తెలంగాణ రాష్ట్ర హమాలీ సంఘం తమ డిమాండ్ల కోసం ధర్నా

జిల్లా రేషన్ డీలర్ల సంఘ జిల్లా కోశాధికారి బానోత్ బాలు సంఘీభావం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నైటీ ధాత్రి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ఊకె శేఖర్ రావు పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర హమాలీ సంఘం తమ డిమాండ్ లా కోసం ధర్నా నిర్వహిస్తున్న కారణం గా వారికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రేషన్ డీలర్ లా సంఘం జిల్లా కోశాధికారి బాణోత్ బాలు మరియు డీలర్ లు పవన్, రాజ్ కుమార్ లు సంఘీభావం తెలపటం జరిగింది మరియు ప్రభుత్వం ఇచ్చిన హామీలను త్వరగా అమలు చేయవలసినగా కోరుతున్నాము మరియు రేషన్ డీలర్లకు సకాలములో బియ్యం పంపిణీ చేసి పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని బానోత్ బాలు. మరియు రేషన్ డీలర్ల సంఘం కోరుతున్నారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య 

భద్రాచలం నేటి ధాత్రి

విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన మౌలిక సదుపాయాలు అందించే బాధ్యత మాది, మా ప్రభుత్వానిది.

భద్రాచలం నియోజకవర్గంలోని – ఎంజేపీటీబీసీ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య పాఠశాలను, తరగతి గదులను, స్టోర్ రూమ్ను, వంటగదిని, వాష్ రూంలను, డ్రైనేజీని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది.

పాఠశాల భవనంలో విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునే వాతావరణాన్ని కల్పించడానికి కొన్ని మార్పులకు సూచనలు చేయడం జరిగింది. త్వరలో భద్రాచలం నియోజకవర్గం కు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ మంజూరవ్వబోతుందని తెలియచేయడం జరిగింది.

ఈ సందర్భంగా భోజన విరామ సమయంలో కళాశాల విద్యార్థినిలతో కలిసి ముచ్చటిస్తూ – భోజనం చేయడం జరిగింది

ఈ కార్యక్రమం భద్రాచలం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరవడం జరిగింది.

విద్యార్థులు చన్నీళ్లతో స్నానం చేస్తున్న సమస్యను అధ్యాపకులు వారి దృష్టికి తీసుకురాగానే, త్వరలోనే సోలార్ హీటర్ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలియచేయడం జరిగింది.

ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలి.

రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ, బి.సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.

వనపర్తి / నేటి ధాత్రి.

ట్రాఫిక్ నిబంధనలు పాటించడమే కాకుండా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ ఒక సామాజిక బాధ్యతగా భావించి అరికట్టేందుకు కృషిచేయాలని రాష్ట్ర రవాణా, బి.సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. శనివారం మధ్యాహ్నం రోడ్డు భద్రత మాసోత్సవాలపై హైదారాబాద్ నుండి జిల్లా కలెక్టర్లు, ఎస్పీ, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సర రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించేదని, రోడ్డు భద్రతపై అత్యంత ప్రాధాన్యత దృష్ట్యా దీనిని రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నెల రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో రోడ్డు భద్రతా, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని స్కూల్, కళాశాలల్లో ట్రాఫిక్ ట్రాక్ ఏర్పాటు చేసి విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతా పై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ అండ్ బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ మాట్లాడుతూ చాలా మందికి ట్రాఫిక్ రూల్స్ తెలియవని అడ్డదిడ్డంగా వాహనాలు నడపటం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రతిరోజూ ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. అందువల్ల ప్రమాదాల నివారణకు ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించటం, ర్యాలీలు ఏర్పాటు చేయటం వంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించేందుకు ప్రాంతాల వారీగా లింక్ ఏర్పాటు చేసి అక్కడి ప్రజలు, వ్యాపారస్తులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాదం జరిగిన వెంటనే 108 కు సమాచారం ఇవ్వడం, దగ్గరలోని ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించడం పై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. జిల్లాలో రోడ్డు భద్రత మాసొత్సవాలు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళికలు చేయడం జరిగిందన్నారు. బ్లాక్ స్పాట్ గుర్తించి సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం, విద్యాలయాల్లో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనల పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నిబంధనలు పాటించని వాహన దారుల పై జరిమానాలు వేసేందుకు చర్యలు తీసుకోవాలని పోలీస్, రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. రోడ్డు భద్రతా కమిటీ సమావేశాలు తరచుగా నిర్వహించి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు.
వాహనాలపై పరిమితికి మించి ప్రయాణం చేయడం, రాంగ్ రోడ్ డ్రైవింగ్, హెల్మెట్ ధరించని, ర్యాష్ డ్రైవింగ్ చేసేవాళ్లను గుర్తించి జరిమానాలు విధించాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ రావుల గిరిధర్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, డిఎస్పీ వేంకటేశ్వర రావు, ఆర్డీఓ సుబ్రమణ్యం, ఆర్.టి. ఒ మానస, పంచాయతీ రాజ్ ఈ ఈ మల్లయ్య, రోడ్లు భవనాలు డి. ఈ సీతారామ స్వామి ఎన్.ఐ.సి. ఐ.ఆర్.ఎ.డి. నుండి మురళీ కృష్ణ, డి.యం ఆర్టీసీ తదితరులు పాల్గొన్నారు.

4వ రోజుకు చేరిన సివిల్ హమాలీ కార్మికుల నిరవధిక సమ్మె

అర్దనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపిన కార్మిక సంఘం నాయకులు

ప్రభుత్వం హామీలను నెరవేర్చాలని కార్మికుల డిమాండ్

ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెలను ఉద్రిక్తం చేస్తాం

పరకాల నేటిధాత్రి
సివిల్ సప్లై హమాలీల ఎగుమతి దిగుమతి రేట్ల ఒప్పందం ప్రకారం జీవో విడుదల చేయాలని సివిల్ సప్లై కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టిన నేపథ్యంలో పరకాల పట్టణంలోని సివిల్ సప్లైగోదాం వద్ద యూనియన్ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె 4వ రోజుకు చేరింది.ఈ సందర్బంగా పలువురు కార్మిక నాయకులు మాట్లాడుతూ హమాలీల వేతన పందాన్ని వెంటనే అమలు చేయకపోవడం తో 2025 జనవరి 1నుండి రాష్ట్రవ్యాప్తంగా సివిల్ సప్లై మరియు జిసిసి హమాలీల కార్మికుల ఎగుమతి దిగుమతి రేట్ల ఒప్పందం 2023 డిసెంబర్ తో ముగిసింది 2024,2025 నూతన రేట్ల ఒప్పందాన్ని కోసం హమాలీ కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో ప్రభుత్వానికి అనేక సందర్భాలలో వినతి చేసుకున్నప్పుడు నూతన రేట్లు మరియు ఇతర సమస్యల పరిష్కారానికి 10 నెలల తర్వాత 3అక్టోబర్ 2024 న అన్ని కార్మిక సంఘాల సమక్షంలో చర్చలు జరిపి ఎగుమతి దిగుమతి నూతన రేట్లు ప్రస్తుతం ఉన్న 26 నుండి 29 రూపాలుగా అనగా 3రూపాయలు పెంచారని ఈ పెరిగిన రేట్లు 2024 జనవరి నుండి అమలు చేస్తామని ఏరియాస్ తో సహా చెల్లిస్తామని,మహిళా కార్మికులకు గోధుమల సామర్ధ్యాన్ని బట్టి ప్రస్తుతం ఇస్తున్నా వేతనం పైన 1000అదనంగా పెంచుతామని,బోనస్ 6,500 నుండి 7500కు,యూనిఫామ్ స్టిచ్చింగ్ చార్జి 1300 నుండి 1600 వరకు పెంచుతామని కమిషనర్ సంబంధిత అధికారులు అంగీకరించడం జరిగిందన్నారు.మూడు నెలలు గడిచిన ఒప్పందం ప్రకారం నేటికీ కనీసం జీవో విడుదల చేయలేదని గత ఒప్పందాల సందర్భంలో చర్చలు జరిగిన తర్వాత జీవో విడుదల చేసి వెంటనే పెరిగిన రేట్ల ప్రకారం ఏరియర్స్ అందించడం జరిగేదని గత ఒప్పందాలకు భిన్నంగా సంవత్సరం కాలం గడిచిన నేటికి హమాలీల సమస్యల పైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం హమాలీలను ఆర్థికపరంగా నష్టపరచడమేనని అన్నారు.ఈ కార్యక్రమంలో హమాలీ యూనియన్ అధ్యక్షులు గడ్డం సురేష్,కార్యదర్శి మచ్చ సందీప్,ఉపాధ్యక్షులు సర్వేషం,మచ్చ శంకర్,బొచ్చు కృష్ణ,బొచ్చు బిక్షపతి,జూపాక చంద్రమౌళి,కొమ్ముల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు

– రాష్ట్ర బీసి, రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్

– రోడ్డు భద్రత ప్రమాణాలపై విస్తృత ప్రచారం కల్పించాలి

– జిల్లా హెడ్ క్వార్టర్ లో పిల్లలచే రొడ్డు భద్రతా ప్రమాణాల పై భారీ ర్యాలీ

– గురుకులాలో పిల్లలకు అందించే ఆహార నాణ్యత పై తనిఖీలు నిర్వహించాలి

– రోడ్డు భద్రత ప్రమాణాల అవగాహన పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి పొన్నం ప్రభాకర్

సిరిసిల్ల(నేటి ధాత్రి):

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత ప్రమాణాలపై అవగాహన కల్పించేలా రోడ్డు భద్రత మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు.

