బెల్లంపల్లిలో బీసీ రిజర్వేషన్ బందుకు సిపిఐ మద్దతు…

బీసీ సంఘాలు తలపెట్టిన ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర బంధుకు సిపిఐ బెల్లంపల్లి పట్టణ సమితి సంపూర్ణ మద్దతు.

బెల్లంపల్లి నేటిధాత్రి :

 

బెల్లంపల్లి పట్టణ కార్యాలయం బాసెట్టి గంగారం విజ్ఞాన్ భవన్ లో బెల్లంపల్లి పట్టణ సిపిఐ, బీసీ హక్కుల సాధన సమితి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి మాట్లాడుతూ
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ రాకుండా రెడ్డి సామాజిక వర్గం బీజేపీ అడ్డుపడటం తగదు. రెడ్డి సామాజిక వర్గం హైకోర్టులో వేసిన పిటిషన్ వాపస్ తీసుకుని
హైకోర్టు స్టేను వెంటనే రద్దు చేయించి
బిసి లకు 42 శాతం రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు నిర్వహించా దానికి దోహదపడాలి.
బీసీ సంఘాలు ఈ నెల 18 వ తేదీన తలపెట్టిన తెలంగాణా బంద్ కు బెల్లంపల్లి పట్టణ భారత కమ్యూనిస్టు పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తుంది.
పార్లమెంటులో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తున్నట్లుగా వెంటనే చట్టాన్ని చేయాలి .
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విధంగా జీవో9ను తీసుకొచ్చి షెడ్యూల్ను ప్రకటించినా, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ప్రభుత్వం ఆమోదించనందున స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయినాయని, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తున్నట్లుగా చట్టం తీసుకొచ్చి బీసీలకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కేంద్రము లో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కేవలం మతతత్వ రాజకీయాలను అనుసరిస్తూ, అగ్రవర్ణాలకే పెద్ద పీట వేస్తూ, బీసీలను విస్మరిస్తోందని వారు అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించినా, కేంద్ర ప్రభుత్వం వల్ల ఆగిపోయిందని కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం *9వ షెడ్యూల్ ప్రకారం చట్టాన్ని చేసి బీసీలు కూడా ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం కల్పించాలని వారు కోరారు.బీసీలను ఇంకెన్నాళ్లు వెనకబడేస్తారని వారిని కూడా రాజకీయంగా ఎదిగే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈనెల 18 జరుపు తలపెట్టిన బందును విజయవంతం చేయడానికి వ్యాపార వర్గాలు, ఆర్టీసీ బస్సులు, బ్యాంకులు, ఆటోలు, సినిమా హాలు అన్ని వర్గాలు సహకరించగలరని కోరుతున్నాము.
ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి బొల్లం తిలక్, జిల్లా సమితి సభ్యులు రత్నం రాజన్న ,మేకల రాజేశం ,పట్టణ కార్యవర్గ సభ్యులు బియ్యాల ఉపేందర్, బొంకురి రామచందర్, పులిపాక స్వామి దాస్.
తదితరులు పాల్గొన్నారు ,

బీసీ రిజర్వేషన్ లపై బంద్ కు సిపిఐ పార్టీ సంపూర్ణ మద్దత్తు….

బీసీ రిజర్వేషన్ లపై బంద్ కు సిపిఐ పార్టీ సంపూర్ణ మద్దత్తు.

