‘‘అంతం కాదిది’’…’’ఆరంభం!’’

 

-ఆపరేషన్‌ సిందూర్‌ సక్సెస్‌!

-ఆపరేషన్‌ సింధూర్‌…ఉగ్ర స్థావరాలు మటాష్‌!

-పహల్గావ్‌ దాడికి ఆపరేషన్‌ సింధూర్‌తో ప్రతీకారం.

-భారతీయుల్లో వెల్లి విరుస్తున్న ఆనందం.
-దేశమంతా మన సైనికులకు సలామ్‌.

 

-జై హింద్‌ ట్విట్లతో దేశంమంతా మారుమ్రోగిపోతోంది.

-పాకిస్తాన్‌ లో వున్న 4 ఉగ్ర స్థావరాలు, పివోకేలో 5 బంకర్లు ధ్వంసం.

-మసూద్‌ కుటుంబం, బంధువులు మృతి.

-100 మందికి పైగా ఉగ్రవాదులు హతం.

-26 ఉగ్రస్థావరాలు గుర్తింపు.

-పాకిస్తాన్‌ మాయమయ్యే సమయం ఆసన్నమైంది.

-ఇప్పుడే మొదలైంది…ఇక పాకిస్తాన్‌కు మూడిరది.

-ఉగ్రవాద స్థావరాలపై అర్థరాత్రి మొదలైన భారత్‌ దాడులు.

-25 నిమిషాలలో ఆపరేషన్‌ పూర్తయ్యింది.

-9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంతో భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు.

-అంతర్జాతీయంగా పాక్‌ ఇప్పుడు ఏకాకి!