శనివారం రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ నుంచి రోడ్లు భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ తో కలిసి రోడ్డు భద్రత మాసోత్సవాల నిర్వహణ పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, గతంలో కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించేదని, దీని ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని నేడు రొడ్డు భద్రతా మాసోత్సవం చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి శాఖను భాగస్వామ్యం చేస్తూ వినూత్నంగా ప్రజలకు చేరేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.

రోడ్డు భద్రత ప్రమాణాల పై వేడుకలను ప్రతి గ్రామంలో జరగాలని అన్నారు. పిల్లల్లో రొడ్డు భద్రతా ప్రమాణాల పై అవగాహన కల్పించేందుకు ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. సంక్రాంతి సెలవుల తర్వాత విద్యార్థులచే ప్రతి జిల్లా , మండల హెడ్ క్వార్టర్ లో భారీ ర్యాలీ చేపట్టాలని అన్నారు.

ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖ తమ పరిధిలో రొడ్డు భద్రతా ప్రమాణాల కార్యక్రమాలు జరగాలని అన్నారు. రవాణా శాఖ, పోలీస్ శాఖ, విద్యాశాఖ, రొడ్డు భవనాలు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రోడ్డు భద్రత కార్యక్రమాలు విజయవంతం చేయాలని అన్నారు.

భారీ తుఫాన్లు, వరదలు, రోగాల వల్ల పోయే ప్రాణాల కంటే ప్రమాదంలో అధికంగా ప్రాణాలు కోల్పోతున్నామని, రొడ్డు ప్రమాదాల నియంత్రణకు మనమంతా కలిసి పని చేయాలని అన్నారు. రొడ్డు భద్రతా ప్రమాణాలను పిల్లల సిలబస్ లో కూడా పెట్టెలా చూస్తామని అన్నారు.

రోడ్డు భద్రత నియమాలను పాటించని వారి లైసెన్స్ రద్దు చేసి భవిష్యత్తులో జారీ చేసేందుకు వీలు లేకుండా సాఫ్ట్వేర్ రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని అన్నారు. రోడ్డు భద్రత ప్రమాణాల కార్యక్రమాలకు విస్తృత ప్రచారం ఉండాలని, స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని అన్నారు.

రోడ్డు భద్రత ప్రమాణాల అవగాహన కార్యక్రమాల్లో హెల్మెట్ వినియోగం వల్ల కలిగే లాభాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ వినియోగించేలా ప్రోత్సహిస్తూ కొంతమందికి హెల్మెట్ పంపిణీ చేయాలని, ఈ కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు.

మహిళల ప్రయాణికుల సంఖ్య పెరిగిన మార్గాలలో బస్సులు పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. రవాణా శాఖ అధికారులు దొడ్డు భద్రతా కార్యక్రమాలను ముందుండి నిర్వహించాలని, పాఠశాలలో రోడ్డు భద్రత ప్రమాణాలపై పోటీ పరీక్షలు నిర్వహించాలని అన్నారు.

రెసిడెన్షియల్ పాఠశాలలో పిల్లలకు మెస్ చార్జీలు పెంచామని, వారికి రుచికరమైన నాణ్యమైన ఆహారం అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. పిల్లలకు అందించే ఆహర నాణ్యతను కలెక్టర్లు , ఉన్నతాధికారులు తనిఖీ చేయాలని, ఆహర సరఫరా చేసే కాంట్రాక్టర్లకు బిల్లులు త్వరగా చెల్లిస్తున్నామని , నాణ్యత అంశంలో ఎక్కడ రాజీ ఉండవద్దని అన్నారు.

రోడ్డు భవనాల శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ మాట్లాడుతూ,
జనవరి నెల మొత్తం రోడ్డు భద్రత ప్రమాణాల కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు తెలిపారు. ప్రస్తుత సమాజంలో జరిగే రొడ్డు ప్రమాదాలలో 75 శాతం డ్రైవర్ తప్పుల వల్ల జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలోని వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత ప్రమాణాలు, పాటించాల్సిన నియమ నిబంధనల పై అవగాహన కల్పించాలని అన్నారు.
రోడ్ల పై ప్రమాదాలు జరిగినప్పుడు అంబులెన్స్ ఏ ఆసుపత్రికి తీసుకుని రావాలి ఒక ప్రణాళిక ఉండాలని, దిని పై అవగాహన కల్పించాలని అధికారులకు ఆయన సూచించారు. ప్రతి జిల్లా స్థాయిలో ఉన్న రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించి, ఆక్సిడెంట్ ప్రోన్ ఏరియా గుర్తించాలని, అక్కడ అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు.
ప్రతి పాఠశాల పరిసరాలలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు చిన్నతనం నుంచి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన ఉండాలని అన్నారు. రోడ్డు భద్రత ప్రమాణాలపై లోకల్ ఎఫ్.ఎం రేడియో, కేబుల్ చానల్స్ లో టెలికాస్ట్ అయ్యేలా చూడాలని అన్నారు.
రోడ్లు భవనాల శాఖ, పంచాయతీ రోడ్లు, జాతీయ రహదారుల్లో అవసరమైన సైన్ బోర్డులు ఉండేలా జిల్లా రవాణా శాఖ అధికారి పర్యవేక్షించాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ లక్ష్మణ్, ఈఈ పి.అర్. సుదర్శన్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ, రవాణా శాఖ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఎరువుల దుకానులను తనిఖీ చేసిన వ్యవసాయ అధికారి

పరకాల నేటిధాత్రి
పరకాల మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ శనివారం రోజున పరకాల పట్టణంలోని పలు ఫర్టిలైజర్స్ షాపులను ఆకస్మిక తనిఖీ చేసే క్రమంలో ఎరువులు పురుగు మందులకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి అనంతరం మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ అయిపోయి రబీ సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో రైతులకు ఎరువుల కొరతను నియంత్రించే నేపథ్యంలో హనుమకొండ జిల్లా పరకాల పరిధిలోని అలాట్మెంట్ అయినా ఎరువులను ఇతర జిల్లాలకు హోల్సేల్ లో అమ్మకూడదని ఫర్టిలైజర్ షాప్ యజమానులకు తెలియపరుస్తూ రైతులు తప్పకుండా ఎరువులు కొనుగోలు చేసే సమయంలో ఆధార్ కార్డు తో కొనుగోలు చేసుకోవాలని కోరారు.

మైనార్టీ యువతి యువకులకు ఉచిత శిక్షణ

వనపర్తి / నేటి ధాత్రి.

వనపర్తి జిల్లాల్లో మైనార్టీ యువతకు ఉచితంగా గ్రూప్-1,2,3,4 ఆర్ఆర్ బి, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ వంటి పరీక్షలకు నాలుగు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి సుబ్రహ్మణ్యం శనివారం తెలిపారు. నిరుద్యోగులు ఈనెల 17వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారులు ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, మెమో, ఆధార్ కార్డు జిరాక్స్, రెండు ఫోటోలతో వనపర్తి కలెక్టర్ కార్యాలయంలోని ఐడిఓసి కార్యాలయం నందు దరఖాస్తులను అందజేయాలన్నారు.

ప్రజలతో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ముఖాముఖి

భూత్పూర్ /నేటి ధాత్రి.

మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ సమీపంలోని మినీ ఇండోర్ స్టేడియంలో అధికారులు, మండలంలోని వివిధ గ్రామ ప్రజలతో శనివారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ముఖాముఖి, సమీక్ష సమావేశంను నిర్వహించారు. ఈ సందర్భంగా..గ్రామాల్లోని సమస్యలను ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తేవడంతో… అట్టి సమస్యలపై అధికారులతో చర్చించి, పలు సమస్యలను తక్షణం పరిష్కరించి, మిగతా సమస్యలను నోటిఫై చేసుకున్నారు. పెండింగ్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అన్నారు.

