కురిసిన వాన మెరిసిన రైతు.

కురిసిన వాన మెరిసిన రైతు….

◆: రైతుల మొహంలో ఆనందం…..!

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండల,పరిధిలో ఎట్టకేలకు పది పదిహేను రోజుల తరువాత వర్షం కురవటంతో రైతులు ఆనందంతో ఉన్నారని, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడక్కడ చిన్నపాటి వర్షాలు కురుస్తున్నాయి. రైతులు అనందంతో రైతులు తమ తమ పోలాలల్లో ఆయా ఖరీఫ్ సీజన్ పంటలు పత్తి మొక్కజొన్న, సోయా,మినుము, పెసర పంటలు వేసి వారం నుండి రెండు వారాలు అవుతుంది. వర్షం మాత్రమే
అలికిన సనిపి లాగానే అంతా అంతా మాత్రమేనని నాటి నుండి వర్షం కురువకపోవడంతో పంటలు అంతంతగా మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు పడుతు న్న వర్షాలతో రైతులకు మేలు కలుగుతుంది. అంతే కాకుండా కొంతమంది రైతులు ఎప్పుడు, ఎప్పుడు పత్తి మరియు సోయా తదితర పంటలు వేయడా నికి భూమిని కూడా సిద్ధంగా ఉంచారు. ఇప్పుడు వర్షాలు కురువడంతో రైతులు లక్షలలో పెట్టుబడి పెట్టి వర్షం కోసం చాలా వేచి చూడవలసిన అవసరం రావడమే కాకుండా వర్షాలు కురుస్తున్న నేల రైతుల మొహంలో చిరునవ్వులు పట్టరాని సంతోషం రైతులను కలిగించేసింది.

వివాహ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే .

వివాహ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

హైదరాబాద్ వారాహి బ్యాంకేట్ హాల్ లో జరిగిన మాజి ఆత్మ చైర్మన్ పెంటా రెడ్డి గారి మనుమడి జన్మదిన వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన జహీరాబాద్ శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు ,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

అందుకే ఆలస్యం.

అందుకే ఆలస్యం.

చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ మల్లిడి తెరకెక్కిస్తోన్న సోషియో ఫ్యాంటసీ ‘విశ్వంభర’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి…

చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ మల్లిడి తెరకెక్కిస్తోన్న సోషియో ఫ్యాంటసీ ‘విశ్వంభర’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సంక్రాంతికే రావాల్సిన ఈ సినిమా విడుదల తేదీపై ఇప్పటికీ స్పష్టత లేదు.

దీంతో ఈ సినిమా ఎప్పుడొస్తుందనేది ఓ ప్రశ్నగా మారింది.

ఈ నేపథ్యంలో ఆంగ్ల మీడియాతో మాట్లాడిన దర్శకుడు వశిష్ఠ, సినిమా గురించి అప్‌డేట్‌ ఇచ్చారు.

‘‘విశ్వంభర’ ఒక్క పాట మినహా షూటింగ్‌ అంతా పూర్తైంది. సినిమా ఒక విజువల్‌ వండర్‌లా ఉంటుంది.

ఆ అనుభూతినిచ్చేందుకే వీఎ్‌ఫఎక్స్‌ పనులు జరుగుతున్నాయి వాటి నాణ్యత విషయంలో అస్సలు రాజీపడడం లేదు.

అందుకే ఆలస్యం అవుతోంది. ఈ పనులు ఓ కొలిక్కి వచ్చాకే విడుదల తేదీపై స్పష్టతనిస్తాం.

సినిమాలో అత్యధికంగా 4676 వీఎ్‌ఫఎక్స్‌ షాట్స్‌ ఉన్నాయి.

అవి ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా ఉంటాయి.

ప్రపంచస్థాయి క్వాలిటీని అందివ్వడానికి టాప్‌ వీఎ్‌ఫఎక్స్‌ కంపెనీలు పనిచేస్తున్నాయి.

చిరంజీవి ఇప్పటివరకూ చేసిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల అవుట్‌పుట్‌ చూసి థ్రిల్లయ్యారు అని అన్నారు.

యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ ప్రమోద్‌ విక్రమ్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తున్నారు

ఈసారీ దాటవెతలే .

ఈసారీ దాటవెతలే…..

