ఘనంగా 139వ మేడే దినోత్సవ వేడుకలు.

ఘనంగా 139వ మేడే దినోత్సవ వేడుకలు

శ్రీరాంపూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా నస్పూర్ ఏరియాలోని ఐఎన్టీయూసీ బ్రాంచ్ కార్యాలయంలో 139వ మే డే దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించి, వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గురువారం ఏరియా వైస్ ప్రెసిడెంట్ జెట్టి శంకర్రావు మాట్లాడుతూ…కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసి అసువులు బాసిన అమరుల త్యాగాలు మరువలేవని కీర్తించారు.ఇది సాధారణమైన రోజు కాదని,శ్రమించే ప్రతి గుండె చప్పుడు,పోరాడే ప్రతి ఆత్మ యొక్క గర్జన,తరతరాల కార్మికుల కలలు,ఆకాంక్షలు, అలుపెరగని పోరాటాల సజీవ సాక్ష్యమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ సెక్రెటరీ గరిగ స్వామి, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కలవేన శ్యామ్,సెంటర్ సెక్రెటరీ లేగల శ్రీనివాస్,డిప్యూటీ జనరల్ సెక్రెటరీ పేరం రమేష్,జీవన్ జోయల్,భీమ్ రవి,మెండే వెంకట్,తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

మే డే సంబరాల్లో కార్మికులు.

మే డే సంబరాల్లో కార్మికులు

ఘనంగా పలు సంఘాలు మే డే ను నిర్వహించుట

శాయంపేట నేటిధాత్రి:

 

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో కూడలి వద్ద అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు సంఘటిత అసంఘటిత కార్మికుల అందరూ మే డేను జరుపుకు న్నారు.వివిధ రంగాలకు చెందిన కార్మికులతో వివిధ యూనియన్ల ఆధ్వ ర్యంలో గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జెండాలను ఎగురవేసి, ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపు కున్నారు చేనేత సహకార సంఘంలోని కార్మికులు, ఎంసిపిఐ యూనియన్ల కార్మి కులు, గ్రామపంచాయతీ కార్మికులు, పలు సంఘాల కార్మికులు పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొన్నారు. కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కార్మికులు తన చెమటను చుక్కలను రక్త మాంసాలను కలిగించి పనిచేస్తేనే ఈ ప్రపంచం ముందుకు సాగుతుంది వారి శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ జరుపుకునే పండుగ కార్మిక దినోత్సవం మేడే కార్మికుల ఐక్యత పోరాటాలను నిదర్శనంగా నిలుస్తూ మేడేను అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని కూడా పిలుస్తారు. ఈ కార్యక్రమంలో ఎంసిపిఐ శాయంపేట గ్రామ అధ్యక్షుడు నాలికే రాజమౌళి, సూర్య ప్రకాష్, సునీల్ ,అనిల్ కొమురయ్య, చింతల భాస్కర్ ఉస్మాన్ ,నాగలగాని వీరన్న, గాదే కుమారస్వామి రమేష్ వంగరి సాంబయ్య, అన్ని యూనియన్ సంఘాల కార్మికులు, హమాలి కార్మి కులు, గ్రామపంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

వివాహా వేడుకల్లో పాల్గొన్న.!

వివాహా వేడుకల్లో పాల్గొన్న టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చేర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి

మొగుడంపల్లి మండల కేంద్రంలోని ఎస్.వి.కె.గార్డెన్స్ లో ఈ రోజు జరిగిన గుడుపల్లి గ్రామం కాల్వ ముత్యాల్ రెడ్డి కుమారుని వివాహా వేడుకల్లో టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చేర్మెన్ వై.నరోత్తం పాల్గొని నూతన వదువరు లను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ వివాహా వేడుకల్లో సుదర్శన్ రెడ్డి,రాజేందర్ రెడ్డి,వినాయక్ రెడ్డి,చెంగల్ జైపాల్,విజయ్, సి.యం.అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

బసవేశ్వర జయంతి వేడుకలలో కలెక్టర్ ఎమ్మెల్యే.

