ఝరాసంగం : ప్రమాదవశాత్తు అడవికి నిప్పంటుకొని చెట్లు, ఆకులు పూర్తిగా కాలి బూడిదైన ఘటన ఝరాసంగం మండలంలోని బర్దిపూర్ లో చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం సమయంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని దట్టంగా మంటలు వ్యాపించాయి. బర్దిపూర్ గ్రామానికి చెందిన బత్తిన పాండు అనే యువకుడు అటువైపుగా వెళ్తున్న క్రమంలో మంటలను గమనించి జహీరాబాద్ ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది గ్రామస్తుల సహాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో పలు నీలగిరి చెట్లు దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బందికి సమయం లో సమాచారం అందించిన యువకులను ఫైర్ సిబ్బంది అభినందించారు.
ఝరాసంగం: ఎటు చూసినా బండ నేల రాళ్లు, దట్టమైన గట్టు ప్రాంతం గట్టుపైన జల ధార నీటి (గుండం) ఎండాకాలంలో సైతం ఎండిపోని నీరు. ఏళ్ల తరబడి ఇదే తంతు జలధార ఎటు నుంచి వస్తుందో అంతుచి క్కని రహస్యం. చుట్టూ బండ నేల ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో మాత్రం నేటికీ నీరు భూమికి సమాంతరంగా ఉంటుంది. సంగారెడ్డి జిల్లా కొల్లూరు రామేశ్వర దేవాలయం వద్ద గల జలగుండం స్థితి ఇది. ఝరా సంగం మండలంలోని కొల్లూర్ గ్రామ శివారులోని ప్రఖ్యాత రామేశ్వర దేవాలయం సమీపంలో ఒక వింతైన జలగుండం ఎల్లప్పుడూ ప్రత్యేక ఆకర్ష ణగా నిలుస్తోంది. చుట్టూ బండరాళ్లు, ఎత్తైన గట్టు ప్రాంతంతో నిండి ఉన్నప్పటికీ, ఈ నీటి గుండం మాత్రం ఎండాకాలంలో సైతం ఎండిపోకుండా నీటితో కళకళలాడుతూ ఉండటం విశేషం. ఎటు చూసినా రాతి నేల ఉండగా, ఈ ప్రాంతంలో మాత్రం నేలకు సమాంతరంగా నీటితో నిండి ఉంటుంది. సంవత్సరాలు గడుస్తున్నా ఈ జలధార తన ఉనికిని కాపాడుకుంటూ వస్తోంది. అయితే ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందనే విషయం మాత్రం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే ఉంది. సాధార ణంగా ఎండాకాలంలో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఎండిపోతుంటాయి.భూగర్భ జలాలు అడుగం టుతాయి. కానీ కొల్లూరు రామేశ్వర దేవాలయం వద్ద గల ఈ జలగుండం లోని నీరు ఏ మాత్రం తగ్గకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిత్యము ఆ నీటిని పశువుల కాపరులు, వ్యవసాయదారులు, కూలీలు,నీటిని సేవిస్తారు.
ఎండకాలం కూడా బావిలో నీరు..
Rameshwaram temples.
ఝరాసంగం మండలంలోని మాచునూర్ గ్రామ శివారులోని శ్రీ రామేశ్వర ఆలయం వద్దగల బావి నీరు ఎప్పుడూ తగ్గకుండా ఉండడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎండాకాలంలో సైతం ఈ బావిలో నీరు భూమికి సమాంతరంగా ఉండడం. విశేషం. చుట్టూ బండ నేల ఉన్నప్పటికీ, ఆయా బావిలోని నీరు ఎప్పుడూ తగ్గకపోవడం అంతుచి క్కని రహస్యంగా మారింది. బావిని సత్పురుషులైన రాందాస్ మహారాజ్, హనుమాన్ దాస్ మహారాజ్ కొన్ని ఏళ్ల క్రితం నిర్మించారని స్థానికులు కథనం. కొంతమంది భక్తులు బావి చుట్టూ సిమెంట్ గోడను నిర్మించారు. ప్రస్తుతం పూర్వపు బొక్కెన తాడు సహాయంతో భక్తులు, గ్రామస్తులు చేదుకొని స్నానాలు చేసి అక్కడే ఉన్న రామేశ్వర శివలింగానికి పూజలు నిర్వహిస్తారు. ఎండాకాలంలో సైతం నీరు తగ్గకుండా భూమికి సమాంతరంగానే ఉంటుంది. ఈ బావి లోతు సుమారుగా 20 ఫీట్లు ఉంటుందని గ్రామస్తుల కథనం. ఈ దేవాలయాల వద్ద మహాశివ రాత్రి. కార్తీక మాసం, పౌర్ణమి, అమావాస్య, శ్రావణ మాసం పండుగ సమయాలో జహీరాబాద్ ప్రాంతం నుంచి కర్ణాటకలోని బీదర్, చించోల్లు, కుంచారం, మన్నె కెళ్లి, తదితర ప్రాంతాల భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకుంటారు.
మధ్య యుగాల్లో ముస్లిం చొరబాటుదార్ల చేతిలో పెద్దసంఖ్యలో మరణించిన బౌద్ధులు
దాడులో బతికిన బౌద్ధులు ఆలయాన్ని విడిచి పారిపోయారు
1590 నుంచి శైవ సన్యాసుల ఆధీనంతో ఆలయం
నిత్యం శైవ ఆరాధన, క్రతువుల నిర్వహణ
ఎప్పుడో పరిష్కారమైన సమస్యను కెలుగుతున్న రాజకీయ పార్టీలు
త్వరలో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలే కారణం
హైదరాబాద్,నేటిధాత్రి:
బిహార్‌లోని బుద్ధ గయ అంటే తెలియనివారుండరు. ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధులకు ఇది పవిత్ర పుణ్యక్షేత్రం. అయితే ఇక్కడ గత ఫిబ్రవరి నుంచి ఆల్ ఇండియా బుద్ధిస్ట్ ఫోరం (ఐఏబీఎఫ్) ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇంతకూ వీరి డిమాండ్ ఏంటంటే బుద్దగయ టెంపుల్ యాక్ట్`1949 (బీటీఏ)ను తక్షణం రద్దుచేయాలని. నిజానికి బుద్ధ గయలోని మహాబోధి లేదా మహా విహార ఆలయ నిర్వహణ బాధ్యతలు పూర్తిగా తమకే అప్పగించాలని బౌద్ధులు ఎన్నో ఏళ్లుగాడిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ మహాబోధి మహావిహార దేవాలయ ప్రాంగణంలోని బోధి వృక్షం కిందనే గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయమైందన్నది బౌద్ధుల విశ్వాసం.
ఈ మహాబోధి దేవాలయాన్ని బౌద్ధం స్వీకరించిన తర్వాత అశోకచక్రవర్తి క్రీ.పూ.260లో నిర్మిం చాడు. భక్తియార్ ఖిల్జీ బారత్‌పై దండయాత్ర చేసేవరకు అంటే క్రీ.శ.13వ శతాబ్దం వరకు ఈ ఆలయం బౌద్ధుల నిర్వహణలోనే కొనసాగింది. తర్వాతి కాలంలో అంటే క్రీ.శ. 13వ శతాబ్దం చివరికాలం నుంచి 18వ శతాబ్దం వరకు ఈ ఆలయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. బ్రిటిష్ పాలన ప్రారంభమైన తర్వాత ఈ ఆలయానికి మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం యునెస్కో ఈ ఆల యాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.
ఆలయ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం క్రీ.శ.1590లో ఘమండి గిరి అనే ఒక హిందూ శైవ సన్యాసి ఈ ఆలయానికి వచ్చి, ఇక్కడే నివాసం ఏర్పరచుకున్నాడు. ఇక్కడ ఆయన వివిధ క్ర తువులు నిర్వహించడమే కాకుండా, బుద్ధ గయ మఠాన్ని నెలకొల్పారు. అప్పటినుంచి ఈ ఆల య వ్యవహారాలను గిరి వంశస్థులే నిర్వహిస్తున్నారు. ఇదిలావుండగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రెండేళ్లకు బిహార్ ప్రభుత్వం బుద్ధ గయ ఆలయ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఆలయ నిర్వహణ బాధ్యతలను అప్పటివరకు నిర్వహిస్తున్న బుద్ధ గయ మఠం అధినేత నుంచి తప్పించి, ఎనిమిదిమందితో కూడిన కమిటీకి అప్పగించింది. బుద్ధ గయ టెంపుల్ యాక్ట్`1949 పేరుతో రూపొందించిన ఈ చట్టం ప్రకారం 1953లో బుద్ధగయ టెంపుల్ మేనేజ్‌మెంట్ కమిటీ (బీటీ ఎంసీ) ఏర్పాటైంది. ఈ కమిటీలో నలుగురు బౌద్ధులు, నలుగురు హిందువులు సభ్యులుగా వుండే ఏర్పాటు జరిగింది. ఈ కమిటీనే ఇప్పటివరకు బుద్ధగయ లోని మహాబోధి ఆలయ నిర్వహణ బాధ్యతలను నిర్వస్తోంది.
ఈ చట్టం ప్రకారం బుద్ధగయ జిల్లా మెజిస్ట్రేట్ ఈ కమిటీకి ఎక్స్‌ాఅఫిసియో ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. మొదట్లో పొందుపరచిన నిబంధనల ప్రకారం ఎక్స్‌ాఅఫిసియో ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ తప్పనిసరిగా హిందువై వుండాలి. అయితే 2013లో ఈ నిబంధనలో మార్పుచేసి, ఏ మతానికి చెందిన డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అయినా ఎక్స్ అఫిసియో ఛైర్మన్‌గా వుండే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. అయితే ఈ చట్టాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేస్తూగత ఫిబ్రవరి నుంచి వందమంది బౌద్ధ సన్యాసులు ఆలయ ప్రాంగణంలో నిరసనలు చేపట్టారు. ముఖ్యంగా ఫిబ్రవరి 12 నుంచి అన్ని బౌద్ధ గ్రూపులకు చెందిన సన్యాసులు ఆల్ ఇండియా బుద్ధిస్ట్ ఫోరం (ఎఐబిఎఫ్) అనే ఛత్రం కింద నిరాహారదీక్షలు కొనసాగిస్తున్నారు. ‘‘బౌద్ధులకు న్యా యం జరగాలి’’, ‘‘బీటీఎంసీలో అందరు సభ్యులు బౌద్ధులు మాత్రమే వుండాలి’’ అనేవి వీరు చే స్తున్న నినాదాలు.
మొదట్లో ఈ నిరసనలు మహాబోధి ఆలయంలోనే జరిగాయి. ఇక్కడ నిరాహారదీక్ష చేస్తున్న రెండుడజన్ల మంది బౌద్ధ సన్యాసులను ఫిబ్రవరి 27న బిహార్ పోలీసులు ఆలయ ప్రాంగణం నుంచి తొలగించడంతో, వారు ఆలయం వెలుపల తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వున్నఆలయ కమిటీని రద్దుచేసిన పూర్తిగా ఎనిమిదిమంది బౌద్ధులతోనే కొత్త కమిటీ ఏర్పాటు చేయా లని వీరు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నిరసనలు ఆల్ ఇండియా బుద్ధిస్ట్ ఫోరం (ఐఐబీఎఫ్) అధ్యక్షుడు జంబు లామా, కార్యదర్శి ఆకాష్ లామా నేతృత్వంలో జరుగుతున్నాయి. ఇదిలా వుండగా ఛత్తీస్‌గఢ్ నుంచి బుద్ధగయ చేరుకున్న అభిషేక్ బుద్ధ అనే సన్యాసి, ‘దేశంలోని అన్ని మతాలు తమ ప్రార్థనా స్థలాలను నిర్వహిస్తున్నాయి. అటువంటప్పుడు ఈ మహాబోధి ఆలయ నిర్వహణ బాధ్యతలు బౌద్ధులకే అప్పగించడం న్యాయం’ అని అన్నారు. బౌద్ధుల మతపరమైన ప్రదే శంలో ఇంతమంది హిందువులు వుండటం అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. ఇక్కడ బౌద్ధులు జరుపుతున్న నిరసనలకు మద్దతుగా ఢల్లీి, ముంబయి, మైసూరు, అమెరికాలోని బౌద్ధులు ఆందోళనలు నిర్వహించారు. రాజ్యాంగం ప్రసాదిస్తున్న మతస్వేచ్ఛ హక్కుకు బీటీఏ పూర్తి విరు ద్ధమని బౌద్ధ సన్యాసులు వాదిస్తున్నారు. ఆలయంలో హిందూ సన్యాసులు వైదిక క్రతువులు నిర్వహిస్తున్నారని, బౌద్ధ మత సిద్ధాంతాలకు ఇది పూర్తి విరుద్ధమని వారు వాదిస్తున్నారు.
ఇదొక శైవమఠం
ఇదిలావుండగా ఈ బుద్ధగయ మఠం, గత కొన్ని శతాబ్దాలుగా శైవమఠంగా కొనసాగుతూ, ఇక్కడ శైవ సాంప్రదాయ క్రతువులను పాటిస్తూ వస్తోంది. ఈ ఆలయాన్ని కొన్ని శతాబ్దాలుగా కాపాడుతూ వస్తున్నది కూడా వీరే. ఈ నేపథ్యంలో మార్చి 25న ఆలయ కమిటీ బాధ్యులు విలేకర్లతో మాట్లాడుతూ, బౌద్ధ సన్యాసులు చేస్తున్న ఆందోళన కేవలం రాజకీయ ప్రేరేపితమైందని ఆరోపించారు. బౌద్ధ సన్యాసులు చేస్తున్న వాదనలను కమిటీ కొట్టిపారేసింది. మఠం అధినేత వివేకానందగిరి మాట్లాడుతూ కొందరు రాజకీయ నాయకుల ప్రమేయంతో ఈ ఆందోళన కొనసాగుతోందని. మఠంలో కొనసాగుతున్న ప్రశాంతతను భగ్నం చేయడానికే ‘మహాబోధి మందిర్ ముక్తి ఆందోళన్’ పేరుతో ఆందోళనలు కొనసాగిస్తున్నారని ఆరో పించారు. ఈరకంగా సామాజిక అశాంతిని సృష్టించడం ఈ వర్గాల ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. కేవలం బిహార్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్న తరుణంలో రాజకీయ లబ్దికోస మే కొన్ని పార్టీలు ఈరకమైన వివాదాలను రెచ్చగొడుతున్నాయని ఆయన అన్నారు. ‘మా మఠ సంప్రదాయం ప్రకారం బుద్ధుడిని శ్రీమహావిష్ణువు పదవ అవతారంగా పరిగణిస్తాం. బౌద్ధులను మా సహోదరులుగా భావిస్తాం’ అని ఆ యన అన్నారు. ఎన్నో ఏళ్లుగా బౌద్ధ భక్తులు ప్రశాంతంగా ఇక్కడ ప్రార్థనలు చేసుకుంటున్నారు. మేం ఎన్నడూ వారికి అడ్డు చెప్పలేదు. విదేశాలనుంచి కూడా బౌద్ధులు ఇక్కడకు వచ్చి తమ ప్రార్థనలు కొనసాగిస్తున్న సంగతిని ఆయన గుర్తు చేశారు.
