కలెక్టర్ కార్యాలయ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలి..

కలెక్టర్ కార్యాలయ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలి

వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి

ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

కలెక్టరేట్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎంసిపిఐ(యు) జిల్లా బృందం

వరంగల్ జిల్లా ప్రతినిధి/ నర్సంపేట,నేటిధాత్రి:

వరంగల్ జిల్లా ప్రజల సౌకర్యార్థం నత్తనడకన సాగుతున్న జిల్లా కలెక్టరేట్ సముదాయపనులను వేగవంతం చేసి త్వరితగతిన ప్రారంభించాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు.
ఎంసీపీఐయు వరంగల్ జిల్లా ప్రతినిధి బృందం అజాoజాహి మిల్ గ్రౌండ్లో నిర్మిస్తున్న వరంగల్ జిల్లా కేంద్ర కార్యాలయ నిర్మాణ పనులను గురువారం సందర్శించారు ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ జిల్లాల విభజన జరిగి సంవత్సరాలు గడుస్తున్న వరంగల్ జిల్లా ప్రజలకు జిల్లా కార్యాలయాలు సొంత జిల్లాలో లేకపోవడం ఎంతో అసౌకర్యాన్ని గురిచేస్తున్నదని అన్నారు. పరిపాలన సౌకర్యార్థం అధికార యంత్రాంగాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జిల్లాలు ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన జిల్లా ప్రజలకు మాత్రం ఒరిగింది శూన్యమని ఎద్దేవా చేశారు.నేటికీ హన్మకొండ జిల్లాలోనే కలెక్టర్ కార్యాలయం ఇతర ఆఫీసులు ఉండడం అన్యాయం అన్నారు.గత ప్రభుత్వం,ప్రస్తుత ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించడం జరగటంలేదని ఆరోపించారు.నిర్మాణ పనులను ప్రారంభించి మూడు సంవత్సరాలు కావస్తున్న పనులు నత్తనడకన నడుస్తున్నాయని పనుల్లో నాణ్యత లోపం కనబడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజల ప్రయోజనాలను అవసరాలను గుర్తించకుండా స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను బలి పశువులను చేస్తున్నారని ఆరోపించారు.రాష్ట్రానికి వరంగల్ నగరాన్ని రెండో రాజధానిగా చేస్తామని చెప్పిన పాలకులు అది విస్మరించి కనీసం జిల్లా కలెక్టర్ కార్యాలయం సైతం సకాలంలో పూర్తి చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా జిల్లాలో ఉన్న మంత్రి, ఎమ్మెల్యేలు తక్షణమే పట్టించుకోని జిల్లా కేంద్ర కార్యాలయాలను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నర్రా ప్రతాప్, నగర కార్యదర్శి మాలోత్ సాగర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సుంచు జగదీశ్వర్, ముక్కెర రామస్వామి,జిల్లా నాయకులు మహమ్మద్ ఇస్మాయిల్, మల్లికార్జున్, ఐతమ్ నాగేష్, గణిపాక ఓదేలు, తాటికాయల రత్నం,నగర నాయకులు మహమ్మద్ మెహబూబ్ పాష తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version