ఫోటో భవన్ రెండవ వార్షికోత్సవం సంబరాలు.

ఫోటో భవన్ రెండవ వార్షికోత్సవం సంబరాలు

మందమర్రి నేటి ధాత్రి

ఈరోజు మంచిర్యాల జిల్లా మందమర్రి ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. ఫోటో భవన్ రెండవ వార్షికోత్సవం స్థానిక ఫోటో భవన్లో నిర్వహించారు

Welfare Association

శ్రీ అధ్యక్షులు పసుల వెంకటస్వామి ఫోటోగ్రఫీ పితామహుడు అయినటువంటి లూయిస్ డాగురే జెండా ఎగురావేశారు అనంతరం లూయిస్ డాగురేగారి చిత్ర పటానికి పూలమాలవేసి . జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం కేక్ కట్ చేశారు

Welfare Association

ఈ కార్యక్రమంలో. రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు వడ్డకొండ కనకయ్య గౌడ్.పట్టణ కార్యదర్శి ఆడెపు అశోక్ కుమార్. ఉపాధ్యక్షులు. లక్కిరెడ్డి అనిదర్ రెడ్డి.. ఆర్ సుజిత్ నక్క పవన్ తాళ్లపల్లి రమేష్. వర్కింగ్ ప్రెసిడెంట్ వలస మణిరజ్. ప్రచార కార్యదర్శులు పసుల రవి. రామసాని సురేందర్. కేశవేణి హరికృష్ణ. జూపాక చది. సర్వ సలహాదారులు నక్క తిరుపతి. ఎం వి సత్యనారాయణ. జాడి ముకుందం. మంచిర్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్వాస తిరుపతి. కుటుంబ భరోసా ఇన్చార్జి నూనె సురేష్. జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు.

Welfare Association

జహీరాబాద్ లో యువకుడి హత్య..

జహీరాబాద్ లో యువకుడి హత్య..

◆:- మొదట మిస్సింగ్.. అనంతరం హత్య.

◆:- శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణ పరిధిలోని ఫైజ్ నగర్కు చెందిన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. హ త్యకు గురైన వ్యక్తి మొహమ్మద్ తాజో ద్దీన్ (22)గా గురించారు. పట్టణ పరిధి అల్లానా రోడ్డులో గల రహమత్ నగర్ ప్రాంతంలో ఆయన మృతదేహం లభిం చింది. నిన్న నమాజ్ కోసం వెళ్తున్నట్లు
ఇంట్లో చెప్పి బయలుదేరిన యువకుడు రాత్రి వరకు రాలేదు. జామ మసీదు వద్ద ఆయన బైక్ ను రికవరీ చేశారు. ఇవాళ ఓ పాడు బావిలో మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అక్కడకు చేరుకొని పరిశీలించగా మృత దేహం మీద గాయాలున్నందున కసితీరా పొడిచి హత్య చేసి అక్కడి నుంచి పరారై నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా హత్య ఎవరు, ఎందుకు చేశారనేది తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఝరాసంగం మాజీ సర్పంచ్ ను పరామర్శన..

ఝరాసంగం మాజీ సర్పంచ్ ను పరామర్శన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఇటీవల ఎమ్మెల్యే గారి సొంత గ్రామమైన ఝరాసంగం లో అనారోగ్యంతో బాధపడుతు కోలుకున్నా గ్రామ మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్,రామ్ సింగ్,కేతన్ చౌతయి, గార్ల వారి నివాసనికి చేరుకొని శాసనసభ్యులు కోనింటి మానిక్ రావు గారు,ఉమ్మడి మెదక్ జిల్లా చైర్మన్ డీసీఎంఎస్ శివకుమార్ గార్లు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి త్వరగా కోవాలని కోరారు.
వారితో పాటుగా మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్, మాజీ కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నర్సింహా గౌడ్, పట్టణ అధ్యక్షులు ఎజాస్ బాబా, మాజీ సర్పంచ్ లు పరమేశ్వర్ పటేల్,శ్రీనివాస్ రెడ్డి, బస్వరాజ్, అమరజిత్, ప్రభు పటేల్,బస్వరాజ్ పటేల్,ఫరూక్ పటేల్, నాయకులు వెంకట్ రెడ్డి, నవాజ్ రెడ్డి, నాగేశ్వర్ సజ్జన్,సంగన్న, శివ శంకర్ పటేల్, శశి వర్ధన్ రెడ్డి, కిజర్, విజయ్ పాటిల్, మాణిక్ యాదవ్,ఎంపీ శ్రీనివాస్ పటేల్,ఎంపీ నాగన్న, సోహైల్,రమేష్,రాజు కుమార్, బాలరాజ్, విల్లాస్, అనిల్ పటేల్, కృష్ణ, విజయ్, సాయ్యేద్, శివ వైజ్యనాథ్, రామ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

చెక్కులు ఇప్పించేందుకు… రూ.30 లక్షల కమీషన్!

చెక్కులు ఇప్పించేందుకు… రూ.30 లక్షల కమీషన్!

◆:- అసైన్డు భూమికి పరిహారం రాదంటూ తిరకాసు పెట్టిన అధికారులు

◆:- ఆందోళనతో నెలల తరబడి కార్యాలయాల చుట్టూ బాధితుల ప్రదక్షిణలు

◆:- ఇదే అదనుగా యంత్రాంగం సహకారంతో రంగంలోకి దిగిన దళారులు

◆:- అంతా తాము చూసుకుంటామని ఇద్దరు రైతులతో బేరసారాలు

◆:- వాళ్లు చెప్పినట్లుగా తక్కువ సమయంలో చెక్కులు ఇచ్చేసిన అధికారులు

◆:- కమీషన్ డబ్బులు ఇచ్చి. ఆధారాలతో దందాను వెలుగులోకి తెచ్చిన రైతులు

◆:- పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోక ఆవేదన

◆:- నిమ్జ్‌ భూసేకరణలో పెద్ద ఎత్తున సాగిన అక్రమాలకు నిదర్శనమీ ఘటన

Issuing cheques

జహీరాబాద్ నేటి ధాత్రి:

అసైన్లు భూములున్న వారే లక్ష్యంగా అధికారు లు పెద్దయెత్తున దందా సాగించారు. రైతుల అవగాహన లేమి, ఇతరత్రా అంశాలను ఆధారం చేసుకొని రూ.కోట్లు వెనకేసుకున్నారు. దళారులను ముందు పెట్టి పని నడిపించారు. ఎకరాకు ఇంత అని రేటు పెట్టి మరీ దర్జాగా వసూళ్లకు పాల్పడ్డారు. రైతులు ఎన్ని రోజులు తిరిగినా విడుదల కాని చెక్కులు, దళారుల సాయం తీసుకుంటే రోజుల వ్యవధిలోనే చేతికం దాయి. యంత్రాంగం, గ్రామాల్లోని దళారులు కలిసి సాగించిన కమీషన్ల దందాకు ఈ ఘటనే నిదర్శనం.

తిరిగి తిరిగి అలసిపోయారు!

