ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం..

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం

 

పరకాల నేటిధాత్రి
పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు మాదాసి శ్రీధర్ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి,డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క,పోన్నం ప్రభాకర్ కి దామోదర రాజనర్సింహ,ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు దొమ్మటి కృష్ణకాంత్ మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వమే ఎన్నడ లేనివిధంగా కానీ విని ఎరుగని రీతిలో 6000 కోట్ల రూపాయలతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రాజీవ్ యువ వికాసం పథకం కింద 5లక్షల యువత యువకులకు నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించడానికి ఆర్థిక సహకారం అందించడానికి ఈ పథకం క్రింద ప్రతి లబ్ధిదారునికి నాలుగు లక్షల వరకు ఆర్థిక సాయం అందించడం జరుగుతుందని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% బిల్లు మరియు ఎస్సీ వర్గీకరణ భారతదేశ చరిత్రలో కనీ వినీ ఎరగని రీతిలో శాసన సభ లో బిల్లునీ ప్రవేశ పెట్టిన తీర్మానించి ఆమోదించినందున తెలంగాణా ప్రభుత్వానికి ఆమోదం తెలిపిన సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పరకాల మండల అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు కొయ్యాడ శ్రీనివాస్,మాజీ ఎంపీపీ తక్కలపెళ్లి స్వర్ణలత,సమన్వయ కమిటీ సభ్యులు సొద రామకృష్ణ,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్యామ్,అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి అల్లం శ్రీరామ్ కుమార్,యూత్ నాయకులు బొచ్చు జెమిని,మంద వెంకటేష్,బొచ్చు రాజు,బోజ్జం అనిల్,దాసరి దిలీప్,ఇనుముల రాము,సిలివేర్ తిరుపతి,అముదలపెళ్లి రమేష్,శివ కుమార్,అరుణ్,సురేష్,నరేష్, తిక్క అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన.!

ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు

సిరిసిల్ల టౌన్ 🙁 నేటి ధాత్రి )

Congress

సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించిన సందర్భంగా సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, ఇది ఒక చరిత్ర ఒక అంశం అంటూ సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్,కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత. మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప కాంగ్రెస్ సీనియర్ గడ్డం నర్సయ్య,ఆకునూరి బాలరాజు. కుడిక్యాల రవి, గోనె ఎల్లప్ప, తదితర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ.

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

 

నడికూడ,నేటిధాత్రి:

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో నిర్వహించగా విద్యార్థులు ఉపాధ్యాయులు గా మారి తరగతి గదులలో విద్యాబోధన చేశారు. అనంతరం ఉపాధ్యాయులుగా ఉన్న విద్యార్థులు సమావేశంలో మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అనేది సమాజంలో విలువలతో కూడుకొని ఉన్నదని,ఉన్నత మైనదని అన్నారు.గురువు లేని విద్య గుడ్డి విద్య అని కూడా అన్నారు.ఒక డాక్టర్, లాయరు,పోలీస్,కలెక్టర్, రాజకీయ నాయకులు, తయారు కావాలంటే గురువు దగ్గర చదువు తీసుకోవాల్సిందే అని అన్నారు.మేము ఒకరోజు ఉపాధ్యాయులుగా పని చేయడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో స్వయం పరిపాలన దినోత్సవం లో ప్రధానోపాధ్యాయులుగా ముష్కే గగన్ వాల్మీకి, ఉపాధ్యాయులుగా సురుగుల నవ్య శ్రీ, శనిగరం చరణ్,కట్ల హిమాన్షు రెడ్డి,మామిడాల విశ్వతేజ రెడ్డి,దుబ్బాకుల వశిష్ట భార్గవ,తోకల నవనీత్ రెడ్డి,గోగుల జస్వంత్ రెడ్డి, కందికట్ల హర్షిత్,సోలంకి జస్మిత,గరిడే శ్రీనిత,తాళ్లపల్లి శ్రీనిధి,పూసాల అభిజ్ఞ, తాళ్లపల్లి శరణ్య, వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా,మేకల సత్యపాల్ రెడ్డి, అంగన్వాడీ టీచర్స్ బీముడి లక్ష్మీ,నందిపాటి సంధ్య ఐఆర్పి రమేష్ పాల్గొన్నారు.

MP నిధుల కేటాయించడంతో హార్షం వ్యక్తం చేసిన BJP..

MP నిధుల కేటాయించడంతో హార్షం వ్యక్తం చేసిన BJP కథలాపూర్ మండల శాఖ….

నేటి ధాత్రి కథలాపూర్

కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కథలాపూర్ మండలంలోని నాలుగు గ్రామాలకు MP నిధులను కేటాయించడంతో BJP మండల శాఖ,బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. సిరికొండ,తండ్రీయాల, కథలాపూర్ గ్రామాలకు బోర్ మోటార్,దులూర్ రజక సంఘ భవనానికి 9 లక్షల రూపాయలు విడుదల చేయడం పట్ల పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్,వేములవాడ నియోజకవర్గ నాయకులు చెన్నమనేని వికాస్ రావు లకు బీజేపీ మండల శాఖ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
కార్యక్రమంలో BJP మండల అధ్యక్షులు మల్యాల మారుతి,సీనియర్ నాయకులు వెంకటేశ్వర్ రావ్,బద్రి సత్యం,కథలాపూర్ మహేష్, కాసోజీ ప్రతాప్,నరెడ్ల రవి,గడ్డం జీవన్ రెడ్డి, తెడ్డు మహేష్ పాల్గొన్నారు.

భద్రాచల సీతారామచంద్రుల కళ్యాణ తలంబ్రాలు.

భద్రాచల సీతారామచంద్రుల కళ్యాణ తలంబ్రాలు..ఆర్టీసీ సంస్థ సేవలు

సిరిసిల్ల టౌన్ :(నేటి దాత్రి)

శ్రీరామనవమి సందర్బంగా భద్రాచలం లోని శ్రీ సీతారామచంద్రుల కళ్యాణం తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే ఆర్టీసీ కార్గో ద్వారా అందచేస్తామని సిరిసిల్ల ఆర్.టీ.సీ డిపో మేనేజర్ ప్రకాష్ రావు అన్నారు .బుధవారం సిరిసిల్ల బస్ స్టేషన్ లో తలంబ్రాల బుకింగ్ రశీదు పుస్తకాలను ఆవిష్కరించినారు.ఈ సందర్బంగా డిపో మేనేజర్ ప్రకాష్ రావు మాట్లాడుతూ కల్యాణ తలంబ్రాలు బుకింగ్ కోసం భక్తులు సిరిసిల్ల బస్టాండ్ లోని కార్గో కార్యాలయం లో మరియు డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వద్ద,ఏజెంట్ ల వద్ద 151/- లు చెల్లించి బుకింగ్ రసీదును పొందాలనిఅన్నారు . కళ్యాణ అనంతరం భక్తుల ఇండ్లకు తలంబ్రాలను అందజేస్తామని,స్వామివారి కల్యాణానికి వెళ్లలేని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని శ్రీరాముడి ఆశీస్సులను పొందాలని అన్నారు. తలంబ్రాలు బుకింగ్ కోసం 9154298576
,9154298577,9492448189 నెంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్గో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కార్గో సిబ్బంది, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.

ప్రైవేటు పాఠశాలలలో మౌలిక వసతుల జాడేది.?

ప్రైవేటు పాఠశాలలలో మౌలిక వసతుల జాడేది..?