అసలు చరిత్ర
నిజానికి ఇక్కడి సమస్య కొన్ని దశాబ్దాల క్రితమే పరిష్కృతమైంది. 1192లో ముస్లింల దండయా త్రల సందర్భంగా ఇక్కడి ఎంతోమంది బౌద్ధ సన్యాసులను దారుణంగా హతమార్చారు. దీంతో మిగిలినవారు ఈ ఆలయాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. తర్వాత 1590 నుంచి ఈ ఆలయాన్ని శైవ సన్యాసులు తమ ఆధీనంలోకి తీసుకొని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. 1894లో అప్పటి బర్మారాజు ఈ ఆలయ భవనాన్ని బౌద్ధ ప్రార్థనా మందిరంగా నిర్మిస్తానని చేసిన ప్రతిపాదనకు శైవ సన్యాసులు అంగీకరించారు. అయితే అప్పట్లో వచ్చిన ఆంగ్లో`బర్మా యుద్ధం, వివిధ దేశాల శకుని పాత్ర కారణంగా ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది. 1890`92 మధ్యకాలంలో ‘ది లైట్ ఆఫ్ ఆసియా’ పుస్తక రచయిత ఎడ్విన్ ఆర్నాల్డ్ ఈ ఆలయాన్ని బౌద్ధులకు అప్పగించాలని నాటి బ్రిటిష్`ఇండియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. అంతేకాదు జపాన్‌కు వెళ్లి తన డిమాండ్‌కు దౌత్యపరమైన మద్దతివ్వాలని కూడా అక్కడి ప్రభుత్వాన్ని కోరాడు. దీనిపై కోర్టులో కేసు దాఖలు కాగా, కోర్టు బౌద్ధులకు వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. తర్వాత 1901లో స్వామి వివేకానంద, 1935లో హిందూ మహాసభ నాయకుడు భాయి పరమానంద వంటి వారు ఈ ఆలయం విష యంలో ఎన్నో చర్చలు జరిపారు. ఎట్టకేలకు 1924లో బాబూ రాజేంద్రప్రసాద్ నేతృత్వంలో ఒక రాజీ ప్రతిపాదన ముందుకు తెచ్చారు. దీనికి అనేక అడ్డంకులు కల్పించినప్పటికీ, చివరకు ఈ ప్రతిపాదనే 1949లో చట్టంగా రూపొందింది. దీని ప్రకారం హిందువుల, బౌద్ధులకు ఇక్కడ ప్రార్థనలు జరుపుకునేందుకు సమాన హక్కులుంటాయి. మేనేజ్‌మెంట్ కమిటీలో కూడా రెండువర్గాలకు సమాన ప్రాతినిధ్యాన్ని ఈ చట్టం కల్పించింది. ఇదిలావుండగా ప్రస్తుత బౌద్ధుల ఆందోళనను హిందువులు మరోలా పరిగణిస్తున్నారు. ముస్లింల దాడులతో బౌద్ద సన్యాసులు పారిపో యిన తర్వాత ఆలయాన్ని పరిరక్షిస్తూ, దాని ఉనికిని కాపాడుతూ వచ్చిన తమకు కృతజ్ఞత చెప్పాల్సింది పోయి, బౌద్ధులు కృతఘ్నులుగా వ్యవహరిస్తున్నారని భావిస్తున్నారు.
ఈ మహాబోధి ఆలయ విముక్తి ఉద్యమాన్ని ప్రారంభించింది జపాన్‌కు చెందిన భదంత్ ఆర్య నాగార్జున సురై ససాయ్. నిజం చెప్పాలంటే బౌద్ధం చైనా, టిబెట్, ఉత్తరకొరియా, వియత్నాంలలో కమ్యూనిస్టుల చేతులో దారుణంగా అణచివేతకు గురైంది. దక్షిణకొరియాలో బౌద్ధాన్ని, క్రైస్తవం పూర్తిగా కప్పేసింది. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ కొండల్లోని చక్మా తెగ ప్రజలు బౌద్ధాన్ని పాటిసా ్తరు. ముస్లిం సెటిలర్లు వీరిని తరిమివేశారు. ఈ జపాన్ సన్యాసి ససాయ్ ఆయా దేశాల్లో ఇక్కడి మాదిరిగానే ఆందోళన చేపడితే ఆయన పరిస్థితి ఎలావుండేదో ఊహించుకోవచ్చు. మనది మితిమీరిన స్వేచ్ఛ కలిగిన ప్రజాస్వామ్యం కనుక ఎటువంటి ఆందోళనకైనా మద్దతు లభిస్తుంది. న్యాయాన్యాయాలతో పనిలేదు. నిజం చెప్పాలంటే మహాబోధి ఆలయాన్ని బాగా అభివృద్ధి చేసింది శైవుడైన ఒక బ్రాహ్మణమంత్రి. ఇది కమిటీ సభ్యులు కూడా కాదనలేని సత్యం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బౌద్ధ సన్యాసుల ఆందోళన వెనుక కొన్ని రాజకీయ శక్తుల పాత్రను కొట్టిపారేయడానికి వీల్లేదు. కులాలు మతాల మధ్య విభేదాలు సృష్టించి ఓట్లను దండుకునే వ్యూహంలోనే ఇది భాగం కావచ్చు. మరి ఈ ఆందోళనకు ఎప్పుడు పరిష్కారం లభిస్తుందో కాలమే నిర్ణయించాలి.
‘‘బీఆర్ఎస్’’ రజతోత్సవాలు అంటే పార్టీ పండుగ మాత్రమే కాదు… ప్రజల పండుగ…అంటున్న బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ‘‘బి. వినోద్ కుమార్’’, నేటిధాత్రి ఎడిటర్ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’తో పంచుకున్న ఉద్యమ స్మృతులు, పార్టీ ప్రస్థానంపై పంచుకున్న విషయాలు, విశేషాలు ఆయన మాటల్లోనే..
`సిద్ధాంతాలు లేని పార్టీలు బీఆర్‌ఎస్‌కు ఎప్పుడూ పోటీ కాదు
`ప్రపంచ చరిత్రలోనే ఈతరం ప్రజల కోసం పుట్టిన పార్టీ బీఆర్‌ఎస్
`తెలంగాణ సంకెళ్లు తెగించి కొట్లాడి తెంపిన పార్టీ
`తెలంగాణకు స్వేచ్ఛా వాయువులు ప్రసాదించిన పార్టీ
`తెలంగాణ ఆత్మ గౌరవం నింపిన పార్టీ
`తెలంగాణ చైతన్య రథాలు కదిలించిన పార్టీ బీఆర్‌ఎస్
`తెలంగాణలో చైతన్య కిరణాలు నింపిన పార్టీ బీఆర్‌ఎస్
`తెలంగాణ నే ఒక ఉద్యమ ప్రవాహంగా మార్చిన పార్టీ బీఆర్‌ఎస్
`తెలంగాణ పోరులావా పొంగించిన పార్టీ బీఆర్‌ఎస్
`బీఆర్‌ఎస్ లేకుంటే జై తెలంగాణ నినాదమే లేదు
`కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు
`కేసీఆర్ అనే పదమే విశ్వజనీనం
`బీఆర్‌ఎస్ అనే పార్టీయే ఉద్యమ సోపానం
హైదరాబాద్,నేటిధాత్రి:
బిఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవాలంటే ఒక్క పార్టీ పండుగనే కాదు. అది తెలంగాణ ప్రజల పండుగ. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ పండుగ. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు బిఆర్‌ఎస్. కేసిఆర్ మది నుంచి జాలు వారిన ఆశయాలు, ఆలోచనలు నుంచి పురుడు పోసుకున్న పార్టీ బిఆర్‌ఎస్. బిఆర్‌ఎస్ ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తవుతున్న శుభవేళ జరుపుకుంటున్న ప్రజా సంబురాలు. పార్టీ వేడుకనే కాదు, ప్రేజా వేడుకలు. తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించిన పార్టీ. ప్రజా ప్రవాహాన్ని పోరుబాటగా మలిచిన పార్టీ. ప్రజా సేవలో, ఉద్యమ స్వరూపాన్ని నింపిన పార్టీ. తెలంగాణ అభివృద్ది ప్రాంత హక్కు..తెలంగాణ రాష్ట్ర జన్మ హక్కు అని నినాదం నుంచి పుట్టిన పార్టీ. తెలంగాణ ఆత్మగౌరవం నింపుకొని, తెలంగాణ ఆత్మాభిమానం చాటి చెప్పిన పార్టీ. ఒక వ్యక్తి రాజకీయం కోసం పుట్టిన పార్టీ కాదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ. తెలంగాణ ఆత్మగౌరవం నుంచి పుట్టినపార్టీ. తెలంగాణకోసం కేసిఆర్ చేసిన త్యాగం నుంచి ఉద్భవించినపార్టీ. 60 సంవత్సరాల తెలంగాణ గోసను నుంచి విముక్తికోసం పుట్టిన పార్టీ. పద్నాలుగేళ్లపాటు అలుపెరగని పోరాటం చేసి, తెలంగాణ సాదించిన పార్టీ. తెలంగాణ తెచ్చిన కేసిఆర్ చేతుల మీదుగా బంగారు తెలంగాణ ఆవిష్కారం చేసిన పార్టీ. మోడువారిని పల్లెను చిగురించిన పార్టీ. చుక్క నీటి కోసం తల్లడిల్లిన పల్లెలో గోదారి పరవళ్లు తొక్కించిన పార్టీ. ఇంటింటికీ గోదారి నీళ్లందించిన పార్టీ. సాగు లేక, సాగు చేయలేక రైతు కన్నీటి వ్యవసాయం నుంచి, గోదారి గలగలలు వింటూ రైతు కన్నీళ్లు తుడిచిన పార్టీ. ఒకప్పుడు తొండలు కూడా గుడ్లు పెట్టవంటూ వెటకారం చేసిన వాళ్లు కోట్ల రూపాయల ధరలు పలికేలా తెలంగాణను తీర్చిదిద్దిన పార్టీ. అందుకే బిఆర్‌ఎస్ అంటే తెలంగాణ ఇంటి పార్టీ. తెలంగాణ కుటుంబ పార్టీ. తెలంగాణ గుండెల్లో చిరస్ధాయిగా నిలిచిపోయే పార్టీ. మరో వెయ్యేల్లయినా చెరిగిపోని, తరిగిపోని చరిత్ర బిఆర్‌ఎస్ పార్టీది. తెలంగాణ ఉనికి వున్నంత వరకు నిలిచిపోయే పార్టీ. తెలంగాణ అస్ధిత్వాన్ని తన భుజాల మీద మోసే ఏకైక పార్టీ బిఆర్‌ఎస్ పార్టీ. ఎన్ని తరాలు మారినా తరగని చిరునామా లాగా శాశ్వతంగా తెలంగాణ గుండెల్లో నిండిన పార్టీ అంటున్న బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు బోయిన పల్లి వినోద్ కుమార్, నేటిధాత్రి ఎటిటర్ కట్టా రాఘవేంద్రరావుతో ఉద్యమ కాలం నాటి అనుభవాలు, బిఆర్‌ఎస్ పుట్టు పూర్వత్తరాలపై పంచుకున్న ఆసక్తికరమైన అంశాలు…ఆయన మాటల్లోనే..