Issuing cheques

న్యాల్ కల్ మండలం గణేష్ పూర్ గ్రామానికి చెందిన యోహాన్, సీమన్ అన్నదమ్ములు. వారికి ఒక్కొక్కరికి 4.19 ఎకరాల భూమి ఉంది. నిమ్జ్‌
కోసం ఈ భూములను సేకరించారు. అయితే ఈ భూములకు పరిహారం రాదని, కొన్ని రకాల కారణాలతో చెక్కులు ఇవ్వడం కుదరదని అధికారులు చెప్పారు. దీంతో అన్నదమ్ములిద్ద రూ ఆందోళన చెందారు. తమకు చాలా ఏళ్ల క్రితమే ప్రభుత్వం ఈ భూములను ఇచ్చిందని, పరిహారం ఇవ్వాలని విన్నవించారు. అయినా వారు పట్టించుకోలేదు. నెలల తరబడి కార్యా లయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపో యింది. ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్కులు రావని అధికారులు స్పష్టం చేశారు.

దళారులను రంగంలోకి దించారు!

Issuing cheques

న్యాయంగా యోహాన్ కు రూ.67లక్షలు, సీమన్ కు రూ.67లక్షలు వస్తాయి. కావాలనే అధికారు లు చెక్కులు ఆపేశారు. వారే హుసెళ్లికి చెందిన ఒక దళారిని రంగంలోకి దించారు. అతడు వెళ్లి నేరుగా వీరిద్దరితో మాట్లాడారు. ‘మీకెందుకు నేను అధికారులతో మాట్లాడుతాను. మీకు చెక్కులు ఇప్పిస్తాను. కానీ ఒక్కొక్కరు రూ.15ల క్షలు ఇవ్వాలి. లేకుంటే మీకు రూపాయి కూడా రాద’ని చెప్పుకొచ్చాడు. దీంతో భయపడిపో యిన అన్నదమ్ములు చేసేదేమీలేక సరేనన్నారు. దళారి చెప్పినట్లుగానే రోజుల వ్యవధిలోనే ఇద్దరి కీ చెక్కులు వచ్చాయి. తాము నెలలుగా తిరిగినా అందని చెక్కులు.. జెట్ స్పీడుతో వచ్చేయడంతో అన్నదమ్ములిద్దరూ అవాక్కయ్యారు.

ఆయన చేతికే చెక్కులు!

Issuing cheques

అధికారులు ఈ చెక్కులనూ దళారి చేతికే ఇచ్చే శారు. తమకు న్యాయంగా రావాల్సిన పరిహారం విషయంలో ఇంత పెద్దయెత్తున దందా నడవడం తో సీమెన్ నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆధారాలతో సహా ఈ బాగోతాన్ని బట్టబయలు చేసేందుకు ప్రయత్నించారు. ‘దళారి చేతికే రూ.67లక్షల విలువైన చెక్కు ఇచ్చారు. ఆయన నన్ను నేరుగా బ్యాంకుకు తీసుకెళ్లాడు. అక్కడ చెక్ డిపాజిట్ చేయించాడు. మా ఖాతాలో డబ్బు పడగానే.. రూ.15లక్షలు ఆయన ఖాతాలోకి పంపించుకున్నాడు. ఈ అంశమై చర్యలు తీసుకోండి’ అంటూ హద్నూర్ పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. కానీ వారు పట్టించుకోలేదు. నిమ్జ్‌ భూసేకరణ మాటున సాగిన, సాగుతున్న దందాలకు ఇదొక ప్రత్యక్ష నిదర్శనం. ఇప్పుడు వెళ్లి అధికారులు విచారణ చేసినా. పూర్తి వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.

Issuing cheques

అయినా.. పన్ను ప్రయోజనాలున్నాయ్‌..

 

అయినా.. పన్ను ప్రయోజనాలున్నాయ్‌

ఏ వ్యక్తికైనా ఆరోగ్య బీమా తప్పనిసరి. దేశంలో హెల్త్‌కేర్‌ వ్యయాలు ఏటా 14ు వంతున పెరుగుతున్నాయని అంచనా. అయితే వయోవృద్ధులు లేదా సీనియర్‌ సిటిజన్లు పెరుగుతున్న వయసు, ముందు నుంచి ఉన్న వ్యాధుల కారణంగా…

ఆరోగ్య బీమా లేదా..?

ఏ వ్యక్తికైనా ఆరోగ్య బీమా తప్పనిసరి. దేశంలో హెల్త్‌కేర్‌ వ్యయాలు ఏటా 14ు వంతున పెరుగుతున్నాయని అంచనా. అయితే వయోవృద్ధులు లేదా సీనియర్‌ సిటిజన్లు పెరుగుతున్న వయసు, ముందు నుంచి ఉన్న వ్యాధుల కారణంగా అందుబాటు ప్రీమియంలలో ఆరోగ్య బీమా పొందలేక పోతున్నారు. ఈ కారణంగా ఆస్పత్రి, వైద్య పరీక్షలు, డాక్టర్‌ కన్సల్టేషన్‌ వ్యయాలన్నీ తాము పొదుపు చేసుకున్న సొమ్ము నుంచే చెల్లించాల్సి వస్తోంది. ఇలాంటి అంశాలన్నీ దృష్టిలో ఉంచుకునే ఆదాయపు పన్ను చట్టం 80డి సెక్షన్‌.. 60 సంవత్సరాల వయసు పైబడిన వారందరికీ ఆరోగ్య సంబంధిత వ్యయాలపై కొన్ని రాయితీలు అందిస్తోంది. పాత ఆదాయపు పన్ను విధానాన్ని ఎంపిక చేసుకున్న వారికి మాత్రమే ఈ ప్రయోజనాలు పరిమితం. దీని కింద ఆరోగ్య బీమా పాలసీ లేకపోయినా సీనియర్‌ సిటిజన్లు ఆరోగ్య సంబంధిత వ్యయాలపై పన్ను మినహాయింపులు కోరవచ్చు.
80డి సెక్షన్‌ ఏమిటి?

పన్ను చెల్లింపుదారుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ సెక్షన్‌ ఆరోగ్య బీమా లేదా ఆరోగ్య సంబంధిత వ్యయాలపై రాయితీలు, మినహాయింపులు అందిస్తుంది. తద్వారా పన్ను చెల్లింపు మొత్తం ఆదా చేస్తుంది.

  • ఈ సెక్షన్‌ కింద పన్ను చెల్లింపుదారు తనతో పాటుగా కుటుంబ సభ్యుల (భార్య లేదా భర్త, తనపై ఆధారపడిన సంతానం) ఆరోగ్య సంరక్షణకు చేసిన వ్యయాలపై లేదా ఆరోగ్య బీమా ప్రీమియంపై ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా రూ.25,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
  • దీనికి తోడు వయోవృద్ధులైన తల్లిదండ్రుల కోసం చేసిన ఆరోగ్య సంబంధిత వ్యయాలు, ఆరోగ్య బీమా ప్రీమియంపై మరో రూ.25,000 పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేయవచ్చు.
  • అలాగే ప్రీమియం చెల్లిస్తున్న వ్యక్తి (స్వయంగా లేదా కుటుంబ సభ్యుల కోసం) సీనియర్‌ సిటిజన్‌ అయినట్టయితే ఈ మినహాయింపు పరిమితి గరిష్ఠంగా రూ.50,000 వరకు ఉంటుంది. అంటే మీరు సీనియర్‌ సిటిజన్‌ అయి ఉండి మీ కోసం, మీ తల్లిదండ్రుల కోసం కూడా ప్రీమియం చెల్లిస్తున్నట్టయితే రూ.1 లక్ష వరకు ఆదాయపు పన్ను మినహాయింపునకు క్లెయిమ్‌ చేసుకోవచ్చు.
  • ప్రివెంటివ్‌ హెల్త్‌ చెకప్‌ చెల్లింపుల (గరిష్ఠంగా రూ.5,000) కోసం చేసే వ్యయాలైతే నగదు రూపంలో చెల్లించవచ్చు. మిగతా వ్యయాలేవైనా నగదేతర రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది.

