ఈనెల 20న కార్మిక సంఘాల.!

ఈనెల 20న కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ పిలుపు

కరీంనగర్ నేటిధాత్రి:

నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని మే20న కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె జరుగుతుందని దీని జయప్రదంకై జిల్లాలోని సంఘటిత, అసంఘటిత కార్మిక లోకం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ శుక్రవారం పిలుపునిచ్చారు. కరీంనగర్ లోని బైపాస్ రోడ్ లో గల సిమెంట్ గోదాం వద్ద సార్వత్రిక సమ్మె పోస్టర్ ను శుక్రవారం హమాలీ కార్మికులతో ఆవిష్కరించడం జరిగింది. ఈసందర్భంగా బుచ్చన్న యాదవ్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకోండు సంవత్సరాలైనా శ్రమిస్తున్న ప్రజల జీవితాలు మరియు జీవన ఉపాధిపై తన కార్పోరేట్ కుతంత్రాలు అమలు చేయాలని ప్రయత్నిస్తుందని దీనివల్ల దేశంలో పేదరికం, ఆకలి, పోషకాహార లోపం, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నలబై నాలుగు లేబర్ కోడ్లను సంస్కరించి కార్మికుల పని భారoని పెంచారని ఎనిమిది గంటలు ఉన్న పని గంటలకు పన్నేండు గంటలుగా మార్చారని దీనిని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేబర్ కోడులు అనేవి శ్రామిక ప్రజలపై బానిసత్వం విధించే బ్లూ ప్రింట్ లాంటివని సంఘంలోని కార్మికులకు సంబంధించిన అన్ని హక్కులు కార్మికుల నుండి లాక్కుంటున్నారని పని గంటలు, కనీస వేతనాలు, సామాజిక భద్రత పని పరిస్థితులకు సంబంధించిన అన్ని ప్రాథమిక హక్కులను తీవ్రమైన సవాలుగా పరిగణించబడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. యూనియన్ హక్కులు గుర్తింపు సమిష్టి నిరసనల హక్కు బావ వ్యవస్థీకరణ హక్కు తీవ్రమైన సవాలుగా మారాయని కార్పొరేట్ యజమానుల ప్రయోజనాల కోసం శ్రామిక ప్రజలపై బానిసత్వం యొక్క షరతులను విధించే బ్లూప్రింట్ లాంటివని కార్మికులు యూనియన్ నాయకులను నాన్ బెలబుల్ జైలు శిక్షలతో సహా కఠినమైన పోలీస్ చర్యలకు దారితీస్తుందని యజమాన్యానికి లేదా కార్మిక శాఖకు సమిష్టి ఫిర్యాదులను నిరాకరిస్తుందని ఇలాంటి చట్టాలను కార్మిక లోకం వ్యతిరేకించాలన్నారు. అసంఘటిత కార్మికుల జీవన ఉపాధికి సంబంధించిన ప్రాథమిక హక్కులను దూరం చేస్తుందని అందుకని కేంద్ర కార్మిక సంఘాల ఫెడరేషన్లు దేశవ్యాప్త సమ్మెను చేస్తున్నాయని దీని విజయవంతం చేయాలని చార్టర్ ఆఫ్ డిమాండ్స్ తయారుచేసి మే20న దేశవ్యాప్త నిరవధిక సమ్మె నిర్వహించడo జరుగుతుందని దీనిలో ప్రభుత్వ, ప్రవేట్ రంగంలో పనిచేసే కార్మిక లోకం జిల్లా వ్యాప్తంగా భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. ఈపోస్టర్ ఆవిష్కరణలో సిమెంట్ గోదాంహమాలీ అధ్యక్షులు జంగం తిరుపతి ఉపాధ్యక్షులు బాగోతం వీరయ్య, నాయకులు నన్నవేని శ్రీనివాస్, ననవేని కొమరయ్య, పల్లెర్ల రాములు గౌడ్, ముత్యాల శ్రీనివాస్, దానవేని కొమరయ్య, ఉప్పారం శ్రీనివాస్, జక్కుల ఐలయ్య, దొంగల శ్రీనివాస్, బోయిని ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version