బిఆర్‌ఎస్ పార్టీ రజతోత్స సంబురాలు అంటే పార్టీ పండుగ మాత్రమే కాదు…అవి ప్రజల జరుపుకునే పండుగ. తెలంగాణ కోసమే పుట్టి, అలుపెరుగని పోరాటం చేసి, తెలంగాణ తెచ్చిన పార్టీ. ఈ సంబురాల వేళ మరో వెయ్యేళ్ల ప్రయాణం సాగాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే బిఆర్‌ఎస్ అనేది తెలంగాణ ప్రజల పార్టీ. మా పార్టీ బిఆర్‌ఎస్ అని ప్రజలు గర్వంగా చెప్పుకునేపార్టీ. త్యాగాల నుంచి పుట్టి, తెలంగాణ పొలికేకలు పెట్టి, గులాబీ జెండాను పట్టి, పిడికిలెత్తి జై తెలంగాణ అని నినదించిన ఏకైక పార్టీ. అసలు తెలంగాణ అనడానికి తెలంగాణ నాయకులకే నోరు రాని రోజులవి. తెలంగాణ అంటే ఎక్కడ తమ పదవులు పోతాయో అని భయపడిపోయిన రోజులు. వెనుకబడిన ప్రాంతం అని తెలంగాణ నాయకుల చేత సమైక్య పాలకులు చెప్పించిన కాలం. కష్టమొచ్చిన చెప్పొదు. కాలం కాకపోయినా ఏడువొద్దు. తెలంగాణ కోసం ఏది అడిగినా గొంతెమ్మ కోరికలంటూ సమ్యై వాదులు హేళన చేసిన రోజుల నుంచి జై తెలంగాణ అని దిక్కులు పిక్కటిల్లేలా గర్జించిన కేసిఆర్ ఉక్కు సంకల్పం నుంచి ఉద్భవించిన గులాబి సింహస్వప్నం బిఆర్‌ఎస్ పార్టీ. ఆ మాటలు చెబుతుంటేనే రక్తం మరుగుతుంది. బిఆర్‌ఎస్ అని పలుకుతుంటేనే రక్తం ఉప్పెనై పొంగుతుంది. అంతటి శక్తి వంతమైన పదం బిఆర్‌ఎస్. గులాబీ జెండను చూస్తేనే ఉద్యమం ఉరకలెత్తేది. ప్రజలు జెండా పట్టుకొని ఉద్యమ రంగంలోకి దింకేలా చేసింది. అంత గొప్పది. అందుకే టిఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ వున్నంత వరకు వుంటుంది. తెలంగాణ గుండెల్లో ఎప్పుడూ చిరంజీవిగా చిరస్ధాయిగా నిలిచిపోతుంది. తెలంగాణ గుండెలో గులాబీ రెపరెపలాడుతూ వుంటుంది. తెలంగాణ తలరాత మార్చిన పార్టీగా రాజకీయ మనుగడలో ముందు వరుసలోనే వుంటుంది. బిఆర్‌ఎస్ అని పలుకుతున్న ప్రతి సందర్భంలోనూ కేసిర్, కేసిఆర్ అని ప్రకృతి నుంచిధ్వని వినిపిస్తుంది. తెలంగాణ మూల సిద్దాంతంగా, తెలంగాణ వాదమే సూత్రంగా పుట్టిన పార్టీ. సిద్దాంతాలు లేని ఏ రాజకీయ పార్టీ బిఆర్‌ఎస్‌కు పోటీ కాదు. రాలేదు. తెలంగాణ సంకెళ్లను తెంచడానికి తెగించి కొట్లాడిన పార్టీ బిఆర్‌ఎస్. తెలంగాణలో అణువణువూ నిండిన పార్టీ. తెలంగాణ వాదానికే కాదు, తెలంగాణకే స్వేచ్చా వాయువులు ప్రసరింపజేసి పార్టీ. ఉద్యమానికి ఊపిరి పోసి, తెలంగాణ చైతన్య రథ చక్రాలు కదిలించిన పార్టీ. తెలంగాణలో చైతన్య కిరణాలు పంచిన పార్టీ. తెలంగాణనే ఒక ఉద్యమ ప్రవాహంగా మార్చిన పార్టీ. తెలంగాణ పోరు లావా పొంగించిన పార్టీ. ఎందుకంటే బిఆర్‌ఎస్ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు. అందుకే కేసిఆర్ అనే మూడక్షరాల పదం విశ్వజననీం…సర్వాంతర్యామి స్వరూపం. బిఆర్‌ఎస్ పార్టీయే ఉద్యమ సోపానం. తెలంగాణ కోసం కేసిఆర్ తొలి అడుగు వేసిన నాడు ఎటు చూసినా ఎడారి పరిస్ధితులు. ఒక్కడుగా అడుగులు మొదలు పెట్టాడు. ఒక్కడే సింహమై గర్జించాడు. ఒక్కడే జై తెలంగాణ అని పిడికిలెత్తి నినదించాడు. ఒక్కడే అసెంబ్లీలో తన గళం వినిపించాడు. ఒక్కడే అసెంబ్లీలో తెలంగాణ సమస్యలపై ఏకరువు పెట్టారు. కేసిఆర్ నోరు నొక్కేందుకు ఎంతో ప్రయత్నం చేశారు. తెలంగాణ కోసం తొలి రాజీనామా చేసినప్పుడు, తెలంగాణ వాదాన్ని సమూలంగా అణచివేయాలని చూశారు. ఎక్కడికక్కడ అప్పటి ఉమ్మడి పాలకపక్షంతో పాటు, అప్పటి ప్రతిపక్షం కూడా చేతులు కలిపి, కేసిఆర్‌ను ఓడిరచాలని విశ్వ ప్రయత్నం చేశారు. ఎందుకంటే కేసిఆర్ నాయకత్వం ఎలాంటిదో అప్పటికే ఉమ్మడి పాలకులకు తెలుసు. కేసిఆర్ ఎంతటి పట్టుదల వున్న నాయకుడో తెలుసు. కేసిఆర్ ఎంతటి విజ్ఞానవంతుడో తెలుసు. ఎంతటి వాగ్ధాటి కల్గిన నాయకుడో తెలుసు. తెలంగాణపై కేసిఆర్‌కు వున్నంత అవగాహన మరే నాయకుడికి లేదని తెలుసు. అందుకే అడుగడుగునా కేసిఆర్‌ను అవమానపర్చాలని చూశారు. కేసిఆర్ అదే తీరులో స్పందించి సింహస్పప్నమైన వారి విమర్శలకు తెలంగాణ నిజాలు చెప్పి నోరు మూపించేవారు. అలా ప్రజలందరికీ తెలంగాణ కావాలని వున్నా,కేవలం పదవుల కోసం ఉమ్మడి పాలకులకు మోచేతి నీళ్లు తాగే నాయకులు కేసిఆర్‌ను పలుచన చేయాలని అనేక మార్లు ప్రయత్నం చేశారు. కాని ధర్మం, న్యాయం కేసిఆర్ వైపు నిలించింది. కేసిఆర్ మీద నమ్మకంతో తెలంగాణ అంతా కదిలింది. తొలి గులాబీ జెండా ఎగిరింది. అది తెలంగాణ అంతటా రెపరెపలాడిరది. దేశ దిగంతాలు దాటి ప్రపంచంలో తెలంగాణ వాదులున్న అన్ని దేశాలలో గులాబీ జెండా ఎగిరింది. నిజానికి రాజకీయ పార్టీ నపడం అంటే సామాన్యమైన విషయం కాదు. పైగా ఉద్యమ పార్టీ నిర్వహణ అనేది మరింత అసాద్యం. అటు ఉద్యమాన్ని రంగరించి, ఇటు రాజకీయానికి చాణక్యాన్ని జోడిరచి కేసిఆర్ సాగించిన ప్రయాణం ప్రపంచంలోనే ఎక్కడా, ఎవ్వరూ నిర్వహించి వుండరు. తెలంగాణ కోసం కేసిఆర్ చేసిన సాహసం అంతా ఇంతా కాదు. కేవలం ఆమరణ దీక్ష సమయంలోనే ,కాదు అడుగుడుగునా ఆయన తన ప్రాణాలను లెక్క చేయకుండా ఉద్యమాన్ని కొనసాగించారు. పార్టీని నడిపించారు. ప్రజలను చైతన్యం నింపారు. పసిపాప నుంచి మొదలు పండు ముసలివరకు జై తెలంగాణ అని నినదించేలా కోట్లాది మంది తెలంగాణ వాదులను తయారు చేశారు. ఒక్క కేసిఆర్ గొంతు కోట్ల గొంతుకలై జై తెలంగాణ అని గర్జిస్తుంటే దిక్కులు మారుమ్రోగిపోయాయి. అదీ కేసిఆర్ అంటే..అలాంటి కేసిఆర్ పెట్టిన బిఆర్‌ఎస్ పార్టీ ఆచంద్ర తారార్కం వెలుగుతుందని చెప్పడంలో సందేహంలేదు. తెలంగాణ వున్నంత వరకు, తెలంగాణ ఉనికి వున్నంత వరకే కాదు, ఎన్ని వేల సంవత్సరాలైనా సరే ఆయన నడిచిన అడుగులు చరిత్ర పుటల్లో సజీవంగా వుంటాయి. అందుకే బిఆర్‌ఎస్ రజతోత్సవాలను ప్రజలే జరుపుకునేందుకు వరంగల్ వస్తారు. ప్రజలే ఆ పండుగను ఆశీర్వదిస్తారు. మహా సింహగర్జనను మించిన సభను నిర్వహించి, తెలంగాణ వాదం ఎంత బలమైందో, కేసిఆర్ నాయకత్వం ఎంత గొప్పదో చూస్తారు. కేసిఆర్ పిలుపు ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుందో వరంగల్ రజతోత్సవ సభతో మరోసారి తెలుసుకుంటారు. కేసిఆర్‌తోపాటు తొలి నుంచి ఇప్పటి దాకా తెలంగాణ కోసం పునరంకితమైనందుకు నా జన్మ కూడా ధన్యమైందనే అనుకుంటాను. తెలంగాణ ఉద్యమంలో నేను కీలకమైన పాత్ర పోషించాను. కరుడుగట్టిన బిఆర్‌ఎస్ సైనికుడిగా పార్టీకోసం పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాను.
