బీ ఆర్ ఎస్ రజతోత్సవ సభకు తరలిరావాలి.!

బీ ఆర్ ఎస్ రజతోత్సవ సభకు తరలిరావాలి

పరకాల మాజీ ఎంపీటీసీ చందుపట్ల సాయి తిరుపతి రెడ్డి

పరకాల నేటిధాత్రి:

టిఆర్ఎస్ రజతోత్సవ సభకు తెలంగాణ ప్రజలు తరలిరావాలని పరకాల మాజీ ఎంపీటీసీ,మలిదశ ఉద్యమకారుడు చందుపట్ల సాయి తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు.ఆయన మాట్లాడుతూ కష్ట నష్టాలకు ఓర్చి తెచ్చుకున్న తెలంగాణ, మోసపూరిత కాంగ్రెస్ చేతుల్లో పడి ఆగమైపోతున్నదని,వారి పాలనను ఎండగట్టి తెలంగాణను కాపాడుకునే దశలో ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే బీ ఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు భారీగా జనాలు తరలివచ్చి విజయవంతం చేయాలని పేర్కొన్నారు.కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పదువులను లెక్కచేయలేదని, చావుదాకా వెళ్లి తెలంగాణను సాధించినట్లు గుర్తు చేశారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రాన్ని పదేండ్ల కేసీఆర్ పాలనలో అన్నిరంగాల్లో దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు.ఈ నెల 27న ప్రతి ఒక్కరు గులాబీ జెండాతో సభకు కదలాలని కోరారు.

నిన్న బి.ఆర్.ఎస్. లోకి నేడు సొంత గూటికి.!

నిన్న బి.ఆర్.ఎస్. లోకి నేడు సొంత గూటికి???
స్థానిక ఎలక్షన్స్ రాకముందే వేడెక్కుతున్న రాజకీయాలు
కక్కిరాల పల్లిలో మళ్ళీ మారిన రాజకీయం
మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో తిరిగి చేరికలు
కక్కిరాలపల్లి గ్రామంలో రెండు వందల మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక..

నేటిధాత్రి ఐనవోలు :

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఐనవోలు మండలంలోని బీఆర్ఎస్ బిజెపి నాయకులు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయము అందరికి తెలిసిందే.మంగళవారం రోజు అధికార పార్టీ నుంచి కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు గతంలో పార్టీలో పనిచేసిన కార్యకర్తలుకక్కిరాలపల్లి గ్రామంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో టిఆర్ఎస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కండవు కప్పుకున్న నాయకులు కార్యకర్తలు తిరిగి మండల పార్టీ అధ్యక్షుడు సమ్మెట మహేష్ ఆధ్వర్యంలో బుధవారం అధికార పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజలు ప్రలోభాలకు గురి కావద్దని అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పార్టీలో చేరిన వారికి తగు ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటుందని ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందుతాయని. కె ఆర్ నాగరాజు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అందరికీ సమన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ బిజెపి నాయకులు చెప్పిన మాటలు విని ఆగమాగం కావద్దని అధికార పార్టీతోనే అన్ని సాధ్యమైతాయని ప్రతి కార్యకర్తను ఎమ్మెల్యే కంటికి రెప్పలా కాపాడుకుంటాడని పార్టీలో చేరిన వారికి ఈ సందర్భంగా మహేష్ గౌడ్ తెలిపారు.కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న వారిలో ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షుడు పొన్నం గోపాల్. బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ కంజర్ల సురేష్ మాజీవార్డు మెంబర్ కంజర్ల అశోక్ బీఆర్ఎస్ నాయకులు కంజర్ల మధుకర్ కత్తెర శాల రమేష్ అరుణ, బర్ల సుమలత రాజు, అరూరి లలిత, అరూరి పూలమ్మ, రావుల సాంబయ్య, కంజర్ల మమత, కంజర్ల యాకమ్మ, అన్నెపు రాజు,నూనె రాజ్ కుమార్, పిట్టల యాదమ్మ, నాయిని శ్రీను మరియు నూనె రాజు తదితరులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు..

రజతోత్సవ సభను విజయవంతం చేయండి.!

