ఘనంగా సంకటహర చతుర్థి వేడుకలు.

న్యాల్కల్: ఘనంగా సంకటహర చతుర్థి వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండలం రాజవరంలోని స్వయంభు వరసిద్ధి వినాయక ఆలయంలో సంకటహర చతుర్థి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వరసిద్ధి గణపతికి అర్చకులు పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. గరికలతో మహా పూజ కార్యక్రమాన్ని చేశారు. గణపతికి ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులు గణపతిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే.

‘జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే’

బాలానగర్ నేటి ధాత్రి :

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని తిరుమలగిరి మాజీ ఎంపీటీసీ నేనావత్ వెంకట్ రాము కూతురు నేనావత్ వందన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి వందనాకు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వందన ఉన్నత విద్యలు చదివి తిరుమలగిరి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్, వెంకటేశ్వర రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తాండవాసులు పాల్గొన్నారు.

ఘనంగా గీసుకొండ శ్రీమంతుని వజ్రోత్సవ జన్మదిన.!

*ఘనంగా గీసుకొండ శ్రీమంతుని
వజ్రోత్సవ జన్మదిన వేడుకలు*

పలు సంఘాల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు..మజ్జిక పంపిణీ.

వరంగల్/నర్సంపేట నేటిధాత్రి:

గీసుకొండ గ్రామ శ్రీమంతుడు పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ వజ్రోత్సవ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ 75 వ జన్మదినం సందర్భంగా గీసుకొండ సోషల్ సర్వీస్ టీం,స్థానిక గీతా లక్ష్మీనారాయణ మహిళా పరపతి సంఘం ఆధ్వర్యంలో కొనాయమాకుల బస్ స్టాండ్ లో ప్రయాణీకులు ఉచితంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నర్సంపేట బస్ డిపో ఎంఎఫ్ ప్రభాకర్, ఏఈ నరేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సరస్వతీ పుష్కరాల సందర్భంగా మండుటెండల్లో విధులు ‌నిర్వహించనున్న బస్ డ్రైవర్లు, కండక్టర్లకు 100 మందికి తెల్ల రుమాళ్లను కూడా లక్ష్మీనారాయణ సౌజన్యంతో పంపిణీ చేశారు.
ఈకార్యక్రమంలో గీసుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చైర్మన్ ఏనుగుల సాంబరెడ్డి, మాజీ చైర్మన్ రామా కుమారస్వామి, ఆర్టీసీ ఉద్యోగి వంగల రాంబాబు,గీసుకొండ సోషల్ సర్వీస్ టీం సభ్యులు కర్ణకంటి రాంమూర్తి, ముల్క సత్యనారాయణ, మహ్మద్ సోనీ,యాదగిరి కుమారస్వామి,పసుల సంపత్, వటుకుల రవికుమార్, గీతా లక్ష్మీనారాయణ మహిళా పరపతి సంఘం అధ్యక్ష కోశాధికారులు కర్ణకంటి రజిత, కత్తి హేమలత, గౌరవ సలహాదారులు కక్కెర్ల సుజాత, వీరగొని హేమలత,పసుల సునిత తదితరులు పాల్గొన్నారు.

జయంతి ఉత్సవాల సందర్భంగా ఊరేగింపు. !

శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా ఊరేగింపు

వనపర్తి నేటిధాత్రి :

 

వనపర్తి పట్టణంలో శంకర్ గంజ్. శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం రాత్రి స్వామివారి ఊరేగింపు శంకర్ గుంజీ నుండి బయలుదేరి కమాన్ చౌరస్తా రాజీవ్ చౌక్ ద్వారా భక్తిశ్రద్ధలతో ఆలయ కమిటీ నిర్వాహకులు నిర్వహించారు

శ్రీశ్రీశ్రీ శివ కేశవ సంజీవ ఆంజనేయ స్వామి .

శ్రీశ్రీశ్రీ శివ కేశవ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయ రజితోత్సవ వేడుకలు.

