యూనియన్ సమావేశంలో నాయకులు మాట్లాడిన విషయాలు.. “తోట”నోట”తొండిమాట”? ఎపిసోడ్-1

వసూళ్లు వదిలేసి..అప్పులా?

బకాయిలు వదిలేసి..రుణాలా!?

ప్రభుత్వానికి సవాల్ విసిరిన రైస్ మిల్ యూనియన్ నాయకులు?

మిలర్ల బకాయిలు వసూలు చేయక పోవడానికి కారణమేమిటి?

80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందని మిలర్లే చెబుతున్నారు?

`అధికారులకు వినిపించడం లేదా?

`వసూలు చేయడానికి బద్ధకమా?

`అధికారులు లెక్కలు వదిలేస్తున్నారా?

`నాయకులు చెప్పిన దానిని బట్టి 24 వేల కోట్ల మిల్లర్ల వద్ద ఉన్నట్లే?

`అధికార వ్యవస్థ ఇంత నిర్లక్ష్యంగా వుందా?

`ఇప్పటికే 80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కాపాడలేక పోతున్నాం అంటున్న యూనియన్ నాయకులు?

`వచ్చే రబిలో కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం ఎక్కడ నిలువ చేస్తారని నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు?

`ప్రభుత్వానికి వినపడుతోందా? అధికారులు నిద్ర పోతున్నారా?

`యూనియన్ నాయకులు విసురుతున్న సవాళ్లు అధికారులకు వినిపించడం లేదా?

`నాయకులు ధాన్యం ఉందని చెబుతుంటే, ధాన్యం లేదని మిల్లర్ల మీద కేసులు ఎందుకు నమోదు చేస్తున్నారు?

`ఎవరి లాభం కోసం అధికారులు దాడులు చేస్తున్నట్లు?

`నిజానిజాలు కమిషనర్ కు తెలుసా? ఆయనను కూడా అధికారులు మోసం చేస్తున్నారా?

`అధికారులు పంచుకు తినడం కోసం ప్రభుత్వాన్ని ఆగం చేస్తున్నారా?

`నాయకులు చెప్పిన విధంగా మిలర్ల వద్ద వున్న ధాన్యం అమ్మితే 24 వేల కోట్లు వస్తాయి?

`వాటిని వసూలు చేయక పోవడానికి కారణం ఎవరు?

`మిలర్ల బకాయిలు వసూలుకు అలసత్వమెందుకు?

`రైస్ మిల్ యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసేదాకా తెస్తున్న దెవరు?

హైదరాబాద్, నేటిధాత్రి:

నీతి తప్పిన వారు నిజాయితీ గురించి మాట్లాడితే అసహ్యంగా వుంటుంది. అలాగే తాము అన్యాయమైపోతున్నామని మిల్లర్ల యూనియన్ నాయకులు మాట్లాడుతుంటే కూడా అలాగే వుంది. ఆశ్చర్యమనిపిస్తుంది. మిల్లర్ల నాయకులు తొండి, మొండి, గండి మాటలు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ముక్కున వేలేసుకోవాల్సిందే. ఏ వ్యవస్ధలో పెద్దలుగా చెలామణి అయ్యే వారెవరైనా సరే అలాగే మాట్లాడుకుంటారని సమర్ధించుకుంటే సరిపోదు. మిల్లర్ల వ్యవస్ధ అనేది చిన్నది కాదు. సామాన్యమైంది అసలే కాదు. అది ఒక పెద్ద ఇండస్ట్రీ. దానిలో సభ్యులై, నాయకులైన వారు మాట్లాడే సుద్దులు వింటే విచిత్రమనిపిస్తోంది. ఇటీవల మిల్లర్ల నాయకులంతా ఓ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమయంలో వేశంలో తమకు అన్యాయం జరిగిపోతున్నట్లు మొసలి కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేశారు. ఆ సమావేశంలో తోట సంపత్ అనే యూనియన్ నాయకుడు మాట్లాడిన మాటలు వింతగానూ, విడ్డూరంగా వున్నాయి. అసలు మిల్లర్ల వద్ద వున్న ధాన్యం ఎంతో కూడా ఆయనకు అవగాహన వుండి మాట్లాడారో..లేదో అనేది నిజమైన మిల్లర్లు చెప్పాలి. ఎందుకంటే మిల్లర్ల యూనియన్‌లో చెలమణి అయ్యేవాళ్లలో చాల మందికి మిల్లులు లేవు. ఒకప్ప్పుడు మిల్లులు వున్నా ఇప్ప్పుడు నడవడం లేదు. ఆ వ్యాపారంలో వాళ్లు బాగస్వాములు కాదు. కాని నాయకులుగా చెలామణి అవుతుంటారు. మిల్లర్ల సమస్యలపై ముందుకొస్తుంటారు. మిల్లర్లు అంటే మేమే అనేంతగా కలరింగ్ ఇస్తుంటారు. మిల్లర్లను దోపిడీ చేసుకుంటూ బతుకుతుంటారు. అలాంటి ఓ నాయకుడుగా పేరున్న తోట సంపత్ అనే నాయకుడు ఆ సమవేశంలో తొండి మాటలు కొన్ని మాట్లాడారు. వాటిని మిల్లర్లే సహించడం లేదు. ఎందుకంటే ఓ నలుగురు నాయకులు ఓ గదిలో కూర్చొని సమావేశం ఏర్పాటు చేసుకొని మిల్లర్ల తరుపున వకాల్తా పుచ్చుకున్నట్లు మాట్లాడినంత మాత్రాన వాటి ద్వారా మిల్లర్లకు ఎలాంటి ప్రయోజనం లేదు. కాని ఆ నాయకులకు మాత్రం ఎంతో ఉపయోగకరం అనేది తేలిపోయింది. అసలు మిల్లే లేని తోట సంపత్ మాటలు చాలా విచిత్రంగానూ, విడ్డూరంగానూ వున్నాయి. ప్రస్తుతం మిల్లర్ల అందరి వద్ద సుమారు 80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వుందంటూ లెక్కచెప్పారు. ఈ లెక్కను ఎవరు తేల్చాలి? నిజంగానే మిల్లర్ల వద్ద అంత ధాన్యం వుందా? వుంటే అధికారులు మిల్లుల మీద ఎందుకు దాడి చేస్తున్నారో కూడా తోట సంపత్ చెప్పాలి. చాలా మంది మిల్లర్లు వున్న బకాయిల కోసం అధికారులు మిల్లుల తనిఖీకోసం వెళ్లినప్ప్పుడు అక్కడ ఒక్క బస్తా కూడా లేకపోవడంతోనే కేసులు నమోదు చేస్తున్నారు. మరి మిల్లర్ల వద్ద మొత్తం 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వుందని తోట సంపత్ ఎలా చెప్పారు? ఆ ధాన్యం తీసుకోకుండా ప్రభుత్వమే తాత్సారం చేస్తుందనే అర్దం వచ్చేలా తోట సంపత్ మాట్లాడడం జరిగింది. నిజానికి తోట సంతప్ చెప్పినట్లు 80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విలువ ఎంత కాదన్నా సుమారు 25వేల కోట్ల రూపాయల విలువైంది. ఈ విషయాన్ని ఎవరో కాదు, ఏకంగా మిల్లర్ల నాయకుడు తోట సంపత్ చెప్పేస్తున్నారు. దానిని ఒక్కసారి అదికారులు అనుసరిస్తే అసలు విషయం తేలుతుంది. ఓ వైపు తెలంగాణ వ్యాప్తంగా మిల్లర్ల అందరి వద్దా పెద్ద ఎత్తున దాన్యం వుందంటూనే మరో వైపు మిల్లర్లను వేదించొద్దంటారు. ఈ రెండు విషయాలల్లో ఏది దేనికి పొంత లేదు. మిల్లర్ల వద్ద ఇంత ధాన్యం వున్నప్ప్పుడు అదికారులు 25శాతం పెనాల్టీ వేయాల్సిన అసవరం లేదు. 12శాతం వడ్డీ వసూలు చేయాల్సిన అవసరమే రాదు. కాని తోట సంపత్ మాత్రం ఇంతకు భిన్నంగా చెబుతున్నారు. uకాయిలు వున్న మిల్లర్ల నుంచి 25శాతం పెనాల్టీలు, 12 శాతం వడ్డీలు వసూలు చేడయం సరైంది కాదంటారు. ఇందులో ఏది నిజమని ప్రజలు నమ్మాలి. ప్రభుత్వం విశ్వసించాలి. మరో పక్క మిల్లర్లు అనేక అవస్ధలు పడుతున్నారంటారు. మిల్లర్లు చితికిపోతున్నారని అంటారు. మిల్లింగ్ ఇండ్రస్త్రీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తోట సంపత్ చెబుతున్నారు. ఒకసారి తెలంగాణ వ్యాప్తంగా దిగుబడి సాధించిన ధాన్యం మొత్తం తమ మిల్లర్ల వద్దే వుందని అంటున్నాడు. మిల్లర్లు సమస్యలుఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ఈ రెండింటీకీ ఎలాంటి పొంతన లేకుండాపోతోంది. అంత దాన్యం మిల్లర్ల వద్ద వుందంటే ప్రభుత్వానికి బకాయిలు వున్నట్లే కదా! ఆ బకాయిలు ఇంత కాలం ఎందుకున్నట్లు అనేదానికి మాత్రం తోట సంపత్ సమాదానం చెప్పలేదు. పైగా రైతులు, ప్రభుత్వం రెండు బాగానే వున్నాయి కాని, మిల్లర్లే అవస్ధలు పడుతున్నారని అంటున్నారు. సుమారు 80లక్షల టన్నుల ధాన్యం మిల్లర్ల వద్ద వున్న తర్వాత మిల్లర్లు ఇబ్బందులు ఎదుర్కొనే సమస్యే ఉత్పన్నం కాదు. కాని ఎందుకు ఇలా తిమ్మిని బమ్మిని చేసే మా{లు మాట్లాడుతున్నారు? అనేదానికి సమాదానం రావాల్సి వుంది. ఓ వైపు ఇప్పటికే తమ వద్ద 80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వుంది? వాటిని కాపాడేందుకే మిల్లర్ల వద్ద వున్న స్ధలం సరిపోవడం లేదు. రబి సీజన్ రానున్నది. అప్ప్పుడు కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం రాబోతోంది. దానిని ఎక్కడ దాచాలన్నదానిపై ప్రభుత్వమే ఒక మార్గం చూపాలంటున్నారు. ఇలా తిరకాసు పనులు చేస్తూ, ప్రభుత్వాన్ని ఆటాడించే పరిస్దితికి మిల్లర్ల యూనియన్ నాయకులు చేరుకున్నారన్నది స్పష్టమౌతోంది. మిల్లర్ల యూనియన్ నాయకులకు బాద్యత లేదా? ప్రభుత్వం తమ సమస్యలు, గొంతెమ్మ కోరికలు తీర్చాలని