నర్సంపేట మున్సిపాలిటీ పట్టణం లోని పదో వార్డులో గల పోచమ్మ కాలనీ కి చెందిన పోలబోయిన ఆగమ్మ ఆకస్మికంగా మృతి చెందడంతో స్థానిక వార్డు మాజి కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆగమ్మ భౌతిక గాయనికి పూలమాలవేసి నివాళులర్పించారు.కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5 వేలు అర్ధిక సహయం అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డులోని ముఖ్య నాయకులు ఎదురబోయిన రామస్వామి, మామిడాల బిక్షపతి, వలుస సత్యనారయణ,పస్తం ఎల్లాస్వామి,వలుస అదినారయణ,జక్క రవిందర్,పస్తం కృష్ణ, అరెపెల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
శాయంపేట మండలం సూర్య నాయక్ తండా గ్రామంలో రెండు రోజుల క్రితం గాలి దుమారం వల్ల గ్రామంలో మక్కా జొన్న పంట నేలకు వాలడంతో గ్రామంలో రైతులకు జరిగినటువంటి నష్టాన్ని తెలుసుకున్న తీన్మార్ జయ్ సమస్యను మండల వ్యవసాయ శాఖ అధికారు లకు వివరించి రైతులకు అధికారుల నుండి న్యాయం జరిగేలా కృషి చేశాడు తమ ఓటు వేసి గెలిపించుకున్న నాయకులు చేయవలసిన పని మంచి మనసుతో తమ గ్రామం లోని తీన్మార్ జయ్ రైతుల పక్షాన నిలవడం చాలా సంతోషంగా ఉందని రైతులు ప్రశంసించారు తండా గ్రామం లో 42 మందికి ఉచిత కంటి ఆపరేషన్ తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో చేయించి వారి మన్ననలను పొందాడు తన గ్రామంలో వారం అంగడి స్థాపించి చుట్టుపక్కల గ్రామా లకు కూడా తను ఒక ఆదర్శ వంతమైన వ్యక్తిగా నిలిచాడు అలాగే ఫ్లోరైడ్ నీటి వాటర్ ఉండకూడదని ఆ తండా గ్రామంలో ప్రతి ఒక్కరికి మినరల్ వాటర్ ఉచితంగా సరఫరా చేయాలనే ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ ను కొంతమంది దాతల సహాయంతో కలిసి నిర్మిస్తున్నాడు తన పుట్టిన ఊరు తన కన్న తల్లితో సమాన మని తన గ్రామ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచు కోవడం లేనే నాకు ఆనందంగా ఉంది అని ఎవరో వస్తారు ఏమో చేస్తారు అని ఎదురు చూడటం చేతగాని తనం అవు తుందని అన్నారు రానున్న స్థానిక సంస్థల్లో ఆ సూర్య నాయక్ తండా గ్రామంలో తాను తప్పకుండా పోటీలో నిలిచి తన గ్రామాన్ని ఆదర్శ గ్రామం గా తీర్చిదిద్దాలని తీన్మార్ జయ్ అన్నారు. గ్రామంలోని ప్రజలు తీన్మార్ జయ్ చేస్తున్న మంచి పను లకు ఎప్పుడు తనకు అండగా ఉంటామని ప్రజలు తెలిపారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభ జయప్రదం చేద్దాం ఎమ్మెల్యే మాణిక్ రావు
◆ఈనెల 27 న ఎల్కతుర్తి లో జరిగే సభను కలిసి కట్టుగా విజయవంతం చెయ్యాలి
◆కోహిర్ మండల పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు అన్నారు.
జహీరాబాద్. నేటి ధాత్రి:
మాజి మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు, శనివారము మండలంలోని ఎస్ఎస్ ఫంక్షన్ హాలులో మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతుందని అన్నారు. 10 లక్షల మంది తో జరిగే సభకు గ్రామ గ్రామం నుంచి పార్టీ కార్యకర్తలు బయలుదేరి రావాలని పిలుపునిచ్చారు.రజతోత్సవ సభ రాష్ట్రంలో గులాబీ పండగ వలె జరుపుకుంటున్నామని.. ఈ పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
MLA Manik Rao
కోహిర్ మండలం నుండి పెద్ద ఎత్తున కదలిరావాలని ఎమ్మెల్యే మాణిక్ రావు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ రామకృష్ణ రెడ్డి,కొహిర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు , జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,మాజి జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు మొహిద్దీన్ , ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మాజి కేతకీ ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్, సీనియర్ నాయకులు కలీం, కొహిర్ పట్టణ అధ్యక్షులు ఇఫ్టేకార్,యువ నాయకులు మిథున్ రాజ్,మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్ ,మాజి సర్పంచ్ లు నర్సింలు , మొలయ్య,రమేష్ ,మాజి ఎంపీటీసీ లు సంపత్,విఠల్ రెడ్డి ,నాయకులు నర్సింహ రెడ్డి,మాజి విజిలెన్స్ కమిషన్ మెంబర్ రామకృష్ణ బంటు,గ్రామ పార్టీ అధ్యక్షులు & కార్యవర్గం ,ముఖ్య నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన మండల మాజీ వైస్ ఎంపీపీ వంగాల నారాయణరెడ్డి
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలోని సాధనపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జంగా పద్మ సమ్మయ్య దంపతుల కుమార్తె నిత్యశ్రీ వివాహమునకు పాల్గొ ని నూతన వధూవరులను ఆశీర్వదించి ,శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ మాజీ చైర్మన్ దూదిపాల రాజిరెడ్డి, మైలారం ఎంపీటీసీ గడిపే విజయ కుమార్ శాయంపేట ఉప సర్పంచ్ సుమన్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, బత్తిని తిరుపతి, మండల నాయకులు పాల్గొన్నారు.
