భూభారతి రైతులకు ఒక వరం.

భూభారతి రైతులకు ఒక వరం

ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ సత్య శారదా

#నెక్కొండ,

నేటి ధాత్రి;

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణిని దరిదాపుల్లో లేకుండా చేసి భూభారతి కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని, ఈ భూభారతి రైతుకు ఒక వరం రైతులు ఈ భూభారతిని సరైన విధంగా వినియోగించుకోవాలని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి బుధవారం అన్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం భూభారతిపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. భూభారతి రికార్డుల్లో తప్పులు సవరణ, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, సెక్షన్ 5, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ, వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్, ఇతర మార్గాల ద్వారా వచ్చిన భూమికి మ్యుటేషన్, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, పట్టాదారు పాసు పుస్తకాలు, ఆపిల్ వ్యవస్థ రివిజన్ అధికారాలు, గ్రామ రెవెన్యూ రికార్డులు, రికార్డుల నకలు పొందడం ఎలా, తదితర అంశాలపై రైతులకు ఒక అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వం ఈ సదస్సు నిర్వహిస్తున్నదని, అధికారులు గ్రామాల్లోని అన్ని వర్గాల ప్రజలకు భూభారతి విధివిధానాల కరపత్రాలు గ్రామాల్లో పంపిణీ చేయాలని, ఆయన అన్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని, 39 గ్రామపంచాయతీలు ఉన్నాయని, మండలంలో మొత్తం విస్తీర్ణం 49,466 ఎకరాల భూమి ఉందని, 33,250 ఎకరాల పట్టా భూములు ఉన్నాయని, అలాగే 6862 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, 25491.36 ఎకరాల భూమికి పట్టాదారు పాస్బుక్కులు ఇప్పటివరకు ప్రభుత్వం సరఫరా చేసిందని,6293 ఎకరాల భూములపై వివాదాస్పదమైన ఆరోపణలతో కేసులు ఉన్నాయని అలాగే 4120, వివిధ కారణాలతో పట్టా భూములకు ఇంకా పట్టాలు ఇవ్వలేదని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్ సత్య శారద దేవి మాట్లాడుతూ గతంలో మాదిరిగా కాకుండా రైతుకు సులభమైన మార్గంలో మీ భూ సమస్యలు పరిష్కారానికై ఈ భూభారతి విధానం వచ్చిందని అన్నారు. నెక్కొండ మండలంలో భూ యజమానులు 15145 ఉన్నారని, 15145 ఖాతా నెంబర్లు కలిగి ఉన్నారని, ఇప్పటివరకు మండలంలో ఆర్ఓఆర్ కంప్యూటర్ లో నిక్షిప్తం అయినావి 15145, ఇవి కాక 6293 పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు ఉన్నాయని ఆమె అన్నారు. కార్యక్రమంలో నర్సంపేట ఆర్డిఓ ఉమారాణి, ఏ డి ఏ దామోదర్ రెడ్డి, నెక్కొండ తహసిల్దార్ వేముల రాజ్ కుమార్, నెక్కొండ ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి నాగరాజు, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి ,నర్సంపేట వ్యవసాయ మార్కెట్ఠ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కీ అశోక్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, పలు గ్రామాల మాజీ సర్పంచ్ ఎంపీటీసీలు మహిళా సంఘ ప్రతినిధులు మహిళ సంఘల మహిళలు, రైతులు, మహిళ రైతులు,లతోపాటు సిఐ సన్నాయిల శ్రీనివాస్, ఎస్ఐ మహేందర్లు, బందోబస్తు నిర్వహించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version