తీరని విద్యార్థుల దాహం..!

నిబంధనలను బేకాతర్ చేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు

మౌలిక వసతులను పకడ్బందీగా అమలు చేయాలి

జిల్లా,మండల విద్యాశాఖ అధికారికి
సామాజిక కార్యకర్త కర్నె రవి వినతి

 

నేటి ధాత్రి! భద్రాద్రి జిల్లా

విద్యార్థుల నుంచి వేలకు వేల రూపాయలను ఫీజులుగా తీసుకుంటున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు కనీస మౌలిక వసతుల కల్పన విషయంలో మాత్రం ఏం పట్టనట్లు వ్యవహ
రిస్తున్నారని, ప్రభుత్వ నిబంధనలు పాటించని ఆయా ప్రైవేట్ విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, విద్యార్థు
లకు కనీస సౌకర్యాలు కల్పించా
లని, సామాజిక కార్యకర్త కర్నె రవి
జిల్లా విద్యాశాఖ అధికారి కి వినతి పత్రం అందజేశారు. ఈ సంద
ర్భంగా ఆయన మాట్లాడుతూ..
విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించేందుకు రకరకాల పేర్లతో పినపాక నియోజకవర్గం లో ప్రైవేట్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నా యాజమాన్యాలు
ఒలంపియాడ్, టెక్నో, డిజిటల్‌, ఇంటర్‌నేషనల్‌, ఫౌండేషన్‌ వంటి తోక పేర్లతో పాఠశాలలను ఏర్పా
టు చేస్తున్నారని, ఆరోపించారు. ఇలాంటి స్కూల్ లను నిర్వహించ
వద్దని ప్రభుత్వం పలుమార్లు ఆదేశాలు కూడా ఇచ్చింది. కానీ తమను ఆపేది ఎవరన్నట్టు… పలు ప్రైవేటు బడుల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ముందుకెళ్తున్నా
యన్నారు.ఓవైపు యథేచ్చగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలు…. విద్యార్థులకు కనీస వసతలు కల్పించడంలో విఫలమ
వుతున్నాయని, అగ్రహం వ్యక్తం చేశారు.ప్రైవేటు బడుల నిర్వహణ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఆశించిన మేర అమలు కావటం లేదన్నారు.ఇంగ్లీషు మీడియంపై మోజు, కార్పొరేటు స్కూళ్లపై వ్యామోహంతో తమ బిడ్డల భవిష్యత్ బాగుండాలని ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్న తల్లిదండ్రు
లకు కన్నీరే మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పీజుల పేరుతో లక్షలు కుమ్మరిస్తున్నా సౌకర్యాలు మాత్రం కరువయ్య
యన్నారు. కోన్ని ప్రైవేట్ పాఠశాల
ల్లో విద్యార్థుల దాహం తీరడం లేదని, పాఠశాలల్లో సౌకర్యాలు మేడిపండు చందంగా ఉన్నాయని పేర్కొన్నారు.రోజంతా బడిలో గడిపే ఆడిపాడే విద్యార్థులకు ఇంటి నుంచి తెచ్చుకునే లీటరు మంచినీరు ఏ మాత్రం చాలడం లేదని,దీంతో పాఠశాలల్లో ఉన్న చేతిపంపులు, కుళాయిలు, వాటర్‌ ట్యాంకుల్లో రక్షితం కాని నీటినే తాగుతున్నారని,దీంతో విద్యార్థు
లు పలు మార్లు జబ్బుల బారిన ఘటనలు ఉన్నాయన్నారు. ఒకవైపు వేసవితో మండే ఎండలు
ఇరుకైన గదులలో విద్యార్థులకు
వేడినీరే ఆధారమవుతుందని, సౌకర్యాలు కల్పించాల్సిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కనీసం స్పందించకుండా కూల్ వాటర్ ను కూడా అందుబాటులో ఉంచకుండా విద్యార్థుల జీవితాల
తో చెలగాటమాడుతున్నాయన్నా
రు.ప్రైవేటు పాఠశాలలలో మౌలిక వసతుల జాడే మచ్చుకైనా కనిపించడం లేదని ధ్వజమెత్తారు.
చాలా ప్రైవేటు పాఠశాలలకు సరైన భవనాలు ఉండటం లేదని,
అద్దెకు భవనాలతో గాలి, వెలుతు
రు కూడా సరిగా లేని బడులు చాలాచోట్ల దర్శనమిస్తున్నాయని,
కొన్ని బడులకు ఫైర్ సెఫ్టీ కూడా లేదని, ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని ఆయన ప్రశ్నించారు. ప్రతి ప్రవేట్ పాఠశాలలో బిల్డింగ్ నిర్వహణ నుంచి టీచర్ల జీతాల వరకు ఏ విషయం తీసుకున్నా…. లోపాల పుట్ట బయటపడే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రైవేట్ పాఠశాలలలో తనిఖీలు చేపట్టాలని, విద్యార్థులకు కనీస మౌలిక వసతులను కలిపించాలని కర్నెరవి డిమాండ్ చేశారు.

శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ ఆహ్వానము.

శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ ఆహ్వానము

జహీరాబాద్. నేటి ధాత్రి:

గ్రా రంజోల్ (బాబానగర్), మం॥ జహీరాబాద్, జిల్లా సంగారెడ్డి,తేది : 25-03-2025 మంగళవారము రోజున ఉ॥ 7-00 ని॥లకు సృష్టి, స్థితి, లయకారిణి తన కంటి చూపుతో జగత్తును నడిపించు తల్లి అపారశక్తి మాతా ఆ శక్తి దివ్య స్వరూపిణి, శ్రీ పెద్దమ్మతల్లి మాతా సుమారుగా 150 సం॥ల నుండి ఇక్కడి చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలు పొడి, పంటలకు సంబందించి భక్తులందరిని అనుగ్రహిస్తూ, భక్తులందరికి కొంగు బంగారమై వెలసిన శ్రీ పెద్దమ్మతల్లి కోరిన కోరికలు వెంటనే తీర్చి సుఖ శాంతి సంతోషాలను ప్రసాదిస్తుందని ఇక్కడి స్థల ప్రతిష్ఠ ఆచల్లని తల్లి అయిన శ్రీ పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవము వైభముగా జరుగును. కావున భక్తులందరూ కార్యక్రమములో తన, మన, ధన రూపేన పాల్గోని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు.

వేదిక కార్యక్రమ వివరములు :

తేది : 25-03-2025 మంగళవారము రోజున ఉ॥ 6-00 గం॥లకు గోపూజ, అగ్రోదకము, ధ్వజారోహణము, యాగశాల ప్రవేశము, అఖండ దీపారాధనము, మహా గణపతిపూజ, స్వస్తిశివపుణ్యహావచనము తరువాత విగ్రహ జలాధి వాసము తరువాత పంచాచార్య పూజ, పంచ గవ్వ ప్రాశనము, నాడి సమారాధనము, నవగ్రహ అష్టదిక్పాలక పూజా సర్వతో భద్ర మండప ప్రధాన కళశ దేవత ఆహ్వాన పూజ, అగ్ని ప్రతిష్ఠ మరియు తీర్ధ ప్రసాదములు మంగళవారము ఉ. 7-00 గం॥లకు విగ్రహము ఊరేగింపుతో విగ్రహం ఆలయం వద్దకు వచ్చుట మరియు హోమము విగ్రహ జలధివాసనము. సా॥ 6-00 గం॥ హోమము విగ్రహ దాన్యాధి వాసము.
తేది: 26-03-2025 బుధవారము రోజున ఉ॥ 5-00 గం॥లకు సుప్రభాత సేవా తరువాత విగ్రహ శయ్యాధి వాసనము తరువాత మండవ దేవతా ఆరాధనము కళశ పూజా. జపాది స్నానము (మహాస్నపనము) హోమము.
ఉ॥ 11-39 ని॥లకు విగ్రహ ప్రతిష్టాపన, శిఖర ప్రతిష్టా, నేత్రనిర్మలనము, పూర్ణాహుతి అమ్మవారి ధర్శనము, సద్గురువుల ఆశీర్వాద ప్రవచనము. పండిత సన్నానము ఆశీర్వచనములు మరియు తీర్థ ప్రసాదములు, మ॥ 1-00 గం॥లకు గ్రామము నుండి గుండి వరకు భోనాల

కార్యాక్రమము తర్వాత.