◆ నిర్మాణానికి నోచుకోని ప్యాలవరం బ్రిడ్జి

◆ రూ.3కోట్లతో ఆరు నెలల క్రితం శంకుస్థాపన

◆ వర్షకాలంలోపు పూర్తి చేస్తామని హామీ

◆ ఇప్పటికీ ప్రారంభంకాని పనులు

◆ వాగోస్తే రాకపోకలు తీవ్ర ఇబ్బందులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల పరిలోని ప్యాలారం వాగు ఏటా వానకాలంలో పొంగిపొర్లుతుండడంతో గ్రామస్తులు రాకపోకలు తీవ్ర మబ్బందులు పడుతున్నాడు. ఆరు నెలల క్రితం ఈ వాగు పై నూతనంగా బ్రిడ్జి నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరయ్యాయి.

అంతేకాకుండా బహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్. ఇహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్తేపు, స్థానిక ప్రజాప్రతిఙ్ఞడు లతో కలిసి పనులకు శంకుస్థావన కూడా చేశారు. రానున్న వానకాలం లోపు బ్రిడ్జి నిర్మాదాని పూర్తి చేస్తామని వారు అప్పట్లో ప్రజలకు భరోసా ఇచ్చారు. దీంతో ఎన్నో ఏళ్ల అవస్థలకు దేక్ పడుతుందని గ్రామస్థులు బావించారు. కానీ ఇప్పటికి పసులు ప్రారంభంకాకపోత తో ఈ సారీ కూడా ఇక్కట్లు తప్పడం లేదు. 10 రోజుల క్రితం కురి సేన వర్గానికి వాగు ప్రవాహించడంతో రాకపోకలు స్తంభించి ప్రయాణి కులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.

రాకపోకలకు తప్పని ఇబ్బందులు

 

ఎన్నో సంవత్సరాల నుంచి ప్మాలవరం వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో ఆ గ్రామ ప్రజలు వర్ష కాలం వచ్చిదంటే నానా తంటాలు పడుతు న్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఈ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినా పసులు ముందుకు సాగలేదు. ప్రస్తుత కాంగ్రెస్: ప్రభుత్వమైనా పనుణు వేగవంతంగా చేస్తుందనుకుంటే కాల యాపనికే పరిమితమైందని పలువురు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ముఖ్యంగా ప్యాంవరం, దేవరంపల్లి గ్రామానికి రాకపోకలు సాఫీగా సాగుతాయి.

ప్రతీ ఏటా తిప్పలే..

ఎలా వాగు ఉద్భత్తంగా ప్రవహిస్తుండ మతే రాకపోవకు ఇబ్బందులు పడు తున్నాయి.నీళ్లు తగ్గుముఖం పట్టింతవరకు నిరీక్షణ తప్పడంలేదు తప్పని పరిస్థితల్లో దేవరంపల్లి ఈదులపల్లి మీదుగా చుట్టూ తిరిగి జహీరాబాద్ పట్టణానికి వెళ్లాల్సి వస్తుంది.

-మాణిక్యం యాదవ్. ప్యాలవరం

 

 

తమ్ముడు ప్రేక్షకులను మెప్పిస్తాడు.

తమ్ముడు ప్రేక్షకులను మెప్పిస్తాడు…

‘నా గత చిత్రాలు ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగించలేదు. కానీ ‘తమ్ముడు’ సినిమా మిమ్మల్ని నిరాశ పరచదు. దర్శకుడు వేణు శ్రీరామ్‌ ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే కుటుంబ కథా చిత్రంగా.‘నా గత చిత్రాలు ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగించలేదు.

కానీ ‘తమ్ముడు’ సినిమా మిమ్మల్ని నిరాశ పరచదు. దర్శకుడు వేణు శ్రీరామ్‌ ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే కుటుంబ కథా చిత్రంగా తీర్చిదిద్దారు.

ఇక నుంచి మంచి కథలతో మీ ముందుకు వస్తాను’ అని హీరో నితిన్‌ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘తమ్ముడు’ చిత్రం ఈ నెల 4న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా చిత్రబృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. నితిన్‌ మాట్లాడుతూ ‘80 రోజులు అడవుల్లోనే ఉండి ఎన్నో ఇబ్బందులకు ఓర్చుకొని ‘తమ్ముడు’ షూటింగ్‌ పూర్తి చేశాం’ అని అన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ ‘చిత్రబృందం కష్టం వల్లే ‘తమ్ముడు’ సినిమా అవుట్‌పుట్‌ బాగా వచ్చింది.

