ప్రగతి స్టేడియంలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్.

ప్రగతి స్టేడియంలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్.

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో కొక్కిరాల రఘుపతి రావు జ్ఞాపకార్థంగా ఎంఎల్ఏ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు యువసేన శ్రీరాంపూర్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. యువకులలో క్రీడా స్ఫూర్తినీ పెంచడంకోసం,మానసిక వికాసం కోసం,స్నేహభావాన్ని పెంపొందించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నస్పూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నూకల రమేశ్,ధర్ని మధు 21 వార్డు ఇంచార్జీ
,మాజీ కౌన్సిలర్లు పుదరీ కుమార్,తెనుగు దేవేందర్,మాజి ఎంపీటీసీ ఎల్పుల రవీందర్,చిలుకా మల్లేష్ వార్డు ఇన్చార్జులు అత్కాపూర్ సతీష్,నియోజక వర్గ యూత్ అధ్యక్షుడు నారిగే నరేష్,అంగిడి ,రాజేష్,ఉప్పల్ రమేష్ మారు మల్లన్న నాగార్జున,ఆర్గనైజర్ భీమిని రాజేష్,కొండే రజినీ కాంత్,గుర్రపు సురేష్,మూట శేఖర్,ప్రదీప్,ప్రశాంత్ తదితర పాల్గోన్నారు

ఓబులాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడి రాజీనామా.

ఓబులాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడి రాజీనామా

మల్లాపూర్ ఏప్రిల్ 18 నేటి ధాత్రి

 

కాంగ్రెస్ పార్టీ కోరుట్ల కాంసెన్సీ ఇంచార్జ్ జువ్వడి నర్సింగ రావు గారు, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను కలుపుకోలేక పోతున్నారు మల్లాపూర్ మండలంలో పది సంవత్సరాలు కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్య కర్తలు తీవ్ర ఆవేదనలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేను గత పది సంవత్సరాలుగా పార్టీ కోసం పైసలు ఖర్చు పెట్టుకున్నాను కష్టపడ్డాను ఫలితంగా నాకు అవమానాలే ఎదురు అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నర్సింగరావు గారు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పట్టించుకోకపోవడంలేదు నిరసన గా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని తెలియపరుస్తున్నాను
పల్లె శేఖర్ ముదిరాజ్.
.

అగ్నిప్రమాదం లో సుద్దాల బుచ్చిరాజు.!

అగ్నిప్రమాదం లో సుద్దాల బుచ్చిరాజు కి చెందిన ఇల్లు పూర్తిగా కాలి పోవడం జరిగింది

నేటి ధాత్రి

 

కథలాపూర్

ఇటీవల ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదం లో సుద్దాల బుచ్చిరాజు కి చెందిన ఇల్లు పూర్తిగా కాలి పోవడం జరిగింది ఇట్టి విషయాన్ని మన ఆపద్బాంధవులు ఫౌండేషన్ కి తెలుపగానే వారు స్పందించి సుద్దాల బుచ్చిరాజు కి ఒక నెలకి సరిపడా నిత్యావసర సరుకులతో పాటు వంట చేసుకోవడానికి బొల్లు, గ్యాస్ స్టవ్, చిరెలు మరియు చేద్దార్లు పంపిణీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో Dr.సతిష్, గంగాధర్, B. తిరుపతి, సాగర్, జలందర్, గంగాధర్, రాజేందర్ వంశీ తదితరులు పాల్గొన్నారు ఇట్టి దాతలకు మరియు ఫౌండేషన్ కి వారి కుటుంబ సభ్యులు మరియు సిరికొండ గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.

మల్లాపూర్ గ్రామానికి చెందిన మృతుడు పుట్ట రాజేష్.

