జహీరాబాద్ లో యువకుడి హత్య..
◆:- మొదట మిస్సింగ్.. అనంతరం హత్య.
◆:- శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణ పరిధిలోని ఫైజ్ నగర్కు చెందిన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. హ త్యకు గురైన వ్యక్తి మొహమ్మద్ తాజో ద్దీన్ (22)గా గురించారు. పట్టణ పరిధి అల్లానా రోడ్డులో గల రహమత్ నగర్ ప్రాంతంలో ఆయన మృతదేహం లభిం చింది. నిన్న నమాజ్ కోసం వెళ్తున్నట్లు
ఇంట్లో చెప్పి బయలుదేరిన యువకుడు రాత్రి వరకు రాలేదు. జామ మసీదు వద్ద ఆయన బైక్ ను రికవరీ చేశారు. ఇవాళ ఓ పాడు బావిలో మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అక్కడకు చేరుకొని పరిశీలించగా మృత దేహం మీద గాయాలున్నందున కసితీరా పొడిచి హత్య చేసి అక్కడి నుంచి పరారై నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా హత్య ఎవరు, ఎందుకు చేశారనేది తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.