ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి డి వాసంతి అన్నారు. 25-7-2025 రోజున జిల్లా పరి షత్ ఉన్నత పాఠశాల పత్తిపాక కాంప్లెక్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొని వచ్చే విధం గా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హనుమకొం డ జిల్లా సమగ్ర శిక్ష గుణాత్మక విద్య కోఆర్డినేటర్ డాక్టర్ మన్మో హన్,మండలవిద్యాశాఖ అధి కారి భిక్షపతి, ఉన్నత పాఠ శాల ఇన్చార్జి ప్రధానోపా ధ్యాయులు అనిత, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయు లు శ్రీనివాస్,ఆర్ పిలు అం జని, నారాయణ, అశోక్, మనోజ్, సురేందర్, పాఠ శాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను నమ్మి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను కూడా ప్రభుత్వ పాఠశాలలోకి పంపిస్తే డిప్టేషన్ పేరిట ఉపాధ్యాయులను బదిలీ చేయడం సరికాదని నిరసిస్తూ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో 55 మంది విద్యార్థులకు గాను 4 టీచర్లు ఉండగా డిప్టేషన్పై ఇద్దరూ ఉపాధ్యాయులను వేరొక ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మన ఊరు మన బడి అనే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఇప్పుడు ఉపాధ్యాయులను తీసివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉపాధ్యాయులను బదిలీ చేస్తే విద్యార్థుల చదువులు నాశనం చేసినట్లు అవుతుందన్నారు. ఈ విషయమై నిరసిస్తూ గంటపాటు గేటు ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. డిప్టేషన్ నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ధర్నా చూస్తామన్నారు. కార్యక్రమంలో బుర్ర సంతోష్ గౌడ్, అందే సిద్ధ రాములు, మ్యాదరి కుమార్, భూపతి రెడ్డి, బురాని నర్సాగౌడ్, నాగభూషణం తదితరులు ఉన్నారు.
ఎమ్మార్వో కి వినతి పత్రం అందించిన ఉపాధ్యాయుల సంఘం జమ్మికుంట (నేటిధాత్రి) జమ్మికుంట తాసిల్దార్ వెంకటరెడ్డికి కరీంనగర్ జిల్లా డి టి ఎఫ్ అధ్యక్షుడు ఆవాల నరహరి ఉపాధ్యాయులతో కలిసి వినతి పత్రం అందించారు ఉపాధ్యాయులకు రావలసిన మెడికల్ బిల్లులు GPF బిల్లులు క్లియరెన్స్ లు పూర్తి చేయాలని కోరారు ఉపాధ్యాయ సమస్యలపై పోరాట కమిటీ ఆగస్టు 1న అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నా, ఆగస్టు 23న హైదరాబాదులో మహాధర్నా కార్యక్రమంలో చేపడుతున్నట్లు తెలిపారు.
గురుదేవ్ విద్యాలయం నందు ఐఎల్ఎమ్ బెంగళూరు టీచర్స్ చే స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ప్రారంభం
నేటిదాత్రి చర్ల
చర్ల మండల కేంద్రంలోని ప్రముఖ ప్రైవేటు విద్యాసంస్థ అయిన గురుదేవ్ విద్యాలయంలో ఈ విద్యా సంవత్సరం నుండి విద్యార్థులలో ఆంగ్లభాష యందు చక్కని అవగాన కల్పించాలన్న సత్సంకల్పంతో ఆంగ్ల భాషలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించాలనే సదుద్దేశ్యంతో ఎంతో వ్యయంతో కూడుకున్నదే అయినా కూడా ఐఎల్ఎమ్ బెంగుళూరు వారితో ఒప్పందం కుదుర్చుకుని ఐఎల్ఎమ్ బెంగుళూరు వారి ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు ప్రారంభించడమైనదని పత్రికా ప్రకటన ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు ఈ విద్యా సంవత్సరం విద్యార్థినీ విద్యార్థుల కు చక్కని శిక్షణ ఇచ్చుటకు బెంగుళూరు నుండి కుమారి సౌజన్య శిక్షకులుగా నియమించబడ్డారు ఈ రోజు ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు హెచ్ జివి ప్రసాద్ అకడమిక్ కోఆర్డినేటర్స్ ఎంవి