ట్రంప్‌పై నిరసన..నాగ్‌పూర్‌లో భారీ దిష్టిబొమ్మ ప్రదర్శన…

ట్రంప్‌పై నిరసన..నాగ్‌పూర్‌లో భారీ దిష్టిబొమ్మ ప్రదర్శన

 

 

నాగ్‌పూర్‌లో జరుగుతున్న మార్బత్ పండగ.. ట్రంప్ సుంకాలపై నిరసనలకు వేదికైంది. స్థానికులు ట్రంప్ దిష్టిబొమ్మను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో మార్బత్ పండగ సందర్భంగా ట్రంప్‌పై నిరసనలు వెల్లువెత్తాయి. అనేక మంది ట్రంప్ దిష్టిబొమ్మను ఊరేగిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. భారత వస్తువులపై ట్రంప్ 50 శాతం సుంకం విధించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపేందుకు స్థానికులు ఈ పండగను వేదికగా ఎంచుకున్నారు.

మట్టి, గడ్డితో ఈ దిష్టిబొమ్మను చేసి ఎర్ర కోటును తొడిగారు. రకరకాల పూల దండలను కూడా దిష్టిబొమ్మకు వేసి డప్పుల చప్పుళ్ల మధ్య ఊరేగించారు. స్థానికులు వినూత్న శైలిలో తమ నిరసనలు తెలియజేశారు. ‘టారిఫ్‌లతో మమ్మల్ని బెదిరిస్తే.. భారత్ దెబ్బకు మీకు కన్నీళ్లు తప్పవు’ అని ఓ స్థానికుడు ప్లకార్డు ప్రదర్శించాడు. మా పై సుంకాలు మీకే చేటు అని రాసున్న ప్లకార్డును మరో వ్యక్తి ప్రదర్శించాడు. మరికొందరు అమెరికా ద్వంద్వ వైఖరినీ ఎండగట్టారు. రష్యా వస్తువులు కొంటున్న అమెరికాకు భారత్‌పై అక్కసు ఎందుకని ప్రశ్నించారు.

ఏటా జరుపుకునే ఈ పండగకు పెద్ద చరిత్రే ఉందని స్థానికులు చెబుతున్నారు. 1800 దశాబ్దం చివర్లో ఈ సంప్రదాయం ప్రారంభమైంది. అప్పట్లో స్థానికులు దుష్టశక్తులను పారద్రోలేందుకు దిషి బొమ్మలను ఊరేగించారు. కాలక్రమంలో ఈ పండుగ కొత్త సోబగులు సొంతం చేసుకుంది. సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై అభిప్రాయాలను వ్యక్తం చేసే వేదికగా మారింది. హాస్య చతురతను, సెటైర్‌ను జోడించి జనాలను ఆకట్టుకునేలా ప్లకార్డులు, దిష్టి బొమ్మలను ప్రదర్శించడం ప్రారంభించారు. వినూత్న శైలిలో నిరసనలకు కూడా ఇది వేదికగా మారింది.

వాణిజ్య లోటు పూడ్చుకోవడంలో భాగంగా ట్రంప్ తొలుత భారత వస్తువులపై 25 శాతం సుంకం విధించిన విషయం తెలిసిందే. అమెరికా అభ్యంతరాలను కాదని రష్యా చమురు కొనుగోలును కొనసాగిస్తున్నందుకు శిక్షగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్టు ఆ తరువాత ప్రకటించారు. దీంతో, భారత్‌పై మొత్తం సుంకం 50 శాతానికి చేరింది. ఆగస్టు 27 నుంచి ఈ సుంకాలు పూర్తిస్థాయిలో అమలు కానున్నాయి.