బసవేశ్వర జయంతి వేడుకలలో కలెక్టర్ ఎమ్మెల్యే

వనపర్తి నేటిదాత్రి :

 

బుధవారం నాడు బసవేశ్వర జయంతి వేడుకల సందర్భంగా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు.సంఘ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెగారెడ్డి మాట్లాడుతూ 12వ శతాబ్దానికి చెందిన బసవేశ్వరుడు మానవులంతా.ఒక్కటే అని కుల మతాలు లేవని ప్రగాఢంగా నమ్మి ప్రజలకు అవగాహన కల్పించారని అన్నారు .మూఢ నమ్మకాలను నమ్మవద్దని, సమానత్వం, శోషలిజం వంటి సిద్ధాంతాలను ప్రచారం చేసి ప్రజలకు దిశానిర్దేశం చేశారని గుర్తు చేశారు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ బసవేశ్వరుడు శ్రమకు మించిన సౌందర్యం లేదని, ఏ పని చేసిన నిష్టతో అంకిత భావంతో పనిచేయాలని బోధించిన బోధనలు ప్రతి ఒక్కరికి స్పూర్తినిస్తాయని అన్నారు అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, డి.సి.డి.బి అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ,ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా అధికారులు, సంఘ నాయకులు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆవిర్భవ దినోత్సవం.!

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు

మందమర్రి నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పట్టణంలో ఈరోజు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ 6వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది

కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది

పంపిణీ అనంతరం వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ అజీమోద్దీన్ మరియు ఉపాధ్యాయులు సుద్దాల ప్రభుదేవా మాట్లాడుతూ…
ఈరోజుల్లో యువత చెడు మార్గంలో వెళుతున్న తరుణంలో ఆ మార్గాన్ని ఎంచుకోకుండా ప్రజలకు సేవ చేయాలని ఒక కొత్త మార్గం ఎంచుకోవాలని వారిని కోరడం జరిగింది

5 సంవత్సరాలుగా మాకు సహకరించి మా కోసం ముందుండి నడిపిన ప్రతి ఒక్క మా మిత్రులకు అన్నలకు, తమ్ముళ్లకు కుటుంబ సభ్యులకు మరియు పట్టణ ప్రజలందరికీ మా తరఫున పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ మొదలుపెట్టి సరిగ్గా ఈరోజుకు 6 సంవత్సరాలు పూర్తయింది

ఈ సంస్థ నేను స్థాపించినప్పుడు కేవలం ఇద్దరు వ్యక్తులతో మొదలై ఈరోజు కొన్ని వందల మందితో ముందుకు వెళుతుంది

మా ప్రజా సేవ వెల్ఫేర్ సొసైటీ ఇప్పటిదాకా చేసిన కార్యక్రమాలు ఏమిటంటే కొన్ని మీకోసం తెలియజేయడానికి

1. కరోనా వచ్చి మృతి చెందిన వారికి దహన సంస్కరణాలు చేయడం జరిగింది

2. కరోనా వచ్చినవారికి మా సొంతంగా పౌష్టిక ఆహారం మేమే స్వయంగా వారి వద్దకు వెళ్లి వారికి ఇవ్వడం జరిగింది

3. లాక్ డౌన్ సమయంలో వందల కుటుంబాలకు నిత్యవసర వస్తువులు మేము వారి వద్దకు వెళ్లి అందించడం జరిగింది

4.పాఠశాల పిల్లలకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు బుక్స్ అందించడం జరిగింది

5.ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పట్టణ ప్రజల కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది

6. పట్టణ రహదారిపై గుంతలు ఏర్పడి వాహనదారులకు చాలా ఇబ్బందిగా మారిన సమయంలో రోడ్లపై స్వయంగా మేమే మరమత్తులు చేయడం జరిగింది

7. వాహనదారులకు రోడ్డు మార్గంలో చెట్లు చాలా వేపుగా పెరిగి రోడ్డు సరిగ్గా కనబడక చాలా ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో మా సొసైటీ సభ్యులంతా కలిసి ఆ చెట్లను తీసివేయడం జరిగింది

8. నిరుపేద కుటుంబంలోని అమ్మాయిల వివాహాలకు మా వంతుగా ఆర్థిక సహాయం చేయడం కూడా జరిగింది చాలా సందర్భాలలో

9.వికలాంగులకు స్టాండ్స్ పంపిణీ చేయడం జరిగింది

10.కరోనా సమయంలో పెరిగిన ఆటో చార్జీలను మా వంతుగా కృషి చేసి తగ్గించడం జరిగింది
ఆరోగ్యం బాగా లేక ఇబ్బంది పడుతున్న వారికి మా వంతుగా మేము ఆర్థిక సహాయం చేయడం జరిగింది

11.మందమర్రి చుట్టుపక్కల రాత్రివేళ మహిళలకు ఇబ్బందికరంగా మారిన మార్కెట్ల లైట్ల కోసం సమస్యపై కృషి చేయడం జరిగింది

ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటి కాదు రెండు కాదు కొన్ని వందల వేల కార్యక్రమాల ద్వారా ప్రజలకు మంచి చేయడం జరిగింది

ఇన్ని కార్యక్రమాలు చేయడానికి సహకరించిన నాతోటి మిత్రులకు అధికారులకు ఇతర పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు

ఇంకా మీ సపోర్ట్ ఇలాగే కొనసాగితే మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మీ ముందుకు తీసుకు వస్తాం

రాబోయే రోజుల్లో ఈ వందల సంఖ్య కాస్త వేల సంఖ్యగా మారి వేల నుంచి లక్షల సంఖ్యలుగా మారాలని ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి మా వంతుగా మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను

ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నంది పాట రాజ్ కుమార్ జిల్లా కార్యదర్శి గాండ్ల సంజీవ్ మండల అధ్యక్షుడు సకినాల శంకర్ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు ఓరం కవిరాజ్, దాడి రాజు అబిద్ కిరణ్ చరణ్ చింటూ అజయ్ సుందర్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది

వరంగల్ రజతోత్సవ సభను విజయవంతం.!

వరంగల్ రజతోత్సవ సభను విజయవంతం.

జహీరాబాద్. నేటి ధాత్రి:

వరంగల్ ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ చైర్మన్ శివకుమార్,నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.మాజి మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు బి ఆర్ ఎస్ పార్టీ జహీరాబాద్ మండల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే, చైర్మన్ గార్లు మాట్లాడుతూ.

Silver Jubilee

27న ఎల్కతుర్తి బిఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు తరలిరావాలని ,ఎల్కతుర్తిలో జరుగనున్న రజతోత్సవ సభలో కేసీఆర్‌ తెలంగాణ ప్రజల భవిష్యత్‌ గురించి దిశా నిర్దేశం చేయనున్నారని, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,మాజి కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్,మాజి న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింహ రెడ్డి,వీర రెడ్డి,రాజు పటేల్,రాజ్ కుమార్,ప్రవీణ్ కుమార్,రాజేందర్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి,అశోక్,హనీఫ్ పటేల్,యువత అధ్యక్షులు ఉమేష్ ,మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవి కుమార్, మాజి సర్పంచ్ లు ,ఎంపీటీసీ లు ,
గ్రామ పార్టీ అధ్యక్షులు,నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వివాహా వేడుకలలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.

వివాహా వేడుకలలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి నేటిదాత్రి :

ముసాపెట్ మండలం.మహ్మద్ హుసేన్ పల్లి గ్రామాని కి చెందిన మాజీ సర్పంచ్ నిర్మల కాశీ నాథ్ సాగర్ సోదరుడు వెంకటయ్య కుమారుడు శేఖర్ దీపిక వివాహా వేడుకలకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని ఆశీర్వదించారు మాజీ మంత్రి వెంట బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు గొల్ల శేషయ్య సీనియర్ నాయకులు శేఖర్ గౌడ్ చెన్నారెడ్డి బీ ఆర్ ఎస్ కార్యకర్తలు ఉన్నారు

ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా కాన్వోకేషన్ డే వేడుకలు.

ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా కాన్వోకేషన్ డే వేడుకలు…

విద్యార్థులకు ఉత్తీర్ణత సర్టిఫికెట్ల ప్రధానోత్సవం…

రామకృష్ణాపూర్,నేటిధాత్రి:

 

 

మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల- ఫిల్టర్ బెడ్ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తిచేసుకున్న విద్యార్ధులకు సర్టిఫికెట్ ల ప్రధానోత్సవ కార్యక్రమం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మందమర్రి ఎంఈఓ దత్తుమూర్తి ,స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పద్మజ హాజరై ఉత్తీర్ణత సర్టిఫికెట్ లు అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ…ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నతమైన జ్ఞాన నిర్మాణం కోసం ఉపాద్యాయులు ఎంతో కృషీ చేస్తున్నారని అన్నారు. వినూత్న రీతుల్లో విద్యాబోధన చేస్తూ ఉపాద్యాయులు విద్యార్థులకు సేవలను అందిస్తున్నారని అభినందించారు. పాఠశాల ప్రత్యేకతలు,అడ్మిషన్ ల ప్రారంభం తెలియజేసే కరపత్రాలను విడుదల చేశారు.

Education

 

ప్రతిభ కనబరిచిన విద్యార్థిని,విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు.తల్లితండ్రులు పెద్దఎత్తున హాజరై ఆద్యంతం పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి , విద్యార్ధుల ప్రతిభను అభినందించారు. ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసాచారి,ఉపాద్యాయులు జనగామ ఉమాదేవి, భీంపుత్ర శ్రీనివాస్ జలంపెల్లి, చింతకింది లలిత, గుడివెనుక రవి, అమ్మ ఆదర్శం పాఠశాల పాఠశాల చైర్మన్ దూలం అంజలి, పిల్లల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఘనంగా. ఈస్టర్. పండుగ వేడుకలు

ఘనంగా. ఈస్టర్. పండుగ వేడుకలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 


జహీరాబాద్ నియోజకవర్గం గ్రామాల్లో..ఘనంగా. ఈస్టర్ పండుగ వేడుకలు. నిర్వహించారు. యేసు క్రీస్తు. వారు. మానవాళి. పాప పరిహారం. నిమిత్తం. సిలువ వేయబడి.. తిరిగి మూడవ రోజు నాడు తిరిగి లేచాడని. క్రైస్తవులు. నమ్ముతారు..ఆయన. శుక్రవారం నాడు.సిలువ వేయబడి.. శనివారం నాడు.. సమాధిలో.. ఉంచబడి.. ఆదివారం ఉదయం. ముడున్నర. గంటల సమయం లో సమాధిలో నుండి. తిరిగి పునరుతానుడై. లేప బడుతాడు..ఆ తరువాత కొందరు శ్రీలకు. అటు తరువాత ఐదు వందలకు పైగా. మనుషుల కు కనిపించి. అటు తరువాత. ఆయన.. పరలోకం వెళ్లిపోయడు.. అందు నిమిత్తం.. ఇస్టర్.. పండుగ ను. నిర్వహించు కొంటారు.. ఈ పండుగ కార్యక్రమం లో. పాస్టర్ లు. సంఘపెద్దలు. భక్తులు. యువకులు. తదితరులు పాల్గొన్నారు

6వ రోజు అగ్నిమాపక వారోష్టత్సవాలు.

6వ రోజు అగ్నిమాపక వారోష్టత్సవాలు

గ్యాస్ గోదాంలో ప్రమాద నివారణ చర్యల గురించి వివరించిన ఫైర్ సిబ్బంది

పరకాల నేటిధాత్రి

 

