ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్
నిజాంపేట, నేటి ధాత్రి
వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ నీళ్లు నిలువ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని రాంపూర్, నగరం గ్రామాలలో కలెక్టర్ పర్యటించి ఫ్రైడే ఫ్రైడే పరిసరాల పరిశుభ్రత, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి పిచ్చి మొక్కలు తొలగించాలన్నారు మురుగు కాలువలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు దోమలను పారద్రోలేందుకు పాగింగ్ చేపట్టాలన్నారు. సిజనల్ వ్యాధులు చికెన్ గున్య ,మలేరియా , డెంగ్యూ, విష జ్వరాలు రాకుండా సిబ్బందులు అందుబాటులో ఉండాలని అధికారులు పర్యవేక్షణ చేపట్టాలన్నారు.
లోటత్తు ప్రాంతాల్లో నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటూ అపరిశుభ్రత ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించాలన్నారు పంచాయతీ సెక్రెటరీ, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు ,అంగన్వాడీలు క్షేత్రస్థాయిలో గ్రామాలను సందర్శించి ప్రజల ఆరోగ్యం పరిరక్షణపై తగిన సూచనలు, సలహాలు అందించాలన్నారు అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. నగరం గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు మొత్తం లబ్ధిదారులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజిరెడ్డి, ఎంపీ ఓ ప్రవీణ్, హౌసింగ్ ఏఈ సంధ్య, ఆర్ ఐ ప్రీతి ,హిమద్ ,పంచాయతీ సెక్రటరీ లు హరిప్ హుస్సేన్, చంద్ర హాసన్, ఆశ వర్కర్లు ,అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు