ఉస్తాద్‌ సరసన ఛాన్స్‌ కొట్టేసింది..

ఉస్తాద్‌ సరసన ఛాన్స్‌ కొట్టేసింది..

రాశీఖన్నా మల్టీ టాలెంటెడ్‌ ఆర్టిస్ట్‌. వైవిధ్యమైన పాత్రలతో నటిగా నిరూపించుకున్నారు. పాటలు పాడే టాలెంటూ ఆమెలో ఉంది.

రాశీఖన్నా (Rashi khanna) మల్టీ టాలెంటెడ్‌ ఆర్టిస్ట్‌. వైవిధ్యమైన పాత్రలతో నటిగా నిరూపించుకున్నారు. పాటలు పాడే టాలెంటూ ఆమెలో ఉంది. ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ భామ అతి తక్కువ సమయంలో అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకున్నారు. 12 ఏళ్లుగా టాలీవుడ్‌లో సక్సెస్‌ ఫుల్‌గా కెరీర్‌ కొనసాగిస్తున్నారు. పక్కా కమర్షియల్‌, థ్యాంక్యూ చిత్రాల తర్వాత తెలుగులో మరో సినిమా అవకాశం అందుకోలేదు. కొంతగ్యాప్‌ తర్వాత ఓ పెద్ద అవకాశం అందుకున్నారు. రాశీఖన్నా. అది కూడా పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) సరసన. ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌లో (Ustaad Bhagat Singh) రాశీ అవకాశాన్ని సొంతం చేసుకొంది. హరీశ్‌శంకర్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. ఇందులో శ్రీలీల ఓ కథానాయికగా ఎంపికైన సంగతి తెలిసిందే!

నేటి విద్యాలయాలు అభివృద్ది..

నేటి విద్యాలయాలు అభివృద్ది.. భవిష్యత్తు దేశాభివృద్ధి

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్/నేటి ధాత్రి

విద్యాలయాలు అభివృద్ధి చెందినప్పుడే దేశాభివృద్ధి సాధ్యం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వికలాంగుల, వయోవృద్ధుల మరియు ట్రాన్స్ జెండర్స్ వ్యక్తుల సాధికారత శాఖ ద్వారా రూ.69 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ మరియు గ్రంథాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మీ పాఠశాల లో చదివి ఈరోజు జీవితంలో స్థిరపడిన హరీష్ నాకు పాత మిత్రుడని హరిష్ తో పాటు ఈ పాఠశాల లో చదివి జీవితంలో స్థిరపడ్డ వారి మాదిరిగానే మీరు మంచిగా చదువుకొని మీరు కూడా జీవితంలో స్థిరపడాలని ఆయన ఆకాంక్షించారు. ఆత్మన్యూనత భావం నుంచి ఆత్మవిశ్వాసానికి ఎదగడానికి మీరందరూ కృషి చేయాలని ఆయన సూచించారు. వ్యతిరేక ఆలోచనలు చేయరాదని ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో ఈ పాఠశాలలో ఏమైనా అభివృద్ధి పనులు కావాలంటే తన దృష్టికి తీసుకురావాలని, తప్పకుండా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అలరించాయి. అంతకుముందు అంధుల ఆశ్రమ పాఠశాల లో చదివి వివిధ ప్రభుత్వ ప్రైవేటు శాఖలో ఉద్యోగాలు సాధించి జీవితం లో స్థిరపడిన పలువురు పూర్వపు విద్యార్థులను ఆయన ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఓ.రాములు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా మత్స్యకారుల సంఘం అధ్యక్షులు గంజి ఆంజనేయులు, రాములు యాదవ్, రమేష్ యాదవ్, ఏసు దాస్ , రఘురామిరెడ్డి ,తిరుమల వెంకటేష్, పాపారాయుడు, రాజు, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version