-పాక్‌కు మిగిలేది ఇక భవిష్యత్తు కాళరాత్రి.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఇండియా అంటేనే శాంతి సందేశం. శాంతికి నిలయం. పరహితం. పరోపకారం. ప్రపంచశాంతిని కోరుకునే దేశం. అలాంటి మన దేశం మీద ప్రతి క్షణం విషం చిమ్ముతూ బతకడమే పాకిస్తాన్‌కు అలవాటుగా మారింది. దేశం విడిపోయిన నాటి నుంచి ఏదో ఒక రకంగా గిచ్చి కయ్యం పెట్టుకోవడం అలవాటు చేసుకున్నది. ఇప్పటికి నాలుగు సార్లు జరిగిన యుద్దంలో ఓడిపోయినా ఆ పాకిస్తాన్‌కు బుద్ది రావడం లేదు. 1972లో ఏకంగా 90 వేల మంది పాకిస్తాన్‌ సైనికులు లొంగిపోయి, యుద్దంలో ఓడిపోయారు. అయినా ఆ దేశానికి సోయి రావడం లేదు. ఎన్ని సార్లు ఆ దేశం పీచమణిచినా మారడం లేదు. తినడానికి తిండికి దిక్కులేకపోయినా సరే, మనతో యుద్ధం కోరుకుంటూ పతనం అంచుల్లో వున్నా దాని బుద్ది మారడం లేదు. మన దేశంలో ఎన్ని కవ్వింపులు చేసినా క్షమిస్తూ పోతూనే వున్నాం. పైగా ఆ దేశంలో విపత్కర పరిస్ధితులు ఎదురైన ప్రతిసారి సాయం చేస్తూ ఆదుకుంటూనే వున్నాం. అయినా ఆ దేశానికి కృతజ్ఞతలేదు. ఎన్నొసార్లు భూకంపాలు వచ్చిన పాకిస్తాన్‌ అతలా కుతలమైపోయిన సందర్భాలలో ఆదుకుంటూ వచ్చాం. ఇప్పటికీ నిత్యం గోదుమ పిండి పంపకపోతే , తిండికి దిక్కులేకపోయినా, మన తిండి తింటూ మన దేశంపైనే ప్రతికారం కోరుకుంటుంది. అలాంటి దేశానికి ఇక బుద్ది చెప్పే తరుణం ఆసన్నమైంది. ఇక పాకిస్తాన్‌ను కోలుకోకుండా, తేరుకోకుండా చేస్తే తప్ప పాకిస్తాన్‌ దారికి వచ్చే పరిస్ధితి లేదు. దాయాది దేశమని సాయం చేసినా, ఎన్ని పాలు పోసినా పాము విషమే కక్కుతుందన్నట్లు తన పాపపు బుద్దిని పాకిస్తాన్‌ ప్రదర్శిస్తూనే వుంటుంది. అందుకే ఇక ఆట మొదలైంది. ఉగ్రవాదులు వేట మొదలైంది. తనకు దిక్కులేకపోయినా, ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూ, మన దేశంలో అశాంతిని రేపుతామని చూస్తున్న పాకిస్తాన్‌ను ఇక వదిలిపెట్టకూడదన్న గట్టి నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చింది. ఆరేళ్ల క్రితం మన సైనికులు 60 మందిని పొట్టన పెట్టుకున్నా, సర్జికల్‌ స్ట్రైక్‌తో ఆపేశాం. కాని ఆసారి పెహల్గావ్‌లో ముష్కరులు హిందువులను టార్గెట్‌ చేసి చంపడం అన్నది ప్రపంచంలో ఏ దేశం సహించలేదు. మన 140 కోట్ల మంది భారతీయుల రక్తం మరిగిపోయింది. ఇప్పటికీ కూడా పాకిస్తాన్‌ ప్రేజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండానే, ముష్కర స్ధావరాలను కూకటి వేళ్లతో పెలికించి, ప్రపంచం ముందు మరోసారి భారత్‌ గొప్పదనాన్ని చాటుకున్నది. కాకపోతే పాకిస్తాన్‌ పాపాలకు ఎక్కడో అక్కడ పుల్‌ స్టాప్‌ పడాలి. పాకిస్తాన్‌ ఇక భారత్‌ వైపు కన్నెత్తి చూడాలంటే కలలో కూడా అక్కడి పాలకులు ఉలిక్కి పడాలి. పాకిస్ధాన్‌కు మన దేశపు దెబ్బ అంత గట్టిగా పడాలనే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చింది. ఓ వైపు ప్రపంచంలో అభివృద్దిలో పోటీ పడాలని మనం ఆలోచిస్తుతంటే, ప్రతిసారి పాకిస్తాన్‌ కవ్వింపుల కోసం ఇక ఆలోచించే రోజు వుండకూడదు. అంటే పాకిస్తాన్‌ వరల్డ్‌ మ్యాప్‌లో లేకుంటా చేస్తేనే దారి వస్తుంది. పాక్‌ ఆక్రమించుకున్న పిఓకే స్వాధీనంతోపాటు, పాక్‌ను అష్ట దిగ్భందనం చేస్తే తప్ప దానికి ఊరిరి ఆడదు. మన కేంద్ర ప్రభుత్వం అదే ఆలోచన చేస్తోంది. పాకిస్తాన్‌ కూసాలు కదిలిపోయేలా చేస్తోంది. భవిష్యత్తులో యుద్దం అన్న ఆలోచన వస్తేనే పాకిస్తాన్‌ గుండెలు అదిరిపోవాలి. అంతే కాదు మీరు తప్ప మాకు దిక్కులేదని కాళ్లబేరానికి రావాల్సిన అవసరం వుంది. అంత దూరం తీసుకుపోతే తప్ప పాకిస్తాన్‌ మాట వినదు. ఇప్పుడున్న పరిసి ్దతుల్లో పాకిస్తాన్‌పై కనికరం అన్నది చూపకూడదని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు. హిందూస్తాన్‌ వైపు తొంగి చూసినా తునాతునకలైపోతామన్న భయం పాకిస్తాన్‌కు రుచి చూపించాలి. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ఆ అవకాశాన్ని ప్రధాని మోడీ ప్రభుత్వం కూడా జార విడువాలనుకోవడం లేదు. పాకిస్తాన్‌తో ఈ తలనొప్పి ఇక వుండదకూడదనే నిర్ణయానికి వచ్చింది. సరిహద్దును చూస్తే పాకిస్తాన్‌ ఇక జడుసుకోవాలి. ముష్కరులకు తావివ్వాలంటేనే పాకిస్తాన్‌కు తడిసిపోవాలి. అందుకే ఇక అసలు ఆట మొదలైంది. అంతం కాదిది..ఆరంభం. ఆపరేషన్‌ సింధూర్‌ సక్సెస్‌. 9 ఉగ్రవాద స్ధావరాలు మాటాష్‌. పలహాల్గావ్‌ దాడికి ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట భారత్‌ తీర్చుకున్న ప్రతికారం. భారతీయుల్లో ఆనందం వెల్లిరిస్తోంది. ఇలాంటి మాట కోసం అమాయకులైన 25మందిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న నాటి నుంచి ఎదురుచూస్తున్నారు. ప్రతీకారంతో దేశ ప్రజలు రగిలిపోతున్నారు. ప్రభుత్వం ప్రతికారం తీర్చుకోకుంగా జాప్యం చేస్తుందని మధనపడినవ వారు కూడా వున్నారు. మన దేశ ప్రభుత్వ ఆలోచన, యుద్ద వ్యూహాలు అర్ధం చేసుకోలేక, బావోద్వేగాలతో ఎదురుచూసిన ప్రజలకు కూడా ఎంతో సంతోషాన్నిచ్చిన సందర్భమిది. దేశమంతా ఒక రకంగాచెప్పాలంటే పులకించిపోతోంది. కేంద్ర ప్రభుత్వాన్ని, మన సైనికులను కీర్తిస్తోంది. దేశమంతా జేజేలు పలుకుతోంది. ఆపరేషన్‌ సింధూర్‌ అని పేరుపెట్టి మరీ ఉగ్ర స్ధావరాలను ధ్వంసం చేయడాన్ని దేశమంతా ఉద్వేగంతో సంబరాలు చేసుకుంటోంది. భారత్‌ మాతాకీ జై అని జై కొడుతోంది. జై హింద్‌ అంటూ దేశమంతా నినదిస్తోంది. దేశమంతా మన సైనికులు సలాం చేస్తోంది. జై హింద్‌ ట్విట్లతో దేశమంతా మారు మ్రోగిపోతోంది. పాకిస్ధాన్‌ ఆక్రమించుకున్న పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోనే కాదు, ఏకంగా పాకిస్తాన్‌ గడ్డ మీదకు వెళ్లి మరీ ఉగ్ర స్ధావరాలను మన వైమానిక దళం ద్వంసం చేసింది. పాకిస్తాన్‌ కేంద్రంగా వున్న 26 ఉగ్ర స్ధావరాలను గుర్తించినట్లు సమాచారం. అందులో కీలకమైన 9 స్దావరాలను గుర్తించి ధ్వంసం చేశారు. పిఓకెలో వున్న 5 ఉగ్రవాద స్ధావరాలు, పాకిస్తాన్‌ గడ్డ మీద వున్న 4 స్ధావరాలను నామరూపాలు లేకుండా చేశారు. పాకిస్తాన్‌ గడ్డ మీద మన సైనికులు త్రివర్ణ పతాకం ఎగరవేడం గొప్ప శుభ పరిణామం. మన దేశమంతా సగర్వంగా సైనికులకు సలాం చేసింది. తీవ్ర వాద నాయకుడైన మసూద్‌ కుటుంబం మొత్తం చనిపోయింది. వారితోపాటు బంధువులు, ఇతర ఉగ్ర వాదులు మొత్తం 100 మందికిపైగా భారత్‌ జరిపిన వైమానికదాడిలో చనిపోయినట్లు తెలుస్తోంది. ఇక మన కంటిలో నలుసులా, చెప్పులో రాయిలా తయారైన పాకిస్తాన్‌ కూడా మాయమయ్యే సమయం ఆసన్నమైంది. అయితే మన దేశం అనుసరిస్తున్న యుద్ద వ్యూహాలు అర్దం కాక ఇప్పటికే పాకిస్తాన్‌ తలలు పట్టుకుంటోంది. పాకిస్తాన్‌ విషయంలో ప్రపంచమంతా ఒకవైపు, పాకిస్తాన్‌ ఒక వైపు అనేలా యుద్ద తంత్రాన్ని నెరిపిన ఘనత మన ప్రదాని నరేంద్ర మోడీకే దక్కింది. గతంలో పాకిస్తాన్‌కాలు దువ్విన ప్రతి సందర్భంలోనూ ఏదోఒక దేశం మద్దతు ప్రకటిస్తూ వచ్చేవి. కాని ఈసారి 80 సంవత్సరాల స్వాతంత్య్ర చరిత్రలో మొదటిసారి పాకిస్తాన్‌కు అగ్రరాజ్యాలేవీ పాకిస్తాన్‌కు మద్దతు పలకలేదు. ఒక రకంగాచెప్పాలంటే పాకిస్తాన్‌ ఏకాకి అయ్యింది. మన ప్రధాని నరేంద్ర మోడీ యుద్ద తంత్రాన్ని ఇప్పుడే మొదలు పెట్టారు. అయితే నిజానికి పహల్గావ్‌ దాడి మరుసటి రోజు నుంచే మన దేశం యుద్దతంత్రాన్ని మొదలు పెట్టింది. ముందు పాకిస్తాన్‌ను ఆర్ధికంగా కుదేలు చేసింది. ఆ దేశానికి ఎగుమతులు అన్నీ రద్దు చేసింది. తర్వాత వైమానిక దారులు మూసేసింది. పాకిస్తాన్‌కు సిందు నది నీళ్లను ఆపేసింది. దాంతో పాకిస్తాన్‌ ఉక్కిరిబిక్కిరైంది. ఇప్పటికే మూలిగే నక్కలాంటి పాకిస్తాన్‌ మీద మన ప్రభుత్వం కొట్టిన దెబ్బతో పాకిస్తాన్‌ గిలగిలాడుతోంది. నిజానికి పాకిస్తాన్‌ ప్రజలు కూడా మన దేశంతో యుద్దం వద్దని ఆ దేశ సైనికులు కూడా పాకిస్తాన్‌ను కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి. యుద్దం చేయడానికి ఇష్టపడక ఎంతో మంది పాకిస్తాన్‌ సైనికులు కూడా తమ ఉద్యోగాలు రాజీనామా చేశారన్న వార్తలు కూడా విన్నాం. అయినా పాకిస్తాన్‌కు బుద్ది రాలేదు. ఆ దేశ రాజకీయ నాయకులకు సోయి రావడం లేదు. ఇండియా మీద గెవడం అన్నది పాకిస్తాన్‌కు కలలో కూడా జరగనిది. యుద్దమంటే క్రికెట్‌ లాంటి ఆటలో గెలవడం కాదు. అయినా ఆటలో కూడా ఎప్పుడూ పాకిస్తాన్‌ పెద్దగా గెలిచింది లేదు. అలాంటిది యుద్దంలో పాకిస్తాన్‌ కనీసం చెప్పుకునే రణ తంత్రం లేదు. సైనిక సంపత్తి చాలదు. మన దేశ ప్రజలంతా ఒక్క సారి జై హింద్‌ అంటే ఆ సౌండ్‌కే పాకిస్తాన్‌ సగం గుండె ఆగిపోతుంది. అలాంటి పాకిస్తాన్‌ కొన్ని అగ్ర రాజ్యాల అండ చూసుకొని ఎగురుతూ వుండేది. కాని ఇప్పుడు ఏ దేశం పాకిస్తాన్‌కు సాయం చేయడానికి ముందుకు రావడం లేదు. అంతే కాదు అఫ్గనిస్తాన్‌ తాలిబన్లు కూడా పాకిస్తాన్‌కు మద్దతు పలకలేదు. అయినా పాకిస్తాన్‌కు సిగ్గు రావడం లేదు. మన దేశ నుంచి విడిపోయిన ముక్కకే అంత వుంటే, ఆ ప్రాంతాన్ని దానం చేసిన మనకు ఎంత వుండాలి? మన సైనిక శక్తి కింద వారి సంఖ్య ఎంత? గతంలో ఊ అంటే అణ్వాయుదాలున్నాయంటూ పదే పదే పాకిస్తాన్‌ బెదిరిస్తూ వచ్చేది. అయినా మన దేశం ఎంతో సంయమనంతో వుండేది. మన మంచితనం పాకిస్తాన్‌కు చేతగాని తనంగా కనిపిస్తోంది. ఈసారి అసలు పాకిస్తాన్‌ అనేదే లేకుండా చేస్తే తప్ప దారికి రాదు. 1972 తర్వాత మళ్లీ మనదేశంలో సైనిక మాక్‌ డ్రిల్‌ జరిగిందంటే మన ప్రభుత్వం ఎంత స్ధిర నిర్ణయంతో వుందో అర్ధం చేసుకోవచ్చు. ప్రశాంతతను దెబ్బతీసేలా పక్కలో బల్లెంలా నిత్యం కొర్రీలు పెడుతుంటే ఇంకా చూసుకుంటూ ఊరుకునే పరిస్దితి లేదని మన ప్రభుత్వం హెచ్చరిక జారీచేసింది. ఓ వైపు పాక్‌ మన దేశ భూగాగాన్ని ఆక్రమించుకొని ఆ ప్రాంతాన్ని ఉగ్రవాదులకు అడ్డగా చేసి పెట్టి మారణ హోమం సృష్టించాలని ఇప్పటి వరకు పాకిస్తాన్‌ చూసింది చాలు. ఇకపై మన దేశం ఉపేక్షించే పరిస్దితి లేదని ప్రదాని మోడీ తేల్చి చెప్పేశారు. ఆఖరుగా ఐక్య రాజ్య సమితి సమావేశంలో పాకిస్తాన్‌ ఈ విషయాన్ని లెవనెత్తి పై చేయి సాధించాలిన చూసింది. మన దేశం చెప్పిన సమాధానం విని పాకిస్తాన్‌ బిత్తర పోయింది. ప్రపంచ దేశాలతోపాటు, ఐక్య రాజ్య సమితికూడా మన దేశానికి మద్దతు పలికింది. పాకిస్తాన్‌ చేత కూడ ఉగ్ర వాదులను తుదముట్టించేందుకు సహకరిస్తామని చెపాల్సి వచ్చింది. పాకిస్తాన్‌ ఐక్యరాజ్యసమితిలో తమ దేశంపై భారత్‌ దాడిచేయాలని చూస్తోందని చెప్పి సానుభూతి పొందాలని చూసింది. కాని మన ప్రభుత్వం మాత్రం మేం ఉగ్రవాదుల ఏరి వేత మాత్రమే చేస్తున్నామని చెప్పడంతో ఐక్యరాజ్య సమితిలో పాక్‌ పరువు పోయింది. లేనిపోనివి చెప్పి సానుభూతి పొందాలనుకున్నా చెల్లలేదు. అదే రోజు అర్ధరాత్రి అంటే 7తేదీన ఆలస్యం చేయకుండా 9 ఉగ్ర వాద స్ధావరాలను ధ్వసం చేసింది. పాకిస్తాన్‌లాగా దొంగ దెబ్బ మనం తీయలేదు. ప్రపంచానికి చెప్పి మరీ మన ప్రభుత్వం ఉగ్ర స్ధావరాలను టార్గెట్‌ చేసింది. ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో 25 నిమిషాలలో పని పూర్తి చేసింది. అయితే ఇక్కడితో ఆగిపోయేది కాదు. మనదేశం ఆగేది కాదు. అందుకే హోం మంత్రి అమిత్‌షా కీలక ప్రకటన చేశారు. ఆపరేషన్‌ సింధూర్‌ 2 వుంటుందని ప్రకటించారు. అంటే ఆట ఇప్పుడే మొదలైంది. ఇంకా ఇ ంకా వుందని అమిత్‌షా సంకేతాలిచ్చినట్లైంది. ఏ రకంగా చూసినా అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ ఏకాకి. ఇక ప్రతి రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రే..! జై భారత్‌. జై హింద్‌!!