నల్ల రవికిరణ్ ను పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య
10 వేల రూపాయల ఆర్థిక సహాయం, 50 కేజీల బియ్యం అందజేత
“నేటిధాత్రి” హనుమకొండ:
జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) వరంగల్ జిల్లా అధ్యక్షులు నల్ల రవి కిరణ్ తండ్రి నల్ల రవీందర్ ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య పరామర్శించారు. స్వర్గీయ నల్ల రవీందర్ చిత్రపటానికి నివాళులు అర్పించి వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. నల్ల రవికిరణ్ ను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పదివేల రూపాయల ఆర్థిక సాయం 50 కేజీల బియ్యాన్ని వారి కుటుంబానికి అందజేశారు.
Assistance
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మాంచాలక్క, గ్రేటర్ వరంగల్ కమిటీ అధ్యక్షులు ఉచత శ్రీకాంత్, ఉపాధ్యక్షులు గూడూరు నరేందర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, అధికార ప్రతినిధి వేల్పుల మణెమ్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీనివాస్, రామ్మూర్తి, రాష్ట్ర సోషల్ మీడియా కో కన్వీనర్ కోడిపాక రవి, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి సన్నగుండ్ల వెంకటేశ్వర్లు, వరంగల్ జిల్లా ప్రచార కార్యదర్శి సురేందర్, నల్లబెల్లి మండల అధ్యక్షులు ఆవునూరి కిషోర్, జిల్లా అధికార ప్రతినిధి నర్మెట్ట యాదగిరి, కె. తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిమ్మాని “శేఖర్ రావు” పిలుపు.
“నేటిధాత్రి” వరంగల్.
ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఈనెల 14వ తేదీ సోమవారం నిర్వహిస్తున్న జ్ఞాన యాత్రలో జిల్లా ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు పిలుపునిచ్చారు. హన్మకొండ ప్రెస్ క్లబ్ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… అంబేద్కర్ అందరి వ్యక్తి, అందరి శక్తి అని కొందరికే పరిమితం చేయడం సరికాదన్నారు. అలాగే, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు ఆధ్వర్యంలో ప్రతి ఏటా జరుపుతున్నట్లుగానే అన్నివర్గాల వారిని భాగస్వామ్యం చేస్తూ ఈ ఏడాది కూడా విజ్ఞాన యాత్రను నిర్వహిస్తున్నామన్నారు.
పది విభిన్న మతాలు, 25 వేల కులాలున్న మన భారత దేశంలో కాలమాన పరిస్థితులకు, ప్రజల సామాజిక, ఆర్ధిక, రాజకీయ అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకునే గొప్పగా రూపొందించారని వారు కొనియాడారు.
Congress
భారత రాజ్యంగ విలువలను వివరిస్తూ వరంగల్ ఎంజీఎం సెంటర్ నుంచి హన్మకొండ అంబేద్కర్ విగ్రహం సాగే ఈ యాత్రలో దళిత, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, కార్మికులు, ఉద్యోగులు, మహిళలు, యువతతోపాటు అన్నివర్గాల ప్రజలు పాల్గొని అంబేద్కర్ మహాశయునికి నివాళులర్పించాలని డీసీసీ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు కోరారు.
సమావేశంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మారుపాక ఎల్లయ్య, రైల్వే జేఏసీ అధ్యక్షులు కోండ్ర నర్సింహరావు, మాల మహానాడు జాతీయ నాయకుడు మన్నె బాబురావు, డీబీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు అంకేశ్వరపు రాంచందర్, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కడారి కుమార్, జాతీయ మాల మహానాడు గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు పనికల శ్రీనివాస్, విగ్రహాల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు బండి అశోక్, 50వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంకా హరిబాబు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రుద్రోజు మణీంద్రనాథ్, మాల మహానాడు నాయకులు కాళేశ్వరపు రామన్న తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిమ్మాని “శేఖర్ రావు” పిలుపు.
