ఎస్టిపిపి ఉత్తమ ఉద్యోగుల ఎంపిక
జైపూర్,నేటి ధాత్రి:
సింగరేణి సంస్థలో విశేష సేవలందించిన ఉత్తమ ఉద్యోగులను 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల రోజున యాజమాన్యం వారికి ఘనంగా సన్మానాలు చేపడుతున్నట్లుగా జైపూర్ ఎస్టిపిపి అధికారులు తెలిపారు.వివిధ ఏరియాల నుంచి ప్రతిభావంతులైన కార్మికులు,అధికారులను గుర్తించి ఉత్తమ సింగరేణీయులుగా ఎంపికలో భాగంగా ప్లాంట్ నుండి నలుగురు ఎంపికయ్యారని ప్లాంట్ ఈడి సిహెచ్ చిరంజీవిలు వెల్లడించారు.ఉత్తమ అధికారిగా జి.ఎం మదన్మోహన్,ఉత్తమ సింగరేణియన్ గా సీనియర్ అసిస్టెంట్ శశిధర్ ఎంపిక కాగా,వీరిని సింగరేణి ప్రధాన కార్యాలయం కొత్తగూడెంలో సి అండ్ ఎండి కృష్ణ భాస్కర్ సింగరేణి డైరెక్టర్ల తో కలిసి సన్మానిస్తారని తెలిపారు. స్థానిక ప్లాంట్ లో జరగబోయే గణతంత్ర వేడుకల్లో సీనియర్ అసిస్టెంట్ సంతోష్ కుమార్, వార్డ్ అసిస్టెంట్ తిరుపతి ఉత్తమ ఉద్యోగులుగా సన్మానించబడతారని తెలిపారు.
