తాగునీటికి దిక్కులేని పెద్దాసుపత్రి

తాగునీటికి దిక్కులేని పెద్దాసుపత్రి

100 కోట్లు ఖర్చుపెట్టినా బుక్కెడు నీళ్లు లేవు–ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం

ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంఓలకు హెచ్చరిక

బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాణా ప్రతాప్ రెడ్డి ధ్వజం

నర్సంపేట, నేటిధాత్రి:

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో కోట్ల రూపాయలతో జిల్లా పెద్దాస్పత్రి ఏర్పాటు చేస్తే ఇప్పుడు తాగడానికి నీళ్లు లేక దిక్కులేని పరిస్థితికి వచ్చిందని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు. మెడికల్ కాలేజీ, ఆసుపత్రిని 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని చెప్పుకునే ప్రభుత్వాలు చెప్పుకోవడానికే “కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక పోయింది అన్నట్లు ఉందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్క కాటుకు గురై చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న రోగులు తాగడానికి కనీసం బుక్కెడు మంచినీరు లేక ఇబ్బందులు పడుతున్నామని తనతో చెప్పారని తెలిపారు. రోగులకు తాగడానికి తాగునీరు లేని పరిస్థితి ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పూర్తి వైఫల్యమని ఆయన విమర్శించారు. ఆసుపత్రిలో ఉన్న సూపరింటెండెంట్, ఆర్ఎంఓలతో రోగులు పడుతున్న ఇబ్బందులను వివరించి, వెంటనే సంబంధిత అధికారులు దృష్టి పెట్టి మంచినీటి ఏర్పాటు చేయకపోతే తామే స్వయంగా ఏర్పాటు చేస్తామని రాణా ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు.

నాగర్ కర్నూలులో 650 పడకల ఆసుపత్రి నిర్మాణం ప్రారంభం

235 కోట్ల రూపాయలతో మంజూరైన 650 పడకు ఆసుపత్రి నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ

నేటి దాత్రి నాగర్ కర్నూలు జిల్లా

నాగర్ కర్నూలు జిల్లాలో మెడికల్ కాలేజీకి అనుసంధానంగా 10 ఎకరాల స్థలంలో 235 కోట్లతో మంజూరు అయిన 650 పడకల ఆసుపత్రిని ఈరోజు నవ తేజ నిర్మాణ సంస్థ యజమాన్యంతో కలిసి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు
వీలైనంత త్వరగా ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే గారు సంస్థ వారికి సూచించడం జరిగింది ఎక్కడ కూడా పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడకూడదని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే గారు సూచించారు
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణారావు ప్రిన్సిపల్ సంబంధిత అధికారులు పట్టణ మాజీ కౌన్సిలర్ నాయకులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version