“నేటిధాత్రి” వరంగల్.
ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఈనెల 14వ తేదీ సోమవారం నిర్వహిస్తున్న జ్ఞాన యాత్రలో జిల్లా ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు పిలుపునిచ్చారు. హన్మకొండ ప్రెస్ క్లబ్ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… అంబేద్కర్ అందరి వ్యక్తి, అందరి శక్తి అని కొందరికే పరిమితం చేయడం సరికాదన్నారు. అలాగే, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు ఆధ్వర్యంలో ప్రతి ఏటా జరుపుతున్నట్లుగానే అన్నివర్గాల వారిని భాగస్వామ్యం చేస్తూ ఈ ఏడాది కూడా విజ్ఞాన యాత్రను నిర్వహిస్తున్నామన్నారు.
పది విభిన్న మతాలు, 25 వేల కులాలున్న మన భారత దేశంలో కాలమాన పరిస్థితులకు, ప్రజల సామాజిక, ఆర్ధిక, రాజకీయ అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకునే గొప్పగా రూపొందించారని వారు కొనియాడారు.
భారత రాజ్యంగ విలువలను వివరిస్తూ వరంగల్ ఎంజీఎం సెంటర్ నుంచి హన్మకొండ అంబేద్కర్ విగ్రహం సాగే ఈ యాత్రలో దళిత, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, కార్మికులు, ఉద్యోగులు, మహిళలు, యువతతోపాటు అన్నివర్గాల ప్రజలు పాల్గొని అంబేద్కర్ మహాశయునికి నివాళులర్పించాలని డీసీసీ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు కోరారు.
సమావేశంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మారుపాక ఎల్లయ్య, రైల్వే జేఏసీ అధ్యక్షులు కోండ్ర నర్సింహరావు, మాల మహానాడు జాతీయ నాయకుడు మన్నె బాబురావు, డీబీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు అంకేశ్వరపు రాంచందర్, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కడారి కుమార్, జాతీయ మాల మహానాడు గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు పనికల శ్రీనివాస్, విగ్రహాల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు బండి అశోక్, 50వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంకా హరిబాబు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రుద్రోజు మణీంద్రనాథ్, మాల మహానాడు నాయకులు కాళేశ్వరపు రామన్న తదితరులు పాల్గొన్నారు.
రైల్వే బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ప్రజలు తరలిరావాలి…
పట్టణ కాంగ్రెస్ నాయకులు
రామకృష్ణాపూర్, నేటిధాత్రి
రామకృష్ణాపూర్ పట్టణం నుండి మంచిర్యాలకు వెళ్లేందుకు నిత్యం రైల్వే గేట్ సమస్యతో సతమతం అవుతున్న వాహనదారుల కష్టాలు తీరనున్నాయి. క్యాతనపల్లి వద్ద రైల్వేగేటుపై నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. ఈ నెల 15 మంగళవారం రోజున పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి లు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభిస్తారని టిపిసిసి సెక్రటరీ రఘునాథరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు పల్లె రాజు , సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య లు తెలిపారు. అనంతరం వారు మాట్లాడారు.
Inauguration
ఈ రహదారి ద్వారా ప్రతిరోజూ వేలాది వాహనాలు రైల్వే ట్రాక్ దాటి వెళ్లేవని ఆ సమయంలో గేటువేయడంతో ఇరువైపులా వందలాది వాహనాలు నిలిచిపోయి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారని అన్నారు. రైలు వెళ్లిన అనంతరం వాహనాలు గేటు దాటడానికి అర గంటకుపైగా సమయం పట్టేదని, ఇదే సమయంలో రైళ్ల సంఖ్య కూడా పెరగడంతో తరచూ గేటువద్ద వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉండేవన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో బ్రిడ్జి ప్రారంభోత్సవం ఆలస్యం అయిందని, బ్రిడ్జికి పునాది వేసిన వివేక్ వెంకటస్వామి నే ప్రారంభిస్తుండడం సంతోషంగా ఉందని అన్నారు. బ్రిడ్జి ప్రారంభంతో ప్రజల కష్టాలు తీరనున్నాయని, రామకృష్ణాపూర్ పరిసర ప్రాంత ప్రజలు ఈనెల 15న బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. బ్రిడ్జి ప్రారంభోత్సవ ప్రదేశాన్ని మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి, పట్టణ ఎస్ఐ రాజశేఖర్ పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పనాస రాజు, కాంగ్రెస్ నాయకులు నీలం శ్రీనివాస్ గౌడ్ లు పాల్గొన్నారు.
అల్లిపూర్ లో మహిళా శిశు సంక్షేమశాఖ అధర్యంలో చిరుధన్యాలు, స్థానిక ఆహార పదార్థాల పైన అవగాహన కార్యక్రమం
రాయికల్ నేటి ధాత్రి. . .