బీమా కవరేజీ లేని వారి మాటేమిటి?

ఆరోగ్య బీమా కవరేజీ లేని సీనియర్‌ సిటిజన్లకు కూడా ఈ సెక్షన్‌ రాయితీలు కల్పిస్తోంది. అలాంటి వారు వైద్య వ్యయాలపై ఏడాదికి గరిష్ఠంగా రూ.50,000 వరకు మినహాయింపులు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఈ వ్యయాలను మీ పిల్లలు భరించినట్టయితే వారు కూడా పన్ను మినహాయింపులు పొందేందుకు అర్హులవుతారు. కేవలం 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు మాత్రమే ఈ ప్రయోజనాలు పరిమితం అన్న విషయం గుర్తుంచుకోవాలి. అంతే కాదు…నూతన, సరళీకృత ఆదాయపు పన్ను విధానం ఎంచుకున్న వారికి ఇది వర్తించదు.

ప్రపంచ సంస్కృత మహాసభలో అక్షర-పురుషోత్తమ దర్శనం..

ప్రపంచ సంస్కృత మహాసభలో “అక్షర-పురుషోత్తమ దర్శనం”పై స్పెషల్ సెషన్

వేదాంత చరిత్రలో మరో కీలక మలుపు…ప్రపంచ సంస్కృత మహాసభలో తొలిసారిగా అక్షర-పురుషోత్తమ దర్శనానికి విశిష్ట సెషన్! భగవాన్ స్వామినారాయణ బోధించిన వేదాంత సిద్ధాంతానికి గ్లోబల్ స్థాయిలో గౌరవం. నేపాల్‌ భూమి, సంస్కృత పండితులు, శాస్త్రీయ చర్చలు… ఈ ఘట్టం చరిత్రలో నిలిచిపోతుంది. ఆ డీటేల్స్ ఈ కథనంలో… 

ప్రపంచంలోని ప్రాచీనమైన భాషలలో ఒకటైన సంస్కృత భాషకు అంకితమైన ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ గ్యాథరింగ్ ప్రపంచ సంస్కృత మహాసభ (World Sanskrit Conference) ఈ ఏడాది 19వ ఎడిషన్‌గా నేపాల్‌లో ఘనంగా నిర్వహించబడింది. ఈ మహాసభ ప్రతి మూడేళ్లకోసారి ప్రపంచంలోని ఒక దేశంలో జరుగుతుంది. వేలాది మంది స్కాలర్లను ఒకేచోట సమీకరిస్తూ.. సంస్కృత భాష, సాహిత్యం, తత్వశాస్త్రాలపై సుదీర్ఘ చర్చలకు ఇది వేదికవుతుంది.

ఈసారి నేపాల్ రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభమైన ఐదు రోజుల ఈ సదస్సు… మరో విశేషానికి వేదికైంది. నేపాల్‌తో ఉన్న పవిత్రమైన సంబంధాన్ని గుర్తిస్తూ.. భగవాన్ స్వామినారాయణు ప్రకటించిన తత్త్వాలలో అక్షర-పురుషోత్తమ దర్శనానికి (Akshar-Purushottam Darshan) ప్రత్యేక శాస్త్రీయ సెషన్‌ ఏర్పాటైంది. ఇది నేపాల్‌లో మొదటిసారిగా ఈ తత్వశాస్త్రాన్ని విద్యావేత్తల సమక్షంలో అధికారికంగా పరిచయం చేసిన చారిత్రక సంఘటనగా నిలిచింది.

18వ శతాబ్దం చివర్లో భగవాన్ స్వామినారాయణ మూడు సంవత్సరాలకు పైగా నేపాల్‌ యాత్ర చేశారు. ఈ యాత్రలో ఆయన తపస్సు, యోగసాధన, ఆధ్యాత్మిక బోధనలతో నేపాల్‌ భూమిని పవిత్రం చేశారు. ఈ యాత్ర సందర్భంగానే ఆయన అక్షర-పురుషోత్తమ దర్శనం అనే ఆధునిక వేదాంత పాఠాన్ని వ్యక్తపరిచారు. ఇది ఇప్పుడు వేదాంతంలో ఒక ప్రత్యేక పాఠశాలగా గుర్తింపు పొందింది.

జూన్ 28న జరిగిన ప్రత్యేక సెషన్‌లో నేపాల్, భారతదేశం, అమెరికా, చైనా, జపాన్, యూరప్‌ తదితర దేశాల ప్రఖ్యాత సంస్కృత పండితులు పాల్గొన్నారు. ఈ సెషన్‌ను మహామహోపాధ్యాయ స్వామి భద్రేశ్దాస్‌జీ అధ్యక్షతన నిర్వహించారు. ఆయన రచించిన స్వామినారాయణ భాష్యాలు, ప్రస్థానత్రయి (ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు)పై వ్యాఖ్యానాలుగా వేదాంత ప్రపంచంలో విశిష్ట స్థానం పొందాయి.

ప్రతిష్టాత్మక అతిథులు: ఈ సెషన్‌లో పలువురు ప్రముఖ విద్యావేత్తలు, వర్సిటీ వైస్ చాన్సలర్లు పాల్గొన్నారు:

  • శ్రీ కాశీనాథ్ న్యౌపానే – ప్రపంచ సంస్కృత మహాసభ జాతీయ సమన్వయకర్త
  • ప్రొఫెసర్ శ్రీనివాస వరఖేడి – కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం, ఢిల్లీ
  • ప్రొఫెసర్ ముర్లీ మనోహర్ పాఠక్ – లాల్ బహదూర్ శాస్త్రీ సంస్కృత విశ్వవిద్యాలయం
  • ఇతర వర్సిటీల వైస్ చాన్సలర్లు – తిరుపతి, గుజరాత్, నాగపూర్, రాజస్థాన్, ఉజ్జయినీ, కాశీ, తదితర ప్రాంతాల నుండి
  • ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫిలాసఫికల్ రీసెర్చ్ సభ్యులు
  • నేపాల్ సంస్కృత విశ్వవిద్యాలయం, జయతు సంస్కృతం, నేపాల్ పండిట్ మహాసభ వంటి సంస్థల ప్రతినిధులు

శాస్త్రీయ పత్రాలు – సిద్ధాంత వైశిష్ట్యం: ఈ ప్రత్యేక సెషన్‌లో అక్షర-పురుషోత్తమ దర్శనంపై ప్రముఖ పండితులు వివిధ కోణాల్లో పరిశోధనాత్మక పత్రాలు సమర్పించారు:

  • డా. ఆత్మతృప్తదాస్ స్వామి – 21వ శతాబ్ద సంస్కృత సాహిత్యంలో స్వామినారాయణ భాష్యాల నిర్మాణ ప్రక్రియపై అధ్యయం
  • డా. అక్షరానందదాస్ స్వామి – భగవద్గీతలో ధర్మతత్వంపై అక్షర-పురుషోత్తమ దృష్టి
  • ఆచార్య బ్రహ్మానందదాస్ స్వామి – పరబ్రహ్మ స్వామినారాయణుని అవతార తత్వం
  • డా. జ్ఞానతృప్తదాస్ స్వామి – వచనామృతంలోని అక్షర-పురుషోత్తమ సిద్ధాంతం
  • ఇతర పండితులు – బ్రహ్మ-ఆత్మ ఏకత్వం, అక్షరబ్రహ్మ తత్వం, గీతా భాష్య విశ్లేషణ, విశిష్టాద్వైతంతో తులనాత్మక అధ్యయనాలు