తేది: 25-03-2025 రోజు మ॥ 2-00 గం॥ మరియు తేది: 26-03-2025 రోజు సా॥ 5-00 గం॥లకు భక్తులందరు అన్నదాన ప్రసాదము స్వీకరించుకోగలరు.

ఈ కార్యక్రమమునకు విచ్చేయు పూజ్యగురువరేణ్యులు:

వేధిక నిర్వాహణ:

శ్రీ గురు శాంతయ్య స్వామి,

శ్రీ రాజు స్వామి, శివప్రసాద్ స్వామి

శ్రీ వద్దమ్మ తల్లి దేవాలయ కమిటీ మరియు గ్రామ ప్రజలు, పెద్దలు.

ఆత్మగౌర పరిరక్షణ కై మాలల సింహ గర్జన.

*23న ఆత్మగౌర పరిరక్షణ కై మాలల సింహ గర్జన..

*రిజర్వేషన్లు రద్దు కోసం ప్రభుత్వాల కుట్ర..

*ఎస్సీ వర్గీకరణతో మాలల వంచనకు ప్రయత్నం…

*సింహగర్జనతో మాలల సత్తా చాటుదాం…

*వ్యతిరేక ప్రభుత్వాలకు గుణపాఠం చెబుదాం…

*రాయలసీమ మాలల జేఏసీ నేతల పిలుపు…

తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 19:

అనగారిన బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పడే రిజర్వేషన్లను పూర్తిస్థాయిలో రద్దు చేయాలని కుట్రతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ తెరపైకి తెచ్చి మాలలను దగా చేసేందుకు ప్రయత్నిస్తోందని రాయలసీమ మాలల జేఏసీ నేతలు ధ్వజమెత్తారు. బుధవారం బాలాజీ కాలనీలోని అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాయలసీమ మాలల జేఏసీ గౌరవ అధ్యక్షుడు అశోకరత్న మాట్లాడారు.2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకొని మాలలను తక్కువగా చూపిస్తూ మాదిగలకు ఉపకరించేలా వర్గీకరణను ఆమోదానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. వన్ మ్యాన్ కమిషన్ నివేదికను అడ్డుపెట్టుకుని అసెంబ్లీలో వర్గీకరణ ఆమోదం చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. యావత్తు దళిత జాతి ఓట్లతో గద్దెనెక్కి ఆ జాతి అణిచివేతకు పాలకులు ప్రయత్నించడం అత్యంత హేమమైన చర్య అన్నారు. రాజ్యాంగబద్ధంగా ఎంపికైన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎస్సీ వర్గీకరణ పై ప్రశ్నించకుండా అచేతనంగా నిలబడడం దుర్మార్గమన్నారు. రాజకీయ లబ్ధి కోసం పాలకులు చేసే కుయుక్తులను అడ్డుకోకపోతే యావత్ దళిత జాతి రాజ్యాంగబద్ధంగా సిద్ధించిన రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో కోల్పోయే పరిస్థితి దాపురుస్తుందన్నారు. ఇప్పటికీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మాలలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దళిత జాతి వ్యతిరేక పవిత్రమైన కూటమికి గుణపాఠం చెప్పేందుకు యావత్ మాల జాతి సన్నిద్ధం కావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇందులో భాగంగానే రాయలసీమ మాలల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తారీఖున భారీ స్థాయిలో తిరుగుతూనే నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్లో 23వ తేదీ సాయంత్రం మూడు గంటలకు మాలల సింహగర్జన సభను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సింహగర్జన సభకు రాయలసీమలోని యావత్ మాల జాతి తో పాటు దళిత మేధావులు ఉద్యోగులు, పెద్ద ఎత్తున తరలివచ్చి మాలల ఐక్యతతో తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాయలసీమ మాలల జేఏసీ ప్రతినిధులు మల్లారపు మధు. సుదర్శనం. ఏ ఆర్ అజయ్ కుమార్. ధన శేఖర్. కే మురళి. అనిల్ కుమార్ పాల్గొన్నారు.

బిఆర్ఎస్వి నాయకుల అరెస్టులు అప్రజాస్వామికం.

బిఆర్ఎస్వి నాయకుల అరెస్టులు అప్రజాస్వామికం.

జహీరాబాద్. నేటి ధాత్రి:

ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాలకు పురిటి గడ్డ అని. ఝరాసంగం మండలం మేధపల్లి తాజా మాజీ సర్పంచ్ మండలబి ఆర్ యస్. యువనాయకులు. పరమేశ్వర్ పాటిల్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న బిఆర్ఎ స్ నాయకలును ఎక్కడిక్కడ ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం హేమమైన చర్య అని అన్నారు. ఉస్మానియా యూనివర్శిటీలో నిరసనల కార్యక్రమాలు రద్దు చేసే సర్క్యులర్ ప్రతిపాదన ను వెంటనే రద్దు చేయాలి అని లేదంటే ఉద్యమాన్ని ఇంకా ఉదృతం చేస్తాం అని ఈసందర్బంగా పరమేశ్వర్ పాటిల్ అన్నారు. టిఆర్ఎస్వీ నాయకులు , అదేవిధంగా దేవరం పల్లి తాజా మాజీ ఉపసర్పంచ్ శంకర్ యాదవ్. ప్యాలవరం తాజా మాజీ ఉపసర్పంచ్ మాణిక్ యాదవ్ లు మాట్లాడుతూ అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్నా మాకు ముందస్తుగా అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నిండమే అప్రజాస్వామికం అయిపోయింది ఈ కాంగ్రెస్ పాలన లో అని. సామాజిక ప్రజా ఉద్యమా లకు వేదికైనటువంటి ఓయులో నిరసన కార్యక్రమాలు రద్దుకు సర్క్యులర్ జారీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ ముర్కత్వపు చర్య అని మండిపడ్డారు. ప్రతి పక్షంలో ఉన్నపుడు ఇదే ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి దొడ్డి దారిన ఉస్మానియా యూనివర్శిటీ లో నిరసన కార్యక్రమాలు చేయొచ్చు గానీ ప్రజాస్వామ్య పద్ధతిలో విద్యా ర్థులు నిరుద్యోగ, విద్య, వైద్యం, నీళ్లు, నిధులు నియామకాల కోసం మరియు ప్రభుత్వ తీరును ఎండగట్టి ప్రజా సమస్యల పై ప్రశ్నిస్తే మాలాంటి యువకులను అరెస్ట్ చెయ్యడం. విడ్డురం అని.విద్యార్థి లోకం నేడు నక్సలైట్లు గా అభివర్ణిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో టిఆర్ఎస్వి అద్వర్యంలో విద్యార్థుల పక్షాన పోరాడి మరిత పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

నిమ్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలి.