సీకేఎం డిగ్రీ కళాశాల ఎఫ్ఎసి ప్రిన్సిపాల్ గా డాక్టర్ ఏ.ధర్మారెడ్డి.
వరంగల్, నేటిధాత్రి
దేశాయిపేటలోని సికేఎం ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల ఎఫ్ఎసి (ఫుల్ అడిషనల్ ఛార్జీ) ప్రిన్సిపాల్ గా డాక్టర్ ఏ. ధర్మారెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. మార్చ్ 31వ తేదీన సికేఎం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా డాక్టర్ జి .శశిధర్ రావు పదవి విరమణ పొందడంతో ఆ స్థానంలో కళాశాలలో కెమిస్ట్రీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ ఏ ధర్మారెడ్డికి ఇంచార్జ్ ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. అనంతరం కళాశాల విద్య కమిషనర్ ఉత్తర్వుల ఆదేశానుసారం తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు సీకేఎం డిగ్రీ కళాశాలకు ఫుల్ అడిషనల్ చార్జ్ ప్రిన్సిపాల్ గా వ్యవహరించాలని కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేవసేన ఐఏఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం డాక్టర్ ఏ .ధర్మారెడ్డి ఎఫ్ ఎ సి ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది డాక్టర్ ధర్మారెడ్డికి పుష్పగుచ్చాలు అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తనను ఎఫ్ఎసి ప్రిన్సిపాల్ గా నియమించినందుకు సిసిఈ ఉన్నతాధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిసిఈ సూపరిండెంట్ కృష్ణారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ భరత్ చారి, కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్ జీ. శశిధర్ రావు, అధ్యాపకులు డాక్టర్ కే ఎల్ వి. వరప్రసాదరావు, కెప్టెన్ డాక్టర్ పి. సతీష్ కుమార్, లైబ్రరియన్ ఎస్ .అనిల్ కుమార్, సూపరిండెంట్ జి .శ్రీనివాస్, గెస్ట్ అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం పట్టుబడింది. శేరిలింగంపల్లి జోనల్ జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటి డిప్యూటీ డైరెక్టర్ రూ. 70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు మంగళవారం మధ్యాహ్నం శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ఏసీబీ డి.ఎస్.పి శ్రీధర్ ఆధ్వర్యంలో సోదాలు చేపట్టింది. అర్బన్ బయోడైవర్సిటి డిప్యూటీ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ గత కొంతకాలంగా చాంద్రాయణ గుట్ట సర్కిల్ లో అర్బన్ బయోడైవర్సిటి విభాగం ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు.
https://youtu.be/_tzxsiCQ0C0?si=eQjpA5cVA-A1Qq30
చాంద్రాయణ గుట్ట సర్కిల్ పనికి సంబంధించి ఓ కాంట్రాక్టర్ వద్ద రూ. 2 లక్షల 20 వేలు లంచం డిమాండ్ చేశాడు. కాగా ఇదివరకే రూ. 1 లక్ష 50 వేలు పలు దఫాలుగా తీసుకున్నాడు. ఒప్పందం ప్రకారం మిగతా రూ. 50 వేలు ఇచ్చేందుకు శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయానికి రావాలని సూచించాడు. దీంతో కాంట్రాక్టర్ శ్రీనివాస్ తెలిపిన విధంగా శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలోని ఛాంబార్ కు వచ్చాడు. కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శ్రీనివాసుని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డి.ఎస్.పి శ్రీధర్ తెలిపారు.
https://youtu.be/_tzxsiCQ0C0?si=eQjpA5cVA-A1Qq30
ఏసీబీ రైడ్స్ తో మిగతా విభాగాల అధికారులు పరారు… శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలోని అర్బన్ బయోడైవర్సిటీ విభాగం అధికారి పై ఏసీబీ రైట్స్ జరగడంతో, జోనల్ కార్యాలయంలోని మిగతా విభాగాల అధికారులు పరారయ్యారు. ఉదయం 12 గంటల నుంచి అన్ని విభాగాల అధికారులు కార్యాలయంలో లేకపోవడంతో కుర్చీలు కాలిగా దర్శనమిచ్చాయి. అధికారులు అందుబాటులో లేకపోవడంతో పనుల పైన విచ్చేసిన ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఏదో ఒక అధికారిపై ఏసీబీ దాడులు జరిగితే మిగతా అందరూ వీధిల నుంచి తప్పించుకుని వెళ్లడంపై సర్వత్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఏసీబీ దాడులకు భయపడే అధికారులు పారిపోయారంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.
కల్వకుర్తి పట్టణంలోని బిజెపి కార్యాలయంలో మంగళవారం బీజేపీ క్రియాశీలక సభ్యుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ జాతీయ బీసీ కమిషన్ నెంబర్ తల్లోజు ఆచారి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో జరగబోయే ప్రతి ఎన్నికలలో బిజెపి విజయ దుందుభి మోగిస్తుందని ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని రాష్ట్రంలో దాదాపు సగం బీజేపీ ఎంపీల పాలనలో ఉందని వచ్చే ఎన్నికల్లో పూర్తిగా తెలంగాణ రాష్ట్రం బీజేపీ వశం అవుతుందని భవిష్యత్తు బీజేపీ దేనని.. దానికి అనుగుణంగా కృషి చేయాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మార్కెట్ యార్డ్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు పండించిన ప్రతీ గింజను మద్దతు ధరతో కొనుగోలు చేసి, వారి అకౌంట్లలో డబ్బులు వేస్తామన్నారు. సన్నాలు పండించిన రైతులకు మద్దతు ధరతో పాటు.. రూ.500 బోనస్ వస్తుందని అన్నారు. అనంతరం చిన్న రాజమూర్ గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన చిన్న రాజమూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్ర గొల్ల ప్రేమ్ కుమార్ యాదవ్ తల్లి భౌతిక దేహానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
యువత భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని నడుచుకోవాలి..
రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట రాజా గౌడ్..
రామాయంపేట ఏప్రిల్ 15 నేటి ధాత్రి (మెదక్)
ప్రజలు, యువకులు, ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో ఫోటోలు మార్పించేస్తూ ప్రజల మనోభా వాలు దెబ్బతీసే విధంగా సోషల్ మీడియా వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, పోస్టులు పెట్టవద్దని, అలా పెట్టిన వ్యక్తులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి తగు చర్య లు తీసుకోవడం జరుగుతుందని సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట రాజా గౌడ్ హెచ్చరించారు. ఇందుకోసం ప్రత్యేక సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు తప్పుడు వార్తలు పెట్టే వారిపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగు తుందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు, ప్రజలు ఎవ్వరు నమ్మవద్దని సూచించారు. సామాజిక మాద్యమాలను వేదికగా చేసుకోని తప్పుడు, విద్వేషకర పోస్టులు చేసిన, షేర్ చేసినా వారి సమాచా రాన్ని రామాయంపేట సర్కిల్ కార్యాలయం కంట్రోల్
రూమ్ వాట్సప్ నెంబర్కు 8712667100 తెలియజేయాలని అట్టి సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఈ టెక్నాలజీ యుగంలో వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ద్వారా సమాచారము క్షణాల్లో కొన్నిలక్షల మందికి చేరుతుందని పంపించే సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని సూచించారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ను మంచి మంచి కార్యక్రమాలకు ప్రజలను యువతను చైతన్యపరిచే విధమైన పోస్టులు చేస్తూ మంచితనానికి ఉపయోగిం చుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత వారి భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని నడుచుకోవాలని, సోషల్ మీడియాలో అనవసరమైన పోస్టులు పెట్టి ఇబ్బంది పడవద్దని భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
రెండో రోజు రిలే నిరహార దీక్షలు. వివిధ పార్టీల నాయకులు, సంఘాల మద్దతు.
జర్నలిస్టుల డబల్ బెడ్ రూమ్ లు కేటాయించండి మంత్రి కొండా సురేఖకు విజ్ఞప్తి
వరంగల్ తూర్పు, నేటిధాత్రి
వరంగల్ తూర్పు జర్నలిస్టుల కోసం గత ప్రభుత్వం నిర్మించిన డబల్ బెడ్ రూమ్ లను త్వరగా కేటాయించాలని వరంగల్ తూర్పు వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో రిలే నిరహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. సోమవారం మొదలైన దీక్ష, పాలకులు స్పందించే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.. యూనియన్ సంఘాలకు అతీతంగా కూడు గూడు జర్నలిస్టుల హక్కుల కోసం చేస్తున్న నిరాహార దీక్షకు సీపీఐ సిపిఎం నాయకుల మద్దతుతో పాటు, విద్యార్థి సంఘాల సంఘీభావం ప్రకటించారు. ఎవరు కలిసొచ్చినా స్వాగత్తిస్తామని తూర్పు వర్కింగ్ జర్నలిస్టులు ముక్త కంఠంతో తెలిపారు. మంగళవారం నిర్వహించిన జర్నలిస్టుల నిరాహార దీక్షలో బీజేపీ, సీపీఐ, సీపీఎం, విద్యార్థి సంఘం నేతలు, కార్మిక యూనియన్ నాయకులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్స్ సాధించే వరకు న్యాయ పోరాటం, నిరసన దీక్షలు చేస్తామని అందులో భాగంగా మూడు రోజుల దీక్షలు ఉంటాయని తెలిపారు. ఈ న్యాయ పోరాటం జర్నలిస్టుల దీక్షలో తప్పుడు ప్రచారం చేయడం హేయమైన చర్యగా పరిగణలోకి తీసుకుంటామని కనీస హక్కుల సాధన పోరాటంలో రాజకీయ రంగు కావాలని అంటిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జర్నలిస్టుల హక్కుల కోసం కలిసోచ్చే పార్టీలకు యూనియన్లకు అతీతంగా స్వాగతిస్తున్నామని అసత్య ప్రచారాలు బురదజల్లే ఆలోచనలు మానుకోవాలని కొందరి నాయకులకు దీక్ష శిభిరం నుండి సూచించారు. మా ప్రయత్నం ఫ్లాట్లు, డబుల్ బెడ్రూమ్స్, కనీస హక్కులు సాధన కోసమేనని అందులో ఎక్కడ పదవులు అధికారం లేదని తేల్చి చెప్పారు.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సహకారంతో కల్వకుర్తి పట్టణానికి చెందిన 27 మంది లబ్దిదారులకు రూ. 9లక్షల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులను మంగళవారం కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీమ్ముల శ్రీకాంత్ రెడ్డి లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మిర్యాల శ్రీనివాస్ రెడ్డి,మాజీ కౌన్సిలర్ లు గోరటి శ్రీనివాసులు, చిన్న, హన్మనాయక్, రవి,చిత్తరి శ్రీను, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి,రేష్మ, నాయకులు పుస్తకాల రాహుల్, మిరియాల దామోదర్ రెడ్డి,పాండు రంగా రెడ్డి, శంకర్ నాయక్,కేశవులు, ప్రవీణ్,విక్కీ భాయ్, పడకంటి వెంకటేష్, దున్న సురేష్, శ్రీశైలం,పరశురాం శివ,లబ్ది దారులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో రెడ్ క్రాస్ సేవలు ప్రశంసనీయం..
నిజాంపేట గ్రామంలో మెగా వైద్య క్యాంపు విజయవంతం..
హాజరైన తాసిల్దార్, ఎస్సై.. ఇతర అధికారులు…
రామాయంపేట ఏప్రిల్ 15 నేటిధాత్రి (మెదక్)
గ్రామీణ ప్రాంతాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని నిజాంపేట సబ్ ఇన్స్పెక్టర్ బండి రాజేష్ కొనియాడారు. మంగళవారం నాడు నిజాంపేట మండల కేంద్రంలో తుప్రాన్ వి ఎస్ టి ఇండస్ట్రీస్ సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు..
SI
నిజాంపేట గ్రామంలో మెగా వైద్య క్యాంపును నిర్వహించడం శుభ పరిణామం అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను మళ్లీ నిజాంపేట మండలంలో కొనసాగిస్తే తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు. అనంతరం రెడ్ క్రాస్ సోసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగం శ్రీనివాసరావు, జిల్లా చైర్మన్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు, మెగా వైద్య క్యాంపులు, ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కాగా నిజాంపేట గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య మెగా క్యాంపుకు అక్కడి ప్రజల నుండి మంచి స్పందన లభించింది.