ఏప్రిల్ 12. జగిత్యాల ప్రాజెక్టు పరిధిలోని రాయికల్ మండలం, అల్లీపూర్ గ్రామంలో మహిళా శిశు సంక్షేమశాఖ జగిత్యాల ప్రాజెక్టు సిడిపిఓ మమత అధర్యంలో చిరుదాన్యాలు (కొర్రలు,రాగులు,ఉదలు,అరికెలు,సామలు,సజ్జలు,జొన్నలు,అండ్రుకొర్రలు, మొదలైనవి) స్థానిక ఆహార పదార్థాల పైన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
Food
పోషణ పక్షంలో భాగంగా ఈరోజు స్థానిక ఆహార పదార్థాలు, చిరుధన్యాలను ఉపయోగించి అనుబంధ ఆహార వంటకాలను తయారు చేయడం పై ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటు చెయ్యాలని షెడ్యూల్ రావడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సిడిపిఓ మమత గారు మాట్లాడుతూ స్థానికంగా దొరికే ఆహార పదార్థాలు, చిరుధన్యాలను ప్రత్యక్షంగా చూపించి వాటితో ఏ ఏ అనుబంధ ఆహార వంటకాలను తయారు చేయవచ్చునో ప్రత్యక్షంగా తయారు చేసి చూపించడం జరిగింది మరియు మనం ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వలన కలిగే లాభాలను లబ్ధిదారులకు, గ్రామస్థులకు ఒక్కొక్క దాని గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జగిత్యాల ప్రాజెక్టు సిడిపిఓ మమత, సెక్టార్ సూపర్వైజర్ రాధ, మెడికల్ ఆఫీసర్, జెండర్ స్పెషలిస్ట్ గౌతమి, సఖి కేంద్రం రజిత, అంగన్వాడీ టీచర్లు, గర్భిణిలు, బాలింతలు, పిల్లలు, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.
ఇంటర్నేషనల్ డ్రాయింగ్ ఒలంపియాడ్ స్టేట్ లో గోల్డ్ మోడల్ సాధించిన గీతాన్విత..
రామాయంపేట ఏప్రిల్ 12 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట పట్టణానికి చెందిన చింతల ఉష శ్రీనివాస్ దంపతుల కూతురు గీతాన్విత రామాయంపేట పట్టణంలోని వివేకనంద విద్యాలయం లో 5వ తరగతి చదువుతున్నది.
Student
ఇంటర్నేషనల్ డ్రాయింగ్ ఒలంపియాడ్ పోటీలు నిర్వహించారు. రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించడం జరిగింది. ఉత్తమ ఫలితాలు సాధించి రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించినందుకు గోల్డ్ మెడల్ అందజేయడం జరిగింది.
Student
రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించిన విద్యార్థిని గీతాన్వితను పాఠశాల ఉపాధ్యాయ బృందం, పట్టణవాసులు అభినందించారు.
పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భారతయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభలను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాణ్ అన్నారు.ఈనెల 25,26,27 నా మూడు రోజులపాటు జరగనున్నాయని తెలిపారు.ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలి అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ గురుకుల హాస్టల్లకు సొంత భవనాలు నిర్మించాలని అదేవిధంగా ఖాళీగా ఉన్న టీచర్ లెక్చరర్ ఔట్సోర్సింగ్ పర్మనెంట్ పోస్టులను భర్తీ చేయాలి మూడు రోజులపాటు విద్యారంగ సమస్యలపై చర్చ జరనుంది విద్యార్థులు ఈ మహాసభను అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్,పరకాల పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్,బన్నీ,అజయ్ కుమార్,ప్రణయ్,విజయ్,బంటి పాల్గొన్నారు.