సెషన్ ముగింపు సమయంలో ప్రొఫెసర్ శ్రీనివాస వరఖేడి మాట్లాడుతూ..“అక్షర-పురుషోత్తమ దర్శనం వేదాంతంలో ఒక ప్రత్యేకమైన, మౌలికమైన మానవతాత్మక ఆవిష్కరణ. ఇది వేదపరంపరలో కొత్త వెలుగుల్ని నింపుతుంది” అని కొనియాడారు. ఇదే సందర్భంలో కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం అక్షర-పురుషోత్తమ దర్శనాన్ని అధికారికంగా తమ సిలబస్‌లో చేర్చినట్టు ప్రకటించారు.

స్వామి భద్రేశ్దాస్ తన ముగింపు ప్రసంగంలో నేపాల్ భూమికి భగవాన్ స్వామినారాయణుని పవిత్ర పాదయాత్రతో ఏర్పడిన ఆధ్యాత్మిక పునీతతను గుర్తుచేశారు. అక్షర-పురుషోత్తమ దర్శనం ద్వారా సానాతన వేదిక పరంపరలోకి ఒక కొత్త అధ్యాయం ప్రవేశించిందన్నారు. ఈ చారిత్రక సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ “ఈరోజు నేపాల్ భూమి అక్షర-పురుషోత్తమ దర్శనాన్ని గౌరవంగా ఆహ్వానిస్తూ, శాస్త్రీయంగా స్థాపన చేయడం సంతోషంగా ప్రకటిస్తున్నాం” అని ప్రపంచ సంస్కృత మహాసభ జాతీయ సమన్వయకర్త శ్రీ కాశీనాథ్ న్యౌపానే వ్యాఖ్యానించారు.

ఈ సదస్సు కేవలం ఒక విద్యా కార్యక్రమం కాదు. ఇది భగవాన్ స్వామినారాయణుడు, వేదాంత తత్త్వాలు, నేపాల్‌ భూమి మధ్య ఉన్న ఆధ్యాత్మిక బంధానికి ఒక మైలు రాయి.

విద్యార్థులు గర్భం దాలిస్తే రూ.లక్ష బహుమతి..

విద్యార్థులు గర్భం దాలిస్తే రూ.లక్ష బహుమతి.. సరికొత్త స్కీమ్ తెచ్చిన ఆ దేశ సర్కార్..

ఓ దేశం తెచ్చిన స్కీమ్ చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులు గర్భవతులు అయితే దాదాపు రూ.లక్ష అందిస్తోంది. ఇది విద్యార్థుల కెరీర్‌ను నాశనం చేస్తుందని పలువురు మండిపడుతున్నా.. అక్కడి ప్రభుత్వం మాత్రం జనాభా పెరిగితే చాలా అని భావిస్తోంది. ఎందుకంటే ఆ దేశంలో సంతానోత్పత్తి రేటు దారుణంగా పడిపోవడమే దీనికి కారణం.

గత నాలుగేళ్లుగా ఉక్రెయిన్‌తో యుద్ధంలో బిజీగా ఉంది రష్యా. ఏళ్లు గడుస్తున్నా యుద్ధం మాత్రం ఓ కొలక్కి రావడం లేదు. ఉన్న సైన్యం సరిపోక ఉక్రెయిన్ నుంచి సిబ్బందిని తెచ్చుకుంటుంది రష్యా. ఇప్పటివరకు యుద్ధంలో 2లక్షల 50వేల మంది రష్యన్ సైనికులు మరణించినట్లు తెలుస్తోంది. లక్షలాది మంది యువత దేశం విడిచి వెళ్లిపోతున్నారు. దీంతో జనాభా సంక్షోభం తలెత్తింది. మరోవైపు జననాల రేటు గణనీయంగా తగ్గుతున్న తరుణంలో దానిని పెంచేందుకు ప్రభుత్వం అనేక స్కీమ్స్ ప్రవేశపెడుతుంది. ఈ క్రమంలోనే సంతానోత్పత్తిని పెంచేందుకు రష్యా ఓ కొత్త స్కీమ్‌ను తీసుకొచ్చింది. స్కూల్, కాలేజీ స్టూడెంట్స్ గర్భవతులు అయితే వారికి ప్రోత్సాహకాలు అందజేస్తుంది. ప్రస్తుతం ఎంపిక చేసిన ప్రాంతాల్లో దీనిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తోంది. ఇప్పుడు ఈ పథకం చర్చనీయాంశంగా మారింది. కొంతమంది మేధావులు విద్యార్థుల భవిష్యత్తును ఈ స్కీమ్ నాశనం చేస్తుందని విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ క్రెమ్లిన్ మాత్రం జనాభా పెరుగుదలను జాతీయ బలం, వ్యూహాత్మక శక్తిగా భావిస్తుంది. అందుకే ఇటువంటి స్కీమ్‌ను ప్రవేశపెట్టింది.

ప్రస్తుతం రష్యాలోని 10 ప్రాంతాల్లో ఈ స్కీమ్‌ను అమలు చేస్తున్నారు. అర్హత గల వయసు ఉన్న విద్యార్థులు మాత్రమే ఈ స్కీమ్‌ను పొందొచ్చు. ఆ విద్యార్థులకు 100,000 రూబిళ్లు అంటే రూ.90వేల రూపాయలను ప్రోత్సాహంగా అందజేస్తుంది. ఈ పథకం రష్యా జనాభా క్షీణతను తిప్పికొట్టడానికి 2025 మార్చిలో ప్రవేశపెట్టారు. స్కూల్ లేదా కాలేజీకి చెందిన యువతి 22వీక్స్ గర్భవతిగా ఉండి తన పేరును ప్రభుత్వ మదర్ క్లినిక్‌లో నమోదు చేసుకుంటే దాదాపు లక్ష రూపాయలు అందజేస్తోంది. 2023లో రష్యా జనన రేటు 1.41శాతంగా ఉంది. అవసరమైన దానికంటే ఇది చాలా తక్కువ. 2024లో మొదటి ఆరు నెలల్లో రష్యాలో దాదాపు 6లక్షల మంది శిశివులు మాత్రమే జన్మించారు. గత పాతికేళ్లలో ఇదే అతి తక్కువ సంఖ్య కావడం గమనార్హం. అందుకే ఈ ఏడాది విద్యార్థులకు సైతం ప్రోత్సాహకాలు అందజేస్తోంది.

ఈ స్కీమ్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. రష్యన్ పబ్లిక్ ఒపీనియన్ రీసెర్చ్ సెంటర్ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం.. 43శాతం మంది రష్యన్లు ఈ విధానాన్ని సమర్థిస్తుండగా.. 40శాతం మంది దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఈ స్కీమ్ యువతుల భవిష్యత్తును దోపిడీ చేస్తుందని.. విద్య, కెరీర్ అవకాశాలను దెబ్బతీస్తుందని పలువురు మండిపడుతున్నారు. అయితే ఈ విధానాలను రష్యా మాత్రమే కాదు వివిధ దేశాలు అమలు చేస్తున్నాయి. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లులకు హంగేరీ పన్ను మినహాయింపులను అందిస్తుంది. పోలాండ్ ప్రతి బిడ్డకు నెలవారీ భత్యాలను చెల్లిస్తుంది. 2050 నాటికి మూడొంతుల కంటే ఎక్కువ దేశాల సంతానోత్పత్తి స్థాయిల దిగువకు పడపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారత్‌పై సుంకాలు..20% లోపే..

