హైడ్రెంట్స్,స్పింక్లర్లను ఏర్పాటు చేసుకోవాలి.!

ధియేటర్ లలో హైడ్రెంట్స్,స్పింక్లర్లను ఏర్పాటు చేసుకోవాలి

 

పరకాల నేటిధాత్రి

 

ఫైర్ అధికారి వక్కల భద్రయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని జయడీలక్స్ మరియు కాకతీయ థియేటర్లలో అరవ రోజు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు.మేనేజర్, సిబ్బందికి అగ్ని ప్రమాదాల నివారణ చర్యల గూర్చి అవగాహన కలిపించారు.అందులో భాగంగా ఫైర్ ఎక్సటింగుషేర్ ఏర్పాటు చేసుకోవాలనీ,నిర్ధేశించిన సమయంలో వాటిని రీఫిల్ చేసుకోవాలని తెలిపారు.హైడ్రెంట్స్,స్పింక్లర్లను ఏర్పాటు చేసుకోవాలని, రెడియం ఎగ్జిట్ సూచికలు అత్యవసర సమయంలో అందరికి కనిపించే విధంగా ఉండాలని సూచించారు.హలొజెన్ దీపాలను వాడలని అత్యవసర సమయలో సిబ్బందికి,సెక్యూరీటీ సిబ్బందికి ఫైర్ స్టేషన్ నెంబర్ అందుబాటులో ఉంచి సమాచారం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమం లో పరకాల అగ్ని మాపక సిబ్బంది ఎల్ఎఫ్ కృషుమార్,డ్రైవర్ సత్తయ్య ఫైర్మన్ సత్యం,దిలీప్ కుమార్ లు పాల్గొన్నారు.

శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న.

శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న జిల్లా ఎస్పీ దంపతులు

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి)

 

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా సిరిసిల్ల జిల్లా ఎస్పీ. మహేష్ బి.గీతే దంపతులు శనివారం దర్శించుకోవడం జరిగినది. అనంతరం ఆలయ అర్చకులు జిల్లా ఎస్పీకి స్వాగతం పలుకుతూ, స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు.వేద పండితులు అద్దాల మండపంలో ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం ఆలయ ఈవో కె.వినోద్ శేష వస్త్రం కప్పి స్వామివారి తీర్థ ప్రసాదాలు సిరిసిల్ల జిల్లా ఎస్పీకి అందజేశారు.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని సభలో చాటాలి.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని సభలో చాటాలి

-స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ దే ఘన విజయం

-కార్యకర్తలు పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలి

-మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి
నేటి ధాత్రి మొగుళ్ళపల్లి

 

ఓరుగల్లు గడ్డమీద జరగనున్న 27వ రజతోత్సవ సభలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటాలని సర్పంచ్ ల ఫోరం మొగుళ్లపల్లి మండల మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి
బీఆర్ఎస్ నాయకత్వానికి పిలుపునిచ్చారు. శనివారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 25 ఏళ్ల గులాబీ పండుగను విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో గత 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. సబ్బండ వర్గాలకు న్యాయం చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ఒక్కటేనన్నారు. నాడు అందుతున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉండేవారని, నేడు రైతన్నలు మొదలు ప్రతి ఒక్క రంగానికి చెందిన వారు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే హావా కొనసాగుతుందన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటేనే బాగుండేదని ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. రానున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి రజతోత్సవ సభ నాందిగా నిలవాలని వ్యాఖ్యానించారు. మొగుళ్లపల్లి మండలంలోని ప్రతి గ్రామం నుండి సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.

రజతోత్సవ సభను విజయవంతం చేయాలి.

బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి.
మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తక్కలపెల్లి చందర్ రావు

నేటిధాత్రి అయినవోలు :-

 

 

 

 

వర్ధన్నపేట నియోజకవర్గం అయినవోలు మండలం ఉడుతగూడెం గ్రామంలో శనివారం టిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు తోట రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన టిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నందనం సొసైటీ వైస్ చైర్మన్ తక్కలపల్లి చందర్ రావు మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన ఎలుకతుర్తి ఎక్స్ రోడ్డులో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రచతోత్సవ సభకు గ్రామంలో అధిక సంఖ్యలో హాజరై సభ విజయవంతం అయ్యేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని రానున్న రోజుల్లో బి. ఆర్. ఎస్. అధినేత కేసీఆర్ తప్పకుండా ముఖ్యమంత్రి అవుతున్నారని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ టిఆర్ఎస్ ఇన్చార్జి కట్కూరి రాజు మండల నాయకుడు కొమురయ్య, దేవదాసు ఆకారపు యాదవ రెడ్డి ప్రతాపరెడ్డి చంద్రారెడ్డి సుదర్శన్ రెడ్డి రమేష్ నరేష్ రవి వీరస్వామి రవి యాదగిరి శీను అనిల్ మల్లయ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలి.

పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలి.. వి హెచ్ పి డిమాండ్

మల్కాజ్ గిరి నేటిధాత్రి

 

 

పశ్చిమ బెంగాల్ లో గత వారం రోజులుగా హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ శనివారం నాడు దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టి అన్ని జిల్లా కలెక్టర్లలో రాష్ట్రపతికి మెమొరాండం సమర్పించారు. ముర్షిదాబాద్ పరిసర ప్రాంతాలలో హిందువులను లక్ష్యంగా చేసుకుని మతం పేరుతో ఉగ్రవాద సానుభూతిపరులు మారణఖండ చేస్తుంటే అక్కడి మమత బెనర్జీ ప్రభుత్వం చూస్తూ మౌనం వహించడం గమనిస్తే మైనారిటీ బుజ్జగింపు రాజకీయాల కోసం హిందువులను బలి చేస్తున్నారని వి హెచ్ పి తెలంగాణ ప్రాంత ఉపాధ్యక్షురాలు భేరి సునీతా రామ్ మోహన్ రెడ్డి అన్నారు. వెంటనే అక్కడ శాంతి భద్రతలను కాపాడాలంటే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మల్కాజ్ గిరి కార్పొరేటర్లు శ్రావణ్, మౌలాలి కార్పొరేటర్ సునీత యాదవ్ ,తెలంగాణ ప్రాంత గోరక్ష సభ్యులు శివానంద్ ,జిల్లా కార్యదర్శి రజినీకాంత్,సహ కార్యదర్శులు రాజి రెడ్డి,గోపాల్ చారి, గోరక్షా ప్రముఖ్ బాలాజీ, మణిమాల, మాతృశక్తి సంయోజిక పశ్యంతి,స్థానిక బీజేపీ నాయకులు వీకే మహేష్ , సోమ శ్రీనివాస్,బక్క నాగరాజు,కిరణ్ , భజరంగ్ దళ్ అఖిల్ , హిందూ సంఘాల నేతలు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం.