భద్రాద్రి శ్రీ సీతారాములు కళ్యాణ తలంబ్రాలు ముందస్తుగా బుకింగ్ చేసుకున్న డిపో ఉద్యోగులు, సీతా రాముల భక్తులకు నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ శనివారం ఆర్టీసి డిపో వద్ద తలంబ్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిఎం మాట్లాడుతూ సీతా రాముల కళ్యాణం ప్రత్యక్షంగా చూడలేకపోయినా భక్తులకు తలంబ్రాలు, ముత్యాలు, బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించిన ఆర్టీసీ ఎం.డి సజ్జనార్ , దేవాదాయశాఖ ధన్యవాదములు తెలిపారు. పవిత్ర శుభాకార్యలకు ఈ తలంబ్రాలు అక్షింతలుగా ఉపయోగ పడతాయని పేర్కొన్నారు. బుకింగ్ ఏజెంట్లుగా చేసిన డిపో ఉద్యోగులు కార్గో మార్కెటింగ్ ఎగ్సిగీటివ్ నరేందర్,రవీందర్, రాంబాబు, పుష్పలీల, ఎడిసి నారాయణలను అభినందించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ ప్రభాకర్జ్ ఆఫీస్ స్టాఫ్ వెంకటరెడ్డి శ్రీను,కిషోర్, ఎస్డిఐ వెంకటేశ్వర్లు, బాబు, డిపో ఉద్యోగులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆర్యవైశ్య వైకుంఠ రథానికి ఉచితంగా బ్యాటరీ ఇచ్చిన దాత
నేటిదాత్రి దినపత్రికలో వచ్చిన వార్తకు స్పందిన
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా చిట్యాల రోడ్ లో ఆర్యవైశ్య వైకుంఠ రథానికి బ్యాటరీ లేనందువల్ల వైకుంఠ రథం ఉపయోగంలోకి రావడం లేదని దహన కమిటీ మాజీ చైర్మన్ పాలాది శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు .ఈ సందర్భంగా పాలాది శ్రీనివాసులు తన సొంత ఖర్చు లతో శనివారం నాడు వైకుంఠ రథానికి బ్యాటరీ కొనుగోలు చేసి డ్రైవర్ కు అప్పగించారు ఈకార్యక్రమంలో పెంట్లవెల్లి విశ్వనాథం డ్రైవర్ వెంకటేష్ పాల్గొన్నారు ఈమేరకు పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ విలేకరులు వేముల రాజి శెట్టి బొమ్మ వెంకటస్వామి అ వొ ప .పట్టణ అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు పొలిశెట్టి మురళి లారీ చే బా ర నరసింహ చవ్వ పండరయ్య తాడిపర్తి వెంకటస్వామి వేముల శంకరయ్యశెట్టి వేముల వెంకటస్వామి వేముల రాజు ఒక ప్రకటన లో హర్షం వ్యక్తం చేశారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఇటుకూరు బుచ్చయ్య శెట్టి పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజ్ శెట్టిఆర్యవైశ్య వైకుంఠ రథం బ్యాటరీ కొనుగోలు చేసి ఇచ్చినందుకు ఒక ప్రకటనలో పోలాది శ్రీనివాసులు కు హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర ఆర్యవైశ్య నేతలు ఆర్యవైశ్య అనుబంధ సంఘాలు వనపర్తి ఆర్యవైశ్య సంఘానికి చెందిన వైకుంఠ రథం పట్టణ ఆర్యవైశ్యులకు ప్రజలకు ఉపయోగపడే విధంగా చిట్యాల రోడ్డులో ఉన్న వైకుంఠ రథం బయటకి తీసుకురావాలని ఆర్యవైశ్యులు వేడుకుంటున్నారు
• టెన్త్ విద్యార్థుల ఇళ్ల చుట్టూ పీఆర్వోల ప్రదక్షిణ
• ఫీజులో ప్రత్యేక రాయితీలంటూ వల
జహీరాబాద్. నేటి ధాత్రి:
ఈ ఏడాదికి సంబంధించి పదో తరగతి పరీక్షలు ఈ నెల 21 నుండి ప్రారంభమైనాయి, కానీ ఈ విద్యార్థుల వచ్చే ఏడాది ఇంటర్ అడ్మిష న్లపై మాత్రం కాలేజీల యాజమాన్యాలు అప్పుడే వేట మొదలెట్టాయి. ఇది ఏ స్థాయిలో ఉందంటే కార్పొరేట్ కాలేజీల పీఆర్వోలు విద్యా ర్థుల తల్లిదండ్రులకు నిత్యం ఫోన్లు చేయడం, వీలైతే ఇళ్ల వద్దకే వెళ్లి కలవడం వరకు వచ్చింది. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని కళాశాలలో ఇదే పరిస్థితి ఉంది. ముక్యంగా జిల్లా కేంద్రమైన సంగారెడ్డి, పటాన్చెరు, రామచంద్రాపురం, జహీరాబాద్, నారాయణఖేడ్ పట్టణాలలో ఈ తతంగం నడుస్తున్నట్లు తెలుస్తుంది.