బి.ఆర్.ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయండి

సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)

 

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని 37వ వార్డులో మాజీ కౌన్సిలర్ రెడ్డి మాధవి రాజు ఆధ్వర్యంలో ఈరోజు సిరిసిల్ల పట్టణంలో డప్పు సప్పులతో ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి ఆహ్వాన పత్రికను అందించి కుటుంబ సమేతంగా తేది:27-4-24 ఆదివారం రోజున జరగబోయే భారత రాష్ట్ర సమితి పార్టీ 25వ వేడుకల సందర్భంగా రజతోత్సవ సభను విజయవంతం చేయవలసిందిగా కోరడం జరిగినది. అంతే కాకుండా భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాటలు విని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సవినాయంగా వార్డు ప్రజలను కోరుతూ ఆహ్వాన పత్రిక అందించడం జరిగినది.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధి గా భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాజా మాజీ చేనేత, జౌలి మరియు టెక్స్ టైల్స్ కార్పొరేషన్ అధ్యక్షులు గూడూర్ ప్రవీణ్, సిరిసిల్ల పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు బత్తుల వనజ రమేష్, 37.వ వార్డు బి.ఆర్.యస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి,కూరపాటి భూమేష్, బూత్ అధ్యక్షులు వేముల తిరుపతి, మహిళా విభాగం వార్డు అధ్యక్షులు ముదారపు లలిత రాజేశం, కమిటీ సభ్యులు, ఎక్కల దేవి శ్యామల, గంగుల సదానందం, మచ్చ సురేష్, గాజుల ఎల్లయ్య, జిందం రాజేశం, బోద్దుల రమేష్, పచ్చనూరు తిరుపతి, గజ్జల లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీని వీడి బి.ఆర్.ఎస్. పార్టీలో.!

కాంగ్రెస్ పార్టీని వీడి బి.ఆర్.ఎస్. పార్టీలో చేరిన నాయకులు
మాజీ మంత్రి దయాకర్ రావు సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్న మాజీ సర్పంచ్ ఉప, సర్పంచ్
కక్కిరాల పల్లిలో ఖాళీ అవుతున్న కాంగ్రెస్ పార్టీ

నేటిధాత్రి ఐనవోలు/హన్మకొండ:-

ఐయినవోలు మండలం కక్కిరాల పల్లి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ కంచర్ల రమేష్, ఉప సర్పంచ్ బొల్లం ప్రకాష్ మంగళవారం మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బి. ఆర్. ఎస్ పార్టీలో చేరడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఈ మోసపూరిత కాంగ్రెస్ మాటలు విని మేం మోసపోయామని ప్రజలు అంటున్నారని,కెసిఆర్ ఒక విజన్ తో పని చేస్తే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవగాహన లోపంతో ప్రజలను ఆగం పట్టిస్తున్నారని విమర్శించారు. బోగస్ మాటలు చెప్పి ప్రజలను బోల్తా కొట్టించిన ఈ కాంగ్రెస్ పార్టీని తొందరలోనే బొంద పెట్టే రోజులు వస్తున్నాయని వారు అన్నారు.వీరితోపాటు బీ. ఆర్. ఎస్ పార్టీలో కాటబోయిన కుమారస్వామి, గాడుదల లింగయ్య, చిర్ర రాజేందర్, తల్లపెల్లి నాగరాజు, మడ్లపల్లి రాజు,ఆరూరి అరుణ్, నూనె సాంబరాజు, జోగు సతీష్, జోగు రమేష్, గుబ అరుణ్ కుమార్, కోల శ్రీనివాస్, ఆరూరి లలిత, ఆరూరి పూల, బర్ల సుమలత, ఆరూరి అనిత ఇంకా భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నుండి కార్యకర్తలు పార్టీలో చేరటం జరిగింది.ఈ కార్యక్రమంలో బి. ఆర్. ఎస్ మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ తక్కలపల్లి చందర్ రావు మండల కన్వీనర్ తంపుల మోహన్, మండల ఇంచార్జ్ గుజ్జ గోపాలరావు, నాయకులు పల్లకొండ సురేష్, గ్రామ పార్టీ బీఆర్ఎస్ అధ్యక్షుడు అల్లం సోమయ్య, టిఆర్ఎస్ నాయకులు మరుపట్ల దేవదాస్,దుప్పెల్లి కొమురయ్య, గడ్డం రఘువంశీ గౌడ్ పాల్గొన్నారు.

‘ధరణి చట్టం..బీఅర్ఎస్ ప్రభుత్వానికి చుట్టం’.

‘ధరణి చట్టం..బీఅర్ఎస్ ప్రభుత్వానికి చుట్టం’

ధరణి పాలిట.. రైతులకు శాపం

భూభారతి చట్టంతో.. సమస్యలకు శాశ్వత పరిష్కారం.

