సిరిసిల్ల 9వ వార్డు రేషన్ షాప్ లో సన్న బియ్యం పంపిణి.

సిరిసిల్ల 9వ వార్డు రేషన్ షాప్ లో సన్న బియ్యం పంపిణి

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

సిరిసిల్ల పట్టణం 9వ వార్డు (సర్ధాపూర్, జెగ్గరావుపల్లె) లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి గారు గంభీరావుపేట ప్రశాంత్ గౌడ్ గారు.

 

Ration shop.

బాలకీస్టాయ్య, యాదయ్యా,రాజనర్సు,కనకయ్య,రాములు,ఉపేందర్, షాధుల్, అంజయ్య, తిరుపతి, మోఫిక్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వనికి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పారు..

సన్న బియ్యం పంపిణిని ప్రారంభం.

సన్న బియ్యం పంపిణిని ప్రారంభం

గంగారం, నేటిదాత్రి:

 

గంగారం మండలం కోమట్ల గూడెం గ్రామంలోని రేషన్ దుకాణంలో ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉచిత సన్న బియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని, ఈపథకం ద్వారా రైతుల కష్టానికి సన్న వడ్ల కు క్వింటకు 500 రూపాయల బోనస్ కల్పిస్తూ వారికీ గౌరవాన్ని కల్పించడంతో పాటు, పేద ప్రజలకు పోషకాహారాన్ని అందించడమే ఈపథకం యొక్క ఉద్దేశమన్నారు. ఈ పథకాన్ని అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఈసం రమ, కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు మంకిడి విజయ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామప్రజలు,మహిళా లు తదితరులు పాల్గొన్నారు…

సన్న బియ్యం పంపిణిని ప్రారంభించిన AMC చైర్మన్.

సన్న బియ్యం పంపిణిని ప్రారంభించిన ఏఎంసి చైర్మన్

రామడుగు, నేటిదాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని రేషన్ దుకాణంలో ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గోపాల్రావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల తిరుపతి గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఎఏంసి చైర్మన్ మాట్లాడుతూ ఉచిత సన్న బియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని, ఈపథకం ద్వారా రైతుల కష్టానికి గౌరవాన్ని కల్పించడంతో పాటు, పేద ప్రజలకు పోషకాహారాన్ని అందించడమే ఈపథకం యొక్క ఉద్దేశమన్నారు. ఈ పథకాన్ని అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ పిండి సత్యం, రేషన్ డీలర్ నార్ల మంగ రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

పేదలకు సన్న బియ్యం పంపిణి.

పేదలకు సన్న బియ్యం పంపిణి

నాగర్ కర్నూల్/నేటి దాత్రి:

Distribution of fine rice to the poor

బిజనేపల్లి మండలం కేంద్రం, మంగనూర్ గ్రామంలో ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నాగర్ కర్నూల్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గురువారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పథకాన్ని లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తీసుకొస్తున్నామన్నారు. అందులో భాగంగా, ఉచిత సన్న బియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వచ్చింది” అని తెలిపారు. రైతుల కష్టానికి గౌరవాన్ని కల్పించడంతో పాటు, పేద ప్రజలు ఆకలికి గురికాకుండా పోషకాహారాన్ని అందించడమే ఈ పథక ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే అన్నారు. ఈ పథక ఫలాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు..

లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పథకం సజావుగా అమలవ్వాలని, బియ్యం పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అక్రమాలను సహించేది లేదని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ పథకం విజయవంతంగా అమలుకావడానికి ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు. ఎమ్మెల్యే గ్రామ ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సన్న బియ్యం పంపిణీ విప్లవాత్మక మార్పు…