పరకాల పట్టణ పరిధిలోని ఆర్ఆర్ ఇండియన్ గ్యాస్ గోదాంలో శుక్రవారం ఫైర్ అధికారి వక్కల భద్రయ్య ఆధ్యరంలో 6వ రోజు వారోత్సవాలు నిర్వహించారు.గ్యాస్ గోదాం వద్ద మేనేజర్,సిబ్బందికి అగ్ని ప్రమాదాల నివారణకు తగు చర్యల గురించి అవగాహన కల్పించారు.అందులో భాగంగా ఫైర్ ఎక్సటింగుషర్స్ ఏర్పాటు చేసుకోవాలని,నిర్దేశించిన సమయంలో వాటిని రిఫిల్ చేసుకోవాలని మరియు ఎలా ఉపయోగించాలి అని అవగాహన కల్పించారు.వాటర్ హైడ్రెన్డ్స్, స్పింక్లార్ల్ను ఏర్పాటు చేసుకోవాలని,రేడియం ఎగ్జిట్ సూచికలు అత్యవసర సమయంలో అందరికి కనిపించే విధంగా ఉంచాలని అతి ఉష్టాన్ని వెలువరిచే విదుత్ దీపాలను నియమించి, హలొజెన్ దీపాలను వాడవలని తెలిపారు.అత్యవసర సమయాలలో గోదాము సిబ్బందికి,సెక్యూరిటీకి ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పరకాల అగ్నిమాపక శాఖ కార్యాలయ సిబ్బంది ఎల్ఎఫ్.చారి,డ్రైవర్ గణేష్,అగ్ని మాపకులు అజయ్ కుమార్,రాజేంద్ర ప్రసాద్ లు పాల్గొన్నారు.

శ్రీప్రగతిలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు.

శ్రీప్రగతిలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని శ్రీ ప్రగతి హై స్కూల్ లో యుకేజి విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి అంబాటి వేణుకుమార్ హాజరై విద్యార్థులకు పట్టాలను అందజేశారు. ఈకార్యక్రమంలో నూట ముప్పై ఎనిమిది మంది యుకేజి విద్యార్థులు గ్రాడ్యుయేషన్ డ్రెస్లలో తమ తల్లిదండ్రుల సమక్షంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈసందర్భంగా పాఠశాల చైర్మన్ అన్నదానం రాధాకృష్ణ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులకు అందిస్తున్న సహకారం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా విద్యార్థులు పాఠశాలలో వారి అనుభవాలను పంచుకున్నారు.

Graduation Day

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముచ్చర్ల మునీందర్ రెడ్డి, డైరెక్టర్ బేతి భూమయ్య, అట్ల శ్రీనివాస్ రెడ్డి, ఉప్పల శ్రీనివాస్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, పాఠశాల ఇన్చార్జులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

పాఠశాల వార్షికోత్సవ వేడుకలు.!

ఘనంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ వేడుకలు

రామడుగు, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామంలో ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగామండల విద్యాధికారి అంబాటి వేణు కుమార్ హాజరై మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈకార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం తిరుపతయ్య, మాజీ ఎంపిటిసి గుండి ప్రవీణ్, మాజీ ఉపసర్పంచ్ మేడి శ్రీనివాస్, విద్యా కమిటీ చైర్మన్ చిలువేరి స్వప్న, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ రమేష్, మ్యాకల నాగరాజు, మడ్డి మనోజ్, ఉత్కం శ్రీనివాస్, మచ్చ పవన్ కళ్యాణ్, మంద రాజశేఖర్, కత్తి సాయి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

మాజీ సర్పంచ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.

మాజీ సర్పంచ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

మల్గి గ్రామ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గ్రామ అధ్యక్షులు సిద్ధారెడ్డి పాటిల్ & మాజీ ఎంపీటీసీ శివానంద శ్రీపతి ఆధ్వర్యంలో మల్గి మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి కాలువ పూలమాలలతో కేక్ కట్ చేసి
జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మల్గి మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సిద్ధారెడ్డి మాజీ ఎంపీటీసీ శివానంద శ్రీపతి యువ నాయకులు వైద్యనాథ్ అఖిల్ మియా బసవరాజ్ జాలేందర్ మహేష్ సునీల్ సిద్దూ సాయినాథ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

3వరోజుకు చేరిన అగ్నిమాపక వారోత్సవాలు.

