400 కేజీల గుడుంబా బెల్లం పటిక పట్టివేత…

400 కేజీల గుడుంబా బెల్లం పటిక పట్టివేత

బెల్లం,పటిక,కారు స్వాధీనం..నిందితుడి అరెస్ట్

నాటు సారా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవు

నర్సంపేట ఎక్సైజ్ సిఐ నరేష్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

నిషేధిత అక్రమ గుడుంబా తయారి కోసం రవాణా చేస్తున్న 100 కిలోల బెల్లం 300 కిలోల పటిక, ఐదు లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు నర్సంపేట ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి తెలిపారు. ఏ నరేష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ డివిజన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు,జిల్లా ఎక్సైజ్ అధికారి అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు నర్సంపేట పరిధిలో నాటుసారా నియంత్రణ కొరకు ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు.ఈ సందర్భంగా నర్సంపేట మండలంలోని ముత్తోజిపేట ప్రధాన రహదారిపై విస్తృత తనిఖీలను చేపట్టగా నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డిపల్లెకు చెందిన బానోతు రాజన్న @ టీక్య అనే వ్యక్తి కారును అనుమానంతో తనిఖీలు చేయగా కారులో బెల్లం,పట్టిక,నాటుసారా లభ్యమైంది.కాగా అతని వద్ద నుండి 300 కేజీల పట్టిక ,100 కేజీల బెల్లం, ఐదు లీటర్ల నాటుసారా, టాటా విస్టా కారు, ఒక మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగిందన్నారు. నిందితుడు పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అనంతరం సిఐ నరేష్ రెడ్డి మాట్లాడుతూ నిషేధిత నాటుసార తయారుచేసిన విక్రయించిన చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖ రూల్స్ ప్రకారం గుడుంబా తయారు చేసిన,విక్రయించిన ప్రభుత్వం నుండి అందించే సంక్షేమ పథకాలు రద్దు చేయాల్సి ఉంటుందని సిఐ సూచించారు.ఈ తనిఖీలలో నర్సంపేట ఎక్సైజ్ ఎస్సై శార్వాణి, సిబ్బంది పాల్గొన్నారు.

గుడుంబా తయారీపై ఉక్కు పాదం మోపిన ఎక్సైజ్ శాఖ…

గుడుంబా తయారీపై ఉక్కు పాదం మోపిన ఎక్సైజ్ శాఖ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

భూపాలపల్లి రూరల్ మండలంలో గుడుంబా నిర్మూలన ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా, అంజన్ రావు, ప్రోహిబిషన్ ఎక్సజ్ డిప్యూటీ కమీషనర్, వరంగల్ డివిజన్ శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ ప్రోహిబిషన్ ఎక్సజ్ ఆఫీసర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆదేశాల మేరకు ప్రోహిబిషన్ ఎక్సస్ స్టేషన్ భూపాలపల్లి ప్రోహిబిషన్ ఎక్సస్ స్టేషన్-కాటారం, సంయుక్తగా భూపాలపల్లి మండలంలోని గొల్లభూద్దరం, గ్రామంలో నాటు సారాయి తయారీ స్థావారాలపై దాడులు నిర్వహించి (03) కేసులు నమోదు చేసి,( 02) మంది నిందితులను అరెస్ట్, (30 )లీటర్ల నాటుసాయిరా (08) కేజీల చక్కర ను స్వాధీన పరుచుకొని (900)లీటర్ల చక్కర పానకాంను ధ్వంసం చేయడం జరిగింది. తదుపరి నాటుసారాయి వల్ల ప్రజలకు జరుగు నష్టం గురించి, ఒక అవగాహన కార్యక్రమం చేపట్టటం జరిగింది. తదుపరి ఎవరైనా నాటు సారాయిని, తయారు చేసిన, రవాణా చేసిన, కలిగి ఉన్న అమ్మిన చట్ట రీత్యా చర్యలు వుంటాయని సీఐ రమ్య తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాటారం సిఐ కిష్టయ్య బాదావత్
భూపాలపల్లి భూపాలపల్లి ఎక్సైజ్ ఎస్సై షేక్ రబ్బాని సిబ్బంది పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version