సమన్వయ సామర్థ్యాన్ని ప్రపంచానికి వెల్లడిరచిన ‘ఆపరేషన్‌ సింధూర్‌’

రుజువైన భారత్‌ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వ్యూహాత్మక సమన్వయ సామర్థ్యం

పాక్‌లోని లోపలి ప్రాంతాల్లోకి చొచ్చుకుపోగల సామర్థ్యం బహిర్గతం

తాత్కాలిక లక్ష్యాలు సాధించినా, దెబ్బతినని ఉగ్రవాదుల మూలాలు

పాక్‌ ప్రకటనతో యుద్ధంగా మారే ప్రమాదం

 

పాకిస్తాన్‌కు మరింత గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే

అడుక్కు తింటున్నా అహంకారం తక్కువేం లేదు

అంతర్జాతీయంగా ఏకాకి అయినా బుద్ధి మారని పాక్‌

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7వ తేదీన నిర్వహించిన ‘ఆపరేషన్‌ సింధూర్‌’ అత్యాధునిక యుద్ధకళలో మనదేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. గతంలో బాలాకోట్‌, యురి దాడులు నిర్వహించినా, ఆ రెండుసార్లు మన దళాలు పీఓకేలోకి ప్రవేశించి ఆయా ఆపరేషన్లను దిగ్విజయంగా నిర్వహించాయి. అయితే ఈసారి సరిహద్దు దాటకుండానే కేవలం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో మాత్రమే కాదు, పాక్‌ భూభాగంపై కూడా నిర్దిష్టమైన రీతిలో దాడిచేయగలమని ఆ దేశానికి తెలియజెప్పింది. ముఖ్యంగా ఈ దాడిలో త్రివిధ సైనిక దళాలు, రాజకీయ నాయకత్వం, ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు ఎంతో సమన్వయంతో పనిచేసి అనుకున్నది సాధించాయి. మనదేశంలోని అన్ని వ్యవస్థల సమన్వయ సామర్థ్యంకూడా ప్రపంచానికి మరోసారి వెల్లడైంది. ముఖ్యంగా ఈదాడుల్లో ఉపయోగించింది రఫేల్‌ యుద్ధ విమానాలు. వీటిల్లో అత్యాధుóనిక ఆయుధాలను అమ ర్చి సరిహద్దును దాటకుండానే, ఏవిధమైన నష్టం లేకుండా నిర్దిష్ట లక్ష్యాలపై కచ్చితమైన దాడులు నిర్వహించడం ఇక్కడ గుర్తించాల్సిన కీలకాంశం. ఏప్రిల్‌ 22న పహల్గామ్‌లో మనదేశానికి చెందిన 25 మంది, నేపాల్‌కు చెందిన మరొక పర్యాటకుడిని అమానుషంగా ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న సంఘటనకు ప్రతీకారంగా జరిపిన ఈ దాడుల్లో 90వరకు మిలిటెంట్లు మరణించి నట్టు తొలి వార్తలు తెలియజేస్తున్నాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం ఆపే ప్రసక్తే లేదని ప్రపంచానికి పదేపదే స్పష్టం చేస్తున్న మనదేశం, ఈ దాడులను కేవలం లష్కరే తొయ్యబా (లెట్‌), జైషే మహమ్మద్‌ (జెమ్‌) స్థావరాలను లక్ష్యంగా చేసుకొని మాత్రమే నిర్వహించింది. చాలా జా గ్రత్తగా రచించిన ప్రణాళిక ప్రకారం పాక్‌ సైనిక స్థావరాలను ముట్టుకోలేదు.

