ప్రమాదం లో బుర్కపల్లి వాగు వంతెన.

ప్రమాదం లో బుర్కపల్లి వాగు వంతెన

బయందోళనలో ప్రయాణం సాగిస్తున్న ప్రజలు

కొత్తగూడ, నేటిధాత్రి :

 

 

 

 

మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం నుంచి గంగారం ఇల్లందు వెళ్లే దారిలో మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి బుర్కపల్లి వాగుపై వంతెన ఎప్పుడో తాతల కాలం నాటి నిర్మించినది.. అది కూడా వెడల్పు లేకుండా ఉండడంతో వర్షాకాలం వచ్చిందంటే బ్రిడ్జి పైన నుంచి నీళ్లు వెళ్లి రాకపోకలకు అంతరాయం జరుగుతూ ఉంటుంది.. వర్షాకాలంలో వాగు ఉప్పొంగి వరద ఉధృతికి బ్రిడ్జి పూర్తిగా దెబ్బతిని భారీ వాహనములు బ్రిడ్జిపై వెళ్తుండడంతో బ్రిడ్జ్ పిల్లర్లు రాళ్లు ఇసుక కంకర అన్ని కొట్టుకపోయాయి బ్రిడ్జి ఎప్పుడు కూలిపోతుందని ప్రయాణికులు భయంకరమైన చెందుతున్నారు కావున ఉన్నత అధికారులు తక్షణమే స్పందించి పాత బ్రిడ్జి స్థానంలో మరింత వెడల్పుగా కొత్త బ్రిడ్జి నిర్మించాలని ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని కొత్తగూడ గంగారం మండలాల ప్రజలు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు..,,

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కాంగ్రెస్.!

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి,పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఆదేశాల మేరకు శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని,ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో వరి పంట ఎక్కువ దిగుబడి అవుతుందని అన్నారు. రూ.2లక్షల రుణమాఫీ చేసి రైతు పక్ష పాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిందని తెలిపారు.సన్న వడ్ల ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికె దక్కిందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చల్ల సత్యనారాయణ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ గుండు తిరుపతి,వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామ రైతులు, సెంటర్ ఇన్చార్జి బల్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

భూభారతిపై అవగాహన కార్యక్రమం.

భూభారతిపై అవగాహన కార్యక్రమం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి అవగాహన కార్యక్రమాన్ని.రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్.నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూభారతి చట్టంలో వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ.రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకువచ్చిన భూభారతి నూతన ఆర్ ఓ ఆర్.చట్టంపై తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సదస్సులో కలెక్టర్ పాల్గొని చట్టంలోని వివిధ అంశాలను ప్రయోజనాలను ప్రజెంటేషన్ ద్వారా రైతులకు ప్రజలకు క్లుప్తంగా వివరించడం జరిగిందని. అలాగే శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలోని గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూధార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక చేస్తుందని దీని ద్వారా భూ అక్రమాలకు చెక్ పెట్టవచ్చునని పెండింగ్లో ఉన్న సాదా బైనామ పరిష్కారం కోసం భూభారతి. చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని పి ఓ టి. ఎల్.టి.ఆర్ సీలింగ్ చట్టాలు ఉల్లంఘనలు లేని దరఖాస్తులను క్రమబద్ధీకరణ చేసే నాటి స్టాంప్ డ్యూటీ 100 రూపాయలు అపరాధ రుసుము వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారని. హక్కుల రికార్డులు వివరాలను నమోదు చేసి పాస్ బుక్ జారీ చేయడం జరుగుతుందని వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఒకేరోజు ఉంటాయని కొనుగోలు తనక బదిలీ బాగా పంపకాల ద్వారా భూమిపై హక్కులు సంకల్పిస్తే తాసిల్దార్ .రిజిస్ట్రేషన్ చేసి హక్కుల రికార్డులను మార్పు చేసి పట్టాదారు పాసుబుక్ జారీ చేస్తారని .స్లాట్ బుకింగ్ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ న్యూట్రిసియేషన్ .ఫీజు చెల్లింపు అంటే నిర్ణీత తేదీల్లో చట్ట ప్రకారం సొంత దస్తావేజు రాసుకొని సమర్పించాల్సి ఉంటుందని దస్తావేజుతోపాటు ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి భూమి పట్టం సమర్పించాలని తెలియజేశారు చట్టంపై అవగాహన కల్పించేలా కరపత్రాలు పంపిణీ చేశామని ప్రజలు వీటిని గమనించాలని ఏమైనా సందేహాలు ఉంటే తీర్చడానికి అధికారులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేశారు రైతులకు ఎటువంటి భూ సమస్యలు ఉన్న భూభారతిలో పరిష్కరించవచ్చని పేర్కొంటూ ప్రతి గ్రామానికి ఒక విలేజ్ రెవెన్యూ అధికారిని నియమించడం జరుగుతుందని తద్వారా రైతులకు భూభారతిలో ఎటువంటి సమస్యలు వచ్చిన పరిష్కరించడానికి చాలా సులువుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి అవగాహన కార్యక్రమానికి రైతులు ఆర్డీవో రాధాబాయి ఎమ్మార్వో జయంత్ కుమార్ గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప తిరుపతి రెడ్డి వైస్ చైర్మన్.నేరెళ్ల నరసింహం గౌడ్.ప్రభుత్వ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మహిళా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫామ్లు.