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లో విఫలం

బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

 

 

శాసన సబ ఎన్నికల ముందు కాంగ్రేస్ పార్టీ ప్రజలకు ఇచ్చినా హమీలు అమలు చేయడంలో మిత్రపక్షమైనా సిపిఐ ఎమ్మెల్యే తో ప్రబుత్వం పూటకో ప్రకటన చేస్తుందని ముత్తారం బి అర్ ఎస్ మండల శాఖ అద్యక్షుడు మాజీ ఎంపీటీసీ పోతుపేద్ది కిషన్ రేడ్డి శనివారం ఒక ప్రకటనలో అరోపించారు పేదింటి యువతుల వివాహనికి కళ్యాణ లక్ష్మి పథకం లో భాగంగా లక్ష 116 రూపాయలతో పాటు అదనంగా తులం బంగారం ఇస్తామని మహిళలకు నెలకు 2500 వారి ఖాతలలో జమ చేస్తామని ఎన్నికల ముందు హమి ఇచ్చారని ప్రస్తుతం కాంగ్రేస్ మిత్రపక్షమైనా సిపిఐ ఎమ్మేల్యే కూనంనేని సాంబశివ రావు కోత్తగూడేం లో కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణి చేసి తులం బంగారం ప్రబుత్వం ఇప్పట్లో ఇచ్చే అలోచన లేదని ప్రకటించడం హస్య స్పందంగా ఉందని అన్నారు మహిళలకు 25 వందల ఊసే లేదన్నారు సిపిఐ పార్టీకి బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడినా చరిత్ర కల్గినా పార్టీ ని నేడు ప్రజలలో చీప్ గా తయారు చేసారని కిషన్ రేడ్డి ఒక ప్రకటనలో విమర్సించారు

ఈవేస్ట్ తో పర్యావరణానికి ముప్పు.

*ఈవేస్ట్ తో పర్యావరణానికి ముప్పు..

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేద్దాం..

స్వర్ణాంధ్ర…స్వచ్ఛ ఆంధ్ర మనందరి బాధ్యత..

స్వచ్ఛ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్..

పలమనేరు(నేటి ధాత్రి) ఏప్రిల్ 19:

 

 

ఎలక్ట్రానిక్ పరికరాల వేస్ట్ తో పర్యావరణానికి పెను ముప్పని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పురపాలక సంఘ కార్యాలయంలో శనివారం స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం పై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్ధాలతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాల వ్యర్ధాలతో పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుతుందని మానవాళి మనుగడకే ప్రశ్నర్థకంగా మారుతుందన్నారు.ఈ వేస్ట్ వ్యర్థలతో పర్యావరణ సమతుల్యత పూర్తిగా దెబ్బతినే ఆస్కారముందన్నారు.

 

MLA

కాబట్టి ఈ వేస్ట్ వ్యర్థాలపై ప్రజల అవగాహన పెంచుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణాంధ్ర స్వచంద్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యలు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి గంగమ్మ గుడి వీధి మీదుగా అవగాహన ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్వీ.రమణారెడ్డి,మెప్మా సిటీ మిషన్ మేనేజర్ బాబా,మున్సిపల్ సిబ్బంది తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్బీసీ కుట్టి, గిరిబాబు,సుబ్రహ్మణ్యం గౌడ్, నాగరాజు,ఖాజా పీర్, చాంద్ భాషా, బీ.ఆర్.సి కుమార్,లోకేష్ ఆచారి,
సురేష్,మురళీ, చందు తదితరులు ఉన్నారు.

గొప్ప పరిపాలనాదక్షుడు చంద్రబాబు నాయుడు.

గొప్ప పరిపాలనాదక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..

తెలుగు ఉమ్మడి రాష్ట్రాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ఎనలేనిది…

సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన అరుదైన గౌరవం బాబు సొంతం…

దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన మేటి రాజకీయ వేత్త చంద్రన్న…

తెలుగు రాష్ట్రాల ప్రగతిని ప్రపంచానికి పరిచయం చేసిన తెలుగు జాతి ముద్దు బిడ్డ…

ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..

చిత్తూరు(నేటి ధాత్రి) ఏప్రిల్ 19:

 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొప్ప పరిపాలనాదక్షుడు అని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు ఓ ప్రకటనలో కొనియాడారు.
తెలుగు ఉమ్మడి రాష్ట్రాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ఎనలేనిది అన్నారు. దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన మేటి రాజకీయ వేత్త చంద్రబాబు నాయుడు అని ప్రశంసించారు.., సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన అరుదైన గౌరవం బాబు సొంతమన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 75 వ పుట్టిన రోజు నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రగతిని ప్రపంచానికి పరిచయం చేసిన తెలుగు జాతి ముద్దు బిడ్డ.., రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి శనివారం ముందస్తుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.
సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచలంచెలుగా ఎదుగుతూ.. విలువలు కలిగిన రాజకీయ వేత్తగా. తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసి.., తెలుగు ప్రజల అభ్యున్నత కోసం పరితపించిన ప్రజా ప్రతినిధి,పాలనాదక్షుడు
నారా చంద్రబాబు నాయుడు అని, ఆయన స్పూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారాయన.
అభివృద్ధికి మారు పేరు చంద్రబాబు నాయుడు అని. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సర్వతో ముఖాభివృద్ధికి బాటలు వేసాయన్నారు. ప్రస్తుతం స్వర్ణాంధ్ర అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నిత్య కృషీవలుడన్నారు, ముఖ్యమంత్రిగా..తెలుగు దేశం పార్టీ అధినేతగా.., ప్రజాసేవకుడిగా… ఆయన అందిస్తున్న సేవలు నిరుపమానమన్నారు.
ఆధునిక యుగానికి చంద్రన్నను
రోల్ మోడల్ గా నిలిపాయని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు అభినందించారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా మరోసారి ఏపీ సీఎం చంద్రబాబుకు చిత్తూరు ఎంపి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని, ఆంధ్రప్రదేశ్ను సర్వతో ముఖాభివృద్ది వైపు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

ఈ వేస్ట్ ను ఇవ్వండి నగర అభివృద్ధికి సహకరించండి.

*ఈ- వేస్ట్ ను ఇవ్వండి – నగర అభివృద్ధికి సహకరించండి…

కమిషనర్ ఎన్.మౌర్య..

తిరుపతి(నేటి ధాత్రి) ఏప్రిల్ 19:

 

 

ప్రమాదకరమైన ఎలక్ట్రానిక్ వేస్ట్ తమకు అందజేసి నగర శుభ్రతకు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర లో భాగంగా శనివారం ఈ-వేస్ట్ సేకరణ, నిర్వహణపై నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మునిసిపల్ కార్యాలయం నుండి శ్రీదేవి కాంప్లెక్స్ వరకు సాగిన ఈ ర్యాలీ ని కమిషనర్ ఎన్.మౌర్య, శాప్ చైర్మన్ రవి నాయుడు, యాదవ కార్పొరేషన్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, ఏపీఎంఐడిసి డైరెక్టర్ విజయకుమార్, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్.సి.మునికృష్ణకార్పొరేటర్ నారాయణ, అధికారులు పాల్గొని ర్యాలీని ప్రారంభించి పాల్గొన్నారు. An e-waste collection program was organized at Sridevi Complex. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్. మౌర్య మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జనవరి నెలలో పరిశుభ్రత పచ్చదనం, ఫిబ్రవరి నెలలో వేర్వేరుగా చెత్త సేకరణ,మార్చిలో ప్లాస్టిక్ నియంత్రణ థీమ్ తో ప్రజల్లో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు.ఏప్రిల్ నెలలో ఈ-వేస్ట్ నియంత్రణ థీమ్ తో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించామని అన్నారు.