స్కాల్ప్‌ క్రూయీజ్‌ క్షిపణులు

ఈ దాడులకు ఉపయోగించిన రఫేల్‌ జెట్‌ విమానాల్లో స్కాల్ప్‌ క్రూయీజ్‌ క్షిపణులు, హామర్‌ ప్రిసిషన్‌ గైడెడ్‌ బాంబులను భారతీయ వాయుసేన అమర్చింది. వీటిల్లో స్కాల్ప్‌ క్షిపణులు లోపలి ప్రాంతాలపై కచ్చితమైన దాడులకు ఉపయోగపడగా, హామర్‌ బాంబులతో గాల్లోనుంచి భూత లం మీది లక్ష్యాలపై అత్యంత కచ్చితత్వంతో దాడిచేశాయి. పూర్తిగా భారత భూభాగంనుంచి ని ర్వహించిన ఈ ఆపరేషన్‌కు, నేవీ చక్కటి సమన్వయ సహకారాలు అందించింది. భారత ప్రజలుగాఢనిద్రలో వున్న సమయంలో, పాక్‌ సైన్యం ఏమరుపాటుగా వున్న తరుణాన్ని ఎంచుకొని సరి గ్గా 6వ తేదీ అర్థరాత్రి దాటి, 7వ తేదీ 1.44 గంటలకు మన సైన్యం ఈ దాడులు చేసింది. ఈ ఆపరేషన్‌లో భారత్‌ వైపు ఎటువంటి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పాకిస్తాన్‌ గగనతలంలోకి ప్రవేశించి నిర్దిష్ట ఉగ్ర లక్ష్యాలపై దాడులు జరపడంలో భారత్‌ తనవద్ద ఉన్న ఆధునిక సాంకేతిక సామర్థ్యాన్ని విస్పష్టంగా ప్రదర్శించింది. ముఖ్యంగా పాకిస్తాన్‌ సైన్యంతో అనవసర యుద్ధం రాకుండా, కేవలం ఉగ్రవాద కేంద్రాలపైనే దృష్టి కేంద్రీకరించడమనే అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ అనుకున్న విధంగా పూర్తిచేయడం అంత సులభం కాదు. దీన్ని మనదేశం సాధించి చూపింది. 

రఫేల్‌ కీలకపాత్ర

రఫేల్‌ యుద్ధవిమానాల్లో అమర్చిన స్కాల్ప్‌ క్రూయీజ్‌ క్షిపణులకు 300 కిలోమీటర్లలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యముంది. ఫలితంగా ఈ యుద్ధ విమానం సురక్షితమైన దూరంలో వుంటూనే తన దాడిని కొనసాగించడానికి వీలైంది. అదీకాకుండా ఈ క్షిపణీ వ్యవస్థ శత్రు రక్షణ వ్యవస్థల ను ఏమార్చి ముందుకు దూసుకెళ్లి లక్ష్యాలను ఛేదించగలదు. హామర్‌ (హైలీ అగైల్‌ మాడ్యులార్‌ మ్యునిషన్‌ ఎక్స్‌టెండెండ్‌ రేంజ్‌) బాంబులు వ్యూహాత్మకంగా, ఉగ్రవాద స్థావరాల్లోని నిర్దిష్ట చిన్న లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగపడ్డాయి. ఈ మొత్తం ఆపరేషన్‌, ప్రణాళికా రచనలో మన సైన్యం అనుసరించిన ఆధునిక పోకడ ప్రపంచానికి వెల్లడైంది. అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించకుండానే, అనుకున్న లక్ష్యాన్ని సాధించడం ఆపరేషన్‌ సింధూర్‌ విశిష్టత. గమనించాల్సిన మరో ముఖ్య విషయమేంటంటే, మనవైపు ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా, ఉగ్రవాద స్థావ రాలకు అనుకున్న రీతిలో తీవ్ర నష్టం కలిగించడం. అంతేకాదు, ఈ ఆపరేషన్‌ కేవలం ఉగ్రవాద మౌలిక సదుపాయాల ధ్వంసంపై మాత్రమే కాదు, ఆయా సంస్థల ముఖ్యనేతలను హతమార్చ డంపై కూడా దృష్టి కేంద్రీకరించింది. ఈ ఉగ్రవాద స్థావరాలను గుర్తించడానికి, పహల్గామ్‌ దా డులు జరిగినప్పటినుంచి మన రిసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ (రా) సభ్యులు తీవ్రంగా కృషి చేశారు. ఆవిధంగా సేకరించిన కచ్చితమైన సమాచారం ఆధారంగా, లష్కరే తొయ్యబా, జెయిషే మహమ్మద్‌ సంస్థల కమాండ్‌ మరియు కంట్రోల్‌ విభాగాలను పూర్తిగా ధ్వంసం చేయాలన్న లక్ష్యాన్ని మన సైన్యం నిర్దేశించుకుంది. 

ముర్దిక్‌లోని లెట్‌ స్థావరంపై తీవ్రస్తాయి దాడులు

ఈ ఆపరేషన్‌లో ప్రధానంగా ముర్ధిక్‌లోని లెట్‌ స్థావరంపై తీవ్రస్థాయిలో దాడులు జరిగాయి. ఇది అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌కు కేంద్ర స్థానం. అదేవిధంగా బహవాల్పూర్‌లోని జై షే మహమ్మద్‌ ఉగ్ర సంస్థపై కూడా దాడులు తీవ్రస్థాయిలో జరిగాయి. ఈ రెండు సంస్థల్లోనూ భారత్‌ను లక్ష్యం చేసుకొని ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే ప్రదేశాలపై ప్రధానంగా దృష్టి పెట్టడం గమనార్హం. ఈవిధంగా ఈ సంస్థలకున్న ఉగ్రవాదులను తయారుచేసే సామర్థ్యాన్ని దెబ్బతీయడమే కాదు, భవిష్యత్తులో అటువంటి ప్రణాళికలు రూపొందించకుండా వుండే స్థాయిలో ఈ దాడులు నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ 7 లోక్‌ కళ్యాణ్‌ మార్గ్‌లోని తన నివాసం నుంచి ఈ ఆప ంషన్‌ మొత్తాన్ని పర్యవేక్షించడాన్ని పరిశీలిస్తే, మనదేశ అత్యున్నత నాయకత్వం దీనికి ఎంతటి ప్రాధాన్యత నిచ్చిందీ అర్థమవుతుంది. ఇక మన రియల్‌ జేమ్స్‌బాండ్‌ అజిత్‌ దోవల్‌ ఎప్పటికప్పుడు ఆపరేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని అందిస్తూ వచ్చారు. ఈ మొత్తం ఆపరేషన్‌లో మన జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ దోవల్‌దే కీలక పాత్ర. ఇదే సమయంలో మన ‘రా’ సంస్థ ఉగ్రవాద స్థావరాలకు సంబంధించిన నిక్కచ్చి సమాచారాన్ని అంద జేయడం మరో గొప్ప విషయం. 

