ఆకలి తీర్చే అన్నదాతకు ఆర్థిక ధైర్యం ఇచ్చే ప్రజాపాలన.

ఆకలి తీర్చే అన్నదాతకు ఆర్థిక ధైర్యం ఇచ్చే ప్రజాపాలన

నడికూడ నేటిధాత్రి:

 

మండల కేంద్రం లో రైతు భరోసా సంబురాలు.
కాంగ్రెస్ పార్టీ ఆగ్రనేతలా చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్
రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని విశ్వసించిన ప్రజా ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రాష్ట్రంలో 1 కోటి 49 లక్షల ఎకరాలకు తొమ్మిది రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతులు ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేసింది.ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా సంబరాలు నిర్వహించింది. అందులోనే భాగంగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా నడికూడ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద రైతు భరోసా సంబరాలు నిర్వహించారు,నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,రైతులు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఏఐసీసీ అధ్యక్షులు మల్లి కార్జున్ ఖర్గే, సోనియాగాంధీ గాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రి వర్గానికి, ఎమ్మెల్యే కు అందరికి ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా దేవేందర్ గౌడ్ మాట్లాడుతూ గడచిన 18 నెలలో రైతు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం 1.04 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని పేర్కొన్నారు.గత ప్రభుత్వం పది సవంత్సరాల కాలంలో18 వేల కోట్లు రైతుబందు ఖర్చుపెడితే కేవలం18 నెలలోనే 21వేలకోట్లు రైతు భరోసా కింద ప్రజా ప్రభుత్వం ఖర్చు పెట్టిందని అన్నారు.ఇది రైతు ప్రభుత్వం మని వెల్లడించారు
ఈ కార్యక్రమం లో మండల ప్రధానకార్యదర్శి మాలహల్ రావు,మాజీ జడ్పీటీసీ పాడి కల్పనా ప్రతాప్ రెడ్డి,పరకాల బ్లాక్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్ల చిన్ని,మండల సమన్వయ కమిటీ సభ్యులు పర్నెం తిరుపతి రెడ్డి,పెద్ద బోయిన రవీందర్ యాదవ్, మాజీ ఎంపీటీసీ పర్నెం మల్లారెడ్డి,రైతులు,వివిధ గ్రామాల అధ్యక్షులు, కార్యదర్శులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నైట్ టైంలో ఆకలిగా అనిపిస్తుందా..

నైట్ టైంలో ఆకలిగా అనిపిస్తుందా.. ఈ విషయాలు తెలుసుకోండి..

 

 

కొంతమందికి అర్ధరాత్రి కూడా ఆకలిగా అనిపిస్తుంది. అయితే, అలాంటి వారు పడుకునే ముందు వీటిని తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

 

 

 

 

చాలామందికి అర్ధరాత్రి ఆకలి వేస్తుంది. ఇది వివిధ కారణాల వల్ల జరగవచ్చు. ముఖ్యంగా రాత్రి మేలుకువగా ఉండేటప్పుడు లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆకలి ఎక్కువగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో చాలా మంది చిప్స్, స్వీట్లు వంటి అనారోగ్యకరమైన వాటిని తింటారు. కానీ ఇవి జీర్ణక్రియను దెబ్బతీస్తాయి. నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. అంతేకాక బరువు పెరగడానికి కూడా కారణం అవుతాయి. కాబట్టి, మీకు ఆకలిగా అనిపిస్తే ఈ తేలికపాటి, ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇవి మీ ఆకలిని తీరుస్తాయని, అదే సమయంలో నిద్రకు ఇబ్బంది కలిగించవని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

 

 

గోరువెచ్చని పాలు

రాత్రిపూట ఒక చిన్న గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. పాలలో ట్రిప్టోఫాన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మంచి నిద్రకు సహాయపడుతుంది. అలాగే, పాలలో ప్రోటీన్, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి కండరాలకు మంచిగా పనిచేస్తాయి. అలాగే ఆకలిని కూడా నియంత్రిస్తాయి. ప్రతి రోజు పడుకునే ముందు 150–200 మి.లీ పాలు తాగడం మంచిది.

 

 

 

 

 

 

గింజలు (బాదం, వాల్‌నట్స్)

గుప్పెడు బాదం లేదా 2–3 వాల్‌నట్స్ తినడం మంచిది. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్‌ను కలిగి ఉంటాయి. బాదంలో మెగ్నీషియం ఉండటం వల్ల ఇది ఒత్తిడిని తగ్గించి నిద్రకు సహాయపడుతుంది. వీటిని తినడం వల్ల తక్షణమే ఆకలి తగ్గుతుంది. అలాగే రాత్రంతా చక్కెర స్థాయిలు స్తిరంగా ఉంటాయి.

 

 

 

 

 

 

అరటిపండు

అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B6 ఉంటాయి. ఇవి కండరాలను సడలించడంతో పాటు నిద్రకు సహాయపడతాయి. అరటిపండు ఆకలిని తీరుస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు ఒక చిన్న అరటిపండు తినవచ్చు. దీనిని పాలతో కలిపి తీసుకుంటే మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది.

 

 

 

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version