మల్లాపూర్ ఏప్రిల్ 18 నేటి ధాత్రి

 

మల్లాపూర్ గ్రామానికి చెందిన మృతుడు పుట్ట రాజేష్ తండ్రి పోశెట్టి (13సం) తేదీ :18/04/2025 రోజున ఉదయం పూట తన తండ్రికి జ్వరం రావడం వలన తన తండ్రి మేపుతున్న పశువులను మల్లాపూర్ గ్రామ శివారు లింగన్న చెరువు వద్దకి మేపడానికి తీసుకువెళ్లగా అక్కడ చెరువు ఒడ్డుకు మృతుడు ధరించి బట్టలు, చెప్పులు,సర్ది డబ్బకనపడగా ఆచూకీ కొరకు వెతకగా లభించక పోవటంతో శనివారం రోజున ఉదయం చెరువులో నీట మునుగి పైకి తెలినాడు.స్నానం కోసం చెరువులో దిగగా ప్రమాదవశత్తు (లేక) ఈత రాక నీటిలో మునుగి చనిపోయినడని తన తండ్రి పుట్ట పోశెట్టి వెంకటి పిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కే రాజు తెలిపారు.

నీటి సమస్యపై స్పందించిన సింగరేణి అధికారులు..

నీటి సమస్యపై స్పందించిన సింగరేణి అధికారులు..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల అబ్రహం నగర్ ,సర్దార్ వల్లభాయ్ నగర్ ఏరియాలో నివసించే సింగరేణి కార్మికులకు, మంచినీళ్లు అందించేలా సింగరేణి యాజమాన్యం చొరవ తీసుకోవాలని వారం రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ నాయకులు యాకుబ్ ఆలీ సింగరేణి అధికారులను కోరారు. స్పందించిన సింగరేణి అధికారులు శనివారం కల్వర్టులో ఉన్న కొన్ని నీటి పైపులైన్లను తొలగించి నూతన పైప్ లైన్లను ఏర్పాటు చేశారు. నీటి సమస్య ఉందని తెలిపిన వెంటనే స్పందించిన సింగరేణి అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పిటిసి యాకూబ్ అలీ అన్నారు. లింగేశ్వర పాఠశాల నుండి అబ్రహం నగర్ బోర్డ్ వరకు కూడా కొత్త పైప్ లైన్లు వేయాలని సింగరేణి అధికారులను కోరుతున్నామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కి నూతన నీటి పైప్ లైన్ వేయించాలని కోరడం జరిగిందని తెలిపారు.స్పందించిన ఎమ్మెల్యే సింగరేణి అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తామని, కాలనీ వాసుల నీటి అవసరం నిమిత్తం నూతన పైప్లైన్ వేయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం జరిగిందని యాకుబ్ ఆలీ అన్నారు.

జాన్ పాకలో ఎక్సైజ్ దాడులు,ఇద్దరిపై కేసు నమోదు.

జాన్ పాకలో ఎక్సైజ్ దాడులు,ఇద్దరిపై కేసు నమోదు.  

పరకాల నేటిధాత్రి

గుడుంబా నిర్ములన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా శనివారంరోజున పరకాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని జాన్ పాక శివారులో దాడులు నిర్వహించారు.గుడుంబా తయారీ కోసం నిల్వ ఉంచిన 500 లీటర్ల షుగర్ పానకం ను ధ్వంసం చేసి,5 లీటర్ల గుడుంబా,25 కేజీల షుగర్ ను స్వాధీనం చేసుకొని బాదావత్ శ్రీను,బానోత్ సురేష్ ల పై కేసు నమోదు చేసినట్టు సీఐ తాతజీ తెలిపారు.ఈ దాడులలో ఎక్సైజ్ ఎస్ఐ వై.జ్యోతి
సిబ్బంది లక్ష్మణ చారి,రవీందర్,సమ్మయ్య,విజయ్ కుమార్ పాల్గొన్నారు.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

 

నడికూడ,నేటిధాత్రి:

మండలంలోని వివేకానంద గ్రామైక్య సంఘం నర్సక్కపల్లి, కనకదుర్గ గ్రామ ఐక్య సంఘం చర్లపల్లి, సోనియా గ్రామీక సంఘం నార్లాపూర్ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఏపిఎం రమాదేవి,కాంగ్రెస్ పార్టీ నడికూడ మండల అధ్యక్షు డు బుర్ర దేవేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కుడ్ల మలహల్ రావు,పర్నెం మల్లారెడ్డి,సమన్వయ కమిటీ సభ్యులు,సిసి కుమారస్వామి,రైతులు తదితరులు పాల్గొన్నారు.

పోషణ లోపం లేని సమాజాన్ని నిర్మిద్దాం.!

