కోటగుళ్ళు గోశాల గోమాతలకు దానా బస్తాల వితరణ.

కోటగుళ్ళు గోశాల గోమాతలకు దానా బస్తాల వితరణ

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లు గోశాల గోమాతలకు గణపురం మండల కేంద్రానికి చెందిన పెద్దపల్లి విరాట్ చారి రమాదేవి ల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం దాన బస్తాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు గోశాల గోమాతలకు దానా బస్తాలు అందజేసిన దంపతులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ .!

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి :

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కళ్యాణ లక్ష్మి. షాది ముబారక్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది… సందర్భంగా మాట్లాడుతూ. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పలు గ్రామాలకు. సంబంధించి లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాది ముబారక్. చెక్కులను తంగళ్ళపల్లి మండల కేంద్రంలో. స్థానిక మార్కండేయ భవన్ లో ఏర్పాటుచేసిన. దానిలో భాగంగా మండలంలో పలు గ్రామాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి . షాది ముబారక్. చెక్కుల పంపిణీలను. స్థానిక. ప్రభుత్వ ఆదేశాల మేరకు. తంగళ్ళపల్లి ఎమ్మార్వో సంబంధిత అధికారుల. చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా. కొంచెం ఆలస్యం.అయిన అర్హులందరికీ. రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా కళ్యాణ్ లక్ష్మి. షాదీ ముబారక్. చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు చెక్కులు అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. తంగళ్ళపల్లి. ఎమ్మార్వో . జయత్ కుమార్. జిల్లా గ్రంధాల చైర్మన్ నాగుల సత్య నారాయణ గౌడ్. సిరిసిల్ల ఏఎంసి. చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతిరెడ్డి. వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగం గౌడ్. మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరాల శ్రీనివాస్ యాదవ్. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మండల చెక్కుల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.

సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.

చిట్యాల  నేటిధాత్రి :

 

 

జయశంకర్ జిల్లా చిట్యాల మండలం గోపాలపురం గ్రామానికి చెందిన తిప్పని లక్ష్మి మరియు తీర్తాల సుస్మిత కి హస్పెటల్ ఖర్చుల కొరకు నాయకుడు పేదలకు ఆధర్షవంతుడు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సహయనిధి(సీఎం ఆర్ఎఫ్ )Rs. 52000/ల చెక్కులను చిట్యాల మండల కాంగ్రేస్ పార్టీ వర్క్ంగ్ ప్రెసిడెంట్ మూల శంకర్ గౌడ్,అదజేయడం జరిగింది . ఈ కార్యక్రమం లోపిఎసియస్ వైస్ చైర్మెన్ ఏరుకొండ గణపతి గ్రామ శాఖ అధ్యక్షులు నీలం కుమార స్వామి నా యకులు తాటి కంటి మల్లయ్య, చెవుల రమేశ్, సంపెల్లి రాజు తదితరులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.

‘రైతులకు ట్రాన్స్ ఫార్మర్ల పంపిణీ’

‘రైతులకు ట్రాన్స్ ఫార్మర్ల పంపిణీ’

దేవరకద్ర /నేటి ధాత్రి :

 

 

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలంలోని జానంపేట గ్రామంలో ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి మంగళవారం అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్ మండలాలకు చెందిన 67 మంది రైతులకు నూతన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉండి లో వోల్టేజీ సమస్యను తీర్చలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు నూతన విద్యుత్ ట్రాన్స్ ఫార్మార్లను అందజేస్తున్నమన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో ఏ ఒక్క రైతుకు లో వోల్టేజీ సమస్యతో బాధపడకుండా.. పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

గ్రామంలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.

గ్రామంలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాష్ట్రంలోని పేద ప్రజలకు వైద్యం చేయించుకుని పరిస్థితులు ఉన్నవారికి కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలియజేస్తూ. పేద ప్రజలకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముందంజలో ఉంచుతున్నారని తెలియజేశారు. ఇట్టి చెక్కులను. కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల మీదుగా అందజేశారు ఇందులో లబ్ధిదారులైన. అంబటి లక్ష్మమ్మకు 60000 రూపాయలు. మునిగే మహేందర్ కు 55 వేల రూపాయలు. బి మల్లయ్యకు. 11,500 రూపాయలు. చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి చెక్కులు రావడానికి కృషిచేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి. సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి మండల అధ్యక్షులు ప్రవీణ్ కి. ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మాకు చెక్కులు రావడానికి కృషి చేసినందుకు లబ్ధిదారులందరూ ధన్యవాదాలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కడారి సునీల్ రెడ్డి. సీనియర్ నాయకులు కూతురి రాజు. కుండ వేణి కిషన్. రవి. మీరాల శ్రీనివాస్ యాదవ్. ఎడ్ల ప్రేమ్ కుమార్. జంగం సత్తయ్య. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ…