మహిళా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫామ్ లు కుట్టి వేత…

రామాయంపేట ఏప్రిల్ 26 నేటి ధాత్రి (మెదక్)

 

 

ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ లు కుట్టి అందించే బాధ్యత ప్రభుత్వం మెప్మ, ఐకెపి కి అప్పగించింది. దీంతో మహిళా సంఘాలను ప్రోత్సహించి ఈ యూనిఫాంలు కుట్టించే బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించారు. ఇందుకు ఒక యూనిఫామ్ కు రూ. 75 రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది.

Students

 

ఒక రకంగా ఇది మహిళా సంఘం లో టైలరింగ్ వచ్చిన వారికి మంచి అవకాశం. గతంలో కూడా తాము విద్యార్థులకు యూనిఫామ్ లు కుట్టించి ఇచ్చామని, ఇప్పుడు కూడా తమకు యూనిఫాంలు కుట్టడానికి ఎంపిక చేసినట్లు మహిళా సంఘాల సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మర్కు లావణ్య. ఆర్ లావణ్య. జి స్రవంతి. పి స్వాతి. సిహెచ్ కవిత. ఆర్ తరంగిణి. బి బాల్ లక్ష్మి. కె శ్రీలత. ఆర్ స్రవంతి. పి శ్రీలత. తదితరులు పాల్గొన్నారు.

పహెల్గమ్ ఉగ్రదాడిని ఖండించండి.

పహెల్గమ్ ఉగ్రదాడిని ఖండించండి

మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

నర్సంపేట నేటిధాత్రి:

 

 

 

 

జమ్మూ కాశ్మీర్ లోని పల్గామ పర్యటక ప్రాంతంలో ఉగ్ర మూకలు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ బిఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో మౌనం పాటించారు.

ఘటనను ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా బిఆర్ఎస్ జిల్లా నాయకులు నల్ల మనోహర్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు నాగేల్లి వెంకటనారాయణ మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ వైఫల్యంతో ఈ ఘటన జరిగిందని నిగ్గు వర్గాలు హెచ్చరించిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఉండటంవల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు.

దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజీనామా చేయాలని మృతి చెందిన కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఉగ్రవాదాన్ని కూకటి వేళ్ళతో పెకిలించి అంతమొందిస్తామని బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి చెప్పుతూ రాజకీయ లబ్ధికే వాడుకుంటుంది తప్ప ఆచరణలో సాధ్యం కావడం లేదని గతంలో జరిగిన పుల్వామా దాడి నుండి నేటి వరకు దేశంలో అనేక చోట్ల ఇలాంటి మారణ హోమాలు జరగటమే నిదర్శనమని అన్నారు.