పోషణ లోపం లేని సమాజాన్ని నిర్మిద్దాం- 7 వ రాష్ట్రీయ పోషణ పక్షం

 

నడికూడ,నేటిధాత్రి:

స్వాతి సిడిపిఓ అధ్యక్షతన పరకాల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో నడికూడ మండలంలోని నర్సక్కపల్లి గ్రామంలో జాతీయ పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి
ముఖ్యఅతిథిగా జిల్లా సంక్షేమ అధికారి జెట్టి జయంతి హాజరై మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్లో ముఖ్యంగా నిర్వహించే కార్యక్రమాలు మొదటిది ఆరోగ్య లక్ష్మి, రెండవది ప్రీస్కూల్,మూడోది లోపోషణతో బాధ పడే పిల్లల పోషణస్థితిని మెరుగుపరిచే విధంగా అంగన్వాడి టీచర్స్ పని చేయాలని సూచించారు. పోషణ పక్షంలో భాగంగా ఏప్రిల్ 8 నుండి 22 వరకు ప్రతి గ్రామంలో పోషణ కార్యక్రమాలు నిర్వహించి పోషణ లోపం లేని సమాజం నిర్మించేలా కృషి చేయాలన్నారు.గర్భిణీలు, బాలింతలు అంగన్వాడి కేంద్రాల ద్వారా అందించే ఒక్కపూట భోజనం సద్వినియోగం చేసుకోవాలి, పౌష్టిక ఆహారం తీసుకుంటేనే పుట్టే పిల్లలు ఆరోగ్యవంతంగా పుడతారన్నారు.ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీల కు శ్రీమంతాలు,6 నెలలు నిండిన పిల్లలకి అన్నప్రాసనలు,అంగన్వాడి పూర్వ ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న
చిన్నారులకు గ్రాడ్యుయేషన్
డే,చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పరకాల తహసిల్దార్ టి. విజయలక్ష్మి,నడికూడ తహసిల్దార్ నాగరాజు, నడి కూడ మండల వైద్యాధికారి కే దివ్య,ఎంపీడీవో నడికూడ విమల,సఖి అడ్మిన్ హైమావతి,పోషణ అభియాన్ డిస్టిక్ కోఆర్డినేటర్ సుమల డిహెచ్ఈడబ్ల్యు కోఆర్డినేటర్ కళ్యాణి,ఐసిడిఎస్ సూపర్వైజర్లు శ్రీదేవి, హేమలత,పుణ్యవతి,రోజా రాణి,మంజుల,సునీత,రాణి, నజీమ,పర్వీన్,ఉమాదేవి, పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ బిక్షపతి,జిల్లా బాలల పరిరక్షణ విభాగం విజయకుమార్,అంగన్వాడీ టీచర్స్,ఆశ వర్కర్స్,గర్భిణీ స్త్రీలు,పిల్లలు మొదలగు వారు పాల్గొన్నారు.

కోట్లతో వాటర్ షెడ్ల నిర్మాణం: మంత్రి.

కోహిర్: 10. 50 కోట్లతో వాటర్ షెడ్ల నిర్మాణం: మంత్రి

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

10. 50 కోట్లతో వాటర్ షేట్ల నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. కోహిర్ మండలం పీచే రాగడి గ్రామంలో వివిధ అభివృద్ధి పనులను శనివారం ప్రారంభించారు. మహిళా సంఘాలకు 1. 56 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. ఉన్నత పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు కేటాయిస్తారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కార్ పాల్గొన్నారు.

ఉద్యమకారుల ప్లీనరీ పోస్టర్ ఆవిష్కరణ.

