సిపిఐ మండల శాఖ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత పునర్ధరణ కార్యక్రమం…

సిపిఐ మండల శాఖ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత పునర్ధరణ కార్యక్రమం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సిపిఐ ముఖ్య సమావేశం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భాగంగా. కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు ఈసందర్భంగా ఖమ్మం లో లక్షలాది మందితో బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలక్యాడర్ను పెంచుకుంటూ పోరాటాలు కొన.సాగించిందని. అలాగే ఈ క్రమంలో .100 .సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో అనేక త్యాగాలు చేసిందని అన్యాన్యమైనపోరాటాలు చేసిందని. ఈ సందర్భంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తంగళ్ళపల్లి మండలం .లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన .సింగిరెడ్డి భూపతిరెడ్డి. నైజాం సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడి మందాపూర్. గుట్టల్లో.నైజం పోలీసులచే.బూటకం ఎన్కౌంటర్లో అమరుడు.య్యారని. ముఖ్యంగా ఉపాధి హామీ చట్టం అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి ఉపాధి హామీ కార్మికుల అనేక అడ్డంకులు సృష్టిస్తూ అనేక సమస్యలను సృష్టిస్తూ ముఖ్యంగా .ముఖ కలకలు.వినిపించాలని ఉద్దేశంతో తీసుకొచ్చిన చట్టాలు కార్మికులను ఉపాధి హామీ పథకాన్ని దూరం చేసే పద్ధతి కొనసాగుతుందని. ఈ.జీ.ఏ.పథకాన్ని తీసేసి జి.రాo.జి. చట్టాన్ని తీయడానికి తీవ్రంగా.వ్యతిరేకిస్తున్నాం అని ఈ చట్టం మూలంగా కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు 90% నిదులు .కేటాయించగా. ఇప్పుడు కేంద్రం 60 శాతం గాను రాష్ట్రాల 40% గానూ రాష్ట్రాల మీద భారం పడుతుందని ఇది .జిరాంజీ చట్టాన్ని రద్దుచేసి జాతీయ ఉపాధి హామీ పథకం అమలు చేయాలని.జిరాంజీ పథకంలో యంత్రాల వాడకాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం మనీ. ఈజీఎస్ పథకంలో 15 రోజులకు ఒకసారి వేతనాలు ఇవ్వాలని చట్టం ఉన్నప్పటికీ. నెలల తరబడి పని చేసే కార్మికులకు డబ్బులు ఇవ్వకపోవడం మూలంగా. ఈజీఎస్ అని అంటేనే కార్మికులకు.విసుక్కునే పరిస్థితి వస్తుందని. కార్మికుల ఉపాధి హామీ పథకంలో పని కావాలంటే స్థానిక ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకుంటేనే పని దొరికేది పని హక్కుగా కొనసాగింది. బిజెపి ప్రభుత్వం పని హక్కును రద్దుచేసి కేవలం పథకంగా అమలు చేసే పద్ధతిని బిజెపి ప్రభుత్వం తీసుకు వచ్చిందని తక్షణమే ఈజీఎస్ కొనసాగించాలని చట్టాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ముఖ్యంగా. ప్రతి సంవత్సరం సిపిఐ పార్టీ సభ్యత్వ పునర్ధరణ కార్యక్రమం జరుగుతుందని అందులో భాగంగానే ఈరోజు తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సిపిఐ ముఖ్య సమావేశo. సిపిఐ మండల కార్యదర్శి సోమ నాగరాజు. ఆధ్వర్యంలో నిర్వహిస్తూ సిపిఐ పార్టీ సభ్యత పునర్ధరణ కార్యక్రమం లో. భాగంగా మండల శాఖ సిపిఐ సభ్యత పునర్ధరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని. ఇట్టి కార్యక్రమంలో. సిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

నాలుగో తేదీన జరిగే సిపిఐ బహిరంగ సభను విజయవంతం చేయండి- కసిరెడ్డి సురేందర్ రెడ్డి..

