ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.

రాష్ట్ర సాధనలో మాజీ సీఎం కెసిఆర్ ఆమరణ దీక్ష తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచి.

రాష్ట్రం సిద్ధించడంలో అమరవీరుల త్యాగాలు మరువలేనివి.

మాజీ జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న.

మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ భానోత్ సారంగపాణి.

నల్లబెల్లి నేటి ధాత్రి:

14 ఏళ్ల అలుపెరుగని పోరాటంతో తెలంగాణ ఉద్యమ రథసారథి కెసిఆర్ సారధ్యంలో సాధించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను మండల కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగృహం వద్ద బిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు అలాగే మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి పార్టీ జెండా ఎగరవేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరుల త్యాగాలు, ప్రభుత్వ ఉద్యోగులు విద్యార్థుల పోరాటాలు సబ్బండ వర్గాల సమిష్టి కృషితోనే ఆరో దశబ్దాల కల సహకారం అయిందని అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ తొలి 10 ఏళ్ల ప్రస్థానం యావత్ భారత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రతి ఆలోచన వెనుక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా దిక్సూచిగా నిలిచిందని పేర్కొన్నారు.

తెలంగాణ గడ్డపై పురుడుపోసుకున్న రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశానికి దారి చూపే దీప స్తంభంలా నిలవడం ప్రతి తెలంగాణ బిడ్డకు గర్వకారణమని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్ష చైర్మన్ చెట్టు పల్లి మురళీధర్ రావు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఉడుగుల ప్రవీణ్ గౌడ్, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, క్లస్టర్ ఇన్చార్జిలు గందె శ్రీనివాస్ గుప్తా, వైనాల వీరస్వామి, ఇంగ్లీశివాజీ, మాజీ సర్పంచులు నాన బోయిన రాజారాం యాదవ్, ఊరటి అమరేందర్ రెడ్డి, మామిండ్ల మోహన్ రెడ్డి, చీకటి ప్రకాష్, వెంకన్న, మాజీ ఎంపిటిసి జన్ను జయరావు, నాయకులు ఖ్యాతం శ్రీనివాస్, పాండవుల రాంబాబు, ఆకుల సాంబారావ్, బోట్ల పవన్, బూస సదయ్య, గుండాల శ్రీశైలం, గుమ్మడి వేణు, పరికి కోర్నిల్, రాజు, వేల్పుల రవి తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయండి.

జూన్ 4న కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయండి

CITU పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ పిలుపు

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు CITU పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బి.వై.నగర్ లోని కామ్రేడ్,అమృత్ లాల్ శుక్లా భవనంలో సి.ఐ.టి.యు జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది.
ఈ సందర్భంగా సి.ఐ.టి.యు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడుతూ 2023 సంవత్సరం బతుకమ్మ చీరలకు సంబంధించి గత నెల రోజుల క్రితం మొదటి విడతగా 3,000 మంది కార్మికుల ఖాతాలలో సబ్సిడీ డబ్బులు జమ చేయడం జరిగిందని ఇంకా సిరిసిల్ల మరియు టెక్స్ టైల్ పార్క్ లో దాదాపు 2200 మంది కార్మికులకు సంబంధించిన సబ్సిడీ డబ్బులు రావాల్సి ఉందని అధికారులను ఎన్నిసార్లు అడిగినా రేపు మాపు అంటూ దాటవేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు రెండవ విడత సబ్సిడీ డబ్బులు రాకపోవడంతో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆందోళన చెందుతున్నారని సబ్సిడీ రావలసిన కార్మికులకు కాలయాపన చేయకుండా అధికారులు వెంటనే రేపటి వరకు సబ్సిడీ అందించాలని డిమాండ్ చేశారు.మొదటి విడత సబ్సిడీ వచ్చి నెల రోజులు అవుతున్న సబ్సిడీ రానీ కార్మికులకు అందించడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ , వెంటనే సబ్సిడీ అందించాలని జూన్ 4 వ. తేదీ బుధవారం రోజున CITU ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఇట్టి ధర్నా కార్యక్రమంలో సిరిసిల్ల మరియు టెక్స్ టైల్ పార్క్ లో సబ్సిడీ డబ్బులు రాని కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షులు నక్క దేవదాస్ నాయకులు స్వర్గం శేఖర్,సందు పట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ అవతరణ దినోత్సవము వేడుకలు.

