గోదావరి లోయ ప్రతిఘటన వీర యోధుడు లింగన్న…

గోదావరి లోయ ప్రతిఘటన వీర యోధుడు లింగన్న…

విప్లవొద్యమంలో నిబద్దత కలిగిన విప్లవ కమ్యూనిస్ట్ కార్యకర్త లింగన్న…

వేములపల్లి వెంకట్రామయ్య,సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు…

నేటి ధాత్రి -బయ్యారం :-

విప్లవోద్యమంలో నిబద్ధత కలిగిన విప్లవ కమ్యూనిస్టు కార్యకర్తగా లింగన్న పని చేశాడని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య అన్నారు.మండల కేంద్రంలోని స్థానిక గడ్డం వెంకట్రామయ్య విజ్ఞాన కేంద్రంలో పార్టీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య అధ్యక్షతన లింగన్న 6వ వర్ధంతి సభ నిర్వహించారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ,లింగన్న తన 20వ సంవత్సరంలోనే పార్టీలో చేరి,కొంత కాలం తరువాత పూర్తి కాలం కార్యకర్తగా పని చేసాడని,కొద్ది రోజుల్లోనే ప్రతిఘటనా దళాల్లో చేరాడని,తన క్రమశిక్షణ, దృఢదీక్షతో దళ కమాండర్ బాధ్యత నిర్వహించాడని కీర్తించారు.క్రమ క్రమంగా ఎదిగి రాష్ట్ర నాయకుడిగా అభివృద్ధి అయ్యి,పార్టీలో సిద్ధాంత పరంగా తన అధ్యయనాన్ని అభివృద్ధి చేసుకున్నాడని అన్నారు.రాజకీయాలలో నిలకడగా సుదీర్ఘ కాలం ప్రయాణించి, క్రమ శిక్షణకి మారు పేరుగా మారాడన్నారు. పార్టీ విధానాలను ఉక్క క్రమశిక్షణ గల సైనికునిగా అమలు చేశాడు.

మట్టిలో మాణిక్యం లింగన్న.ఆదివాసీల సమస్యలపై ముఖ్యంగా పోడు భూములు ప్రజలకే దక్కాలని అవిరామరంగా పోరాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న అడవి చట్టాల అపహరణకి వ్యతిరేకంగా పోడు రైతులను ఏకం చేసి,వాటి రక్షణ కోసం బలమైన ఉద్యమాన్ని నిర్మించడానికి అహర్నిశలు కృషి సల్పాడని,అందుకే లింగన్న భూమిలో విత్తనంలా ప్రజల గుండెల్లో హత్తుకుపోయాడని తెలిపారు. రోళ్లగడ్డ లోని పండగట్టలో లింగన్న దళంపై కాల్పులు చేయగా లింగన్న కాలికి తూటా తగిలి తప్పించుకోలేక పోయాడని, క్షతగాత్రుడయిన లింగన్న ను పట్టుకొని కాల్చి చంపి ఎన్కౌంటర్ అని బూటకపు మాటలు చెప్పారని విమర్శించారు.అధికారం మార్పిడి జరిగి 70 సంవత్సరాలు గడిచినా ప్రజల కనీస అవసరాలు తీర్చలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో పాలకవర్గాల తీరువుంది. నేటి బీజేపీ ప్రభుత్వం విదేశీ పెట్టుబడిదారులకు, భూస్వాములకి, కోటీశ్వరులకి ఊడిగం చేస్తుందని వారు దుయ్యబట్టారు.ప్రజల హక్కులను కాలరాస్తున్న క్రమంలో, ప్రశ్నించిన వారిని నిర్బంధిస్తు, ప్రజల ప్రాథమిక హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా హరిస్తున్నాయని, వాటికి వ్యతిరేకంగా పోరాడడమే ప్రతిఘటనా పోరాట యోధుడు లింగన్న కి ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.ఈ సంతాప సభ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జెవి చలపతిరావు,కే గోవర్ధన్,గౌని ఐలయ్య లు ప్రసంగించారు.కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల వెంకన్న,మోకాళ్ళ మురళీ కృష్ణ,బండారి ఐలయ్య, నందగిరి వెంకటేశ్వర్లు,జడ సత్యనారాయణ,ఊకే పద్మ,పుల్లన్న,జి. సక్రు,హెచ్. లింగ్యా, ఇ.శ్రీశైలం,గుజ్జు దేవేందర్, శివ్వారపు శ్రీధర్, తుడుం వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

యుద్ధభూమిలో యోధుడు.

యుద్ధభూమిలో యోధుడు

 

 

 

 

 

 

గోపీచంద్‌ కథానాయకుడిగా సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో చారిత్రక నేపథ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘గోపీచంద్‌ 33-వర్కింగ్‌ టైటిల్‌’. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు…

గోపీచంద్‌ కథానాయకుడిగా సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో చారిత్రక నేపథ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘గోపీచంద్‌ 33-వర్కింగ్‌ టైటిల్‌’. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో రూపొందించిన భారీసెట్లో చిత్రీకరణ జరుగుతోంది. గోపీచంద్‌ పుట్టిన రోజు సందర్భంగా గురువారం చిత్రబృందం పోస్టర్‌ను, గ్లింప్స్‌ను విడుదల చేసింది. గోపీచంద్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించారు. యుద్ధభూమిలో వీరతిలకం ధరించిన యోధుడిగా ఆయన కనిపించారు. ఏడో శతాబ్దానికి చెందిన ఇప్పటివరకూ ఎవరూ స్పృశించని ఓ పాయింట్‌తో సంకల్ప్‌రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని యూనిట్‌ తెలిపింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version