మానవత్వానికి ప్రతిరూపం ఇనగాల…

మానవత్వానికి ప్రతిరూపం ఇనగాల

‘హృదాన్’ప్రోగ్రామ్ ద్వారా విజయవంతమైన గుండె శస్త్రచికిత్స

పరకాల,నేటిధాత్రి

పరకాల పట్టణంలో మానవత్వానికి నిలువుటద్దంగా నిలిచే సంఘటన ఒక చోటుచేసుకుంది.కష్టాల్లో ఉన్న ఒక చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు ముందుకు వచ్చిన సేవా మనసు ఒక కుటుంబానికి కొత్త జీవం నింపింది.పట్టణానికి చెందిన బొచ్చు శరత్ చైతన్య దంపతుల ఆరు నెలల పసిబిడ్డ ఋత్విక గుండె సంబంధిత తీవ్రమైన సమస్యతో బాధపడుతూ, ప్రాణాపాయ స్థితిలో ఉండగా ఈ హృద్యమైన పరిణామం చోటుచేసుకుంది.వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేయకపోతే ప్రమాదం తప్పదని సూచించడంతో ఆ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది.ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ దంపతులకు లక్షల రూపాయల ఖర్చుతో కూడిన శస్త్రచికిత్స చేయించడం అసాధ్యంగా మారింది.ఈ క్రమంలో వారు ఆశాకిరణంగా భావించిన ఇనగాల వెంకట్రామ్ రెడ్డిని మార్చి 8 2026న సంప్రదించారు.వారి పరిస్థితిని తెలుసుకున్న వెంటనే స్పందించిన వెంకట్రామ్ రెడ్డి తన సేవా దృక్పథాన్ని చాటుతూ ఇనగాల ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా వెంటనే చర్యలు ప్రారంభించారు.

అపోలో హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి ప్రతిష్టాత్మకమైన ‘హృదాన్’ ప్రోగ్రామ్ కింద చిన్నారి ఋత్వికకు పూర్తిగా ఉచితంగా గుండె శస్త్రచికిత్స చేయించేలా ఏర్పాట్లు చేశారు.దీంతో మార్చి 18,2026న జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది.పరేషన్ అనంతరం చిన్నారి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతూ ప్రస్తుతం పూర్తిగా కోలుకుంటోందని వైద్యులు తెలిపారు.ఈ పరిణామం కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా పట్టణ ప్రజలకు కూడా ఆనందాన్ని కలిగించింది.శస్త్రచికిత్స అనంతరం నిన్న రాత్రి చిన్నారి ఋత్వికను తీసుకొని ఆమె తల్లిదండ్రులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి నివాసానికి వెళ్లి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.తమ బిడ్డకు పునర్జన్మ ప్రసాదించిన దేవుడిలా భావిస్తున్నామని, తమ కుటుంబానికి అండగా నిలిచినందుకు జీవితాంతం రుణపడి ఉంటామని భావోద్వేగంతో పేర్కొన్నారు.ఈ సందర్భంగా వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి సేవలు చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.సమాజంలో ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే సహాయం చేయడం మనందరి కర్తవ్యమని పేర్కొన్నారు. చిన్నారి ఋత్విక ఆరోగ్యంగా ఎదిగి మంచి భవిష్యత్తు సాధించాలని ఆకాంక్షించారు.ఈ సంఘటన పరకాల పట్టణంలో మానవత్వం ఇంకా జీవించి ఉందనే విషయాన్ని మరోసారి రుజువు చేసింది.ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడే వ్యక్తులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.ఇనగాల వెంకట్రామ్ రెడ్డి సేవలను పలువురు ప్రజాప్రతినిధులు,సామాజిక కార్యకర్తలు ప్రశంసిస్తూ,ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని కోరుతున్నారు.

కండరాల క్షీణిత వ్యాధితో మంచాన పడ్డ పసునూటి బాలకృష్ణ…

కండరాల క్షీణిత వ్యాధితో మంచాన పడ్డ పసునూటి బాలకృష్ణ

-రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబం

-దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకోలు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మేదరమట్ల గ్రామానికి చెందిన పసునూటి బాలకృష్ణ గత ఆరు సంవత్సరాల నుండి కండరాల క్షీణిత వ్యాధితో బాధపడుతుండేవాడు. రూ.10 లక్షల వరకు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఖర్చు పెట్టుకున్నప్పటికీ..ఆ వ్యాధి నయం కాకుండా మంచాన పడ్డాడు. దీంతో విధి వక్రీకరించిన ఆ కుటుంబం వీధిన పడ్డట్లయ్యింది. పసునూటి బాలకృష్ణకు భార్య స్రవంతి ఇద్దరు కుమార్తెలు ఐశ్వర్య, విష్ణు ప్రియలున్నారు. రోజువారి కూలి పనులు చేసుకుంటూ..భార్య శిరీష కుటుంబ జీవనాన్ని వెల్లదీస్తుంది. దీనికి తోడు కండరాల క్షీణిత వ్యాధితో మంచాన పడ్డ పసునూటి బాలకృష్ణకు నెలకు రూ. 20వేల వరకు మెడిసిన్ ఖర్చు అవుతుంది. అలాగే అదే వ్యాధితో పసునూటి బాలకృష్ణ సోదరీమణులు బాధపడుతున్నారు. కండరాల క్షీణిత వ్యాధి నుంచి బాధపడుతున్న వీరిని రక్షించేందుకు మానవత్వం కలిగి ఉన్న దాతలు స్పందించి..రెక్కాడితే గానీ డొక్కాడని ఆ నిరుపేదల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు రావాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఆ కుటుంబాలకు విరాళాలు ఇచ్చి..బాధిత కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముందుకు వచ్చే దాతలు ఫోన్ పే నెంబర్ 8309029249, గూగుల్ పే నెంబర్ 9666321300 లకు విరాళాలు ఇవ్వాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version