భూత్పూర్ /నేటి ధాత్రి

 

మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో ఎక్సైజ్ & టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, దేవరకద్ర మంగళవారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ధరణి వంటి చట్టాలు వారికి చుట్టాలు అయ్యాయి కానీ..

Dharani Act

జనానికి మాత్రం ధరణి దరిద్రంగా మారిందని, ధరణితో అధికారులకి.. అధికారాలు లేకుండా పోయాయన్నారు. ధరణి వల్ల ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలకు భూభారతి చట్టం ద్వారా మోక్షం లభిస్తుందని, కొత్త చట్టంలో సమస్యలపై అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో కలిపి భూభారతిని తీసుకొచ్చారన్నారు. భూ భారతి చట్టం ప్రకారం.. భూ సంబంధిత సమస్యలను నిర్దిష్ట గడువులోపు పరిష్కరించడం జరుగుతుందని, సమస్య పరిష్కారం కాకుంటే కలెక్టర్‌కు అప్పీల్ చేసుకోవచ్చని, ఈ చట్టంలో కొత్తగా ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ధరణిలో రెవెన్యూ కోర్టులను తొలగించడం వల్ల భూ వివాదాల విషయంలో రైతులు సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని గుర్తు చేశారు. దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రస్తుత భూభారతి చట్టం ద్వారా గతంలో మాదిరిగా రెవెన్యూ కోర్టులు పునరుద్ధరించిందని వివరించారు. భూ సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకునేందుకు తహసీల్దార్ రెవెన్యూ డివిజన్ అధికారికి, కలెక్టర్‌కు అధికారాలు కల్పించామని తెలిపారు. అయినా సమస్య పరిష్కారం కాలేదని రైతులు భావిస్తే అప్పీల్‌ చేసుకోవచ్చని సూచించారు. ఆర్థిక స్థోమత లేని పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం కూడా ప్రస్తుత చట్టంలో సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ… 10 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం అధికారం కోసం తహతహలాడుతోందన్నారు. ధరణిని తెచ్చి వాళ్లు మాత్రం లబ్దిపొంది.. ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని కేసీఆర్ కుటుంబం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం.!

బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సుంకే

రామడుగు, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని వైశ్య భవన్ లో ఈనెల 27న వరంగల్ లో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో రామడుగు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ముఖ్యఅతిథిగా చోప్పదండి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ పాల్గోని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రామడుగు సింగిల్విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంట్ల జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మర్కొండ కిష్టారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ గంట్ల వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ తౌటు మురళి, మాజీ రైతుబంధు సమితి అధ్యక్షులు జూపాక కరుణాకర్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన.!

నూతన వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ నాయకులు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో నారగాని మాధవి-శ్రీధర్ గౌడ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులు చి. ల. సౌ. అమూల్య -చి.శ్రీకాంత్ గౌడ్ ను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన గణపురం మండల బిఆర్ఎస్ నాయకులు
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు, బి ఆర్ఎస్ మండల అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రా రెడ్డి, యాత్ నాయకులు గాజర్ల చింటూ గౌడ్, మార్క సాయి గౌడ్,బబ్లుగౌడ్, హఫీజ్ మరియు తదితరులు పాల్గొన్నారు

బిఆర్ఎస్ బహిరంగ సభ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ.

బిఆర్ఎస్ బహిరంగ సభ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ.