మందమర్రి నీటి ధాత్రి :

 

 

మందమర్రి పట్టణ అంగడి బజార్ లోని శ్రీశ్రీశ్రీ శివ కేశవ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయ రజితోత్సవ వేడుకలు. మందమర్రి పట్టణంలోని అంగడి బజార్ లో గల శ్రీ శ్రీ శివ కేశవ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయ 25వ వార్షికోత్సవ ఉత్సవాలను శుక్రవారం నుండి శనివారం వరకు అత్యంత వైభవంగ నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు దిలీప్ శుక్ల శర్మ తెలిపారు.

Silver Jubilee.

 

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రీ శ్రీ శ్రీ శివ కేశవ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయం యొక్క 25 వార్షికోత్సవ వేడుకలను ఈ నెల 9వ తేదీ నుంచి పదవ తేదీ వరకు నిర్వహించడం జరిగిందని ప్రతిరోజు ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహిస్తూ అనంతరం మహా అన్నప్రసాద్ వితరణ నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈనాటి.

Silver Jubilee.

ఆలయ రజిత ఉత్సవ వేడుకలకు హాజరైన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన జరిగిందని అలాగే స్వామివారి కృపకు పాత్రులు అయ్యారని తెలిపారు

వివాహ వేడుకల్లో పాల్గొన జహీరాబాద్ ఎమ్మెల్యే .

వివాహ వేడుకల్లో పాల్గొన జహీరాబాద్ ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ముంగి ఎస్ ఎల్ ఆర్ గార్డెన్స్ లో జరిగిన న్యాల్కల్ మండల  .మాజీ జెడ్పీటీసీ భాస్కర్ గారి బావమరిది గారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, మాజి మార్కెట్ చైర్మన్ గుండపా,మాజి సిడిసి చైర్మన్ ఉమాకంత్ పాటిల్ ,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరాసంగం మండల పార్టీ నేను అధ్యక్షులు వెంకటేశం, పాక్స్ చైర్మన్ మచ్చేందర్, మాజి కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్, మాజి సర్పంచ్ లు కళీమ్,ప్రభు పటేల్,మల్లా రెడ్డి,జగదీశ్వర్,కరణ్,మాజి ఎంపీటీసీ రాములు,నాయకులు విజేందర్ రెడ్డి,దత్తురెడ్డి,రాథోడ్ భీమ్ రావ్ నాయక్ తదితరులు.

జమ్మికుంట లో పొన్నం ప్రభాకర్ జన్మదిన.!

జమ్మికుంట లో పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి
అన్నదాన కార్యక్రమం
బొమ్మల గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దేశిని కోటి
సుంకరి రమేష్ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో కేక్ కటింగ్
మొక్కలు నాటిన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బొడిగ శ్రీకాంత్
జమ్మికుంట :నేటిధాత్రి

 

హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రి ప్రభాకర్58వ పుట్టినరోజు సందర్భంగా దేశిని కోటి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జమ్మికుంట బొమ్మల గుడి శివాలయంలో పొన్నం ప్రభాకర్ పేరున ప్రత్యేకమైన పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది .

Ponnam Prabhakar’s birthday

అలాగే పట్టణంలోని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది
* జమ్మికుంట మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బుడిగే శ్రీకాంత్ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని స్థానిక మోత్కల గూడెం ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి యువజన కాంగ్రెస్ జమ్మికుంట మండల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు వీరందరూ మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థి దశలోనే రాజకీయ ప్రవేశం చేసి NSUI రాష్ట్ర అధ్యక్షులుగా కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా ప్రజలకు ఎన్నో రకాల సేవలు అందించారని కొనియాడారు ఈ కార్యక్రమాలలో ఎర్రబెల్లి రాజేశ్వరరావు సుంకరి రమేష్ సాయిన్ రవి జమ్మికుంట మాజీ కౌన్సిలర్ బొంగుని వీరన్న మారపల్లి బిక్షపతి ఎలగందుల స్వరూపా శ్రీహరి పిట్టల శ్వేతా రమేష్ పానుగంటి సారంగం దిడ్డి రామ్మోహన్ కు దాడి రాజన్న గొల్లి పూలమ్మ మొగిలి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట స్వప్న కాంగ్రెస్ నాయకులు పూదరి శివ మరి రామ్ రెడ్డి పందాల అజయ్ ముద్దమల్ల రవి పోతుల శ్రీనివాస్ అశోక్ రాజ్కుమార్ శ్రీను యూత్ కాంగ్రెస్ నాయకులు పార్లపల్లి నాగరాజు ఎండి సజ్జు పాతకాల రమేష్ రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు మండల కార్యదర్శులు రవి అజయ్ సేవాదళ్ నియోజకవర్గం అధ్యక్షులు వినోద్ రెడ్డి వార్డుల అధ్యక్షులు నరికే సుమన్ బుల్లి రమేష్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజ పొనగంటి కుమార్ పొన్నగంటి రాజు గాంధీ యువజన నాయకులు శ్రీకాంత్ శ్రీనివాస్ పాల్గొన్నారు