సుబ్రహ్మణ్యం జి శ్రీనివాస్ మరియు ఐఎల్ఎమ్ బెంగుళూరు నుండి విచ్చేసిన సందీప్ చేతుల మీదుగా ఉపాధ్యాయినీ ఉపాధ్యాయుల సమక్షం లో లాంఛనంగా ప్రారంభించబడినది ప్రధానోపాధ్యాయులు హెచ్ జివి ప్రసాద్ మాట్లాడుతూ కమ్యూనికేషన్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చుటకు ఎంతో సుదూరాల నుండి వచ్చేసిన కుమారి సౌజన్య సందీప్ కు మరియు మన పాఠశాలకు తమ సహకారాన్ని అందిస్తున్న ఐఎల్ఎమ్ బెంగుళూరు సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు పత్రికా ముఖంగా తెలిపారు
*51 శాతం ఫిట్మెంట్తో ఉద్యోగ ఉపాధ్యాయులకు తక్షణమే పిఆర్సి అమలు చేయాలి*
*డి ఏ లు,జూలై 2023 నుండి అమలు కావలసిన పిఆర్సి ఇంకా పెండింగ్ లోనే….!!*
*ఆర్థికంగా ఎంతో నష్టపోతున్న ఉద్యోగ ఉపాధ్యాయులు.*
*ఉచితాలకు పెద్దపీట వేస్తూ, ఉద్యోగ ఉపాధ్యాయులు కొట్లాడి తెచ్చుకున్న ఆర్థిక హక్కులను కాలురాస్తున్న ప్రభుత్వాలు.*
*కోరి తెచ్చుకున్న ప్రజా ప్రభుత్వం సత్వరమే తగిన చర్యలు గైకొనాలి.*
*తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ మహబూబాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు బాలాష్టి రమేష్ డిమాండ్*
*కేసముద్రం/ నేటి ధాత్రి*
జూలై 2023 సంవత్సరం నుంచి అమలు చేయాల్సిన పిఆర్సిని 51 శాతం ఫిట్మెంట్తో తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ ఫెడరేషన్ మహబూబాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు బాలాస్టి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గురువారం టిపిటిఎఫ్ కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షులు గుండు సురేందర్, ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు ల నేతృత్వంలో కేసముద్రం మండలంలోని వివిధ పాఠశాలలను సందర్శిస్తూ రెండో రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా శాఖ అధ్యక్షులు బాలాష్టి రమేష్ మాట్లాడుతూ డిఏలు, మెడికల్ రీయంబర్స్మెంట్, జిపిఎఫ్ ఉపసంహరణ లతో పాటు 2023 జూలై నుంచి అమలు కావల్సిన పి ఆర్ సి ఇంతవరకు అమలు చేయకపోవడం బాధాకరమని తద్వారా ఉద్యోగ ఉపాధ్యాయులు ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఇవ్వకూడని హామీలు ఇస్తూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ఉచితాల హామీలను నెరవేర్చడానికి నానా తంటాలు పడుతున్నారని, కానీ ఉపాధ్యాయ,ఉద్యోగ వర్గాలకు హక్కుగా ఇవ్వాల్సిన డి ఏలు, పిఆర్సీలు మొదలగు వాటిని ఆమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఏరి కోరీ తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే వీటిని అమలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని, అంతేకాదు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
అనంతరం మండల శాఖ అధ్యక్షులు అధ్యక్షులు గుండు సురేందర్ మాట్లాడుతూ రెండో రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా గురువారం కేసముద్రం స్టేషన్, కేసముద్రం విలేజ్, కస్తూరిబా గాంధీ, మోడల్ స్కూల్, కల్వల తాళ్లపూసపల్లి ఉన్నత పాఠశాలలను, అన్నారం ప్రాథమికొన్నత పాఠశాలలను సందర్శించామని తెలిపారు
ఈ కార్యక్రమంలో మండలశాఖ ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు, జిల్లా శాఖ ఉపాధ్యక్షులు చీకటి వెంకట్రామ్ నర్సయ్య, మండల శాఖ ఉపాధ్యక్షులు ఆంజన్న, కొమ్ము రాజేందర్, కార్యదర్శులు బి విజయ్ చందర్, జీ.మోహనకృష్ణ, బబ్బులు సురేష్ , పి రామారావు తదితరులు పాల్గొన్నారు.