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణ కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతని ఇస్తుందని తెలియజేస్తూ .నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయనిది ఒక వరంలో మారాయని కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని పేదలకు సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తుంది అని తెలియజేస్తూ లక్ష్మి పూర్ గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుడు చందు ఆధ్వర్యంలో 45 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది ఇట్టి చెక్కులు రావడానికి కృషిచేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి ఆది శ్రీనివాస్ కి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు చెక్కులు రావడానికిసహకరించిన పెద్దలందరికీ లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ ఆరెపల్లి బాలు మునిగే ప్రభాకర్ నందగిరి ఆంజనేయులు మహేష్ తక్కల్ల ఆంజనేయులు గణేష్ తదితరులు పాల్గొన్నారు

అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో.!

అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వీధి సౌర కాంతి సామాగ్రి పంపిణీ

జైపూర్,నేటి ధాత్రి:

 

 

జైపూర్ మండలం లోని కాన్కుర్ గ్రామంలో తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ(టీజీ ఎఫ్ డీసీ) ఆధ్వర్యంలో మంగళవారం వీధి సౌర కాంతి సామాగ్రి పంపిణీ కార్యక్రమం జరిగింది.అటవీ అభివృద్ధి సంస్థ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కార్పొరేట్ సామాజిక భాద్యత (సి. ఎస్. ఆర్ ) కింద ముప్పై ఆరు వేల విలువ చేసే వీధి సౌర కాంతి సామాగ్రి ని డివిజనల్ మేనేజర్ శ్రీశ్రావణి చేతుల మీదుగా గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉపేందర్ కు అందజేశారు.ఈ సందర్బంగా శ్రీశ్రావణి మాట్లాడుతూ జైపూర్ మండలంలోని కాన్కుర్, ముదిగుంట అటవీ ప్రాంతాల్లో టీజీ ఎఫ్ డీసీ ఆధ్వర్యంలో నీలగిరి ప్లాంటేషన్ లను పెంచుతూ పర్యావరణ పరిరక్షణ తో పాటు స్థానికులకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. గ్రామాలకు తమ వంతు సేవ చేయాలనే ఉద్దేశ్యం తో సి. ఎస్. ఆర్ కింద టీజీ ఎఫ్ డీసీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమం లో టీజీ ఎఫ్ డీసీ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్, ఫీల్డ్ సూపర్ వైసర్ లు రాజేష్, శ్రీనివాస్,వాచర్ లు శంకర్,సాయికిరణ్,ఓదెలు, రాకేష్,సిబ్బంది షాహిద్, సంజీవ్ లు పాల్గొన్నారు.

ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ.

ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ

పరకాల నేటిధాత్రి

పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో వేసవికాలం దృష్టిలో ఉంచుకొని అక్షయ తృతీయ సందర్భంగా డిపో మేనేజర్ రవిచంద్ర తో పాటు అరుణ ఫర్టిలైజర్ యజమాని మాజీ ఛైర్మెన్ శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం గందె వెంకటేశ్వర్లు,సంజయ్ మెడికల్ స్టోర్ యజమాని సంజయ్,గంగా వాటర్ ప్లాంట్ యజమాని లక్ష్మణ్ లు ప్రారంభించి మజ్జిగ ప్యాకెట్లు ప్రయాణికులకు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో సిబ్బంది,ప్రయాణికులు, తదితరులు పాల్గొన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ..