నాలుగో తేదీన జరిగే సిపిఐ బహిరంగ సభను విజయవంతం చేయండి- కసిరెడ్డి సురేందర్ రెడ్డి

కరీంనగర్, నేటిధాత్రి:

 

సిపిఐ వంద సంవత్సరాల సందర్భంగా ఈనెల నాలుగో తేదీన కరీంనగర్ నగరంలోని రెవెన్యూ గార్డెన్ లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. బహిరంగ సభ కరపత్రాన్ని సిపిఐ జిల్లా కార్యాలయంలో విడుదల చేశారు. ఈసందర్భంగా కసిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ సమసమాజ స్థాపన కోసం, పెట్టుబడి దారి విధానానికి వర్గ దోపిడీకి, శ్రమ దోపిడీకి, వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రచారోద్యమాలు నిర్వహించటానికి 1925 డిసెంబర్ 26వ తేదీన ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిందని నాటి నుండి నేటి వరకు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో సిపిఐ కరీంనగర్ లో బహిరంగ సభ రెవెన్యూ గార్డెన్ లో ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. భారతదేశాన్ని బ్రిటిష్ పాలకుల నుండి విముక్తి చేయడం కోసం జరిగిన స్వాతంత్ర ఉద్యమంలో సిపిఐ పార్టీ పాల్గొని ఎన్నో కేసులను ఎదుర్కొని జైల్లో నిర్బంధించినప్పటికీ మొక్కవోని ధైర్యంతో ప్యూడల్ వ్యవస్థను బద్దలు కొట్టేందుకు వందేళ్లుగా పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తున్న నిజాం సర్కార్ ను గద్దెదించడానికి దేస్
ముఖులు, రజాకార్ లను ఎదిరించటానికి వెట్టి చాకిరి విముక్తి కోసం భూమికోసం భుక్తి కోసం బానిసత్వానికి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు పార్టీ పిలుపుమేరకు సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో సిపిఐ అగ్రభాగాన నిలిచిందని ఆమహత్తర పోరాటానికి రావి నారాయణరెడ్డి, మగ్దూo మోహినుద్దీన్, బద్ధం
ఎల్లారెడ్డిలు ముగ్గురు పిలుపునిచ్చారని అందులో బద్దం ఎల్లారెడ్డి కరీంనగర్ జిల్లాకి చెందినవారు కావడం గర్వించదగ్గ విషయమని, ఆ పోరాటంలో నలభై ఐదు వందల మందికి పైగా కమ్యూనిస్టులు ప్రాణాలు కోల్పోయారని, మూడు వేలకు పైగా గ్రామాలను విముక్తి చేయబడ్డాయని పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ దేనిని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సిపిఐ ముందుండి పోరాడిందని జాతీయస్థాయిలో ఒకే నినాదంతో ప్రజల ఆలోచనలను, ఆకాంక్షలను గ్రామస్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు వినిపించి రాష్ట్రo సాధించేవరకు అనేక పోరాటాలు ఉద్యమాలు, యాత్రలు, పోరు బాటలు నిర్వహించిన పార్టీ కేవలం సిపిఐ పార్టీయేనని అన్నారు. వందేళ్ల ఉత్సవాల సందర్భంగా రెవెన్యూ గార్డెన్లో బహిరంగ సభ జరుగుతుందని దీని విజయవంతం కోసం జిల్లాలోని పార్టీ శ్రేణులు సానుభూతిపరులు వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈబహిరంగ సభకు సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవెన శంకర్, జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ లు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈసమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు న్యాలపట్ల రాజు, కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, నగర కార్యవర్గ సభ్యులు ఎలిశెట్టి భారతి, గామినేని సత్యం, చెంచల మురళి, మాడిశెట్టి అరవింద్, భాకం అంజన్న, బెక్కంటి రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version