వేములపల్లిలో తెలంగాణ అవతరణ దినోత్సవము వేడుకలు అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రం …
గ్రామ శాఖ అధ్యక్షులు ఆరేళ్ల రమేష్

మొగుళ్ళపల్లి నేటిధాత్రి:

భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని వేములపల్లి బి ఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఆరేళ్ల రమేష్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో జెండా ఆవిష్కరణ జరిపారు గ్రామ శాఖ అధ్యక్షులు మాట్లాడుతూ అమరవీరుల త్యాగ ఫలితం తోనే తెలంగాణ రాష్ట్రం కల సహకారం అయిందని, నీళ్లు, నిధులు, నియామకాలతో మొదలెట్టిన తెలంగాణ ఉద్యమం, సకలజనులు సబ్బండవర్ణాల కలయికతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అన్నారు. దశాబ్దాలుగా 1969 నుండి 2014 వరకు వివిధ దశలో సాగిన తెలంగాణ ఉద్యమంలో వేలాదిమంది ఆత్మహత్య చేసుకున్నారుప్రత్యేక తెలంగాణ అంశంపై 2017 శ్రీకృష్ణ కమిటీ ఎప్పటి ఆరు ప్రతిపాదనలు చేసి ఆ ప్రతిపాదనలు జూలై 2013 జూలై 31 తెలంగాణ కొరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది 2013 అక్టోబర్ 3న కేంద్రం మండలి ఆమోదం లభించగా 2014 ఫిబ్రవరి 13 తెలంగాణ ఏర్పాటు బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతు లోకసభలో ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొంది 2014లో ఉమ్మడి రాష్ట్ర విభజన ఆదేశిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వికరణ చట్టం 2014 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు లేదా తెలంగాణ బిల్లు అని ప్రవేశపెట్టింది 2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించాక 2014 దేశంలో 29వ రాష్ట్రంగా నూతన రాష్ట్రంగా ఆవిర్భవించింది . తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్ అని 14 సంవత్సరాలు అలుపెరగని పోరాటంలో తెలంగాణ సాధించారని ఉద్యమ సారధి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించింది అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి పోచంపల్లి రమేష్ ఎండి రహీం బండారి తిరుపతి బీసీ సంఘం అధ్యక్షులు భాష బోయిన శ్రీశైలం వికలాంగుల అధ్యక్షులు రమేష్ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కరీంనగర్ నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట మార్కెట్ కమిటీ ఆద్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేణి తిరుమల తిరుపతి ముదిరాజ్. ఈకార్యక్రమంలో వైస్ చైర్మన్ పిండి సత్యం రెడ్డి, డైరెక్టర్ లు బడుగు ఎల్లయ్య, మ్యాకల స్వామి, జక్కుల బాబు, కుంబాల రాజేశం, వేణుగోపాల్ రెడ్డి, కోట్ల మల్లేశం, మార్కెట్ సిబ్బంది, రాజేశం, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

నాగారం మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నాగారం నేటిదాత్రి:

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం నాగారం మున్సిపల్ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు నాగారం మున్సిపల్ కమిషనర్ రాజేందర్ కుమార్ జాతీయ జెండా ఎగురవేశారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో నాగారం మాజీ వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు అనిత సుధాకర్ రెడ్డి, లావణ్య శ్రీనివాస్, సుమిత్ర సురేష్, మాజీ కోఆప్షన్ మెంబర్ షఫీ, మాజీ వార్డ్ మెంబర్ శ్రీనాథ్ గౌడ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