నిమ్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలి : సంగారెడ్డి కలెక్టర్.

జహీరాబాద్. నేటి ధాత్రి:

జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిమ్జ్ ఏర్పాటు కోసం అవసరమైన భూసేకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో నిమ్జ్ ప్రత్యేక అధికారి రాజు, జహీరాబాద్ ఆర్డీవో, తహసీల్దార్ లతో కలెక్టర్ నిమ్జ్ భూసేకరణ పై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిమ్జ్ ఏర్పాటుతో మారుమూల ప్రాంతాలైన జహీరాబాద్ నియోజకవర్గాల రూపురేఖలు మారిపోతాయి అన్నారు. నిమ్జ్ ఏర్పాటుతో ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయన్నారు.ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం నిమ్జ్ ఏర్పాటుకు భూములు ఇచ్చిన వారికి నష్టపరిహారం అందించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ విషయంపై ఆయా గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించి భూసేకరణ ప్రక్రియ వేగవంతం అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు ఆయా మండలాల్లో గ్రామాల వారీగా చేసిన భూసేకరణ వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఎంత సేకరణ చేయాల్సి ఉంది అన్న వివరాలను కలెక్టర్ ఆయా మండలాల రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని గ్రామాల్లో ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ పనులు వేగవంతంగా చేసి నిమ్జ్ ప్రాజెక్టు సకాలంలో ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జహీరాబాద్ ఆర్డీవో రామ్ రెడ్డి, తహసీల్దార్లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

కంపు కొడుతున్న కాంట్రాక్టర్ బస్తీ.

కంపు కొడుతున్న కాంట్రాక్టర్ బస్తీ.

బెల్లంపల్లి నేటిధాత్రి :

ఇంటి పనుల కోసం బస్తీలోకి వస్తే అసలు మునిసిపాలిటీకి పన్నులు దేనికోసం కట్టాలి అని నిలదీయడానికి బస్తి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న కౌన్సిలర్ కూడా ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్ సంబంధిత అధికారులు కూడా పట్టించుకోవడం లేదు
బెల్లంపల్లి పట్టణంలోని 18. వార్డ్ కాంట్రాక్టర్ బస్తీలో కాలువలు ఏరులైపోరుతున్నాయి చెత్త రోడ్డు మీద పేరుకుపోయి దుర్వాసనకు బస్తి ప్రజలు అల్లాడుతున్నారు కానీ సంబంధిత మున్సిపల్ అధికారులు కన్నెత్తి కూడా చూడరు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరు ఇక బెల్లంపల్లి మునిసిపల్ కమిషనర్లు ఎంతమంది మారినా కానీ కాంట్రాక్టర్ బస్తి కంపు మాత్రం వదలడం లేదు నడిరోడ్డు మీద గుంతలు తవ్వి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా గాని దాన్ని సరి చేయలేదు గుంతలు పూడ్చలేదు అత్యవసర పరిస్థితిలో కనీసం మూడు చక్రాల ఆటో కూడా బస్తీలోకి రాక గతంలో ఇద్దరి ప్రాణాలు పోయినా కానీ పట్టించుకోని మునిసిపల్ అధికారులు ఇంటి పన్నులు వసూలు చేసుకోవడంలో ఉన్న శ్రద్ధ వార్డు పారిశుద్ధ్యం పై లేకపోవడం సోషనీయం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఇంటి పనులు కట్టే ప్రసక్తే లేదని వార్డు ప్రజలు అంటున్నారు అసలు కాంట్రాక్టర్ బస్తి బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఉందా లేదా ఏదైనా గుట్ట కింది మారుమూల అడవిలో ఉందా అర్థం కావడం లేదు అని వాపోతున్నారు.

పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి.

పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

సర్పంచ్ పెండింగ్ బిల్లులు ఇవ్వలని అసెంబ్లీ ముట్టడి కి వెళ్లకుండా ముందస్తు గా అరెస్ట్ చేసి హద్నూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు అరెస్ట్ అయిన వారు బిఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి మాజీ సర్పంచ్ మల్లారెడ్డి జట్గొండ మారుతీ చంద్రప్ప సర్పంచ్ ల బిల్లులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం మంచింది కాదు కాబట్టి ప్రభుత్వం వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాము.

ఉన్నత ఉద్యోగానికి ఎంపిక..!

‘దూర విద్యలో చదివి.. ఉన్నత ఉద్యోగానికి ఎంపిక’

కల్వకుర్తి /నేటి ధాత్రి

కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామానికి చెందిన తాళ్ల శివలీల గృహిణిగా ఉంటూ.. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ దూరవిద్యలో డిగ్రీ పూర్తి చదివింది. అనంతరం కల్వకుర్తిలో బీఈడీ పూర్తి చేసింది. భర్త తాళ్ల రాజేందర్ ప్రోత్సాహంతో హైదరాబాదులో ఉంటూ.. శిక్షణ తీసుకొని ప్రిపేర్ అయింది. మూడు రోజుల క్రితం వెలుబడిన హాస్టల్ వెల్ఫేర్ ఫలితాలలో ఉద్యోగం సాధించింది. ఆమెకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి వరుణ్ గౌడ్ అమెరికాలో ఏం.ఎస్ చదువుతుండగా.. కూతురు పూజిత హైదరాబాదులో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. గృహిణిగా ఉంటూ.. ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక కావడంతో.. పలువురు అభినందనలు తెలిపారు.

సునీత విలియమ్స్ కు ప్లైకార్డులతో స్వాగతం.!

సునీత విలియమ్స్ కు ప్లైకార్డులతో స్వాగతం పలికిన విద్యార్థులు

వరంగల్/నర్సంపేట,నేటిధాత్రి:

Students

భారతీయ సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ సురక్షితంగా భూమిమీదకు చేరిన సందర్భంగా వరంగల్ జిల్లా గీసుగొండ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ విద్యార్ధులు ప్లైకార్డ్స్ తో స్వాగతం పలికారు.ఈకార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులతో పాటు పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎం.పట్టాభి, ఉపాద్యాయలు విటోభా,పద్మ, అరుణశ్రీ, వెంకట్రావు, శ్రీనివాస్, జ్యోత్స్నప్రభ,రవిచందర్, సబిత, ప్రవళిక , బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈసందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ పట్టాభి మాట్లాడుతూ 9 నెలల 288 రోజుల సుధీర్ఘ కాలం వివిధ పరిశోధనల నిమిత్తం అంతరిక్షంలో ఉండి, దిగ్విజయవంతంగా తిరిగి భూమిపైకి చేరుకున్న సునీత విలియమ్స్ మన భారత సంతతికి చెందినవారు కావడం మనందరి గర్వకారణం అని పేర్కొన్నారు. ఆమె స్ఫూర్తితో తమ పాఠశాల విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని ప్రపంచ స్థాయి గుర్తింపు పొందాలని పిలుపునిచ్చారు.

Students

మండల జాగృతి అధ్యక్షుల ఆధ్వర్యంలో కమిటీలు.