◆:- జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలుద్దీన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

బీసీ రిజర్వేషన్ లను అమలు చెయ్యాలని ప్రజలంతా కోరుతున్న సందర్భంలో బీసీ రిజర్వేషన్ లపై హైకోర్టు స్టే ఇవ్వడం తగదని వెంటనే రిజర్వేషన్ లను కల్పించాలని కోరుతూ ఈ నెల 18 నాడు బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన బంద్ లో సిపిఐ జిల్లా శ్రేణులన్నీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చెయ్యాలని సిపిఐ పార్టీ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలుద్దీన్ పిలుపునిచ్చారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ లు అమలు చెయ్యాలని ప్రజలు రాష్ట్రాలు కోరుతుంటే బీజేపీ ప్రభుత్వం నిమ్మకనిరేతినట్లు వ్యవహారిస్తుందని అన్నారు,ఇప్పుడు బీజేపీ అసలు స్వరూపం బయటపడుతుందని అన్నారు. అగ్రవర్ణ కులాల వెనుకబడిన వారికీ ఏ రాష్ట్రం కానీ,ప్రజలు కానీ అడగలేదని,ఎక్కడా ధర్నాలు కానీ నిరసనలు జరగలేదని కానీ బీజేపీ ప్రభుత్వం 10 శాతం కూడా లేనివారికీ 10 శాతం రిజర్వేషన్ లు ఇచ్చి పార్లమెంట్ లో అమోదింప చేసుకొని సుప్రీమ్ కోర్టు విధించిన 50 శాతం పరిమితి కూడా మించిపోయిందని,ఇది బీజేపీ కి అగ్రవర్ణాలకు ఇచ్చే సహకారమని అగ్రవర్ణాల పై చూపుతున్న ప్రేమ బీసీలపై చూపుతున్న వివక్షత కనబడుతుంది అన్నారు కానీ బీసీ లు అడిగితే మాత్రం చెయ్యట్లేదని ఇప్పటికైనా బీజేపీ నాటకాలు మానేసి బీసీ బిల్లును పార్లమెంట్ లో అమోదించాలని లేకపోతే ఒక విషయం మాత్రం బిజెపి గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ఉద్యమానికి పురిటి గడ్డ దేశంలోనే తెలంగాణకు ఉద్యమాలు నిర్మించిన చరిత్ర కలదు నిజాం నుంచి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి ప్రత్యేక తెలంగాణ ఇలాంటి పోరాటాలు నిర్వహించిన చరిత్ర తెలంగాణకు కలదు. ఇలాంటి పోరాటాలు బీసీ ఇల్లు కోసం ఉధృతం కాకముందే కేంద్ర ప్రభుత్వం బిసి బిల్లు ఆమోదించాలని లేనిపక్షంలో బీజేపీ ని రానున్న ఎన్నికల్లో తిరస్కరిస్తారని అన్నారు.బీసీ రిజర్వేషన్ లు అమలు అయ్యేంత వరకు సిపిఐ పార్టీ కార్యకర్తలు పోరాటాలకు నాయకత్వం వహించాలని కోరారు.

తోట సుధాకర్ కు పలువురి పరామర్శ…

తోట సుధాకర్ కు పలువురి పరామర్శ

నడికూడ,నేటిధాత్రి:

 

 

టియూడబ్ల్యూజేే జిల్లా ప్రధాన కార్యదర్శి,ప్రజాపక్షం ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యూరో ఇంచార్జ్ తోట సుధాకర్ మాతృమూర్తి తోట వెంకటమ్మ ఇటీవల మృతి చెందగా గురువారం పలువురు సుధాకర్ తో పాటు వారి కుటుంబ సభ్యులను పలువురు పరామర్శించారు.ఈ సందర్భంగా హవ్రాను జిల్లా నడికూడ మండలం చౌటుపర్తి గ్రామానికి చేరుకుని తొలుత తోట వెంకటమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వెంకటమ్మ చిత్ర పటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో సీపీఐ,బీసీ హక్కుల సాధన సమితి నాయకులు, జర్నలిస్టు నాయకులు ఉన్నారు.పరామర్శించిన వారిలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి,బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్రంలో కార్యదర్శి ఎన్. రాజమౌళి,వరంగల్ జిల్లా నాయకులు పనాస ప్రసాద్, ల్యాదెళ్ల శరత్,సీనియర్ జర్నలిస్టులు ఎస్.శోభన్ బాబు,వెంకట్,మారుతి, ముత్యాల రఘు, కనకరాజు,పి.కిషోర్ కుమార్,టి.రజినీకాంత్,జిల్లా కార్యవర్గ సభ్యులు తాళ్ల రవి తదితరులు ఉన్నారు.