భారత్‌పై సుంకాలు..20% లోపే

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికయ్యాక ట్రంప్‌ సుంకాల బాదుడుకు పలు దేశాలు విలవిల్లాడుతున్నాయి…

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయం తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి సన్నాహాలు

బ్రిటన్‌ తర్వాత మనతోనే ఈ తరహా అవగాహన

ట్రంప్‌ సర్కారు నిర్ణయం

వాషింగ్టన్‌, జూలై 12: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికయ్యాక ట్రంప్‌ సుంకాల బాదుడుకు పలు దేశాలు విలవిల్లాడుతున్నాయి. ప్రపంచ షేర్‌ మార్కెట్లు ‘బేర్‌’మంటున్నాయి. చైనా లాంటి దేశాలపై పదుల్లో కాకుండా.. వందల శాతాల మేర సుంకాల బాదుడుతో ట్రంప్‌ దూసుకుపోతున్నారు. ఇటీవల బ్రిక్స్‌ దేశాలకు 50శాతానికి పైగా సుంకాలు తప్పవని, భారత్‌ కూడా మినహాయింపు కాదని హెచ్చరించిన సంగతి తెలిసిందే..! అయితే.. త్వరలో భారత్‌తో కుదరనున్న తాత్కాలిక వాణిజ్య ఒప్పందం ప్రకారం అమెరికా దిగుమతి చేసుకునే భారతీయ ఉత్పత్తులపై సుంకాలను 26%(ముందుగా ప్రకటించినది) కాకుండా.. 20% కంటే తక్కువగా ప్రకటించే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు పలు వార్తాసంస్థలు కథనాలను ప్రచురించాయి. ఈ ఒప్పందంతో ట్రంప్‌ పాలనలో వాణిజ్య ఒప్పందం చేసుకున్న అరుదైన దేశాల జాబితాలో భారత్‌ చేరనుంది. ఇప్పటికే బ్రిటన్‌ ఈ జాబితాలో ఉంది.

ఇక ఆసియా దేశాలైన మయన్మార్‌పై 40%, వియత్నాం, ఫిలిప్పీన్స్‌లపై 20% మేర అమెరికా సుంకాలు కొనసాగుతున్నాయి. భారత్‌ మాత్రం అధిక సుంకాల జాబితాలో చేరకపోవచ్చని బ్లూమ్‌బెర్గ్‌ కూడా ఓ నివేదికలో పేర్కొంది. మరోవైపు అమెరికాతో వాణిజ్య చర్చలకు భారత్‌ వడివడిగా అడుగులు వేస్తోంది. ఓ ప్రతినిధి బృందం అమెరికాకు చేరుకుని, అక్కడి అధికారులతో చర్చలు జరపనుంది. ఇప్పటికే భారత్‌ తన తుది ప్రతిపాదనను అమెరికాకు అందజేసింది. జన్యు మార్పిడి(జీఐ) పంటలకు భారత్‌ వ్యతిరేకంగా ఉన్న విషయం తెలిసిందే..! అయితే.. అమెరికా తన తాత్కాలిక వాణిజ్య ఒప్పందంలో భాగంగా భారత్‌పై జీఐ పంటల విషయంలో ఒత్తిడి చేసే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి భారత్‌ అంగీకరించకపోవచ్చని తెలుస్తోంది. ఇటు ఔషధ రంగ నియంత్రణ సమస్యలు కూడా ఇంకా పరిష్కారం కావాల్సి ఉంది. ప్రస్తుత చర్చల తర్వాత తాత్కాలిక ఒప్పందం కుదురుతుందని, ఈ ఏడాది చివరికి తుది ఒప్పందంపై ప్రకటన ఉంటుందని సమాచారం.

ఇరాన్ ఊహించని నిర్ణయం..

ఇరాన్ ఊహించని నిర్ణయం.. ఇజ్రాయెల్‌కు గడ్డు కాలమే..

12 రోజుల యుద్ధం తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. రెండు దేశాలు యుద్ధాన్ని ఆపేశాయి. అయితే, తాజా పరిణామంతో ఇజ్రాయెల్‌కు గట్టి దెబ్బ పడేలా ఉంది.

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య న్యూక్లియర్ పరిశోధనల విషయంలో యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఇరాన్ న్యూక్లియర్ బాంబు ప్రయోగాలు చేయటాన్ని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఇరాన్ న్యూక్లియర్ సైట్లను ధ్వంసం చేయడానికి ప్రయత్నించింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగింది. దాదాపు 12 రోజుల పాటు యుద్ధం నడిచింది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అమెరికా పూర్తి మద్దతు ఇచ్చింది. స్వయంగా రంగంలోకి దిగి బాంబర్లతో ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై దాడులు చేసింది.

12 రోజుల యుద్ధం తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. రెండు దేశాలు యుద్ధాన్ని ఆపేశాయి. అయితే, తాజా పరిణామంతో ఇజ్రాయెల్‌కు గట్టి దెబ్బ పడేలా ఉంది. ఇరాన్.. అమెరికాతో పాత దోస్తీ కొనసాగించాలని చూస్తోంది. ఇరాన్ న్యూక్లియర్ ప్రయోగాలు మొదలుపెట్టడానికి కారణం అమెరికానే. 1960లలో ఇరాన్.. అమెరికా సాయంతో న్యూక్లియర్ ప్రయోగాలు మొదలెట్టింది. అమెరికా ఇందుకోసం స్వయంగా కొన్నేళ్ల పాటు యురేనియాన్ని సప్లై చేసింది.

కథ విని ఉద్వేగానికి లోనయ్యా..

కథ విని ఉద్వేగానికి లోనయ్యా

‘ఒక సినిమా అంగీకరించే ముందు కథలో ప్రేక్షకులను కదిలించే బలమైన భావోద్వేగాలు ఉన్నాయా, లేవా? అని చూస్తాను. ‘జూనియర్‌’ సినిమా స్ర్కిప్ట్‌ నాకు బాగా నచ్చింది. కథ విని ఉద్వేగానికి లోనయ్యా….

