మండలంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాలలో వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో ముప్పు కృష్ణ, మండల పరిషత్ కార్యాలయం వద్ద సూపర్డెంట్ అబిద్ ఆలీ, పోలీస్ స్టేషన్లో ఎస్సై వి గోవర్ధన్, రైతు వేదిక వద్ద వ్యవసాయ అధికారి బన్న రజిత, గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ నాగేల్లి జ్యోతి ప్రకాష్, మహిళ సమైక్య కార్యాలయంలో ఏపీఎం సుధాకర్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి, బిజెపి కార్యాలయం వద్ద తడుక వినయ్ గౌడ్, వి ఎఫ్ జి సొసైటీ వద్ద అధ్యక్షుడు పోలు దాసరి శ్రీనివాస్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ ఆచార్య, వివిధ గ్రామాలలో సర్పంచులు, కుల సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