మిగిలిన రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలి

మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

ఈనెల 27 న వరంగల్ జిల్లా సమీప ఎల్కతుర్తిలో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ పట్ల నర్సంపేట రూరల్ మండలంలోని ఇటుకలపల్లి,ఆకుల తండా,ఏనుగుల తండా,ఇప్పల్ తండ గ్రామలలో బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ ఆయా గ్రామాల్లో మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు.అనంతరం గోడ పత్రికలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ రుణ మాఫీ పట్ల ప్రకటన ప్రకారం మిగిలిన రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ రంగాల్లో విఫలమయ్యిందని అన్నారు.
ఈ కార్యక్రమం లో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నరసింహరాములు,క్లస్టర్ ఇన్చార్జిలు మోటూరి రవి,కడారి కుమారస్వామి,మాజీ ఎంపీటీసీ భూక్యా వీరన్న,మండల పార్టీ ఉపధ్యక్షుడు అల్లి రవి,ఇటుకాపల్లి గ్రామకమిటీ అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్,ఆకుల తండ గ్రామ పార్టి అధ్యక్షుడు కూకట్ల రవి,ఇప్పల్ తండ గ్రామ పార్టి అధ్యక్షుడు ధరావత్ బద్దు,ఏనుగుల తండ గ్రామ పార్టి అధ్యక్షుడు,మాజీ సర్పంచ్ బానోతు రవి,మాజీ సర్పంచ్ లు మండల రవీందర్,భానోత్ శంకర్ నాయక్,మాజీ ఉప సర్పంచ్ జమాల చంద్రమౌళి,వాడికారి గోపాల్,కుసుంబ కోటి,మండల రాజమౌళి,రాధరపు రాజు,నకినబొయిన సారంగం,జామచెట్ల చేరాలు, సాంబయ్య,గజ్జి బాబు, హరీష్, సుమన్,కిషన్ నాయక్,బోయిని సమ్మాలు,పాసికంటి శంకర్ లింగం,కన్నెబోయిన రాజు, కూకట్ల కుమార్ ఉప్పునూతల వీరాచారి,గోపు సాంబయ్య,బానోతు దశ్రు,కిషన్,ధరావత్ దసురు,జై కిసాన్ బద్రు,గ్రామ కమిటీ సభ్యులు,నాయకులు,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం…

బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం…

బిఆర్ఎస్ నియోజక వర్గ ఇన్చార్జి రాజా రమేష్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

ఈనెల 27న ఎల్కతుర్తి లో జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ రాజా రమేష్ అన్నారు.బుదవారం రామకృష్ణాపూర్ పట్టణంలో సభకు సంబంధించి కేసీఆర్ వాల్ రైటింగ్ తో ప్రజలను, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు.అనంతరం రాజా రమేష్ మాట్లాడుతూ..

BRS Silver Jubilee Celebration

మున్సిపాలిటీలోని 14,15,17,18,20 వార్డు లలో వాల్ పోస్టర్లను అంటించడం అంటించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కంభగోని సుదర్శన్ గౌడ్,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రామిడి కుమార్, బడికల సంపత్,ఆలుగుల సత్తయ్య,మాజీ కౌన్సిలర్లు పోగుల మల్లయ్య,బోయినపల్లి అనిల్ రావు,రేవెల్లి ఓదెలు, జిలకర మహేష్,పారుపల్లి తిరుపతి,గడ్డం రాజు, చంద్రమౌళి, లక్ష్మారెడ్డి,రంగరాజు,పైతారి ఓదెలు,మేకల రమేష్,వేనంక శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు రామిడి లక్ష్మీకాంత్,ఆశనవేణి సత్యనారాయణ,టైలర్ రాజు,చంద్ర కిరణ్,కుర్మ దినేష్,దేవి సాయి కృష్ణ, శివ,మణి, గోనె రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

సిఎంఆర్ఎఫ్ చెక్కుని అందజేసిన బి అర్ ఎస్ నాయకులు

సిఎంఆర్ఎఫ్ చెక్కుని అందజేసిన బి అర్ ఎస్ నాయకులు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎమ్మెల్యే గారి కృషి తో మంజూరైన ₹54,000/- విలువ గల చెక్కును రంజోల్ గ్రామానికి చెందిన రాము గారికి అందజేసిన సీనియర్ నాయకులు నామ రవికిరణ్,సత్యం ముదిరాజ్ గార్లు .ఈ సంధర్బంగా ఎమ్మెల్యే గారికి,నాయకులకు లబ్ధిదారుడు కృతజ్ఞతలు తెలియజేశారు.

బీఆర్ఎస్ రజతోత్సవ సభ జయప్రదం చేద్దాం ఎమ్మెల్యే.!