ఉద్యమకారుల ప్లీనరీ పోస్టర్ ఆవిష్కరణ

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

ఈనెల 21 వ తేదీన హైదరాబాద్ లో జరుగబోయే ఉద్యమకారుల ప్లీనరీ కి ఉద్యమకారులందరూ హాజరు కావాలని కోరుతూ కేసముద్రం మండల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో శనివారం కేసముద్రం పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పి.సి.సి. సభ్యులు గుగులోత్ దస్రూ నాయక్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారులందరికీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫేస్టోలో ఇచ్చిన హామీలన్నింటిని తప్పకుండా నెరవేరుస్తుందని అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షులు చాగంటి కిషన్ మాట్లాడుతూ ఉద్యమంలో అమరులైన ఉద్యమకారుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించి, 10 లక్షల పరిహారం అందించి ఆదుకోవాలని, ఉద్యమకారులందరికీ మండల కేంద్రంలో నివాస స్థలం కేటాయించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని గుర్తింపు కార్డులు ఇవ్వాలని నెరకు 25000 పింఛను ఇవ్వాలని మనవి చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉద్యమకారుల ఫోరం మండల ప్రధాన కార్యదర్శి షేక్ ఖాదర్, కోశాధికారి దామరకొండ ప్రవీణ్ కుమార్, కేసముద్రం స్టేషన్ మాజీ సర్పంచ్ భట్టు శీను, విద్యార్థి, యువజన జెఎసి పూర్వ కన్వీనర్ దండు శ్రీనివాస్, కొలిపాక వెంకన్న, చిట్యాల వీరన్న, బాలు మోహన్, వేం నరసింహారెడ్డి, సోమారపు వెంకటయ్య, జనిగల పరమేశ్వర్, మాందాటి ఆంజనేయులు, షేక్ యాకుబ్ అలీ, గుగులోత్ సునీత, నాగరబోయిన చంద్రకళ పాల్గొన్నారు.

దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం.

దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం. 

దమ్మాయిగూడ నేటి ధాత్రి

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా

దమ్మాయిగూడ మున్సిపల్ సిబ్బందికి గత రెండు నెలలు గా జీతాలు రానందున ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు పక్కన ఉన్న నాగారం మున్సిపాలిటీ ఫిబ్రవరి జీతాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ దమ్మైగూడలో ఎందుకు ఇవ్వడం లేదు అని మున్సిపల్ సిబ్బంది ప్రశ్నించడం జరిగింది వారికీ మద్దతుగా బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ కు విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి తక్షణమే చేర్యా తీసుకోవాలని కోరడం జరిగింది లేనిపక్షంలో సోమవారం నాడు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి నాయకులు నాగారం మాజీ చైర్మెన్ కౌకుట్ల చెంద్రారెడ్డి,( బి ఎం ఎస్ ) నాయకులు రాము, మోర నాగమల్లా రెడ్డి, సామల భరత్ రెడ్డి , డొంకెన రవీందర్ గౌడ్, రామిడి బాపి రెడ్డి, మహిళా మోర్చా మునిసిపల్ అధ్యక్షురాలు రోత్తమ్ ప్రశాంతి, దాసరి సరెండర్ రెడ్డి, దసారం సతీష్ కుమార్, కే కుమార్, జరిపిటి ఆంజనేయులు, తడుక కృష్ణ, సాయికృష్ణ చారీ, చక్రపాణి, ర్ సురేష్, మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

మినిస్టేడియంలో కొనసాగుతున్నకబడ్డీ రెజ్లింగ్ క్రీడలశిక్షణ.

మిని స్టేడియంలో కొనసాగుతున్న కబడ్డీ,రెజ్లింగ్ క్రీడల శిక్షణ

నర్సంపేట,నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లా యువజన,క్రీడల అధికారిని టీవీఎల్ సత్యవాణి ఆధ్వర్యంలో నర్సంపేట మిని స్టేడియంలో కబడ్డీ ఇంచార్జ్ కోచ్ యాట రవికుమార్ ముదిరాజ్, రెజ్లింగ్ ఇంచార్జ్ కోచ్ సిరపురపు మహేశ్ శిక్షణలో ప్రతిరోజు ఉదయం 5:30 గంటల నుండి 7:30 గంటల వరకు సాయంత్రం 5:30 గంటల నుండి 7:30 గంటల వరకు బాల బాలికలకు కబడ్డీ,రెజ్లింగ్ క్రీడల శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి.