 

Development

ఎలక్ట్రిక్ దుకాణాల వద్ద వేస్ట్ సేకరించామని అన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆర్ఆర్ఆర్ సెంటర్ ను న్యూ బాలాజి కాలనీలోని అన్నా క్యాంటీన్ సమీపంలో ఏర్పాటు చేశామని ఈ-వేస్ట్ ను అక్కడ ఇవ్వ వచ్చునని అన్నారు. అలాగే అన్ని సచివాలయాల వద్ద కూడా ఇవ్వవచ్చునని తెలిపారు. ఇలా సేకరించిన వేస్ట్ ను సురక్షితంగా రీ సైకిల్ చేస్తామని అన్నారు. ప్రజలు ఈ-వేస్ట్ ను మీ ఇంటి వద్దకు వచ్చే మా సిబ్బందికి కూడా అందించవచ్చునని తెలిపారు. శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. జన్మభూమి, పరిసరాల పరిశుభ్రత వంటి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు.ఈ వేస్ట్ వలన కాలుష్యం పెరుగుతోందని దీన్ని నియంత్రించేందుకు ప్రత్యేక కార్యక్రమం రూపొంచించారని అన్నారు. ఇందులో అందరూ భాగస్వాములై ఎలక్ట్రానిక్ వ్యర్థాల నియంత్రణకు సహకరించాలని అన్నారు. స్వచ్ఛ తిరుపతి సాధనకు అందరూ సహకరించాలని అన్నారు. యాదవ కార్పొరేషన్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, ఏపీఎంఐడిసి డైరెక్టర్ విజయకుమార్, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్.సి.మునికృష్ణ మాట్లాడుతూ నగరం సుందరంగా, పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి బాధ్యత అన్నారు. చెత్తను రోడ్లపై వేయకుండా, తడి, పొడి చెత్త గా వేరు చేసి నగరపాలక సంస్థ సిబ్బందికి అందించి నగర శుభ్రత కు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈ-వేస్ట్ అందించిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, మేనేజర్ హాసీమ్, సర్వేయర్ కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు…

సమీప పాఠశాలలతోనే స్కూల్ కాంప్లెక్స్ లను.

సమీప పాఠశాలలతోనే స్కూల్ కాంప్లెక్స్ లను శాస్త్రీయంగా పునర్విభజించాలి.

పెనుగొండ హై స్కూల్ ను నూతన కాంప్లెక్స్ గా ఏర్పాటు చేయాలి

గతంలో ఇష్టారాజ్యంగా, అస్తవ్యస్తంగా పాఠశాలల కూర్పు

దూరాభారంతో సవ్యంగా పర్యవేక్షణ చేయని స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు

చదువులో తగ్గిన గుణాత్మకత – నష్టపోయిన విద్యార్థులు

నూతన ఇనుగుర్తి మండలంలోకి భౌగోళికంగా 15 పాఠశాలల చేర్పు

అయినా ఇంకా కేసముద్రం మండల స్కూల్ కాంప్లెక్స్ లోనే కొనసాగింపు

వచ్చే నూతన విద్యా సంవత్సరానికి ముందే స్కూల్ కాంప్లెక్స్ ల పునర్విభజన పూర్తి చేయాలి

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ డిమాండ్

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

 

 

స్కూల్ కాంప్లెక్స్ లోకి సమీప పాఠశాలలను చేర్చి శాస్త్రీయంగా పునర్విభజించాలని కోరుతూ శనివారం తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షులు గుండు సురేందర్ నేతృత్వంలో మండల విద్యాధికారి కాలేరు యాదగిరికి ప్రాతినిధ్యం చేశారు. ఈ సందర్భంగా టిపిటిఎఫ్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ మాట్లాడుతూ గతంలో స్కూల్ కాంప్లెక్స్ ల ఏర్పాటు దగ్గర ,దూరంతో సంబంధం లేకుండా అస్తవ్యస్తంగా జరిగిందని , ఏ ప్రామాణికత లేకుండా చేయడం వల్ల ఎన్నో ఇబ్బందులు తలెత్తాయని అన్నారు. స్టేషన్ కాంప్లెక్స్ లో ఉన్న యుపిఎస్ మహమూద్ పట్నం పాఠశాల నిజానికి కేసముద్రం విలేజ్ కాంప్లెక్స్ దగ్గర్లో ఉంటుందని, అమీనాపురం సమీపంలో ఉండే మాన్సింగ్ తండా పాఠశాల స్టేషన్ , కల్వల కాంప్లెక్స్ లకు సమీపంలో ఉంటుందనీ , కానీ ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే తాళ్లపూసపళ్లి కాంప్లెక్స్ లో చేర్చారని , సర్వాపురం స్టేషన్ కి దగ్గరగా ఉన్నప్పటికీ తాళ్లపూసపల్లి కాంప్లెక్స్ లో చేర్చడం, అలాగే పెనుగొండ, దాని ఆవాస పాఠశాలలన్నీ స్టేషన్ కాంప్లెక్స్ కు చాలా దూరంగా ఉన్నప్పటికీ విధి లేక దానిని స్టేషన్ కాంప్లెక్స్ లో చేర్చడం వల్ల ఆయా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు
దూరాభారంతో పాఠశాలల పర్యవేక్షణ చేయలేకపోయారని , తద్వారా పర్యవేక్షణలోపించి విద్యార్థులకు గుణాత్మక విద్య సరిగా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు

పెనుగొండ ఉన్నత పాఠశాల ఆవాసంలో ఉండే 15 పాఠశాలలన్నింటితో పెనుగొండ నూతన కాంప్లెక్స్ ను ఏర్పాటు చేస్తే ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణకు సులభంగా ఉంటుందని సూచించారు.