సన్న బియ్యం పంపిణీ విప్లవాత్మక మార్పు…

కాంగ్రెస్ నాయకులు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

ప్రభుత్వ చౌకధర దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయడం విప్లవాత్మక మార్పు అని కాంగ్రెస్ నాయకులు అన్నారు.గురువారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 7,8,10 చౌకధర దుకాణాలలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం కళ, పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, రఘునాథ్ రెడ్డి, అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, గాండ్ల సమ్మయ్య లు ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. పేదలు,ధనికులు అనే తేడా లేకుండా అందరూ ఒక్కటేనని భావంతో రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేయడం ప్రజాపాలన ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇస్తున్న అన్ని సరుకుల పంపిణీని బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎత్తివేసి దొడ్డు బియ్యం మాత్రమే పంపిణీ చేసి పేదల పట్ల పక్షపాత వైఖరి ధోరణి అవలంబించిందని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు పొలం సత్యం, పనాసరాజు, మాజీ ఎంపీపీ మహంకాళి శ్రీనివాస్, శ్యాం గౌడ్, శ్రీనివాస్ గౌడ్ ,సత్యం, చంద్రయ్య, పుల్లూరి కళ్యాణ్, మహిళా నాయకురాలు పుష్ప తదితరులు పాల్గొన్నారు.

రేషన్ షాపులలో సన్న బియ్యం పంపిణీ.

సిరిసిల్ల పట్టణంలోని రేషన్ షాపులలో సన్న బియ్యం పంపిణీ

సిరిసిల్ల టౌన్ : (నేటి ధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణంలోని వివిధ రేషన్ షాపులలో ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం కార్యక్రమం
ఈరోజు 25 వ వార్డులో గల రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ ఉదయం 10 గంటలకు 25 వ వార్డు కాంగ్రెస్ ఇంచార్జి తాడికొండ శ్రీనివాస్ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి రవి, కాంగ్రెస్ నాయకులు బిల్ల శేషాద్రి,పాషికంటి శ్రీధర్,ఉప్పుల సంజు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించడంతో పేదలందరికీ లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు నిరంతరం ఇలాగే సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రజలు కాంగ్రెస్ నాయకులను కోరారు.

14వ వార్డులో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం.

14వ వార్డులో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం

 

పరకాల నేటిధాత్రి

 

 

శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తంకుమార్ ప్రతిష్టాత్మకంగా చెప్పట్టిన రేషన్ షాప్ ల వద్ద సన్నబియ్యం పంపిణీ కార్యకరమంలో భాగంగా మున్సిపాలిటీలో ని 14వ వార్డులో మాజీ కౌన్సిలర్ మర్క ఉమాదేవి రఘుపతి ఆధ్వర్యంలో మాజీ మైనార్టీ అధ్యక్షులు మహ్మద్ అలి అధ్యక్షతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేసారు.అనంతరం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 14 వ వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యులు అమీనా,కొక్కిరాల స్వాతి,విజయ్,అశోక్,ఎండి నజియ,తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సన్నబియ్యం పంపిణి కార్యక్రమం.

ఘనంగా సన్నబియ్యం పంపిణి కార్యక్రమం

గంగారం, నేటిధాత్రి :

 

తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రేషన్ షాప్ లో సన్న బియ్యం పథకం కొత్తగూడ గంగారం మండలాల్లో ఘనంగా ప్రారంభం చేశారు.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రేషన్ షాపులో సన్నబియ్యం ఇస్తామన్న హామీని నెరవేర్చిందని.. సన్న చిన్న కారు నిరుపేదలు ప్రతి ఒక్కరూ ఈరోజు నుంచి సన్న బియ్యం తింటారని రేషన్ షాప్ లో సన్న బియ్యం పథకం ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రి ధనసరి సీతక్క కి రెండు మండలాల ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు….

ప్రభుత్వ ఆదేశాలు బేఖాతారు తెరుచుకొని డీలర్ షాపులు

గంగారం మండలంలోని మర్రిగూడ గ్రామ పంచాయతీలోని రేషన్ డీలర్ షాపు మంగళవారం రోజు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపు సన్న బియ్యం ఏప్రిల్ ఒకటవ తారీకున ఇవ్వాలని స్పష్టమైన హామీలు ఉన్నప్పటికీ మండలంలో అన్ని గ్రామాలు రేషన్ షాపులో సన్న బియ్యం వచ్చినప్పటికీ.. మర్రిగూడెం అంధువుల గూడెం మరికొన్ని గ్రామాల్లో రేషన్ షాపులు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించలేదు దీంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు నిరుత్సాహపడ్డారు…

లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ.

లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ

జైపూర్,నేటి ధాత్రి:

 

చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి ఆదేశాల మేరకు మంగళవారం జైపూర్ మండలం మిట్టపెల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సన్నబియ్యం పంపిణీ రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది.పేదల కోసం గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పటికీ ప్రజలు ఎవరు తినలేని పరిస్థితి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజల సమస్య ను గుర్తించి నేడు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అమలుపరచడం జరిగిందని,అదేవిధంగా ప్రజలందరూ కూడా సన్నబియ్యం పంపిణీతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.అలాగే చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధి కొరకు మిట్టపల్లి గ్రామంలో 35 లక్షల అంతర్గత సీసీ డ్రైనేజీలు,ఈజిఎస్ నిధుల నుండి 15 లక్షలు,రెండు కోట్ల రూపాయలతో నర్వ నుండి మిట్టపల్లి వరకు రోడ్డు నిర్మాణం,వ్యవసాయ రైతులకు ఇబ్బంది పడుతున్నారనీ 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు,ప్రజలు త్రాగునీరుకి ఇబ్బంది కలుగకూడదని ఐదు బోర్లుమంజూరు చేయడం జరిగిందనీ తెలిపారు.ప్రజల సమస్యలను క్షణక్షణం పరిశీలిస్తూ పేద నిరుపేద ప్రజలు ఇబ్బంది పడకుండా వారికి ఏ కష్టం వచ్చినా సమస్యను తీర్చుకుంటూ వారికి అండదండ నిలుస్తున్న ఎమ్మెల్యే కి కాంగ్రెస్ పార్టీ నాయకులు,ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గం లింగయ్య,కామెర మనోహర్,అల్లూరి స్వామి,జంబిడి కిష్టయ్య,దూట శీను, చంద్రయ్య,మల్లేష్,గోదారి తిరుపతి,భిమిని తిరుపతి, గ్రామస్తులు పాల్గొన్నారు.

సన్న బియ్యం పంపిణీ దేశంలోనే ప్రథమం.

రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ దేశంలోనే ప్రథమం

– అన్ని వర్గాల సంక్షేమ లక్ష్యంగా పథకాల అమలు

– మంత్రి పొన్నం ప్రభాకర్

– సిరిసిల్లలో సన్నబియ్యం పంపిణీని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ప్రారంభించిన మంత్రి

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

 

రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ దేశంలోనే ప్రథమమని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్ తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పథకాన్ని సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త  బస్ స్టాండ్ వద్ద ఉన్న రేషన్ దుకాణంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీ గితే తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు సన్న బియ్యాన్ని మంత్రి, విప్, కలెక్టర్, ఎస్పీ తదితరులతో కలిసి పంపిణీ చేశారు.

అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు దేశంలో ఎక్కడా లేనివిధంగా మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది రోజున ప్రారంభించారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీ మేరకు పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు రాష్ట్రంలోని 17,263 రేషన్ దుకాణాల్లో రెండు లక్షల 91 కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేయనున్నామని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడు సన్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమ లక్ష్యంగా వివిధ పథకాలు అమలు చేస్తుందని వివరించారు. దాదాపు 60 వేల ఉద్యోగాలను తమ ప్రభుత్వం భర్తీ చేసిందని గుర్తు చేశారు. మహిళల అందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు,రూ. 500 కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నామని గుర్తు చేశారు. మహిళా మణులను కోటీశ్వరులుగా చేయాలని సదుద్దేశంతో ఇప్పటికే ఇందిరా మహిళా శక్తి కింద వివిధ యూనిట్లు ప్రారంభించామని తెలిపారు. అలాగే సోలార్ యూనిట్లు మహిళా సంఘాలకు బస్సులు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. సన్న సన్న ధాన్యం పండించే రైతులకు క్వింటాల్కు అదనంగా 500 అందజేస్తూ ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీకి నూతన బస్సులు అందజేస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పాటును అందజేస్తున్నామని వివరించారు.