కార్పొరేట్ కాలేజీల పాఠశాలలు ఇష్టారాజ్యం
‘సార్, మేము ఫలానా కాలేజీ నుంచి మాట్లాడుతున్నాం… మీ పిల్లాడిని మా కాలేజీలో చేర్పించండి. ఫీజులో రాయితీలు ఇస్తాం… పదవ తరగతి పరీక్షల్లో మంచి గ్రేడ్ పాయింట్లు వస్తే ఫీజు మరింత తగ్గిస్తాం’.. అంటూ కార్పొరేట్ కాలేజీల నుంచి ఫోన్లు ప్రారంభమయ్యాయి. కర్నూలు వెంకటరమణ కాలనీకి చెందిన ప్రభుత్వ స్కూల్ టీచర్ కూతురు ఓ ప్రముఖ విద్యా సంస్థలో 10వ తరగతి చదువుతోంది. కార్పొరేట్ కాలేజీల పీఆర్ ఓల నుంచి తనకు రోజుకు మూడు, నాలుగు ఫోన్కాల్స్ వస్తున్నట్లు ఆయన తెలిపారు. పదో తరగతి విద్యా ర్థుల తల్లిదండ్రులంద రిదీ ఇదే పరిస్థితి. ఆడ్మి షన్ ఇంటి దగ్గర చేయిస్తామంటే దగ్గరకే వస్తామని మరీ చెబు తున్నారు. వచ్చే ఏడాది జూన్ లొ మొదలయ్యే ఇంట ర్మీడియట్ అడ్మిష న్లకు ఇప్పటి నుంచే ఇలా ఒత్తిడి పెడుతుండ డంపై విద్యార్థుల తల్లి దండ్రులు విస్తుపోతున్నారు. ఇంటర్ విద్యపై అధికారుల పర్యవేక్షణ కొరవడడం,కార్పొరేట్ కాలేజీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండ డమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ప్రతిభావంతులపైనే దృష్టి
వివిధ యాజమాన్యాల పరిధిలోని ఉన్నత పాఠశాలల విద్యార్థుల్లో ప్రతిభావంతులుగా ఉన్న విద్యార్థులను గుర్తించి వారిపైనే కార్పొరేట్ కాలేజీల ప్రతినిధులు దృష్టి సారిస్తున్నారు. పాఠశాల స్థాయి పరీక్షల్లో వచ్చిన మార్కులతోపాటు క్లాస్ టీచర్ తో మాట్లాడి విద్యార్థు లను ఎంపిక చేసుకుని వారి వివరాలు సేకరిస్తున్నారు. ఆ తరు వాత నుంచి విద్యార్థుల తల్లిదండ్రు లకు ఫోన్లు చేయడం, నేరుగా కలిసి అడ్మిషన్లు చేయిం చుకోవాలని కోరడం చేస్తున్నారు..
Congress
ఫీజు రాయితీ పేరుతో వల
కార్పొరేట్ విద్యా సంస్థలైతే ఆయా ప్రభుత్వ, ప్రేవేటు పాఠశాలల ఉపాధ్యాయులతో టచ్ లొ ఉంది పేరెంట్స్ మీటింగ్ లొ పాల్గొని తమ పిల్లలను తమ కాలేజ్ లో చేర్పించాలని వల వేస్తున్నారు. ‘ఇంటర్ కు మీ పిల్లలను మా కాలేజీలోనే చేర్పించండి. ముందుగానే అడ్మిషన్ తీసుకుంటే ఫీజులో రాయితీ ఇస్తాం’ అని చెబుతున్నారు. మరికొందరైతే ‘మా కాలేజీలో హాస్టల్ వసతితో కలిపి ఫీజు రూ.85 వేల నుంచి రూ.1.25 లక్షలు. డేస్కాలర్ అయితే రూ.60వేల నుంచి రూ.90 వేలు ఉంది. ఇదే ఫీజుతో నీట్ కోచింగ్ కూడా ఇస్తాం. అడ్మిషన్ కావాలంటే రూ.10 వేలు చెల్లించి సీటు రిజర్వు చేసుకోండి’ అని ఒత్తిడి తెస్తున్నారు. గత నెల నుంచి కాలేజీల పీఆర్ ఓలు స్కూళ్లు, ఇళ్ల చుట్టు తిరుగుతున్నారు. అడ్మిషన్లు చేయించకుంటే మీ స్థానంలో మరొకరు వస్తారంటూ పీఆర్వోలను కాలేజీ యాజమాన్యాలు పరోక్షంగా బెదిరిస్తున్నట్లు ఓ ప్రముఖ కార్పొరేట్ కాలేజీ పీఆర్ పేర్కొన్నారు.
అడ్మిషన్లు తెస్తేనే ఉద్యోగం
ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ప్రతి సంవత్సరం ప్రవేశాల కోసం బోదన, బోధనేతర సిబ్బందికి అప్పగిస్తున్నారు. ప్రతి ఆపాధ్యాయుడికి కొంత మంది పిల్ల లను పాఠశాలలో చేర్చే బాధ్యతను యాజమాన్యాలు అప్పగిస్తున్నాయి. కేటాయించిన లక్ష్యాలను అధిగమిస్తేనే వచ్చే విద్య సంవత్సరంలో కొలువుల్లో ఉంచారని, లేదంటే ఉద్యోగాలు ఊడుతాయని యాజమాన్యాలు హుకుం జారీ చేస్తున్నారు. ఉద్యోగాలను కాపాడుకోవడానికి ఉపాధ్యా యులు సిబ్బంది పట్టణ, పల్లెల వీధుల్లో ఇంటింటికి వెళ్లి వివరాలను సేకరిస్తూ తమ పిల్లలను పలానా విద్యాసం స్థల్లో చేర్చాలని ప్రాధేయపడుతున్నారు. మరి కొంత మంచి ఉద్యోగులు మరొక అడుగు ముందుకు చేసి. విద్యా సంస్థల్లో ఉన్నవి, లేనివి కల్పితాలు సృష్టించి విద్యాసం స్థల్లో చేర్చే పనిలో నిమగ్నమయ్యారు. ఫీజులో రాయితీ ఇప్పిస్తామని, లేదా ఉచితంగా ట్రాన్స్ పోర్ట్ ఏర్పాటు చేస్తామని పిల్లలను తల్లిదండ్రులను బుట్ట లో వేసుకుంటునానరు. ముక్కుసూటి వ్యక్తిత్వం గల వారు యాజమాన్యాలు పెట్టి పరతులకు లోబడి పనిచేయలేక ఉద్యోగం మానేస్తున్నారని తెలుస్తోంది.
