చెరువులలో పూడికతీత పనులు చేపట్టాలి

చెరువులలో పూడికతీత పనులు చేపట్టాలి దళిత గిరిజన మత్స్య సహకార సొసైటీలు ఏర్పరచాలి

తాళిపేరు డ్యామ్ అభివృద్ధికి నిధులు కేటాయించాలి

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తాలిపేరు డ్యాం అభివృద్ధికి నిధులు కేటాయించాలి
సీనియర్ జర్నలిస్ట్ నరసింహ

టిపిసిసి మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్ ప్రత్యేక చొరవ చూపాలి

నేటిధాత్రి చర్ల :

 

చర్ల మండల కేంద్రంలోని 60 చెరువులను మినీ తాలిపేరు డామ్ గా తీర్చిదిద్దాలి గేట్లను అమర్చాలి చేపల సాగుకు మరియు వ్యవసాయ రైతుల అవసరాలకు అనుకూలంగా తీర్చిదిద్దాలని సీనియర్ జర్నలిస్ట్ నరసింహ అన్నారు అదేవిధంగా దళిత గిరిజన మత్స్య సహకార సంఘాలను ఏర్పాటు చేసి చేప పిల్లలను పంపిణీ చేసి ఆర్థిక అభివృద్ధికి పాటుపడాలి బయట ప్రాంతం నుండి వచ్చే చేపల వ్యాపారస్తులను అడ్డుకోవాలని స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి సహాయం అందించాలి
భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ మరియు ఐటీడీఏ పీవో రాహుల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారులు తాలుపెరు డ్యామ్ ను మరియు చెరువులను సందర్శించాలి సమగ్ర ప్రణాళికతో చర్ల మండల కేంద్రంలో సాగునీటి కాలువలు లిఫ్ట్ ఇరిగేషన్ కొరకు ఈ ప్రాంతంలో పర్యటించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించి చర్ల మండల ప్రజల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని స్థానిక దళిత గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రజల ఆకాంక్ష అన్నారు అదేవిధంగా తాలిపేరు డ్యామ్ ను పూర్తిస్థాయిలో బాగుచేయాలని హైడ్రాలిక్ గేట్లను అమర్చాలని తాళి పేరు లోపల భాగంలో సిల్ట్ ను పూర్తిగా తొలగించి నీటి నిలువ సామర్థ్యం పెంపొందించి చేపల సాగుకు అనుకూలంగా మరియు రైతులకు సాగునీటిని అందించే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మండలంలోని ప్రతి చెరువుకు నీటిని పంపిణీ చేయాలి ని ఎండాకాలంలో కూడా పూర్తిస్థాయి నీటిమట్టం ఉండేలా చెరువులకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీటి కాలువల ద్వారా నీటిని పంపిణీ చేయాలి చెరువులను సుందరీకరంగా తీర్చిదిద్దాలని సీనియర్ జర్నలిస్ట్ నరసింహ అన్నారు

సామజిక తనిఖీ పై గ్రామసభ 2024 – 25 పని వివరాలు.

సామజిక తనిఖీ పై గ్రామసభ 2024 – 25 పని వివరాలు

నిజాంపేట నేటి ధాత్రి:

జాతీయ ఉపాధి హామీ పనుల పై సామజిక తనిఖీ అధికారులు సర్వే చేపట్టారు. ఈ మేరకు మండలం లోని నస్కల్ గ్రామంలో బీఆర్పి అధికారులు మూడు రోజులుగా గ్రామం లోనీ ఇంటి ఇంటికి వెళ్లి కూలీలు ఎంత పని చేశారు. ఎంత డబ్బులు పడ్డాయనే దానిపై సర్వే నిర్వహించారు. సర్వే అనంతరం గ్రామసభ ఏర్పాటు చేసి మాట్లాడారు.. 2024 – 25 సంవత్సరంలో 18 పనులు జరిగాయని ఈ పనులకు సంబంధించి కూలీ వేతనాలు, సామాగ్రి తో కలుపుకొని రూ,, 33,04,117 వచ్చినట్లు తెలిపారు. అలాగే గ్రామంలో నూతన పని బుక్కులకు దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక తనిఖీ బృందం, గ్రామ కార్యదర్శి అరిఫ్ హుస్సేన్, దేశెట్టి సిద్ధ రాములు, సుధాకర్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్ లు ఉన్నారు.

పటిష్టతకు పని చేసేవారిని నూతన అధ్యక్షుడిగా అవకాశం.

కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పని చేసేవారిని నూతన అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలి

◆ సీనియారిటీకి ప్రాధాన్యత ఇచ్చి పార్టీ విధేయులకు ప్రాధాన్యత ఇవ్వలి

◆ అన్ని వర్గాలను కలుపుకొని పోయే నాయకుడిని పెద్దపీట వెయ్యాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్,అల్ ఇండియా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ శాసనసభ పరిది ఝారసంగం మండలంలోని మచ్నూర్ గ్రామంలో సోమవారం ఝారసంగం మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశమై పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా మండలంలో బలమైన కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణంలో భాగంగా పార్టీ చేపట్టబోయే నూతన గ్రామ, మండల అధ్యక్షుల ఎంపికను అందరూ ఏకతాటిపై నిలిచి నూతన అధ్యక్షుడి ఎంపికను పూర్తి చేసి జహీరాబాద్ నియోజకవర్గంలోనే ఝారసంగం మండల కాంగ్రెస్ పార్టీని పటిష్టం చెయ్యాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తూ..

నూతన నాయకత్వాన్ని అందరి అభిప్రాయంతో ఎంచుకోవలని తెలిపారు.

పార్టీ నూతన మండల ఎంపిక కోసం సంస్థాగత ఎన్నికల ఇంచార్జ్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పార్టీ అధిష్టానం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ,ఓసి జనరల్ వారి నుంచి అనగా 2017 కంటే ముందు పార్టీలో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఉదాహరణకు ఝారసంగం మండల అధ్యక్షుడిగా ఒకే వ్యక్తి మూడు దశబ్దాలకుపై, న్యాల్కల్ మండల అధ్యక్షుడు నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో ఉన్నప్పటి నుంచి 2009 లో నియోజకవర్గల పునర్విభజనలో జహీరాబాద్ లో విలీనం అయిన నాటి నుంచి ఇప్పటివరకు అన్నగా రెండు దశాబ్దాలకు పైగా ఉండగా, 2009 నుండి
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండటం, మిగిలిన మండలాల వారు 2018 సంవత్సరం నుంచి ఉండటంపై పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నారు.

మూడు రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ఇచ్చిన పాసులను ఇష్టానుసారంగా ఇచ్చుకొని జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులకు,మాజీ జడ్పిటిసిలు,మాజీ ఎంపిపిలు, మాజీ ఎంపిటిసిలు, మాజీ సర్పంచ్ లకు ఇవ్వకపోవడంతో కార్యకర్యాల ఆగ్రహానికి కారణం అయింది.

ఏది ఏమైనప్పటికి పార్టీ అధిష్టానం మండల అధ్యక్షుడిని మార్చి పార్టీ శ్రేయస్సు కోసం పనిచేసే వారిని అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానంతో కోరారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ అసెంబ్లీ ఓటమి చెందడానికి పలు కారణాల్లో అధ్యక్షులను మార్చకపోవడం కూడా ఒకటని సమావేశంలో చెప్పుకోవడం విశేషం..

ఇప్పటికైనా పార్టీ అధిష్టానం స్పందించి 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించాలంటే నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో నూతన అధ్యక్షుల నియామకం చేపట్టి వారికి అవకాశం కల్పిస్తే వారు ఐకమత్యంగా ఉంటూ పార్టీ విజయం కోసం కష్టపడే అవకాశం ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పిసిసి ప్రచార కార్యదర్శి మహేందర్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎండి.

ముల్తానీ, ఝారసంగం మండల మాజీ ఎంపిటిసి ఫోరం అధ్యక్షుడు శంకర్ పాటిల్, మాజీ జడ్పిటిసి వినిల నరేష్, మాజీ ఎంపిపి దేవదాస్, మాజీ సర్పంచులు నవాజ్ రెడ్డి, రామిరెడ్డి, ఇస్మాయిల్ సాబ్, రాజుస్వామి, శంషోద్దీన్, నందప్ప పాటిల్, మహరుధ్ రావు, సుధాకర్, మాణిక్యం, మాజీ ఎంపిటిసిలు మొహమ్మద్ హాఫిజ్, రవి, మాజీ ఉప సర్పంచ్ సంగన్న, యువజన కాంగ్రేన్ అధ్యక్షుడు రాఘవేంద్ర, అభిలాశ్ రెడ్డి, యువ నాయకులు, సుధాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రాజు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలి

విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలి
విద్యాశాఖ అధికారి లింగాల కుమారస్వామి

మొగులపల్లి నేటి ధాత్రి

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని విద్యా ప్రమాణాలు పెంపొందించాలని మండల విద్యాశాఖ అధికారి లింగాల కుమారస్వామి అన్నారు.

శనివారం మండలంలోని మొట్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత ఐదు రోజులుగా నిర్వహించబడుతున్న ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ శిక్షణలో నూతనంగా పరిసరాల విజ్ఞానాన్ని చేర్చడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత మరింతగా పెరుగుతుందన్నారు.

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులకు వివరించి విద్యార్థులు నమోదు పెంచుటకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన కోరారు.

గ్రామ స్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధులను, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, అంగన్వాడి సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో బడిబాట కార్యక్రమం నిర్వహించి విద్యార్థుల సంఖ్య పెంచడానికి భాగస్వాములను చేయాలన్నారు.

విద్యార్థుల తల్లిదండ్రులకు నిర్దిష్టమైన చదువు హామీ ఇచ్చి నెరవేర్చేలా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు.

Students Education Officer

 

ఉపాధ్యాయులు శిక్షణలో పొందిన విధంగా విద్యార్థులను ఆకట్టుకునేలా, ఆసక్తిని పెంచేలా బోధన ప్రక్రియ కొనసాగాలన్నారు.