‘ఒక సినిమా అంగీకరించే ముందు కథలో ప్రేక్షకులను కదిలించే బలమైన భావోద్వేగాలు ఉన్నాయా, లేవా? అని చూస్తాను. ‘జూనియర్‌’ సినిమా స్ర్కిప్ట్‌ నాకు బాగా నచ్చింది. కథ విని ఉద్వేగానికి లోనయ్యా. బలమైన భావోద్వేగాలతో పాటు ప్రేమ, కుటుంబ విలువలతో సినిమా ఆద్యంతం హృద్యంగా ఉంటుంది’ అని సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ కుమార్‌ అన్నారు. గాలి జనార్ధన్‌రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి కథానాయకుడిగా నటించిన చిత్రమిది. రాధాకృష్ణ దర్శకత్వంలో రజనీ కొర్రపాటి నిర్మించారు. ఈ నెల 18న ‘జూనియర్‌’ విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన సెంథిల్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడారు. ‘దర్శకుడు రాధాకృష్ణ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. కొత్త హీరోకు ఇలాంటి సినిమా చేయడం కొంచెం కష్టమే. కానీ కిరీటి ఒక సవాల్‌గా తీసుకొని ఈ సినిమా కోసం కష్టపడిన తీరు నాకు నచ్చింది. ఈ సినిమాలో పాటలతో పాటు కిరీటీ, శ్రీలీల జంట చేసిన డాన్స్‌లను ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తారు. కిరీటి మంచి నటుడు, అద్భుతమైన డాన్సర్‌. సెట్స్‌లో చాలా కష్టపడ్డాడు. తొలి చిత్రం ‘జూనియర్‌’తోనే ఆయన ప్రేక్షకులను ఆకట్టుకుంటాడనే గట్టి నమ్మకం ఉంది. ఒక మంచి సినిమా అందించాలనే తపనతో నిర్మాతలు ఈ సినిమా తీశారు’ అని చెప్పారు.

పవర్‌ఫుల్‌ పాత్రలో..

పవర్‌ఫుల్‌ పాత్రలో

రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘పెద్ది’. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థల సమర్పణలో వృద్ధి సినిమాస్‌ బేనర్‌పై వెంకట సతీష్‌ కిలారు…

రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘పెద్ది’. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థల సమర్పణలో వృద్ధి సినిమాస్‌ బేనర్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌ షాట్‌ గ్లింప్స్‌తో దేశవ్యాప్తంగా అంచనాలను పెంచేసింది. కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ ఈ చిత్రంలో ‘గౌర్నాయుడు’ అనే పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. శనివారం ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా శివరాజ్‌కుమార్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. కాగా, ఈ సినిమాలో రామ్‌చరణ్‌ సరసన కథానాయికగా జాన్వీకపూర్‌ నటిస్తున్నారు. జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న రామ్‌చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా సినిమా విడుదల కానుంది.

చెన్నైలో తెలుగు అబ్బాయి కథ..

చెన్నైలో తెలుగు అబ్బాయి కథ

సంతోష్‌ శోభన్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘కపుల్‌ ఫ్రెండ్లీ’. అశ్విన్‌ చంద్రశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్‌ తెలుగు, తమిళ భాషల్లో…

సంతోష్‌ శోభన్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘కపుల్‌ ఫ్రెండ్లీ’. అశ్విన్‌ చంద్రశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్‌ తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తోంది. మ్యూజికల్‌ రొమాంటిక్‌ లవ్‌స్టోరీగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. శనివారం సంతోష్‌ శోభన్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ చిత్రబృందం స్పెషల్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేసింది. పోస్టర్‌లో చెన్నైలో జీవనం కొనసాగిస్తున్న మధ్యతరగతి తెలుగు అబ్బాయిగా సంతోష్‌ శోభన్‌ కనిపిస్తున్నారు. చెన్నై నగరం బ్యాక్‌డ్రా్‌పలో సాగే ఈ ప్రేమ కథా చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుందని చిత్రబృందం పేర్కొంది.

బ్యూటిఫుల్‌ మెలోడీ..

బ్యూటిఫుల్‌ మెలోడీ

రష్మిక మందన్న, దీక్షిత్‌ శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ద గర్ల్‌ఫ్రెండ్‌’. ‘చి ల సౌ’తో జాతీయ అవార్డు అందుకున్న రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం…

రష్మిక మందన్న, దీక్షిత్‌ శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ద గర్ల్‌ఫ్రెండ్‌’. ‘చి ల సౌ’తో జాతీయ అవార్డు అందుకున్న రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌ సమర్పణలో ధీరజ్‌ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు. ఇటీవలె విడుదలైన టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ నెల 16న సినిమా నుంచి ‘నదివే’ అంటూ సాగే పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్‌. ఈ బ్యూటిఫుల్‌ మెలోడీకి హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ సంగీతం అందించారు. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కృష్ణన్‌ వసంత్‌.

స్నేహితులే రాజకీయ ప్రత్యర్థులు..

స్నేహితులే రాజకీయ ప్రత్యర్థులు

ఆది పినిశెట్టి, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో ‘ప్రస్థానం’ ఫేమ్‌ దేవా కట్టా, జయకిరణ్‌కుమార్‌ సంయుక్తంగా తెరకెక్కించిన వెబ్‌ సిరీస్‌ ‘మయసభ’. ‘రైజ్‌ ఆఫ్‌ ద టైటాన్స్‌’ ట్యాగ్‌లైన్‌…

ఆది పినిశెట్టి, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో ‘ప్రస్థానం’ ఫేమ్‌ దేవా కట్టా, జయకిరణ్‌కుమార్‌ సంయుక్తంగా తెరకెక్కించిన వెబ్‌ సిరీస్‌ ‘మయసభ’. ‘రైజ్‌ ఆఫ్‌ ద టైటాన్స్‌’ ట్యాగ్‌లైన్‌. విజయ్‌కృష్ణ లింగమనేని, శ్రీహర్ష నిర్మించారు. ఆగస్టు 7న ఓటీటీ వేదిక సోనీ లైవ్‌ ద్వారా అందుబాటులోకి రానుంది. తాజాగా, టీజర్‌ను విడుదల చేశారు. సంభాషణలు, ప్రధాన పాత్రధారుల మధ్య ఉన్న సంఘర్షణ, భావోద్వేగాలు ఆకట్టుకున్నాయి. ఇద్దరు స్నేహితులు కొన్ని పరిస్థితుల వల్ల రాజకీయ ప్రత్యర్థులుగా మారితే ఎలా ఉంటుందనేది కథాంశం. అయితే వీరిద్దరి పాత్రలు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మాజీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిని పోలి ఉంటాయని సమాచారం.

యాక్టర్స్‌ని తిట్టాను కొట్టాను..

యాక్టర్స్‌ని తిట్టాను కొట్టాను

‘మా ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ సినిమాలో రెండు పాత్రల మధ్య నడిచే సన్నివేశాలు కీలకంగా నిలుస్తాయి. వారి మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా రాకపోతే…

‘మా ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ సినిమాలో రెండు పాత్రల మధ్య నడిచే సన్నివేశాలు కీలకంగా నిలుస్తాయి. వారి మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా రాకపోతే సినిమా సాదాసీదాగా ఉంటుంది. అందుకే వారి నుంచి మంచి నటన రాబట్టాలనుకన్నాను. సెట్‌లో వారిని తిట్టాను, కొట్టాను, వారిపై రాళ్లు విసిరాను. మనం చేసే పాత్రలో జీవించడమే నటన అని నమ్ముతాను. అందుకే సినిమా కోసం ఏదైనా సరే తప్పదు. అందుకే వారిపట్ల అలా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెప్పలేదు’ అని దర్శకురాలు ప్రవీణ పరుచూరి చెప్పారు. రానా సమర్పణలో మనోజ్‌ చంద్ర, మోనికా జంటగా ప్రవీణ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మనోజ్‌ చంద్ర మాట్లాడుతూ ‘ప్రవీణ చేసే సినిమాల్లో నటిస్తే సరిపోదు, పాత్రల్లో జీవించాలి. అలా రామకృష్ణ పాత్రకు నేను ప్రాణం పోశానని నమ్ముతున్నాను’ అని చెప్పారు.