గురువులను సన్మానము చేసిన బిజెపి మహిళా మోర్చా నేతలు
వనపర్తి నేటిదాత్రి :
గురుపౌర్ణిమ సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రం ము ఎన్ టి ఆర్ లలిత కళాతోరణం లో తెలంగాణ బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర పిలుపుమేరకు గురువులను మహిళ మోర్చా నేతలు గురువులు రిటైర్డ్ ఉపాధ్యాయులు శ్రీవెంకటేశ్వర ఆలయ చైర్మన్ అయ్యలూరి రంగనాథచార్యులు విజయకుమార్ శ్రీమతి శ్యామల,
స్వర్ణముకి అకాడమీ చైర్మన్ నాట్యకలా వి నీరజ దేవి లను ఘనంగా సన్మానము చేశారు వారు గురువుల ఆశీర్వాదం తీసున్నారు సన్మానము చేసిన వారిలో తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా కోశాధికారి శ్రీమతి నారాయణదాసు జ్యోతి రమణ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి కవిత మాజీ జిల్లా అధ్యక్షురాలు మహిళా మోర్చా కల్పన మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి సుమిత్రమ్మ, ప్రధాన కార్యదర్శి సుగూరు లక్ష్మి, అర్చన తదితరులు.ఉన్నారు
నర్సంపేట ప్రాజెక్టు పరిధిలోని నల్లబెల్లి మండలంలోని అంగన్వాడి టీచర్లు, ఆయాలు మంగళవారం సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి సమక్షంలో సిఐటియులో చేరారు.ఈ సందర్భంగా కాసు మాధవి మాట్లాడుతూ కార్మికుల మెడపై కత్తిలా వేలాడుతున్న లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కార్మిక వర్గం ఉద్యమిస్తున్న తరుణంలో అంగన్వాడీలు సిఐటియులో చేరడం అభినందనీయమని, పోరాడే శక్తిని పెంచుతుందని, ఉద్యమాలకు ఊతమిస్తుందని తెలిపారు.అంగన్వాడీల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేసి విజయాలు సాధించింది సిఐటియు మాత్రమేనని ఆమె తెలిపారు. రానున్న కాలంలో మరిన్ని విజయాలు సిఐటియు ఆధ్వర్యంలో సాధించడానికి ఈ చేరికలు మరింత బలాన్ని చేకూరుస్తాయని, ఉద్యమ శక్తిని పెంచుతాయని చేరిన అంగన్వాడీలను అభినందించారు.బుదవారం జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అంగన్వాడీలు భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రాజెక్టు ఆఫీసులో సమ్మె నోటీసు అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు హన్మకొండ శ్రీధర్ పాల్గొన్నారు సిఐటియులో చేరిన అంగన్వాడి నాయకుల్లో జాటోత్ సుజాత, పిన్నింటి రజిత, ఉదయ, జమున, భాగ్యమ్మ, సుమలత, కల్పన, శీలాభాయి, ఎండి అస్మత్ తదితరులు ఉన్నారు.
ఉపాధ్యాయుల సమస్యలపై సీఎం తో చర్చిస్తాం ప్రొ.కోదండరాం
మంచిర్యాల నేటి ధాత్రి:
తెలంగాణ ఉద్యమకారుడు,ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మంచిర్యాల జిల్లా రెవిన్యూ డివిజనల్ ఆఫీసుకు విచ్చేసిన సందర్భంగా వారికి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ జి.శ్రీనివాసరావు టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి శుక్రవారం మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి ఘనంగా సన్మానం చేయడం జరిగినది.ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం తో ఉద్యోగ,ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలపై చర్చించారు.ప్రస్తుత స్థితిగతులను,పరిస్థితులను వివరంగా ప్రొఫెసర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.వారు సానుకూలంగా స్పందిస్తూ ప్రత్యేక చొరవ తీసుకొని ఉద్యోగ,ఉపాధ్యాయుల సమస్యలపై ముఖ్యమంత్రి తో చర్చించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శివాజీ,ఆర్డిఓ ఆఫీస్ పరిపాలన అధికారి బి.రామచందర్ రావు,కార్యాలయ సిబ్బంది పద్మశ్రీ,అరుణ,లక్ష్మి ,రవి కిషోర్,జనార్ధన్,సతీష్,మహేందర్,సదయ్య,స్వప్న రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఐదు నెలలుగా అందని జీతాలు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉద్యోగులు.