ఇదిలా ఉంటే నూతనంగా ఏర్పాటైన ఇనుగుర్తి మండలానికి భౌగోళికంగా 15 పాఠశాలలు చేర్చినప్పటికీ ఇనుగుర్తి మండలంలో నూతన స్కూల్ కాంప్లెక్స్లను ఏర్పాటు చేయకపోవడం వలన అవి ఇంకా కేసముద్రం మండల కాంప్లెక్స్ లోనే
కొనసాగుతున్నాయని, ఆయా పాఠశాలల పర్యవేక్షణ ఇనుగుర్తి మండల ఎంఈఓ మరియు కేసముద్రం మండల విలేజ్ మరియు కల్వల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చేయాల్సి ఉండగా వారి మధ్య సమన్వయం కొరవడి పర్యవేక్షణ సవ్యంగా సాగలేదని ముఖ్యంగా కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు నిర్లక్ష్యం చేశారని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలే ఉంటారని, వారి సర్వతోముఖాభివృద్దికి , వారిలో విద్యా ప్రమాణాలు పెంపొందించడానికి ఉపాధ్యాయులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు .కొంతమంది ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పని చేస్తే , మరికొంతమంది పర్యవేక్షణ అనే భయంతో పని చేస్తారన్నారు.
విద్యా ప్రమాణాలతో ముడిపడి ఉన్న ఈ పర్యవేక్షణ సవ్యంగా సాగాలంటే, ఆ కాంప్లెక్స్ లో ఉండే పాఠశాలలు ఆ కాంప్లెక్స్ కు అతి సమీపంలో ఉండేలా శాస్త్రీయంగా స్కూల్ కాంప్లెక్స్లను పునర్విభజన చేయాలని ,అలాగే పెనుగొండ ఉన్నత పాఠశాలను స్కూల్ కాంప్లెక్స్ గా మార్చాలని అధికారులను ఈ సందర్భంగా సురేందర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెలమాల భాస్కర్ ,అప్పాల నాగరాజు పాల్గొన్నారు.

సెల్యూట్ టూ ట్రాఫిక్ పోలీస్.

సెల్యూట్ టూ ట్రాఫిక్ పోలీస్

వరంగల్ ట్రాఫిక్ సీఐ రామకృష్ణ ఔదార్యం

 

వరంగల్ తూర్పు, నేటిధాత్రి.

 

 

 

 

వరంగల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నగర ప్రజలకు, ప్రయాణికులకు ఎండ వేడిమి నుండి ఉపశమనం కలిగించే గ్రీన్ మ్యాట్ షెల్టర్ లు ఏర్పాటు చేశారు. పోచంమైదాన్ బస్ షెల్టర్ కు తాత్కాలిక ఉపశమనం కల్పించిన ట్రాఫిక్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు ప్రయాణికులు. పోచంమైదాన్ లో బస్ షెల్టర్ పై కప్పు లేక గత రెండు సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఇదే విషయంలో ఎన్ని సార్లు వార్తలు రాసిన పట్టించుకొని రాజకీయ నాయకులు. మహిళా ప్రయాణికులు పోచంమైదాన్ బస్ సెంటర్లో నిలబడే అవకాశం కల్పించిన వరంగల్ ట్రాఫిక్ సీఐ రామకృష్ణ కు సెల్యూట్ అంటున్న నగర ప్రజలు.

CI Ramakrishna Audaryam

 

 

ఎండ తీవ్రతకు వాహనదారులు, ప్రయాణికులకు, పాదచారులకు ఇబ్బందులు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్టు వరంగల్ ట్రాఫిక్ సిఐ రామకృష్ణ తెలిపారు. వరంగల్ నగరంలో పలుచోట్ల ప్రయాణించే వాహనదారులు సిగ్నల్స్ వద్ద ఆగినప్పుడు, బస్టాండ్ల వద్ద నిలబడి ఉన్నప్పుడు ఎండ తీవ్రతకు ఇబ్బంది పడకుండా గ్రీన్ మ్యాట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

గ్రామాల వారీగా కులగణన లెక్కలు ప్రకటించాలి.

గ్రామాల వారీగా కులగణన లెక్కలు ప్రకటించాలి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలి.

అచ్చునూరి కిషన్ ముదిరాజ్
మెపా ములుగు జిల్లా అధ్యక్షుడు.

 

హన్మకొండ:నేటిధాత్రి

 

 

ములుగు జిల్లా కేంద్రంలో మెపా జిల్లా కార్యాలయంలో అచ్చునూరి కిషన్ ముదిరాజ్ అధ్వర్యంలో ముఖ్య నాయకుల అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మెపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ విచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టో లో ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలిని, మేమెంతో మాకు అంతా వాటా అన్ని రంగాల్లో కల్పించాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

మెపా ములుగు జిల్లా అధ్యక్షుడు, గౌరవ అధ్యక్షుడు అచ్చునూరి కిషన్ ముదిరాజ్, బండి రాజు ముదిరాజ్ సంయుక్తంగా మాట్లాడుతూ స్వాతంత్ర్య వచ్చినప్పటి నుంచి అగ్ర వర్ణాల చేతి’లో, వారి మోసపూరిత మాటలకు బీసీ’లు అన్ని రంగాల్లో అణిచివేతకు, అవమానాలకు, అభివృద్ధి’కి, వెనుకబాటు గురి అవుతునే ఉన్నారు. కానీ వారి బతుకుల్లో ఎక్కడ మార్పు కనబడడం లేదు.

కావున ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన లెక్కలను గ్రామాల వారీగా ప్రకటించి, కులగణన ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్స్ ఇవ్వాలని, లేనియెడల ప్రతి జనరల్ స్థానాల్లో బీసీలు అత్యధిక స్థానాల్లో పోటో చేసి బీసీల సత్తా ఏంటో నిరూపిస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మెపా ములుగు జిల్లా గౌరవ అధ్యక్షుడు బండి రాజు ముదిరాజ్, మెపా ములుగు జిల్లా అధ్యక్షుడు అచ్చునూరి కిషన్ ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కల నాగరాజు ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు భూమ నరేష్ ముదిరాజ్, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల కృష్ణ ముదిరాజ్, మహబూబాబాబ్ జిల్లా అధ్యక్షుడు దుండి అశోక్ ముదిరాజ్, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు పోలుదాసరి రాము ముదిరాజ్, వెంకటాపూర్ మండల అధ్యక్షుడు మేకల రమేష్ ముదిరాజ్, చోప్పరి రాజేందర్ ముదిరాజ్, మల్లేబోయిన వెంకటేష్ ముదిరాజ్, మల్లికార్జున్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్ లో రన్ ఫర్ జీసస్.

జహీరాబాద్ లో రన్ ఫర్ జీసస్.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

 

 

జహీరాబాద్ పట్టణంలో శనివారం మెథడిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా చర్చి వద్ద ప్రత్యేక ప్రార్ధన నిర్వహించి, ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఈ ర్యాలీ రైల్వే గేట్ వరకు, అక్కడి నుండి పస్తపూర్ కూడలి వరకు, తిరిగి మెథడిస్ట్ చర్చ్ గార్డెన్ నగర్ వరకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో క్రైస్తవ మతపెద్దలు, భక్తులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

– రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి.. ఎమ్మెల్యే…

కొల్చారం, (మెదక్ )నేటిధాత్రి :-

 

మండలపరిధిలోనిచిన్నఘణపూర్
గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి పిఎసిఎస్ చైర్మన్ నాగయ్యతో కలిసి ప్రారంభించారు. ముందుగా తూకానికి కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి, ధాన్యాన్ని తూకం వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునిత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి, దళారుల చేతిలో రైతులు మోసపోవద్దని అన్నారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు పడకుండా ఏర్పాటు చేయాలని పిఎసిసిఎస్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సూరెగారి నరేందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి పాశం శ్రీనివాస్ రెడ్డి, బాగారెడ్డి, రాజా గౌడ్, రవితేజ రెడ్డి, ముత్యంగారి సంతోష్ కుమార్, సందీప్, లక్ష్మీనారాయణ గౌడ్, మురళి గౌడ్, మంగలి శంకర్, సీఈఓ కృష్ణ, రైతులు, పిఎసిఎస్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.