భారత్‌ నిగ్రహం

ఈమొత్తం ఆపరేషన్‌ను ఉగ్రవాద వ్యతిరేక చర్యగానే భారత్‌ పరిగణించి ఎంతో నిగ్రహంతో వ్య వహరించడం వల్లనే పరిస్థితి యుద్ధానికి దారితీయలేదు. ఈ వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులు విజయంవంతం కావడానికి మించి మరో ప్రయోజనం కూడా ఒనగూడిరది. చాలా తక్కువ నష్టంతో పాకిస్తాన్‌లోని సుదూర ప్రాంతాల్లోని నిర్దిష్ట లక్ష్యాలపై దాడులు చేయగలమన్న స్పష్టమైన సందేశాన్ని పాక్‌ ఉగ్రవాదులకు, వారి మద్దతుదార్లకు మనదేశం ఇచ్చినట్లయింది. ఇదే సమయంలోఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని మాత్రమే దాడులు చేసామని, ఆవిధంగా ‘ఉగ్రవాదంపై పోరు ’కే కట్టుబడి వున్నామన్న సందేశాన్ని ప్రపంచానికి మనదేశం ఇచ్చింది. అయితే ఆపరేషన్‌ సిం ధూర్‌ ద్వారా మనదేశం తక్షణ లక్ష్యాలను సాధించినప్పటికీ దీర్ఘకాలంలో దీని పర్యవసానాలు ఎట్లా వుంటాయనేది ఇప్పుడే చెప్పడం కష్టం. మౌలిక వసతుల ధ్వంసం, ఉగ్ర సంస్థల నాయకులను హతమార్చడం తాత్కాలికంగా ఆయా సంస్థల సామర్థ్యాన్ని దెబ్బతీసినప్పటికీ, కొంత విరామం తర్వాత అవి మళ్లీ యథాస్థితికి చేరుకుంటాయనేది చరిత్ర చెబుతున్న సత్యం. కాకపోతే పాకిస్తా న్‌ లోని సుదూర ప్రాంతాలపై కూడా అత్యంత కచ్చితత్వంతో దాడిచేసే సామర్థ్యం భారత్‌కు ఉ న్నదన్న సత్యం పాకిస్తాన్‌కు తెలిసొచ్చిన మాట వాస్తవం. అంతేకాదు ఈ ఆపరేషన్‌ దక్షిణాసియాలో భౌగోళిక రాజకీయ సరిహద్దు అంశాలపై తన ప్రభావాన్ని తప్పక చూపుతుంది. ఈ దాడులను ‘యుద్ధ చర్య’గా పాకిస్తాన్‌ ప్రకటించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశాలే ఎక్కువ! అయితే ఉగ్రస్థావరాలపై మాత్రమే దాడులు జరపడం, ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సన్నిహిత దేశాలకు తెలియపరుస్తూ రావడంవల్ల, యుద్ధం స్థాయికి పరిస్థితులు దారితీయకపోవచ్చు కూడా!

మరో మైలురాయి

ఏతావాతా చెప్పొచ్చేదేమంటే ఈ ఆపరేషన్‌ సింధూర్‌ ద్వారా ఉగ్రవాద వ్యతిరేక పోరులో మనదే శం మరో మైలురాయిని దాటిందనే చెప్పాలి. తన ఆధునిక సాంకేతిక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూనే, వ్యూహాత్మక సంయమనం పాటించడం ఒక్క భారత్‌కు మాత్రమే సాధ్యమైంది. వీటి వినియోగం ద్వారా రెండుదేశాల మధ్య సంఘర్షణ జరగకుండా జాగ్రత్తపడిరది. అంతేకాదు మనదేశం అనుసరిస్తున్న ‘త్రివిధ దళాల ఉమ్మడి చర్య సిద్ధాంతం’ ఇస్తున్న చక్కటి ఫలితాలు ప్రపంచానికి తెలిసొచ్చాయి. మొత్తంమీద చెప్పాలంటే, ఉగ్రవాదంపై పోరు విషయంలో భారత్‌ నిబద్ధత ప్రపంచానికి మరోసారి వెల్లడైంది.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన.!

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన
తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి
చందుపట్ల కీర్తి రెడ్డి
మొగులపల్లి నేటి ధాత్రి:

మొగులపల్లి మండలం గ్రామం వేములపల్లి లోఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి బుధవారం రోజున పరామర్శించారు. వారి వెంట నాయకులు మాజీ ఎంపీటీసీ గాజుల రజిత మల్లయ్య రాజు గౌడ్ చంద్రసేన ఎర్ర రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

కలెక్టర్ కార్యాలయంలో దిశా కమిటీ సమావేశం.

సంగారెడ్డి: కలెక్టర్ కార్యాలయంలో దిశా కమిటీ సమావేశం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దిశా కమిటీ సమావేశం జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. వివిధ శాఖలపై సమీక్షించారు. కార్యక్రమంలో నిర్మలారెడ్డి, టీజీ ఐఐసీ చైర్మన్ నిర్మల రెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమరయ్య పాల్గొన్నారు.

అప్పుల బాధతో ఉన్నప్పటికీ సంక్షేమ ఫలాలు అమలు.

అప్పుల బాధతో ఉన్నప్పటికీ సంక్షేమ ఫలాలు అమలు

పేదవారి కళను నెరవేర్చడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం.

అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.

రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

ములుగు జిల్లా, నేటిధాత్రి:

 

 