2008 డిఎస్సి లో సెలెక్ట్ అయి డీ.ఎడ్ రిజర్వేషన్ తో నియామకం నిలుపుదల.
కోర్టు నాశ్రయించిన బాధితులు, ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి పదిహేను సంవత్సరాల సుదీర్ఘ పోరాటం
కోర్టు అనుకూల తీర్పుతో కాంట్రాక్టు ఉద్యోగం ఇచ్చి తీరని అన్యాయం చేసిన ప్రభుత్వం.
ఐదు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం సమంజసం కాదు
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్.
కేసముద్రం/ నేటి దాత్రి
shine junior college
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో నియామకమైన డీఎస్సీ 2008 కాంట్రాక్టు ఉపాధ్యాయులకు నియామకమైన నెల నుండి నేటి వరకు ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదని, తక్షణమే ప్రభుత్వం వారికి జీతాలు చెల్లించేలాగా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ డిమాండ్ చేశారు. కేసముద్రం విలేజ్ ప్రాథమిక పాఠశాలలో భోజన విరామ సమయంలో టి పి టి ఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలిపిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ సంఘ మండల శాఖ అధ్యక్షులు సురేందర్ మాట్లాడుతూ.. డీఎస్సీ 2008లో సెలెక్ట్ అయి,నియామకం పొందే సమయంలో డి.ఎడ్ వారికి 30% రిజర్వేషన్ ఇవ్వాలన్న నిర్ణయంతో ఈ నియామకం ఆగిపోయిందని, ఈ విషయమై ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ప్రభుత్వం వీరికి ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. విధి లేని పరిస్థితుల్లో వీళ్ళు కోర్టు ను ఆశ్రయించి, ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి 15 సంవత్సరాలుగా పోరాటం చేశారని వివరించారు. చివరకు వీరికి అనుకూలంగా కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో వీరిని రెగ్యులర్ ఉపాధ్యాయులుగా కాకుండా కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా నియమించి వారికీ తీరని అన్యాయం చేశారని ఆయన వాపోయారు. ఈ పదిహేను సంవత్సరాలు వారు ఎంతో మనోవేదనకు గురయ్యారని, శారీరకంగా ఆర్థికంగా వారు ఎంతో నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో వీరికి కాంట్రాక్టు ఉద్యోగాన్ని అంటగట్టిన ప్రభుత్వం నియామకమైన ఫిబ్రవరి నెల నుండి నేటి వరకు సుమారు ఐదు నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదని, ఎందుకీ వివక్ష అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వీరంతా ఐదు నెలలుగా తమ విధులు నిర్వర్తిస్తూనే ఉన్నారని, కానీ జీతాలు రాక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకు పోయారని అన్నారు.
ప్రభుత్వం వీరికి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని హితువు పలికారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి వారికి జీతాలు ఇవ్వడానికి అవసరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలని సురేందర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ కార్యదర్శి వీసం నర్సయ్య, ఉపాధ్యాయులు అప్పాల నాగరాజులు పాల్గొన్నారు.
మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాల కోమటి కొండాపూర్ లో ప్రొఫెసర్ “జయశంకర్ బడిబాట “లో భాగంగా FLN LIP దినోత్సవం ఘనంగా జరిగింది.ఈ సందర్బంగా ఉపాధ్యాయులు తయారుచేసిన భోధనాభ్యసన సామాగ్రి(TLM) వివిధ తరగతులలో ఆశించిన అభ్యసన ఫలితాల చార్థులు ప్రదర్శించి,వీటి గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. ఇట్టి ప్రదర్శన విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతు భోధనాభ్యసన సామాగ్రి ఉపాధ్యాయుల భోదన సులభతరం చెయ్యడమే కాకుండా,TLM ద్వారా భోదిస్తే విద్యార్థులు బడి పట్ల ఆకర్షితులై హాజరు శాతం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థులచే గత సంవత్సరం వారు చదివిన కథల, పాఠ్య పుస్తకాలు చదివించి బాగా చదివిన వారికి “నేను బాగా చదువగలను “అనే గుర్తింపు బ్యాడ్జ్ తో అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమం లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ రాధిక, ఉపాధ్యాయులు సుధారాణి, విశాల్, నర్మదా, రాసూరి రాణి, విద్యార్థులు పాల్గొన్నారు.
దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి గ్రామంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్మీడియట్ మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్ (ఎంఎల్టి ) గ్రూపులో తాత్కాలిక పధతిలో విద్యా బోధన చేయడానికి మహిళా విద్యాపకుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు,పాఠశాల ప్రత్యేక అధికారిని మంజుల ఒక సంయుక్త ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ మంజుల మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల కళాశాలలో టిజిసిఆర్టి ఇంగ్లీష్ ఫస్ట్ ఒకటి, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు ఒకటి లకు గాను దరఖాస్తు ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు. ఇంగ్లీష్ పీజీసిఆర్టి పోస్ట్ కు గాను అభ్యర్థి విద్య అర్హత ఎంఏ ఇంగ్లీష్ బీఈడీ అర్హత ఉండాలి, ఎంఎల్టి పోస్ట్ కు గాను ఎండి పాతాలోజి, బీఫార్మసీ, ఎంఎస్సీ జెనెటిక్స్, ఎంబిబిఎస్, బిహెచ్ఎంఎస్, పిజిడి క్లినికల్ బయో కెమిస్ట్రీ అర్హతలు గల అభ్యర్థులు వారి వారి దరఖాస్తులను పాఠశాలకు నేరుగా వచ్చి ఈనెల 14 నుండి 18 తారీకు లోపు దరఖాస్తులు చేసుకోవాలని ఆమె తెలియజేశారు.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం లోని మొగిలిపేట మండల పరిషత్ ప్రైమరీ. పాఠశాల లో విద్యార్థులకు ఉపాధ్యాయలు పుష్ప గుచ్చలు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం లో హెచ్ఎం శ్రీనివాస్ ఉపాధ్యా యులు రాజేందర్, సుమిత్ర దేవి, కృష్ణవేణి, ఆఫీస్ సభర్డినేట్ రాకేష్, అంగన్వాడీ టీచర్ పాల్గొన్నారు.
చిన్న బోనాల, ముష్టిపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీర్చాలి
మాజీ వార్డు కౌన్సిలర్ బోల్గం నాగరాజ్ గౌడ్
సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణ మున్సిపాలిటీ 10వ వార్డు పరిధిలోని చిన్న బోనాల మరియు ముష్టిపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యా బోధన తీవ్రంగా ప్రభావితమవుతోంది. విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయించాలంటూ 10 వార్డ్ మాజీ వార్డు కౌన్సిలర్ బోల్గం నాగరాజ్ గౌడ్ చిన్న బోనాల అమ్మ ఆదర్శపాఠశాల కమిటీ మరియు ముష్టి పెళ్లి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్, DEO, MEO లకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మాజీ వార్డు కౌన్సిలర్ బోల్గం నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ.. చిన్న బోనాల పాఠశాలలో 65 మంది విద్యార్థులకు కేవలం 4 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఉండగా, ఇద్దరు డిప్యూటేషన్‌పై, ఒకరు రిటైర్డ్ అయ్యారు. అలాగే ముష్టిపల్లి ప్రాథమిక పాఠశాలలో 15 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. జీవో నెం.25 ప్రకారం ఈ సంఖ్యకు తగినట్టు అదనపు టీచర్లను నియమించాలి అని ప్రజావాణిలో అధికారులకు తెలిపారు.ఈ వినతిపత్ర సమర్పణలో బండారి భాగ్య, గుగ్గిల లావణ్య లలిత, బి.వినోద్, నరాల లత, సరోజ,అనన్య,లింబ్బవ్వ,సురేష్,మహేష్, బాబు,పరశురాములు, రమేష్, శివ, కుమార్, అనిల్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలల పునఃప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల సర్దుబాటు అనైతికం.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికే ప్రభుత్వం కృషి చేయాలి
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచే బడిబాట కంటే ముందే సర్దుబాటు ఏంటి…..?