కేసీఆర్‌ అనే మూడక్షరాలు…తెలంగాణ బీజాక్షరాలు!

`తెలంగాణలో కేసిఆర్‌ అనే పదమే వేదమయ్యింది.

`ప్రజల నాలుకల మీద కేసీఆర్‌ అనే పదమే జపమైంది.

తెలంగాణ ఉద్యమ ఊపిరి…పోరు కడలి కేసిఆర్‌ అంటున్న తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో కేసిఆర్‌ పట్టుదల, త్యాగాల గురించి చెప్పిన వివరాలు.. ఆయన మాటల్లోనే..

`కలల తెలంగాణను నిజం చేసిన ఉద్యమ వీరుడు కేసీఆర్‌

`ఒక్కడుగా మొదలై లక్షలాది మంది కేసీఆర్‌ లను తయారు చేశాడు

`నలుదిక్కులు జై తెలంగాణ అని చాటేలా ఉద్యమ రచన చేశారు

`సమైక్యవాదులకు కూడా తెలంగాణ గోస అర్థమయ్యేలా చెప్పాడు

`తెలంగాణ అస్తిత్వం ఎంత గొప్పదో ప్రపంచం ముందుంచారు

`తెలంగాణ ఆత్మ గౌరవ నినాదం ఎలుగెత్తి చాటారు

`పల్లేరు మొలిచిన తెలంగాణను చూసి కన్నీరు కార్చాడు

`తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద కన్నెర్ర జేశాడు

`ఉద్యమ దారిలో రాజకీయ నడకలు తెలంగాణకు నేర్పాడు

`ఉద్యమ రాజకీయాలను రంగరించి తెలంగాణ సాధనలో సరికొత్త పంధా ఆవిష్కరించారు

`ఎత్తిన పిడికిలి దించకుండా పద్నాలుగేళ్లు పోరు వాసం చేశాడు

`పిడి వాదమన్న వారి చేత కూడా పిడికిలెత్తించిన ధీరుడు

`మగ, పుబ్బ అని ఎగతాళి చేసిన వారిని తెలంగాణ పొలిమేర నుంచి తరిమేశాడు

`కేసీఆర్‌ శ్వాస కూడా జై తెలంగాణ అనే అంటది

`తెలంగాణ అంటే కేసీఆర్‌ కు అంత ప్రాణం

`అందుకే ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాటం చేశారు

`చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించారు

`అష్టదిక్పాలకుడై తెచ్చిన తెలంగాణను కాపాడిన శూరుడు

`సమైక్య వాదులు తెలంగాణ వైపు కన్నెత్తి చూడకుండా చేశాడు

`తెలంగాణ తెచ్చి బంగారు తెలంగాణ చేశాడు

`ఎండిన పల్లెలు కేసీఆర్‌ పాలనలో చిరుగించాయి

`పచ్చటి మాగాణాలై పరవశించాయి

`పల్లెలు మురిసి పసిడి రాసులందిస్తున్నాయి

`అరవై ఏళ్ల చీకట్లను తరిమి వెలుగులు నింపిన నాయకుడు కేసీఆర్‌

`ఎడారి లాగా మారిన తెలంగాణను సాగు తెలంగాణ చేశాడు

`బంగారు పంటల మాగాణ చేసి అన్నపూర్ణగా మార్చాడు

`పదేళ్ల పాలనలో వందేళ్ల ప్రగతి కళ్లముందుంచాడు

`అభివృద్ధికి ఆమడ దూరంలో వున్న తెలంగాణను బంగారుమయం చేశాడు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

తెలంగాణ ఉద్యమ కాలం గురించి ఇప్పుడు గుర్తుకు చేసుకంటే ఒళ్లు జలదరిస్తుంది. మనసు పులకరిస్తుంది. పద్నాలుగేళ్ల పాటు అంతటి సుదీర్ఘమైన ఉద్యమం కేసిఆర్‌ ఎలా చేశారు అన్నది తలుచుకుంటే అది కలా..నిజామా? అనిపిస్తుంది. పద్నాలుగు సంవత్సల కాలం మంచులా కరిగిపోయింది. అంటే బలమైన సంకల్పం వున్న కేసిఆర్‌ లాంటి నాయకుడు ముందుండి నడుస్తుంటే కాలం అలా కరిగిపోయింది. తెలంగాణ వచ్చేదాకా పోరుసాగింది. కేసిఆర్‌ ఒక్కడు జై తెలంగాణ అన్నప్పుడు ఆయన పక్కన ఒక్కరు కూడా లేరు. కాని ఆయన మాటలే ప్రజలకు వేదమంత్రాలయ్యాయి. అప్పటి యువత ఆయన వెంట నడిచేందుకు అన్నీ వదులుకొని వచ్చిన నాలాంటి వేల మంది వచ్చారు. ఆ సమయంలో మాకు ఆశ, శ్వాస అన్నీ కేసిఆరే. ఒకప్పుడు జై తెలంగాణ అనే వ్యక్తిలేడు. తెలంగాణ కోసం కొట్లాడుదాం రమ్మని పిలిచిన నాయకుడు లేడు. కేసిఆర్‌ అనే నాయకుడే లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు. తెలంగాణ స్వరాష్ట్రమయ్యేదే కాదు. తెలంగాణ స్వయంపాలన మరో వెయ్యేల్లయినా చూసే వాళ్లం కాదు. కేసిఆర్‌ అంటేనే తెలంగాణ ఊపిరి. కేసిఆర్‌ అంటేనే పోరుకడలి. ఆయన శ్వాస కూడా జై తెలంగాణ అనే అంటుందంటున్న తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి బిఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవాల సందర్భంగా నేటి ధాత్రి ఎటిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో నాటి రోజులను పంచుకుంటూ చెప్పిన ఆసక్తికరమైన విషయాలు..విశేషాలు..ఆయన మాటల్లోనే….