మంత్రి బర్త్డే వేడుకల సందర్భంగా నూతన వస్త్రాలు !

మంత్రి బర్త్డే వేడుకల సందర్భంగా నూతన వస్త్రాలు అందజేసిన యూత్ నాయకులు..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో. స్థానిక గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బర్త్డే సందర్భంగా సిరిసిల్ల యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి చుక్క రాజశేఖర్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం పొన్నం ప్రభాకర్ బర్త్ డే వేడుకల సందర్భంగా తంగళ్ళపల్లి గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన వస్త్రాలను అందజేసిన చుక్క రాజా శేఖర్ అలాగే అనంతరం కేక్ కట్ చేసి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కలకాలం ఆరోగ్యాలతో పిల్లాపాపలతో సు సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించి పొన్నం ప్రభాకర్ గౌడ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని. ఆ దేవుని ప్రార్థించడం జరిగిందని. ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. ఏఎంసి. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్. నేరెళ్ల నర్సింగ్ గౌడ్. జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి. జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మునిగేల రాజు. జిల్లా కాంగ్రెస్ సెక్రెటరీ సత్తు శ్రీనివాస్ రెడ్డి తంగళ్ళపల్లి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశాంత్ సిరిసిల్ల అసెంబ్లీ సోషల్ మీడియా ఇన్చార్జి గుగ్గిళ్ల వినయ్ గౌడ్ భరత్. తంగళ్ళపల్లి మాజీ సర్పంచ్ ఆసాని సత్యనారాయణ రెడ్డి. దుగ్గిళ్ల భరత్. ఎడ్ల తిరుపతి. గణాధి కిషన్. పెద్దూరి తిరుపతి. మచ్చ శ్రీనివాస్. సుద్దాల శ్రీనివాస్. రాపల్లి ఆనందం. సుద్దాల కరుణాకర్. ముక్క శ్రీనివాస్. బంటి పరశురాం బై రీ రమేష్. బొద్దుల రాజేష్. పయ్యావుల శ్రీనివాస్. విజయ్. భాగ్యలక్ష్మి. శోభ. కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు. పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

మంత్రి పొన్నం ప్రభాకర్ బర్త్డే వేడుకలు…

మండేపల్లి ప్రభుత్వ వృద్ధాశ్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ బర్త్డే వేడుకలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి ప్రభుత్వ వృద్ధాశ్రమంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండేపల్లి ప్రభుత్వ వయో ముద్దుల సమక్షంలో రాష్ట్ర రవాణా. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ వృద్ధులచే కేక్ కటింగ్ చేయించి వారికి పండ్లు పంపిణీ చేయడం జరిగిందని సోషల్ మీడియా కోఆర్డినేటర్ తెలిపారు భవిష్యత్తులో అన్ని రంగాలపై దృష్టి సారించి మంత్రి పొన్నం ప్రభాకర్ పనిచేస్తున్నారని రాష్ట్ర అభివృద్ధికి అవిశ్రాంతంగా పనిచేస్తున్న ఆయన పనితీరు ప్రశంసనీయమని కొనియాడుతూ పొన్నం ప్రభాకర్ కి దీర్ఘాయుష్ ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎగుర్ల ప్రశాంత్. నరేష్. శ్యామ్. వేణు. శ్రీకాంత్. జ్యోతి. మౌనిక. అనిత. జ్యోతి . కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

వివాహా వేడుకలలో ఎమ్మెల్యే మేఘారెడ్డి.