జిల్లాలోని 345 రేషన్ దుకాణాలు ద్వారా..

రాష్ట్ర ప్రభుత్వం సోషియో ఎకనామిక్ సర్వే ను ఇటీవల నిర్వహించిందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ఆమోదించిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని నేత కార్మికులకు భరోసా కల్పిస్తూ గత బకాయిలను విడుదల చేసిందని, అలాగే యార్న్ బ్యాంకును ప్రారంభించిందని వారి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. దాదాపు 20వేల కోట్ల రూపాయల రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని వెల్లడించారు. త్వరలో పెన్షన్ పంపిణీ ఇతర కార్యక్రమాలను ప్రారంభించనున్నామని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని ప్రకటించారు. జిల్లాలోని 345 రేషన్ దుకాణాలు ద్వారా లక్ష 70 వేల రేషన్ కార్డుల లబ్ధిదారులకు
3275 మెట్రిక్ టన్నులు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా లబ్ధిదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూప, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, జిల్లా పౌర సరఫరాల అధికారి వసంత లక్ష్మి, పౌర సరఫరాల మేనేజర్ రజిత తదితరులు పాల్గొన్నారు.

ఏప్రిల్ 1 నుండి సన్న బియ్యం పంపిణీ.

ఏప్రిల్ 1 నుండి సన్న బియ్యం పంపిణీ

రేషన్ డీలర్లకు సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మార్వో

ఎమ్మార్వో సత్యనారాయణ

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలంలోని 30 రేషన్ షాప్స్ డీలర్స్ తో తహసీ ల్దార్ కార్యాలయంలో సమా వేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం
ఏప్రిల్ నుండి రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం సన్న బియ్యం సరఫరా చేస్తుంది కాబట్టి డీలర్స్ వద్ద ఏమైనా మార్చి నెల దొడ్డు బియ్యం నిల్వలు ఉంటే అట్టి నిల్వలను పై నుండి ఆదేశాలు వచ్చేంత వరకు భద్రపరచాలి. ఎట్టి పరిస్థితుల్లో దొడ్డు బియ్యం ఇవ్వరాదని ,సన్న బియ్యం మాత్రమే ఇవ్వాలని ప్రతి రోజు ఉదయం 7 గం.లకు తీయాలని ,ఎట్టి పరిస్థితుల్లో కార్డ్ ఉన్న వారి దగ్గర డబ్బులు ఇచ్చి బియ్యం కొనకూడదు అలాంటి కంప్లైంట్స్ వస్తె 6-A కేసులు పెట్టుతామని హెచ్చ రించారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు ఆర్ ఐ తోపాటు మల్లయ్య అద్యక్షుడు మరియు డీలర్స్ పాల్గొన్నారు.

ఆపరేటివ్ బ్యాంక్ ప్రమాద బీమా చెక్కు పంపిణి.

గాయత్రి కో-ఆపరేటివ్ బ్యాంక్ ప్రమాద బీమా చెక్కు పంపిణి

జమ్మికుంట :నేటిధాత్రి

జమ్మికుంట మండలంలోని ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారుడు బిజిగిరి షరీఫ్ గ్రామ సుడైనటువంటి ముడతనపల్లి రాజు తండ్రి మల్లయ్య ప్రమాదవశాత్తు మరణించగా ఇతనికి గాయత్రి బ్యాంకులో నిర్భయ సేవింగ్ ఖాతాపై ప్రమాద బీమా సౌకర్యం ఉంది ప్రమాదంలో చనిపోవడం వల్ల అతని తల్లి అయిన ముడతనపల్లి సుశీలకు లక్ష రూపాయల చెక్కును జమ్మికుంట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అయిన శ్రీమతి పుల్లూరి స్వప్న సదానందం చేతుల మీదుగా బ్యాంకు మేనేజర్ వోద్దుల మహేందర్ పొల్లు ప్రవీణ్ కుమార్ గార్ల ఆధ్వర్యంలో చెక్కు పంపిణీ చేయడం జరిగింది.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణి.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణి

సిరిసిల్ల టౌన్ (నేటి ధాత్రి):

సిరిసిల్ల పట్టణం అనంత నగర్ 26వ వార్డులో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. వికృతి భరత్ కుమార్ కి 42500 రూపాయల చెక్ ను అందజేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, మంత్రి పొన్నం ప్రభాకర్ కి, ఆది శ్రీనివాస్ కి, నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 26వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రెడ్దిమల్ల భాను, వార్డు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జయలక్ష్మి, దళిత నాయకులు కొంపెల్లి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ…

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం రామన్న పల్లె గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం కన్నా వందరెట్లు ఎక్కువగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంజూరు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్నిదని అలాగే ఖరీదైన వైద్యం చేయించుకోలేనినిరుపేద కుటుంబాలకు ఎంతో అండగా ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి సహాయ నిధి బాసటగా నిలుస్తుందని సందర్భంగా లబ్ధిదారులకు కోలాపురి నర్సయ్యకు .60000. కట్ల రమ్యకు.20000.రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేసిన కాంగ్రెస్ నాయకులు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముందటితిరుపతి యాదవ్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆత్మకూరు నాగరాజు ముందటి రమేష్ సంపత్ నక్క రవి గొర్రె రాజు గుండి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు

పేదలకు సన్నబియ్యం పంపిణి.

ప్రజా పంపిణి వ్యవస్థ ద్వారా పేదలకు సన్నబియ్యం పంపిణి

ఎస్సీ సేల్ మండల అధ్యక్షులు ఓనపాకాల ప్రసాద్

నేటి ధాత్రి మొగుళ్ళపల్లి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సన్నబియ్యం పంపిణీకి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోందని. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సేల్ మండల అధ్యక్షులు ఓనపాకాల ప్రసాద్ అన్నారు. ఆయన మాట్లాడుతూ. నిరుపేదలకు చెందాల్సిన రేషన్ షాపులోని దొడ్డు బియ్యం అక్రమార్కులు రాష్ట్రాలు దాటించి సొమ్ము చేసుకున్నారని పేదల నోటికి చెందాల్సిన అన్నం దొంగల పాలవుతుందని భావించి. ఎలాగైనా నిరుపేదలకు న్యాయం చేయాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ముఖ్యమంత్రితో పాటు పౌర సరఫరాల మంత్రి దృష్టికి తీసుకువెళ్లి సన్న బియ్యం పంపిణి చేస్తేనే బియ్యం దొంగలకు అడ్డుకట్ట వేయచ్చని చర్చించి సన్న బియ్యం. ప్రజలకు పంపిణి చేసేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు నిరుపేదల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందుకు అనుగుణంగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీకి ప్రజా ప్రభుత్వం సన్నా హాలు చేస్తోందని. ఇందులో భాగంగా పౌర సరఫరాల శా ఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,సొంత నియోజకవర్గ మైన హుజూర్ నగర్‌లో ఈ పథకాన్ని ఉగాది పండుగ పర్వదిననా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,పౌర సమాచార శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని
సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించడం మా నిరుపేదలకు ఆనందంగా ఉన్నదనీ సన్న బియ్యం పంపిణి చేసి నిజమైన పెదలపార్టీ కాంగ్రెస్ పార్టీ అని నిరూపించిందని రాష్ట్రంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ఏడాదిలో. రెండు సీజన్లలో సేకరించే సన్నధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించడం. ప్రభుత్వ కృషికి నిదర్శనమని. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులకు, నియోజకవర్గ ఎమ్మెల్యే కు ఓనపాకాల ప్రసాద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ…

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ…

 