నల్లబెల్లి నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. మండల తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో ముప్పు కృష్ణ, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో నరసింహమూర్తి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై వి గోవర్ధన్, సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ రావు, మదర్ తెరిసా సమైక్య మండల కార్యాలయంలో అధ్యక్షురాలు ఊట్కూరి భాగ్యలక్ష్మి, రైతు వేదిక వద్ద ఏవో బన్న రజిత, జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం తెలంగాణ గీతాన్ని ఆలాపించి అమరవీరులకు జోహార్లు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మార్వో ముప్పు కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరుద్యోగ యువకులు, ఉద్యోగులు సబ్బండ వర్గాల త్యాగ ఫలితం తోటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం జరిగిందని. రాష్ట్రం కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసిన త్యాగమూర్తులను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేసే విధంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖలకు సంబంధించిన సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

కొత్తగూడలో స్వరాష్ట్ర తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

కొత్తగూడలో స్వరాష్ట్ర తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జాతీయ జెండా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరణ చేసిన వజ్జ సారయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు.

కొత్తగూడ నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని కొత్తగూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క సూచనల మేరకు జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గ్రామ కమిటీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించినారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు త్రివర్ణ పతాకం జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు తధానంతరం వారు మాట్లాడుతూ…
జూన్ 2 స్వరాష్ట్ర స్వప్నం సాకారం అయిన రోజు
ఆరున్నర దశాబ్దాల ఆకాంక్షలు నెరవేరిన రోజు
నాలుగున్నర కోట్ల ప్రజల ఆత్మగౌరవ నినాదం
ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితం
అలుపెరగని పోరాటాలతో సాధించిన అంతిమ విజయం
అసాధ్యభావనను, సుసాధ్యాం చేసిన శుభదినం స్వేచ్ఛ, సమానత్వం, సంక్షేమం, అభివృద్ధితో విరాజిల్లుతున్న మన ప్రజాపాలనకు నిలువెత్తు నిదర్శనం..తెలంగాణ ప్రజల కాంక్షను తీర్చిన తల్లి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ..రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి,
కొత్తగూడ బ్లాక్ అధ్యక్షులు సుంకరబోయిన మొగిలి.
లావణ్య వెంకన్న జిల్లా నాయకులు,
బానోత్ విజయ రూప్సింగ్ ఎక్స్ ఎంపీపీ & జిల్లా ప్రధాన కార్యదర్శి.
పులుసం పుష్పలత ఎక్స్ జెడ్పిటిసి.
బిట్ల శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శి.
ఇర్ప రాజేశ్వర్ మండల అధికార ప్రతినిధి.
బోయినేని ప్రశాంత్ రెడ్డి యూత్ మండల అధ్యక్షులు.
వల్లపు రంజిత్ జిల్లా ఓబీసీ నాయకులు.
నోముల ప్రశాంత్ యాదవ్ జిల్లా యూత్ నాయకులు
సిరిగిరి సురేష్ మండల సోషల్ మీడియా.
కే దాసుప్రసాద్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు.
బోడ ఈరియా నాయక్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు.
కట్రోజు బిక్షపతి బీసీ సెల్ మండల నాయకులు.
శిరబోయిన సాయి
యాదగిరి కిరణ్.
మెకానిక్ కృష్ణ. జితేందర్ తదితరులు పాల్గొన్నారు

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

నేటి ధాత్రి గార్ల:

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పిఎసిఎస్ కార్యాలయంలో జాతీయ జెండాను సొసైటీ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ,నీళ్లు, నిధులు,నియామకాల కోసం ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందని అన్నారు.అమరుల ఆకాంక్షలు, ఆశయాల కోసం సకల జనులందరూ కృషి చేయాలని ఆయన కోరారు.స్వరాష్ట్రము కోసం అసువులు బాసిన తెలంగాణ అమరవీరులందరికీ నివాళులు అర్పించారు. పోలీస్ స్టేషన్ లో ఎస్సై రియాజ్ పాషా, తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద విశ్వ జంపాల,తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శారదా, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మంగమ్మ జెండా ఆవిష్కరణ చేశారు.ఈ యొక్క కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ గంగావత్ లక్ష్మణ్ నాయక్,సొసైటీ డైరెక్టర్ శీలంశెట్టి ప్రవీణ్ నాయుడు, సిపిఎం పార్టీ జిల్లా నాయకులు కందునూరి శ్రీనివాస్,కడియం వెంకన్న, సొసైటీ సీఈవో వెంకటేశ్వర్లు, గిన్నారపు మురళి తారక రామారావు, భూక్యా నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

సమీకృత కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ.

సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుక

జిల్లా కలెక్టర్ సందీప్ ఝా జెండా ఆవిష్కరణ

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలో పాల్గొని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జెండా ఆవిష్కరించడం జరిగినది.
తదనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది.
అంతేకాకుండా జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నామని, ప్రభుత్వం నుండి గాని ప్రభుత్వ అధికారుల నుండి గాని జిల్లా ప్రజలకు అభివృద్ధిలో భాగంగా ముందుంటామని తెలపడం జరిగినది. తెలంగాణ అవతరణ దినోత్సవం లో భాగంగా జిల్లా కలెక్టర్ విద్యార్థిని, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేయడం జరిగినది.

ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.

ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

జాతీయ జెండాను, పార్టీ పతాకాన్ని ఎగరేసి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించిన బిఆర్ఎస్ శ్రేణులు

గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు

మరిపెడ నేటిధాత్రి:

14 ఏళ్ల అలుపెరగని పోరాటంతో తెలంగాణ జాతిపిత,ఉద్యమ రథసారథి కేసిఆర్ సారథ్యంలో సాధించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గo మరిపెడ మున్సిపల్ కేంద్రంలో ని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నవీన్ రావు హాజరై జాతీయ జెండా తోపాటు పార్టీ జెండాను ఎగరేసి సంబరాలు జరుపుకున్నారు.అమరుల త్యాగాలు, ప్రభుత్వ ఉద్యోగులు , విద్యార్థుల పోరాటాలు, సబ్బండ వర్గాల సమిష్టి కృషితోనే ఆరు దశాబ్దాల కల సాకారం అయిందని గుర్తు చేశారు,కొట్లాడి సాధించుకున్న తెలంగాణ తొలి పదేళ్ల ప్రస్థానం యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు,తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రతి ఆలోచన వెనుక రాష్ట్ర ప్రభుత్వనికి,కేంద్ర సర్కార్ కు కూడా దిక్సూచిగా నిలిచిందని పేర్కొన్నారు.తెలంగాణ గడ్డపై పురుడు పోసుకున్న రైతుబంధు,మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశానికే దారిచూపే దీపస్తంభంలా నిలవడం ప్రతి తెలంగాణ బిడ్డకు గర్వకారణమని అన్నారు,తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతో పాటు గత పదేళ్లపాటు సాగిన తెలంగాణ ఉజ్వల ప్రయాణంలో కేసీఆర్ అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు అన్నారు,మాయమాటలతో మభ్యపెట్టే ఢిల్లీ పార్టీలతో రాష్ట్ర ప్రయోజనాలు అడుగడుగునా దెబ్బతింటున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణ సమాజమంతా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు,జిల్లా సీనియర్ నాయకుడు రాంబాబు, మాజీ ఎంపీపీ గడ్డం వెంకన్న, మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు తాళ్లపల్లి రఘురాం,కేసముద్రం మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్, రైతు కోఆర్డినేటర్ కొమ్ము చంద్రశేఖర్,మైనారిటీ నాయకులు లతీఫ్,మాజీ కౌన్సిలర్లు వెంకటేశ్వర్లు,అజ్మీర రెడ్డి, బోడ భాస్కర్,గంధసిరి కృష్ణ, బిఆర్ఎస్ కార్యకర్తలు వివిధ గ్రామాల మాజీ సర్పంచులు,ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో తెలుగుదేశం.

తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో తెలుగుదేశం నేతలు

వనపర్తి నేటిధాత్రి :

 

 

 

 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వనపర్తి జిల్లా తెలుగుదేశం నేతలు ఘన o గా జరుపుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేశారు .

 

 

ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ పార్లమెంటు కన్వీనర్ బి రాములు న్యాయవాది షాకీర్ హుస్సేన్ కాగితాల లచ్చన్న చిన్నయ్య కృష్ణయ్య ,ఉపేంద్ర, రాజుఎం శేఖర్, కొత్తగొళ్ల శంకర్ దస్తగిరి డి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

జెండాను ఆవిష్కరించిన ఆర్డీవో రామ్ రెడ్డి.

జహీరాబాద్ జెండాను ఆవిష్కరించిన ఆర్డీవో రామ్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవవేడుకల సందర్భంగా సోమవారం జహీరాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జహీరాబాద్ ఆర్డిఓ రామ్ రెడ్డి జెండా ఎగురవేసి తెలంగాణ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మిథున్ రాజ్, ఎమ్మార్వో దశరద్ సింగ్, మోహన్ రెడ్డి, రైతుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చిట్టెంపల్లి బాలరాజ్, వివిధ పార్టీల కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

జెండాను ఆవిష్కరించిన ఎంపీడీవో.

జెండాను ఆవిష్కరించిన ఎంపీడీవో

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవవేడుకల సందర్భంగా సోమవారం ఝరాసంగం ఎంపీడీవో కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఝరాసంగం ఎంపీడీవో సుధాకర్ జెండా ఎగురవేసి తెలంగాణ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఆర్ఓ తిరుమల రావు ఏపీవో రాజ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమంతరావు పటేల్ అశ్రాఫ్ ఫలి రాజేందర్ సింగ్ మాజీ సర్పంచ్ పెంటయ్య పోలీసు అధికారులు వివిధ పార్టీల కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

తుమ్మనపల్లి గ్రామంలో ఆవిర్భావ దినోత్సవవేడుకల

ఝరాసంగం మండలంలోని తుమ్మనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి విక్రాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జండా సోమవారం ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు ఘనగా నిర్వహించరు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి సురేఖ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కోసం ఎందరో త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రన్ని సాధించుకున్నారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ మైనారిటీ నాయకులు షేక్ సోహెల్ ప్రధానోపాధ్యాయురాలు ఎక్స్ ఎంపిటిసి ఏ. నవాజ్ రెడ్డి మరియు కే శ్రీనివాస్ రెడ్డి మతిన్ ఆశప్ప మిటుషా. తదితరులు పాల్గొన్నారు

సిరిసిల్ల జిల్లా పోలీస్ పరేడ్ కేంద్రంలో.

సిరిసిల్ల జిల్లా పోలీస్ పరేడ్ కేంద్రంలో తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుక

వేడుకలో పాల్గొన్న, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ని జిల్లా పోలీస్ పరేడ్ కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వేములవాడ ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ పాల్గొని భారత త్రివర్ణ పతాక జెండా ఆవిష్కరించడం జరిగినది. తదనంతరం పోలీస్ పరేడ్ వందన కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది,ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ మాట్లాడుతూ.

తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలపడం జరిగినది. అంతేకాకుండా ఎందరో అమరుల త్యాగం వల్ల సిద్ధించిన తెలంగాణ, నేడు ప్రజా పాలన వ్యవస్థగా పురుడుపోసుకున్నదని తెలిపారు. అంతేకాకుండా తెలంగాణలో ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి, ప్రభుత్వం ద్వారా, పాలకుల ద్వారా, ప్రభుత్వ అధికారుల ద్వారా జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందించే ప్రతిఫలాలు పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కృషి చేస్తున్నామని.
అంతేకాకుండా జిల్లాను విద్యా,వైద్య, ఉపాధి కల్పనలో ముందుండడానికి ప్రభుత్వం మరియు ప్రభుత్వ అధికారులు అహర్నిశలు కష్టపడుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప తిరుపతిరెడ్డి,

రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు,ప్రభుత్వ అధికారులు పాల్గొనడం జరిగినది.

అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రం…

అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రం …

పట్టణ వివిధ రాజకీయ పార్టీల నాయకులు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

 

అమరవీరుల త్యాగ ఫలితం తోనే తెలంగాణ రాష్ట్రం కల సహకారం అయిందని, నీళ్లు, నిధులు, నియామకాలతో మొదలెట్టిన తెలంగాణ ఉద్యమం, సకలజనులు సబ్బండవర్ణాల కలయికతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని రామకృష్ణాపూర్ పట్టణ వివిధ పార్టీల నాయకులు అన్నారు.

రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో పట్టణ ఎస్సై రాజశేఖర్, క్యాతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో కమీషనర్ గద్దె రాజు లు జాతీయ జెండా లను ఎగరవేసి, అమరవీరులకు నివాళులు అర్పించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు కంభగోని సుదర్శన్ గౌడ్ జెండా ఎగరవేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

సూపర్ బజార్ చౌరస్తాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు జెండా ఎగురవేసి అమరవీరులకు నివాళులు అర్పించారు.

రాజీవ్ చౌక్ లోని రాజీవ్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించి అమరవీరులను స్మరించుకుంటూ తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. 

Telangana State .

 

 

 

జోన్ లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ జండా ఎగరవేసి అమరవీరుల కు నివాళులు అర్పించారు.

రామాలయం చౌరస్తాలోని అమరవీరుల స్తూపం వద్ద వివిధ పార్టీల నాయకులు ఘన నివాళులు అర్పించి అమరవీరులను స్మరించుకున్నారు.

సూపర్ బజార్ లోని తెలంగాణ తల్లి విగ్రహానికి సైతం పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమాలలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఏరియా ఆసుపత్రిలో,సివిల్ కార్యాలయంలో, సిహెచ్పి లో , ప్రభుత్వ పాఠశాలల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

తెలంగాణ అమరవీరులకు ప్రభుత్వ విప్ ఘన నివాళి.

తెలంగాణ అమరవీరులకు ప్రభుత్వ విప్ ఘన నివాళి

సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పాత బస్టాండ్ సమీపంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద, తెలంగాణ అమరవీరులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మరియు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలోజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప తిరుపతిరెడ్డి,తదితరులు నివాళులు అర్పించారు.

మల్లీ గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

మల్లీ గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా న్యాల్కల్ మండల్ మల్లీ గ్రామ పంచాయతీ కార్యాలయం & అంగన్వాడి కేంద్రం జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జట్గొండ మారుతీ మాజీ సర్పంచ్ బాబురావు మాజీ ఎంపీటీసీ శివానంద శ్రీపతి మాజీ వార్డు సభ్యులు సిద్ధారెడ్డి తాత్కాలిక పంచాయత్ కార్యదర్శి జై సింగ్ సిఏ నర్సారెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్ అంబిక అంగన్వాడీ టీచర్లు వసంత సుకుమారి ఆశ వర్కర్లు జగదేవి శివలీల పంచత్ కార్మికులు చంద్రయ్య డేవిడ్ గణపతి సంగమ్మ చిన్నమ్మ కన్నమ్మ మైనార్టీ నాయకులు అఖిల్ స్వామి దాస్ తదితరులు పాల్గొన్నారు.

జూన్ మాసం వచ్చిందంటే వారిలో టెన్షన్.