అందాల‌కే విందు.. కుషిత వీడియో వైర‌ల్.

అందాల‌కే విందు.. కుషిత వీడియో వైర‌ల్

ఇన్నాళ్లు చీర‌క‌ట్టులో మ‌న ప‌క్కింటి అమ్మాయిలా క‌నిపిస్తూ సంద‌డి చేసే హైద‌రాబాదీ బ్యూటీ కుషిత క‌ల్ల‌పు మ‌రోసారి రెచ్చిపోయింది.

అచ్చ తెలుగు సోయ‌గం కుషిత క‌ల్ల‌పు (Kushitha kallapu) రెచ్చిపోయింది. ఎప్పుడూ చీర‌క‌ట్టులో మ‌న ప‌క్కింటి అమ్మాయిలా క‌నిపిస్తూ సంద‌డి చేసే ఈ హైద‌రాబాదీ బ్యూటీ ఎలాంటి డ్రెస్ వేసుకున్నా అందులో ఒదిగిపోయి త‌న అందంతో ఎదుటి వారిని మెస్మ‌రైజ్ చేసేది.

అప్పుడప్పుడు చూయించి చూయించన‌ట్లు అందాల ప్ర‌ద‌ర్శిస్తూ వ‌చ్చిన ఈ ముద్దుగుమ్మ ఒక్క‌సారిగా రూట్ మార్చి ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి పోయి అందాల‌ను బాహాటంగా ప‌రుస్తూ చూసే వారికి షాకిచ్చింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఓ మూడు నాలుగు సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన బ్యూటీ ఎక్క‌డా స‌రైన గుర్తింపు రాక పోయిన‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో మిలియ‌న్‌కు పైగానే ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకుంది.

తాజాగా నిర్మాత‌ ఎస్కేఎన్‌, ద‌ర్శ‌కుడు మారుతి కాంబోలో వ‌స్తున్న త్రీ రోజెస్ వెబ్ సిరీస్ సీక్వెల్‌లో ఓ రోజ్‌గా న‌టిస్తున్న‌ ఈ భామ దానికి సంబంధించిన గ్లింప్స్‌లోనే హీట్ పెంచింది. ఆపై గ‌త ఆరు నెల‌ల నుంచి గ్లామ‌ర్ ప్ర‌ద‌ర్శ‌ణ‌లో ప‌ట్టా ప‌గ్గాలేకుండా ఓ రేంజ్‌లో ఫుల్ మీల్స్ పెడుతూ మ‌గ పుంగ‌వుల‌కు నిద్ర లేకుండా చేస్తోంది.

తాజాగా హాలీడే ట్రిప్‌కు వెళ్లిన ఈ బ్యూటీ అక్క‌డ కేవ‌లం చిన్న గుడ్డ పీల‌క‌తో ఎద అందాల‌ను టైట్‌గా బిగించి వీధుల‌న్నీ క‌లియ తిరుగుతూ క‌ల్లోలం రేపింది. వంటి పై భాగంలో, న‌డుముపై లైవ్‌లో క‌ల‌ర్ ఫుల్‌గా టాటూస్ వేయించుకుని ఎంజాయ్ చేసింది.

ఇందుకు సంబంధించిన వీడియోను సైతం పోస్టు ఈ చేసిన ఈ చిన్న‌ది కాసేప‌టికే ఆ వీడియోను డిలీట్ చేసి దాని స్థానంలో ఫొటోలు షేర్ చేసింది. ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట దుమార‌మే రేపుతున్నాయి. మీరూ ఓ లుక్కేసి మీ క‌నులారా ఆస్వాదించండి మ‌రి.

బికినీలో.. మన్మథుడు అన్షు అందాల విందు..

బికినీలో.. మన్మథుడు అన్షు అందాల విందు

మన్మథుడు సినిమాలో మృదు మ‌ధుర స్వరం, అమాయ‌క‌త్వంతో ఆక‌ట్టుకున్న‌ అన్షు ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో గ్లామర్ షోతో నెట్టింట ర‌చ్చ చేస్తోంది.

‘తాగితే కదా.. నచ్చుతుందో లేదో తెలిసేది… అంటూ మన్మథుడు (Manmadhudu) సినిమాలో మృదు మ‌ధుర స్వరం, అమాయ‌క‌త్వంతో ఆక‌ట్టుకున్న‌ అన్షు (ANSHU) ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో గ్లామర్ షోతో నెట్టింట ర‌చ్చ చేస్తోంది. రెండు ద‌శాబ్దాల క్రితం నాగార్జున మ‌న్మ‌ధుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చి చేసిన రెండు మూడు సినిమాల‌తోనే స్టార్ హీరోయిన్ స్టేట‌స్ తెచ్చుకున్న ఈ న‌టి ఆ చిత్రం త‌ర్వాత ప్ర‌భాస్‌తో రాఘ‌వేంద్ర, త‌మిళంతో ప్ర‌శాంతో ఓ సినిమా తెలుగులో గెస్ట్ పాత్ర‌ల్లో మాత్ర‌మే న‌టించిన‌ ఈ ముద్దుగుమ్మ ఆపై రీర్ ఊపందుకుంటున్న స‌మయంలోనే పెళ్లి చేసుకుని విదేశాల‌కు వెళ్లి పోయింది.

ఇటీవ‌ల సందీప్ కిష‌న్‌, రావు ర‌మేశ్ మ‌జాకాతో తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ మూవీ అంత‌గా విజ‌య‌వంతం కాక‌పోవ‌డంతో ఏవైనా ఛాన్సులు వ‌స్తే వ‌స్తా అన్న‌ట్లు విదేశాల‌కు తిరిగి వెళ్లిపోయింది. అయితే పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌లున్నా ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవ‌ర్స్‌ను సంపాదించుకుంది.

తాజాగా త‌న భ‌ర్త , పిల్ల‌ల‌తో క‌లిసి దుబాయ్ ట్రిప్‌కు వెళ్లిన ఈ భామ అక్క‌డ ఓ ఖ‌రీదైన హోట‌ల్‌లో బ‌స చేసి, స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతూ అందాలు ఆర‌బోస్తూ అభిమానుల‌కు స‌డ‌న్ షాక్ ఇచ్చింది.

ఆ ఫొటోలు చూసిన వారంతా అన్షును ఇంత హాట్‌గా ఎన్న‌డూ చూడ‌లేదంటు కామెంట్లు చేస్తున్నారు. సినిమాల్లోనూ ఎప్పుడూ అందాల ప్ర‌ద‌ర్శ‌ణ చేయ‌ని ఈ బ్యూటీ ఇప్పుడేంటీ ఇంత‌గా గ్లామ‌ర్ ట్రీట్ ఇస్తుందంటూ అనుకుంటున్నారు.

కోట శ్రీనివాసరావు జీవితంలో విశిష్ట ఘట్టం..

కోట శ్రీనివాసరావు జీవితంలో విశిష్ట ఘట్టం

కోట శ్రీనివాసరావు జీవితంలో విశిష్ట ఘట్టం..1994 అక్టోబర్ లో చోటు చేసుకుంది.