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

నిజాంపేట, నేటిధాత్రి

 

 

 

ఈ మెదక్ జిల్లా నిజాంపేట మండలం పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన ముచ్చర్ల కల్పన రూ.54 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గ్రామ కాంగ్రెస్ నాయకులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఒక వరo మని అన్నారు .అలాగే ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

తంగళ్ళపల్లి మండలం సారం పెళ్లి గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మునిగే రాజు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల మీదుగా సారంపల్లి గ్రామానికి చెందిన కోల అనిత లక్ష్మణ్ కి 14,500 రూపాయల చెక్కుల పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరుపేద కుటుంబాలు అత్యవసర సమయంలో వైద్యం చేయించుకోలేని పరిస్థితులు ఉన్న వారికి సీఎంఆర్ఎఫ్ ఎంతగానో అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల దృష్టిలో ఉంచుకొని ఎన్నో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్టి చెక్కులు.రావడానికి కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ కి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ కి నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ కి కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులు కోల అనిత లక్ష్మణ్ కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ళ భరత్ గౌడ్ సుంచుల కిషన్ గడ్డమీద శ్రీనివాస్ సిరిసిల్ల దేవదాస్ కున వేణి వినోద్ కోల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…

సీఎంఆర్ఎఫ్.చెక్కుల పంపిణీ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నక్క రవి ఆధ్వర్యంలో సీఎంఆర్ ఎఫ్. చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యవసర సమయంలో వైద్యం చేయించు కో లేని పరిస్థితులు ఉన్న ప్రజలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందని ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఇటువంటి మహత్తర అవకాశాలను తీసుకొచ్చిన ప్రభుత్వాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తర్వాత లబ్ధిదారులకు జగ్గాన్ని సాహితి మహేష్కి.. 60000. పన్యాల స్వాతిక మహిపాల్ కి. 21. వేల. రూపాయల చెక్కులను అందజేశారు. మాకు ఇట్టి చెక్కులు రావడానికి కృషి చేసిన వారందరికీ లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ బండి దేవదాస్ మాజీ ఎంపిటిసి బస్సు స్వప్న లింగం. మాజీ సర్పంచ్ తంగళ్ళపల్లి దేవయ్య రాగి పెళ్లి కృష్ణారెడ్డి. గుర్రం కిషన్ గౌడ్. తంగళ్ళపల్లి మహేష్ .పెద్ది రఘు .పెద్ది పరిసరాములు .రాము అమర గొండ ప్రశాంత్. ప్రభుదాస్ పెద్దిరాజు .తదితరులు పాల్గొన్నారు

ఇందిరమ్మ ఇళ్లు శంకుస్థాపన, కళ్యాణ లక్ష్మి పంపిణీ.!

ఇందిరమ్మ ఇళ్లు శంకుస్థాపన, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ

పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకున్న లింగగూడెం గ్రామ పంచాయతీ కేంద్రంలో మంగళవారం ఇందిరమ్మ ఇల్లులు శంకుస్థాపన చేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు . ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇల్లు ఇపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం కూడా అందరూ వినియోగించుకోవాలని యువత కు చాలా ఉపయోగ కరమయిన పథకం అని తెలియజేసారు. ఈ మధ్య ప్రవేశ పెట్టిన భూ భారతి పథకం ద్వారా ఎలాంటి భూమి సమస్యలు ఉన్న పరుష్కరించ పడతాయని పూర్వం ఉన్న ధరణి పథకం ద్వారా అనేక మంది ప్రజలు ఇబందులు పడ్డారని భూభారతి ద్వారా అలాంటి సమస్యలన్నీ పరిష్కారం దొరుకుతుంది అని ఏ సమస్య ఉన్న ఎమ్మార్యో ని సంప్రదించండి అని తెలియజేసారు. నన్ను గెలిపించినందుకు అనుక్షణం మీ కోసం పని చేస్తానని ఎలాంటి సమస్య ఉన్న నన్ను సంప్రదించండి అని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్న లింగగూడెం గ్రామ పంచాయతీ రాష్ట్రానికే మార్గదర్శకంగా నిలవాలని అధికారులు కూడా అందుకు అనుకూలంగా పని చేయాలనీ ఆదేశాలిచారు. అనంతరం కళ్యాణి లక్ష్మి అర్హులైన వారికి మొత్తంగా రు.27,03132 (ఇరవై ఏడు లక్షల మూడు వేల నూట ముప్పై రెండు రూపాయలు ) అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొడెం ముత్యమాచారి, పిఎస్ఆర్,పీవీఆర్ యువసేన కో-ఆర్డినేటర్ ఎస్కె ఖదీర్, మాజీ ఎంపీపీ చాట్ల పద్మ, ఏఏంసి డైరెక్టర్ ఊకె బుచ్చయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దార అశోక్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సీతారాముల కళ్యాణ తలంబ్రాలు పంపిణీ.