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ చిత్తశుద్ధితో అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అమలు చేస్తున్నామని, పేద వాడి కలలను నిజం చేయడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
బుధవారం జిల్లాలోని వాజేడు మండలం టేకులగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజా, నాగారం నుండి పాయబట్ల వరకు 400 లక్షలు తో బి.టి రోడ్డు నిర్మాణ పనులు, 150 లక్షల అంచనా విలువ తో వాజేడు మండల ప్రజా పరిషత్ కార్యాలయ భవన నిర్మాణం, ఎడ్చర్లపల్లి నుండి ముత్తారం వరకు 300 లక్ష తో బి.టి. రోడ్డు నిర్మాణం పనులను శంకుస్థాపనలు, 14 లక్షలతో నిర్మించిన బేబీ బర్త్ వెయిటింగ్ భవనము ను రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, భద్రాచలం శాసనసభ్యులు డా. తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ శబరిష్ , ఐటిడిఏ పిఓ చిత్ర మిశ్రా లతో కలిసి ప్రారంభించినారు.
అనంతరం కొంగాల గ్రామం 57 మందికి , నాగారం గ్రామం 64 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు మంత్రి అందచేశారు.
అనంతరం వెంకటాపురం మండలం కేంద్రం లో అంచనా విలువ 60 లక్షల నిధులతో ఉపకార్య నిర్వాహక ఇంజనీర్ (పి.ఆర్) కార్యాలయ భవన నిర్మాణ పనులకు రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, స్థానిక శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఐటిడిఏ పిఓ చిత్ర మిశ్రా లతో కలిసి శంకుస్థాపన చేశారు.
పాత్రపురం గ్రామంలోని రైతు వైదిక లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు మంత్రి అందచేశారు.
ఈ సందర్భంగా పలుచోట్ల ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రంలో 8 లక్షల 19 వేల కోట్ల రూపాయల అప్పులు చేసి ప్రజలపై పెను భారం మోపిందని, ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గత పాలకులు చేసిన అప్పులు తీర్చడంతో పాటు సంక్షేమ ఫలాలను అమలు చేస్తున్నామని వివరించారు. ప్రతి నిరుపేద ఆడబిడ్డకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నిరుపేద కుటుంబానికి 5 లక్షల రూపాయలతో ఇండ్లను నిర్మించుకోవడానికి అవకాశం కల్పించిందని, వాజేడు, వెంకటాపూరం మండలాలలో నిరుపేదలు ఇండ్లు నిర్మించుకోవడానికి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపనలు చేయడం జరుగుతుందని తెలిపారు.
గత ఎన్నికలకు ముందు ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు నూతన హామీలను అమలు చేయడానికి కార్యక్రమాలను చేపట్టిన ఈ సంవత్సరం ఉగాది నుండి ధనికుడు తినే సన్నబియ్యాన్ని పేదలకు అందించాలని లక్ష్యంతో ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం అందజేస్తున్నామని అన్నారు. గతంలో పాలించిన దొర కాలంలో అరకొరగా ఉద్యోగ అవకాశాలు కల్పించగా నేటి ప్రజా ప్రభుత్వం పది నెలల కాలంలోనే 57 వేల 662 ఉద్యోగ అవకాశాలు కల్పించిందని, రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం భూ భారతి చట్టం తెచ్చి పేద రైతులకు చుట్టంగా మార్చిందని అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు భరోసా కల్పించాలని ఉద్దేశంతో రాజీవ్ వికాస్ పథకం కింద ఆర్థిక సహాయం చేయాలని లక్ష్యంతో అర్హులైన వారి నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని, అర్హులైన వారందరికీ జూన్ 2వ తేదీన ఆరువేల కోట్ల రూపాయలను అందజేయడం జరుగుతుందని అన్నారు. నిరుపేద విద్యార్థినీ, విద్యార్థులకు నూతన పరిజ్ఞానంతో విద్యను బోధించడానికి చర్యలు తీసుకోవడంతో పాటు నిరుపేదలు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద వైద్య సేవలు పొందడానికి పది లక్షల రూపాయలను పెంచడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వం పేదల పట్ల సవతి తల్లి ప్రేమ కనపరిచినప్పటికీ నేటి ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి పేదల కన్నీళ్లను చూడచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. పేదవారి ఆశయాన్ని నెరవేర్చడం కోసం రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను చేపట్టడం జరుగుతుందని, రానున్న రోజులలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపరిన అనంతరం నూతన పథకాలను అమలు చేయడం జరుగుతుందని మంత్రి వివరించారు.
ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం.
భద్రాచలం శాసన సభ్యులు
తెల్లం వెంకట్రావు.
భద్రాచలం నియోజకవర్గం లోని అన్ని గ్రామాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని భద్రాచలం శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు అన్నారు.
బుధవారం వాజేడు, వెంకటాపురం మండలాలలో జరిగిన పలు కార్యక్రమాలలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో పాటు ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలోని గ్రామాల నిరుపేద ప్రజలకు అదనంగా ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని మంత్రి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. తన నియోజకవర్గం పరిధిలోని వాజేడు, వెంకటాపురం మండలాలలోని అన్ని గ్రామాలలో అన్ని వర్గాల నిరుపేద ప్రజలు ఉన్నారని వారందరికీ దశలవారీగా ఇండ్లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. పేదవారి సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలను అర్హులైన నిరుపేదల అందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. తాను ఎన్నికల ముందు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణ పనులను త్వరత గతిన పూర్తి చేయడానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నదని అన్నారు. వాజేడు మండలంలోని టేకులగూడెం గ్రామంలో 106 ఇల్లు మంజూరు కాగా 62 ఇండ్లు గ్రౌండ్ లెవెల్ లో ఉన్నాయని 15 ఇండ్లు గ్రౌండ్ ఇండ్లు నిర్మాణం పూర్తి కావడంతో లబ్ధిదారులకు మొదటి విడత డబ్బులు చెల్లించడం జరిగిందని వివరించారు. ఇండ్ల నిర్మాణం కోసం సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్మాణ పనులను పూర్తి చేయడానికి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వం జిల్లాను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిరుపేదలకు ఐటిడిఏ పరిధిలోని ఆదివాసి గిరిజనులకు ఇండ్ల నిర్మాణం కోసం అదనపు ఇండ్లను కేటాయించిందని అన్నారు.
ఈ కార్యక్రమములలో ఏ ఎస్ పి శివం ఉపాధ్యాయ, డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్, ఆర్డీఓ వెంకటేష్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు,
మండల అధికారులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో చదవండి.!

ప్రభుత్వ పాఠశాలలో చదవండి మీ భవిష్యత్తు బంగారు బాటలు వేసుకోండి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలం. స్థానిక సెస్. ఆధ్వర్యంలో. ప్రభుత్వ బాలికలు జూనియర్ కళాశాల సిరిసిల్ల అధ్యాపక బృందం. ప్రభుత్వ కళాశాలలో చేరండి మీ మంచి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి. అనే.నినాదంతో సారంపల్లి బద్దెనపల్లి గ్రామాల్లో 10వ తరగతి పాసైన విద్యార్థులు ఇంటింటికి వెళ్లి కళాశాలకు సంబంధించిన కరపత్రాలను ప్రచారం చేస్తూ ప్రభుత్వ కళాశాలలోనే ఇంటర్మీడియట్ విద్యను చదవండి చదవడం వల్ల కలిగే లాభాలు వారి తల్లిదండ్రులకు వివరిస్తూ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కళాశాల లెక్చరర్ సీతారాము శ్రీనివాస్ ప్రవీణ్ కుమార్ .నవీన్ రెడ్డి. జెబి ఉల్లా గంగరాజు తదితరులు పాల్గొన్నారు

నేషనల్ హైవే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం.!

నేషనల్ హైవే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

 

మండలంలో రోడ్డు విస్తరణలో భాగంగా వరంగల్ నుండి మంచిర్యాల వరకు. నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు మార్గం కొత్తగా నిర్మాణం చేయడం జరుగుతున్న నేపథ్యంలో. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాలతో మొగుళ్లపల్లి మండల తాహసిల్దార్ జాలి సునీత బుధవారం రోజున మొగుళ్లపల్లి గ్రామ శివారు ( భారత్ గ్యాస్ సమీపంలోని) వ్యవసాయ భూముల మీదుగా హైవే రోడ్డు నిర్మాణం చేపడుతున్న ప్రదేశానికి తాహసిల్దార్ చేరుకొని అక్కడున్న వ్యవసాయ భూములను పరిశీలించిన తాసిల్దార్. ప్రభుత్వం రైతుల వద్దనుండి స్వీకరించిన వ్యవసాయ భూములకు రోడ్డుకు అనుగుణంగా రెండు వైపులా హద్దులను వేయించారు. ఇరువైపులా. రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించి వివిధ వాహనాలతో వ్యవసాయ భూమిని చదును చేయించి రోడ్డు విస్తరణ పనులను తాహసిల్దార్ మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో. ఎస్సై బొరగల అశోక్, గిరిధవార్. శివరామకృష్ణ, రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

నేషనల్ హైవే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం.

నేషనల్ హైవే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

మండలంలో రోడ్డు విస్తరణలో భాగంగా వరంగల్ నుండి మంచిర్యాల వరకు. నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు మార్గం కొత్తగా నిర్మాణం చేయడం జరుగుతున్న నేపథ్యంలో. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాలతో మొగుళ్లపల్లి మండల తాహసిల్దార్ జాలి సునీత బుధవారం రోజున మొగుళ్లపల్లి గ్రామ శివారు ( భారత్ గ్యాస్ సమీపంలోని) వ్యవసాయ భూముల మీదుగా హైవే రోడ్డు నిర్మాణం చేపడుతున్న ప్రదేశానికి తాహసిల్దార్ చేరుకొని అక్కడున్న వ్యవసాయ భూములను పరిశీలించిన తాసిల్దార్. ప్రభుత్వం రైతుల వద్దనుండి స్వీకరించిన వ్యవసాయ భూములకు రోడ్డుకు అనుగుణంగా రెండు వైపులా హద్దులను వేయించారు. ఇరువైపులా. రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించి వివిధ వాహనాలతో వ్యవసాయ భూమిని చదును చేయించి రోడ్డు విస్తరణ పనులను తాహసిల్దార్ మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో. ఎస్సై బొరగల అశోక్, గిరిధవార్. శివరామకృష్ణ, రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మర్రి చెట్లను తొలగించాలని కమిషనర్ కు వినతి.!