కోట శ్రీనివాసరావు జీవితంలో విశిష్ట ఘట్టం..1994 అక్టోబర్ లో చోటు చేసుకుంది. దక్షిణ భారత చలనచిత్ర సమాఖ్య, ఆంధ్ర ప్రదేశ్ చలన చిత్ర సమాఖ్య మధ్య ఏర్పడిన వివాదం చిలికి చిలికి గాలివానై యావత్ పరిశ్రమే స్తంభించిన నేపథ్యం లో ఈ రెండు వర్గాల  కార్మికుల సంక్షేమం, సమైక్యత కోసం నిరాహార దీక్ష చేపట్టారు కోట. ఇది ఆయన జీవితంలోనే కాదు సినిమా చరిత్రలోనూ విశిష్ట ఘట్టమే.

ఆంధ్రప్రదేశ్ సినిమా పరిశ్రమ బలం ఏమిటో మద్రాసులోని ఫెఫ్సీ కి తెలిపిన కీలక ఘట్టం అది.  తెలుగు చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో స్థిరపడానికి ఇకపై ఏం చేయాలో  ఇటు ప్రభుత్వం, అటు పరిశ్రమ ఆలోచింపజేసేలా చేసిన సంఘటన అది. హీరోలందరూ కోట దీక్షా శిబిరానికి వచ్చి నిమ్మరసం తాగించి దీక్ష  విరమింపజేశారు. ఆ ఏడాది నవంబర్ 30 న హైదరాబాద్ లో మొక్కుబడిగా నైనా షూటింగ్స్ ప్రారంభమయ్యాయంటే దానికి కారణం కోట చేపట్టిన దీక్ష అనే చెప్పాలి.

ఆయన లక్కీ నంబర్ 8 (Kota lucky Number)

తానే నటుడి రిఫరెన్స్ తీసుకోకుండా తానే పదిమందికి రిఫరెన్స్ లా నిలిచారు కోట శ్రీనివాసరావు. ఆయనకి సెంటిమెంట్స్ ఎక్కువ. మానవతా సంబంధమైన సెంటిమెంట్స్ నీ ఆయన ఎక్కువగా గౌరవించే వారు. 8 తన లక్కీ నంబర్ గా కోట చెప్పేవారు. తెలుగులో తన పేరు ఎనిమిది అక్షరాలు అని, ఇంగ్లీష్ లోని అక్షరాలు కూడిన ఎనిమిది వస్తుందని చెప్పేవారు. తనకు ఎంతో పేరు తెచ్చిన ప్రతిఘటన చిత్రం విడుదల తేదీ, సంవత్సరం, నెల .. అన్నీ , కూ డితే 8 వస్తుందని, తానుడే రోడ్ నంబర్ కూడా ఎనిమిదె నని ఆయన చెప్పేవారు. ఇది యాదృచ్చికంగా తనకు ఎదురవుతున్న నంబర్ అని, దాని మీద గౌరవం పెంచుకున్నానని కోట శ్రీనివాసరావు చెప్పేవారు

ట్రిప్తి డిమ్రి, సిద్ధార్థ్ చతుర్వేది జోడిగా ‘ధడక్ 2’.

ట్రిప్తి డిమ్రి, సిద్ధార్థ్ చతుర్వేది జోడిగా ‘ధడక్ 2’ ట్రైలర్ విడుదల!

సిద్దార్థ్ చ‌తుర్వేది, ట్రిప్తి డిమ్రి జంట‌గా ద‌డ్క‌న్ 2 సినిమా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు రెడీ అయింది.

బాలీవుడ్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర సినిమా రెడీ అవుతోంది. 2018లో జాన్వీ, ఇషార్ క‌ట్ట‌ర్ జంట‌గా వ‌చ్చిన‌ ద‌శాబ్దాల ద‌డ‌క్‌ (DHADAK) చిత్రానికి సీక్వెల్‌గా ఓ కొత్త క‌థ‌తో ఇప్పుడు ద‌డ‌క్‌ 2 (DHADAK 2) అనే సినిమా త‌యార‌వుతోంది. గ‌ల్లీబాయ్ చిత్రంతో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న సిద్దార్థ్ చ‌తుర్వేది (Siddhant Chaturvedi) హీరోగా న‌టించ‌గా ప్ర‌స్తుత నేష‌న్ సెన్షేష‌న్ ట్రిప్తి డిమ్రి (Triptii Dimri) క‌థానాయిక‌గా చేసింది.

ఈ చిత్రం ఈగ‌స్ట్ 1న థియేట‌ర్ల‌కు రానుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. జియో స్టూడియో (Zee Studios), క‌ర‌ణ్ జోహ‌ర్ ధ‌ర్మ ప్రోడ‌క్ష‌న్స్ (Dharma Productions) సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించ‌గా షాజియా ఇక్బాల్ (Shazia Iqbal) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

భార్యతో విడాకులు సంతోషంతో పాలతో స్నానం..

భార్యతో విడాకులు.. సంతోషంతో పాలతో స్నానం..

భార్య చేసిన పనికి అతడు తట్టుకోలేకపోయాడు. విడాకులకు అప్లై చేశాడు. తాజాగా కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. దీంతో మానిక్ సంతోషం పట్టలేకపోయాడు. పాలతో స్నానం చేశాడు. ఏకంగా 40 లీటర్ల పాలను తెచ్చుకుని మరీ స్నానం చేశాడు.

‘ఒకే ఒక్కడు’ సినిమాలో ఓ సీన్ ఉంటుంది. విలన్లు హీరో అర్జున్ మీద పెట్రోల్ పోసి నిప్పంటిస్తారు. హీరో పరుగులు తీస్తూ మురికి కాల్వలో దూకుతాడు. తర్వాత నడుచుకుంటూ ఓ షాపు దగ్గరకు వస్తాడు. అతడు ఒకరోజు సీఎం అని గుర్తించిన ప్రజలు పాలతో అతడి శరీరాన్ని కడుగుతారు. అచ్చం ఇలాంటిదే కాకపోయినా.. ఇంచుమించు ఇలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. భార్యతో విడాకులు వచ్చిన సంతోషంలో ఓ వ్యక్తి పాలతో స్నానం చేశాడు. తనకు స్వాతంత్ర్యం వచ్చిందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

ఈ సంఘటన అస్సాంలో ఆలస్యంగా వెలుగు చూసింది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నల్బరి జిల్లా, బరాలియపర్ గ్రామానికి చెందిన మానిక్ అలీ భార్య అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. రెండు సార్లు ప్రియుడితో కలిసి ఇంటినుంచి పారిపోయింది. కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చింది. కూతురి భవిష్యత్తు కోసం మానిక్ భార్యను ఏమీ అనలేదు. ఆమెతో కలిసి ఉండటానికే ప్రయత్నించాడు. అయితే, ఆమె మూడో సారి కూడా ఇంటినుంచి పారిపోయింది. ఈ సారి తన వెంట కూతుర్ని కూడా తీసుకెళ్లింది.

దీంతో అతడు తట్టుకోలేకపోయాడు. విడాకులకు అప్లై చేశాడు. తాజాగా కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. దీంతో మానిక్ సంతోషం పట్టలేకపోయాడు. పాలతో స్నానం చేశాడు. ఏకంగా 40 లీటర్ల పాలను తెచ్చుకుని మరీ స్నానం చేశాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘ఈ రోజునుంచి స్వేచ్ఛా జీవిని.. నాకు పట్టిన మురికిని కడిగేసుంటున్నాను. నాకు ఇప్పుడే పుట్టినట్లుగా ఉంది. కొత్త జీవితానికి ప్రతీకగా పాలతో స్నానం చేస్తున్నా’ అని అన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version