శ్రీ పాండురంగ స్వామి దేవాలయంలో గోదాదేవి ధనుర్మాస ఉత్సవాలు

వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి పట్టణంలో బ్రాహ్మణవాడలో శ్రీ పాండురంగ స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు గోదాదేవి పల్లకి సేవ ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ అధ్యక్షులు పూరి పాండు నిర్వాహకులు 15వ వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ పూరి బాలరాజ్ పాపిశెట్టి శ్రీనివాసులు వలకొండ జగదీష్ కోట్ర నరసింహ కొంపల బాలచంద్రుడు ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు ఆలయ పురోహితులు రామకృష్ణ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వారు పేర్కొన్నారు ప్రతిరోజు ఉదయం 5 గంటలకు గోదాదేవి అమ్మవారి పల్లకి సేవ అష్టోత్తరం పూజలు ఉంటాయని వారు పేర్కొన్నారు భక్తులు శ్రీ పాండురంగ స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలలో పాల్గొని పాండురంగ స్వామి గోదాదేవి అమ్మవారి అనుగ్రహం పొందాలని వారు కోరారు భక్తులు జర్నలిస్టు నాగబంది వెంకట్ రమణ క్రాంతి ట్రాన్స్ పోర్టు నుకల విజయ హరి నాథ్ అలుగడ్డ శ్రీనివాసులు కొండ విశ్వనాథం లగిశెట్టి చక్రవర్తి భక్త్తులు పాల్గొన్నారు

గట్టుఇప్పలపల్లిలో బ్యాంకును ఏర్పాటు చేయాలని ఎంపీ మల్లు రవికి వినతి.

తలకొండపల్లి /నేటి ధాత్రి

తలకొండపల్లి మండలంలోని గట్టు ఇప్పలపల్లి గ్రామంలో నూతన బ్యాంకును ఏర్పాటు చేయాలని గ్రామస్తులు శనివారం ఎంపీ మల్లురవిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామంలో బ్యాంకు లేకపోవడంతో సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుందని, వికలాంగులు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు అన్నారు. బ్యాంకును ఏర్పాటు చేయాలని ఎంపీ మల్లు రవిని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు రేణురెడ్డి, ఇందికంటి శివకుమార్ గౌడ్, బొడ్డే కిషన్, మధుసూదన్ రెడ్డి, సురేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు

కళాశాల ప్రిన్సిపాల్: డాక్టర్ గోలి శ్రీలత

హన్మకొండ, నేటిధాత్రి:

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల వరంగల్ వెస్ట్ నందు సావిత్రిబాయి పూలే 194 వ జన్మదినం సందర్భంగా సావిత్రిబాయి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపన్యాస పోటీలు ,వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగినది. కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే గురించి వారి జీవిత విశేషాలను ఎంతో చక్కగా వివరించారు. అలాగే కళాశాల అధ్యాపకులు డాక్టర్ సాంబలక్ష్మి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహిళల విద్య కోసం ఏ విధంగా కృషి చేశారో వివరించారు. డాక్టర్ రాధిక గారు సావిత్రిబాయి అడుగుజాడల్లో నడవాలని విద్యార్థులకు సూచించారు. అలాగే వైస్ ప్రిన్సిపల్ మాలతి గారు మాట్లాడుతూ విద్యార్థులు సమయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మరియు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గోలి శ్రీలత గారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఎన్నో అవమానాలను ఓర్చుకొని నిస్వార్థ సేవ చేసి ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే ఉండడం మనకు గర్వకారణం అని, అలాగే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఈరోజును (3 జనవరి)మహిళ ఉపాధ్యాయ దినోత్సవం గా వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించడం ఎంతో ఆనందదాయకమని వివరించారు. అలాగే రామకృష్ణ పరమహంస వంటి నిరంతర సామాజిక సేవాభావం కలిగిన మహానుభావులు చెప్పినటువంటి సమదృష్టి గురించి కొన్ని కథలను విద్యార్థులకు వారి అమూల్యమైన సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సీనియర్ ఫ్యాకల్టీ భద్రకాళి మేడం ,డాక్టర్ జక్కె పద్మ, జ్యోతి డాక్టర్ సాంబలక్ష్మి, డాక్టర్ రాధిక ,డాక్టర్ విమల మరియు విద్యార్థులు పాల్గొన్నారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గోలి శ్రీలత ఒక ప్రకటనలో తెలియజేశారు.

ఒకే రోజు బాలయ్య డబుల్ బొనాంజా!

ఇపట్లో ఒక హీరో ఒక్క సినిమా చేయడానికే రెండు మూడు సంవత్సరాల సమయం తీసుకుంటున్నారు. కానీ నట సింహం బాలయ్య మాత్రం ఒకే రెండు సినిమాలు రిలీజ్ చేసి జై బాలయ్య అనిపించుకున్నారు. 1993 సెప్టెంబరు 3 ఒకే రోజు నిప్పురవ్వ, బంగారు బుల్లోడు రిలీజ్ చేశారు. విశేషమేమిటంటే రెండు సినిమాలు హిట్ అయ్యాయి. సుదర్శన 35 ఎంఎంలో నిప్పురవ్వ, సంధ్య 35 ఎంఎం.లో బంగారు బుల్లోడు రిలీజ్ అయ్యాయి. నిప్పురవ్వ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చింది. బంగారు బుల్లోడును రవిరాజ పినిశెట్టి దర్శకత్వం వహించారు. కాకపోతే ఎన్నో అంచనాలతో వచ్చిన నిప్పురవ్వ కొంత చతికిలపడింది. ఆవరేజ్ అనుకున్న బంగారు బుల్లోడు సూపర్ హిట్ అయ్యింది. దటీజ్ బాలయ్య అని అప్పట్లోనే కొనియాడేలా చేసుకున్నారు.

‘‘దమ్మిడీ అడగాలంటే’’ ‘‘దఢ పుట్టాలే’’.

-అవినీతి అంతమే మంత్రి పొంగులేటి లక్ష్యం.

-లంచం కూడా దొంగతనంతో సమానం కావాలే!

-దొంగలకిచ్చే ట్రీట్‌ మెంట్‌ జరగాలే!

-అవినీతి సొమ్ము ముట్టుకోవాలంటే చేతులు వణకాలే!

-అవినీతి సహించొద్దు..దొరికితే వదలొద్దు!

-గత ప్రభుత్వం హయాంలో విచ్చలవిడిగా అవినీతి.

-దశాబ్దానికి పైగా ట్రాన్స్‌ఫర్లు లేకపోవడంతో విపరీతంగా అవినీతి.

-రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు వందల కోట్లలో సంపాదనలు.

-రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖలో అంతులేని అవినీతి.

-ధరణితో రెవెన్యూ శాఖ అధికారులు కోట్లకు పడగలెత్తారు.

-భూముల ధరలు పెరగడంతో రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారుల చెలరేగిపోయారు.

-ప్రైవేటు వ్యక్తులను పెట్టుకొని మరీ సంపాదనకు ఎగబడ్డారు.

-ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అనిశా వలకు చిక్కుకుంటున్నారు.

-అయినా కించిత్‌ కూడా ఎవరిలోనూ భయం లేదు.

-పదేళ్లుగా అడ్డగోలు దోపిడీ తో కోట్లు కూడబెట్టుకున్నారు.

-ఉద్యోగాలు పోయినా ఫరవాలేదని తెగిస్తున్నారు.

-ఇటీవల ప్రభుత్వ భూమిని అప్పనంగా అమ్ముకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.

-అసలు సూత్రదారి ‘‘సంతోష్‌’’ తప్పించుకున్నాడు?

-పాత్రదారులైన ఇతర ఉద్యోగులు పట్టుబడ్డారు.

-600 కోట్ల భూమి వ్యవహారం ఎక్కడిదాకా వచ్చిందో ఎవరికీ తెలియదు.

-అసలు సూత్రదారి దర్జాగా తిరుగుతున్నాడు.

-అవినీతి కేసులో దోషిని చేయడానికి పై అధికారులే ముందుకు రావడం లేదు.

-అందుకే మంత్రి పొంగులేటి రంగంలోకి దిగనున్నారు.

-అవినీతి అధికారుల భరతం పట్టేందుకు సిద్దమౌతున్నారు.

-రెవెన్యూలో త్వరలో సమూల మార్పులు.

-అవినీతి పరులపై కఠినమైన చర్యలు.

-రిజిస్ట్రేషన్‌ శాఖలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన.

-రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారుల ఆస్థులు మీద నిఘా.

-రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన వారిని ఇబ్బంది పెడితే కటకటాలే!

-ప్రజలను వేధిస్తే జైలు పాలు చేయడమే!

-పట్టుబడిన వెంటనే వారి ఉద్యోగాలు ఊడిపోవాలే!

-ఆస్థులన్నీ జప్తు జరిపి రోడ్డున పడాలే!

 

హైదరాబాద్‌,నేటిధాత్రి:
తెలంగాణలోని కొన్ని శాఖల్లో అధికారుల అవినీతికి హద్దూ బద్దూ లేకుండాపోతోంది. మరీ ఇంత అన్యాయానికి ఎందుకు తెగబడుతున్నారని ప్రశ్నించే వారు కూడా లేకుండాపోతున్నారు. ఓ వైపు అవినీతి నిరోధక శాఖ అధికారులు డేగ కండ్లేసుకొని జల్లపడుతున్నా అవినీతి ఆగడంలేదు. వారిలో భయం అన్నది కనిపించడం లేదు. నిత్యం ఎవరో ఒకరు ఎక్కడోఅక్కడ పట్టుబడుతూనే వున్నారు. ఈ ఏడాది కాలంలో 300లకు పైగా అధికారులు పట్టుబడ్టారంటే అవినీతి ఏమేరకు విశృంఖలంగా జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. గత పదేళ్ల అవినీతి పరంపరను అవినీతి అదికారులు ఆపడం లేదు. కొత్త ప్రభుత్వం వచ్చిందన్న భయం అంతకన్నా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో దృష్టిపెట్టి అవినీతిని అంతం చేయాలని చూస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఉద్యోగం వెలగబెట్టడమంటే ప్రజలను పీడిరచి సొమ్ము వసూలు చేయాలని అనుకుంటున్నారో ఏమో? ప్రజల చెల్లించే పన్నుల ద్వారా జీతాలు తీసుకుంటూ, ప్రజలకు సేవ చేయాల్సిన బాద్యతలో వున్నామన్న విషయాన్ని ఎప్పుడో మర్చిపోయినట్లున్నారు. అందుకే ఇంతగా భరితెగిస్తున్నారు. ఓ వైపు మేం వేతన జీవులమంటూ అమాయకపు చూపులు చూస్తూ, ప్రభుత్వం నుంచి పొందాల్సిన సదుపాయాలు పొందుతూ, హక్కులు సాధించుకుంటూనే వున్నారు. జీతాలు ఇబ్బడి ముబ్బడిగా పెంచినా, ప్రజలను పీడిరచడం మానుకోవడంలేదు. అవినీతిని ఆపడం లేదు. లంచాలకు మరిగి కోట్లు సంపాదించుకుంటున్నారు. మేం లేకపోతే వ్యవస్ధ నడవదన్న అహం అధికారుల్లో బాగా పెరిగిపోయింది. ఉద్యోగం పోతే జీవితం ఆగమైపోతుందన్న భయం లేకుండాపోయింది. ఎందుకంటే జీవితాంతం ఉద్యోగం చేస్తే జీతం ద్వారా వచ్చే ఆదాయం చాలా మంది ఉద్యోగులు అంతకు పది రెట్లు ఈ పదేళ్ల కాలంలో సంపాదించిపెట్టుకున్నారు. ఆస్ధులు కూడబెట్టుకున్నారు. ఇండ్లు , స్ధలాలు కొని పెట్టుకున్నారు. హైదరాబాద్‌ లో కూడా చిన్నా చితక ఉద్యోగులు కూడా విల్లాలు కొనుగోలు చేసుకున్నారంటే అవినీతి ఎంతగా రాజ్యమేలుతుందో అర్దం చేసుకోవచ్చు. ఇక పెద్ద పెద్ద హోదాలలో వున్న అధికారుల సంపాదన ఎలా వుందో పట్టుబడిన వారిని చూస్తేనే తెలిసిపోతుంది. గత ప్రభుత్వ హాయంలో ధరణి మూలంగా రెవిన్యూశాఖ, భూముల విలువ పెంచడంతో రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చేసిన దోపిడీ అంతా ఇంకా కాదు. అవినీతికి పాల్పడి, అక్రమంగా సంపాదించిన అధికారుల ఆస్ధులు వెలికితీస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంతో సరిసమానమౌతుందని అంటున్నారు. అంతలా ఈ పదేళ్ల కాలంలో ప్రజలు జలగల్లా పీల్చుకుతిన్నారు. ఇంకా చాలదన్నట్లు తింటూనే వున్నారు. జేబులు నింపుకుంటూనే వున్నారు. పట్టుబడుతూనే వున్నారు. అయినా ఏ ఉద్యోగ వ్యవస్ధలో కించింత్‌ భయం కూడా కనిపించడం లేదు. ఉద్యోగం పోతే పోని అన్నట్లుగా తయారయ్యారు. అందుకే ఇలా భరితెగించి లాంచాలు తీసుకుంటున్నారు. రైతులు తమ భూమిని కుటుంబ సభ్యుల మీదకు మార్చుకుంటే కూడ లక్షల రూపాయలు ముట్టజెప్పుకోవడం ఏమిటి? ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుములు చెల్లింపులు చేస్తున్నా, అధికారులకు లంచాలు ఎందుకివ్వాలి. ప్రభుత్వానికి చెల్లిస్తున్న సొమ్ముకు పదింతలు లంచాలు వసూలు చేస్తున్నారు. కోట్లు రూపాయలు గడిస్తున్నారు. భూములను కుటుంబ సభ్యుల పేరు మీద మార్చడానికి కూడా లక్షల రూపాయలు వసూలు చేసి, కోట్లు కొల్లగొడుతున్నారు. అవినీతికి అలవాటు పడిన అధికారులను దారిలోకి తీసుకురావాల్సిన అసవరం వుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవిన్యూ శాఖ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిలు సీరియస్‌గానే వున్నారు. అవినీతి అన్నది అన్ని శాఖలో పాతుకుపోయింది. వైరస్‌ కన్నా ప్రమాదకరంగా మారిపోయింది.