ప్రయత్నం చేయకుండానే పాఠశాలల మూసివేతలా…?
ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే కావాలి కానీ ఏదో కారణంతో మూసివేయడం కారాదు.
ప్రభుత్వం ఈ సర్దుబాటు నిర్ణయాన్ని వెంటనే పునః పరిశీలించాలి
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ డిమాండ్.
కేసముద్రం/ నేటి దాత్రి
పాఠశాలల ప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల సర్దుబాటు నిర్ణయం సరికాదని,ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పాఠశాలల పునః ప్రారంభానికి ముందే ఉపాధ్యాయ సర్దుబాటు నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా సురేందర్ మీడియాతో మాట్లాడుతూ…
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని, బడుగు బలహీన వర్గాల పిల్లల అభ్యున్నతే ఈ ప్రభుత్వ లక్ష్యమని ఒకవైపు ప్రకటిస్తూనే మరోవైపు ఆయా వర్గాల పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి ఉపాధ్యాయులను మరొక పాఠశాలలో సర్దుబాటు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు.
ఇటీవలే ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఇచ్చి, పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని,బడిబాటలో అత్యధిక సంఖ్యలో అడ్మిషన్లు చేయాలని సూచించిన ప్రభుత్వం, కనీసం ఉపాధ్యాయులకు ఆ ప్రయత్నం చేసే అవకాశం ఇవ్వకుండానే ఉపాధ్యాయుల సర్దుబాటు నిర్ణయం ప్రకటించడం అనైతికమని విమర్శించారు.
ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం జూన్ 6వ తేదీ నుండి బడిబాట కార్యక్రమం ప్రారంభం అవుతుందని, ఉపాధ్యాయ లోకం కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను అత్యధికంగా చేర్పించాలనే కసితో ఉన్నారని, ఇప్పటికే పలుమార్లు గ్రామాల్లో బడిబాట ర్యాలీలు తీయడం, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించడం కూడా జరిగిందని వివరించారు.
ఎలాగైనా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే సంకల్పం, పట్టుదలతో ఉపాధ్యాయులు ఉన్నారని, చేస్తారని కూడా ధీమా వ్యక్తం చేశారు.
విద్యార్థులను పాఠశాలలో చేర్పించే అసలు బడి బాట కార్యక్రమం ముందే ఉండగా, కనీసం ఉపాధ్యాయులను బడిబాట కార్యక్రమ ప్రయత్నం చేయనివ్వకుండానే కొన్ని పాఠశాలలను మూసివేస్తామనడం, ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తామనడం ప్రభుత్వ దమననీతికి పరాకాష్ట అని దుయ్యబట్టారు. కనీస ప్రయత్నం చేయించకుండానే పాఠశాలలను ఎలా మూసివేస్తారని, ఏ ప్రాతిపదికన ఉపాధ్యాయ సర్దుబాటు చేస్తారని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే కావాలి కానీ పాఠశాలలను ఏదో ఒక కారణంతో మూసివేయడం కారాదు అని సూచించారు.
ఒకవేళ బడిబాట కార్యక్రమ అనంతరం కూడా అడ్మిషన్లలో ఎలాంటి పురోగతి లేనట్లయితే అప్పుడు ప్రభుత్వం తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు.
అంతే కాదు చాలా పాఠశాలల్లో త్రాగు నీటి సౌకర్యం లేదని, కావున ప్రభుత్వం వెంటనే స్పందించి త్రాగునీటి సౌకర్యం కల్పించేలాగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు .
ప్రభుత్వ పాఠశాలలకు పునర్ వైభవం తీసుకొచ్చేలాగా ప్రభుత్వం పనిచేయాలని ఈ సందర్భంగా సురేందర్ డిమాండ్ చేశారు.
విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలి విద్యాశాఖ అధికారి లింగాల కుమారస్వామి
మొగులపల్లి నేటి ధాత్రి
https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని విద్యా ప్రమాణాలు పెంపొందించాలని మండల విద్యాశాఖ అధికారి లింగాల కుమారస్వామి అన్నారు.
శనివారం మండలంలోని మొట్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత ఐదు రోజులుగా నిర్వహించబడుతున్న ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ శిక్షణలో నూతనంగా పరిసరాల విజ్ఞానాన్ని చేర్చడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత మరింతగా పెరుగుతుందన్నారు.
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులకు వివరించి విద్యార్థులు నమోదు పెంచుటకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన కోరారు.
గ్రామ స్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధులను, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, అంగన్వాడి సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో బడిబాట కార్యక్రమం నిర్వహించి విద్యార్థుల సంఖ్య పెంచడానికి భాగస్వాములను చేయాలన్నారు.
విద్యార్థుల తల్లిదండ్రులకు నిర్దిష్టమైన చదువు హామీ ఇచ్చి నెరవేర్చేలా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు.
Students Education Officer
ఉపాధ్యాయులు శిక్షణలో పొందిన విధంగా విద్యార్థులను ఆకట్టుకునేలా, ఆసక్తిని పెంచేలా బోధన ప్రక్రియ కొనసాగాలన్నారు.
అనంతరం బెస్ట్ ప్రాక్టీస్ అవార్డు పొందిన ఉపాధ్యాయులు కోటేశ్వర్లు, సునీతా దేవినీ ఎమ్మార్పీలు వ్యవహరించిన వేణుమాధవ్, నాగరాజు, రామకృష్ణ, రాజ్ కుమార్, స్వామి, రాము, చంద్రయ్యలకు పుష్పగుచ్చం అందించి, శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎం ఆర్ సి సిబ్బంది, మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
#శిక్షణ శిబిరాన్ని సందర్శించిన డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br
సమ సమాజాన్ని నిర్మించే నిర్మాతలు ఉపాధ్యాయులే అని వరంగల్ డీ ఈ వో మామిడి జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో జరుగుతున్న 5 రోజులు ప్రైమరీ ఉపాధ్యాయుల శిక్షణను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు ప్రక్రియ పెంచాలని కోరారు. ఐదు రోజులుగా ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాల గొప్పతనాన్ని గ్రామాల ప్రజలకు వివరించి పిల్లల నమోదును పెంచడానికి ప్రయత్నం చేయాలని అన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నూతన సాంకేతిక విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలని అన్నారు. పాఠశాలల్లో నమోదును ఎలా పెంచాలో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. రానున్న కాలంలో విద్యా రంగంలో మార్పులు రానున్న తరుణంలో ఆ దిశగా బోధనలో మార్పులు తీసుకురావాలని కోరారు. బెస్ట్ టీచర్స్ యొక్క పని విధానాన్ని అందరికీ వివరించారు. వృత్యుంతర శిక్షణను వినియోగించుకోవాలని అన్నారు.
Training Camp.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ అనురాధ,కాంప్లెక్స్ హెచ్ ఎం లు, ఎం ఆర్పిలు, ఎస్ఆర్పీలు, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, ఉపాధ్యాయులు, ఎం ఆర్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని గీతా నగర్ ప్రభుత్వ పాఠశాల నందు ఐదు రోజుల ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినది.
Collector Sandeep Kumar
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఈరోజు గీత నగర్ ప్రభుత్వ పాఠశాల నందు ప్రభుత్వ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థిని, విద్యార్థులను గురించి ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధ్యాయులకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినది.