జహీరాబాద్ మండలం హోతి(కె) బాలికల గురుకులంలో ఏడుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. నైట్ స్టడీ తర్వాత విద్యార్థినులు తీవ్రమైన దగ్గు, ఆయాసంతో అస్వస్థతకు గురవడంతో వారిని హాస్టల్ సిబ్బంది జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి వారు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
జై బాపు. జై భీమ్. జై సంవిధాన్ . భాగంగా. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ. కాలనీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. జై బాపూ. జై భీమ్. జై సంవిధాన్. కార్యక్రమాన్ని నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్పులు తెచ్చే విధంగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నుతుందు అని. కులాల మతాల మధ్య విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకోవడానికి బిజెపి విధానమని. కేంద్రం కుట్రలను ప్రజలకు వివరించేందుకు రాహుల్ గాంధీ గ్రామ గ్రామాన పాదయాత్ర చేపట్టారని రాజ్యాంగాన్ని మార్చాలన్న బిజెపి కుట్రలను రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్రలో దేశంలో ప్రజలందరికీ వివరించారని గత బి ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని కాదని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ రేవంత్ రెడ్డి జనరంజక పాలన అందిస్తున్నారని 50 వేల ఉద్యోగులను భర్తీ చేయడమే కాకుండా నిరుద్యోగ యువకులకు రాజీవ్ వికాస్ పథకం ద్వారా స్వయం ఉపాధి చూసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని గత ప్రభుత్వం రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన ఈ ప్రభుత్వం.అభివృద్ధి ఎక్కడ ఆపలేదని ఒక్కొక్క హామీలు నెరవేస్తూ. ప్రజాపాలన సాగుతుందని మత కుల ద్వేషాలు రెచ్చగొట్టాలని బిజెపి కుట్రలను తిప్పి కొట్టడానికి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జూడో యాత్ర కొనసాగించాలని బిజెపి కుట్రలను రాహుల్ గాంధీ ప్రజలకు తెలియజేశారని రాహుల్ గాంధీ యాత్రలో బిజెపి పార్టీ 200 సీట్లకే పరిమితమైందని సన్న బియ్యం పథకంతో మీ కంచంలో అన్నమై వచ్చిండు అని దానికి కారణం ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ.రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వతంత్రాన్ని పోరాటాల ద్వారా సాధించిందని ప్రభుత్వ పాలకులు గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ భూములను దోచుకుని తిన్నారు అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పిన అవినీతి అక్రమార్కులు కేసీఆర్ కుటుంబం నెంబర్ వన్ అందుకే సీటు దించి ప్రజలు చీ వా ట్లుపెట్టారని గత ప్రభుత్వంలో ఈ ప్రాంతం ఎంత దోపిడీ గురైందో అందరికీ తెలుసు అని ప్రజా జం జకా పరిపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డికి అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు రాష్ట్ర ప్రజలు అందరూ ఈ ప్రభుత్వానికిఅండగా ఉండాలని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
హనుమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మండల బిజెపి అధ్యక్షులు…
తంగళ్ళపల్లి నేటి దాత్రి…
తంగళ్ళపల్లి మండలం పాపాయిపల్లి గ్రామంలో హనుమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మండల బిజెపి అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జరిగే హనుమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని అలాగే ఆంజనేయ స్వాములు మాల ధారణ చేసి 41 రోజు గానీ. 21 రోజు గానీ. 11 రోజులు గాని. మాల దారణ చేసి పిల్ల పాపలకు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ భక్తిశ్రద్ధలతో హనుమాన్ మాలధారణ పూర్తి చేసుకోవడం జరుగుతుందని ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని వారు పిల్లాపాపలతో ఆయు ఆరోగ్యాలతో సుఖసంతోత్సంగా కలకాలం చల్లగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఏ రెడ్డి వెంకట్ రెడ్డి ఉప సర్పంచ్ చెన్నమనేని పరశురాములు ఏ రెడ్డి రాజు రెడ్డి కొ స్ని. శ్రీనివాస్ వర్కులు అంజయ్య వర్కుడు చంద్రయ్య బొజ్జ రాజేంద్రప్రసాద్ వివేక్ గ్రామ యువకులు మహిళలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు
రామాయంపేట పట్టణానికి చెందిన చింతల ఉష శ్రీనివాస్ దంపతుల కూతురు గీతాన్విత రామాయంపేట పట్టణంలోని వివేకనంద విద్యాలయం లో 5వ తరగతి చదువుతున్నది.