తెలంగాణలో అవినీతి అధికారుల మూలంగా రెవిన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలు పూర్తిగా భ్రష్టుపట్టిపోయాయి. అందుకే రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇక పూర్తిగా రంగంలోకి దిగుతున్నారు. రెండు శాఖల్లో జరుగుతున్న అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించే ప్రయత్నానికి శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే పలు మార్లు చెప్పి చూశారు. హచ్చరించారు. అయినా అదికారుల్లో మార్పు రావడం లేదు. లంచాలవతారాలు మారడం లేదు. వారి చేతి వాటం ఆపడం లేదు. అధికారులు చేసే అవినీతి మూలంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదముంది. పైగా కొత్తగా భూ భారతి వచ్చింది. సమస్యలతో సతమతమౌతున్న రైతులు రెండు శాఖల కార్యాలయాలకు క్యూ కట్టే సమయం వచ్చింది. గత ప్రభుత్వం ధరణి దరిద్రం తెచ్చిపెట్టినప్పటి నుంచి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పటి నుంచి తీరని సమస్యలు భూ భారతి ద్వారా తీరుతాయిని ఎన్నొ ఆశలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి సమయంలో రైతులను, ప్రజలు రెవిన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ఇబ్బందులకు గురిచేసే పరిస్దితులు లేకపోలేదు. అందుకే మంత్రి పొంగులేటి ముందస్తుగా హెచ్చరించారు. రైతులనుగాని, ప్రజలను గాని ఇకపై ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. అయినా లెక్క చేయకుండా ఎవరైనా లంచాలు తీసుకుంటే మాత్రం పరిణామాలు తీవ్రంగా వుండే అవకాశం వుంది. లంచం తీసుకొని దొరికిపోతే పోయేది ఉద్యోగమే కదా? అని ఇకపై అనుకుంటే పొరపాటు. గత పాలకులు అవినీతిని ప్రోత్సహించి, అధికారుల అవినీతిని చూస్తూ ఊరుకున్నారు. అధికారులు జనాన్ని పీల్చి పిప్పి చేస్తున్నా పట్టించుకోలేదు. కాని ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే మాత్రం ఉపేక్షించే పరిస్ధితి లేదు. ప్రజలు ఎవరు ఇబ్బందులకు గురిచేసినా, లంచాల కోసం పీడిరచినా, వేదించినా, ఒక్క రూపాయి తీసుకున్నట్లు సమచారం అందినా సరే ఆ ఉద్యోగి కొలువు ఊడిపోవడమే కాకుండా, ఉద్యోగిగా అవినీతి సంపాదన మొత్తం వెలికి తీస్తారు. ఆస్దులను జప్తు చేస్తారు. ఉద్యోగులను జైలు పాలు చేస్తారు. దాంతో కుటుంబం ఉద్యోగులు కుటుంబాలు వీధినపడే అవకాశాలున్నాయి. ఇంత కాలం అలాంటి భయం లేకపోవడం వల్లనే అధికారులు విచ్చలవిడిగా లంచాల రూపంలో దోచుకున్నారు. ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. నిజానికి లంచగొండి తనాన్ని దొంగతనంగా భావించాలి. ఒక దొంగ దొంగతనానికి పాల్పడితే పోలీసులు ఎలాంటి ట్రీట్‌ మెంటు ఇస్తారో! అలాంటి ట్రీట్‌ మెంటు అమలులోకి తీసుకురావాలి. ఓ వైపు విచ్చలవిడిగా అవినీతి సాగిస్తారు. మరో వైపు ప్రశ్నించిన ప్రజలను వేదిస్తారు. అవసరమైతే కేసులు నమోదు చేస్తారు. ఇలా ప్రజలను తమ దారికి తెచ్చుకోవడానికి అధికారులు వేసే వేలం వెర్రి వెషాలకు కూడా అడ్డుకట్ట పడాలి. ఒక అదికారి నీతిగా నిజాయితీగా ప్రజలకు పనులు చేసి పెడితే దండం పెడతారు. దేవుడని కొలుస్తారు. జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. కాని అదే అదికారులు పీడిరచుకు తింటే నిత్యం శపిస్తారు. ఇలాంటి సమయంలో అదికారులు అత్యుత్సాహానికి పోయి బాదితుల మీద కేసులు నమోదు చేసి వేదిస్తుంటారు. ఇకపై ఇలాంటివి జరక్కుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేకుంటే అదికారులు దారికి రారు. వారి అవినీతిని ఆపరు. లంచాలు అడగాలంటే అదికారులు ధడ పుట్టాలి. అవినీతి చేయాలంటే చేతులు వణికిపోవాలి. గత పదేళ్ల కాలంలో అటు రెవిర్యూ, ఇటు రిజిస్ట్రేషన్‌ శాఖల్లో ట్రాన్స్‌ఫర్లు లేకుండా ఏళ్ల తరబడి తిష్టవేసుకొని వున్నారు. అవినీతి సామ్రాజ్యాలు సృష్టించుకున్నారు. రిజిస్ట్రేషన్‌ శాఖలో ఇది మరీ దారుణంగ తయారైంది. జిల్లా స్ధాయిలో పనిచేసిన రిజిస్ట్రేషన్‌ అదికారులు, ఉద్యోగులు చిన్న పట్టణాలలో పనిచేయడానికి నామోషీగా భావిస్తున్నారు. పాతుకుపోయిన దగ్గర కోట్లకు కోట్లు సంపాదించుకునే వెసులుబాటు కల్పించుకున్నారు. ఇటీవల మేడ్చల్‌,మల్కాజిగిరి జిల్లా పరిధిలో సుమారు 600 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని జిల్లా రిజిస్ట్రేషన్‌ అధికారి కనుసన్నల్లో హంపట్‌ చేశారు. ప్రభుత్వ భూమిని మాయం చేశారు. ప్రైవేటు వ్యక్తులకు దార దత్తం చేశారు. ఇది వెలుగులోకి రావడంతో కింది స్ధాయి ఉద్యోగులను బలి చేశారు. అంత పెద్ద రిజిస్ట్రేషన్‌ తంతు జిల్లా రిజిస్ట్రార్‌కు తెలియకుండా జరిగిందా? అని నేటిధాత్రి అనేకసార్లు ప్రశ్నించింది. కాని సమాధానం చెప్పిన వారు లేరు. డిఆర్‌పై చర్యలు తీసుకున్నది లేదు. 600 కోట్ల రూపాయల స్ధలం మాయంలో సూత్రదారి బాగానే వున్నారు. కాని జిల్లా అధికారి ఆదేశాలను పాటించిన పాత్రదారులైన కింది స్ధాయి ఉద్యోగులు బలయ్యారు. జైలు పాలయ్యారు. అందుకే ఈ రెండు శాఖలను పూర్తిగా ప్రక్షాళన చేస్తే గాని వ్యవస్ధలు గాడిలో పడవు. అవినీతి ఆగదు. ప్రజలు మేలు జరగదు. లేకుంటే యాదా విధిగా అదే అవినీతి రాజ్యమేలక తప్పదు.