మండల జాగృతి అధ్యక్షుల ఆధ్వర్యంలో కమిటీలు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మండల జాగృతి ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తెలంగాణ మండల జాగృతి అధ్యక్షులు కందుకూరి రామ గౌడ్ మాట్లాడుతూ మండలంలో పట్టణంలో తెలంగాణ జాగృతి కమిటీ లను వేశామని అలాగే రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉండి 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి అభినందిస్తూ అలాగే రాబోయే ఎన్నికల్లో బీసీలకు అన్ని సంక్షేమ పథకాల్లో గాని స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పిటిసి గాని ఎంపిటిసి గాని సర్పంచ్ గాని ఎన్నికల్లో రిజర్వేషన్ కేటాయించాలని ముఖ్యంగా మహిళలకు రిజర్వేషన్ అమలు అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎమ్మెల్సీ కవితక్క గారు బీసీల గురించి మండల సభల్లో ఎన్నోసార్లు బీసీల గురించి స్థానికంగా ప్రసంగించారని తెలంగాణ జాగృతి ని రాష్ట్రంలో అన్ని వర్గాలకు అనుకూలంగా ప్రయోజనం పొందేలా ఎమ్మెల్సీ కవితక్క ఎప్పటినుండో పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే ముందు రోజుల్లో అన్ని కులాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్ ప్రక్రియ కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే తెలంగాణ జాగృతి తంగళ్ళపల్లి మండలం యువజన కార్యదర్శిగా అనిల్ గౌడ్ ను తంగళ్ళపల్లి తెలంగాణ జాగృతి పట్టణ అధ్యక్షులుగా విబి రంగమును ఉపాధ్యక్షులుగా భానుమూర్తిని నియమించడం జరిగిందని ఇట్టి కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జగత్.వెంగళ రమేష్ పసుల దుర్గయ్య మనోహర్ శ్రీనివాస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

మద్యం సేవించి వాహనం నడిపితే నిండు ప్రాణాలు.!

మద్యం సేవించి వాహనం నడిపితే నిండు ప్రాణాలు బలి..

మందుబాబులు ఇకనైనా మారండి..

మద్యం తాగి వాహనం నడిపితే జైలుకు వెళ్లాల్సిందే.

ప్రతిరోజు డ్రంకన్ డ్రైవ్..

రామాయంపేట మార్చి 19 నేటి ధాత్రి (మెదక్)

Drunk driving

మద్యం తాగి వాహనాలునడిపితే తరచూ ప్రమాదాలు జరుగుతూ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా.. తాగే వారు మాత్రం తాగక మానడం లేదు. వాహనాలు నడిపేవారు మాత్రం నడపక మానడం లేదు. నిత్యం ఈ తంతు జరుగుతూనే ఉంది. అధికారులు వారు తగిన విధాలుగా ప్రయత్నాలు చేస్తున్న తాగి నడపడం మాత్రం మానుకోవడం లేదు.
మద్యం సేవించి వాహనాలు నడపరాదు అంటూ అధికారులు ఆదేశించిన ప్రయాణీకుల్లో మాత్రం దృష్టి పెట్టడం లేదు. అధికారులు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న వాహనాదారులు మాత్రం తాగిన మైకంలో వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు గురి చేస్తున్నారు. డ్రింక్ అండ్ డ్రైవ్ లో దొరికి జైలుకు పోతున్న సందర్భాలు ఉన్న, ప్రయాణికుల్లో మాత్రం చలణం కనిపించడం లేదు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం తాగినడపడమే అని చాలామంది వాదిస్తున్న వారికి ఆలోచనలు మాత్రం రావడం లేదు. తాగిన మైకంలో ద్విచక్ర వాహనదారులు వారి ఇష్టాను రీతిలో వాహనాన్ని నడుపుతున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు ప్రధాన రహదారిపై వాహనాల జోరు పెరిగింది. విందులు, వినోదాల పేరుతో దైవదర్శనాలకు వెళుతూ వచ్చేవారు కొంతమంది అయితే, తాగినడిపేవారు ఎక్కువగా ఉన్నారు.

వాహనదారుల తీరు మారాల్సిందే..

Drunk driving

తాగి నడిపిన పాపానికి కేవలం మనమే ఒకరికే కాకుండా ఎదుటి వ్యక్తులకు కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా వాటిల్లుతుంది. దీని ప్రభావం ఎన్నో కుటుంబాల పైన పడుతుంది. దీనితో వాహనదారులు సైతం తాగి వాహనాలు నడిపే ధోరణిని మానుకోవాలి, రామాయంపేట మండల ప్రాంతంలో తరచు ఏదో ఒక రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ఇప్పటికైనా వాహనదారులు మారితే అందరికీ మేలు కలుగుతుంది.

తాగి నడిపితే జైలు శిక్ష తప్పదు..
ఎస్సై బాలరాజు రామయంపేట.

మందుబాబులు మద్యం సేవించి వాహనాలతో రోడెక్కుతున్నారా అయితే మీకు జైలు శిక్ష తప్పదు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్న వారిని కఠినంగా శిక్షించి జైలు శిక్షలు విధిస్తున్నాయి. మద్యం మత్తులో వాహనం నడిపే వారికి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదంటూ న్యాయస్థానాలు కఠినంగా ఆదేశాలు జారి చేసిన వాహనదారుల్లో మాత్రం భయం ఏర్పడడం లేదు. ఇటీవలె మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ అమాయకమైన వారి ప్రాణాలు బలిగొన్న సంఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయి, వారికి కోర్టుల్లో జరిమానాలు జైలు శిక్షలు విధిస్తూనే ఉన్నారు. అయినా వాహనదారులలో మాత్రం మార్పు రావడం లేదు.
మద్యం సేవించి రోడ్డుపై వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని చెబుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహించి మద్యం సేవించిన వారిని పట్టుకుని కేసులు చేస్తున్నాం.మద్యం సేవించి వాహనం నడపడం నేరం అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు.

అటు లంచాలు..ఇటు అరాచకాలు.

మంత్రి ‘‘శ్రీనివాస్‌ రెడ్డి’’ ఆదేశాలు అంటే అంత లెక్క లేకుండా పోతుందా!

-ఒక్కొక్కటిగా బైట పడుతున్న రెవెన్యూ అధికారుల అగడాలు

-నిత్యం వెలుగు చూస్తున్న అనేక మంది ఎమ్మార్వోల బాగోతాలు.

-రాబందులకెక్కువ..రాక్షసులకు తక్కువగా తయారౌతున్నారు.

 

-మానవత్వం మర్చిపోతూ లంచాలకు తెగబడుతున్నారు.

-అక్రమాలు ఆపరు..లంచాలు మానరు.

-రైతులను తిప్పితిప్పి పిప్పి చేయకుండా వుండలేరు.

-ఒకరి భూములు మరొకరికి అంటగట్టకుండా అసలే వుండలేరు.

-రైతుల ఉసురు పోసుకుండా వుండరు.

-ఆఖరుకు రైతు చనిపోతే వచ్చే పరిహారంలో ఫలహారం కోరుతున్న వాళ్లున్నారు.

-ఆత్మకూరు ఎమ్మార్వో నిర్వాకానికి సజీవ సాక్ష్యం.

-పిండాలను కూడ వదలనంత దుర్మార్‌ంగా వ్యవహరిస్తున్నారు.

-2014లో చనిపోయిన రైతుకు ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదు.

-హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా లెక్క చేయలేదు.