వివాహా వేడుకలలో ఎమ్మెల్యే మేఘారెడ్డి

వనపర్తి నేటిధాత్రి :

 

వనపర్తి ఎమ్మెల్యే తూడి
మేఘారెడ్డి గురువారం వివాహా వేడుకలకు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు
.ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, మాజీ జెడ్పిటిసి గోల్ల వెంకటయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్, తదితరులు పాల్గొన్నారు*

ఘనంగా విలేకర్ జన్మదిన వేడుకలు.

ఘనంగా విలేకర్ జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఝరాసంగం మండలంలోని కంబాలపల్లి గ్రామానికి చెందిన జహీరాబాద్ నియోజకవర్గం రిపోర్టర్ నగేష్ జన్మదిన వేడుకలను వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిల్ జహీరాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు జానారెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చిట్టెపల్లి బాలరాజ్ పాల్గొని విలేఖర్ నాగేష్ ను శాలువాతో సన్మానించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుని కోరుకున్నట్టు తెలిపారు. రిపోర్టర్లకు తమ వంతు సహకారం ఎల్లవేళల అందిస్తానని హామీ ఇచ్చారు. తన కూతురు జ్యురి లియోనా జన్మదినం కూడా ఉండడంతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా జహీరాబాద్ యూనియన్ ప్రెసిడెంట్ జానారెడ్డి మాట్లాడుతూ… ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ ఝరాసంగం మండల అధ్యక్షుడు నర్సింలు, జర్నలిస్ట్ ప్రవీణ్ కుమార్, జర్నలిస్ట్ అనిల్ కుమార్, జర్నలిస్టు ఎర్రోళ్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

శ్రీ జగద్గురు రేవణ సిద్దేశ్వర స్వామి చండికాంబ మాత జయంతి ఉత్సవాలు.

శ్రీ జగద్గురు రేవణ సిద్దేశ్వర స్వామి చండికాంబ మాత జయంతి ఉత్సవాలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 


శ్రీ జగద్గురు రేవణ సిద్దేశ్వర స్వామి చండికాంబ మాత సమేత జయంతి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ధ్వజారోహణం,శిఖర పూజ, కార్యక్రమాలు నిర్వహించారు ఇట్టి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు

 

Mata Jayanti celebrations.

 

శ్రీ చంద్రశేఖర శివచార్య మహాస్వామి బెమల్ ఖేడ్, బసవలింగ అవధూత గిరి మహరాజ్ , మాతృశ్రీ మఠం శివలీలమ్మ, రాచయ్య స్వామి, కేతకీ టెంపుల్ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, మాజీ ఎంపిటిసి శంకర్ పాటిల్, సిద్దయ్య స్వామి, నాగరాజ్ పటేల్,లింగం గౌడ్ , ఈశ్వరప్ప పాటిల్, తదితర భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఘనంగా గండ్ర వెంకట రమణారెడ్డి పుట్టినరోజు వేడుకలు.

ఘనంగా గండ్ర వెంకట రమణారెడ్డి పుట్టినరోజు వేడుకలు

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండల కేంద్రంలో ఘనంగా గండ్ర వెంకటరమ ణారెడ్డి జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ నాయకులు మండ ల కేంద్రంలో భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత, ప్రజానా యకుడు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది.

బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్ రెడ్డిమరియు మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి ఆధ్వ ర్యంలో కూడలి వద్ద కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

 

Gangula Manohar Reddy.

 

 

అనంతరం గవర్న మెంట్ హాస్పిటల్ కి వెళ్లి రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

 

ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ మాజీ శాసన సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి ఆయురా రోగ్యాలతో ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఆకాంక్షించారు.

Gangula Manohar Reddy.