బీఆర్ఎస్ రజతోత్సవ సభ జయప్రదం చేద్దాం ఎమ్మెల్యే మాణిక్ రావు

◆ఈనెల 27 న ఎల్కతుర్తి లో జరిగే సభను కలిసి కట్టుగా విజయవంతం చెయ్యాలి

◆కోహిర్ మండల పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు అన్నారు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

మాజి మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు, శనివారము మండలంలోని ఎస్ఎస్ ఫంక్షన్ హాలులో మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతుందని అన్నారు. 10 లక్షల మంది తో జరిగే సభకు గ్రామ గ్రామం నుంచి పార్టీ కార్యకర్తలు బయలుదేరి రావాలని పిలుపునిచ్చారు.రజతోత్సవ సభ రాష్ట్రంలో గులాబీ పండగ వలె జరుపుకుంటున్నామని.. ఈ పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

MLA Manik Rao

 

కోహిర్ మండలం నుండి పెద్ద ఎత్తున కదలిరావాలని ఎమ్మెల్యే మాణిక్ రావు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ రామకృష్ణ రెడ్డి,కొహిర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు , జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,మాజి జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు మొహిద్దీన్ , ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మాజి కేతకీ ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్,
సీనియర్ నాయకులు కలీం, కొహిర్ పట్టణ అధ్యక్షులు ఇఫ్టేకార్,యువ నాయకులు మిథున్ రాజ్,మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్ ,మాజి సర్పంచ్ లు నర్సింలు , మొలయ్య,రమేష్ ,మాజి ఎంపీటీసీ లు సంపత్,విఠల్ రెడ్డి ,నాయకులు నర్సింహ రెడ్డి,మాజి విజిలెన్స్ కమిషన్ మెంబర్ రామకృష్ణ బంటు,గ్రామ పార్టీ అధ్యక్షులు & కార్యవర్గం ,ముఖ్య నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎల్కతుర్తిలో రజతోత్సవ సభను విజయవంతం చేయాలని.

వరంగల్ ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని.

జహీరాబాద్. నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయలో ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు ,డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ , పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఈనెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే బిఆర్ఎస్ రచోత్సవ సభకు సంబంధించిన గొడ పత్రిక ను బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.ఈనెల 27న ఎల్కతుర్తి బిఆర్ఎస్ రచోత్సవ సభకు జహీరాబాద్ నియోజకవర్గం నుండి సుమారు 5 వేలకు పైగా బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలి వెళుతున్నారని అన్నారు. తెలంగాణ ను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ దేనని, పదేళ్ల కేసీఆర్ పాలన దేశంలో నంబర్ వన్ గా మారిందని పేర్కొన్నారు.

BRS

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పాలించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి గెలిపించి పెద్ద తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. ఎల్కతుర్తిలో జరుగనున్న రజతోత్సవ సభలో కేసీఆర్‌ తెలంగాణ ప్రజల భవిష్యత్‌ గురించి దిశా నిర్దేశం చేయనున్నారని, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,మాజి జడ్పిటిసి స్వప్న భాస్కర్,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,పాక్స్ చైర్మన్ మచ్చెందర్,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మొహిద్దీన్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మాజి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్,మాజి సర్పంచ్ శేఖర్ రెడ్డి,యువ నాయకులు మిథున్ రాజ్,నాయకులు గణేష్ , చంద్రయ్య,దీపక్ తదితరులు పాల్గొన్నారు.

కోరుట్ల నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం.

మెట్ పల్లి ఏప్రిల్ 10 నేటి ధాత్రి

మెట్ పల్లి లో బీఆర్ఎస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం వెల్లుల్ల రోడ్డు ఫంక్షన్ హాల్ లో జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మార్క్ ఫండ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి ముఖ్య కార్తి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.
మల్లాపూర్ మండల్ ముత్యంపేట ఆటో యూనియన్ వారు బీఆర్ఎస్ పార్టీ రజోత్సవం వరంగల్ లో జరిగే చలో వరంగల్ కార్యక్రమానికి పార్టీ నిధులు కింద 5000 రూపాయలు జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కి అందజేశారు.
ఈ సమావేశంలో ముఖ్య కార్యకర్తలు వారి సలహాలు సూచనలు మాట్లాడిన
అనంతరం ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కార్యకర్తలు పార్టీ బలోపేత నికి కృషి చేయాలని కెసిఆర్ అడుగుజాడల్లో నడిచి పూర్వ వైభవం పార్టీకి తేవాలని నియోజకవర్గంలో మన పార్టీకి బెంచి పట్టు ఉందని దానికి ప్రతి కార్యకర్త వచ్చే సర్పంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని అన్నారు. జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ వరంగల్ లో జరిగే టిఆర్ఎస్ రజతోత్సవాలు పురస్కరించుకొని చలో వరంగల్ సభను ఘన జరుపుకుందామని దానికి ప్రతి బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు మన నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ప్రజలను కలిసి మనం చేసిన అభివృద్ధి పనులు గురించి తెలిపి వరంగల్ సభకు తీసుకురావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మారు సాయి రెడ్డి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ , మాజీ జడ్పిటిసిలు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

BRS పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష భక్తులకు భిక్ష.

బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష భక్తులకు భిక్ష

ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్

సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవనంలో ఈరోజు

సిరిసిల్ల నేటి ధాత్రి:

 

బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష భక్తులకు భిక్ష కార్యక్రమం చేపట్టడం జరిగినది.
ముఖ్య అతిథిగా బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది.

BRS & KTR

అనంతరం మాట్లాడుతూ శ్రీ ఆంజనేయ స్వామి కృప, కటాక్షం సుఖ:సంతోషాలతో ఎల్లవేళలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని కే.టీ.ఆర్ కోరాతు, స్వామి వారి చిత్రపటాన్ని స్వీకరిస్తూ, అనంతరం హనుమాన్ దీక్ష స్వాములతో బిక్ష కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తలు మరియు హనుమాన్ దీక్ష పరులు పాల్గొన్నారు.

ఎన్నిక ఏదైనా ఎగిరేది బిఆర్ఎస్ జెండా.

ఎన్నిక ఏదైనా ఎగిరేది బిఆర్ఎస్ జెండా…

రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీ బిఆర్ఎస్…

రాష్ట్రం కోసం పదవులను త్యాగం చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులది…

నీళ్ళివ్వకుండ చెక్ డ్యామ్ కులగొట్టిన ఘనత మన ప్రస్తుత ఎమ్మెల్యే ది..

ఏప్రిల్ 27న జరగబోయే మన సభా రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులను తీసుకు రానుంది…

:-మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

ఈ నెల 27న జరగనున్న బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను జయప్రదం చేసే దిశగా ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో భాగంగా నేడు మొగుళ్ళపల్లి మండలంలోని ఆకినపల్లి, ఇప్పలపల్లి, పోతుగల్,కొరికిశాల ముఖ్య కార్యకర్తలతో సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి

ఈ సందర్భంగా ఆకినపల్లి మాజీ సర్పంచ్ దూడపాక భద్రయ్య,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దూడపాక సమ్మయ్య మరియు యువత అబద్దాల కాంగ్రెస్ పార్టీని వీడి మాజీ ఎమ్మెల్యే రమణన్న సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు.

మాజీ ఎమ్మెల్యే రమణన్న మాట్లాడుతూ…

2001 ఏప్రిల్ 27 వ తారీఖు నాడు కెసిఆర్ గారు ఆ రోజు తన పదవికి రాజీనామా చేసి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను చూసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉంటే లాభం లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతున్నటువంటి ఒక లక్ష్యం తోటి కేసిఆర్ ఆరోజు పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టి 24 సంవత్సరాలు పూర్తయి 25వ సంవత్సరాల్లో అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ రజతోత్సవ సభను నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేసి, అది కూడా మనం నా భూతో నా భవిష్యత్ అనేలా పెద్ద సభను నిర్వహిస్తున్నాం. భవిష్యత్ లో ఇంత పెద్ద మొత్తంలో ఎవరూ నిర్వహించలేరు. మరి ప్రజలు కూడా ఆవిర్బవా సభకు రావడానికి ఉత్సాహంగా ఉన్నారు.

BRS party

 

 

ఇంత తక్కువ సమయంలో ఇంత వ్యతిరేకతను చవిచూసినటువంటి ప్రభుత్వాలు ఉండవు,దానికి కారణమేంటంటే అమలు కానీ హామీలు ఇచ్చి, హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం.

ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పని చేస్తున్నటువంటి తీరు ప్రజలలో అసహనానికి గురిచేస్తుంది.కేసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏ స్కీమ్స్ అయితే అమలు అయినవో వాటినే అమలు చేస్తున్నారు.

ఈరోజు ఎట్లా ఉన్నది పరిపాలన అంటే మరి అనుభవం లేని పరిపాలన, అసమర్ధ పరిపాలన, చేతగాని వ్యవహారం ఇవన్నీ చేసుకుంటు ఈరోజు ప్రజల దగ్గరికి వస్తే అర్థం చేసుకున్నారు.

ప్రజలు కేసీఆర్ ఉన్నప్పుడు ఏ రకంగా మా యొక్క జీవితాలు అద్భుతంగా ఉన్నాయి. ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగింది అని నేడు పునరాలోచించుకుంటున్నారు. ఎప్పుడైనా సామెత ఉంటాది పాలు ఇచ్చే గేదెను కాదని దున్నపోతును తెచ్చుకున్నట్టు ఉంది అన్న చందనంగా ప్రజలు చర్చించుకుంటున్నారు.

