ఈవీ ద్విచక్ర వాహనాలకు దరఖాస్తుల ఆహ్వానం…

ఈవీ ద్విచక్ర వాహనాలకు దరఖాస్తుల ఆహ్వానం

భూపాలపల్లి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఇందిరా

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంఘం ద్వారా 2025-26 ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద జిల్లాలోని అర్హులైన అభ్యర్ధుల నుండి వివిధ ఆర్ధిక సహాయ పథకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భూపాలపల్లి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఇందిరా ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంకు అనుసంధానంతో రవాణా రంగం కింద ఈవీ టూ వీలర్ ఈవీ త్రీ వీలర్ వాహనాలకు, అలాగే వ్యవసాయ పథకాల కింద సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ యూనిట్లకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు వ్యవసాయేతర పథకాలకు 21 నుండి 50 ఏళ్ల వరకు, వ్యవసాయ ఆధారిత పథకాలకు 21 నుండి 60 ఏళ్ల లోపు ఉండాలి. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1,50,000 పట్టణ ప్రాంతాల వారికి రూ.2,00,000 మించకూడదు. సోలార్ పంప్ సెట్ల కోసం కనీసం రెండు ఎకరాల భూమి కలిగి ఉండాలి. ఈవీ ద్విచక్ర వాహనాల కోసం జొమాటో, స్విగ్గీ, రాపిడో వంటి సంస్థల్లో పనిచేసే గిగ్ కార్మికులకు ప్రాధాన్యత ఉంటుందని, వారు సంబంధిత సర్టిఫికేట్లు సమర్పించాలని సూచించారు. అర్హులైన అభ్యర్థులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీసేవ ద్వారా పొందిన కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు, శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో దివ్యాంగులైతే సదరం సర్టిఫికేట్లతో ఈ నెల 17 నుండి 24 వరకు ఆన్లైన్ వెబ్సైట్ tsobmms.cgg.gov.in ద్వారా లేదా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్ని మండలాలు మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఇందిరా ఒక్క ప్రకటనలో తెలిపారు

పోతుగల్లు శివార్లో ఇష్టారాజంగా ఇసుక దందా… పర్మిషన్ లేని ఇసుక క్వారీ….

పోతుగల్లు శివార్లో ఇష్టారాజంగా ఇసుక దందా… పర్మిషన్ లేని ఇసుక క్వారీ….
అడుగంటిపోయిన భూగర్భ జలాలు…..

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కార్యదర్శి…. మారపల్లి మల్లేష్
మొగులపల్లి నేటి ధాత్రి

 

మొగుళ్లపల్లి మండలం లోని పోతుగల్ గ్రామ శివారులో చలివాగులో ఎలాంటి ఇసుక క్వారీ పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు చలివాగులో సుక్క నీరు లేకుండా ఎండిపోయినది చలివాగు ప్రవహిక ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల పొలాల్లో నీరు అందక ఉన్న బోర్లు ఎత్తిపోయే ప్రమాదం ఉన్నది పొలాలు ఇప్పటికే కొన్ని ఎండిపోతా ఉన్నాయి పొట్టకచ్చిన పొలాలకు ఈ సమయంలో నిరంతకపోతే రైతులు ఆరుకాలం పెట్టినటువంటి పెట్టుబడి రాక చేతికి వచ్చిన పొలం ఎండిపోతుంటే రైతులు లబోదిబో అనే పరిస్థితి దాపురించింది కానీ ఇసుక మాత్రం ఇష్టానుసారంగా తరలించడం వల్లనే భూగర్భ జలాలు అడగండి పోయి ఉన్న బోర్లు ఎత్తిపోతవున్నాయి తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఇసుక దందాను అరికట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం .

ఎండిపోతున్న పొలాలకు నీరు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని రైతులను ఆదుకోవాలని అక్రమంగా తరలిస్తున్నటువంటి ఇసుక బకాసురుల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అన్నారు… ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మండల కార్యదర్శి అంబాల అశ్వద్ధామ అజయ్ పాల్గొన్నారు