Eaxms
ఐదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించడం జరిగింది. ఉత్తమ ఫలితాలు సాధించి రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించినందుకు గోల్డ్ మెడల్ ప్రభుత్వం అందజేయడం జరిగింది.
Eaxms
రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించిన విద్యార్థిని గీతాన్వితను పాఠశాల ఉపాధ్యాయ బృందం, పట్టణవాసులు అభినందించారు.
తిమ్మాపూర్ ఎలికేశ్వరం తోపాటు మహాదేవపూర్ పుసుక్పల్లి, క్వారీల్లో అక్రమ వసూళ్లు ఝాట్కా బకెట్ వ్యవహారం నేటి ధాత్రి వరుస కథనాలు ప్రచురించడం జరిగింది. ఇసుక క్వారీల అక్రమాలు దౌర్జన్యాలను తిర పైకి తీసుకువస్తూ నేడు “నేటి ధాత్రిలో”‘ పైసా వసూల్” కథనాన్ని ప్రచురించడం జరిగింది. నేటి ధాత్రి వరుస కథనాల పై స్పందించిన అధికారులు, మైనింగ్ శాఖ ఏడి, విజిలెన్స్ అధికారులు, క్వారీ వద్ద చేరుకొని విచారణ కొనసాగించడం జరుగుతుంది. టిఎస్ఎండిసి జనరల్ మేనేజర్ కూడా అక్రమ వ్యవహారం కొనసాగిస్తున్న ఇసుక క్వారీల తనిఖీలకు రాలినట్లు తెలుస్తుంది.
హన్మకొండ జిల్లా బార్ అసోసియేషన్ ఎలక్షన్ లో హోరాహోరీ పోటీ:-
స్వల్ప మెజారిటీతో గట్టెక్కేనా పులి సత్యనారాయణ:-
హన్మకొండ, నేటిధాత్రి (లీగల్):-
హన్మకొండ జిల్లా బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ శుక్రవారం రోజున రసవత్తరంగా ముగిసాయి. అధ్యక్షునిగా తన గెలుపు నల్లేరు మీద నడకే అని భావించిన పులి సత్యనారాయణను తన ప్రత్యర్థి మొలుగూరి రంజిత్ ముప్పుతిప్పలు పెట్టాడు, కేవలం 26 ఓట్ల మెజారిటీ తో పులి సత్యనారాయణ హన్మకొండ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా గెలుపొందారు.
Elections
హన్మకొండ బార్ అసోసియేషన్ లో 867 ఓట్లకు గాను 752 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు, ఇందులో పులి సత్యనారాయణకు 336 ఓట్లు రాగా తన సమీప అభ్యర్తి మొలుగూరి రంజిత్ కు 310 ఓట్లు వచ్చాయి. అలాగే ప్రధాన కార్యదర్శి గా కొత్త రవి ఎన్నికయ్యారు. ఇతను తన సమీప అభ్యర్థి అయిన వి. నరేందర్ పై 109 ఓట్ల మెజారీతో గెలుపొందారు. అలాగే ఉపాధ్యక్షులుగా చిర్ర రమేష్ బాబు గెలుపొందారు. సంయుక్త కార్యదర్శిగా అంబేద్కర్, లైబ్రరీ సెక్రటరీ గా వెంకటేష్, స్పోర్ట్స్ సెక్రటరీ గా మల్లేష్, ట్రెస్సరర్ గా సాంబశివ రావు, 30 సంవత్సరాల ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా రాజేశ్వర్, 20 సంవత్సరాల ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ అశీర్వాదం, మరియు మహిళా సంయుక్త కార్యదర్శిగా నాగేంద్ర, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ గా శివకుమార్, సునీల్ కుమార్, కమలాకర్, నిఖిల్, మరియు మహిళా ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ గా వేద, స్వాతి గెలుపొందారు. కొత్తగా ఎన్నికైన వారికి పలువురు న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు.
వరంగల్ ————– అలాగే వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా వలస సుదీర్ మరియు ప్రధాన కార్యదర్శిగా డి.రమాకాంత్ ఎన్నికైనారు, వీరిని వరంగల్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఘనంగా సత్కరించి తమ శుభాకాంక్షలు తెలిపారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.