-తహసీల్దారుకు జీతభత్యాలు ఆపాలని హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

-మోతె మండల ఎమ్మార్వో అరెస్టు అయ్యారు.

-ఫైళ్లను టాంపరింగ్‌ చేసిన ఆరోపణలు రుజువయ్యాయి.

-ఇంతగా దిగజారి బతకాలా!

-ప్రజలను పీడిరచడమేమైనా హక్కు అనుకుంటున్నారా!

-రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా మారరా?

-ప్రభుత్వాల ఉదాసీనత చేతగాని తనం అనుకుంటున్నారా?

-ప్రజల రక్తం తాగడం మానరా?

-చేసే తప్పులు చేస్తూనే అహంకారమా!

-అశుద్దాన్ని అద్దుకుతింటూ గొప్పలకు పోవడమా?

-మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరంటూ విర్రవీగుతుండడమా?

మీరు మారరా? మీలో మార్పు రాదా? మీలో మానవత్వం లేదా? అంటే మారితే మేమెందుకు అదికారులమౌతాము? మారితే మాకు అక్రమ సంపాదనలు ఎవరు సమకూర్చిపెడతారు? అని ప్రశ్నించే కాలమొచ్చినట్లుంది. అందుకే మమ్మల్ని ఎవరేం చేయలేరు. అవినీతి చేసినప్పుడు దొరికితే మహా అయితే పట్టుబడతాము? జైలుకెళ్తాము..ఇంతకన్నా జరిగేదేముంది? మా కొలువులు పోయేది వుందా? పరువు మర్యాదల కోసం ఆలోచిస్తూ కూర్చుంటే కోట్లు కూడబెట్టుకోవడం కుదుతుందా? అనుకుంటున్నట్లున్నారు. అందుకే అందిన కాడికి ఎక్కడైనా సరే దండుకోవడమే మాకు తెలుసు అన్నట్లుగా కొంత మంది తహసిల్ధార్‌లు వ్యవహరిస్తున్నారు. ఆరోపణలు నీటి మీద రాతలు. విమర్శలు గాలికి కొట్టుకువచ్చే దుమ్మురేణువులు అనుకుంటున్నారు. ఆరోపణలు నాలుగురోజులైతే చెరిగిపోతాయి. విమర్శలు దులిపేసుకుంటే రాలిపోతాయి. కోట్లు కూడబెట్టుకుంటే తరతరాలకు పనికి వస్తాయి. వచ్చే తరాలు హాయిగా బతుకుతాయి. ఇదే కొందరు అధికారులు కోరుకుంటున్నారు. అందుకే విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటున్నారు. దొరికితే దొంగ..లేకుంటే దొర..అంతే ఇక్కడ పెద్ద తేడాలేదు. దొరికినప్పుడు చూద్దాం..లే..ముందైతే లెక్క చెప్పు అనే వరకు వచ్చింది. అందుకే లంచాలు తీసుకోవడం కూడా మరింత పెరిగింది. దీనికి పుల్‌ స్టాప్‌ పడుతుందని ఆశించడం కూడా తప్పే అనుకుంటున్నారేమో! జనానిది అవసరం. మాది అదికారం. పాలకులు వచ్చి వెళ్తుంటారు. మేం లోకల్‌.. అన్నట్లుగా వుంది. ఈ మండలం కాకపోతే మరో మండలం..అన్నీ మండలాలు అక్షయపాత్రలే..ఎక్కడ కూర్చున్నా లక్షలు వచ్చిపడేవే.. మా సంతకానికి అంత విలువ. అందుకే లంచాలు తీసుకుంటున్నామనంటున్న వాళ్లు చాలా మంది తహసిల్థార్‌లు వున్నారు. ఎవరికి చెప్పుకున్నా, ఎవరితో మొరపెట్టుకున్నా ఆఖరుకు పనిచేయాల్సింది మేమే..సంతర్పణలు చేసుకోవాల్సింది మాకే అంటూ పని కోసం వచ్చిన వారితో బరితెగించి చెబుతున్నారంటే ఇక పరిస్దితి ఎంత దూరం వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు. అలా పేట్రేగిపోయిన వారిలో తాజాగా నల్లగొండ జిల్లా ఆత్మకూరు మండల ఎమ్మార్వోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తహసిల్ధార్‌ జీతభత్యాలు ఆపేయాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. కాని అది ఆ తహసిల్ధార్‌కు శిక్ష కాకపోవచ్చు. ఎందుకంటే జీతం మీదే ఆధారపడి బతకాలన్న భయం వుంటే లంచం అన్న మాట వింటేనే ఎవరికైనా చేతులు వణికిపోతాయి. కాని లంచాల ముందు జీతాలు బలాదూర్‌. కొంత మంది తహసిల్ధార్‌ల జల్సాలకు ఒక్క రోజు పెట్టే ఖర్చు జీతంకన్నా ఎక్కువగా వుంటుందని గొప్పలు చెప్పుకునేవారు కూడా వున్నారు. అలాంటి ఎమ్మార్వోలు జీతం ఆగుతుందంటే భయపడతారా? అయినా ఆగిన జీతం ఎంత కాలానికైనా వస్తుందన్న నమ్మకం. అయితే అసలు విషయమేమిటంటే హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని నీరుకుళ్ల గ్రామానికి చెందిన లక్కర్సు మొగిళి 2014లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రైతుకు ప్రభుత్వం నుంచి పరిహారం అందాల్సి వుంది. రైతుకు నష్టపరిహారం అందించడానికి తహసిల్ధార్‌ మెలికపెట్టారు. కాని ఆ పేద రైతు కుటుంబానికి అంత తాహతు లేదు. దాంతో ఏళ్ల తరబడి ఎమ్మార్వో కార్యాలయానికి మృతుడి భార్య తిరుగుతూనే వుంది. కాని ఆ తహిసిల్ధార్‌కు కనికరం కలగలేదు. ఇక విసిగిపోయిన రైతు బార్య లక్ష్మి హైకోర్టును ఆశ్రయించింది. వాదోపవాదాలు విన్న తర్వాత హైకోర్టు మృతుడికి పరిహారం అందజేయాలని ఉత్తర్వులు జారీ చేసి తీర్పునిచ్చింది. అయినా ఎమ్మార్వో హైకోర్టు ఉత్తర్వులను కూడా పక్కన పెట్టాడు. ఈ విషయాన్ని పదే పదే మృతుడి బార్య ఎంత వేడుకున్నా ఎమ్మార్వో స్పందించలేదు. హైకోర్టు ఆదేశాలనే ఆ ఎమ్మార్వో బేకాతరు చేస్తూ వచ్చారు. దాంతో మళ్లీ రైతు కుటుంబం మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. దాంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎమ్మార్వోకు జీత భత్యాలు ఆపేయాలంటూ కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. జీవో. 173 ప్రకారం మృతుడి కుటుంబానికి పరిహారం చెల్లించాలని మరోసారి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ఉన్నత న్యాయస్దానం ఇచ్చిన తీర్పులను కూడా ఇలా ఎమ్మార్వోలు పక్కన పెట్టే స్ధాయికి చేరుకున్నారంటే , ఇక సామాన్యుల పరిస్దితి ఏమిటి? వారు చెప్పింది వినాల్సిందే..అడిగింది ఇవ్వాల్సిందే..లేకుంటే జీవిత కాలం చెప్పులరిగేలా ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే..ఎమ్మార్వో కాళ్లునిత్యం మొక్కాల్సిందే..అయినా ఆఖరుకు ఎమ్మార్వోలు అడిగింది ఇస్తే తప్ప న్యాయం జరగదు. ఇలాంటి దుర్భరమైన పరిస్ధితులు రాష్ట్రంలో వున్నాయంటేనే సిగ్గు చేటు. ఇక మరో ఎమ్మార్వో మరో ఘనకార్యం వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట జిల్లాకు చెందిన ఎమ్మార్వోల అక్రమాలపై గతంలోనే నేటిధాత్రి అనేక కథనాలు రాసింది. ఆయన చేస్తున్న దుర్మార్గాలను వెలుగులోకి తెచ్చింది. పాపం పండే కాలం రావాలంటే ఇదే మరి. ఆఖరుకు ఆ తహసిల్ధార్‌ జైలుకు వెళ్లాల్సిన పరిస్దితి ఇప్పుడు వచ్చింది. సూర్యాపేట జిల్లాకు చెందిన మోతే మండలంలోని రెవిన్యూ కార్యాలయంలో ఫైళ్ల టాంపరింగ్‌ జరుగుతోందంటూ నేటిధాత్రి వార్తలు రాసిన సందర్భం వుంది. రెవిన్యూ కార్యాలయంలో ఫహానీల టాంపరింగ్‌ జరిగింది వాస్తవమే అంటూ అధికారుల విచారణలో తేలింది. అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న మోతే మండల తహసిల్ధార్‌పై జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ దృష్టిపెట్టారు. కొంత కాలంగా ఎమ్మార్వోపై వస్తున్న వార్తలను సీరియస్‌గా తీసుకున్నారు. గత కొంత కాలంగా లోతైన విచారణ చాలా పకడ్భందీగా సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే తహసిల్ధార్‌తోపాటు, ఇద్దరు ఆర్‌ఐలు, కంపూరట్‌ ఆపరేటర్‌, మీ సేవ నిర్వాహకులతోపాటు ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. గతంలోనే అరెస్టైయిన తహసిల్ధార్‌ , ఆర్‌ఐలను జైలుకు పంపించారు. ఈ కేసులో దోషులుగా 21మందిని గుర్తించినట్లు తెలుస్తోంది. అంటే ఒక ఎమ్మార్వో మూలంగా వాటాలు పంచుకుతిన్న ఇతర ఉద్యోగులు కూడా బలికావాల్సి వచ్చింది. ఒక్క కార్యాలయం సాక్షిగా 21 మంది దోచుకుతింటున్నారంటే, ఒక్కొ వ్యక్తి వద్ద ఈ ముఠా ఎంతెంత వసూలు చేసిందో అర్ధం చేసుకోవచ్చు. ఇలా వచ్చిన ప్రతి పైసాను వాటాలు వేసుకుంటున్నారంటే, ఏ రేంజ్‌లో అవినీతి చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. అసలు రైతుల నుంచి ఇలా లంచాలు తీసుకుంటూ జలగలై రక్తాలు పీల్చుకుతింటున్నారు. అటు లంచాలు తీసుకుంటున్నారు. ఇలా ఫహానీలును టాంపరింగ్‌ చేస్తూ అరాచాలు సాగిస్తున్నారు. నిత్యం ఎక్కడో అక్కడ ఎమ్మార్వోల బాగోతాలు బైటపడుతూనే వున్నాయి. రిజిస్ట్రేషన్ల విషయంలో ఎమ్మార్వోలు సాగిస్తున్న అక్రమాలపై ఇప్పటికే మంత్రి శ్రీనివాస్‌ రెడ్డి అనేక సార్లు హెచ్చరికలు జారీ చేస్తూనే వున్నారు. ఉపేక్షించే ప్రసక్తి లేదని తేల్చి చెబుతూనే వున్నారు. సమీక్షలు నిర్వహిస్తూ అక్రమార్కుల దుమ్ము దులుపుతూనే వున్నారు. ఇకనుంచి గతంలో లాగా క్షమించాడాలు వుండవని కూడా స్పష్టం చేస్తున్నప్పటికీ ఎమ్మార్వోల అరాచకాలు ఎక్కడా ఆగడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎమ్మార్వోలు రాబందులకెక్కువ..రాక్షసులకు తక్కువగా తయారౌతున్నారని సాక్ష్యాత్తు ప్రజలే నిందిస్తున్నారు. రైతులను, ప్రజలను జలగల్లా పీడిరచుకుతింటున్నారు. రైతు చనిపోతే వచ్చే పరిహారంలో కూడా చేతి వాటం చూపిస్తామనే దాకా దిగిజారి బతుకుతున్నారంటే అంతటి నికృష్టమైన బతుకు అవసరమా? సరే రైతు పరిహారంలో ఒక్క ఎమ్మార్వోకు చేతులు తడిపితే సరిపోతుందా?..ఆ కార్యాలయంలో ఎమ్మార్వో నుంచి కింది స్ధాయి వరకు పంచుకుంటూ పోతే తప్ప చెక్కు చేతికి రాదు. మానవత్వం పూర్తిగా మార్చిపోయారు. లంచాలు కూడా తమ హక్కు అనేకునే స్ధాయికి చేరుకుంటున్నారు. ప్రభుత్వాలు ఎంత బెదిరించినా అక్రమాలు ఆపరు. లంచాలు తీసుకోకుండా వుండరు. ఒకరి భూములు ఒకరికి అంటగట్టి పల్లెలో పంచాయితీలు పెంచుతున్నారు. రైతుల మధ్య పగలకు కారణమౌతున్నారు. రైతుల ఉసురు పోసుకుంటున్నారు. ఇస్తే పెట్టిన పిండాలను కూడా తింటామనే తరహాకు దిగజారిపోతున్నారు. ప్రభుత్వాల ఉదాసీనత చేతిగాని తనంగా తీసుకుంటున్నట్లున్నారు. ఓ వైపు తప్పులు చేస్తూనే దమ్ముంటే పట్టుకొమ్మను అని సవాలు విసురుతున్న ఎమ్మార్వోలు కూడా వున్నారంటే వారి అనైతిక ఎంత దూరం వెళ్తోందో అర్ధంచేసుకోవచ్చు.