3వరోజుకు చేరిన అగ్నిమాపక వారోత్సవాలు

ఆసుపత్రిలలో ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసుకోవాలి

పరకాల ఫైర్ అధికారి వక్కల భద్రయ్య

పరకాల నేటిధాత్రి

 

పట్టణంలోని లలితా నర్సింగ్ హోంలో బుధవారం రోజున ఫైర్ అధికారి వక్కల భద్రయ్య ఆధ్వర్యంలో 3వరోజు వారోత్సవాలు నిర్వహించారు.హాస్పటల్ సిబ్బంది,డాక్టర్లు,చిత్స నిమిత్తం వచ్చిన వారికి అగ్ని ప్రమాదాల నివారణకు తగుచర్యల గురించి అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా అధికారి భద్రయ్య మాట్లాడుతూ పట్టణ కేంద్రంలోని హాస్పిటల్ యాజమాన్యం అగ్నిప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు మెలుకువలు సిబ్బందికి తెలిపారు.కరపత్రాలను హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేశారు.ప్రమాదాలను నివారించెందుకు హాస్పటల్ లో ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో చారి,డ్రైవర్ సురేష్ ,శ్రీకాంత్,అజయ్ కుమార్,రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు.

అంబెడ్కర్ జయంతి వేడుకలు. 

సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో అంబెడ్కర్ జయంతి వేడుకలు. 

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితి సమితి అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ కార్య నిర్వహణలో లక్ష్మణ్ ప్రింటర్స్ లో 11 గంటలకు అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి .అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ భారతరత్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ రచనల్లో ప్రధాన పాత్ర వహించిన డాక్టర్ అంబేద్కర్ సేవలు ఎనలేనివి. దేశ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగ రచన చేసిన భారతరత్న బాటలో అందరం కలసి నడుద్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్, సహధ్యక్షులు కోడం నారాయణ, ఉపాధ్యక్షులు బూర దేవానందం, ముడారి సాయి మహేష్, గుండెల్ని వంశీ, దొంత దేవదాసు ,సిరిసిల్ల తిరుపతి, అంకారపు రవి కవులు, రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అంబేద్కర్ జయంతి వేడుకలు. 

దీక్షకుంటలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. 
నెక్కొండ,నేటిధాత్రి:*

నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామంలో మాల మహానాడు ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సందర్భంగా నెక్కొండ మండల మాల మహానాడు కన్వీనర్, కో కన్వీనర్ కారు కరుణాకర్, పోనగంటి స్వామిరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతదేశానికి చేసిన సేవలు మర్చిపోకుండా ఆయన ప్రజలు ఆయనను దేవుడని కొలవాలని భారత రాజ్యాంగం నిర్మాణం కోసం ఆయన ఎన్నో త్యాగాలను చేసి బడుగు బలహీన వర్గాలకు కొరకు అహర్నిశలు కృషి చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు.ఆయన జయంతిని ప్రపంచవ్యాప్తంగా పండుగలాగా బడుగు బలహీన వర్గాల ప్రజలు మేధావులు అంగరంగ వైభవంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను జరుపుకోవాలని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో జామండ్ల రంజిత్, కారు అనిల్, బొల్లెపల్లి విష్ణు, చీర కుమారస్వామి, సర్కిల్ రవి, చీపురు భాస్కర్, పోనకంటి ప్రశాంత్, పులి సుధాకర్, దునకన రఘుపతి, చీపురు స్వామి, తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న.!

అంబేద్కర్ గారి జయంతి వేడుకల్లో పాల్గొన్న టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

బారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా టిఎస్ఎస్ సిసిడిసి ఎస్సి కార్పొరేషన్ మాజి చెర్మెన్ వై.నరోత్తం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలో గల అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు,ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వై.నరోత్తం మాట్లాడుతూ దేశానికి అంబేద్కర్ గారు అందించిన సేవలు ఆమోగమని భారత దేశ స్వపరిపాలన ఆదర్శంగా నిలవాలనే లక్ష్యంగా అంబేద్కర్ గారు దేశ రాజ్యంగాన్నీ తీర్చిదిద్దారని అన్నారు,వారు ఆశయాలను కొనసాగిస్తూ వారు చూపిన మార్గంలో మనమందరం నడుచుకోవాలని అన్నారు,ఈ కార్యక్రమంలో నాయకులు డి.మాణిక్ ప్రభుగౌడ్ రైతు హక్కుల సాధన సమితి అధ్యక్షులు సి.బాల్ రాజ్,శివ కుమార్,పి.జి.ఈశ్వర్,యస్, గోపాల్,చెంగల్ జైపాల్,బి. వేణుగోపాల్,యస్.శ్రీనివాస్, రాజేందర్,దిలీప్,ప్రేమ్ కుమార్, ప్రకాష్,సునీల్, తదితరులు పాల్గొన్నారు.