దేశ భద్రత కోసం ఉగ్రవాదం అంతం అందించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్న బిఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్టియు జిల్లా అధ్యక్షులు గోనే యువరాజు, సీనియర్ నాయకులు రామారావు, మాజీ కౌన్సిలర్లు బండి రమేష్, మండల శ్రీనివాస్, శివరాత్రి స్వామి వాసం సాంబయ్య దేవూజు సదానందం, పెండెం వెంకటేశ్వర్లు, బీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు పుల్లూరి స్వామి, వార్డు అధ్యక్షులు బీరం నాగిరెడ్డి, సంపంగి సాలయ్య, పెరమండ్ల రవి, రావుల సతీష్, రాయరాకుల సారంగం, రచ్చ రఘు, కుంకీసా కుమార్ రుద్రారపు పైడయ్య, గుండెబోయిన కోటి, పోతరాజు బాబు గౌడ సంఘం అధ్యక్షుడు గిరిగాని సాంబయ్య నాయకులు పైసా ప్రవీణ్, తోట సదానందం గోనెల కర్ణాకర్, మద్దెల సాంబయ్య భోలే పాషా రాపోలు రాములు రాపోలు శీను, రాపోలు సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

రజోత్సవ సభను విజయ చేయాలి వంతం

రజోత్సవ సభను విజయవంతం చేయాలి ….

జహీరాబాద్  నేతి ధాత్రి:

బిఆర్ఎస్ నిర్వహించే ఓరుగల్లు రజతొత్సవ సభను విజయవంతం చేయాలని బిఆర్ఎస్ నాయకుడు షేక్ సోహెల్ అన్నారు ఝరాసంగం మండలంలోని ప్రతి గ్రామం నుండి నాయకులు గాని కార్యకర్తలుగాని అభిమానులు పెద్ద ఎత్తున ఈ సభను తరలి వెళ్లి విజయవంతం చేయాలని అన్నారు బిఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కోసం యువత మరియు రైతన్నలు ప్రతి ఒకరు గులాబీ సైనికులు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు జహీరాబాద్ శాసన సభ్యులు కొనింటి మాణిక్ రావు గారి నేతృతంలో ఝరాసంగం మండలం నుండి పెద్ద ఎత్తున సభకు తరాలి రావాలన్నారు. స్వరాష్ట్రం కోసం పుట్టిన జెండా గులాబీ జెండా మన జెండా మన కెసిఆర్ మన రాష్ట్రం అన్నారు జై తెలంగాణ జై జై తెలంగాణ..

రామకృష్ణాపూర్ కు బస్సు సౌకర్యం కల్పించండి..

రామకృష్ణాపూర్ కు బస్సు సౌకర్యం కల్పించండి..

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

క్యాతనపల్లి రైల్వే గేట్ సమీపంలో రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ నిర్మించిన నేపథ్యంలో రవాణా మెరుగుపడిందని, ప్రజల రాకపోకలకు అనువుగా ఉన్న నేపథ్యంలో బస్సు సర్వీసు నడిపించేలా చొరవ తీసుకోవాలని మంచిర్యాల ఆర్టీసీ డిపో అడిషనల్ క్లర్క్ ఎం ఎం రావు, స్టేషన్ మేనేజర్ గోలీ శంకర్ లకు టిపిసిసి జనరల్ సెక్రటరీ పిన్నింటి రఘునాథరెడ్డి తో కలిసి బస్సు సౌకర్యం కల్పించండి అని రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు వినతి పత్రం అందించారు. మంచిర్యాల నుండి రామకృష్ణాపూర్, ఆర్కే వన్ వరకు బస్సు లు నడిపించాలని కోరామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోపు రాజం, పలిగిరి కనకరాజు, రాం సాయి, భాస్కర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి.

ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి…

సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్

రామకృష్ణాపూర్, నేటిదాత్రి:

 

 

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ సీపీఐ పార్టీ క్యాతనపల్లి మున్సిపాలిటీ పట్టణ సమితి ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించారు.ఉగ్రవాదుల దుర్మార్గపు చర్యల వల్ల అమాయక ప్రజలు,పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని,ఉగ్రవాదులను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందినదని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ ఆరోపించారు.కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు వనం సత్యనారాయణ, నక్క వెంకటస్వామి, కాదండీ సాంబయ్య, పార్టీ ప్రజా సంఘాల నాయకులు, మామిడి గోపి, ఎగుడ మొండి,సిర్ల ముకుందరేడ్డి, కస్తూరి మల్లారెడ్డి,గంగాదరి మల్లయ్య,బోయపోతుల కొమురయ్య,మోతుకుల రాజు, అన్నం శ్రీనివాస్, మా దాస్ శంకర్,గొడిసెల గురువయ్య, శ్రీకాంత్ ,చిరంజీవి,తదితరులు పాల్గొన్నారు.