మండల స్థాయి ప్రభుత్వ పాఠశాలల సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఇన్ సర్వీస్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దుగ్గొండి మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుగ్గొండి మండలం లోని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులకు వేసవి సెలవులలో ఈ నెల 20 నుండి 2025 వరకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాలు దుగ్గొండి మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో నిర్వహించబడునని వివరించారు. శిక్షణా కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందన్నారు.తెలుగు ,ఆంగ్లం, గణితం,పరిసరాల విజ్ఞానం విషయాలలో విద్యా సామర్థ్యంతో పాటు ఎఫ్ఎల్ఎన్ లపై రిసోర్స్ పర్సన్స్ ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఎంఈఓ పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి తెలుగు, ఆంగ్లంలలో చదవడం, రాయడం, గణితంలో చతుర్విధ ప్రక్రియలు సాధించడం, పరిసరాల విజ్ఞానంలో భావనలు నేర్చుకునేలా రాబోయే విద్యా సంవత్సరంలో ప్రతి ఉపాధ్యాయుడు శిక్షణలో నేర్చుకున్న ప్రతి అంశాన్ని తరగతి గదిలో విద్యార్థులకు నేర్పించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే బాలబాలికలు ఫౌండేషన్ లిటరసీలో భాగంగా విద్యాసామర్ధ్యాలను సాధించే విధంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఉంటుందని ఎంఈఓ యస్. వెంకటేశ్వర్లు తెలియజేశారు.
వనపర్తి లో ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్
వనపర్తి నేటిధాత్రి :
జిల్లా కలెక్టర్ శ్రీ ఆదర్శ సురభి మరియు విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ వనపర్తి లో జరుగుతున్న ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ శిబిరాన్ని సందర్శిం చారు. జిల్లా కలెక్టర్ మ్యాథమెటిక్స్ శిక్షణ శిబిరాన్ని సందర్శించి ఉపాధ్యాయులతో గణిత శాస్త్రం యొక్క లోటుపాట్లను చర్చిం చారు. వనపర్తి జిల్లాలో 450 పదవ తరగతి విద్యార్థులు గణిత శాస్త్రములో ఫెయిల్ అయినారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం లోనే వెనుకబడిన విద్యార్థులకు ప్రాథమిక గణిత శాస్త్రం యొక్క పద్ధతులను తార్కిక ఆలోచన పద్ధతులను కాన్సెప్ట్ వారిగా విద్యార్థులకు బోధించాలని సూచించారు. విద్యార్థులు గణిత శాస్త్రంలో తమ ప్రతిభను మెరుగుపరచుకుంటే మిగతా అన్ని సబ్జెక్టులలో గణితశాస్త్ర ప్రభావంతో అన్ని అంశాలలో చురుకుగా విద్యార్థులు ఉంటారని కలెక్టర్ సూచించారు. జిల్లాలో గణిత శాస్త్ర అభివృద్ధి కొరకు విద్యార్థులలో తగు మెలకువలు నేర్పించుట కొరకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతి ఒక్క విద్యార్థి పదవ తరగతిలో ఉత్తీర్ణులు అగుటకు తన వంతు సహాయం చేస్తానని దానికి కొరకు ఉపాధ్యాయులు తగిన సమయం కేటాయించి విద్యార్థులకు గణితశాస్త్రం మెలకువలను నేర్పాలని సూచించినారు. కలెక్టర్ వెంట రీజినల్ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి మేడం జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘనీ గారు పరీక్షల నిర్వహణ విభాగం అధికారి గణేష్ జిల్లా సమన్వయకర్తలు శేఖర్ మహానంది యుగంధర్ సెంటర్ ఇన్చార్జిలు ఆనంద్ గురురాజు గారు జిల్లా రిసోర్స్ పర్సన్స్ లు పాల్గొన్నారు
డీఎస్సీ 2008 ద్వారా కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా నియమితులైన వనపర్తి జిల్లాలోని 34 మంది ఉపాధ్యాయులకు ఇంకా వేతనాలు చెల్లించకపోవడం వల్ల వారు మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నార ని తపస్ జిల్లా నాయకులు ఆవేదన వ్యక్తంచేశారుకావున వెంటనే పాఠశాల విద్యాశాఖ దృష్టికి తీసుకువెళ్లి వారికి వేతనాలు వెంటనే చెల్లించే విధంగా డీఈవో చొరవ తీసుకోవాలని కార్యాలయ సూపరిండెంట్ శ్రీనివాస చారి కి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి వేముల అమరేందర్ రెడ్డి గారు విష్ణువర్ధన్ గారు ఈశ్వర్ గారు జిల్లా మీడియా కన్వీనర్ శశి వర్ధన్ తదితరులు పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.