ర్శకుడు శ్రీరామ్‌ వేణు తన విజన్‌ను అద్భుతంగా తెరపైకి తెచ్చారు.

ఈ సినిమా సక్సెస్‌ క్రెడిట్‌ పూర్తిగా ఆయనకే దక్కుతుంది.

నితిన్‌కు ఇది కమ్‌బ్యాక్‌ మూవీ అవుతుంది. రామ్‌చరణ్‌తో ఓ సూపర్‌హిట్‌ మూవీ చేయబోతున్నాం. త్వరలో వివరాలు ప్రకటిస్తాం’ అని చెప్పారు.

శిరీష్‌ మాట్లాడుతూ ‘‘తమ్ముడు’తో నితిన్‌కు హిట్‌ ఇస్తామని నిర్మాతగా మాట ఇస్తున్నాను’ అని అన్నారు. శ్రీరామ్‌ వేణు మాట్లాడుతూ ‘థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసం ‘తమ్ముడు’ సినిమాను డిజైన్‌ చేశాను.

కుటుంబ అనుబంధాలతో పాటు వాణిజ్య హంగులు కలబోసిన చిత్రమిది’ అని చెప్పారు.

‘ఇందులో కొత్త తరహా పాత్ర చేశాను’ అని లయ తెలిపారు.

‘ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాం, పాత్రల తాలూకు భావోద్వేగాలకు ప్రేక్షకులు అనుభూతి చెందుతారు’ అని సప్తమి గౌడ చెప్పారు. థియేటర్లలో చూసి ఎంజాయ్‌ చేయాల్సిన చిత్రమిదని వర్ష బొల్లమ్మ అన్నారు.

మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా VFX  అందుకే విశ్వంభర ఆల‌స్యం.

మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా VFX  అందుకే విశ్వంభర ఆల‌స్యం…

 

ద‌స‌రా, దీపావ‌ళికి సంబంధించిన వివ‌రాలు రిలీజ్ డేట్లు వ‌స్తున్నాయి. కానీ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం ‘విశ్వంభర’ రిలీజ్‌ డేట్‌ మాత్రం డైలామాలో ఉంది.ఈ సంవ‌త్స‌రం ఇప్ప‌టికే అర్థ‌ భాగం ఆరు నెల‌లు పూర్తి అయిది.

ఈ క్ర‌మంలో టాలీవుడ్‌లో సంక్రాంతి, స‌మ్మ‌ర్ సీజ‌న్‌లు ముగియ‌డంతో పెద్ద సినిమాల విడుద‌ల‌కు బ్రేక్ ప‌డిన‌ట్లే అయితే ఇప్ప‌టి నుంచే ద‌స‌రా, దీపావ‌ళికి సంబంధించిన సినిమాల వివ‌రాలు రిలీజ్ డేట్లు వ‌స్తున్నాయి.

కానీ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara) రిలీజ్‌ డేట్‌ మాత్రం డైలామాలో ఉంది.

ఇప్ప‌టికే విడుద‌ల కావాల్సిన ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ఎప్పుడొస్తుందా? అని ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తవ‌గా, 90 శాతం షూటింగ్‌ ఇండోర్‌లోనే జరిగింది.

కొద్ది ప్యాచ్‌ వర్క్ మాత్ర‌మే బాకీ ఉంది. ఇదిలాఉంటే ఈ యేడు మొద‌ట్లో విడుద‌ల చేసిన టీజ‌ర్‌లో విజువ‌ల్స్ VFX తేలిపోయిన‌ట్లు వ్య‌తిరేక‌త‌ను తీసుకువ‌చ్చింది.

దీంతో మేక‌ర్స్ మ‌రింత జాగ్ర‌త్త ప‌డి సినిమా విడుద‌ల‌ను వాయిదా వేసి మ‌రో కంపెనీతో సీజీ ప‌నులు చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. వాటి నుంచి అవుట్‌ పుట్‌ వచ్చాకే రిలీజ్‌ డేట్‌ ప్రకటించాలని చిరంజీవి నిర్ణయించుకొన్నారట.

ఒకసారి సీజీ వర్క్‌ వచ్చి అది నచ్చక మళ్లీ వెనక్కి పంపి, మళ్లీ రిలీజ్‌ డేట్‌ మార్చి..