కెనరా బ్యాంకు మేనేజర్ సైదులు.

కెనరా బ్యాంకు మేనేజర్ సైదులు బదిలీ కావడంతో సన్మానించిన రుద్రప్ప పటేల్

జహీరాబాద్. నీటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండల కెనరా బ్యాంకు మేనేజర్ సైదులు ఉద్యోగరీత్యా బదిలీ కావడంతో ముఖ్యఅతిథిగా హాజరయ్యా స్థానిక కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ నాయకులు రుద్రప్ప పటేల్, శాలువా పూలమాలలతో సన్మానించి తమ మండలానికి సేవలందించిన జ్ఞాపకాలుగా మారుతాయని వీడుకోలు పలికారు
ఈ కార్యక్రమంలో ఫిల్డ్ ఆఫీసర్ నిలేశ్ విఠల్ ,సిద్ధార్థ
అభిలాష్ రెడ్డి ,ల్యకత్ ,బసంతి పటేల్ ,సుధాకర్ రెడ్డి, లక్ష్మణ్,భాస్కర్ రెడ్డి, మజార్ అహ్మద్,శివమణి పటేల్, జగదీష్, నారాయణ,నగేష్ తదితరులు పాల్గొన్నారు

ఏజెన్సీ ప్రాంతంలో1/70 చట్టానికి అనుగుణంగానే.

ఏజెన్సీ ప్రాంతంలో1/70 చట్టానికి అనుగుణంగానే భూభారతిని చట్టాన్ని అమలు చేయాలి

కొత్తగూడ, నేటిధాత్రి:

 

 

 

ఆదివాసి సంక్షేమ పరిషత్ మహబూబాబాద్ జిల్లా కమిటీ సమావేశం కొత్తగూడ మండల కేంద్రంలో జరిగింది.

ఈ సమావేశంలో కొత్తగూడ మండల నూతన కమిటీని జిల్లా అధ్యక్షులు తాటి సుధాకర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎంపిక చేయడమైనది.

ఆగబోయిన ప్రశాంత్ అధ్యక్షులు, దనసరి నారాయణ ప్రధాన కార్యదర్శి, కంగల సురేందర్, సుంచ బాలరాజు ఉపాధ్యక్షులు కార్యదర్శిలు మోకాళ్ళ చంద్రబాబు దనసరి రాజేష్ (చిన్న), దనసరి రాజబాబు, చింత రాజు కమిటీ సభ్యులు గా ఎన్నుకోవడం జరిగింది అనంతరం ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు తాటి సుధాకర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న కొంతమంది నిరుపేద ఆదివాసి రైతులకు ఇప్పటివరకు అడవి హక్కు పత్రాలు ప్రభుత్వం మంజూరు చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు.

హక్కు పత్రాలు మంజూరు కానటువంటి వారికి ప్రభుత్వం తక్షణమే అడవి హక్కు పత్రాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా వారు కోరినారు.

హక్కు పత్రాలు లేకపోవడంతో ప్రభుత్వ బ్యాంకుల ద్వారా పెట్టుబడులకు రుణాలు తీసుకోలేని పరిస్థితి దాపురించింది దీంతో నిరుపేద ఆదివాసి రైతులు వడ్డీ వ్యాపారస్తులు ఆశ్రయించి వారి దగ్గర విత్తనాలు ఎరువులు అధిక వడ్డీలకు ఇస్తూ రైతుల్ని దోపిడీ చేయడమే కాకుండా వారు పండించిన పంటని అలా సులాలకు కొన్న వడ్డీ వ్యాపారులు వారు లాభపడుతూ నిరుపేద ఆదివాసి రైతుల జీవితాలను అప్పుల ఊబిలోకి నేడుతున్నారు ఏజెన్సీ ప్రాంతంలోని దళారులు కోట్లకు పరిగెడుతున్నారు నిరుపేద ఆదివాసి రైతులు సేట్ల దగ్గర అప్పు కోసం వరుస కడుతున్నారు ఏజెన్సీ ప్రాంతంలో ఇంత జరుగుతున్నా కూడా వ్యవసాయ శాఖ అధికారులు కళ్ళు మూసుకొని దళారులను ప్రోత్సహిస్తున్నారు ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఆదివాసీల భూములు మొత్తం కూడా వడ్డీ వ్యాపారులు సేట్లకి తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి దాపురిస్తుందని వారు ఆవేదన చెందినారు.

