సంస్మరణ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే…

సంస్మరణ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే…

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని ఆశ్విన్ కాలనీ లో గల ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వవిద్యంలో జరిగిన రంజోల్ గ్రామ మాజీ సర్పంచ్ కీ. శె. కొత్త రామ్ రెడ్డి సంస్మరణ సభలో పాల్గొని వారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళాలు అర్పించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ గా కొత్త రామ్ రెడ్డి గారి సేవలు చిరస్మనీయమని, వారి పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నా అన్నారు…..
ఎమ్మెల్యే గారితో పాటుగా సీనియర్ నాయకులు నామ రవికిరణ్,యువ నాయకులు ముర్తుజా, బిఆర్ఎస్వీ నాయకులు ఫయాజ్ తదితరులు ఉన్నారు …

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు…

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మొగుడంపల్లి మండలం విట్టు నాయక్ తండాలో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఈ కార్యక్రమంలో నూతన కౌన్సిలర్ దీపక్ ,యువ నాయకులు ముర్తుజా,బిఆర్ఎస్వీ నాయకులు ఫయాజ్, గ్రామ సర్పంచ్ చందు జాదవ్,మాజి సర్పంచ్ లు కేషు,జితేందర్, ఉప సర్పంచ్ రూప్ సింగ్,మాజి ఉప సర్పంచ్ శంకర్,ధర్మం, చంద్రు, మేఘనాథ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

అక్రమ పశువదశాల పట్టించుకోని అధికారులు…

అక్రమ పశువదశాల పట్టించుకోని అధికారులు.

◆-: అనుమతులు లేకుండా నిర్వహణ…..

◆-: స్థానిక అధికారులతో కుమ్మక్కు……

◆-: మాంసం విక్రయ జీరో దందా…..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ నియోజకవర్గం లోని నాల్కల్ మండలంలో అక్రమ పశువాదశాల కొనసాగుతున్న అధికారులు పట్టించు కోవడంతీలేదని తెలిసింది. న్యాల్కల్ మండలం మల్లీ గ్రామ శివారులో వెలసిన ఈ పశువర్ధశాల లో బర్రెలు ఆవులు ఎడ్లు వధించి వాటి మాంసాన్ని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో పరిసర ప్రాంతమంతా దుర్గంధం వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ పశువాదశాల కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉండటం వల్ల అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ పశువాదశాల నుండి మాంసాన్ని హైదరాబాద్ బీదర్ జహీరాబాద్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ పశువాదశాలలో పరిసర ప్రాంతాల్లో కాకుండా వేరే ప్రాంతాల్లో కూడా ఏవైనా పశువులు చనిపోతే వాటిని తీసుకువచ్చి వాటిని మాంసాన్ని కూడా ఎగుమతి చేస్తున్నారు.

పశువుల తో పాటు కుక్కలను కూడా తీసుకువచ్చి వాటి మాంసాన్ని కూడా మేక మాంసంల హైదరాబాద్ తో పాటు వివిధ పట్టణాలకు మేక మాంసంల ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. బీదర్ కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన మల్లీ న్యాల్కల్ మండలం కు చెందిన శివారులో ఈ పశువాదశాల ఉండటం వల్ల ఎలాంటి సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరైనా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వెళ్లి వాటి గురించి అడగగా వారిని బెదిరింపులకు గురి చేస్తూ గుండాయిజం చేస్తున్నట్లు పరిసర ప్రాంతాల ప్రజలు తెలిపారు. ఈ పశువాదశాల గురించి అధికారులకు గ్రామ ప్రజలు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ పశువాదశాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఈ ప్రాంతానికి పోలీసులు కూడా వెళ్లడం లేదని అటువైపు కన్నెత్తి కూడా చూడరని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఏది ఏమైనాప్పటికీ ఈ పశువాదశాల నుండి ప్రతిరోజు టన్నులకొద్దీ మాంసాన్ని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నప్పటికీ ఇలాంటి ప్రభుత్వానికి టాక్స్ కూడా చెల్లించకపోవడంతో ప్రభుత్వ ఖజానాకు కూడా గండి పడుతుంది. ఏది ఏమైనా పనికి జిల్లా కలెక్టర్ అధికారులు స్పందించి మళ్లీ గ్రామంలో ఉన్న ఈ పశువాదశాలను తొలగించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

‘సర్పంచ్ చేతుల మీదుగా పేదింటి వివాహానికి ఆర్థిక సహాయం అందజేత…

‘సర్పంచ్ చేతుల మీదుగా పేదింటి వివాహానికి ఆర్థిక సహాయం అందజేత

జహీరాబాద్ నేతి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం, హుగ్గేల్లీ గ్రామానికి చెందిన మర్పల్లి గొల్ల యాదమ్మ-మల్లయ్య దంపతుల కుమార్తె పూజ (శిరీష) వివాహం బుధవారం దిగ్వాల్లోని నేషనల్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి హుగ్గేల్లీ సర్పంచ్ పట్లోళ్ళ విమల శ్రీనివాస్ డ్డి ముఖ్య అతిథిగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. పేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లిళ్లకు సహాయం చేయడం తమ బాధ్యత అని తెలిపారు. ఈ సందర్భంగా వధువు కుటుంబానికి వివాహ కానుకగా ₹11,000 చెక్కును అందజేశారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version