ఈ రచ్చంతా ఎందుకు? సినిమా మొత్తం చూసుకొన్న తరవాత అప్పుడు రిలీజ్‌ డేట్‌ ప్రకటిద్దాం అని పక్కా ప్రణాళిలతో ఉన్నారట చిరు.

యూవీ క్రియేషన్స్‌ కూడా ఇదే మాటకు కట్టుబడి ఉందని తెలుస్తోంది.

జూలై, ఆగస్టు ఈ రెండు నెలలు ‘విశ్వంభర’ రావడానికి అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ఇటీవ‌ల ఆంగ్ల మీడియాతో మాట్లాడిన చిత్ర దర్శకుడు వశిష్ఠ, సినిమా గురించి అప్‌డేట్‌ ఇచ్చారు. ‘విశ్వంభర’ ఒక్క పాట మినహా షూటింగ్‌ అంతా పూర్తైంది.

సినిమా ఒక విజువల్‌ వండర్‌లా ఉంటుంది.

ఆ అనుభూతినిచ్చేందుకే వీఎఫ్‌ఎక్స్‌ పనులు జరుగుతున్నాయి. వాటి నాణ్యత విషయంలో అస్సలు రాజీపడడం లేదు. అందుకే ఆలస్యం అవుతోంది.

ఈ పనులు ఓ కొలిక్కి వచ్చాకే విడుదల తేదీపై స్పష్టతనిస్తాం అన్నారు.సినిమాలో అత్యధికంగా 4676 వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ ఉన్నాయని, అవి ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా ఉంటాయన్నారు.

ప్రపంచస్థాయి క్వాలిటీని అందివ్వడానికి టాప్‌ వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీలు పనిచేస్తున్నాయి.

చిరంజీవి ఇప్పటివరకూ చేసిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల అవుట్‌పుట్‌ చూసి థ్రిల్లయ్యారు’ అని అన్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌, విక్రమ్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుంది.

 

అన్న‌పూర్ణ‌లో ప‌వ‌న్‌ స‌డ‌న్‌గా షాకిచ్చిన మెగాస్టార్‌.

 అన్న‌పూర్ణ‌లో ప‌వ‌న్‌ స‌డ‌న్‌గా షాకిచ్చిన మెగాస్టార్‌…

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ‌ స్టూడియోలో శ‌ర‌వేగంగా సాగుతుండ‌గా ప‌వ‌న్‌, శ్రీలీల ప్ర‌ధాన తారాగ‌ణం అంతా పాల్గొన్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాజకీయాల్లోకి వచ్చాక అధికారంలోకి రావ‌డం, డిప్యూటీ సీఎం కావ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయిన విష‌యం తెలిసిందే.

ఈక్ర‌మంలో వాయిదా ప‌డ్డ సినిమాల‌ను పూర్తి చేసే ప‌నిలో ఉన్న ఆయ‌న ఇప్పుడు వాటి చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉండ‌గా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు (HariHara Veeramallu), ఓజీ (OG) చిత్రాల షూటింగ్‌ల‌ను పూర్తి చేశారు.

ఆపై చివ‌ర‌గా బ్యాలెన్స్ ఉన్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమా షూటింగ్‌లో ఇటీవ‌లే అడుగు పెట్టాడు.హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న.

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మిస్తుంది. పవన్ సరసన శ్రీలీల(Sreeleela) నటిస్తోంది.

కోలీవుడ్‌లో భారీ విజయాన్ని అందుకున్న తేరి (Theri) సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఆ చిత్రం లైన్‌ను మాత్ర‌మే తీసుకుని హరీష్.

తన స్టైల్ లో రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన  పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి కూడా.అయితే తాజాగా ప్రారంభ‌మైన ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతుండ‌గా ప‌వ‌న్‌, శ్రీలీల ప్ర‌ధాన తారాగ‌ణం అంతా పాల్గొన‌గా ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ‌ స్టూడియోలో షూటింగ్ జ‌రుగుతుంది. ఈ క్ర‌మంలో ఈ సినిమా సెట్‌కు చిరంజీవి (Chiranjeevi) స‌డ‌న్‌గా ఎంట్రీ ఇచ్చి అక్క‌డి వారిని అశ్చ‌ర్య ప‌రిచారు. ప‌వ‌న్‌తో క‌లిసి సెట్‌లో క‌లియ తిరిగారు ఆపై తమ్ముడు పవన్ నటనను, మూవీ చిత్రీకరణ తీరును ఆయన దగ్గరుండి గ‌మ‌నించారు. ప‌వ‌న్‌తో కాసేపు ముచ్చ‌టించారు. ఆపై అంద‌రికి ఆల్ ది బెస్ట్ చెప్పి అక్క‌డి నుంచి వెళ్లి పోయారు. ఇందుకు సంబంధించిన ఫొటో బ‌య‌ట‌కు రావ‌డంతో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఫొటో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