మర్రి చెట్లను తొలగించాలని కమిషనర్ కు వినతి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శేషు పల్లి గ్రామం నుండి క్యాతనపల్లి వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా మర్రి చెట్లు ఉన్నందున రోడ్డు పగిలిపోతుందని, మర్రి చెట్లను తొలగించి వేరే చెట్లను పెట్టేలా చొరవ తీసుకోవాలని మున్సిపాలిటీ కమిషనర్ గద్దె రాజు కు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. రోడ్డుకు ఇరువైపులా మట్టి పోయించేలా చొరవ తీసుకోవాలని వినతి పత్రం అందించడం జరిగిందని మాజీ వైస్ చైర్మన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నంది సురేష్, నరేష్, బండారి ప్రశాంత్, ప్రమోద్ ,సాయికిరణ్, కుర్మ విజయ్, నంది అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.

నీలగిరి తో నా స్నేహం అవగాహన సదస్సు.

నీలగిరి తో నా స్నేహం అవగాహన సదస్సు

టీజీ ఎఫ్ డీసీ డివిజనల్ మేనేజర్ శ్రీశ్రావణి

నెన్నల,(మంచిర్యాల) నేటి ధాత్రి:

 

 

నీలగిరి వనాలతో ఎన్నో లాభాలున్నాయని,వీటిపై అవగాహన పెంచుకోవాలని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీజీ ఎఫ్ డీసీ) కాగజ్ నగర్ డివిజనల్ మేనేజర్ శ్రీ శ్రావణి అన్నారు.తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నీలగిరి తో నా స్నేహం పేరిట నెన్నెల మండలంలోని బొప్పారం శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో పెంచుతున్న నీలగిరి వనంలో గురువారం గ్రామస్తులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డివిజనల్ మేనేజర్ మాట్లాడుతూ నీలగిరి వనాల ద్వారా కాగితం తయారీకి అవసరమయ్యే కలప లభ్యమవ్వడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదం చేస్తున్నాయన్నారు. ఒకే చోట వేలాదిగా పెంచే నీలగిరి చెట్ల ద్వారా అధిక మొత్తంలో ఆక్సిజన్ విడుదల చేస్తూ పరిసర ప్రాంతాల్లో ఉన్న కాలుష్యాన్ని నియంత్రిస్తున్నాయన్నారు.ఈ సందర్భంగా గ్రామస్తులకు నీలగిరి చెట్లు పెంచే దశ నుంచి కోత వరకు,ఆ తర్వాత కాగితం తయారీకి అవసరమయ్యే కలపను రవాణా చేసే వివిధ దశల్లో జరిగే పనులను వివరించారు.ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి నీలగిరి వనాలను రక్షించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టీజీ ఎఫ్ డీసీ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్,బెల్లంపల్లి రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ వి. సునీత,డిప్యూటీ ప్లాంటేషన్ మేనేజర్ దుర్గం నరేష్,వాచర్లుమొండి,సత్తయ్య,రవి సిబ్బంది షాహిద్,సంజీవ్ లు పాల్గొన్నారు. ‎

అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీలు.

అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీలు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో కి. వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మండల బిజెపి పార్టీ అధ్యక్షులు వెన్ననేని. శ్రీధర్ రావు మాట్లాడుతూ పాకిస్తానీయులను గుర్తించి వారి దేశం విడిచి వెళ్లే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తంగళ్ళపల్లి ఎమ్మార్వో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని. ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా మసీదులో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముస్లిములు గుర్తించి వెంటనే వారిని పాకిస్తాన్ కి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ పాకిస్తాన్ మద్దతుతో దేశంలో ఉండిపోతున్న పాకిస్తాన్ పౌరులను గుర్తించి అలాగే మే 22వ తేదీన కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో ఏక్తాయాత్ర. నిర్వహించడం జరుగుతుందని . ఈ కార్యక్రమానికి మండలం నుండి పెద్ద ఎత్తున ప్రజల తరలిరావాలని పిలుపునిచ్చారు ఇట్టి కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు వినయ్ ఓబీసీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ జీవన్ మధుసూదన్ పోకల శ్రీనివాస్. రాజు. అనిల్. గణేష్. తదితరులు పాల్గొన్నారు

వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి.!

*వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు *
ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు
బెజగం నాగరాజు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

జగత్ జనని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వైశాఖ శుద్ధ దశమి మే 7న బుధవారం మొగుళ్ళపల్లి మండలకేంద్రంలోని శ్రీ శ్రీ శ్రీ సాంబమూర్తి దేవాలయంలో ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు
. ఆర్యవైశ్యుల కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బెజగం నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి పురోహితులు భైరవపట్ల వెంకటేశ్వర్ల శర్మ పూజా ప్రాంగణాన్ని సం ప్రోక్షణ చేసి సకల దేవతలను ఆహ్వానం చేయించిన అనంతరం వాసవి మాతకు ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు అనంతరం మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు

 

President

ఆర్యవైశ్య బంధుమిత్రులందరు ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు బెజగం నాగరాజు ఉపాధ్యక్షులు బజ్జురి వీరన్న కోశాధికారి వేణుగోపాల్ యూత్ అధ్యక్షులు పుల్లూరి సాయికృష్ణ కోశాధికారి గోలి మహేష్ ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి మంజుశ్రీ ఆర్యవైశ్య సంఘ కుటుంబ సభ్యులు  కోరుకున్నారు .

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ…

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణ కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతని ఇస్తుందని తెలియజేస్తూ .నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయనిది ఒక వరంలో మారాయని కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని పేదలకు సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తుంది అని తెలియజేస్తూ లక్ష్మి పూర్ గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుడు చందు ఆధ్వర్యంలో 45 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది ఇట్టి చెక్కులు రావడానికి కృషిచేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి ఆది శ్రీనివాస్ కి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు చెక్కులు రావడానికిసహకరించిన పెద్దలందరికీ లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ ఆరెపల్లి బాలు మునిగే ప్రభాకర్ నందగిరి ఆంజనేయులు మహేష్ తక్కల్ల ఆంజనేయులు గణేష్ తదితరులు పాల్గొన్నారు

కెసిఆర్ కాలనీలో ఒకరు ఆత్మహత్య…

కెసిఆర్ కాలనీలో ఒకరు ఆత్మహత్య…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి కేసీఆర్ కాలనీలో రోడ్ నెంబర్ 2 లో కేసీఆర్ నగర్ లో తాడూరు రాము కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మిత్రునికి భార్య ముగ్గురు కుమారులు ఉన్నారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు

కోటగుళ్లను సందర్శించిన పురావస్తు శాఖ.