అనుకుంటున్నప్ప్పుడు ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలన్న ఆలోచన లేదా? ప్రభుత్వం కూడా దీనిపై పూర్తి స్దాయి దష్టిపెట్టాలి. మిల్లింగ్ యూనియన్ నాయకులే స్వయంగా ప్రకటిస్తున్నారు. తమ వద్ద వున్న ధాన్యం విలువ ఎంతో చెప్పేస్తున్నారు. ఆ బకాయిలు వసూలు చేయకుండా ప్రభుత్వం ఏం చేస్తోంది? అదికారులు ఏం చేస్తున్నారు. అలా వేల కోట్ల రూపాయల బకాయిలు మిల్లర్ల మీద వదిలేసి, మళ్లీ వచ్చే సీజన్ కోసం సుమారు 22వేల కోట్ల రూపాయలు రుణం తీసుకోవాలని ప్రభుత్వం ఎందుకు అనుకుంటోంది? ఈ విషయాలు, వివరాలు సిఎం. రేవంత్‌రెడ్డికి, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి, కమీషనర్ కు తెలియదా? వారి దాకా ఈ వివరాలు వెళ్లడంలేదా? అదికారులు ఏం చేస్తున్నారు? యూనియన్ నాయకులే ప్రభుత్వానికి అల్టిమేటమ్ జారీ చేసే దాక వెళ్తున్నారు. ఓ వైపు మిల్లర్ల వద్ద ధాన్యం వుండగా, మళ్లీ మేమెలా దాన్యం తీసుకోవాలి? ఎక్కడ భద్ర పరచాలని ప్రభుత్వాన్నే యూనియన్ నాయకులు ప్రశ్నిస్తున్నారంటే ప్రభుత్వానికి అసలు నిజమేమిటో తెలియడం లేదా? అసలు మిల్లర్ల నుంచి పెద్దఎత్తున మిల్లర్ల యూనియన్ నాయకుల వద్ద పేరుకుపోయిన బకాయిలు ఎందుకు వసూలు చేయడం లేదు? అదికారులు ఏం చేస్తున్నారు? తూతూ మంత్రంగా పనిచేస్తున్నారా? లేక మిల్లర్లు, యూనియన్ నాయకులే అదికారులు సహకరిస్తున్నారా? పైగా మిలర్ల అసోసియేషన్ ప్రభుత్వాన్ని నిందించే దాకా వెళ్తుంటే ఏం చేస్తున్నారు? మిల్లర్లు చెబుతున్న మాట అదికారుల చెవికెక్కడం లేదా? లేక వినిపించుకునే తీరిక అదికారులకు లేదా? బకాయిలు వసూలు చేసే శక్తి అదికారులకు సరిపోవడంలేదా? వసూలు చేయడానికి బద్దకమా? లేక అదికారులే లెక్కలు వదిలేస్తున్నారా? యూనియన్ నాయకులు చెప్పిన దానిని బట్టి వారి వద్ద 25వేల కోట్ల రూపాయలు వున్నట్లే లెక్క. ప్రభుత్వానికి మిల్లర్ల యాజమానులు వినపడడం లేదా? అదికారులు మొద్దు నిద్ర పోతున్నారా? ప్రభుత్వానికే మిల్లర్ల యూనియన్‌లు సవాళు చేస్తున్నారన్న సంగతి అర్దం కావడం లేదా? కుక్కను తోక ఆడిస్తుందా? లేక తోక కుక్కను ఆడిస్తుందా? అనే అనుమానం అదికారులకు రావడంలేదా? ఎవరి లాభం కోసం అదికారులు పనిచేస్తున్నారు? ఎవరి మేలు కోసం అదికారులు మీన మేషాలు లెక్కిస్తున్నారు? బకాయిలు వసూలు చేసే శక్తి అదికారులకు సరిపోవడం లేదా? అదికారులు లాలూచీ పడి లొంగిపోతున్నారా? మిల్లర్ల నాయకులకు భయపడుతున్నారా? బహిరంగంగా యూనియన్ నాయకులు తమ వద్ద అంత దాన్యం వుందని చెబుతున్నా ఎందుకు వసూలు కావడం లేదన్నదానికి ఎవరు సమాధానం చెప్పాలి??? ఇవే కాదు, మిగతా నాయకులు కూడా ఏం మాట్లాడారన్నదానిపై కూడ నేటిధాత్రి వరస కథనాలు..

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version