అతికరేట్లకు విత్తనాలు సప్లై చేస్తున్న సేట్లను అధిక వడ్డీకి డబ్బులు ఇస్తున్న వడ్డీ వ్యాపారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా.

ఏజెన్సీ ప్రాంతంలో భూభారతి అవగాహన సదస్సులో గిరిజనేతరుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి భూముల పైన విచారణ చేపట్టాలని ఆ భూములు 1/70 చట్టం అమల్లో రాకముందు నుండి వారి ఆధ్వర్యంలో ఉన్నాయా అనే విషయాన్ని కూడా ప్రభుత్వం

ఈ అవగాహన సదస్సులో ఏజెన్సీ ప్రాంతంలోని భూములపై కూడా అవగాహన కల్పించాలని అంతేకాకుండా భూభారతి ముసుగులో 1970 సంవత్సరం తర్వాత ఏజెన్సీ ప్రాంతాలకు వలస వచ్చిన గిరిజనేతరాలకు హక్కులు కల్పిస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

 

అదేవిధంగా ఈనెల 27న గంగారం మండలం కమిటీ ఎన్నుకోవడం జరుగుతుందని ఆదివాసి యువకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తాటి ప్రవీణ్ మహాబూబాబాద్ డివిజన్ అధ్యక్షులు ఆదివాసి సంక్షేమ పరిషత్ ధనసరి రమేష్ దనసరీ వినోద్ గట్టి కార్తీక్ చింత సాంబయ్య అలెం సారంగపాణి తదితరులు పాల్గొన్నారు…

కాంగ్రెస్ ఉనికి కోల్పోవడం ఖాయం.!

కాంగ్రెస్ ఉనికి కోల్పోవడం ఖాయం. రజతోత్సవసభ తో

భారత రాజకీయాల్లో రజితోత్సవ సభ చారిత్రాత్మకం

గండ్ర యువసేన జిల్లా నాయకులు

గడ్డం రాజు.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

మండలకేంద్రంలో గండ్ర యువసేన జిల్లా నాయకులు గడ్డం రాజు మొగుళ్ళపల్లిలొ జరిగిన పాత్రికేయుల సమావేశంలొ రజతోత్సవ సన్నాహక సమావేశంను ఉద్దేశించి రాష్ట్రంలో ఉనికిని కోల్పోవడం ఖాయమని అన్నారు. ఆయన మట్కాడుత
ఏప్రిల్ 27న వరంగల్ లో జరిగే రజతోత్సవ సభకు సమాయత్తం చేయడం కొరకు పర్యటన చేస్తున్నానాని రజతోత్సవ సభకు ప్రజలు నాయకులు కార్యకర్తలు వస్తున్నారని భారత రాజకీయ చరిత్రలో ఈ సభ చారిత్రాత్మక అవుతుంది అన్నారు.కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టి అధికారంలోకి వికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చడం లేదని గడ్డం రాజు ఆవేదన వ్యక్తంచేశారు ప్రజాసంక్షేమం గాలికి వదిలేసి ప్రజలను గోసా పడుతున్నారని స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు మొగుళ్ళపల్లి మండలం నుంచి అధిక సంఖ్యలో విజయోత్స సభకు పాల్గొనాలని గడ్డం రాజు పిలుపునిచ్చారు.

డెంగ్యూ, మలేరియాను నియంత్రించాలి.

డెంగ్యూ, మలేరియాను నియంత్రించాలి:
ఎంటమాలజి :ఏ ఈ వనజ

మల్కాజిగిరి నేటిధాత్రి

 

 

 

మలేరియా దినోత్సవం సందర్భంగా మల్కాజ్ గిరి సర్కిల్ ఎంటమాలజీ విభాగం సర్కిల్ ఏఈ వనజ ఆధ్వర్యంలో సఫిల్ గూడ నుంచి ఆనంద్ బాగ్ చౌరస్తా వరకుర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ..