కుంగ్ పూ,కరాటేలో రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్స్.

కుంగ్ పూ,కరాటేలో రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్స్

గుండాల ఎంపీపీస్ విద్యార్థులు

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ టోర్నమెంట్ లో భద్రాద్రి కొత్తగూడెం లో ఆదివారం జరిగిన కుంగ్ పూ, కరాటే పోటిల్లో గుండాల ఎంపీపిఎస్ స్కూల్ విధ్యార్థులు ఏడు గోల్డ్ మెడల్స్ సాధించారు. వారు ఎస్కె ముఖీన, గుండెబోయిన ఈషిత, ఈసం అరుణ శ్రీ,షైనిస్(స్టూడెంట్), అరేం హర్షవర్ధన్,చీమల మహివరున్, బియ్యాని మైతిలి, సిల్వర్ మెడల్స్,ఎస్కె ముదాజిర్, రాఘవి సాదించారు. ముఖ్య అతిధిగా గుండాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్, వాసవి క్లబ్ గుండాల అధక్షులు వనాల శ్రవణ్, శరత్, తవిడిశెట్టి నాగరాజు, రాంబాబు, ఎట్టి సుందర్ . ఎంపీపీ స్కూల్ ఎచ్ఏం బి. రమేష్, సహా ఉపాధ్యాయులు,పిల్లల తల్లి దండ్రులు, కరాటే మాస్టర్ మంకిడి సుధాకర్ మెడల్స్ సాదించిన విద్యార్థులకు మాస్టర్ కు తల్లి దండ్రులకు చాలువాలతో సన్మానించారు.