పదిఏళ్లలో బీసీలకోసం బిఆర్ఎస్ ఏం చేసింది…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-10T133534.280.wav?_=1

 

పదిఏళ్లలో బీసీలకోసం బిఆర్ఎస్ ఏం చేసింది.?
మొగుళ్లపల్లి కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రం లో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్ మాట్లాడుతు బి ఆర్ఎస్ పార్టీ పదిఏండ్లు అధికారంలో ఉండి.. బీసీ రిజర్వేషన్ల మీద కనీసం బిల్లు కూడా పాస్ చేయించుకోలేదు టిఆర్ఎస్ పార్టీ..?
బి ఆర్ఎస్ నాయకులంతా గొప్ప గొప్ప మేధావులు..
బిల్లు ఎలా పెట్టాలో తెలుసు..
ఆర్డినెన్సులు ఎలా తీసుకు రావాలో తెలుసు..
కేంద్రంతో ఎలా కోట్లాడలో తెలుసు.. అంటున్నారు..
మరి ఇన్ని తెలిసి పదేండ్లు అధికారం లో ఉండి.. బిసిల పట్ల మీరు చూపించిన నీతి ఏంటి?

నీతులు ప్రతి ఒక్కడూ చెప్తాడు.. ఆట ఆడే వాడికి తెలుసు ఎలా ఉంది పరిస్థితి అని.
దేశం లో, స్వాతంత్రం నుంచీ.. పేదల పట్ల చట్టాలు చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ నే..
బిసి రిజర్వేషన్ల బిల్లు కూడా సాధించి తీరుతుంది.*
తెలంగాణ కోసం ఎన్నాళ్లు కోట్లాడితే తెలంగాణ వచ్చింది? అడగగానే తెలంగాణ ఇచ్చారా? ఎన్నో ఏండ్లు కోట్లాడితే వచ్చింది తెలంగాణ.. అది ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే..!!
బీసీ బిల్లు కూడా అంత సులువైన వ్యవహారం కాదు..!
కాంగ్రెస్ పోరాడుతుంది.. సాధిస్తుంది..!
బి ఆర్ఎస్ కి బీసీ ల పట్ల అంత చిత్తశుద్ధి ఉంటే పందేడ్లలో ఏనాడైనా బీసీ ల కోసం ఏమైనా చేసిందా? చెప్పండి..
కనీసం బి ఆర్ఎస్ నుంచి ఒక్కటంటే ఒక్క నాయకుడు కూడా ఇంప్లీడ్ పిటిషన్ వెయ్యలేదు బీసీ రిజర్వేషన్ల కేసులో..
నీతులు ప్రతి ఒక్కడూ చెప్తాడు..
బి సి రిజర్వేషన్లు మాత్రం కాంగ్రెస్ ద్వారానే సాధ్యం..అవుతుంది.!! స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకున్న జీవో నెంబర్ స్టే హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో బిజెపి టీఆర్ఎస్ పై ప్రజలు మండి పడుతున్నారని బిల్లు ఆపడంలో వారి కుట్ర స్పష్టంగా కనిపించిందని కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ క్యాత రాజు రమేష్ విలేకరులకు కాంగ్రెస్ పార్టీవివరించారు బీసీ రిజర్వేషన్ బిల్లును ఆపింది బిజెపి ప్రభుత్వం కాదా? రిజర్వేషన్ 50% మించకుండా చట్టం చేసింది బిఆర్ఎస్ కాదా? అని ప్రశ్నించారు ఇక్కడ రెండు పార్టీలు కుట్ర స్పష్టంగా కనబడుతుందని అదంతా ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుంది..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-8-1.wav?_=2