Surroundings Clean

 

దోమల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని డెంగ్యూ, మలేరియాను నియంత్రించాలని సూచించారు. అనంతరం ప్రజలకు డెంగ్యూ, మలేరియా వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు గురు భూషణ్, నాగేందర్ , షోకత్ , రామచందర్, ఎండి అబ్దుల్ , సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ZPHS కారుకొండ

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ZPHS కారుకొండ.

హన్వాడ:- నేటి దాత్రి.

మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట్ మండలం కారుకొండ గ్రామంలోని పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2014-2015 బ్యాచ్.ఏప్రిల్ 20-2025 న.తమ 10 సంవత్సరాల వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తమ తీపి జ్ఞాపకాలను పంచు కున్నారు. ప్రతి ఒక్క విద్యార్థి తమ ఉపాధ్యాయులని గుర్తుచేసుకొని ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు.

ఓరుగల్లు మహా సభను విజయవంతం చేద్దాం.

ఓరుగల్లు మహా సభను విజయవంతం చేద్దాం

బిఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు గంట కళావతి

పరకాల నేటిధాత్రి

ఊరు వాడా ఉప్పెనలా కదులుదాం ఓరుగల్లు మహా సభను విజయవంతం చేద్దాం అని పరకాల పట్టణ బిఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు గంట కళావతి పిలుపునిచ్చారు.27న వరంగల్ ఎల్కతుర్తిలో జరుగుతున్న బిఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబి సైనికులు కదిలి రావాలని కోరారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి కనీ విని ఎరుగని రీతిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో పరకాలను అభివృద్ధి చేశారని తెలిపారు. అలాంటి అభివృద్ధి ప్రదాత ఉద్యమాల ఖిల్లా వరంగల్ జిల్లాలో బిఆర్ఎస్ రజతోత్సవ సభను ఈ నెల 27న నిర్వహిస్తున్నారని ఆ సభకు ప్రతి ఒక్కరు వచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.

ఉగ్రవాదులను తుది ముట్టించాలి.

ఉగ్రవాదులను తుది ముట్టించాలి

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని పహల్గామ్ లో జరిగిన దాడి దురదృష్టకరమని అమాయకులైన 26 మందిని బలిగొన్న ఉన్మాదులను తుది ముట్టించాలని సిరిసిల్ల మజీద్ కమిటీ నాయకులు కేంద్ర ప్రభుత్వన్ని కోరారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణంలో మజీద్ కమిటీ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.
పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మజీద్ కమిటీ నాయకులు మాట్లాడుతూ భారత దేశంలో అన్నదమ్ములల కలిసి మెలిసి ఉన్న హిందూ ముస్లింలలో వైశాల్యాలు సృష్టించి లేనిపోని అపోహలు కల్పించి దేశంలో కునుకు లేకుండా ఉగ్రదాడులు చేస్తున్నారని అన్నారు. పహల్గామ్ లో అమాయకులైన 26 మందిని బలిగొన్నారని అమాయకులైన వారి ప్రాణాలను బలిగొన్న ఉన్మాదులను తుది ముట్టించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో
మజీద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ సమీద్, రఫీ ఉద్దీన్, షాబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు తప్పని ఇబ్బం దులు

ప్రజలకు తప్పని ఇబ్బం దులు

కొత్త రోడ్డును సకాలంలో వెయ్యండి

నేటిధాత్రి:

 

కొప్పుల గ్రామం నుండి గంగిరేణిగూడెం వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర కంకర పోసి అలాగే వదిలేయ డంతో నడవాలంటే ప్రయాణం ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు చెప్తున్నారు.

People have problems.

రాత్రి సమయంలో అత్యవసర పరిస్థితుల్లో రోడ్డు గుండా ప్రయాణించాలంటే నరకం చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోని వెంటనే రోడ్డుపన్నులు పూర్తిచేసే దిశగా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు

రజతోత్సవసభకు మనమంతా ఒక్కటై కదం.!