అనంతరం బెస్ట్ ప్రాక్టీస్ అవార్డు పొందిన ఉపాధ్యాయులు కోటేశ్వర్లు, సునీతా దేవినీ ఎమ్మార్పీలు వ్యవహరించిన వేణుమాధవ్, నాగరాజు, రామకృష్ణ, రాజ్ కుమార్, స్వామి, రాము, చంద్రయ్యలకు పుష్పగుచ్చం అందించి, శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎం ఆర్ సి సిబ్బంది, మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యం గా పనిచేయాలి.

కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యం గా పనిచేయాలి

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

 

 

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి పిలుపునిచ్చారు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు గ ఆదేశం మేరకు కొప్పుల, కాట్ర పల్లి గ్రామాలలో నూతనంగా కాంగ్రెస్ గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలలోకి తీసుకె ళ్లాల చూడాలన్నారు అనం తరం నూతన గ్రామ కమిటీ లను ఎన్నుకున్నారు కాట్రపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు వాంకు డోత్ జగన్ ఉపాధ్య క్షుడిగా ఆరే కమలాకర్ ప్రధాన కార్యదర్శి వంటేరు శ్రీకాంత్ కోశాధికారిగా కొప్పుల గ్రామ కమిటీ అధ్యక్షునిగా ఏరుకొండ శంకర్ ఉపాధ్యక్షుడిగామామిడి రవి ,ప్రధాన కార్యదర్శిగా చాడ రామ్ రెడ్డి, పిట్టల నరేష్ ఎన్నుకున్నారు ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ మండల నాయకులు బాసని చంద్ర ప్రకాష్ ,చల్లా చక్రపాణి, అబు ప్రకాష్ రెడ్డి ,మారేపల్లి రవీందర్ దుబాసి కృష్ణమూర్తి, పోతు కృష్ణమూర్తి, రఘు సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ఉప్పల్ తీగలగుట్టపల్లి రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు.

ఉప్పల్ తీగలగుట్టపల్లి రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయించండి

ప్రజల ఇబ్బందులు తీర్చండి

కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లిన వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్ నేటిధాత్రి:

గురువారం అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 25.85 కోట్లతో పునరాభివృద్ధి చేసిన కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పాల్గొన్నారు.
రైల్వే స్టేషన్ ను వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కరీంనగర్లో జరిగిన రైల్వేస్టేషన్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రైల్వే శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీరితోపాటు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పాల్గొన్నారు. ఈసందర్భంగా వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ నుంచి తిరుపతికి ప్రతిరోజు రైలు నడపాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి వినతి పత్రం అందజేశారని, ఈవిషయంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ చొరవ తీసుకొని, ఈఅభ్యర్థనకు కార్యరూపం దాల్చేలా కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కోరారని తెలిపారు. జమ్మికుంట రైల్వే స్టేషన్ అభివృద్ధికి, ఉప్పల్ రైల్వే బ్రిడ్జి కంప్లీట్ అయ్యేలా, తీగలగుట్టపల్లి రైల్వే బ్రిడ్జి త్వరితగతిన పూర్తయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని కేంద్రమంత్రి బండి సంజయ్ ని రాజేందర్ రావు కోరారు. రైల్వే బ్రిడ్జిల నిర్మాణ పనులు ఆలస్యం కావడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రి దృష్టికి రాజేందర్ రావు తీసుకొచ్చారు. వీటిపై ప్రత్యేక దృష్టిసారించి బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకొని, ప్రజలు ప్రయాణికులు ఇబ్బందులు తీర్చాలని రాజేందర్ రావ్ కోరారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశంలో నూటమూడు స్టేషన్లలో తెలంగాణ నుండి కరీంనగర్ , వరంగల్, బేగంపేట రైల్వే స్టేషన్ లను పునరాభివృద్ధి చేసి ప్రారంభించుకోవడం రాష్ట్ర ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. కరీంనగర్ ప్రజలు రైల్వే శాఖ సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. గతంలో కరీంనగర్ ఎంపీగా పని చేసిన పొన్నం ప్రభాకర్ కరీంనగర్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేశారని గుర్తు చేశారు. నాడు యూపీఏ ప్రభుత్వ హయంలో కరీంనగర్ రైల్వే స్టేషన్ ను తీర్చిదిద్దడానికి ప్రత్యేక చొరవ చూపారని తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మారుతున్న కాలానికి అనుగుణంగా రైల్వే శాఖ అధికారులు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని వెలిచాల రాజేందర్ రావు కోరారు.

జీవజాతి పరిరక్షణకు పాటుపడాలి.