ట్రంప్-పుటిన్ అలాస్కా సమ్మిట్: భారత్ టారిఫ్ సమాచారం…

ఈ వారంలో అతి పెద్ద అలాస్కా సమ్మిట్‌లో US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ సమావేశమయ్యారు. సమ్మిట్ తర్వాత, ట్రంప్ రష్యన్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసే భారత్ వంటి దేశాలపై అదనపు టారిఫ్‌లను విధించకోవచ్చని సంకేతం ఇచ్చారు. ఈ సమావేశం రష్యా-యుక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ పరిణామాల కారణంగా విశేషంగా గమనించబడింది.
పైగా, ఇండస్ వాటర్స్ ట్రిటీ విషయంలో పాకిస్తాన్ న్యూక్లియర్ హెచ్చరికలు ఇచ్చింది. ఆర్మీ చీఫ్ అసీం మునీర్, ప్రధాని షరీఫ్, బిలావాల్ భుట్టో భారత్‌ను హెచ్చరించారు. ట్రంప్ భారత్, చైనా పట్ల రష్యన్ ఆయిల్ టారిఫ్‌లలో భిన్నమైన విధానాన్ని చూపడం గమనార్హం.
ఇతర ఘటనల్లో, గాజాలో ఇజ్రాయిల్ ఎయిర్‌స్ట్రైక్స్‌లో అల్-జజీరా జర్నలిస్ట్ అనాస్ అల్-షరీఫ్ మరణించారు. చైనాలో యువకులు ఉద్యోగం కనిపించేలా కనిపించడానికి చెల్లిస్తున్నారు. అలాగే, ఒక వైరల్ వీడియోలో కిల్లర్ వేల్ లైవ్ షోలో ట్రైనర్‌ను అటాక్ చేసింది. 

భారత్‌పై సుంకాలు..20% లోపే..

భారత్‌పై సుంకాలు..20% లోపే

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికయ్యాక ట్రంప్‌ సుంకాల బాదుడుకు పలు దేశాలు విలవిల్లాడుతున్నాయి…

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయం తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి సన్నాహాలు

బ్రిటన్‌ తర్వాత మనతోనే ఈ తరహా అవగాహన

ట్రంప్‌ సర్కారు నిర్ణయం

వాషింగ్టన్‌, జూలై 12: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికయ్యాక ట్రంప్‌ సుంకాల బాదుడుకు పలు దేశాలు విలవిల్లాడుతున్నాయి. ప్రపంచ షేర్‌ మార్కెట్లు ‘బేర్‌’మంటున్నాయి. చైనా లాంటి దేశాలపై పదుల్లో కాకుండా.. వందల శాతాల మేర సుంకాల బాదుడుతో ట్రంప్‌ దూసుకుపోతున్నారు. ఇటీవల బ్రిక్స్‌ దేశాలకు 50శాతానికి పైగా సుంకాలు తప్పవని, భారత్‌ కూడా మినహాయింపు కాదని హెచ్చరించిన సంగతి తెలిసిందే..! అయితే.. త్వరలో భారత్‌తో కుదరనున్న తాత్కాలిక వాణిజ్య ఒప్పందం ప్రకారం అమెరికా దిగుమతి చేసుకునే భారతీయ ఉత్పత్తులపై సుంకాలను 26%(ముందుగా ప్రకటించినది) కాకుండా.. 20% కంటే తక్కువగా ప్రకటించే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు పలు వార్తాసంస్థలు కథనాలను ప్రచురించాయి. ఈ ఒప్పందంతో ట్రంప్‌ పాలనలో వాణిజ్య ఒప్పందం చేసుకున్న అరుదైన దేశాల జాబితాలో భారత్‌ చేరనుంది. ఇప్పటికే బ్రిటన్‌ ఈ జాబితాలో ఉంది.

ఇక ఆసియా దేశాలైన మయన్మార్‌పై 40%, వియత్నాం, ఫిలిప్పీన్స్‌లపై 20% మేర అమెరికా సుంకాలు కొనసాగుతున్నాయి. భారత్‌ మాత్రం అధిక సుంకాల జాబితాలో చేరకపోవచ్చని బ్లూమ్‌బెర్గ్‌ కూడా ఓ నివేదికలో పేర్కొంది. మరోవైపు అమెరికాతో వాణిజ్య చర్చలకు భారత్‌ వడివడిగా అడుగులు వేస్తోంది. ఓ ప్రతినిధి బృందం అమెరికాకు చేరుకుని, అక్కడి అధికారులతో చర్చలు జరపనుంది. ఇప్పటికే భారత్‌ తన తుది ప్రతిపాదనను అమెరికాకు అందజేసింది. జన్యు మార్పిడి(జీఐ) పంటలకు భారత్‌ వ్యతిరేకంగా ఉన్న విషయం తెలిసిందే..! అయితే.. అమెరికా తన తాత్కాలిక వాణిజ్య ఒప్పందంలో భాగంగా భారత్‌పై జీఐ పంటల విషయంలో ఒత్తిడి చేసే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి భారత్‌ అంగీకరించకపోవచ్చని తెలుస్తోంది. ఇటు ఔషధ రంగ నియంత్రణ సమస్యలు కూడా ఇంకా పరిష్కారం కావాల్సి ఉంది. ప్రస్తుత చర్చల తర్వాత తాత్కాలిక ఒప్పందం కుదురుతుందని, ఈ ఏడాది చివరికి తుది ఒప్పందంపై ప్రకటన ఉంటుందని సమాచారం.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version