రో హౌస్‌లపై నేటిధాత్రి మరో అక్షర విజయం!

`అక్రమంగా, అనుమతులు లేని రో హౌస్‌ లు గతంలోనే నాలుగు కూల్చివేత.

`మిగిలిన రెండు నేడు కూల్చేశారు.

`72 రో హౌస్‌ లపై అక్రమంగా పై అంతస్తులు నిర్మించిన వారికి నోటీసులు.

`15 రోజులలో కూల్చి వేసుకోవాలని ఆదేశాలు.

`గడువు దాటితే తామే కూల్చేస్తామని మునిసిపల్‌ శాఖ హెచ్చరికలు.

`మొత్తం రో హౌస్‌ లు కూల్చివేయాలనేది నేటిధాత్రి ప్రధాన డిమాండ్‌.

`కార్మికుల కోసం ప్రభుత్వం కేటాయించిన భూమి కార్మికులకే సొంతం కావాలి.

`అక్రమంగా జొరబడిన గద్దలు ఖాళీ చేయాలి.

`14 ఎకరాలు చిత్రపురి సొసైటీ స్వాధీనం చేసుకోవాలి.

`ఆ స్థలంలో కార్మికుల కోసం అప్పార్టుమెంట్లు నిర్మాణం చేయాలి.

`అర్హులైన ప్రతి సినీ కార్మికుడికి సొంతిల్లు కల నెరవేరాలి.

`అప్పటి వరకు నేటిధాత్రి అక్షర పోరాటం ఆగదు.

`కార్మికులు సొంత ఇండ్లు కళ్లారా చూసుకునే వరకు నేటిధాత్రి పోరు ఆపదు.

`కార్మికులు ఇప్పటికైనా కళ్లు తెరవాలి.

`నేటిధాత్రి అక్షర పోరాటంతో చైతన్యమై సొంతింటి పోరు జరపాలి.

`14 ఎకరాలలో కార్మికులకు అప్పార్టుమెంట్లు నిర్మాణం జరిగే దాక పోరాటం కొనసాగించాలి.

`అలుపెరగకుండా కార్మికులు తమ కల నెరవేర్చుకోవాలి.

`నేటిధాత్రికి కార్మికుల నుంచి పెద్ద ఎత్తున అభినందనలు.

`నేటిధాత్రి పోరాటానికి కార్మికుల ధన్యవాదాలు.