కండరాల క్షీణిత వ్యాధితో మంచాన పడ్డ పసునూటి బాలకృష్ణ…

కండరాల క్షీణిత వ్యాధితో మంచాన పడ్డ పసునూటి బాలకృష్ణ

-రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబం

-దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకోలు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మేదరమట్ల గ్రామానికి చెందిన పసునూటి బాలకృష్ణ గత ఆరు సంవత్సరాల నుండి కండరాల క్షీణిత వ్యాధితో బాధపడుతుండేవాడు. రూ.10 లక్షల వరకు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఖర్చు పెట్టుకున్నప్పటికీ..ఆ వ్యాధి నయం కాకుండా మంచాన పడ్డాడు. దీంతో విధి వక్రీకరించిన ఆ కుటుంబం వీధిన పడ్డట్లయ్యింది. పసునూటి బాలకృష్ణకు భార్య స్రవంతి ఇద్దరు కుమార్తెలు ఐశ్వర్య, విష్ణు ప్రియలున్నారు. రోజువారి కూలి పనులు చేసుకుంటూ..భార్య శిరీష కుటుంబ జీవనాన్ని వెల్లదీస్తుంది. దీనికి తోడు కండరాల క్షీణిత వ్యాధితో మంచాన పడ్డ పసునూటి బాలకృష్ణకు నెలకు రూ. 20వేల వరకు మెడిసిన్ ఖర్చు అవుతుంది. అలాగే అదే వ్యాధితో పసునూటి బాలకృష్ణ సోదరీమణులు బాధపడుతున్నారు. కండరాల క్షీణిత వ్యాధి నుంచి బాధపడుతున్న వీరిని రక్షించేందుకు మానవత్వం కలిగి ఉన్న దాతలు స్పందించి..రెక్కాడితే గానీ డొక్కాడని ఆ నిరుపేదల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు రావాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఆ కుటుంబాలకు విరాళాలు ఇచ్చి..బాధిత కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముందుకు వచ్చే దాతలు ఫోన్ పే నెంబర్ 8309029249, గూగుల్ పే నెంబర్ 9666321300 లకు విరాళాలు ఇవ్వాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు విచారణ చేపట్టిన డిఎస్పి….

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు విచారణ చేపట్టిన డిఎస్పి

మొగుళ్లపల్లి నేటి ధాత్రి

మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు కాగా భూపాలపల్లి డి.ఎస్.పి సంపత్ రావు బుధవారం విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించి. మొగుళ్లపల్లి మండలంలోని కొరికిషాల గ్రామానికి చెందిన మాల కులానికి చెందిన ఈత ఓదమ్మ,వృత్తి కూలి, . 2.మార్చి .2026 న మా గ్రామంలో ఉపాధి హామీ కరువు పని నిమిత్తం పోయి పని చేస్తూ ఉండగా అక్కడ నాతోపాటుగా కరువు పనికి వచ్చిన ఆరె కులానికి చెందిన లింగంపల్లి సునీత, మాల కులం పేరుతో బూతులు తిడుతూ నన్ను అకారణంగా బూతులు తిట్టగా , నేను ఆమె జోలికి పోకుండా ఊరుకున్నాను. తేదీ 3 మార్చి 2026 రోజున ఉదయం 7 గంటల 30 నిమిషాల సమయాన నీను మా గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో విషయాన్ని తెలుపుతుండగా సదరు సునీత ఆమె భర్త లింగంపల్లి రాయమల్లు ఆగయ్య దంపతులు ఇద్దరు కలిసి పచ్చి బూతులతో పలుసార్లు కులం పేరుతో దూషిస్తూ సునీత, రాయమల్లు వారు కాళ్లకు వేసుకునే చెప్పులతో నన్ను కొట్టి కొట్టి, కిందపడేసి చేతులతో కొట్టి, కాళ్లతో తన్నినారని కులం పేరుతో దూషిస్తూ కొట్టిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకొని నాకు తగిన న్యాయం చేయగలరని దరఖాస్తు రాగా మొగుళ్ళపల్లి ఎస్సై బి అశోక్ కేసు నమోదు చేయగా భూపాలపల్లి డి.ఎస్.పి సంపత్ రావు బుధవారం కొరికిశాల గ్రామంలో విచారణ చేపట్టారు.

పలు కుటుంబాలను పరామర్శించిన తక్కళ్లపల్లి రాజు…

పలు కుటుంబాలను పరామర్శించిన తక్కళ్లపల్లి రాజు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని లోని పాత ఇస్సిపేట గ్రామం లో పలు కుటుంబాలను పరామర్శించిన తక్కళ్లపల్లి రాజు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నేర్పాటి పోషమ్మ, నేర్పాటి లింగమ్మ, బొచ్చు సారయ్య ఇంటి వద్దకు వెళ్లి వారి చిత్ర పటానికి పూలు వేసి ఘన నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసి రైస్ బ్యాగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తక్కళ్లపల్లి రాజు వెంట గ్రామ సర్పంచ్ పెనుకుల గట్టన్న, మూడో వార్డ్ మెంబర్ బొచ్చుఅర్చన(కిషన్), గ్రామ కాంగ్రస్ అధ్యక్షుడు నేర్పాటి జంపయ్య,సీనియర్ నాయకులు పెద్ద మొగిలి,మస్ అన్నపూర్ణ,కటిక అనిల్ ,పసరగొండ శ్రీను,బొచ్చు లడ్డు(తిరుపతి) తదితరులు పాల్గొన్నారు.

స్వామి వివేకానంద బోధనలు మార్గదర్శం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ…

స్వామి వివేకానంద బోధనలు మార్గదర్శం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

సోమవారం జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో కలెక్టర్ పాల్గొని స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత లక్ష్యసాధనలో పట్టుదలతో ముందుకు సాగాలని, సమాజ సేవను తమ జీవిత లక్ష్యంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.
వివేకానందుని ఆలోచనలు నేటి యువతకు దిశానిర్దేశకమని, విద్య, క్రీడలు, సేవా కార్యక్రమాల ద్వారా సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి,
యువజన సర్వీసులు క్రీడల శాఖ అధికారి రఘు, ఆర్డీఓ హరికృష్ణ, యువజన సర్వీసులు శాఖ సిబ్బంది సాగర్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version