Kabaddi

ఈ శిక్షణలో పాల్గొనే విద్యార్థులు ప్రతిరోజు ఉదయం,సాయంత్రం మిని స్టేడియం నర్సంపేటలో జరిగే కబడ్డీ,రెజ్లింగ్ క్రీడల శిక్షణకు హాజరై శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు కబడ్డీ శిక్షణ కొరకు 9666623438, రెజ్లింగ్ శిక్షణ కొరకు 6305271260 నెంబర్లను సంప్రదించాలని డివైస్ ఓ టీవీఎల్ సత్యవాణి ఒక ప్రకటనలో తెలిపారు.

పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత అవసరం

పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత అవసరం

*బిట్స్ స్కూల్ విద్యార్థులకు
గ్రీన్ ఒలంపియాడ్ టెస్ట్ సర్టిఫికెట్ల ప్రదానోత్సవం*

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

సమాజంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడం, వాహనాల వినియోగం ఎక్కువ కావడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందనీ, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్ అన్నారు.పర్యావరణ అటవీ మరియు వాతావరణ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో గత నవంబర్ మాసంలో నిర్వహించిన గ్రీన్ ఒలంపియాడ్ టెస్ట్ లో పాల్గొన్న బాలాజీ టెక్నో స్కూల్ విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు.ఈ పర్యావరణ పరిరక్షణా చర్యలు చేపట్టడాన్ని మీ వ్యక్తిగత జీవితంలో ఒక ప్రధాన బాధ్యతగా స్వీకరించాలని విద్యార్థులకు సూచించారు.
బాలాజీ విద్యార్థులు మొత్తం 183 మంది ఈ ఒలంపియాడ్ టెస్ట్ రాశారు. అందులో పదిమంది విద్యార్థులు మెరిట్ సర్టిఫికెట్ పొందగా 173 మంది విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్ అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎం.డి. రియాజుద్దీన్, ప్రదీప్ చౌదరి, క్రాంతి కుమార్ మరియు ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

కోహిర్ మండలంలోని పిచారగడి గ్రామంలో.!

కోహిర్ మండలంలోని పిచారగడి గ్రామంలో వాటర్ షెడ్ ప్రారంభోత్సవా కార్యక్రమంలో పాల్గొన్న.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

➡ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ
➡ జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్
➡ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్ డా౹౹ఏ. చంద్రశేఖర్

inauguration ceremony of a water

 

శనివారం నాడు, కోహిర్ మండలంలోని పిచారగడి గ్రామంలో వాటర్ షెడ్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఇండస్ట్రియల్ చైర్మెన్ తన్వీర్,కోహిర్ మండల అధ్యక్షులు రామలింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ గారు,మహిళ సంఘాల అధ్యక్షులు&సభ్యులు, మరియు మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

డ్రైనేజీ పొంగిపొర్లుతు కాలనీలో దుర్గంధం.

డ్రైనేజీ పొంగిపొర్లుతు కాలనీలో దుర్గంధం

15,20 రోజుల నుంచి రోడ్డుపై ఏరులై పారుతున్న డ్రైనేజీ పట్టించుకోని అధికారులు

డ్రైనేజీ సమస్య శాశ్వితంగా పరిష్కారం చూపించండి

స్థానిక కాలనీవాసులు

మల్కాజ్ గిరి నేటిదాత్రి

మల్కాజిగిరి డివిజన్ బాల సరస్వతి నగర్ లో (ఆత్మ లింగ మహా గణపతి ఆ లయ రోడ్డులో) గత 20 రోజులుగా డ్రైనేజీ పొంగిపొర్లు తున్న అధికారులు పట్టించుకోవడం లేదని తెలుపుతున్నారు. డ్రైనేజీ పొంగి పొర్లుతుందని వాటర్ వర్క్స్ సంబంధించిన అధికారులకు ఫిర్యాదు చేసిన ఇటువైపు చూడడం లేదని, చూస్తాము చేస్తాము పంపిస్తున్నామని మాటలు చెబుతూ కాలనీవాసులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు స్థానికులు తెలుపుతున్నారు.గత వారం ఇదే సమస్యను కార్పొరేటర్ దృష్టికి తీసుకువెళ్లగా సంబంధిత వారికి చెప్పగా తూతూ మంత్రంగా చర్యలు తీసుకొని వదిలేసారని, డ్రైనేజీ పొంగి కాలనీ రోడ్లన్నీ కూడా వాసనతో ఇండ్లలోకి దుర్గంధం వస్తుంటే ఇండ్లలో స్థానికులు ఉండలేకపోతున్నారని ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారుల పైన ఉన్నత అధికారులు చర్యలు తీసుకో వాలని కోరుతున్నారు.చిన్న చిన్న సమస్యలనే పరిష్కరించలేని అధికారులు, నాయకులు ప్రజా సమస్యలను ఇంకా ఏదైనా ఇబ్బందులు వస్తే ఎలా పరిష్కరిస్తారని స్థానికులు అడుగుతున్నారు.సమస్య పరిష్కరించకుండా వదిలేస్తే కాలనీ వాసులు,ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని రోడ్డుపై నడవడానికి కూడా సమస్యగా ఉందని చెబుతున్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఏఎంసీ మార్కెట్ చైర్మన్ రాజిరెడ్డి

 

పరకాల నేటిధాత్రి

మండలంలోని పోచారం,లక్ష్మీపురం గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డితో పాటు ఐకేపీ నోడల్ ఆఫీసర్ జ్యోతి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ దాసరి బిక్షపతి,బుడిమె రాజయ్య మరియు పోచారం గ్రామ కమిటీ అధ్యక్షులు నీరటి అశోక్, పరకాల సమన్వయ కమిటీ సభ్యులు కొలిపాక చందు,కోరే శ్రీనివాస్,పిఏసీఎస్ డైరెక్టర్ కొలిపాక అర్జున్ పిఏసీఎస్ పరకాల కార్యనిర్వహణాధికారి నాగరాజు,రాయపర్తి మాజీ ఎంపీటీసీ పర్నం మల్లారెడ్డి, లక్ష్మీపురం గ్రామంలో మాజీ ఎంపీటీసీ పల్లెబోయిన శ్రీనివాస్,మాజీ సర్పంచ్ ఆలేటి రవింర్,చిలువేరు మల్లయ్య మరియు గ్రామ కమిటీ సభ్యులు పల్లెబోయిన భాస్కర్,బండారి నరేష్,మంగళపెల్లి సాంబయ్య,మొగిలి సెంటర్ ఇంచార్జీ రమేష్ మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులు కార్యకర్తలు రైతులు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఆర్టీసీ నర్సంపేట డిపో జేఏసీ చైర్మన్ గా కొలిశెట్టి రంగయ్య.

ఆర్టీసీ నర్సంపేట డిపో జేఏసీ చైర్మన్ గా కొలిశెట్టి రంగయ్య

వైస్ చైర్మన్ గా గొలనకొండ వేణు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట ఆర్టీసీ డిపో జేఏసీ చైర్మన్ గా కొలిశెట్టి రంగయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.శనివారం స్థానిక నర్సంపేట పురపాలక సంఘంలో ఆర్టీసీ డిపోకు చెందిన వివిధ యూనియన్ల నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా నూతన డిపో జేఏసీ కమిటీని ఎన్నుకున్నారు.

RTC

డిపో జేఏసీ చైర్మన్ గా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్. డబ్ల్యూఎఫ్) డిపో అధ్యక్షులు కొలిశెట్టి రంగయ్య,తెలంగాణ జాతీయ మజ్దార్ యూనియన్ (టీజేఎంయూ) డిపో సెక్రెటరీ గొలనకొండ వేణును వైస్ చైర్మన్ గా ఎన్నుకున్నారు. కన్వీనర్లుగా ఎంకే.స్వామి (టీఎంయూ), పీసీ. పాలన్ (ఈయూ), బూర ప్రవీణ్ కుమార్, కందికొండ మోహన్, బొడిగె రాజు,ఎండి. జానీపాషా, మంద రాజు, నామాల అశోక్ కుమార్, డ్యాగల వెంకట్రాం నర్సయ్య, ఎన్.రాజాలు తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ రాసిన రాజ్యాం గమే ఆదర్శం. 

అంబేద్కర్ రాసిన రాజ్యాం గమే ఆదర్శం. 

