పిచ్చికుక్కల స్వైర విహారం మహిళపై దాడి.
జహీరాబాద్ నేటి ధాత్రి
జహీరాబాద్ పట్టణంలో పిచ్చికుక్కల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మంగళవారం జహీరాబాద్ పట్టణంలోని పస్తాపూర్లో గల భవాని కాలనీలో చాకలి మంజులకు పిచ్చికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. స్థానిక కమ్యూనిటీ వైద్యశాలలో చికిత్స పొందుతుంది. కాగా ఫస్తాపూర్లోని జర్నలిస్ట్ కాలనీ, మేస్త్రి కాలనీ, ఆనంద్ నగర్ కాలనీ లలో పిచ్చి కుక్కలు దాడి చేసి రోజుకు ఒకరికి గాయపరుస్తున్నాయని కాలనీ వాసులు అంటున్నారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే పిచ్చి కుక్కలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
-కమిషనర్ వివరణ
ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ సుభాష్రవు స్పందిస్తూ.. వెంటనే కుక్కలను నివారించేందుకు చర్యలు చేపడతామని అన్నారు.