జీవజాతి పరిరక్షణకు పాటుపడాలి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

అంతరించిపోతున్న జీవజాతి పరిరక్షణకు సమాజంలోని ప్రతీ ఒక్కరు పాటుపడాలని ఆర్డీఓ
ఉమారాణి పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ జీవ వైవిధ్య పరిరక్షణ దినోత్సవం సందర్బంగా స్థానిక స్వచ్చంధ సంస్థల ఆధ్వర్యంలో ఆర్డివో ఉమారాణి చేతుల మీదుగా జీవ వైవిధ్య పరిరక్షణ వాల్ పోస్టర్లు ఆర్డిఓ కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఆర్డీఓ మాట్లాడుతూ
పర్యావరణాన్ని పరిరక్షిస్తూ జీవ వైవిద్యాన్ని కాపాడుకుందామన్నారు. సృష్టిలోని ప్రతీ జీవరాశిని బతుకనిద్దాం వాటిని కాపాడుకుందాం అని అన్నారు.ప్రతిభా సంస్థ నిర్వాహకులు గిరగాని సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ ప్రకృతితో సామరస్యం, స్థిరమైన అభివృద్ధి అనే ఇతివృత్తంతో జరుపుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట తహసీల్దార్ రవిచంద్రా రెడ్డి, స్వయంకృషి సంస్థ నిర్వాహకులు బెజ్జంకి ప్రభాకర్, ఏ.ఎస్.ఆర్. సంస్థ నిర్వాహకులు ఎర్రబోయిన రాజశేఖర్,వాలంటీర్ కాసుల వెంకటాచారి, వెంకన్న ఆఫీస్ ఇంచార్జి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

కాసింపూర్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం.

కాసింపూర్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం..

నిజాంపేట నేటి ధాత్రి:

నిజాంపేట మండల పరిధిలోని కాసింపూర్ గ్రామంలో అంతర్గత రోడ్లు బాగోలేనందున 5 లక్షల వ్యయంతో శుక్రవారం గ్రామంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ సిసి రోడ్డు నిర్మాణ పనులకు సహకరించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలోకాంగ్రెస్ నాయకులు నీలం కనకరాజు,కుంటకనకరాజు, దావీద్,ప్రశాంత్,మధు, రవి,స్వామి,కొమురయ్య, బిక్షపతి,తదితరులు పాల్గొన్నారు.

పట్టుదలతో పని చేస్తే వ్యాపారంలో.!

పట్టుదలతో పని చేస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి

నేటి యువత అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలుస్తున్నారు అది తెలంగాణ మట్టిగడ్డ యొక్క గొప్పతనం – మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు

కరీంనగర్ నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామంలోని శాంతినగర్ లో శ్రీసేవాలాల్ మహారాజ్ కాంప్లెక్స్ నందు మాలోత్ కల్పన రాజు నాయక్ పెట్టిన రాయల్ బేకరీ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, మాజీ కొత్తపెల్లి మండల వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్ లతో కలసి ప్రారంభించడం జరిగినది. ఈసందర్భంగా నారదాసు లక్ష్మణ్ రావు మాట్లాడుతూ నేటి యువతరం కష్టపడి తమ కుటుంబాన్ని పోషించడం కోసం ఏదో రకమైన వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారని ఒకప్పుడు ఏపని లేక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ముందుకు ఎదుగుతుంది అంటే అందుకు కారణం యువతరమని ఏదో ఒక పని చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని లక్ష్యంతో పనిచేస్తున్నారని అందుకోసమే తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు. ఉద్యోగం కాదు వ్యాపారంలో కూడా అధిక లాభాలు సంపాదించి అభివృద్ధి చెందవచ్చనే విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించారన్నారు. అందులో భాగమే నేడు కల్పన రాజు నాయక్ వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడడం కోసం బేకరీ ఫాస్ట్ ఫుడ్ పెట్టడం జరిగిందని సందర్భంగా వారిని అభినందించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్టి సెల్ అధ్యక్షులు శ్రావణ్ నాయక్, మాజీ వార్డ్ మెంబర్ నజీమా బేగం, బిజెపి నాయకులు సదానందం నాయక్,
బిఆర్ఎస్ నాయకులు చెట్టుపెళ్లి నరేందర్, మల్లేశం, భాస్కర్ నాయక్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ మెంబర్ రవి నాయక్, గిరిజన నాయకులు రంగనాయక్, మోహన్ నాయక్, పాప నాయక్, జాంగిర్, పైడిపాల రవి, శ్రీనివాస్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

సిపిఐ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి .

సిపిఐ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకండి

సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

గ్రామాల్లో సిపిఐ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి పిలుపునిచ్చారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట . గ్రామంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు మచ్చ రమేష్ అధ్యక్షతన మండల మహాసభ జరిగింది. ఈమండల మహాసభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి వెంకటస్వామి హాజరై మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సిపిఐ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని, పార్టీ అభ్యర్థులుగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావాలని, అందులో భాగంగానే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కేంద్రంలో, రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్న వారిని హామీలను అమలు పరుచాలని సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాలు చేయాలని ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకాన్ని కలిగించాలన్నారు. సిపిఐ పార్టీ ఆవిర్బవించి వంద సంవత్సరాలు అవుతుందని, మార్కిసిజం, లేనినిజం సిద్ధాంతాలతో సమ సమాజ స్థాపనే లక్ష్యంగా దోపిడీ లేని సమాజం కోసం అంతరాలు లేని వ్యవస్థ కోసం దేశంలోనే మొట్టమొదటి రాజకీయ పార్టీ సిపిఐ పార్టీ అని నాటి నుండి నేటి వరకు కార్మిక, కర్షకుల సమస్యలతో పాటు దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతూ హక్కుల సాధన కోసం, సమస్యల పరిష్కారం పోరాడుతున్న ఏకైక పార్టీ అని అన్నారు. దేశాన్ని పాలిస్తున్న నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి, ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి కేవలం కార్పొరేట్ బహుళజాతి సంస్థలకు సంపన్న వర్గాలకు అనూకూల నిర్ణయాలు చేస్తూ దేశ సంపదను కోళ్లగొడుతూ కాలయాపన చేస్తున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేయడంలో ఆలస్యం అవుతుందని, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, పెన్షన్స్ పెంపు, రైతుల ఋణమాఫీ తదితర హామీలను వెంటనే నేరవేర్చాలని లేకుంటే ప్రజా ఉద్యమాలు తప్పవని వెంకటస్వామి హెచ్చరించారు. ఈసమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి గోడిశాల తిరుపతి గౌడ్, ఉమ్మెంతుల రవీందర్ రెడ్డి, మండల నాయకులు ఎగుర్ల మల్లేశం, శంకరయ్య, లక్ష్మి, నర్సయ్య, ఐలయ్య, రాజేష్, అజీమ్, తదితరులు పాల్గొన్నారు.

