ఎంజెపి గురుకుల కళాశాలలో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోనీ వారికి అవకాశం కల్పించాలి

ఎంజెపి గురుకుల కళాశాలలో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోనీ వారికి అవకాశం కల్పించాలి

హన్మకొండ నేటిధాత్రి:

ఎం జె పి ఆర్ సి ఓ రాజ్ కుమార్ ద్వారా ఎం జె పి కార్యదర్శి డాక్టర్ సైదులుకి వినతి పత్రం అందజేత.బిఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కాడాపాక రాజేందర్ బోట్ల నరేష్ మాట్లాడుతూ…

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ మొదటి సంవత్సరం విద్యను అభ్యసించేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ ఎంజేపి గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు.

వేల సంఖ్యలో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోకుండా ఈరోజు నిర్వహించే స్పాట్ కౌన్సిలింగ్ హాజరు కాగా కేవలం ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న వారికే మెరిట్ ప్రకారం అవకాశం కల్పిస్తామని సంబంధిత అధికారులు చెప్పడంతో విద్యార్థులు. 

చాలామంది జ్యోతిరావు పూలే గురుకుల కళాశాలలో అవకాశం రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు.

అదేవిధంగా మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల కళాశాలలో తండ్రి గాని తల్లి గాని కోల్పోయిన విద్యార్థిని విద్యార్థులకు అవకాశం కల్పించాలని మరియు సంచార జాతులకు చెందిన విద్యార్థులకు. 

మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల కళాశాలలో అవకాశం కల్పించి వారినీ ఆదుకోవాల్సిందిగా ఎం జె పి గురుకుల కార్యదర్శి డాక్టర్ సైదులుని కోరారు.

కార్యక్రమంలో విద్యార్థి నాయకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి

సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి..

మందమర్రి నేటి ధాత్రి:

 

సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కళాశాల,సిసిసి-నన్పూర్లో మొదటి సంవత్సరం లో ప్రవేశాల కోసం విద్యార్థులు ధరఖాస్తు చేసుకోవాలని మందమరి ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు కొత్తగూడెం ఎడ్యుకేషనల్ సొసైటి నుండి నోటిఫికేషన్ విడుద లైనట్లు తెలిపారు.
కళాశాలలో మొదటి సంవత్సరం సివిల్ కోర్సులో 60.ఎలక్ట్రిక ల్-ఎలక్ట్రానిక్స్-60, మెకానికల్-60, మైనింగ్-60..మొత్తం 300సీట్లు ఉన్నాయన్నారు. వీటిలో 150 సీట్లను సింగరేణి ఉద్యోగులు, మాజీ ఉద్యోగల పిల్లలకు,150 సీట్లు ఇతరు లకు కేటాయించడం జరుగుతుందన్నారు.
సింగరేణి ఉద్యో గులు, మాజీ ఉద్యోగుల పిల్లలు జులై 3వ తేదీ లోపు సింగరేణి పాలిసెట్ వెబ్సైట్ ద్వారా(https://scp.scpolytechnic.com/online_admission), ఇతరులు తెలంగాణ పాలిసెట్ వెబ్సైట్ (https://tgpolycet.nic.in) ద్వారా..ఈ నెల 24 నుంచి 28 వ తేదీలోపు ఆన్లైన్ ధరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాలకు..సెల్ 9010222161, 8790112515 సంప్రదించండి.

ఈనెల 14 వరకు దరఖాస్తు చేసుకోండి.

ఈనెల 14 వరకు దరఖాస్తు చేసుకోండి.

నిజాంపేట, నేటి ధాత్రి

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాస పథకంలో భాగంగా మండల వ్యాప్తంగా యువత దరఖాస్తు చేసుకోవాలని నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలో మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ వికాస పథకానికి ఈ నెల 14 వరకు గడువును పొడిగించిందని అర్హత గల ప్రతి ఒక్కరూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పట్టణ అధ్యక్షుడు నజీరుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి పంజా మహేందర్, ఎం ఎస్ ఎస్ మండల అధ్యక్షులువెంకట్ గౌడ్, జాల శ్రీకాంత్ లు ఉన్నారు.

పెండింగ్ ఉన్న బిపిఎస్ ఎల్ఆర్ఎస్ కి దరఖాస్తు చేసుకోండి.

*కమిషనర్ ఎన్.మౌర్య.

తిరుపతి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 08:

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో పెండింగ్ లో ఉన్న బి.పి.ఎస్., ఎల్.ఆర్.ఎస్.కి దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ ఎన్.మౌర్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2019 వ సంవత్సరంలో దరఖాస్తు సమర్పించి ఇప్పటికీ క్రమబద్దీకరణ కాకుండా పెండింగ్ లో ఉన్న అర్జేదారులకు మార్చి 31 వ తేదీవరకు మరో అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే 2020వ సంవత్సరంలో ప్రభుత్వం జారీచేసిన లేఔట్ రేగులరైజేషన్ స్కీం-2020 నందు అనుమతిలేని లేఔట్లు, ప్లాట్లు కమబద్ధీకరించుకోవడానికి మరో అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. భవనాలు క్రమబద్ధీకరించుకోవడం వలన ప్రత్యేకంగా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందవలసిన అవసరము లేదని, భవిష్యత్తులో భవన నిర్మాణ ఫీజు లో మినహాయింపు ఉంటుందని, ఆస్తిపన్ను పై ఎటువంటి పెనాల్టీ ఉండదని తెలిపారు. ఎల్.ఆర్.ఎస్. ను 2007 తరువాత తిరిగి అమలులోకి తేవడం.జరిగిందని అన్నారు. లేఔట్ల, ఫ్లాట్లు క్రమబద్ధీకరించుకోవడం వలన 14శాతం ఓపెన్ స్పేస్ చార్జీలు మినహాయింపు ఉంటుందని, పీనల్ చార్జీల నుండి మినహాయింపు ఉంటుందని, రోడ్డు మరియు యాజమాన్య హక్కులు ద్రువీకరించబడతాయని తెలిపారు.కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ ఆ ప్రకటనలో తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version