అవకాశవాదులకు నో ఛాన్స్‌

ఈ ఎన్నికల్లో గెలిస్తే రేవంత్‌ ఇక బాహుబలే!

సంక్షేమ పథకాలే ఆయుధం

పదేళ్లు పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకే అవకాశాలు

తన మార్క్‌ వ్యూహంతో ముందుకెళుతున్న రేవంత్‌

హైదరాబాద్‌,నేటిధాత్రి:

రేవంత్‌ ప్రభుత్వం విజయవంతంగా ఏడాది పాలన ముగించుకొని రెండో ఏడాదిలోకి ప్రవేశిం చింది. అయితే ఈ ఏడాది స్థానిక ఎన్నిక సంస్థల గడువు ముగిసిపోనుండటంతో వాటికి ఎన్నికలు జరపాలి. రేవంత్‌ సర్కార్‌ ఈ ఎన్నికల నిర్వహణకు ఇప్పటినుంచే సమాయత్తమవుతున్నట్టు జరుగుతున్న పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పాటు, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ఎన్నికలకు నిర్వహించాలి. మున్సిపాలిటీల పాలక వర్గాల కాలపరమితి జనవరి 26తో, గ్రామ పంచాయతీల కాలపరమితి ఫిబ్రవరితో, జిల్లా మరియు మండల పరిషత్‌ల కాలపరమితి వచ్చే జులైతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రభు త్వం ఎన్నికలు నిర్వహించి, తన బలానికి తిరుగులేదని మరోసారి నిరూపించుకోవడానికి సంసిద్ధమవుతోంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్‌లు, మండల ప్రజాపరిషత్‌లకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేదానిపై ఈనెల 4న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చకురానుంది. సంక్రాంతి తర్వాత మార్చి నెలాఖరులోగాదశల వారీగా ఈ ఎన్నికలు జరపాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తున్నది. మార్చి నెలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీల ఎన్నికలు జరుగనున్న తరుణంలో వాటితో పాటే ఈ ఎన్నికలను కూడా ముగించేస్తే బాగుంటుందని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఈ అంశంపై చర్చకు ప్రాధాన్యత ఏర్పడిరది. డిసెంబర్‌ 7వ తేదీన కాంగ్రెస్‌ తన ఏడాది పాలన ముగిసిన సందర్భంగా ఉత్సవాలు చేసుకున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు రేవంత్‌ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనవని చెప్పక తప్పదు. రాష్ట్రంలో మొత్తం 12769 గ్రామ పంచాయతీలు, 129 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్‌ కార్పొరేషన్లు వున్నాయి. 2021లో రాష్ట్రంలో ప్రవేశపెట్టిన జోనల్‌ వ్యవస్థ కింద ప్రస్తుతం ఏడు జోన్లున్నాయి. అవి వరుసగా బాసర, భద్రాద్రి, కాళేశ్వరం, రాజన్న, చార్మినార్‌, జోగులాంబ మరియు యాదగిరి. 5857 ఎంపీటీసీ స్థానాలు, 539 జెడ్పీటీసీ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతాయి.
స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశమున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రు లకు ఇతర నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ పాలనలో కూడా పార్టీ ని అంటిపెట్టుకొని నిబద్ధంగా పనిచేసిన కార్యకర్తలకు మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించాలని ఆయన స్పష్టంగా నిర్దేశించినట్టు తెలుస్తోంది. అవకాశవాద రాజకీయాలు నెర పుతూ, అవసరాన్ని బట్టి పార్టీలు మారేవారిని పట్టించుకోవద్దని ఆయన స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారు. అదీకాకుండా గత అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో అంతకుముందు అంపశయ్య పై ఉన్న పార్టీని ఏకంగా అధికారంలోకి తెచ్చిన రేవంత్‌ ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కూడా తా నేంటనేది మరోసారి నిరూపించుకోబోతున్నారు. స్థానిక ఎన్నికలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతా ల్లో జరుగనున్నందున రైతు, మహిళ, బీసీ, ఎస్సీ సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించి, తమది సంక్షేమ ప్రభుత్వమని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆయన కృతనిశ్చయంతో అడుగులు ముందుకు వేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో పార్టీకి ఏమాత్రం నష్టం జరిగినా, అది రేవంత్‌ నాయకత్వానికి ఇబ్బందులు కలిగించే అవకాశాలు లేకపోలేదు. కాంగ్రెస్‌లో ఇప్పటివరకు స్తబ్దుగా ఉన్న సీనియర్‌ నాయకులు ఒక్కసారి జూలు విదిల్చి రేవంత్‌ను చికాకుపెట్టడానికే యత్నిస్తారు. తన మార్కు రాజకీయాలు నెరపుతున్న రేవంత్‌కు యివేవీ తెలియంది కాదు.
2019 స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసినప్పటికీ, ఈ సారి రాజకీయాల్లో పూర్తి మార్పు కనిపిస్తోంది. గత అసెంబ్లీ మరియు లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత బీఆర్‌ఎస్‌కు చెందిన జిల్లాస్థాయి నాయకులు, చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం తాను ఇప్పటివరకు అమలు చేసిన సంక్షేమ పథకాలపై ఆధారపడుతోంది. రైతుబంధు రూ.10వేల నుంచి రూ.15వేలకు పెంపు, దీనికి తోడు భూమిలేని, కౌలు రైతులకు రైతు భరోసా కింద వార్షి కంగా రూ.12వేలు చెల్లింపు, రైతులకు సన్నవరి ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్‌ చెల్లిం పు, మహిళలకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ సరఫరా వంటి సంక్షేమ పథకాలు ఈ ఎన్నికల వైతరిణి నుంచి గట్టెక్కిస్తాయన్న గట్టి నమ్మకంతో కాంగ్రెస్‌ పార్టీ బరిలోకి దిగనుంది.
కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత, పార్టీ ఫిరాయింపులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ కచ్చితంగా ఈ ఎన్నికలపై చావో రేవో అన్న రీతిలో దృష్టిపెట్టక మానదు. ఇదే సమ యంలో కాషాయపార్టీ కూడా స్థానికంగా మరింత బలపడేందుకు అవసరమైన వ్యూహాలు రచి స్తోంది. కాంగ్రెస్‌ ఇంకా రైతు భరోసా చెల్లించలేదు. దీనికోసం కసరత్తు జరుగుతున్నదని వార్త లు వస్తున్నాయి. ఇదిలావుండగా జనవరి 4వ తేదీన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరుగనుంది. బీసీ కమిషన్‌ నివేదిక ఆధారంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు ఎంతమేర రిజర్వేషన్లు కల్పించాలన్నది, ఎస్సీ ఉప`కుల వర్గీకరణపై ఏకసభ్య కమిషన్‌ నివేదించిన అం శాలు, రైతుబంధు స్థానంలో రైతుభరోసాను ప్రవేశపెట్టడం, యాదగిరిగుట్ట దేవస్థానానికి, టీటీడీస్థాయిలో పాలక మండలిని ఏర్పాటు చేయడం వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. బీసీ కమ్యూనిటీల పై సర్వే నిర్వహించేందుకు గత నవంబర్‌లో ప్రభుత్వం ప్రత్యేకంగా బీసీ కమిషన్‌ను నియమించింది. ఐ.ఎ.ఎస్‌. ఆఫీసర్‌ బి. వెంకటేశ్వరరావు దీనికి నేతృత్వం వహిస్తున్నారు. ఈ కమిటీ నివేదిక ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి అందే అవకాశముంది. అదేవిధంగా సుప్రీంకోర్టు నిర్దేశాల మేరకు ఎస్సీ ఉప`కుల వర్గీకరణకు సంబంధించి రిటైర్డ్‌ హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ నేతృత్వంలో ఒక కమిషన్‌ను అక్టోబర్‌ 11న ప్రభుత్వం నియమిం చింది. ముందుగా ఈ కమిషన్‌ కాలావధిని రెండు నెలలుగా నిర్దేశించినప్పటికీ, తర్వాత వివిధకారణాలవల్ల మరో నెలపాటు ప్రభుత్వం పొడిగించింది. ఈ కమిషన్‌ తుది నివేదిక కూడా ఈవారం చివర్లో అందే అవకాశముంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఈ కమిషన్‌ నివేదిక అందాల్సిన నేపథ్యంలో, తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మరియు ఇతర నియామక సంస్థల నియామ కాలను తాత్కాలికంగా నిలిపేసింది. ఎస్సీ ఉప`కుల వర్గీకరణ కమిషన్‌ నివేదిక ఆధారంగా రిజ ర్వేషన్లను అమలు పరచాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ శాఖల్లో రిజర్వేషన్ల అమలుపై కూడా ఈసమావేశంలో సమీక్షించనున్నారు.
ఈ కేబినెట్‌ సమావేశంలో విధానపరంగా కీలకమైన మార్పు విషయంలో కూడా నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రస్తుతం అమలు చేస్తున్న రైతుబంధు స్థానంలో రైతు భరోసాను తీసుకు రావాన్నది రేవంత్‌ ప్రభుత్వ ఉద్దేశం. అంటే రైతుబంధు కింద ఇప్పటివరకు రైతులకు వార్షికంగా రూ.10వేలు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందజేస్తున్నది. అయితే దీన్ని రూ.15వేలకు పెంచి రైతుభరోసాగా పేరుమార్చాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇదే సమయంలో పెట్టుబడి సా యం అందించే విషయంలో కొత్త నిబంధనలు తీసుకువచ్చే అవకాశముంది. ముఖ్యంగా సహా యం అందించడానికి సాగుభూమి పరిమితిని విధించడం, వ్యవసాయేతర భూములను ఈ పథ కం నుంచి మినహాయించడం, వ్యవసాయ భూమి పరిమితిని 5`10ఎకరాలుగా నిర్ణయించడం వంటి అంశాలు ఈ కేబినెట్‌ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది. అంతేకాకుండా రైతు బంధు నుంచి మినహాయించిన వ్యవసాయ కూలీలు, కౌలు రైతులను రైతు భరోసా కిందికి తీసుకొచ్చి వార్షికంగా రూ.12వేలు చెల్లించే అంశాన్ని కూడా కేబినెట్‌ సమావేశంలో చర్చించనున్నా రు.
యాదరిగిరి గుట్ట దేవస్థానానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో పాలక మండలిని ఏర్పాటుచేయాలన్నది కూడా ప్రభుత్వ ఉద్దేశం. ఇదికూడా చర్చకు వచ్చే అవకాశముంది. ఇదిలావుం డగా సంక్రాంతి తర్వాత కొత్త రేషన్‌ కార్డులను ఇవ్వాన్నది ప్రభుత్వ ఉద్దేశం. రేషన్‌కార్డు ఇచ్చేం దుకు ప్రస్తుతం వున్న వార్షికాదాయ పరిమితిని పెంచే అవకాశముంది. ఏది ఏమైనా ఈ ఏడాది స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగనున్నదున, ఇది కూడా ఎన్నికల నామ సంవత్సరంగా మారిం ది. అందువల్ల ఈ ఏడాది రాష్ట్ర రాజకీయాలు హాట్‌గానే వుండబోతున్నాయనేది స్పష్టమవుతోంది.

క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి.

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్ గ్రామంలో ప్రేమ్ కుమార్, సంపత్ కుమార్ స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు..శారీరక దృఢత్వాన్ని పెంచుతాయని తెలిపారు, క్రీడాకారులు గెలుపు, ఓటములను క్రీడా స్ఫూర్తితో తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు క్రీడాకారులు పాల్గొన్నారు.

పి డి ఎస్ యు ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్ లో దిష్టిబొమ్మ దహనం.

వనపర్తి,నేటిధాత్రి:
వనపర్తి పట్టణంలోని రాజీవ్ చౌక్ లో శుక్రవారం పి డి ఎస్ యు ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యార్థినీ, విద్యార్థులు సి ఎం ఆర్ కాలేజీ యజమాన్యం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పి డి ఎస్ యు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పవన్ మాట్లాడుతూ హైదరాబాద్ లో విద్యార్థినిలను వేధించినందుకు నిరసనగా దిష్టిబొమ్మను దహనం చేశామని ఆయన పేర్కొన్నారు. వెంటనే సీఎంఆర్ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దిష్టిబొమ్మను దహనం చేసే సమయంలో ట్రాఫిక్ పోలీసులు అక్కడికి వచ్చి దిష్టిబొమ్మను దహనం చేయడానికి అనుమతి ఉన్నదా? అని పి డి ఎస్ యు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పవన్ కుమార్ ను ప్రశ్నించారు.