`నేటిధాత్రి దిన పత్రికకు కార్మికుల జేజేలు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
పోరాటాలన్నింటిలోకి అక్షర పోరాటం గొప్పది. ఆ అక్షరం కదిలంచే శక్తి మరింత గొప్పది. సమాజంలో ఏ వర్గం కదాలన్నా, ఏ వర్గం సమస్యలు వెలుగులోకి రావాలన్నా ముందు అక్షరం వెలగాలి. ఆ సమస్య అక్షర రూపం దాల్చాలి. అక్షరం వేసి తొలి అడుగే సమస్యల పరిష్కారానికి మరో అడుగుకు దారి పడుతుంది. రాజుల కాలంలోనైనా, ప్రజా స్వామ్య దేశాలలోనైనా అక్షర కావాతే అన్నింటికన్నాగొప్పది. దేశానికి స్వాతంత్య్ర సమరమైనా, తెలంగాణ ఉద్యమమైనా అక్షరంతోనే మొదలైంది. తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకున్నా అక్షరంతోనే..తెలంగాణ ఉద్యమం సమాజం ఎంత సాగించినా అది అక్షరూపంలో ప్రపంచానికి చేరినప్పుడే లోకానికి తెలిసింది. తెలంగాణ విజయం కూడా అక్షర రూపంలోనే వెలుగులోకి వచ్చింది. అదే మీడియా గొప్పదనం. అలాంటి అక్షరాలకు పునాదులు వేసేదే మీడియా. ఆ మీడియా లేవనెత్తిన సమస్యలు పరిష్కారమైనప్పుడు అందరికంటే ముందు సంతోషపడేది ఆ అక్షరాలను సందించిన మీడియానే..అలాంటి విజయాలను సొంతం చేసుకోవడం కోసం మీడియా పడే తపన, యాతన అంతా ఇంతా కాదు. ఎంతో శ్రమకోర్చి సమస్యలను వెలుగులోకి తెస్తుంది. ఆ సమస్య పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తుంది. అలా నేటిదాత్రి చేసిన కృషి కోకొల్లలలు. అందులో చిత్ర పురి కార్మికుల సమస్య ఒకటి. చిత్రపురిలోని బాగోతాలను ఒక్కొక్కటిగా వెలుగులోకి తెచ్చి, వాటి పరిష్కారానికి అలుపెరగని అక్షర పోరాటం నేటి ధాత్రి చేసింది. ముఖ్యంగా చిత్రపురిలో జరిగిన రోహౌజ్‌ల నిర్మాణం అక్రమమని, వాటిని తొలగించాలంటూ నేటి ధాత్రి చేసిన పోరాటంలో గతంలోనే ఒక విజయం సాధించింది. ఇప్పుడు మరో విజయం నేటిదాత్రి ఖాతాలో పడిరది. నిజానికి రోహౌజ్‌ల నిర్మాణం అక్రమమే కాదు, దుర్మార్గం కూడా..కార్మికుల శ్రేయస్సుకోసం, వారికి నీడ కోసం రాష్ట్ర ప్రభుత్వం 64 ఎకరాల స్థలం ఇచ్చింది సినీ రంగానికి చెందిన తెలంగాణ నటుడు ప్రభాకర్‌రెడ్డి మూడు ఎకరాల స్ధలం విరాళలంగా ఇచ్చారు. మొత్తంత 67 ఎకరాలకు పైగా ఆ స్ధలం కార్మికుల కోసం కేటాయించబడిరది. అందులో 14 ఎకరాల స్ధలం సినీ రంగంలోని పెద్దలు ఆక్రమించారు. నిజానికి దివంగత నటుడు ప్రభాకర్‌ రెడ్డి చూపిన దారిలో నడిచి, కార్మికుల కోసం స్థలాలు కొని ఇవ్వాల్సిన పెద్దలు ఆ కార్మికుల స్ధలానికే ఎసరు పెట్టారు. ప్రభుత్వం కేటాయించిన భూమిలో 14 ఎకరాలు ఆక్రమించుకున్నారు. చిత్ర పురి సొసైటీని బెదిరించి మరీ లాక్కున్నారు. అందులో 250 రోహౌజ్‌లు నిర్మాణం చేసుకున్నారు. అంతే కాకుండా మరో ఆరు రోహౌజ్‌లు అక్రమంగా అదనంగా నిర్మాణం చేసుకున్నారు. అసలు రోహౌజ్‌ల నిర్మాణమే తప్పని, నేరమని నేటిధాత్రి పోరాటం చేసింది. దాంతో మున్సిపల్‌ శాఖ గత ఏడాది రంగంలోకి దిగింది. అక్రమంగా నిర్మాణం చేసిన మరో ఆరు రోహౌజ్‌లలో నాలుగింటిని కూల్చివేశారు. మరో రెండు రోహౌజ్‌లు కొనుగోలు చేసిన వారు కొంత సమయం అడిగారు. అయినా ఇప్పటి వరకు ఖాళీ చేయలేదు. వాటిని కూల్చేయలేదు. దాంతో మున్సిపల్‌ శాఖ రంగంలోకి దిగింది. మిగిలిన రెండు రోహౌజ్‌లను మంగళవారం కూల్చివేసింది. మొదటి