ఘనంగా ఎంహెచ్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం.

ఘనంగా ఎంహెచ్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం

ఎంహెచ్పీఎస్ అన్ని వర్గాల మేలుకొరకు పోరాటం చేస్తుంది

ఎంహెచ్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ

పరకాల నేటిధాత్రి:

MHPS

మాదిగల రిజర్వేషన్ ప్రకారం రానున్న అసెంబ్లీ మరియు పార్లమెంట్,స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కు అనుకూలంగా ప్రత్యేక సీట్లు కేటాయించాలని
మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఎంహెచ్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మైస ఉపేందర్ మాదిగ మాట్లాడుతూ మాదిగల హక్కులను సాధించే దిశగా కొన్ని దశాబ్దాల ఉద్యమ కాలంలో మాదిగ హక్కుల పరిరక్షణ సమితి క్రియాశీలకంగా పనిచేసిందని ఆవిర్భావం నుండి మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్నారు.గత ప్రభుత్వంలోని దళిత బంధం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ యొక్క పథకాన్ని అమలులో ఉంచాలని కోరారు.గత డిసెంబర్ నెలలో జరిగినటువంటి గ్రూపు-2 గ్రూప్-3 ఉద్యోగ నియామకాల్లో ఎస్సీల రిజర్వేషన్ అమలు చేసి మరోసారి మాదిగల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబడాలని ఎస్సీల వర్గీకరణ మాదిగ అమరవీరుల విజయమని,నామినేటెడ్ పదవులలో కూడా మాదిగలకు అవకాశం ఇవ్వాలని మైస ఉపేందర్ మాదిగ అన్నారు.ఈ కార్యక్రమము లో
మాదిగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు బొల్లికొండ వీరేందర్ గజ్జల మల్లేష్,పుల్ల రమేష్ ఎంహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షులు (వరంగల్ జిల్లా)వంతడుపుల అవినాష్ కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్,కందుకూరి ప్రభాకర్ఎంహెచ్పీఎస్ హనుమకొండ(జిల్లా ఇన్చార్జి), మందా ఆరోగ్యం,సిలుముల రాజు,బరిగల బాబు,ఒసేపాక రవి,మున్నా తదితరులు పాల్గొన్నారు.

కొమ్మాల జాతరలో ఏరులై పారుతున్న మద్యం.

కొమ్మాల జాతరలో ఏరులై పారుతున్న మద్యం.

పవిత్ర దేవాలయం వద్ద మద్యం అమ్మకాలకు ఎక్సైజ్ శాఖ అధికారుల అనుమతులు.?

అడుగడుగునా మద్యం బెల్టు దుకాణాలే జాతరలో దర్శనం.

దేవాలయం అధికారుల పర్మిషన్ లెటర్ ద్వారానే అనుమతులు ఇచ్చమంటూ వివరణ?

ఈ నెల 16 తో ముగిసిన మద్యం అమ్మకాల గడువు..

మద్యం బెల్టు షాపులకు అనుమతులు ఇవ్వలేదు..

దేవాలయ ఈ.ఓ నాగేశ్వర్ రావు..

బెల్టు షాపుల నిర్వహికులపై చర్యలు తీసుకుంటాం.

ఎక్సైజ్ శాఖ సీఐ తాతాజీ.

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

Liquor

పవిత్రమైన దేవాలయం వద్ద మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.భక్తి శ్రద్ధలతో కొమ్మాల జాతరకు వెళ్లిన భక్తులకు ముందుగా మద్యం దుకాణాలు,బెల్టుషాపులే దర్శనం ఇస్తాయి.ఈ నేపథ్యంలో కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతరలో ఎక్కడ చూసినా మద్యం ఏరులైపారే పరిస్థితి నెలకొన్నది.

వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొమ్మాల లక్ష్మినరసింహస్వామి జాతర గత ఐదు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నది.వివిధ రాజకీయ పార్టీలు,ఇతర ప్రభ బండ్లతో మొదలైన జాతర మంగళవారం ఐదవరోజు రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది.దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ ఆలయ ప్రాంగణంలో మద్యం దుకాణాలు,బెల్టు షాపుల జోరు కొనసాగుతూనే ఉన్నది.దైవ దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులు కొందరు ఉద్యోగులు,రైతులు రాత్రివేళలో వస్తున్నారు.ఐతే జాతరలో ఎక్కడ చూసినా బెల్టు షాపులు,అక్కడే మద్యం సేవించి మత్తులో తిరగటం వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అవేదన వ్యక్తం చేస్తున్నారు.ఐతే దేవాలయం వద్ద పోలీస్ కంట్రోల్ రూం వద్దనే బెల్టు షాపులు ఏర్పాట్లు చేసి విచ్చలవిడిగా అమ్మకాలు చేపట్టడం పలు అనుమానాలకు దారితీస్తున్నది.పవిత్రమైన దేవాలయం వద్ద జాతరలో ఫెస్టివల్ ఈవెంట్ అనుమతులు అంటూ ఎక్సైజ్ శాఖ అనుమతులు ఇవ్వడం ఒకెత్తు అయితే అక్కడ మద్యం దుకాణాలకు ఈవెంట్ కు దేవాలయం అధికారులు పర్మిషన్ లెటర్ ఇస్తారు.. వారు ఇస్తేనే మూడు రోజులకు పర్మిషన్ ఇచ్చాము అని గీసుకొండ పరిధిలో ఎక్సైజ్ శాఖ సీఐ తాతాజీ పేర్కొనడం కొసమెరుపు.
ఐనప్పటికీ తాత్కాలిక మద్యం దుకాణాలకు అనుమతులు ఇచ్చిన గడువు ఈ నెల 16 తో ముగిసినప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం అని భక్తులు వాపోతున్నారు.ఇప్పటికైనా పవిత్రమైన దేవాలయం వద్ద మద్యం అమ్మకాలు ఆపివేసి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజలు,భక్తులు కోరుతున్నారు.

బెల్టు షాపుల నిర్వహికులపై చర్యలు తీసుకుంటాం.

ఎక్సైజ్ శాఖ సీఐ తాతాజీ.

పవిత్రమైన శ్రీ కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతరలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై చర్యలు తీసుకొని వాటిని నిలుపదల చేస్తామని గీసుకొండ మండల పరిధి ఎక్సైజ్ శాఖ సీఐ తాతాజీ నేటిధాత్రికి వివరణ ఇచ్చారు.

మద్యం బెల్టు షాపులకు అనుమతులు ఇవ్వలేదు..

Liquor

దేవాలయ ఈ.ఓ నాగేశ్వర్ రావు..

కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతరకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని విధాల జాగ్రత్తగా తీసుకున్నామని దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాగేశ్వర్ రావు తెలిపారు. దేవాలయము పరిసర ప్రాంతాలకు 200 మీటర్ల లోపు మద్యం బెల్టు షాపులకు ఎలాంటి అనుమతులు లేవని ఈ.ఓ తెలిపారు. దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆటంకం కల్పిస్తున్న బెల్టు షాపులపై చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామని కొమ్మాల దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాగేశ్వర్ రావు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version