ఈ కార్యక్ర మంలో మాజీ వైస్ ఎంపీపీ వంగల నారాయణరెడ్డి, సీనియర్ నాయకులు లక్ష్మా రెడ్డి, మండల సోషల్ మీడి యా కన్వీనర్ దాసి శ్రావణ్ కుమార్, మండల యూత్ అధ్యక్షులు మారేపల్లి మోహన్, గ్రామ శాఖ అధ్యక్షులు గాదె రాజేందర్, మేకల వెంకటే శ్వర్లు,సవాసి రమేష్, చల్లా శ్రీనివాస్ రెడ్డి, పసుల ప్రవీణ్, చిలుకయ్య, పిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు మేకల శ్రీనివాస్, మాజీ సర్పంచులు వలపదాస్ చంద్రమౌళి, బొమ్మ కంటి సాంబయ్య, రఘుపతి రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ మారపల్లినందం, గడిపే విజయ్, ధైనంపల్లిసుమన్, పోతురమణారెడ్డి సావుళ్ళ కిష్టయ్య, నర్రరాజు, ఆకుల లక్ష్మణ్, కల్వాలశ్యామాజీ, అట్లతిరుపతి, రంగుమహేం దర్,కొమ్ముల రాకేష్,కరుణ్ బాబు, పైండ్లభానుచందర్, పైండ్లశంకర్, ఫైండ్లశ్రీనివాస్, కోగీలరవికిరణ్, కుతాటి రమేష్, మామిడి శంకర్, ప్రశాంత్, ఆదిరెడ్డి, నారాయణ రెడ్డి, రామరాజు, రమేష్ , మొగిలి,సుభాష్, వైద్యుల సాం బరెడ్డి, మస్కే సుమన్ , నాగరాజు ,దేవయ్య,రేణికుం ట్ల సంతోష్ ,కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా కాకులమర్రి లక్ష్మణ్ బాబు పుట్టినరోజు వేడుకలు.

ఘనంగా కాకులమర్రి లక్ష్మణ్ బాబు పుట్టినరోజు వేడుకలు

మంగపేట నేటి ధాత్రి

 

 

మంగపేట మండలంలో శ్రీ కాకులమర్రి లక్ష్మణ్ బాబు పుట్టినరోజు సందర్బంగా మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో శివాలయం లో ప్రత్యేక పూజలు చేసి అనంతరం కస్తూరిబాయి వృద్ధాశ్రయంలో కేక్ కట్ చేసి పండ్లు స్వీట్ పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ,జిల్లా నాయకులు కాకులమర్రి ప్రదీప్ రావు, తాటి కృష్ణ, పి ఎ సి ఎస్ చైర్మన్ తోట రమేష్, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్ ,మండల సీనియర్ నాయకులు చిట్టీమల్ల సమ్మయ్య,వాలీబాబా, తడూరి రఘు ,మల్లూర్ దేవస్థాన చైర్మన్ నూతిలకంటి ముకుందం, మేడారం మాజీ ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ చిలకమర్రి రాజేందర్, పి ఏ సి ఎస్ వైస్ చైర్మన్ కాడబోయిన నరేందర్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బడిశా నాగరమేష్, పి ఎ సి ఎస్ డైరెక్టర్ సిద్ధంశెట్టి లక్ష్మణ్ రావు ,జిల్లా మహిళా నాయకురాలు కొమరం ధనలక్ష్మి, మండల నాయకురాలు పార్వతి, అన్ని గ్రామ కమిటీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు యూత్ నాయకులు సోషల్ మీడియా వారియర్స్, వివిధ హోదాలో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ,

ఘనంగా ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

ఘనంగా ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

రామకృష్ణాపూర్ పట్టణంలోని ఐఎన్టియుసి కార్యాలయంలో ఐఎన్టియుసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సంఘం సభ్యులు జెండా ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. కనీస వేతనాల బోర్డు చైర్మన్, ఐఎన్టియుసి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించినట్లు సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తేజావత్ రాంబాబు, ఐఎన్టియుసి సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంఘ బుచ్చయ్య, ఏరియా సెక్రెటరీ బత్తుల వేణు, సిహెచ్పి ఫిట్ సెక్రటరీ రాములు, సివిల్ ఫిట్ సెక్రటరీ గుర్రం శ్రీనివాస్, కాసర్ల ప్రకాష్ ఐ ఎన్ టి యు సి నాయకులు పాల్గొన్నారు.

ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రెటరీ జన్మదిన వేడుకలు.

ఘనంగా ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అజీమ్ జన్మదిన వేడుకలు

మెట్ పల్లి: మే 2 నేటిదాత్రి

 

టీయూడబ్ల్యూజే(ఐజేయు) ప్రింట్ మీడియా మెట్ పల్లి ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అజీమ్ పుట్టినరోజు వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మహమ్మద్ అజీమ్ పుట్టినరోజు సందర్భంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశారు. అనంతరం ప్రెస్ క్లబ్ సభ్యులు ప్రెస్ క్లబ్ కార్యాలయంలో శాలువాతో ఘనంగా సన్మానించి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీ యూ డబ్ల్యూ జే (ఐ జే యూ) ప్రింట్ మీడియా అధ్యక్షులు బూరం సంజీవ్, గౌరవ అధ్యక్షుడు ఆగ సురేష్,ఉపాధ్యక్షులు జంగo విజయ్, సాజిద్ పాషా,
కోశాధికారి ఎస్.కె మక్సుద్
సహాయ కార్యదర్శి
పింజరి శివ,ఆర్గనైజింగ్ సెక్రటరీ ,ఎం.డి సమియోద్దీన్ , కార్యవర్గ సభ్యులు,మహమ్మద్ అఫ్రోజ్ ,పానిగంటి మహేందర్,
కుర్ర రాజేందర్ , కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు కుతుబుద్దీన్ పాష, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

-పాలకుర్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మే డే సంబరాలు.

-పాలకుర్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మే డే సంబరాలు

జర్నలిస్టుల హక్కులకై సమిష్టిగా పోరాడుదాం

 

పాలకుర్తి నేటిధాత్రి

 

ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని పాలకుర్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మేడే వేడుకలను నిర్వహించి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కార్యదర్శి చెరిపెల్లి అశోక్ మహర్షి (ఎస్6 న్యూస్ ) మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను వెలికితీస్తున్న క్రమంలో ప్రభుత్వాల కుట్రలకు బలైపోయిన కలం కార్మికులకు నివాళులర్పిస్తూ కలం కార్మికుల స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. జర్నలిస్టు యోధులు షేక్ బందగీ, ఎన్ కౌంటర్ దశరథ రామ్, గౌరీ లంకేష్, ల ఆశయాలను కొనసాగించాలని కోరారు. కలం కార్మికుల హక్కుల కోసం సమిష్టిగా ఉద్యమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు బండిపెల్లి మధు (జర్నలిస్టు సూర్య), ప్రెస్ క్లబ్ కోశాధికారి కొత్తకొండ వాసు (బెస్ట్ వాయిస్ రిపోర్టర్), కార్యవర్గ సభ్యులు కమ్మగాని నాగన్న (పయనించే సూర్యుడు), గజ్జి సంతోష్ కుమార్ ( నేటి దిన పత్రిక సూర్య ), వన్నాల ధనుంజయ (నేటిధాత్రి), అబ్బోజు యాక స్వామి (ఐ న్యూస్), సీనియర్ జర్నలిస్ట్ చిట్యాల మధు (నమస్తే తెలంగాణ) పాల్గొన్నారు.

నందనంలో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు.

నందనంలో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు
గ్రామ లారీ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక

నేటిధాత్రి ఐనవోలు :-

 

 

ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా అయినవోలు మండలం నందనంలో కార్మికులు కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ నెత్తురును చెమటగా మార్చి అవరోధాలను అభివృద్ధికి మెట్లుగా మార్చుతూ దేశ అభివృద్ధికి వారదులుగా నిలుస్తున్న కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం కార్మికుల దినోత్సవం సందర్భంగా ఎర్ర జెండాలు ఆవిష్కరిస్తూ సంబరాలు చేసుకున్నారు. అలాగే గ్రామంలో లారీ యజమానులు డ్రైవర్స్ అంతా కలిసి తమకంటూ ఒక యూనియన్ ఉండాలని గురువారం లారీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక జరిగింది.లారీ యూనియన్ అధ్యక్షుడుగా బర్ల బలరాం ఉపాధ్యక్షులు ఇసురం అనిల్ ప్రధాన కార్యదర్శి యాకర లక్ష్మణ్ కార్యదర్శి బర్ల భాస్కర్ పోశాధికారి ఆకులపల్లి భాస్కర్ సలహాదారుడు బర్ల నాగరాజ్ సలహాదారుడు బర్ల రవి లు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు తమ ఎన్నికకు సహకరించిన యజమానులకు డ్రైవర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దోమకొండ ఏరియా ఆకులపల్లి అశోక్ యాకర కుమార్ దోమకొండ రాజ్ కుమార్ యాకర నరహరి ఇస్రం రఘు యాకర రాజేందర్ తదితరులు పాల్గొన్నారు

పరకాల వ్యవసాయ మార్కెట్లో ఘనంగా మేడే వేడుకలు.

పరకాల వ్యవసాయ మార్కెట్లో ఘనంగా మేడే వేడుకలు

జెండా ఆవిష్కరించిన లంక దాసరి అశోక్

పరకాల నేటిధాత్రి

 

కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఏఐటియూసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లంకదాసర అశోక్ జెండా జెండా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాగల శంకర్,శ్రీపతి కుమారస్వామి,కోట యాదగిరి,మోర రవి,దొగ్గేలా బాబు,ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి పల్లె గ్రామంలో జండా విష్కరణ

కామారెడ్డిపల్లి గ్రామంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అధ్యక్షులు శ్రీపతి రాజు జెండా ఆవిష్కరణ చేసారు. ఈ కార్యక్రమంలో కొయ్యడా శంకర్,తిక్క శ్రీనివాస్,అలాగే గౌరవ అధ్యక్షులు తిక్క రమేష్ బాబు,ఆటో యూనియన్ అధ్యక్షులు శ్రీపతి ఐలయ్య,అమాలి కార్మిక సభ్యులు మేకల రాజయ్య,కొయ్యడ రాజయ్య,కొయ్యడ చిన్న భద్రయ్య,కొయ్యడ శంకర్రావు,కొయ్యడా శోభన్,మామిడి జగన్,రేణిగుంట్ల రాజయ్య,రేణిగుంట్ల రాజు,నాగేల్లి శంకర్,తిక్క కుమారస్వామి,సప్పిడి సాంబయ్య,కొడపాక చిరంజీవి,అనుమకొండ సదయ్య తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఆర్కేపి లో “మే” డే వేడుకలు.

ఘనంగా ఆర్కేపి లో “మే” డే వేడుకలు…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

రామకృష్ణాపూర్ పట్టణంలో 139వ మే డే వేడుకలు ఘనంగా జరిగాయి.చారిత్రాత్మక మేడే ఆవిర్భావ నేపథ్యాన్ని ఈ సందర్భంగా స్మరించుకుని వారి త్యాగాలకు పలువురు కార్మిక సంఘ నాయకులు, రాజకీయ నాయకులు ఘన నివాళులర్పించారు. సిపిఐ కార్యాలయం ఆవరణలో అక్బర్ ఆలీ, సిహెచ్పి సమీపంలో ఏఐటియుసి నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో తేజావత్ రాంబాబు, పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, సీఐటియు కార్యాలయం ఆవరణలో పార్టీ నాయకులు సాంబారి వెంకటస్వామి, రామగిరి రామస్వామి, రజక సంఘం కార్యాలయం ఆవరణలో అధ్యక్షుడు నడిగోట తిరుపతి , సింగరేణి సివిల్ కార్యాలయం సమీపం లో ఐఎన్టీయుసి నాయకులు సంగ బుచ్చయ్య, శ్రీనివాస్ గౌడ్, మేకల రాజయ్య,కాంగ్రెస్ నాయకులు యాకుబ్ ఆలీ, తాపీ మేస్త్రి సంఘం ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు గాండ్ల సమ్మయ్య, అధ్యక్షులు జిలకర రాయమల్లు లు జెండాలు ఎగరవేసి మే డే దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version