నేషనల్ హైవే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం.

నేషనల్ హైవే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

మండలంలో రోడ్డు విస్తరణలో భాగంగా వరంగల్ నుండి మంచిర్యాల వరకు. నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు మార్గం కొత్తగా నిర్మాణం చేయడం జరుగుతున్న నేపథ్యంలో. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాలతో మొగుళ్లపల్లి మండల తాహసిల్దార్ జాలి సునీత బుధవారం రోజున మొగుళ్లపల్లి గ్రామ శివారు ( భారత్ గ్యాస్ సమీపంలోని) వ్యవసాయ భూముల మీదుగా హైవే రోడ్డు నిర్మాణం చేపడుతున్న ప్రదేశానికి తాహసిల్దార్ చేరుకొని అక్కడున్న వ్యవసాయ భూములను పరిశీలించిన తాసిల్దార్. ప్రభుత్వం రైతుల వద్దనుండి స్వీకరించిన వ్యవసాయ భూములకు రోడ్డుకు అనుగుణంగా రెండు వైపులా హద్దులను వేయించారు. ఇరువైపులా. రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించి వివిధ వాహనాలతో వ్యవసాయ భూమిని చదును చేయించి రోడ్డు విస్తరణ పనులను తాహసిల్దార్ మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో. ఎస్సై బొరగల అశోక్, గిరిధవార్. శివరామకృష్ణ, రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

శ్రమ గొప్పదనాన్ని చాటి చెప్పే రోజే ఈ మే డే.

‘శ్రమ గొప్పదనాన్ని చాటి చెప్పే రోజే ఈ మే డే’

‘శ్రమను గౌరవిద్దాం కార్మికులకు అండగా ఉందాం’

 

జడ్చర్ల /నేటి ధాత్రి

 

 

 

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలలోని పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు కార్మికులు ఎంతగానో శ్రమిస్తారని, వారి శ్రమతోనే ప్రజలందరికీ ఆనందం, ఆరోగ్యం సమకూరుతాయని జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం జడ్చర్ల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మే డే వేడుకలలో పాల్గొని కార్మికులతో కలిసి భోజనం చేశారు. మే డే కానుకగా మున్సిపల్ కార్మికులందరికీ దుస్తులను పంపిణీ చేసారు. మున్సిపాలిటీలో గాని, గ్రామాలలో గాని పరిసరాల పరిశుభ్రత కోసం కార్మికులు అహర్నిశలు పాటుపడతారని ఆయన ప్రస్తావించారు. ఒక్క రోజు ఈ కార్మికులు పని చేయకపోయినా పరిసరాలన్నీ కంపు కొడతాయని, ప్రజలు అనారోగ్యాల బారిన పడతారని చెప్పారు. అందుకే వారు చేసే సేవలు అమూల్యమైనవని అభిప్రాయపడ్డారు. పట్టణాల్లో, గ్రామాల్లో పని చేసే ఈ కార్మికుల కృషివల్లే అందరికీ ఆరోగ్యం సమకూరుతుందని పేర్కొన్నారు. మురికి కాలువలను శుభ్రం చేస్తూ, చెత్త ఎత్తివేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేందుకు కార్మికులు ఎంతో కష్టపడతారన్నారు.

Hard Work.

 

అలాంటి కార్మిక సోదరులతో కలిసి భోజనం చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నానని అనిరుధ్ రెడ్డి చెప్పారు. కార్మిక సోదరులకు నా వంతుగా అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో AMC చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్పలత గారు, మున్సిపల్ కమిషనర్, AMC వైస్ చైర్మన్ రాజు గౌడ్, కౌన్సిలర్లు,AMC డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

షాదీఖానా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి.

షాదీఖానా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

ఎంఐఎం మండల అధ్యక్షుడు షేక్ రబ్బాని….

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా : ఝరాసంగం మండల కేంద్రంలోని షాదీఖానా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంఐఎం మండల అధ్యక్షుడు షేక్ రబ్బాని కోరారు. మంగళవారం పెండింగ్‌లో ఉన్న షాదీఖానా భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… షాదీఖానా నూతన భవన నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు జహీరాబాద్ ఎమ్మెల్యే కోట నుండి 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారన్నారు.

