భూసేకరణ వేగవంతం చేయండి : కలెక్టర్ ప్రావీణ్య.

భూసేకరణ వేగవంతం చేయండి : కలెక్టర్ ప్రావీణ్య,

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్జ్ భూసేకరణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఝరాసంగం మండలం చిలేపల్లి, బర్దిపూర్, చిలేపల్లి తాండ, ఎల్గోయి నిమ్జ్ పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వం సేకరించిన భూములను పరిశీలించారు. నిమ్జ్ భూసేకరణ పరిధిలోకి వచ్చే వివరాల మ్యాపును ద్వారా పరిశీలించారు. ప్రభుత్వం సేకరించిన భూమి, మిగిలిన భూమి వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. భూసేకరణను వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించారు. నూతనంగా ఏర్పాటుచేసిన ఉగ్గేల్లి నుంచి బర్దిపూర్ శివారు వరకు వేసిన రోడ్డును పరిశీలించారు. వారి వెంట అదనపు కలెక్టర్ మాధురి, జహీరాబాద్ ఆర్డిఓ రామ్ రెడ్డి, తహసిల్దార్ తిరుమలరావు, సర్వేర్లు, నర్సింలు, లాల్ సింగ్, నిమ్ అధికారులు ఉన్నారు.

భూభారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కారించాలి.

భూభారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కారించాలి
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

నర్సంపేట/వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

భూ భారతి  రెవిన్యూ సదస్సులో ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా  కలెక్టర్ డాక్టర్ సత్య శారద తహసీల్దార్ లను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ లో మండల తహసీల్దార్ లతో భూ భారతి, రెవిన్యూ సదస్సు లో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధించిన అన్ని దరఖాస్తులను క్లియర్ చేయాలని అన్నారు.భూభారతి రెవిన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను కేటగిరీల వారీగా విభజిస్తూ సత్వరమే  వాటిని ఆన్లైన్లో  అప్లోడ్ చేయాలన్నారు. ఆగస్టు 15 నాటికి  అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చొరవ చూపాలన్నారు.

అన్ని మాడ్యుల్స్ లో దాఖలైన భూ భారతి దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా వెంటనే పరిష్కరించేందుకు చొరవ చూపాలి అన్నారు.దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ జరపాలన్నారు. అవసరమైన రికార్డులను కూడా క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. రెవిన్యూ పరంగా ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో  అదనపు కలెక్టర్ సంధ్యారాణి,డిఆర్ ఓ విజయలక్ష్మి,ఆర్డీవో లు సత్యపాల్ రెడ్డి, ఉమారాణి , కలెక్టరేట్ ఏఓ విశ్వ ప్రసాద్, తహసీల్దార్ లు పాల్గొన్నారు.

భూసేకరణ వేగవంతం చేయండి కలెక్టర్.

భూసేకరణ వేగవంతం చేయండి కలెక్టర్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జిల్లాలో రీజనల్ రింగ్ రోడ్డు, నిజ్జా భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. శంకర్ జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ రెండు పనులు పూర్తయితే జిల్లాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. నిమ్స్ కు 12, 500 ఎకరాలకి 7500 ఎకరాల భూ సేకరణ చేసి సేకరించిన భూమికి రక్షణ కంచె ఏర్పాటు చేయాలన్నారు.

నిమ్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలి.

నిమ్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలి : సంగారెడ్డి కలెక్టర్.

జహీరాబాద్. నేటి ధాత్రి:

జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిమ్జ్ ఏర్పాటు కోసం అవసరమైన భూసేకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో నిమ్జ్ ప్రత్యేక అధికారి రాజు, జహీరాబాద్ ఆర్డీవో, తహసీల్దార్ లతో కలెక్టర్ నిమ్జ్ భూసేకరణ పై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిమ్జ్ ఏర్పాటుతో మారుమూల ప్రాంతాలైన జహీరాబాద్ నియోజకవర్గాల రూపురేఖలు మారిపోతాయి అన్నారు. నిమ్జ్ ఏర్పాటుతో ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయన్నారు.ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం నిమ్జ్ ఏర్పాటుకు భూములు ఇచ్చిన వారికి నష్టపరిహారం అందించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ విషయంపై ఆయా గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించి భూసేకరణ ప్రక్రియ వేగవంతం అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు ఆయా మండలాల్లో గ్రామాల వారీగా చేసిన భూసేకరణ వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఎంత సేకరణ చేయాల్సి ఉంది అన్న వివరాలను కలెక్టర్ ఆయా మండలాల రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని గ్రామాల్లో ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ పనులు వేగవంతంగా చేసి నిమ్జ్ ప్రాజెక్టు సకాలంలో ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జహీరాబాద్ ఆర్డీవో రామ్ రెడ్డి, తహసీల్దార్లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version