సీతారాముల కళ్యాణ తలంబ్రాలు పంపిణీ

నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ

నర్సంపేట,నేటిధాత్రి:

 

భద్రాద్రి శ్రీ సీతారాములు కళ్యాణ తలంబ్రాలు ముందస్తుగా బుకింగ్ చేసుకున్న డిపో ఉద్యోగులు, సీతా రాముల భక్తులకు నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ శనివారం ఆర్టీసి డిపో వద్ద తలంబ్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిఎం మాట్లాడుతూ సీతా రాముల కళ్యాణం ప్రత్యక్షంగా చూడలేకపోయినా భక్తులకు తలంబ్రాలు, ముత్యాలు, బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించిన ఆర్టీసీ ఎం.డి సజ్జనార్ , దేవాదాయశాఖ ధన్యవాదములు తెలిపారు. పవిత్ర శుభాకార్యలకు ఈ తలంబ్రాలు అక్షింతలుగా ఉపయోగ పడతాయని పేర్కొన్నారు. బుకింగ్ ఏజెంట్లుగా చేసిన డిపో ఉద్యోగులు కార్గో మార్కెటింగ్ ఎగ్సిగీటివ్ నరేందర్,రవీందర్, రాంబాబు, పుష్పలీల, ఎడిసి నారాయణలను అభినందించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ ప్రభాకర్జ్ ఆఫీస్ స్టాఫ్ వెంకటరెడ్డి శ్రీను,కిషోర్, ఎస్డిఐ వెంకటేశ్వర్లు, బాబు, డిపో ఉద్యోగులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పూజ సందర్భంగా అన్న ప్రసాద వితరణలో పాల్గొన్న.!

వీరాంజనేయ మండల పూజ సందర్భంగా అన్న ప్రసాద వితరణలో పాల్గొన్న మాజీ మంత్రి

సతీమణి సింగిరెడ్డి.వాసంతి

వనపర్తి నేటిదాత్రి :

 

 

వనపర్తి జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ సందర్భంగా పాతబజార్ వీరాంజనేయ స్వామి దేవస్థానం పునర్ణిర్మానం లో భాగంగా 45రోజులు మండల పూజ, గణపతి హోమం కార్యక్రమం నిర్వహించారు
వనపర్తి జిల్లా అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం గుడి పునర్నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకవచ్చారు
ఈ సందర్బంగా పూజ కార్యక్రమం లో పాల్గొన్న మాజీ మంత్రి సతీమణి సింగిరెడ్డి వాసంతి ని ఆలయ నిర్వాహకులు సన్మానించారు, అన్న ప్రసాద వితరణ చేసి భక్తుల తో పాటు స్వీకరించారు
ఆలయ నిర్వాహకులు నీలస్వామి, ఎర్రశ్రీను గణేష్ వాకింగ్ టీమ్ అధ్యక్షులు. గోనూరు వెంకటయ్య, బాలస్వామి,సూర్యావంశం గిరి, మెహన్, సునీల్ వాల్మీకి, శివ లక్ష్మణ్ గౌడ్, బాలరాజు, రాజు, రవి, జస్వంత్ వాల్మీకి, ఇమ్రాన్, మునికుమార్, అలీం మరియు ముఖ్యులు పాల్గొన్నారు.

సన్న బియ్యం పంపిణీ.

సన్న బియ్యం పంపిణీ. 

నిజాంపేట, నేటి ధాత్రి

 

మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు ఆధ్వర్యంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ ఉచిత సన్న బియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని, ఈపథకం ద్వారా రైతుల కష్టానికి గౌరవాన్ని కల్పించడంతో పాటు, పేద ప్రజలకు పోషకాహారాన్ని అందించడమే ఈపథకం యొక్క ఉద్దేశమన్నారు. ఈ పథకాన్ని అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మా గౌడ్ ,రహీం, రజిని, పోచవ్వ, బాలవ్వ తదితరులు పాల్గొన్నారు

సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయం.!

సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయం. చౌకగా ప్రభుత్వ సన్నబియ్యం పేదలకు పంపిణి

ఎస్సి సేల్ మండల అధ్యక్షులు ఓనపాకల ప్రసాద్

మొగులపల్లి ఏప్రిల్ 4 నేటి ధాత్రి

మండలంలోని ములకలపల్లి గ్రామంలోని చౌక ధరల దుకాణంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశాలతో. కాంగ్రెస్ పార్టీ మొగులపల్లి మండల కమిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఓనపాకల ప్రసాద్. రేషన్ షాపులో అర్హులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. చౌక ధరల దుకాణం నుండి చౌకగా పేదల ఇండ్లకు చేరిన సంపన్నుల సన్నబియ్యమని ఓనపాకాల ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో. చౌక ధరల దుకాణం ద్వారా నాసిరకం దొడ్డు బియ్యం సరఫరా జరిగేదని ఆ బియ్యాన్ని ప్రజలు ఎవరు కూడా తినేవారు కాదని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతుల ద్వారా సన్న వడ్లను కొనుగోలు చేసి క్వింటాకు 500 బోనస్ ఇవ్వడంతో పాటు రేషన్ కార్డు దారులు అందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని అన్నారు ముఖ్యమంత్రి అన్న మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రైతుల వద్ద సన్న ధాన్యాన్ని 500 బోనస్ చెల్లించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మర ఆడించి రాష్ట్రంలోని చౌక దరల దుకాణం ద్వారా అర్హులైన వారికి 6 కిలోల చొప్పున1.81.686 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రతినెల ప్రభుత్వం ద్వారా సరఫరా జరగనుందని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి సన్న బియ్యం పంపిణీ చేస్తుందని రేషన్ డీలర్లు పౌరసరఫరాల రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో. సన్న బియ్యం సంక్షేమ పథకాన్ని విజయవంతం చేయాలని అధికారులను వేడుకున్నారు. సన్న బియ్యం పంపిణిలో డీలర్లతో పాటు ప్రజలు పాల్గొన్నారు.

రేషన్ షాప్ లో సన్నబియ్యం పంపిణి.

రేషన్ షాప్ లో సన్నబియ్యం పంపిణి

గంగారం, నేటిధాత్రి:

 

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పునుగోండ్ల గ్రామం లో డీలర్ ఒక కొత్త ప్రచారం చేస్తున్నాడు రేషన్ షాప్ లో సన్నబియ్యం వచ్చాయని సాయంత్రం సమయంలో గ్రామం లో డప్పు సాటింపు చేపించి మరి బియ్యం పంపిణి చేస్తున్నారు ప్రజలు ఉదయమే రేషన్ షాపు కు వస్తున్నారని రేషన్ కార్డు లబ్ధిదారులందరికి సన్నబియ్యం పంపిణి చేయడం జరుగుతుందని..
అన్నారు,,,,

సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చారిత్రాత్మక నిర్ణయం.

పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చారిత్రాత్మక నిర్ణయం:ఎమ్మెల్యే కడియం
దేశంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం
చిల్పూర్(జనగాం)నేటి ధాత్రి

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఓ చారిత్రాత్మక నిర్ణయం అని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.చిల్పూర్ మండలంలోని శ్రీపతి పెళ్లి, మల్కాపూర్, చిన్న పెండ్యాల గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై రేషన్ కార్డుదారులకు శుక్రవారం సన్న బియ్యం పంపిణీ చేసి కార్యక్రమం ప్రారంభించారు.అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ఈ సందర్భంగా మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని దళారులకు అమ్ముకోవద్దని సూచించారు.రాష్ట్రంలో పెద్దవాళ్లు, పేదవాళ్లు అనే తేడా లేకుండా అందరూ ఒకే రకమైన అన్నం తినాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.

Sanna Rice

 

ఆనాడు 2 రూపాయలకు కిలో బియ్యం ఇచ్చి ఎన్టీ రామారావు ఎలా గుర్తుండిపోయారో ఈ రోజు సన్న బియ్యం పంపిణీ చెస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పేరు కూడా అదే స్థాయిలో గుర్తిండిపోతుందని అన్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన దొడ్డు బియ్యం అక్రమ మార్గల్లో రాష్ట్రం దాటి, దేశం దాటి పోతున్న నేపథ్యంలో ప్రభుత్వం అందించే బియ్యం పేదల కడుపు నింపాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతీ కుటుంబానికి ఒక్కరికీ 6కిలోల చొప్పున ఉచిత సన్న బియ్యం పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసం తెలంగాణ ప్రభుత్వం చేసిందని అన్నారు.సన్న బియ్యం పంపిణీ లో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పంపిణీ జరగాలని ప్రభుత్వం అందించే సన్న బియ్యంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వచ్చే వర్షాకాలంలోపు మల్లన్న గండి లిఫ్ట్ పనులను పూర్తి చేసి చిల్పూర్ మండలానికి సాగునీరు అందించే బాధ్యతనాదని హామీ ఇచ్చారు.నియోజకవర్గ అభివృద్ధిని గత పాలకులు పట్టించుకోలేదని అన్నారు. తాను ఎమ్మెల్యే గా ఎన్నికైన నాటి నుండి ప్రతీ రోజు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నాని వెల్లడించారు.ఎన్నికల సమయం లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కాలువల వెంట తిరుగుతూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ కాలువల నిర్మాణం, పూడికతీత, చెట్ల తొలగింపు వంటి పనులను వేగవంతం చేసి పంటలకు సాగు నీరు అందించే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. మరో ఏడాది కాలంలో నియోజకవర్గం లోని ప్రతీ ఎకరానికి సాగు నీరు అందించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్దే నా ఏకైక ఎజెండా అని, నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే వరకు విశ్రమించనని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు,నాయకులు,మండల రేషన్ డీలర్లు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ.