 

President

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా షాదీఖానా పనులు పూర్తి చేయకపోవడం దారుణమన్నారు. కక్ష పూరితంగానే గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులను అధికార పార్టీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. షాదీఖానా పనులు పూర్తి కాకపోవడంతో ముస్లింలు పెళ్లిలు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారన్నారు.

షాదీఖానా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి.

షాదీఖానా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా : ఝరాసంగం మండల కేంద్రంలోని షాదీఖానా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంఐఎం మండల అధ్యక్షుడు షేక్ రబ్బాని కోరారు. మంగళవారం ముస్లిం షాది ఖానా పెండింగ్‌లో ఉన్న షాదీఖానా భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

 

Congress

షాదీఖానా నూతన భవన నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హాయంలో జహీరాబాద్ ఎమ్మెల్యే కోట నుండి 20 లక్షలు మంజూరైన నిధులు మంజూరు చేశారన్నారు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా షాదీఖానా పనులు పూర్తి చేయకపోవడం దారుణమన్నారు. కక్ష పూరితంగానే కాంగ్రెస్ లో చేపట్టిన పనులను అధికార పార్టీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. షాదీఖానా పనులు పూర్తి కాకపోవడంతో ముస్లింలు పెళ్లిలు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారన్నారు.

షాదీఖానా భవన నిర్మాణ పనులను.!

షాదీఖానా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా : ఝరాసంగం మండల కేంద్రంలోని షాదీఖానా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంఐఎం మండల అధ్యక్షుడు షేక్ రబ్బాని కోరారు. మంగళవారం ముస్లిం షాది ఖానా పెండింగ్‌లో ఉన్న షాదీఖానా భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… షాదీఖానా నూతన భవన నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో మాజీ చంద్రశేఖర్ రావు హాయంలో జహీరాబాద్ ఎమ్మెల్యే కోట నుండి 20 లక్షలు మంజూరైన నిధులు మంజూరు చేశారన్నారు.

Shadikhana building

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా షాదీఖానా పనులు పూర్తి చేయకపోవడం దారుణమన్నారు. కక్ష పూరితంగానే కాంగ్రెస్ లో చేపట్టిన పనులను అధికార పార్టీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. షాదీఖానా పనులు పూర్తి కాకపోవడంతో ముస్లింలు పెళ్లిలు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారన్నారు.

అభివృద్ధి అనేది కలిసికట్టుగా పనిచేస్తే సాధ్యమవుతుంది.

అభివృద్ధి అనేది కలిసికట్టుగా పనిచేస్తే సాధ్యమవుతుంది

కేసముద్రం మండల షాదీ ఖానా కమిటీ కి సన్మానం

వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి

 

కేసముద్రం/ నేటి దాత్రి:

 

మంగళవారం వ్యవసాయ మార్కెట్ కార్యాలయము లో ముస్లిం మండల షాదీ ఖానా కమిటీ నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది, నూతనంగా ఏర్పడ్డ షాది ఖానా మండల నూతన కమిటీ సభ్యులు మరియు ముస్లిం సోదరులు పెద్దలు కలిసికట్టుగా మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, డైరెక్టర్లు సంకేపల్లి నారాయణరెడ్డి, చిదురాల వసంతరావు, ఆ యూబ్ ఖాన్, ఆర్టిఏ మెంబర్ రావుల మురళి, నూతన షాది ఖానా మండల కమిటీ అధ్యక్షులు మహమ్మద్ రజాక్, ఎండి రఫీ, తాజుద్దీన్, లను మరియు కమిటీ సభ్యులను శాలువాతో సత్కరించి షాది ఖానా కమిటీకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం మార్కెట్ చైర్మన్ మాట్లాడుతూ కేసముద్రం మండల ముస్లిం సోదరులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని షాదీ ఖానా ఏర్పాటు కొరకు 80 లక్షల రూపాయలు మంజూరు చేయుటకు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎంతో కృషి చేశారని వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. అలాగే షాదీ ఖానా అభివృద్ధి కొరకు ఇంతటితో సరిపోదని ఇంకా మునుముందు సహాయ సహకారాలు ఉంటాయని 80 లక్షల రూపాయల నిధితో షాది ఖానా ఏర్పాటు చేయడం నిధి సరిపోకపోతే మరల కొంత నిధులు మంజూరు చేయించడం కోసం కృషి చేస్తామని అన్నారు. అలాగే కేసముద్రం మండలంలోని ముస్లిం సోదరులు అందరూ ఏకతాటిపై ఉండి షాదీ ఖానా అభివృద్ధి కొరకు పాటుపడాలని, ముస్లిం సోదరులు అందరూ సమైక్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని హితువు పలికారు. ముస్లింలలో చాలావరకు నిరుపేద కుటుంబాలే ఉన్నాయని అలాంటి నిరుపేద కుటుంబాలు శుభకార్యాలు చేసేవారికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ షాదీ ఖానా ఏర్పాటు అనంతరం అందరికీ అందుబాటులో వస్తుందని ఎవ్వరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దని ఈ షాదీ ఖానా అందరికీ ఉపయోగపడుతుందని ఈ అవకాశాన్ని అందరూ కలిసికట్టుగా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కూరెల్లి సతీష్. ముదిగిరి సాంబయ్య. షాదీఖానా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ప్యారవరం బ్రిడ్జి పనులు ఎప్పుడో..?

