ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి..

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

https://youtu.be/NoviIp1TUK4?si=EohsYI-9HsxUTNf_

 

 

ప్రభుత్వ ఆసుపత్రులు,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.మంగళవారం జిల్లాలోని లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి సరోజ తో కలిసి సందర్శించి వార్డులు,రిజిస్టర్లు, మందుల నిల్వలు,పరిసరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు.ఎండాకాలం దృష్ట్యా పాటించవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.వైద్యులు,సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని,ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని,ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.వెంకట్రావుపేట, దౌడపల్లి,చందారం గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ,ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా పట్టాలని,ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలని, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.గృహాలు, వ్యాపార సముదాయాల వద్ద చెత్తను రోడ్లపై,మురుగు కాలువలలో వేయకూడదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇండ్లు పొందిన లబ్ధిదారులు నిబంధనల ప్రకారం నిర్మించుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని,నిర్మాణ పనులను వేగవంతం చేయాలని తెలిపారు.లక్షట్టిపేట మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అమృత్ పథకం నీటి ట్యాంకుల నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ తో కలిసి పరిశీలించి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.రానున్న వేసవిలో ప్రజలకు నిరంతరంగా నీటిని అందించే విధంగా కార్యచరణ రూపొందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version