రేపు ఎన్నిక ఏదైనా ఎగిరేది బిఆర్ఎస్ జెండానే, గెలిచేది బిఆర్ఎస్ అభ్యర్దులే…

ఈ ఏప్రిల్ 27న జరగబోయే మన సభా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయి.

కాబట్టి మిత్రులారా కథం కథం తొక్కి బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు.

బిఆర్ఎస్ పార్టీ నాయకుడు మృతి…

బిఆర్ఎస్ పార్టీ నాయకుడు మృతి…

నేటి ధాత్రి.

 

తంగళ్ళపల్లి మండలం కస్బేకట్కూరు గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జూపల్లి సందీప్ రావు మృతి చెందారు తెలిపినారు.

తెలిసిన సమాచారం ప్రకారం కట్కూర్ గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సికింద్రాబాద్లోనియశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 12 గంటల 15 నిమిషాలకు మృతి చెందారనివారి కుటుంబ సభ్యులు తెలియచేశారు.

వారి మరణం పార్టీకి ఎంతో లోటని తెలియజేస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా జిల్లా బిఆర్ఎస్ మండల పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు తెలిపారు

బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి.

చేనేత కార్మికులకు మద్దతుగా బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి )

 

ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ని స్థానిక అంబేద్కర్ చౌక్ లో సిఐటియు వారి ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు కూలి పెంచే విషయంలో నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది అట్టి నిరాహార దీక్షలో పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ పక్షాన మద్దతు ఇస్తూ జిందాం చక్రపాణి మాట్లాడుతూ చేనేత కార్మికుల కోసం సిరిసిల్ల చేనేత చీరలకు ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చినటువంటి దానికి కూలి పెంచాలని, వైపని కార్మికులకు, వర్పిన్ కార్మికులకు మర మొగ్గల పవర్ లుమ్ కార్మికులకు కూలి పెంచాలని , తెలంగాణ రాష్ట్రంలోని చేనేత చీరలకు అత్యధికoగా ధర కల్పించాలని కోరుతూ ఈరోజు చేనేత కార్మికులకు మద్దతు పలకడం జరిగింది. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోదండ రమణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు ముషం రమేష్, మాజీ వార్డ్ కౌన్సిలర్ దార్ల సందీప్ కీర్తన, తదితర నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎస్పీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.

ఎస్పీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన పరితోష్ పంకజ్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు శుక్రవారం సంగారెడ్డి లోని ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన ఎస్పీకి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిసి మాజీ చైర్మన్ బుచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఎస్పీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..

ఎస్పీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన పరితోష్ పంకజ్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు శుక్రవారం సంగారెడ్డి లోని ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన ఎస్పీకి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిసి మాజీ చైర్మన్ బుచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

BRS మాజీ సర్పంచ్లకు భయపడుతున్నCM.

బిఆర్ఎస్ మాజీ సర్పంచ్లకు భయపడుతున్న సిఎం

ముందస్తు అరెస్ట్ లను ఖండించిన మాజీ సర్పంచ్ విద్యాసాగర్

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రజా పరిపాలన వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ అసెంబ్లీ సమావేశాలలో ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ప్రజలను తప్పుదోవపట్టిస్తున్న సీఎం గత తాజా మాజీ సర్పంచుల పిండింగ్ బిల్లుల పట్ల బిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్లు పోరాటం చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని తిమ్మంపేట మాజీ సర్పంచ్ మోడెం విద్యాసాగర్ గౌడ్ ఆరోపించారు.

BRS party

తనతో పాటు నియోజకవర్గం పరిధిలోని దుగ్గొండి, నల్లబెల్లి, నెక్కొండ,ఖ నాపురం, నర్సంపేట మండలాల తాజా మాజీ సర్పంచులను ముందస్తుగా అరెస్టులు చేసి ఆయా పోలీసు స్టేషన్లో నిర్బందించడం ఎంతవరకు సమంజసం అని పేర్కొన్నారు.అక్రమ అరెస్టులు నిలిపివేసి ఎన్నికల ముందు వాగ్దానం చేసిన పెడింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని విద్యాసాగర్ గౌడ్ డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version