జూన్ మాసం వచ్చిందంటే వారిలో టెన్షన్

వామ్మో జూన్..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

 

పాఠశాలలు మొదలవుతుంది అంటే తల్లిదండ్రులకు టెన్షన్ మొదలయ్యే సందర్భాలు ఎదురవుతున్నాయి.

ముఖ్యంగా పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు అప్పులు చేయడానికి కూడా వెనకాడరు.

అందుకే జూన్ మాసం వచ్చిందంటే వారిలో టెన్షన్ మొదలవుతుంది.

ఒకటో తారీఖు అంటే ప్రతినెలా సామాన్య కుటుంబాలకు ఇబ్బందిగానే ఉంటున్నా జూన్ మాసంలో మాత్రం ఇంకాస్తా భయాన్ని కలిగిస్తుంది.

ఇంటి బడ్జెట్కు తల్లిదండ్రుల కసరత్తు మొదలైంది.

జూన్ మాసం వస్తుందంటేనే తల్లిదండ్రులు హడలిపోతారు.

ప్రతి కుటుంబంపై జూన్ మాసంలో రూ. 50 వేల నుంచి రూ లక్ష వరకు బడి ఖర్చులు ఉంటాయి.

మరో 15 రోజులు మాత్రమే పాఠశాలలకు సెలవులు మిగిలి ఉన్నాయి.

పాఠశాలలు తెరుచుకోవడానికి ముందే విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు, యూనిఫాంలు, షూస్ సహా కొనుగోలు చేయడంతో పాటు ఫీజుల మోతను ఎదుర్కోవడానికి తల్లిదండ్రుల్లో దడ మొదలైంది.

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల మోత మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ను తలకిందులు చేస్తుంది.

కళాశాలలు, పాఠశాలల్లో ఫీజులు కూడా భారీగా పెంచారు.

జూన్ మాసంలో విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందటేనే ప్రతి ఇంటిలో ఎల్ కేజీ నుంచి పదో తరగతి వరకు, అలాగే ఇంటర్మీడియట్కు టర్మ్ ఫీజులు, రవాణా, ఇతర ఖర్చులు కలిపితే రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు అవుతుంది.

School Holidays.

 

కార్పొరేట్ స్థాయికి వెళ్తే రూ.లక్ష వరకు ఖర్చు అవుతుంది.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోకి కార్పొరేట్ పాఠశాలలు కూడా రావడంతో పిల్లల చదువుల కోసం మధ్య తరగతి కుటుంభాలు కూడా మొగ్గు చూపుతున్నారు.

ఇంజనీరింగ్ చదువాలంటే కూడా కళాశాలల్లో ఫీజు రీయింబర్స్మెంట్ మినహాయించిన కళాశాలల ఫీజులు లక్షల్లోనే ఉ న్నాయి.

మరోవైపు హాస్టల్ ఫీజులు అదనపు భారం ఉంటాయి.

ప్రైవేటు పాఠశాలల్లో స్కూల్ ఫీజులు వేలల్లో ఉ న్నాయి.

దీనికి తోడు ఈవెంట్స్ పేరుతో అదనపు వసూళ్లు కూడా ఉన్నాయి.

పుస్తకాలతో పాటు బ్యాగ్లు టిఫిన్ బాక్సుల రేట్లు కూడా మండిపోతున్నాయి.

ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు బస్సు, యూనిఫాం, బెల్ట్, బ్యాడ్జి, టై, ఐడీ కార్డు, డైరీ, పుస్తకాలు, పెన్నులు, పరీక్ష ఫీజులు..

ఇలా అన్నింటికి వేలల్లోనే ఖర్చు చేయాల్సి ఉ ంటుంది.

ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కేవలం పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు ఇస్తుండగా, మిగతా నోటు బుక్కులు, ఇతర వాటికి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది.

ఆపరేషన్ కగార్ వెంటనే ఆపాలి.

ఆపరేషన్ కగార్ వెంటనే ఆపాలి..

ఎర్రజెండాను రూపుమాపడం బిజెపికి పగటి కలే..!

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేన శంకర్

సిపిఐ పార్టీ అంటేనే పేద ప్రజలకు కొండంత బలం…

జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్..

నాలగోసారి సిపిఐ పట్టణ కార్యదర్శిగా మిట్టపల్లి శ్రీనివాస్…

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

సిపిఐ పార్టీ రామకృష్ణాపూర్ పట్టణ మూడవ మహాసభలు పట్టణంలో ఘనంగా జరిగాయి.రాజీవ్ చౌక్ చౌరస్తా నుండి సూపర్ బజార్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి, రైల్వే స్టేషన్ సమీపంలోని కమ్యూనిటీ హాల్ లో సిపిఐ కమిటీ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. మహాసభలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. నాలుగోసారి పట్టణ కార్యదర్శిగా మిట్టపల్లి శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ తెల

అనంతరం వారు మాట్లాడారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను అంతమొందిస్తుందని, ఏకపక్ష దాడులు చేస్తూ మావోయిస్టులు లేకుండా చేస్తామనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం విడనాడాలని బిజెపి ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధిలో విఫలమవుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంఆరు గ్యారెంటీ పథకాల హామీలు నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు.గతంలో రామకృష్ణాపూర్ పట్టణ అభివృద్ధిలో సిపిఐ పార్టీ పాత్ర కీలకమైందని, ప్రస్తుతం అప్పటి అభివృద్ధి పనులే ఇంకా ఉన్నాయని, నేటి పాలకుల అభివృద్ధి శూన్యమని అన్నారు.  సిపిఐ పార్టీ అంటేనే పేద ప్రజలకు కొండంత బలం అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా పోరాల్సిన సమయం ఆసన్నమైందని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేకల దాస్, వనం సత్యనారాయణ, ఇప్పకాయల లింగయ్య, రేగుంట చంద్రశేఖర్, లింగం రవి, దాగం మల్లేష్, మిట్టపల్లి పౌల్, మామిడి గోపి, గోపు సారయ్య, కాదండి సాంబయ్య, మణెమ్మ, రాములు రాజేశ్వర్, ఏఐటియూసీ ఫిట్ కార్యదర్శులు గాండ్ల సంపత్, హరి రామకృష్ణ, ముకుంద రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సస్పెండ్.

ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సస్పెండ్

◆ విధుల్లో నిర్లక్ష్యం.. కరెంట్ పోయినప్పుడు టార్చ్ లైట్లతో వైద్యం

జహీరాబాద్ నేటి ధాత్రి,:

 

 

 

జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో భద్రత లోపాలు, ఆధునిక వసతుల వినియోగంలో నిర్లక్ష్యం ఆరోపణలతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ను అదికారికంగా సస్పెండ్ చేశారు. గత శుక్రవారం రాత్రి ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా ఆగిపోయిన సమయంలో జన రేటర్ ఉన్న వాడకపోవడంతో పేషెంట్లకు టార్చ్ లైట్ల ద్వారా వైద్యం అందిం చిన దారుణ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పత్రికల్లో కథనాలు వెలువడిన వెంటనే సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ చంద్రశే ఖర్ స్వయంగా ఆస్పత్రిని తనిఖీ చేసి విచారణ ప్రారంభించారు. విచారణలో డాక్టర్ శ్రీదర్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు నిర్ధారణ కావడంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. గతంలోను డాక్టర్ శ్రీధర్పై పలు ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. కొంతమంది ఉద్యో గులు ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ నాయకులతో సన్నిహితంగా ఉంటూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని గుసగుసలాడుతున్నారు. ప్రజల ప్రాణాలు దోహదంగా ఉండాల్సిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇటువంటి పరిస్థితులు చోటుచేసుకోవడంపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నాయి. ఈ ఘటనపై మెరుగైన వైద్య సేవల కోసం జిల్లా ఆరోగ్య శాఖ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version