బదిలీపై వెళ్తున్న కమిషనర్ గద్దె రాజు కు సన్మానం..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ కమీషనర్ గా విధులు నిర్వర్తించిన గద్దె రాజు సాధారణ బదిలీపై ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయానికి వెళుతున్న నేపద్యంలో మున్సిపల్ కార్యాలయంలో ఆయనను మాజీ మున్సిపల్ చైర్ పర్సన్, మాజీ కౌన్సిలర్లు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, వివిధ పార్టీల సీనియర్ నాయకులు, కాంగ్రెస్, బారాస నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కమీషనర్ గద్దె రాజు మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కృషి చేశానని అన్నారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీ కి బాధ్యతలు తీసుకొని ఏడాదిన్నర కాలంలో మునిసిపాలిటీని అభివృద్ధి చేసేలా కృషి చేశానని అన్నారు. కమిషనర్ గా నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.