ప్యారవరం బ్రిడ్జి పనులు ఎప్పుడో..?

◆ ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు రూ.3 కోట్ల మంజూరు శంకుస్థాపనకే పరిమితమా..?

జహీరాబాద్. నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని ప్యారవరం గ్రామ ప్రజల దశాబ్దాల నాటి కల. వంతెన నిర్మాణం ఇంకా కలగానే మిగిలి పోతోంది. తెలంగాణ ప్రభుత్వం కొత్త బ్రిడ్జి నిర్మాణా నికి గ్రామీణ రహదారుల నిధుల నుంచి రూ.3కోట్లు మంజూరు చేసింది. గత ఏడాది నవంబర్ 30న ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, జహీరాబాద్ ఎంపీ మాణిక్ రావు స్థానిక నాయకులతో కలిసి శంకుస్టా పన చేశారు.

Pyaravaram Bridge


త్వరలో పనులను ప్రారంభిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. నిధులు మంజూరై దాదాపు ఐదు నెలలు గడుస్తున్నా, పనులను ప్రారం భించడంలో ఎలాంటి కదలిక లేదు. వర్షాకాలం సమీపిస్తుండటంతో వరద నీటి భయంతో ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు మళ్లీ బిక్కుబిక్కుమనే పరిస్థితి ఏర్పడనుంది. వంతెన నిర్మాణం పూర్తయితే వరద కష్టాలు తీరుతాయని ఆశగా ఎదురుచూస్తు న్నారు. ప్యాలవరం, దేవరంపల్లి, ఈదులపల్లి,

దిగ్వాల్ గ్రామాల ప్రజల ఆశలు నిరాశగా మారు తున్నాయి. పంచాయతీ రాజ్ శాఖ నుంచి రూ. 3 కోట్లు మంజూరైనా పనులు ప్రారంభం కాకపోవ డంతో ఆందోళన చెందుతున్నారు. ఈ మార్గం మీదుగా రైతులు, విద్యార్థులు, చిరు వ్యాపారస్తులు రాకపోకలు సాగిస్తుంటారు. వర్షాకాలం వస్తే బ్రిడ్జి కష్టాలు తప్పవని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి కైనా సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వంతెన పనులు వెంటనే ప్రారంభించా లని ఆయా గ్రామాల ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

అగ్రిమెంట్ పూర్తి కాలేదు.

వంతెన నిర్మాణం ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ, సంబంధిత గుత్తేదారులతో అగ్రిమెంట్ పూర్తి కాలేదు. మరో ఆరునెలల సమయం పట్టవచ్చు. ఒకవేళ గుత్తేదారులు వెంటనే అగ్రిమెంట్ పూర్తి చేసుకుంటే ప్రారంభ పనులు ప్రారంభిస్తాం.

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆగిన పనులు.

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆగిన బ్రిడ్జి నిర్మాణం పనులు.

ఓడేడ్ బ్రిడ్జి ని పూర్తి చేయండి.

రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి.

పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించి దూరాన్ని తగ్గించాలని డిమాండ్.

సిపిఐ జిల్లా పూర్వ కార్యదర్శి గౌతం గోవర్ధన్.

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

మంథని నియోజక వర్గ పరిధిలో ఓడేడ్ గ్రామ శివారులో మానేరు నది పై గత ప్రభుత్వ పాలన లో ప్రారంభమైన బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకుండానే కూలి పోయిందని, దానిని వెంటనే పూర్తి చేసి పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించి దూరాన్ని తగ్గించాలని సిపిఐ జిల్లా పూర్వ కార్యదర్శి గౌతం గోవర్ధన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఓడెడ్ గ్రామ శివారులో లో కూలి పోయిన బ్రిడ్జి ని పరిశీలించి అనంతరం మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణం లో లోపాలు ఉన్న మూలంగా నిర్మాణం పూర్తి కాకుండానే పిల్లర్ లు కూలిపోయాయని ఆయన ఆరోపించారు. బ్రిడ్జి నిర్మాణం లో కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించక పోవడం, ప్రభుత్వ అధికారుల అజమాయిషీ లేక పోవడం మూలంగా బ్రిడ్జి పిల్లర్లు గాలి దుమారానికి కూలీ పోయాయని ఆయన ఆరోపించారు. బ్రిడ్జి పిల్లర్లు కూలీ రెండు సంవత్సరాలు గడిచినా ఇంత వరకు రాష్ట్ర ప్రభుత్వం దీనిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన ఆరోపించారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాక పోవడం వల్ల బ్రిడ్జి పక్క నుంచి తాత్కాలికంగా మట్టి రోడ్డు మీద వాహానాల ద్వారా సమీప ప్రాంతంలో ఉన్న ప్రజలు మరియు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు కూడా చాలా మంది ఈ బ్రిడ్జి ప్రక్క నుంచి ప్రయాణం చేస్తున్నప్పటికీ ని వర్షాకాలంలో ఇబ్బందులకు గురి అవుతారని ఆయన పేర్కొన్నారు. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా మంత్రి వర్యులు శ్రీదర్ బాబు దృష్టి సారించి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు, ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి ఐతే దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరం రెండు జిల్లాల ప్రజలకు తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.

కొమ్మాల జాతర అభివృద్ధికి కృషి చేస్తా.

కొమ్మాల జాతర అభివృద్ధికి కృషి చేస్తా

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి

రేవూరికి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఈ.ఓ నాగేశ్వర్ రావు,ఆలయ అర్చకులు

కొమ్మాల జాతర విజయవంతం…అధికారులను అభినందించిన ఎమ్మెల్యే.

 

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

 

 

 

గీసుకొండ మండలంలోని కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం జాతర అభివృద్ధికి అన్ని విధాలుగా కృషిచేస్తానని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి హామీ ఇచ్చారు.గత నెల నుండి ఏప్రిల్ మొదటివారం వరకు కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలు,జాతర నిర్వహణ విజయవంతంగా ముగిసింది.అలాగే దేవాలయం ప్రాంగణం వద్ద ప్రతీ శనివారం నిత్య అన్నదాన కార్యక్రమం దాతల సహకారంతో చేపట్టిన నేపథ్యంలో మహా అన్నప్రసాద వితరణ దాతగా దేవాలయ మాజీ చైర్మన్ వీరాటి రవీందర్ రెడ్డి స్వర్ణలత దంపతులు ఉన్నారు.కాగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి శనివారం దేవాలయం వద్ద అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు.ముందుగా దేవాలయం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని దేవాలయ ఈవో నాగేశ్వర్ రావు, ఆలయ అర్చకులు రామాచారి, ఫౌండర్ శ్రీనివాస చార్యులు సాంప్రదాయ పద్ధతులతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు.అంతకుముందు ఆలయ అర్చకులు దేవాలయ దాతలు,మాజీ చైర్మన్,ప్రతినిధులతో కలిసి గోశాల వద్ద గోమాత పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం జాతర పట్ల మండపాల ఏర్పాట్ల కోసం,అలాగే పరిసర ప్రాంతాలు రోడ్డు రవాణా మౌలిక సదుపాయాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.అన్నిశాఖల అధికారులు,సిబ్బంది, ప్రజాప్రతినిధుల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో జాతర జరుపుకున్నామని పేర్కొన్నారు.అనంతరం జాతర విజయవంతం చేసిన సందర్భంగా దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాగేశ్వర్ రావు,మామునూరు ఏసిపి తిరుపతి,సీఐ మహేందర్,ఎస్సై కుమార్,ప్రశాంత్ పలువురు అధికారులు,ప్రజా ప్రతినిధులను, పోలీస్ శాఖ అధికారులను,దాతలు,ప్రతినిధులకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అభినందనలు తెలిపి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పరకాల అధికార ప్రతినిధి చాడ కొమరారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మలపెల్లి అధ్యక్షుడు శ్రీనివాస్, ఆలయ ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ కడారి రాజు మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య గౌడ్ ,ఆలయ పౌండర్ శ్రీనివాసచార్యులు,అర్చకులు విష్ణు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సాయిలి ప్రభాకర్, మండల అధ్యక్షులు,మండల మహిళా అధ్యక్షురాలు జక్కుల సరిత, మండల ‌సమన్వయ కమిటీ అధ్యక్షులు దూలం వెంకన్న, జావిద్,గోదాసి చిన్న,సంగెం మాజీ జెడ్పీటీసీ వీరమ్మ,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కూస రమేష్ ,కొమ్మాల తాజా మాజీ ఎంపీటీసీ గోపాల్ ,ఉత్సవ కమిటీ మాజీ సభ్యులు లావుడ్యా రాజన్న, కోల వేణు , కేలోత్ జైత్రాం,మర్రి రాజలింగం,భూక్యా రాంబాబు,వాంకుడోత్ సెల్వా, లడే రాజేశ్వర్ రావు,మండల నరేష్,ఇమ్మడి సమ్మయ్య,బోయపాటి శ్రీదేవి,యార రాజయ్య,నాగారపు సుమలత పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆంజనేయ స్వామి కటాక్షం ఉండాలి.

‘అందరిపై.. ఆంజనేయ స్వామి కటాక్షం ఉండాలి’

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్/ నేటి ధాత్రి

 

అందరిపైనా ఆంజనేయ స్వామి కృపా కటాక్షం ఉండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. హనుమాన్ జయంతి సందర్భంగా.. మహబూబ్ నగర్ పట్టణంలోని అప్పన్నపల్లి ఆంజనేయ స్వామి దేవాలయం లో జరిగిన హనుమాన్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ ప్రజలంతా సుఖసంతోషాలతో ఆకాంక్షించారు. ఎంతో పురాతనమైన ఆంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే వేద ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, నాయకులు గుండా మనోహర్, శివశంకర్, రామాంజనేయులు , హరిబాబు , రామకృష్ణ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version