ఎంపీ వద్దిరాజు ఎమ్మెల్సీ సిరికొండ, రాజ్యసభ మాజీ సభ్యులు రావులతో కలిసి సంఘ సంస్కర్త సావిత్రి భాయికి నివాళి

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నాయకులు సిరికొండ మధుసూదనాచారి,

vaddiraju ravichandra

రాజ్యసభ మాజీ సభ్యులు రావుల చంద్రశేఖరరెడ్డితో కలిసి స్త్రీఅభ్యుదయవాది, గొప్ప సంస్కర్త,స్త్రీవిద్య,అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన వీరవనిత సావిత్రి భాయిపూలేకు ఘనంగా నివాళులర్పించారు.సావిత్రి భాయి 194వ జయంతి సందర్భంగా ఎంపీ రవిచంద్ర ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎంపీ చంద్రశేఖర్ రెడ్డి, సాహిత్య అకాడమీ మాజీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి తదితర ప్రముఖులతో కలిసి శుక్రవారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఆమె చిత్రపటానికి పూలుజల్లి ఘనంగా నివాళులర్పించి స్త్రీవిద్యా వ్యాప్తికి చేసిన కృషిని కొనియాడారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్,కోతి కిశోర్ గౌడ్,తుంగబాలు,గాంధీ నాయక్ తదితరులు పాల్గొని సావిత్రి భాయి చిత్రపటానికి పూలువేసి నివాళులర్పించారు.

ముగిసిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ,రెజ్లింగ్ పోటీలు పరిశీలించిన సీఎం ఓఎస్డీ 

రెజ్లింగ్ లో హనుమకొండకు ఏడు పతకాలు

“నేటిధాత్రి”, హనుమకొండ

రాష్ట్రస్థాయి సీఎంకప్ అథ్లెటిక్స్ రెజ్లింగ్ పోటీలు గురువారం ముగిసాయి. స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో గత మూడు రోజులుగా జరిగిన పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి దాదాపు 2వేల మంది ఈ పోటీలో పాల్గొన్నారు. గురువారం ఈ పోటీలను ముఖ్యమంత్రి ఓఎస్డీ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ పోటీలను ప్రారంభించారు. అథ్లెటిక్స్ రెజ్లింగ్ పోటీలను వీక్షించారు. గత కొన్ని రోజులుగా హనుమకొండలు జరుగుతున్న సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణ గురించి జిల్లా క్రీడలు యువజన శాఖ అధికారి గుగులోతు అశోక్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. పోటీలో పాల్గొన్న క్రీడాకారులను సీఎం కప్ పోటీల సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. క్రీడాకారులకు సమకూర్చిన భోజనాన్ని ఆయన ప్రత్యేకంగా పరిశీలించడం కాకుండా భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. క్రీడాకారులకు అందించిన వసతి సౌకర్యాలపై కోచ్ లు మేనేజర్లను అడిగారు. వీరితో పాటు డీసీపీ దేవేందర్ రెడ్డి, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్, డివైఎస్ఓ గుగులోతు అశోక్ కుమార్, తెలంగాణ అథ్లెటిక్స్ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శులు కె.సారంగపాణి, మహ్మద్ కరీం, ఎన్ఐటి ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ డా.రవికుమార్ లు పాల్గొన్నారు.

హనుమకొండ రెజ్లర్ల హవా…

రాష్ట్రస్థాయి సీఎం కప్ రెజ్లింగ్ లో హనుమకొండ జిల్లా రెజ్లర్ల హవా కొనసాగింది. రెజ్లర్లు అద్వితీయ ప్రతిభ కనబరిచి 4 స్వర్ణ , ఒక రజతం, రెండు కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. సబ్ జూనియర్ 60 కేజీలో వి. గణేష్ స్వర్ణం, 53కేజీలో బి.అంజలి, 48 కేజీల విభాగంలో ఎస్.అర్జున్ సాగర్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. జూనియర్ బాలికల 50 కేజీల విభాగంలో బి. ప్రణవి, 59 కేజీలో జె.చిన్ని , 61కేజీలో కొర్ర అఖిల్ స్వర్ణ పతకం

సాధించగా, 57కేజీలో ఎ.రాహుల్ రజత పతకం కైవసం చేసుకున్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను హనుమకొండ జిల్లా క్రీడల యువజన అధికారి గుగులోతు అశోక్ కుమార్, తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ కరీం, వరంగల్, హనుమకొండ జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శులు వై.సుధాకర్, షేక్ రియాజ్, కోచ్ లు కందికొండ రాజు, ఎం.జైపాల్ లు అభినందించారు.

బిసిటియు వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పెరుమాండ్ల సాంబమూర్తి

 

నేటిధాత్రి,కాజీపేట

కాజీపేట ఫాతిమా నగర్ కు చెందిన పెరుమాండ్ల సాంబమూర్తి బిసిటియు వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైనారు. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అయిన జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈ నియామక ఉత్తర్వులను సాంబమూర్తికి అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీ సంక్షేమ సంఘం అనుబంధ సంఘమైన బీసీ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా వరంగల్ నగరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల రైల్వే గేట్ లో సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న పెరుమాండ్ల సాంబమూర్తి సేవలందించారని తెలిపారు. బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అంతకుముందు సాంబమూర్తి మాట్లాడుతూ వరంగల్ జిల్లా బిసిటియు అధ్యక్షుడుగా నియమించిన జాతీయ అధ్యక్షులైన జాజుల శ్రీనివాస్ గౌడ్ కు, బి సి టి యు నేతలైన తాళ్లపల్లి సురేష్, సుంకరి శ్రీనివాస్ రావు, ఇతర నేతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అనంతరం సాంబమూర్తిని పలువురు అభినందించారు

భూభారతి 2024 చట్టంతో సమస్యలు తీరేనా?

రైతులకు చుక్కలు చూపించిన ధరణి

భౌతిక రికార్డులకు డిజిటల్‌ రికార్డులకు పొంతనలేదు

చిన్న పొరపాటుకు కూడా కలెక్టర్‌నే కలవాలంటే ఎట్లా?

పనులు వదులుకొని రైతులు కలెక్టర్‌ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి

ప్రభుత్వ నిర్వాకానికి లబోదిబో మంటున్న రైతులు

రేవంత్‌ సర్కార్‌పై ఆశలు పెట్టుకున్న రైతులు

కొత్త చట్టం అమల్లోకి వస్తే బాధలనుంచి గట్టెక్కుతామన్న ఆశ

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కొత్త రెవెన్యూ చట్టం భూభారతి (ఆర్వోఆర్‌ా2024) బిల్లు గవర్నర్‌ ఆమోదం కోసం తెలంగాణ ప్రభుత్వం పంపింది. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆమోదం తెలిపిన తర్వాత ఈ బిల్లు అమల్లోకి వ స్తుంది. డిసెంబర్‌ 18న శాసనసభలో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆర్వోఆర్‌ా2024 బిల్లును ప్రవేశపెట్టడం, 20వ తేదీన శాసనసభలో, 21న శాసన మండలిలో చర్చలు జరిగిన తర్వాత బిల్లు ఉభయసభల ఆమోదం పొందింది. ఈ కొత్త చట్టానికి సంబంధించిన మార్గదర్శకాలు, ప్రక్రియలను రెవెన్యూశాఖ అధికార్లు పూర్తిచేశారు. ఇక సాగుభూముల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్ల సేవల పోర్టల్‌ ధరణి…నిర్వహణ బాధ్యతలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సంస్థ ఇన్ఫ ర్మేటిక్‌ సెంటర్‌ చేతికి వచ్చాయి. జనవరి 1వ తేదీన ఈ పోర్టల్‌ను సంస్థ పూర్తిస్థాయిలో నిర్వ హించింది. గత ప్రభుత్వ హయాంలో 2020 నవంబర్‌ 2వ తేదీనుంచి అమల్లోకి వచ్చిన ధరణి పోర్టల్‌ను ఐఎఫ్‌ఎల్‌ఎస్‌, దాని అనుబంధ సంస్థ టెర్రా ఐఏసీఎస్‌లు నిర్వహిస్తూ వచ్చాయి. ఈ విదేశీ సంస్థలను తొలగించి స్వదేశీ నిర్వహణలోకి ఈ పోర్టల్‌ను తీసుకొస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసింది. ఈమేరకు నవంబర్‌ నెలాఖరుతో టెర్రా ఐఏసీఎస్‌తో ఒప్పందా న్ని ముగించింది. ధరణి పోర్టల్‌ను భూభారతిగా మార్చారు. ఇందుకోసం రెవెన్యూ చట్టంలో ప్ర భుత్వం మార్పులు చేసింది. దీనికి సంబంధించిన లోగో మరియు ఇతర వివరాలను రెవెన్యూ శాఖ రూపొందిస్తోంది. ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత లోగో ఖరారు చేసి, ప్రారంభించే తేదీని నిర్ణయిస్తారు.