రజతోత్సవసభకు మనమంతా ఒక్కటై కదం తొక్కి కదులుదాం

మాజీ ఆలయ చైర్మన్ గందె వెంకటేశ్వర్లు

పరకాల నేటిధాత్రి

 

 

టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈనెల ఏప్రిల్ 27 వరంగల్ లో ఎల్కతుర్తి లో ఏర్పాటు చేసిన రజితోత్సవ సభ కు తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజలంతా ఒక్కటై కదం తొక్కుతూ కదిలి రావాలని పరకాల నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల ప్రజలంతా భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో హాజరై
బి ఆర్ ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని పరకాల శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ గందె వెంకటేశ్వర్లు కోరారు.ఈ సందర్భంగా గందెవెంకటేశ్వర్లు మాట్లాడుతూ టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలను ఆగమయ్యే రోజులు వచ్చాయని కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిందని మళ్లీ కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుతున్నారు.ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతాంగం ఆగమైందని ఇప్పటికైనా తెలంగాణ ప్రజలంతా మేల్కొని కాంగ్రెస్ పాలన నుండి విముక్తి పొందాలంటే బీఆర్ఎస్ పార్టీని మళ్లీ గెలిపించుకొని కెసిఆర్ ని ముఖ్యమంత్రి ని చెయ్యాలి. భారత రాష్ట్ర సమితి బి ఆర్ ఎస్ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పురస్కరించుకున్నందున ఈనెల 27న జరిగే జరగబోయే టిఆర్ఎస్ రజితోత్సవ సభకు పరకాల నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల నుండి గ్రామాల నుండి గులాబీ దండై ప్రజలంతా తరలిరావాలని బి ఆర్ ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరారు.

రైతులు పండించిన ప్రతి చివరి గింజల వరకు.!

రైతులు పండించిన ప్రతి చివరి గింజల వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కానీ జిల్లాలో కానీ ఆరుగాసాల కష్టపడి రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఐకెపి సెంటర్ ద్వారా కొనుగోలు చేస్తుందని దయచేసి రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని విషయం ఏమిటంటే ప్రతి సంవత్సరం మే మాసంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని గత ప్రభుత్వ పాలకులు ఏం చేశారు ప్రజలందరికీ తెలుసునని ఇప్పుడు కూడా రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తద్వారా కొద్దిగా గన్నిసంచులు లారీల కొరత ఉన్నది వాస్తవమే అని రైతులు పండించిన ధాన్యాన్ని ఐకెపి సెంటర్ ద్వారా విక్రయించాలని అలాగే రైతులకు బ్యాంకు అధికారులు ఇబ్బందులు గురి చేస్తున్నారని విషయం పై అధికారులదృష్టికి వచ్చిన పై అధికారులు తగు చర్యలు తీసుకుంటారని అలాగే రేపు జరగబోయే రైతు అవగాహన సదస్సు పై ప్రభుత్వ వీప్ఆది శ్రీనివాస్. సిరిసిల్లనియోజకవర్గం ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ వ్యవసాయ అధికారులు రైతులతో అవగాహన సదస్సు నిర్వహించి రైతుల అమూల్యమైన సలహాలు తీసుకుంటారని దీనిపై భవిష్యత్తులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని తెలియజేస్తూ ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు మీ మండలంలో పనిచేసే ఒక అధికారి పని ఒత్తిడి భారమో. మీ నాయకులు చేస్తున్న ఒత్తిడి వల్ల కానీ సమస్యలు వస్తున్నాయని దృష్టికి వచ్చిందని దీనిపై వివరణ . కోరగా జరిగిన మాట వాస్తవమే కానీ. అసలు ఏం జరిగింది అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరక లేక ఆమె వ్యక్తిగత అవసరాల గురించా తెలియదు కానీ దీనిపై సంబంధిత అధికారులు తగు విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని దీనిపై మండల కాంగ్రెస్ పార్టీ లో పనిచేసే నాయకులు కార్యకర్తలు ఉన్నారని ఆరోపిస్తుండడం కరెక్టే కానీ దీనిపై విచారణకు సిద్ధమై. అధికార పార్టీ నాయకులైన కార్యకర్తలైన ఏ నాయకులైన చట్టానికి చుట్టం కాదని దీనిపై తగు విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో యూత్ నియోజకవర్గ ఇన్చార్జి. చుక్క శేఖర్. మునిగల రాజు. సత్తు శ్రీనివాస్ రెడ్డి. పొన్నాల లక్ష్మణ్. గుగ్గిళ్ళ భరత్ గౌడ్. భాస్కర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

కంకర పరిచారు.. రోడ్డు మరిచారు.