అంబేద్కర్ భవనం రావడం అన్ని కులాల పేదప్రజల అదృష్టం

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు అంబేద్కర్ భవనం రావడం అన్ని కులాల పేదల ప్రజల అదృష్టం. అంబేద్కర్ ఆశయ కొనసాగిస్తాం. ఎమ్మా ర్పీఎస్ మండల అధ్యక్షుడు తుడుం వెంకటేష్ పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారపేల్లి రవీంద ర్ (బుజ్జన్న) మర్యాద పూర్వ కంగా కలిసి శాలువాతో సన్మానించారు. మండలకేంద్రం ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రమైన అంబేద్కర్ భవనం లేకపోవడం చాలా దురదృష్ట కరం. అంబేద్కర్ భవనం రావడం సంతోషం. అంబేద్కర్ భవనం నిర్మాణ చేస్తానని కాంగ్రెస్ భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారా యణరావు హామీ ఇవ్వడం జరిగింది.. ఈ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో ముక్కెర ముఖేష్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి తుడుం వెంకటేష్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మామిడి భాస్కర్ మాదిగ, ఎంఎస్ పి మండల అధ్యక్షులు మారపేల్లి చిరంజీవి మాదిగ ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి పోతుగంటి రజినికర్ మాదిగ ,మాజీ మండల అధ్యక్షులు కొమ్ముల పరమేష్, ఎమ్మార్పీ ఎస్ మండల సీనియర్ నాయకు లు.రంగు బాబు మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల సీనియర్ నాయకులు రమేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ నాయకు లు,పోతుగంటి సాంబరాజ్, ఎమ్మార్పీఎస్ పత్తిపాక గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

గ్రామాలలో కలిస్తే గెలుస్తాం.

గ్రామాలలో కలిస్తే గెలుస్తాం..నిలుస్తాం

బిసా రమేష్,తాళ్ళ రవి ముదిరాజ్

నేటిధాత్రి:

ముదిరాజ్ ల జాతి అభివృద్ధి కోసం విద్యా,ఉద్యోగం,సాధికారత లక్ష్యంగా అడుగులు వేద్దామని అవిశ్రాంతంగా ముదిరాజ్ కుల బంధువుల అభ్యున్నతికి పాటుపడుతున్న మెపాకు సంఖ్యాపరంగా అధికంగా ఉన్నప్పటికీ ఆర్థిక రాజకీయ సామాజికతలో ముదిరాజ్ ల వెనుకబడి ఉన్నారని విద్యతోనే అభివృద్ధి సాధ్యమని మెపా చేస్తున్న ప్రగతి కార్యక్రమాల కొనసాగింపుగా అన్ని రంగాలలో ముదిరాజ్ లు రాణించేలా అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని మెపా అభివృద్ధికి విస్తరణకు మూలాలలోకి వెళ్తూ గ్రామ గ్రామాన కలిస్తే గెలుస్తాం.. నిలుస్తాం అని మెపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిసా రమేష్ ముదిరాజ్,మెపా రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ రవి ముదిరాజ్ తెలిపారు.వారు మాట్లాడుతూ ముదిరాజ్ లకు చైతన్య కార్యక్రమాలు,విద్యతో అన్ని సమస్యలకు పరిష్కారం అవుతాయి కాబట్టి ముదిరాజ్ యువత విద్య,ఉద్యోగ అవకాశాల వైపు రాజకీయ సాధికారతవైపు అడుగులు వేసేందుకు ముదిరాజ్ లు ఒక తాటిపైకి వచ్చి పూర్తిస్థాయిలో కలిసికట్టుగా సహకరిద్దామని తెలియజేశారు.

ఘనంగా టిఎస్ఎస్ సిసిడిసి.!

ఘనంగా టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చేర్మెన్ వై.నరోత్తం జన్మదిన వేడుకలు..

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్)మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు బి.దిలీప్ డబ్లూ హెచ్ ఆర్ పి సి ఆద్వర్యంలో టపాకాయలు కాల్చి జన్మదిన కేక్ ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు శంకర్, శివరాజ్ పాటిల్,నబి సాబ్, యం.జైపాల్,కె.నర్శింలు,చెంగల్ జైపాల్,జి.జగన్,బాల్ రాజ్, ఇమ్రాన్,సి.యం.అశోక్ రెడ్డి, పెంటన్న,అనిల్,తదితరులు పాల్గొన్నారు

error: Content is protected !!
Exit mobile version