గురుకుల కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే రేవూరి
అనంతరం మృతిచెందిన శ్రీవాణి కుటుంబ పరామర్శ
పరకాల నేటిధాత్రి
ఏకు శ్రీవాణి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.
మండలంలోని మల్లక్కపేట గ్రామపరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల వసతి గృహాన్ని శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి గురువారం రోజున సందర్శించారు.
గత మూడు రోజుల క్రితం బాలికల వసతి గృహంలో ఉరివేసుకొని బలవన్మరణం చెందిన ఏకు శ్రీవాణి మృతి గల కారణాలను పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అనుకోని సంఘటన జరగడం బాధాకరమని,పూర్తిస్థాయిలో ఎంక్వయిరీ చేసి లోపాలని గుర్తించి ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండ,ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
అనంతరం శ్రీవాణి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి,వారి కుటుంబసభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కన్నం.
నారాయణ,ఏసీపీ సతీష్ బాబు,తదితరులు పాల్గొన్నారు.