                         తెలంగాణ కావాలన్న ఆకాంక్ష అప్పట్లో అన్ని వర్గాలలో వుంది. కాని తెలంగాణ వస్తుందా? అన్న మీమంసే అందిరిలోనూ వుండేది. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమ ఫలితాలు అందరి మదిలో అలా నిక్షిప్తమై వున్నాయి. ఎంతో మంది బలిదానం చేసినా తెలంగాణ ఆనాడు రాలేదు. పైగా నాయకులు కాడి వదిలేశారు. పదవులుకు ఆశపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని అటకెక్కించారు. అంత మంది త్యాగం వృధా అయ్యింది. అయితే తర్వాత ఉద్యమం చేపట్టే నాయకులే కరువయ్యారు. ప్రజలు నాయకులను నమ్మడానికి కూడా ఇష్టపడలేదు. అప్పుడప్పుడు, అక్కడక్కడ తెలంగాణ ఆకాంక్షల సభలు జరుగుతుండేవి. కాని అది పిడికెడు మంది మేధావులతో మాత్రమే జరిగేది. కనీసం ఆ సభల గురించి ఒక్క వార్తకూడా వచ్చేది కాదు. కాని ఎప్పుడైతే కేసిఆర్‌ జై తెలంగాణ అన్నారో..తెలంగాణ సమజంలో ఒక్కసారి చలనమొచ్చింది. గత అనుభవాలు ఎలా వున్నా, తెలంగాణ తెచ్చేదాక విశ్రమించేది లేదని చెప్పిన కేసిఆర్‌ మాటలు జనం మొదట్లో నమ్మడానికి సంశయించలేదు. కాని ఉమ్మడి పాలకులు చేసిన అసత్య ప్రచారం వల్ల ప్రజల్లో కొంత అనుమానాలు వుండేవి. కేసిఆర్‌ నాయత్వం మీద, తెలంగాణ ఉద్యమం మీద రకరకాల విషాలు చిమ్మారు. అయినా ఎక్కడా కేసిఆర్‌ వెవరలేదు. రాజకీయ వర్గాలన్నీ కేసిఆర్‌కు వ్యతిరేకంగానే పనిచేశాయి. కాని తెలంగాణ ప్రజలు నమ్మారు. అప్పటి యువత ఆయన వెంట నడిచారు. ఇదే సమయంలో కేసిఆర్‌లో వున్న పట్టుదల చూసి జయశంకర్‌ సార్‌ పూర్తి మద్దతు పలకడంతో అందరికీ కొండంత ధైర్యం వచ్చింది. కేసిఆర్‌ నాయకత్వం గురించి జయశంకర్‌ సార్‌ చెప్పిన మాటలు ఇంకా చెవుల్లో రింగుమంటూనే వుంటాయి. ఎందుకంటే కేసిఆర్‌ కారణజన్ముడు. ఒక నాయకుడు రాజకీయ పదవుల కోసం మాత్రమే ఆలోచిస్తాడు. కాని కేసిఆర్‌ పదవులన గడ్డిపరకల్లా తీసి పారేశారు. తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయానికి ముడిపెట్టి సాగిన ఆయన ప్రయాణం ముందు ఎవరికీ అర్దంకాలేదు. తర్వాత కేసిఆర్‌ను ఆపడం ఎవరి తరం కాలేదు. అంత గొప్పగా తెలంగాణ ఉద్యమాన్ని తీర్చిదిద్దిన నాయకుడు కేసిఆర్‌. ఉద్యమాన్ని కూడా పక్కా ప్రణాళికలతో ముందుకు తీసుకెళ్లిన ఏకైక నయాకుడు కేసిఆర్‌. 1969 ఉద్యమాలు, అనుభవాలను రంగరించి ముందుకు తీసుకెళ్లాడు. అప్పుడు జరిగిన తప్పులు ఒక్కటి కూడా జరక్కుండా ఎంతో జాగ్రత్తపడ్డాడు. తెలంగాణ ఉద్యమాన్ని ఎంతో వైవిద్యంగా ముందుకు నడిపించారు. కేసిఆర్‌ చెప్పే విషయాలను ఆ రోజుల్లో ఆంద్ర ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా వినేవారు. కేసిఆర్‌ సభలు అంటే జనం తండోపతండాలుగా తరలివచ్చేవారు. అలా ప్రజలను ఎప్పటికప్పుడు సభలకు రప్పించి, ఆయన పల్లెపల్లె తిరిగి ప్రజలను చైతన్య వంతం చేసిన సందర్భాలు భవిష్యత్తు తరాలకు మార్గదర్శకాలు. ఒక దశలో కేసిఆర్‌ నడుపుతున్న ఉద్యమాన్ని వెలెత్తి చూపేందుకు కూడా ఎవరూ సాహసించలేదు. కేసిఆర్‌ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. అనేక సంఘాలు పుట్టుకొచ్చాయి. రాజకీయ పార్టీలు కూడా పురుడు పోసుకున్నాయి. కాని అవి ఎంతో కాలం మనలేదు. కేసిఆర్‌ పోరాటానికి సరిపోలేదు. తెలంగాణ పార్టీలు పెట్టిన వారు ఉద్యమం నడిపించడం అంటే అంత ఆశామాషీ కాదని తెలుసుకున్నారు. పట్టుమని పది రోజులు కూడా పోరాటం చేయలేకపోయారు. పార్టీని ఏడాదిపాటు కూడా నడపలేకపోయారు. పార్టీ నడపం అంటే ఎన్ని అడ్డంకులు, అవరోధాలు, ఎంత కష్టమో తెలుసుకొని వదిలేశారు. తెలంగాణ ఉద్యమానికే దూరమయ్యారు. కేసిఆర్‌ చేస్తున్న ఉద్యమాన్ని చూస్తూ వుండిపోయారు. అలా కేసిఆర్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి, తెలంగాణ వాదాన్ని పలుచన చేద్దామని చూసిన వారి కుయుక్తులు సాగలేదు. కేసిఆర్‌ లాంటి నాయకుడి ముందు ఎవరి ఎత్తులు ఫలించలేదు. జిత్తులు అసలే సాగలేదు. కేసిఆర్‌ ఎప్పుడు ఎలాంటి ఉద్యమ రూపాన్ని తీసుకుంటాడో ఎవరికీ అర్ధమయ్యేది కాదు. ప్రత్యర్ధులకు అంచనాలకు అందకుండా, ఉమ్మడి పాలకులకు నిద్ర పట్టకుండా పోరాటం చేసిన ఘనత కేసిఆర్‌ది. అందుకే తెలంగాణ ఉద్యమం పద్నాలుగేళ్లపాటు సుదీర్ఘంగా సాగినా ఎక్కడా అలసట రాలేదు. అయినా తెలంగాణ రాదంటూ సమైక్యవాదులు చేసే ప్రకటనలతో తెలంగాణ యువత కన్నీరు మున్నీరైతుండేది. ఆవేశంతో యువత ఆత్మబలిదానాలు చేసుకుంటుండేవారు. ఆ సమయంలో కేసిఆర్‌ ఎన్ని వేల సార్లు కన్నీరు పెట్టుకున్నారో నా లాంటి వారికి మాత్రమే తెలుసు. అలా యువత ప్రాణాలు విడుస్తుంటే, ఇక చూడలేక ఇక ఒక్క బలిదానం కూడా జరగొద్దని కేసిఆర్‌ ఆమరణ నిరసనకు దిగారు. కేసిఆర్‌ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నిరసన దీక్ష చేపట్టారు. దాన్ని కూడా భగ్నం చేయాలని సమైక్య పాలకులు ఎంతో ప్రయత్నం చేశారు. ఖమ్మం జైలులో కేసిఆర్‌ దీక్ష విరమించాడంటూ లేనిపోని పుకార్లు లేపారు. అయినా ప్రజలు నమ్మలేదు. కేసిఆర్‌ దీక్ష విరమించలేదు. ఇక ఆసుపత్రిలో చేర్చి కేసిఆర్‌ దీక్షను ఎలాగైనా సాగకుండా చేయాలని పన్నాగం పన్నారు. అయినా కేసిఆర్‌ ఆసుపత్రిలో కూడా తన దీక్షను ఆపలేదు. కేసిఆర్‌కు ఏం జరిగినా తెలంగాణ అగ్నిగుండమౌతుందని కేంద్రం గ్రహించింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులను కూడా కేసిఆర్‌ ఆసుపత్రికి రానివ్వలేదు. తెలంగాణ ఇస్తే తప్ప దీక్ష విరమించేది లేదని కేసిఆర్‌ తెగేసి చెప్పడంతో కేంద్రం తెలంగాణ ప్రకటన చేయకతప్పలేదు. అంతే కాదు కేసిఆర్‌ చెప్పిన డ్రాప్టు మాత్రమే చదవి తెలంగాణ ప్రకటించారంటే కేసిఆర్‌ ఎంత మొండిఘటమో అర్ధం చేసుకోవచ్చు. కేసిఆర్‌ అంత మొండిగా ఉద్యమం చేయకపోతే, ఈ రోజు తెలంగాణ వచ్చేది కాదు. డిసెంబర్‌ 9న తెలంగాణ ప్రకటన వచ్చినా, సమైక్యవాదులు రాత్రికి రాత్రి కృత్రిమ ఉద్యమం మొదలు పెట్టారు. తెలంగాణ ప్రకటన వెనక్కితీసుకున్నారు. అప్పుడు కేసిఆర్‌ మరింత దూకుడుగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు. ఇటు క్షేత్రస్ధాయిలో ఉద్యమాలు సాగిస్తూనే, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించారు. తెలంగాణకు అనుకూలంగా వారి గొంతు వినిపించేలా చేశారు. తెలంగాణ ఏర్పాటు చేయొద్దన్న రాష్ట్రాల చేత కూడా తెలంగాణ న్యాయమైన కోరిక అనిపించారు. దేశంలోని 34 పార్టీల చేత తెలంగాణకు అనుకూలంగా ప్రకటనలు చేయించారు. వారి చేత ఉత్తరాలు కేంద్రానికి రాయించారు. ఇలా దేశంమొత్తం తెలంగాణ వైపు చూసేలా 2009 నుంచి 2014 వరకు రాజకీయ ఉద్యమ పోరాటాన్ని కేసిఆర్‌ సాగించారు. కొన్ని కోట్ల మంది కేసిఆర్‌లను తయారుచేశారు. తెలంగాణలోనే కాదు, దేశంలో ఎక్కడ విన్నా తెలంగాణ ఉద్యమ చర్చలే వినిపించేవి. జాతీయ మీడియా కూడా నిత్యం కొన్ని సంవత్సరాల పాటు ఉద్యమంపై ప్రత్యేక చర్చలు సాగించిన సందర్భాలు వున్నాయి. అలా తెలంగాణ వాణిని దేశమంతా వినిపించిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ కోసమే పుట్టిన కారణజన్ముడు కేసిఆర్‌.

వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్.

నార్కో అనాలసిస్ డాగ్ స్క్వాడ్ సహకారంతో పదార్థాల గుర్తింపు.

వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్

నర్సంపేట ఏసీబీ కార్యాలయం ప్రదర్శన,నార్కో అనాలసిస్ డాగ్ స్క్వాడ్ తో ఆర్టీసీ డిపోలో తనిఖీలు.

నర్సంపేట నేటిధాత్రి:

 

 

స్పెషల్ ట్రెయిన్డ్ నార్కో అనాలసిస్ డాగ్ స్క్వాడ్ సహకారంతో మత్తు పదార్థాల రవాణా అరికట్టేందుకు గుర్తింపు చేయవచ్చునని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు.

 

Dog Squad.

ఈరోజు వరంగల్ కమిషనరేట్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ నర్సంపేట ఎసిపి కార్యాలయం సందర్శించి డివిజన్ పోలీసు అధికారులకు శాంతి భద్రతల దృష్ట్యా తగు సూచనలు చేశారు.ఆనంతరం నర్సంపేట బస్ డిపో ఆవరణలో ఏమైనా మత్తు పదార్థాల రవాణా జరుగుతుందా అని అనుమానంతో స్పెషల్ ట్రెయిన్డ్ నార్కో అనాలసిస్ డాగ్ స్క్వాడ్ సహకారంతో తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఈస్ట్ జోన్ డీసీపీ మాట్లాడుతూ గంజాయి, తదితర మత్తు పదార్థాల రవాణా అరికట్టేందుకు అలాగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నివారించేందుకు, ప్రజలకు భరోసా కల్పించేందుకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏసిపి కిరణ్ కుమార్, టౌన్ సీఐ రమణమూర్తి,ఎస్ఐలు రవి కుమార్ ,అరుణ్,డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

తూకంలో ఎలాంటి అవకతవకలు జరగదు

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

శాయంపేట నేటిధాత్రి;

 

 

శాయంపేట మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండలంలోని పలు గ్రామాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారుల సహాయంతో ప్రారంభించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణ రావు మాట్లాడుతూ రైతులు పొలాల నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే సమయంలో ప్రభుత్వం సూచించే సూచన లు క్రమం తప్పకుండా పాటిం చి కొనుగోలు కేంద్రం నిర్వా హకులకు సహకరించాలని తేమశాతం లేకుండా ధాన్యాన్ని ఆరబెట్టి ప్యాడి క్లీనర్ ద్వారా ధాన్యాన్ని శుభ్రపరిచలని రైతులకు దాన్యం కొనుగోలు చేసిన వెంటనే ప్రభుత్వం తమ డబ్బులను ఖాతాలోకి వేస్తుందని అదేవిధంగా సన్నధాన్యానికి కింటాకు 500 రూపాయల బోనస్ ను కూడా ప్రభుత్వం అందిస్తుందని ఇందిరమ్మ రాజ్యంలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని వానకాలం పంట కన్నా యా సంగి పంటలో వరిసాగు పెరి గిందని వరి ధాన్యం కొనుగో లలొ ఎలాంటి అవకతవకలు జరిగిన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు.వరి బస్తాలు కాంట వేయడంలో 40 కిలోల 650 అంతకంటే ఎక్కువ జోకకూ డదని హెచ్చరించారు.

 

MLA

ఈ కార్యక్రమం లో మండల తాసిల్దార్ సత్యనారా యణ, ఎంపీడీవో ఫణి చంద్ర ,వ్యవ సాయఅధికారి గంగా జము నా, అధికారులు, మండల అధ్యక్షుడు దూదిపాల బు చ్చిరెడ్డి, బాసని చంద్రప్రకాష్, దుబాసి కృష్ణమూర్తి, బాసని శాంత- రవి, పోలేపల్లి శ్రీనివాసరెడ్డి, అబ్బు ప్రకాష్ రెడ్డి, చక్రపాణి, చిరంజీవి, భాస్కర్ , అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమా నులు, ప్రజలు,, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన.!