SISI
మల్లారెడ్డి ఆసుపత్రికి చెందిన డాక్టర్లు ఉమేష్ రఘు ప్రసాద్, సాయి సురమి, అభినవ్, చంద్రశేఖర్, అరుణ్ కాంత్ రెడ్డి, ప్రణీత, శ్రీ చరిత్ర శిబిరములో పాల్గొని పేషెంట్లకు వైద్య సేవలు అందించారు. ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రమ్యశ్రీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రీతి, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కోశాధికారి డి. జి . శ్రీనివాస శర్మ, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు దేమే యాదగిరి, మద్దెల సత్యం, దామోదర్ రావు, లక్ష్మణ్ యాదవ్ , వంగరీ కైలాస్ ,తోట శ్రీనివాస్, N. మాధవరెడ్డి, G తిరుపతి, G స్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రావిపల్లి అమర సేవా రెడ్డి, పంజ మహేందర్, సుధాకర్ తో పాటుగా నరేందర్ , వినయ్ గౌడు, S. తిరుపతి, మహేష్, తమ్ములి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
భూభారతి పోర్టల్ ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో అమీనాపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి జిల్లాకాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కటి ఒక్కటిగా అమలుపరుస్తూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడుతుంది. నిన్న ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళి ఇచ్చే సందర్భంలో మూడు దశాబ్దాల పాటు ఎస్సీ కుల వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న వర్గాలకు ఆనాడు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన మేరకు కాంగ్రెస్ సర్కారు 15% రిజర్వేషన్లను మూడు భాగాలుగా విభజించి అమలు చేయడానికి జీవోను కూడా జారీ చేయడం జరిగింది. గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2008లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఉషా మేహరా కమిషన్ వేసి ప్రయత్నం చేయడం జరిగింది న్యాయ చిక్కుల వలన చేయలేదు. కానీ ఈనాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ కోసం ఉత్తంకుమార్ రెడ్డి చైర్మన్, దామోదర రాజ నరసింహ వైస్ చైర్మన్ సభ్యులుగా పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబు, మల్లు రవి లను ఉప సంఘం ఏర్పాటు చేసి వారి స్థితిగతులపై అధ్యయనం చేసి వారి సిఫారసు మేరకు ఏకసభ్య కమిషన్ విశ్రాంత జస్టిస్. షమీం అక్తర్ ను నియమించి వారి సలహా సూచనలను తీసుకొని మంత్రి వర్గం ఆమోదించి, తర్వాత అసెంబ్లీలో కూడా ఆమోదించి చట్టాన్ని చేయడం జరిగింది. ఈ చట్టం నిన్నటి నుండే అమలులోకి వస్తు ఎస్సీలను మూడు వర్గాలుగా విభజించి ఉద్యోగ రాజకీయ అన్ని రంగాలలో కూడా అమలు చేసే విధంగా జీవో జారీ చేయడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా భూభారతి పోర్టల్ ను ప్రారంభించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ధరణి పోర్టల్ వలన ఎన్నో ఇబ్బందులకు గురైన రైతుల ఆవేదనను చూసి ఆనాడు మేము అధికారంలోకొస్తే ధరణి పోర్టల్ బంగాళాఖాతంలో వేసి భూమాత పోర్టల్ ను తెస్తానని మాట ఇచ్చిన ప్రకారం భూమాత పోర్టల్ ను తెచ్చి రైతులందరికీ,ప్రజలకు సులువుగా భూమి యొక్క సమస్యలను పరిష్కార దిశగా నాలుగు మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టి ప్రజల నుండి వస్తున్నటువంటి వినతులను స్వీకరించి ఆ సమస్యలను పరిష్కార దిశగా కొత్త మాడ్యూలను ఏర్పాటు చేస్తూ పూర్తిస్థాయిలో రాష్ట్రంలో జూన్ 2 నుండి అమలు చేసే దిశగా ప్రభుత్వం కృతనిచ్చయంతో ఉండడం అభినందనీయం కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద బడుగు బలహీన వర్గాల అండగా ఉండే పార్టీ వారి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అదేవిధంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలలో దొడ్డు బియ్యాన్ని పేద ప్రజలకు ఇస్తా ఉంటే వాటిని పేద ప్రజలు తినకుండా విక్రయిస్తా ఉంటే వ్యాపారం చేసిన వారు లక్షల రూపాయలుదండుకున్నారు తప్ప పేదవాని ఆకలి తీరనటువంటి పరిస్థితిని చూసి కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదవానికి సన్న బియ్యం అందే విధంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాన్ని తీసుకువచ్చి పేదవాడు సన్న బియ్యంతో బుక్కెడు అన్నము కడుపునిండా తిని నిత్యం పండగ వాతావరణం ప్రతి పేదల ఇండ్లలో ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులకు ఎమ్మెల్యేలకు ప్రజలందరూ దన్నుగా ఉండి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఉంటే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మరొక్కసారి విన్నవించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి అంబటి. లక్ష్మి,అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మందుల కృష్ణమూర్తి, అంబేద్కర్ యువజన సంఘం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వేల్పుగొండ ఏలియా, మండల ఉపాధ్యక్షులు కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు సామ సుధాకర్ రెడ్డి, జన్ను కట్టయ్య, లింగాల నేతాజీ, లాకావత్ బాలు నాయక్, ఇనుముల కర్ణాకర్, వెంకట్రాం నరసయ్య, సామ శ్రీనివాస్, కొడారి. నాగేంద్రబాబు, భోగం రమ, కొనకటి మధు, సింగిరెడ్డి కృష్ణ, కొనకటి వెంకటరెడ్డి, కుసుమ సాంబమూర్తి, వంతడుపుల సమ్మయ్య పాల్గొన్నారు.
ప్రమాదం ఉందన్నా పట్టించుకోవడం లేదు …. కమ్మరి,హనుమంతు, ఝరాసంగం
“నేటిధాత్రి”
విద్యుత్ వైర్ల వల్ల చేతికి వచ్చిన పంటను తీసుకోవడం లేదు. వైర్ల కిందదున్నలాంటిఎప్పుడూప్రమా దం జరుగుతుందో తెలియని పరిస్థితి. అధికారు లకు ఫిర్యాదు చేసినా పట్టించు కోవడం లేదు. స్తంభం వేయడానికి డబ్బులు ఖర్చవు తాయని చెప్పుతున్నారు.
ప్రజాసేవకే కాకా కుటుంబం… ప్రజల కొరకే కాకా కుటుంబం..
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
రైల్వే బ్రిడ్జికి పునాది వేశాం… ప్రారంభించాం..!
ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
సన్నబియ్యం అక్రమ దందా చేస్తే కేసులు నమోదు చేస్తాం.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి
క్యాతనపల్లి వద్ద రైల్వేగేటుపై నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జికి పునాది వేసింది మేమే ప్రారంభించింది మేమేనని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంగళవారం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజాసేవకే కాకా కుటుంబం అని ప్రజల కొరకే కాక కుటుంబం అని అన్నారు.
MP
రామకృష్ణాపూర్ పట్టణ ప్రజల చిరకాల కోరిక రైల్వే బ్రిడ్జి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, గతంలో కాంగ్రెస్ హయాంలో పెద్దపల్లి ఎంపీగా ఉన్న సమయంలో బ్రిడ్జి పునాది వేశామని, తిరిగి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పెద్దపల్లి ఎంపీ, చెన్నూరు ఎమ్మెల్యేలుగా ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో బ్రిడ్జి నిర్మాణ పనులు ఆలస్యం అయ్యాయని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం త్వరితగతిన పూర్తిచేసి బ్రిడ్జి ప్రారంభించామని తెలిపారు.ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, ప్రజాసేవకే కాక కుటుంబం ఉందని అన్నారు. గత ప్రభుత్వం దాచుకోవడం దోచుకోవడం తోనే సరిపోయిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ..
MP
రైల్వే గేటు పడిన సమయంలో అనేక ప్రాణాలు పోయాయని, ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో ప్రాంత ప్రజల కష్టాలు తీరుతున్నాయని అన్నారు. పేద ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, సన్న బియ్యపు అక్రమ దందా చేస్తే కేసును నమోదు చేస్తామని హెచ్చరించారు. మున్సిపాలిటీలోని అన్ని ఏరియాలకు త్వరలోనే మంచినీరు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ గద్దె రాజు, మాజీ చైర్ పర్సన్ జంగం కళ,మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టిపిసిసి నాయకులు రఘునాథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, యాకుబ్ ఆలీ, గోపతి భానేష్, పాల రాజు,మహంకాళి శ్రీనివాస్,కుర్మ సురేందర్, సిపిఐ నాయకులు మిట్టపల్లి శ్రీనివాస్, రామడుగు లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, పట్టణ ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
రైతులు పోలాల్లో సాగు చేసిన పంటలను కోత చేసి ఇంటికి తరిలించా లంటే విద్యుత్ వైర్ల కింది కి వేలాడడం వల్ల పంటను వదిలేయాల్సిన పరి స్థితి ఏర్పడింది. మండల కేంద్రమైన ఝరాసంగంలో ఓ రైతు పోలంలో విద్యుత్ వైర్లు పోలాల్లో వేలాడడం కారణంగా చేతికి వచ్చిన పంటను కోయకుండా వదిలేయడంతో పాటు వైర్ల కింద దున్నకుండా వదిలేస్తు న్నారు. విద్యుత్ తీగలను సరిచేయాలని సంబంధిత విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. వేలా డుతున్న విద్యుత్ వైర్ల మధ్య లో విద్యుత్ స్తంభం ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారం అయిదానికి అధికారులు డబ్బులు చేల్లిస్తేనే మరమ్మతులు చేసా _మని చెప్పుతున్నారని వారు ఆరోపించారు. ప్రాణాలు పోతే తప్ప పట్టించు కోరా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. గత కొన్ని నెలల క్రితం ఝరాసంగం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మేకల మేత కోసం వెళ్ళి వేలాడుతున్న విద్యుత్ వైర్లు తాకడంతో మృతి చెందారు. ఇంత జరిగినా అధికారులు పట్టించుకోకపోవడం దారుణంగా ఉందన్నారు.
వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్.
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని వెంకటేశ్వర్ల పల్లి చైతన్య గ్రామైక్య సంఘం,చౌటుపర్తి శ్రీ ఆంజనేయ గ్రామైక్య సంఘం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ ఐకేపీ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రా లకు ధాన్యాన్ని తరలించి,ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.దీనివల్ల 500 రూపాయల బోనస్ కూడా రైతులకు చేకూరుతుందన్నారు.రైతుల ఆర్థిక అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.మద్దతు ధర క్వింటాలుకు ‘ఎ ‘ గ్రేడ్ రకం రూ. 2320.సాధారణ రకానికి ధర 2300. ఉందన్నారు.ఈ కార్యక్రమం లో ఏవో జైసింగ్,ఏపిఎం రమాదేవి,కాంగ్రెస్ పార్టీ నడికూడ మండల అధ్యక్షు డు బుర్ర దేవేందర్ గౌడ్, సమన్వయ కమిటీ సభ్యులు పెద్దబోయిన రవీందర్ యాదవ్,ఈర్ల చిన్ని, బొల్లె బిక్షపతి,పిఏసిఎస్ సెంటర్ ఇంచార్జ్ పెండ్యాల మహేందర్ రెడ్డి,సీఈవో చోటా మియా, టాప్ ఆపరేటర్ పెగడ ఓం ప్రకాష్,సిసి కుమారస్వామి, మహిళా సంఘం సభ్యులు హరిత,స్వరూప,నవ్య శ్రీ, లక్ష్మి,మాధవి,ప్రసన్న,హైమ, రమ్య,తిరుమల,రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ “వద్దిరాజు”, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ తదితరుల హాజరు.
“నేటిధాత్రి”ఇల్లెందు, ఏప్రిల్, 15:
సన్నాయి మేళం సప్పుడు.. బాజా భజంత్రీల మోతలు.. వెంట నడిచిన మహిళా నేతలు.. కుంకుమ పూలు, కుంకుమ, గంధం, వాయినాలు.. ఇవన్నీ ఏ పెండ్లి కార్యానివో అనుకుంటే.. పప్పులో కాలేసినట్లే..! ఈ హడావిడి ఎక్కడో తెలుసుకోవాలంటే.. ఈ వార్త పూర్తిగా చదవాల్సిందే..!!
MLA
ఏప్రిల్ 27న వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ కు సన్నాహకంగా ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. మేళ, తాళాల నడుమ పార్టీ ముఖ్య నాయకుల ఇళ్లకు వెళ్లి బొట్టు పెట్టి వరంగల్ సభకు ఆహ్వానించారు. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, తెలంగాణ ఉద్యమకారుడు దిండిగాల రాజేందర్ అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళా నేతలు, కౌన్సిలర్లు వెంట నడిచారు. ఇల్లెందు మున్సిపాలిటీ 7 వార్డులో గల 2 నెంబర్ బస్తీలో ఈ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ క్రియాశీల కార్యకర్తల కుటుంబాల్లో ముఖ్యులైన బజారు సత్యనారాయణ, ఎంఏ రవూఫ్, చాగర్ల సరళ, సామల రవితేజ ఇళ్లకు వెళ్లి బొట్టు పెట్టి, కుటుంబ సభ్యులందరినీ వరంగల్ లో జరిగే రజతోత్సవ సభకు హాజరు కావాలని ఎంపీ వద్దిరాజు కోరారు. ఒక ప్రాంతీయ పార్టీ పాతికేళ్లుగా క్రియాశీలకంగా ప్రజల కోసం అంకితమై పని చేయడం చాలా అరుదు అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ తర్వాత అంతటి ఘనత బీఆర్ఎస్ కే దక్కిందన్నారు. అందుకే.. బీఆర్ఎస్ పాతికేళ్ల సంబురం పండుగలా నిర్వహిస్తున్నామని వద్దిరాజు తెలిపారు. ఈ సభకు తాము ఊహించిన దానికంటే ఎక్కువ మంది కార్యకర్తలు తరలివస్తున్నారని చెప్పారు. ఈ సభ విజయవంతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని రవిచంద్ర కోరారు.
గులాబీ దండు కదం తొక్కాలి..! కాంగ్రెసోళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తాలి..!!ఎంపీ “వద్దిరాజు”
“నేటిధాత్రి”,ఇల్లెందు, ఏప్రిల్, 15:
వరంగల్ లో జరిగే సభకు ఇల్లెందు నియోజకవర్గం నుంచి గులాబీ దండు వేలాదిగా కదం తొక్కాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. ఈ సభకు హాజరయ్యే పార్టీ శ్రేణులను చూసి కాంగ్రెసోళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తాలని అన్నారు. మాజీ శాసనసభ్యురాలు బాణోత్ హరిప్రియా నాయక్ అధ్యక్షతన మంగళవారం ఇల్లెందు నియోజకవర్గ పార్టీ విస్తృత సమావేశం జరిగింది. ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వరంగల్ లో పది లక్షల మందితో జరిగే సభలో.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం మాట్లాడుతరోనని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఏడాదిన్నరకే ప్రజలు విసిగి, వేసారి పోయారని అన్నారు. ఆచరణలో సాధ్యం కాని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయలేక చేతులెత్తేశారని విమర్శించారు. కేసీఆర్ ను దూరం చేసుకుని తప్పు చేశామని ప్రజలంతా పశ్చాత్తాప పడుతున్నారని అన్నారు.
BRS
కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేద్దామని భ్రమ పడుతున్న ముఖ్యమంత్రి.. తాను కూర్చున్న కుర్చీ కూడా కేసీఆర్ పెట్టిన బిక్షే అని గురైరగాలని అన్నారు. కేసీఆర్ పోరాటం చేయకపోతే ఇవాళ రాష్ట్రమే వచ్చేది కాదని ఎంపీ రవిచంద్ర గుర్తు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అద్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ.. వరంగల్ సభ విజయవంతానికి దిశా నిర్ధేశం చేశారు.
BRS
బహిరంగ సభకు హాజరయ్యే ముందు పార్టీ కార్యకర్తలంతా తమ తమ గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించుకుని బయలుదేరాలని పిలుపునిచ్చారు.
BRS
సమావేశంలో గ్రంధాలయ సంస్థ మాజీ అద్యక్షుడు దిండిగాల రాజేందర్, మహబూబాబాద్ జెడ్పీ మాజీ చైర్మన్ ఆంగోత్ బిందు, డిసీసీబీ మాజీ డైరెక్టర్ లక్కినేని సురేందర్, సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు సంజీవ్ నాయక్, వివిధ మండలాల పార్టీ బాధ్యులు శీలం రమేష్, బొమ్మెర ప్రసాద్, తాతా గణేష్, లక్ష్మణ్ నాయక్, పరుచూరి వెంకటేశ్వరరావు, టీబీజీకేఎస్ నాయకులు రంగనాధ్, జాఫర్ హుస్సేన్, జెకే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
హోతి బి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ
జహీరాబాద్ . నేటి ధాత్రి:
అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆయన రాసిన రాజ్యాంగం పల్లె తెలంగాణ రాష్ట్ర ఏర్పడినందుకు తెలంగాణ ఫాదర్ ఆఫ్ ది గార్డ్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిలిచిపోతారని చరిత్రలో నిలిచిపోయే పేరు రాజ్యాంగ గ్రహీత డాక్టర్ భారతరత్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్ని వర్గాలకు సమానత్వం చేస్తూ ఆయన చూపిన బాటలో నడుస్తూ మనమంతా ఒకటేనని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమంలో జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావు మాజీ కౌన్సిలర్లు మాజీ జెడ్పిటిసిలు మండల అధ్యక్షులు అంబేద్కర్ అభిమానులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జై భీమ్ నినాదంతో ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు
Ambedkar
తట్టు నారాయణ, నామ రవి కిరణ్, మహమ్మద్ ఇమ్రాన్ బి ఆర్ఎస్ సీనియర్ లీడర్ జహీరాబాద్, డ్రైవర్ కాలనీ జాకీర్, అహమద్ నగర్, ఆలీ, సీఎం అశోక్ రెడ్డి, బండి మోహన్, మోయోద్దీన్ సాబ్, పాల్గొనడం జరిగింది.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.