తెలంగాణ రైట్స్‌ ఇన్‌ ల్యాండ్‌ అండ్‌ పట్టాదార్‌ పాస్‌బుక్స్‌ యాక్ట్‌`2020 ప్రకారం ‘ధరణి’ పేరుతో ఆన్‌లైన్‌ రికార్డును గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఈ ధరణిపై భూయజమానుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ముఖ్యంగా పట్టేదార్‌ పాస్‌పుస్తకాలు అందకపోవడం లేదా రిక ర్డుల్లో తమ భూములు, పేర్ల వివరాలు తప్పుగా నమోదు కావడంతో రైతులు గగ్గోలు పెట్టారు. ఈ పొరపాట్ల వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చింది. మరి ఈ ఇబ్బందులను పరిష్కరించేందుకు సరైన యంత్రాంగం లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది. సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ రంగంలోకి దిగి దీన్ని పూర్తిగా మార్చివేస్తామని, సమస్యలను పరి ష్కరిస్తామని 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు వాగ్దానం చేసింది.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేవంత్‌ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ వల్ల ఏర్పడిన సమస్యలపై ని యమించిన సబ్‌`కమిటీ మొత్తం 123 సమస్యలనుగుర్తించింది. భూమి కొనుగోలుదార్లు, రైతులకు నిద్రలేని రాత్రులనే ధరణి మిగిల్చింది. దిగువ స్థాయిలో అప్పిలేట్‌ అథారిటీ లేకపోవడం మరిన్ని సమస్యలు సృష్టించింది. నిజానికి ఈ 123 సమస్యల్లో సింహభాగం మండల స్థాయిలోనే పరిష్కారమవుతాయి. మొత్తం బాధ్యతను కలెక్టర్‌కే అ ప్పగించడంతో చిన్నా, పెద్దా సమస్యలన్నీ పెండిరగ్‌లో పడిపోయాయి. చిన్న సమస్య పరిష్కారానికి కూడా కలెక్టర్‌ వద్దకే పరిగెత్తాల్సి రావడం గ్రామాల్లోని చిన్న,సన్నకారు రైతులకు పెద్ద తలనొప్పిగా మారింది. ధరణిపోర్టల్‌లో వచ్చిన తప్పులు లేదా పొరపాట్లు లేదా ఇతరత్రా చిన్న సమస్యలను ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లినా తమకు అధికారం లేదంటూ చేతులెత్తేయడంతో రైతులు తీవ్ర అయోమయానికి గురైనమాట వాస్తవం. అదీ కాకుండా పాత పద్ధతే వుంటే ఈ గొడవ వుండేది కాదుకదా అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆవిధంగా చిన్న పొరపాట్లకు సంబంధించి వేలాది కేసులు అట్లా పెండిరగ్‌లో పడిపోయాయి. అవి ఎప్పటికి పరిష్కారమవుతాయో కూడా తెలియని పరిస్థితి! ఇక మ్యుటేషన్‌ విషయానికి వస్తే దాన్ని దిగువ స్థాయి అధికార్లకు వదిలేస్తే సరిపోయేది. ఒకవేళ అక్కడ సమస్య పరిష్కారం కకపోతే వారికి ఎగువన రెవెన్యూ డివిజన్‌ స్థాయి లో మరొక లేయర్‌ అధికార్లకు సమస్య పరిష్కారానికి అవకాశం కల్పించాల్సింది. ఇక నాలాల ఆక్రమణల విషయం కూడా స్థానిక అధికార్ల స్థాయిలోనే పరిష్కరించవచ్చు. ఆ విధానమే లేకుండా మొత్తం ఏకబిగిన కలెక్టర్‌, సీసీఎల్‌లపైనే మొత్తం భారం పెట్టడంతో ప్రతి చిన్న సమస్య పీటముడి పడిరది. అప్పుడు రైతులు తమ వ్యవసాయపనులు ఇతర కుటుంబ వ్యవహారాలు చూసుకోవాలా, ప్రభుత్వం చేసిన నిర్వాకానికి కలెక్టర్‌ ఆఫీసు చుట్టూ తిరగాలా? అన్న పరిస్థితి ఏర్పడిరది.

ధరణి సమస్యలను గుర్తించడానికి ఒక స్వచ్ఛంద సేవాసంస్థ పైలెట్‌ ప్రాజెక్టు కింద రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని పది గ్రామాల్లో సర్వే చేసింది. ఈ గ్రామాల్లో 2114 మంది రైతులు ధరణి పరంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తేలింది. అంతేకాదు 4465 ఎకరాలు సర్వే నెంబర్లకు కూడా ధరణివల్ల లేనిపోని సమస్యలు వచ్చినట్టు స్పష్టమైంది. ‘లీగల్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ అసిస్టెంన్స్‌ టు ఫార్మర్స్‌’ (లీఫ్‌) ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సంస్థ తాము సేకరించిన సమస్యాత్మక సమాచారాన్ని రెవెన్యూ అధికార్లకు గత సెప్టెంబర్‌ నెలలో అందజేసింది. ఈ సంస్థ తొలి దశలో ఆయా గ్రామాల్లో క్యాంప్‌లు ఏర్పాటు చేయగా, రెండో దశలో రెవెన్యూ రికార్డులను పరిశీలించి రెవెన్యూ అధికార్ల దృష్టికి తీసుకెళ్లడం, మూడో దశలో రైతులకు సమస్య పరిష్కారంలో సహకరించడం అనే రీతిలో ఈ సంస్థ పనిచేసింది.

భూముల సమగ్ర సర్వే చేపట్టకుండానే ధరణి పోర్టల్‌లో రెవెన్యూ రికార్డులను డిజిటలైజ్‌ చేస్తూ వచ్చారని, ఫలితంగా చాలామంది భూయజమానులైన రైతుల పేర్లు పోర్టల్‌లో కనిపించడం లేదన్న ఆరోపణలు బలంగా వచ్చాయి. దీనివల్ల రైతుబంధుకు అర్హులైన రైతులకు రైతుబంధు మొ త్తం వారి ఖాతాల్లో జమకాలేదు. మరికొంతమంది రైతులు ధరణి రాకముందే తమ భూములను తనఖాకు పెట్టిన సందర్భాలున్నాయి. వీరు రుణాలు చెల్లించిన తర్వాత ధరణి పోర్టల్‌లోని పొర పాట్ల కారణంగా తమకు పాస్‌పుస్తకాలు రావడంలేదని లబోదిబోమంటున్నారు. ఇన్ని సమస్యల నేపథ్యంలో ప్రస్తుతం రైతులు భూభారతి పోర్టల్‌లోనైనా తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

నిజానికి గత మూడేళ్ల కాలంలో ధరణి పోర్టల్‌ వల్ల అనేక కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. బౌతికంగా వున్న రికార్డులకు, డిజిటల్‌ రూపంలో ధరణిలో పేర్కొన్న రికార్డులకు అసలు పొంతనే లేదు. కొన్ని దశాబ్దాలుగా రైతులు దున్నుకుంటున్న భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో ఆ భూ యజమానులు అయోమయంలో పడటమే కాదు, తమ సమస్యను ఎవరికి చెప్పుకో వాలో కూడా తెలియని పరిస్థితికి లోనయ్యారు. నిషేధిత జాబితాలో చేర్చడంతో అత్యవసర పరిస్థితుల్లో తమ భూములను అమ్ము కోవడానికి వీల్లేకుండా పోయింది. సమస్యను నియమిత కాలావ ధిలో పరిష్కరించే యంత్రాంగం లేకపోవడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. ఫలితంగా రెవెన్యూ అధికారి స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలు ధరణి పుణ్యమాని కోర్టుల్లో మూ లుగుతున్నాయి. నిరుపేద రైతులు తమ సమస్యలను వినిపించుకునే అవకాశమే లేకుండా పో యింది. ఈ నేపథ్యంలోనే ధరణి కారణంగా రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారంగా కొత్త ప్రభుత్వం భూభారతి పేరుతో కొత్తచట్టాన్ని రూపొందించింది. వ్యవసాయేతర భూ ములను కూడా ఈ చట్ట పరిధిలోకి కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకురావడమే కాదు, సమస్యలు ఉత్పన్నమైతే దాన్ని పరిష్కరించేందుకు ఒక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో ప్రభుత్వ భూములు అక్రమ ఆక్రమణలకు గురికాకుండా కాపాడటం కూడా దీన్ని ముఖ్యోద్దేశం. ప్రస్తుత ప్రభుత్వం భూములను రీసర్వే చేయడం ద్వారా ధరణిలో జరిగిన పొరపాట్లను సరిదిద్దడానికి ఉద్యుక్తమైంది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ఏవిధంగా ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తుందో చూడాలి.

error: Content is protected !!
Exit mobile version