నూతన వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ నాయకులు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో నారగాని మాధవి-శ్రీధర్ గౌడ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులు చి. ల. సౌ. అమూల్య -చి.శ్రీకాంత్ గౌడ్ ను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన గణపురం మండల బిఆర్ఎస్ నాయకులు
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు, బి ఆర్ఎస్ మండల అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రా రెడ్డి, యాత్ నాయకులు గాజర్ల చింటూ గౌడ్, మార్క సాయి గౌడ్,బబ్లుగౌడ్, హఫీజ్ మరియు తదితరులు పాల్గొన్నారు

గీత కార్మికులను సాంఘిక బహిష్కరణ చేసిన.

గీత కార్మికులను సాంఘిక బహిష్కరణ చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.

రాజ్యాంగ విరుద్ధమైన వి,డి, సి లను నిషేధించాలి.

మంగపేట నేటిధాత్రి

 

 

 

 

కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు
నిజామాబాద్ జిల్లా తాళ్ల రాంపూర్ గ్రామంలో గీత కార్మికులను సాంఘిక బహిష్కరణ చేసి, శ్రీరామనవమి నాడు గుడిలోకి వచ్చిన మహిళలను గెంటివేసి అవమానపరిచి,ఉపాధి కల్పించే ఈత చెట్లను తగులబెట్టిన వి డి సి సభ్యులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కల్లు గీత కార్మిక సంఘము మంగపేట మండల కమిటీ డిమాండ్ చేశారు. మంగపేట మండల పరిధిలోని వివిధ గ్రామాలలో మండల కమిటీ ఆధ్వర్యంలో తాళ్లరాంపూర్లో జరిగిన వి డి సి పెద్దలను తక్షణమే అరెస్ట్ చేయాలనీ కల్లు గీత కార్మికుల తో నిరసన చేయడం జరిగింది.
నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్ లో రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పాటు చేసిన వి డి సి కమిటీల అరాచకాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయని,తాళ్ల రాంపూర్ లో తాళ్లు ఎక్కతు న్నందుకు వి డి సి కి డబ్బులు ఇవ్వలేదనే కక్షతో కల్లు గీత వృత్తినే నమ్ముకునీ జీవనం కొనసాగీస్తున్న గీత కార్మికులను తాళ్లు ఎక్కద్దని కల్లు ఎవరు తాగద్దని చాటింపు వేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు,పైగా ఈనెల 6న శ్రీరామనవమి పండుగ సందర్బంగా గౌడ మహిళలు గుడికి వస్తే మీరు గుడికి రావద్దు అని బయటకు పంపి బహిష్కరణ చేసిన వి డి సి కమిటీపై చట్టరిత్య చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.నిజామాబాద్ జిల్లాలో వివిధ వృత్తులు చేస్తున్న
కుర్మ,యాదవులు,ముదిరాజ్, బెస్త,వడ్డెర,నాయి బ్రాహ్మణ, నేత,మరియు దళితులు తదితరచేతి వృత్తిదారులను సాంఘిక బహిష్కరణ చేస్తున్న వి డి సి లను శాశ్వతంగా లేకుండా నిషేధించాలని కమిటీ పెద్దలు అన్నారు..

Temple

 

 

 

ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు లోడే శ్రీనివాస్ గౌడు, మండల గౌడ సంఘము అధ్యక్షులు రావుల శ్రీనివాస్ గౌడు గాజుల ఈశ్వర్ గౌడు, గాజుల వెంకటేశ్వర్లు గౌడ్, గంట చిట్టిబాబు గౌడ్, బూర శ్రీనివాస్ గౌడ్, కమలాపూర్ గ్రామం గౌడ సంఘం నుండి పానుగంటి వెంకటేశ్వర్లు గౌడ్, బోనగాని యాదగిరి గౌడ్, జాడి శేఖర్ గౌడ్, బూర సాంబయ్య గౌడ్, పంజాల సత్యం గౌడ్, పందాల హరిబాబు గౌడ్, ఓరగంటి రాంబాబు గౌడ్, బూర నరేష్ గౌడ్, గుండెబోయిన శీను గౌడ్,శేఖర్ గౌడ్ కోరుకొప్పుల రాము గౌడ్, కోరుకొప్పుల సత్యం గౌడ్, కుప్పల పున్నం రావు గౌడ్, చిన్న చంద్రం గౌడ్, పెద్ద చంద్రన్న గౌడ్,ఉడుగుల సాంబయ్య గౌడ్ వీరితో పాటు మిగతా గ్రామాల నుండి 40 మంది గీత కార్మికులు పాల్గొన్నారు.

భీమారం లో ఉచిత నేత్ర వైద్య శిభిరము.

భీమారం లో ఉచిత నేత్ర వైద్య శిభిరము

30 మంది రేకుర్తి ఆసుపత్రి కి తరలింపు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

డాక్టర్ భాస్కర్ మాదేకర్ ఉదార నేత్ర వైద్యశాల రేకుర్తి, కరీంనగర్ వారి సౌజన్యంతో, వైస్ చైర్మన్ లయన్ చిదురా సురేష్ సహకారంతో, మంచిర్యాల జిల్లా భీమారం జడ్పి ఉన్నత పాఠశాలలో శుక్రవారం లయన్స్ క్లబ్ మంచిర్యాల,లయన్స్ క్లబ్ మంచిర్యాల గోల్డెన్ జూబ్లీ,లయన్స్ క్లబ్ విజన్ కేర్ ల ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శిభిరము నిర్వహించారు. వైద్య శిభిరానికి 70 మంది విచ్చేసి బి పి,షుగర్,కంటి పరీక్షల అనంతరం 30 మంది కంటి ఆపరేషన్ కోసం అర్హత సాధించినట్లు,వారిని ఉచిత కంటి ఆపరేషన్ కోసం రేకుర్తి ఆసుపత్రి కి పంపించామని రేకుర్తి ప్రతినిధి ప్రభాకర్ మరియు లయన్ డాక్టర్ కె. సుగుణాకర్ రెడ్డి తెలిపారు.ఐ పెషేంట్ లకు వారి వెంట వెళ్లే వారికి ఉచిత బస్సు ప్రయాణం,ఉచిత భోజన వసతి ఉంటుందని తెలుపుతూ,కంటి ఆపరేషన్ తరువాత ఆదివారం భీమారం కు తిరిగి వస్తారని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఛైర్పర్సన్ ఫర్ ఐ క్యాంప్స్ లయన్ మోదుంపురం వెంకటేశ్వర్,మంచిర్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ పుల్లూరి బాలమోహన్,కోశాధికారి లయన్ కొల్ల వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి విజన్ కేర్ అధ్యక్షులు లయన్ సయ్యద్ ఇలియాస్ వారి సిబ్బంది,భీమారం మాజీ సర్పంచ్ చేకుర్తి సత్యనారాయణ రెడ్డి,భగద్గీత అధ్యయన మండలి సభ్యుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version