నాగారం లో రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకలు.

నాగారం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకలు

అంబెడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన డాక్టర్ సిరంగి సంతోష్,రాజభద్రయ్య

పరకాల నేటిధాత్రి

 

మండలం లోని నాగారం గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్,మున్సిపల్ మాజీ చైర్మన్ మార్తా రాజ భద్రయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పరకాల మండల అధ్యక్షులు కాసగాని రాజ్ కుమార్ గౌడ్,జిల్లా కౌన్సిల్ మెంబెర్ బాబు యాదవ్,కన్వీనర్ కొమ్మిడి మహేందర్ రెడ్డి,కార్యక్రమ కో కన్వీనర్ లు దుమల నగేష్,కునూరు విరస్వామి,జనరల్ సెక్రటరీ జంగిలి రాజేందర్ రావు,కోశాదికారి ఎదునూరి లింగయ్య,సీనియర్ నాయకులు గుండబోయిన నర్సయ్య,పుచ్చకాయల మల్లారెడ్డి,బీజేవైఎం నాయకులు కాసగాని సాయి కుమార్,బూత్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి,బిక్షపతి,గొట్టే మొగిలి,పైడిపెల్లి మాజీ సర్పంచ్ సురేష్,పోచారం బూత్ అధ్యక్షులు గంపలపెళ్ళి రాజు,లక్ష్మిపురం బూత్ అధ్యక్షులు సంపత్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.

ఏ వై ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.

చిట్యాల, నేటిధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాచిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు జన్నే యుగంధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి కేక్ కట్ చేసిన చిట్యాల మాజీ జెడ్పిటిసి గొర్రె సాగర్ ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు అల్లం రవీందర్ పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరీ రాజిరెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్ మండల ప్రధాన కార్యదర్శులు మడికొండ రవీందర్రావు ఏరుకొండ రాజేందర్ మండల నాయకులు బైరం భద్రయ్య పాండ్రాల వీరస్వామి దామెర రాజు మేడిపల్లి శ్రీనివాస్ వల్ల కొండ లింగారెడ్డి చిదిరాల సరోజన వినవంక శ్రీదేవి మైదము కరుణ ముల్కోజు ప్రవీణ్ సిద్ధోజు శ్రీకాంత్ చారి కైరిక రాజు గుండు నగేష్ కట్కూరి రాజేందర్ కట్కూరి కుమార్ (గని) అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

చల్లగరిగలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు.

చల్లగరిగలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు.

చిట్యాల, నేటిధాత్రి ;

 

 

చిట్యాలమండలం లోని చల్లగరిగ గ్రామంలో నేడు అంబేద్కర్ చౌరస్తాలో డా: బిఆర్ అంబేద్కర్ 134,వ జయంతి వేడుకలు సామాజిక కార్యకర్త నోముల శివశంకర్ శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లూరి అశోక్ గార్ల ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి గారు పాల్గొని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి,స్విట్స్ పంచిపెట్టాడం జరిగింది, అనంతరం
మాట్లాడుతూ డా: బిఆర్ అంబేద్కర్ గురించి 120 దేశ ల రాజ్యాంగం లను అవపాసన పట్టీ ప్రపంచంలో నే అతి పెద్ద రాజ్యాంగాన్ని రచించిన పాలన విదానాన్ని,తేలిపిన విశ్వ మేధావి అని కొనియాడారు, ఈకార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు బండి రాజు గారు, సినియర్ నాయకులు నల్ల రాజిరెడ్డి , సిరి పెళ్లి జంపయ్య గారు, నోముల నాగరాజు గారు,సోమిడి రఘుపతి ,జరిపోతుల ఓదేలు, గ్రామ పంచాయతీ కార్యదర్శి,దూడపాక సరోత్తం, మరియు, బిసి ఎస్టీ మైనార్టీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version