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నక్క రవి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తూ గ్రామంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇందులో సల్లూరి ప్రతిమ ఆంజనేయులుకు 9 వేల రూపాయలు లింగంపల్లి రాజు భూమయ్యకు తొమ్మిది వేల రూపాయలు బాజా రమ్యకు 15వేల రూపాయలు తంగళ్ళపల్లి ప్రమీలకు 15 రూపాయలు చెక్కుల పంపిణీ చేయడం జరిగింది ఇట్టి చెక్కులు రావడానికి కృషిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా మంత్రులకు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి కి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తేజ మహేందర్ రెడ్డి కి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ బండి దేవదాస్ మాజీ ఎంపిటిసి స్వప్న లింగం రాగి పెళ్లి కృష్ణారెడ్డి పోతరాజు కొండయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు

సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయం.

వర్ధన్నపేట మండలంలోని,కడారిగూడెం గ్రామ రేషన్ షాప్స్ నందు సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిన…వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య

తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకం నిరుపేదల ఆత్మగౌరవ పథకంగా చరిత్రలో నిలిచిపోతుంది.

దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం పంపిణీ చేయడం లేదు.

సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయం

–ఏఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య.

వర్దన్నపేట (నేటిదాత్రి ):

 

 

 

ఈరోజు…వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండలంలోని కడారిగూడెంలో దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇచ్చే సన్న బియ్యం పంపిణీని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య గారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య గారు మాట్లాడుతూ…గౌరవనీయులు పెద్దలు వర్ధన్నపేట శాసనసభ్యులు కె.ఆర్.నాగరాజు ఆదేశానుసారం వారు కల్పించిన అవకాశం మేరకు ఈరోజు కడారిగూడెంలో రేషన్ షాప్ నందు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు.

రాష్ట్రంలో నిరుపేదల ఆకలి తీర్చేందుకు దేశంలోనే మొట్ట మొదటిసారిగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నందున సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుందని తెలిపారు.

తెల్ల రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యం పంపిణిలో జరుగుతున్న అవినీతి అక్రమాలను అరికట్టాలని అలాగే పేద ప్రజల కడుపు నింపాలనే ఉద్దేశ్యంతో పేద ప్రజలకు రేషన్ షాప్ ల ద్వారా ఉచితంగా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చరిత్రత్మాకమని కొనియాడారు.

ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందని వెల్లడించారు. దేశంలో మరే రాష్ట్రంలో కూడా సన్న బియ్యం పంపిణీ జరగడం లేదని పేర్కొన్నారు.

ఇంత గొప్ప పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి గారిని మర్చిపోకూడదని అన్నారు.

రాష్ట్ర ప్రజలందరి ఆదరణ, ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వంపై ఎల్లవేళలా ఉండాలని కోరారు. సన్న బియ్యం పంపిణీలో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా, సజావుగా సన్న బియ్యం పంపిణీ జరిగే విధంగా అధికారుల పర్యవేక్షణ ఉండాలని అధికారులను కోరుతున్నానన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పింగిలి రాజ్ మల్లారెడ్డి, నాయకులు, వంగాల రామచంద్రా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నాంపెల్లి రవీందర్,కాంగ్రెస్ పార్టీ మహిళా మండల నాయకురాలు తీగల సునీత గౌడ్, కుందూరు యాకూబ్ రెడ్డి,ఏలపాటి పెద్ద తిరుపతి రెడ్డి కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version