కంకర పరిచారు.. రోడ్డు మరిచారు

రోడ్డు వెయ్యండి బాబు… ప్రజలకు తప్పని ఇబ్బందు లు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం కొప్పుల గ్రామం నుండి గంగిరేణిగూ డానికి రైతులు పంట పొలా లకు గంగిరేణి గూడెం గ్రామం వరకు నూతన బిటి రోడ్డు మంజూరు చేశారు సదరు గుత్తేదారు రోడ్డును తవ్వి కంకర పోసి వదిలేశారు. సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు పనులు పూర్తి కాకపోవడంతో రోడ్డుపై ప్రయాణం చేయాలంటే నరకం చూస్తున్నట్లు స్థానికులు ఆవేదం వ్యక్తం చేస్తున్నారు రాకపోకలకు వేరే మార్గం లేక తీవ ఇబ్బందులు ఎదుర్కొ న్నట్లు ఆగ్రహం చేస్తున్నారు. నెలలు గడుస్తున్న రోడ్డును తీసి కంకర పోసి వదిలిపెట్టారు దీన్ని ఎవరు పట్టించుకోక పోవడం వల్ల రాకపోకలను ఇబ్బందులు గురవుతున్నారు అధికారులు కానీ, ప్రజాప్రతిని ధులు గాని స్పందించి సకాలం లో రోడ్డు పూర్తయ్యాలో చూడా లని ప్రజలు కోరుతున్నారు. రాత్రి వేళల్లో రోడ్డు సరిగ్గా కని పించక స్లిప్పు అయి చాలా మంది ప్రమాదాలు గురవుతు న్నారు రోడ్డు అసంపూర్తిగా ఉండడంతో పాటు కంకర రాళ్ల వల్ల ఇప్పటికి చాలామంది గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

కోటగుళ్ల అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి.

కోటగుళ్ల అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి

రాబోయే రోజుల్లో ఆలయం మరింత అభివృద్ధి

దేవదాయ శాఖ డివిజనల్ ఇన్స్పెక్టర్ నందనం కవిత

కోటగుళ్లలో ప్రత్యేక పూజలు

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండల కేంద్రంలో కోటగుళ్ల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని దేవదాయ శాఖ డివిజనల్ ఇన్స్పెక్టర్ నందనం కవిత అన్నారు. గురువారం ఆమె సిబ్బందితో కలిసి కోట గుళ్ళ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహణ విషయమై కోటగుళ్లు పరిరక్షణ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాబోయే రోజుల్లో 43 సెక్షన్ కింద కోట గుళ్ళు దేవాలయం పేరున రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందన్నారు. దీంతో ఆలయం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా అన్నారు. ఆలయ
నిర్వహణ పూర్తిగా కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలోనే కొనసాగుతుందని ఇందులో తమకు ఎలాంటి ప్రమేయం ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిడిఎన్ అర్చక సంఘం రాష్ట్ర క్రమశిక్షణ సంఘం కార్యదర్శి కర్నే సాంబయ్య, డిడిఎన్ అర్చక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మహదేవ్,జిల్లా కోశాధికారి సాంబశివుడు, అర్చకులు గురు మూర్తి, చంద్రశేఖర్, రాజు, కోటగుళ్లు పరిరక్షణ కమిటీ గౌరవ అధ్యక్షులు, మామిండ్ల మల్లికార్జున గౌడ్, సభ్యులు నాగపురి శ్రీనివాస్ గౌడ్, రౌతు కిషోర్, గొర్రె ఎల్లయ్య యాదవ్ చిలువేరు ఉదయాకర్, కొయ్యల గౌతమ్ గౌడ్, సామర్ల నాగరాజు, కొయ్యల రమేష్, , తోట నవీన్, బాలాజీ నవీన్, పెద్ది ప్రశాంత్,ఆరెల్లి ఓంకార్, శంకర్ అంజి, పుప్పాల దీపక్, ఆనంద వర్ధన్, నల్లగొండ రాజు , గణేష్ ,వంశీ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version