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం చిన్న లింగాపూర్ గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులు గుర్రం రవీందర్ రెడ్డి మాజీ ఎంపిటిసిబై రీ వేణి రాముఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదల కుటుంబాల వైద్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో అండగా ఉంటుందని చిన్న లింగాపూర్ గ్రామంలోని లబ్ధిదారులకు మహిమల రాజయ్యకు 60 వేల రూపాయలు గుర్రం ప్రసాద్ రెడ్డికి 45 వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ అందజేశామని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు రావడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ప్రభుత్వ విప్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి పీకే మహేందర్ రెడ్డి కి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ కి కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి చెక్కుడు రావడానికి చెక్కులు రావడానికి కృషిచేసిన వారికి నాయకులకు గుర్రం ప్రసాద్ రెడ్డి మహిమల రాజయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో పాక్స్ డైరెక్టర్ మంద నారాయణ గౌడ్ బోలవే ని అనిల్ రేగుల ఎల్లయ్య పిట్ల పరుశురాములు వంతడుపుల బాలరాజు బోల వేణి హరీష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

సిఎస్ఐ హై స్కూల్ పరీక్ష సామాగ్రి వితరణ.

సి. ఎస్. ఐ. హై స్కూల్ పరీక్ష సామాగ్రి వితరణ

గణపురం నేటి ధాత్రి:

 

గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో ని సి ఎస్ ఐ హై స్కూల్ చదువుతున్న పదోతరగతి పిల్లలకు పరీక్ష సామాగ్రీ అందజేసిన, మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ మారపెళ్లి ప్రభాకర్ ఈ కార్యక్రమం లో స్కూల్ ప్రిన్సిపల్ హన్నా జాన్, స్కూల్ సిబ్బంది శివాజీ, రత్న బాబు పాల్గొన్నారు, హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ ను మొగుళ్ళపల్లి ఎస్ ఐ.బి. అశోక్  అభినందించారు

సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ నాయకుల స్వీట్ల పంపిణీ.

సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ నాయకుల స్వీట్ల పంపిణీ

సిరిసిల్ల టౌన్ 🙁 నేటి ధాత్రి )

Congress leaders

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ సమావేశాల్లో బీసీ లకు 42% శాతం రిజర్వేషన్స్ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా సిరిసిల్ల జిల్లాలోని పలు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వీట్ల పంపిణీ చేయడం జరిగినది. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రెస్ మీట్ ద్వారా కృతజ్ఞతలు తెలుపడం జరిగినది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గ్రంధాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్. టిపిసిసి సభ్యుడు సంగీతం శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత. మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప. గడ్డం నరసయ్య. మ్యాన ప్రసాద్. ఆకులూరి బాలరాజు. కుడిక్యాల రవి.తదితరులు పాల్గొన్నారు.

రైతులకు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల పంపిణీ.

రైతులకు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల పంపిణీ

గద్వాల /నేటి ధాత్రి

గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రము సబ్ స్టేషన్ దగ్గర 200 రైతులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బుధవారం పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో గద్వాల ప్రాంతంలో రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని.. రైతులు కరెంటు కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కరెంటు లేక సరైన పంటలు లేక అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకునేవారన్నారు.
నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి ఈ ప్రాంతంలోని రైతుల కష్టాలను తీర్చానన్నారు. గద్వాల నియోజకవర్గంలో కొత్తగా ఏడు గ్రామాలలో 7 విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు అయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

పరీక్ష ఫ్యాడ్లు పెన్నుల పంపిణీ.

పరీక్ష ఫ్యాడ్లు పెన్నుల పంపిణీ
– గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా
సిరిసిల్ల(నేటి ధాత్రి):
సిరిసిల్ల పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫ్యాడులను పెన్నులను పంపిణీ చేసిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి..
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను, పెన్నులను అందించరు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలను సాధించాలని జీవితంలో విద్యార్థులు ఏర్పరచుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో పదవ తరగతి ఎంతో కీలకమైనదని ఈ సమయంలో చదువు పట్ల ఎవ్వరు అశ్రద్ధ చేయరాదని అన్నారు..
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గడ్డం లత భాస్కర్, బి. ఆర్. ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్, జిల్లా అధ్యక్షులు మానాల అరుణ్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version