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుంది

బిఆర్ఎస్ సేన రాష్ట్ర అధ్యక్షులు
వెంగని మనోహర్

సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రం లోని ప్రెస్ క్లబ్ లో బిఆర్ఎస్ సేన రాష్ట్ర అధ్యక్షులు వెంగని మనోహర్ మాట్లాడతూ.. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి పాదయాత్రలో కులగణన 42 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసినదే, కానీ నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుల గణన అనే పేరుతో బీసీ బిడ్డలను మోసం చేస్తూ గద్దెన ఎక్కి కూర్చొని నేడు బీసీలకు విద్యా, వైద్యం, ఉపాధి కల్పనలో వెనుక అడుగు వేసేలా చూస్తుందని అంతేకాకుండా ఏదో ఒక బీసీ కుల గణన అని రాష్ట్రవ్యాప్తంగా చిన్న సర్వే చేపట్టి, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరియు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రెండు ఒక్కటై బీసీలను మోసం చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో శీలం స్వామి, నందగిరి భాస్కర్ గౌడ్,
మెరుగు తిరుపతి, నెమలికొండ భాస్కర్, కురుమని ప్రశాంత్, బొట్టుకు అజయ్,పీట్ల విన్న బాబు, అమర కొండ కృష్ణ, తదితర బిఆర్ఎస్ నాయకులు, పలు కార్యకర్తలు పాల్గొన్నారు.

బీసీలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీయే.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-06T155906.015.wav?_=3

 

బీసీలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీయే.

బీసీలకు రిజర్వేషన్ లు ఇవ్వాల్సిందే.

రిజర్వేషన్ పెంపునకు పోరాటం చేస్తాం.

ఎమ్మెల్యేలు.. జనంపల్లి అనిరుద్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

మహబూబ్ నగర్ /నేటి ధాత్రి.

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల జనంపల్లి అనిరుద్ రెడ్డి పునరుద్ఘాటించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో.. చేపట్టిన పోరు బాట మహాధర్నాలో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసిన సందర్భంగా..

 

 

బడుగు బలహీన వర్గాల ప్రజల స్థితిగతులను స్వయంగా ఆయన గమనించారని, వారికి విద్య , ఉద్యోగ, ఉపాధి అవకాశాలే కాకుండా చట్టసభల్లో సైతం రిజర్వేషన్లు అవసరమని ఆయన భావించారని అందుకే కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మెనిఫెస్టో లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని హామి ఇచ్చామని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ అమలు చేసి వారికి రాజ్యాధికారం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కుల గణన చేయించి, నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి, వారితో చర్చించి, అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టి, బీసీలకు రిజర్వేషన్ ఆవశ్యకత పైన చర్చించి , అన్ని పార్టీలు ఏకగ్రీవంగా బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించి, కేంద్రానికి పంపించామని‌ , కేంద్రంలో ఉన్న బిజేపి ప్రభుత్వం బీసీల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని, వారికి విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాలన్నా, వారు చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించాలన్నా రిజర్వేషన్లు అవసరమని ఎంతైనా ఉందని వారు స్పష్టం చేశారు.

బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కమిటీ ఎన్నిక.

బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కమిటీ ఎన్నిక

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

బీసీ హక్కుల సాధన సమితి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రెండో మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు టి వెంకట్ రాములు తెలిపారు అధ్యక్షులుగా భీమనాథుని సత్యనారాయణ ప్రధాన కార్యదర్శిగా వేముల శ్రీకాంత్ సహాయ కార్యదర్శిగా క్యాతరాజు సతీష్ అస్లాం
జిల్లా ఉపాధ్యక్షులుగా మేరుగు రమేష్ గోలి లావణ్య.
జిల్లా కోశాధికారిగా కట్టెగొల్ల భారతి…

 

Election

 

జిల్లా కార్యవర్గ సభ్యులుగా
రమేష్ చారి,మహేష్,పుప్పాల వనిత, సుధాకర్, శేఖర్, అజయ్, భగత్ లను ఎన్నుకున్నట్లు తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version