కోటగుళ్లను సందర్శించిన పురావస్తు శాఖ సూపరింటెండెంట్ నిఖిల్ దాస్

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండల కేంద్రంలో
కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ ను మంగళవారం
పురావస్తు శాఖ సూపరింటెండెంట్ నిఖిల్ దాస్ సందర్శించారు. త్వరలో ఆలయాన్ని అభివృద్ధి చేయనున్న తరుణంలో అధికారుల బృందం సందర్శించి ఆలయ పరిసరాలను పరిశీలించారు. గర్భాలయం ప్రదక్షిణ పదం, కాటేశ్వరాలయం నాట్యమండపాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన శిలా శాసనం శివ ద్వారపాలక విగ్రహాలను పరిశీలించి ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆర్కియాలజిస్ట్ అసిస్టెంట్ రోహిణి సీనియర్ కన్వర్జేటర్ మల్లేశం లుఉన్నారు.

అగ్ని ప్రమాదంలో మొక్కజొన్న పంట చేను దగ్ధం.

అగ్ని ప్రమాదంలో మొక్కజొన్న పంట చేను దగ్ధం.

చిట్యాల, నేటి ధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని శాంతినగర్ గ్రామంలో కత్తుల ఓదెలు అనే రైతుకి సంబంధించిన రెండు ఎకరాలలో మక్క పంట పండించడం జరిగింది బుధవారం మధ్యాహ్నం సుమారు 3: 20 నిమిషాలు అధిక ఎండపాతం ఉండడంవల్ల పంటలో చేను లో అనుకోకుండా మంటలు వ్యాపించి రెండు ఎకరాల షేను పూర్తిస్థాయిలో దగ్ధం కావడం జరిగిందిని, రైతు ఆవేదన చెందడం జరిగింది, మొక్కజొన్న పంట సుమారు 100 కింటాల మక్కలు ఉన్నట్టుగా రైతు ఓదెలు తెలియజేయడం జరిగింది, అప్పుచేసి పంటకు పెట్టుబడి పెట్టి చేతి కి అందే టైంలో మంటలో కాలిపోవడంతో రైతు కన్నీరు మున్నీరు అయ్యారు. ప్రభుత్వం నుండి సాయం అందించాలని అధికారులను కోరారు.

ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ సభ.!

ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ సభను జయప్రదం చేయాలి

ఎం సి పి ఐ యు జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మండలం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎం సి పి ఐ యు-ఏఐసీటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈనెల 12న సోమవారం వరంగల్ జిల్లా మచ్చాపూర్ లో నిర్వహించే ఎంసీపీఐయు పార్టీ వ్యవస్థాపకులు కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ ప్రారంభ సభను జయప్రదం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్స్ ను ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా ఎంసీపీఐయు పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న మాట్లాడుతూఅమరజీవి మద్ది కాయల ఓంకార్ నర్సంపేట నియోజకవర్గం నుండి 5సార్లు ఏకధాటిగా ఎమ్మెల్యేగా గెలిచినాడని ఆయన ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం గల మెత్తడని దాంతో పాలకులకు కనువిప్పు కలిగే విధంగా సమస్యల అధ్యయనం చేసి ప్రజల మనిషిగా గుర్తింపు పొందాడు అని ఆయన అన్నారు.1984లో ఎం సి పి ఐ పార్టీని స్థాపించి అంచలంచెలుగా ఎదుగుతూ దేశవ్యాప్తంగా పార్టీని విస్తరింపచేసి 2006లో ఎం సిపిఐ యు గా ఏర్పరిచారని అన్నారు.నిత్యం బడుగు, బలహీన వర్గాల సామాజిక అభివృద్ధి కొరకు తన జీవితకాలమంతా పోరాటాలను కొనసాగించినాడని వారి పోరాట ఫలితమే నేడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనని ఆయన అన్నారు.ఈ సభకు ప్రముఖ కవులు గోరేటి వెంకన్న,జయరాజు గాయకులు యోచన,ప్రజా కళాకారులు,వామపక్ష పార్టీల నాయకులు భారీ ఎత్తున హాజరవుతున్నారని ఈ సభ విజయవంతం కొరకు విద్యార్థులు,యువకులు,సామాజిక ఉద్యమకారులు,అభిమానులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:బొల్లోజు రామ్మోహన్ చారి,ధరావత్ రమేష్,వేల్పుల వెంకన్న,గుగులోతు రాజు,రమణ బోయిన సురేష్,దుగ్గిరాల వెంకన్న,ధారావత్ వీరన్న, సాంబ,బెజ్జం ఐలేష్,కస్తూరి వెంకన్న,లాకావత్ రవి,దేవుల,బానోత్ ఈసు, పుల్లన్న తదితరులు పాల్గొన్నారు.

రామాలయ అభివృద్ధికి నగదు అందజేత.

రామాలయ అభివృద్ధికి నగదు అందజేత

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ పట్టాభి సీత రామచంద్రస్వామి ఆలయంలో బుధవారం ఉదయం ఆలయ అర్చకులు ముసునూరు నరేష్ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు అదేవిధంగా గణపురం మండల కేంద్రానికి చెందిన మచ్చక సారమ్మ కీర్తిశేషులు జ్ఞాపకార్థం వారి కుమారుడు మచ్చక ముఖేష్ కుమార్ ఆలయ అభివృద్ధి కొరకు 10,000₹ రూపాయలను ఆలయ కమిటీ అధ్యక్షులు తాళ్లపల్లి గోవర్ధన్ గౌడ్ కి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బండారు శంకర్ మూల శ్రీనివాస్ గౌడ్ బటక స్వామి బూర రాజగోపాల్ మాదాసు అర్జున్ మాదాసు మొగిలి దయ్యాల భద్రయ్య పాండవుల భద్రయ్య ఆలయ ప్రాంగణంలో హనుమాన్ మాల ధారణ స్వాములు తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య…

విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించండి..

ప్రధానోపాధ్యాయులు బీరం జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బడిబాట…

కేసముద్రం  నేటి ధాత్రి:

విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని బేరువాడ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బీరం జనార్దన్ రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం బేరువాడ గ్రామంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బీరం జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా, ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతు న్న ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ, నాణ్యమైన మధ్యాహ్న భోజనం,ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ , రాగి జావా,రెండు జతల బట్టలు ఇస్తూ నిష్ణాతులైన ఉపాధ్యాయులచే ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన జరుగుతుందని వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, ప్రైవేటు పాఠశాలలో చేర్పించి ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బానోతు వాగ్య, కోడం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పనికి ఆహారపథకంలో పాల్గొంటున్న విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి వారిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బీరం జనార్దన్ రెడ్డి కోరారు.

శ్రీ శ్రీ శ్రీ రేవణ సిద్దేశ్వర స్వామి.!

శ్రీ శ్రీ శ్రీ రేవణ సిద్దేశ్వర స్వామి చండికాంబ మాత జయంతి మహోత్సవాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

శ్రీశ్రీశ్రీ జగద్గురు రేవణ సిద్దేశ్వర స్వామి దేవస్థానం ఝరాసంగం మండలం ఈధులపల్లిలో శ్రీ శ్రీ శ్రీ రేవణ సిద్దేశ్వర స్వామి చండికాంబ మాత జయంతి మహోత్సవాలు ఆలయ కమిటీ అద్వార్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది…ఇట్టి కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ ఝరాసంగం మండల అధ్యక్షులు హనుమంత్ రావు పాటిల్, పెద్దలు రాచయ్య స్వామి,శంకర్ పాటిల్,యూత్ కాంగ్రెస్ సంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్ ,పెన్ గన్ ఎడిటర్ రాయికోటి నర్సింలు, కొల్లూరు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు డప్పూరు సంగమేష్,యూత్ కాంగ్రెస్ ఝరాసంగం మండల ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్ మరియు పలువురు పెద్దలు, నాయకులు,భక్తులు పాలుగొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version