నాలుగు రోహౌజ్‌లు నేటిధాత్రి పోరాటం వల్లనే కూల్చివేశారు. తర్వాత మిగిలిన రెండు కూడా ఎప్పుడు కూల్చేస్తారంటూ నేటిధాత్రి రాసిన కధనాలకు స్పందించి, మున్సిపల్‌ అధికారులు మంగళవారం నేట మట్టం చేశారు. నేటిదాత్రి కోరుకున్న అదనపు రోహౌజ్‌ల కూల్చివేత పూర్తయింది. అయితే నేటిధాత్రి ఆది నుంచి చెబుతున్నది మొత్తం రోహౌజ్‌లను కూల్చివేయాలని కార్మికుల పక్షాన డిమాండ్‌ చేస్తూ వచ్చింది. అయితే నేటిధాత్రి ఓ వైపు అక్షర పోరాటం చేస్తున్నా, 72 రోహౌజ్‌ల యజమానులు వాటిపై అంతస్ధులు నిర్మాణం మొదలు పెట్టారు. రోహౌజ్‌లే అక్రమంగా నిర్మాణం చేసుకున్నారు. వాటిపై అంతస్ధులు వేసుకోవడానికి ఎలాంటి అనుమతిలేదు. మున్సిపల్‌ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఆ యజమానులు అనుమతులు తెచ్చుకోలేదు. కేవలం అనుమతుల కోసం ధరఖాస్తులు చేసుకున్నారు. వాటిని మున్సిపల్‌ శాఖ తిరస్కరించింది. అయిన అందర్నీ మభ్యపెట్టి, అనుమతులు వచ్చినట్లు చెప్పుకొని పై అంతస్ధులు నిర్మాణం చేపట్టారు. వాటిని వెంటనే ఆపాలంటూ నేటిధాత్రి ఈ మధ్య వరస కథనాలు రాసింది. రోహౌజ్‌ల నిర్మాణమే అక్రమంటే, పై అంతస్ధుల నిర్మాణం మరీ దుర్మార్గం. అందుకే నేటిధాత్రి మళ్లీ అక్షర పోరాటం మొదలుపెట్టింది. దాంతో మున్సిపల్‌ అధికారులు 72 రోహౌజ్‌లకు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులను సవాలు చేస్తూ రోహౌజ్‌ల యజమానులు కోర్టును ఆశ్రయించారు. అయితే తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని రోహౌజ్‌ల యజమానులు ఆశించారు. మున్సిపల్‌ అధికారులు చిత్త శుద్ది కారణంగా కోర్టు రోహౌజ్‌ల యజమానులకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దాంతో పై అంతస్ధులను తొలగించాల్సిన పరిస్దితి ఎదురైంది. మున్సిపల్‌ అధికారులు మంగళవారం అదనపు నిర్మాణాలు చేపడుతున్నా 72 రోహౌజ్‌లకు నోటీసులు అంటించారు. 15 రోజుల్లో అదనపు నిర్మాణాలు తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక వేళ 15 రోజుల్లో ఆ నిర్మాణాలు కూల్చని పక్షంలో తామే వచ్చిన నిర్మాణాలు తొలగిస్తామని మున్సిపల్‌ అదికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికైనా సరే కార్మికులు కళ్లు తెరవాలి. కార్మికుల కోసం అక్షర పోరాటం చేస్తున్న నేటిధాత్రిని చూసైనా చైతన్యం పొందాల్సిన అవసరం వుంది. చిత్రపురి అనేది కార్మికులసొంతం. అందులోని ప్రతి అణువణువూ కార్మికులదే..ఈ సంగతి కార్మికులు గుర్తించినప్పుడే ఆ భూమి అంతా కార్మికుల సొంతమౌతుంది. దశాబ్ధాలుగా కార్మికుల చేస్తున్న పోరాటం ఫలిస్తుంది. వారి సొంతింటి కల నెరవేరుతుంది. ఇప్పటికే జరిగిన అప్పార్టుమెంటు వల్ల ఇంకా ఎంతో మంది కార్మికులకు సరిపోలేదు. ప్రస్తుతం నిర్మాణం చేస్తున్న ట్విన్‌ టవర్స్‌ల వల్ల కూడా కార్మికులందరి లక్ష్యం నెరవేరదు. రోహౌజ్‌ల పేరుతో సినీ గద్దలు ఆక్రమించుకున్న 14 ఎకరాల స్ధలంలో మరిన్ని అప్పార్టుమెంట్లు నిర్మాణం చేస్తే తప్ప కార్మికలందరికీ న్యాయం జరగదు. చిత్రపురిలో అన్ని క్రాఫ్టుల కార్మికులకు సొంతింటి కల నెరవేరాలన్నదే నేటిధాత్రి లక్ష్యం. ఆ లక్ష్యం కోసం సాగిన్న అక్షర పోరాట ప్రయాణంలో దక్కిన విజయం ఒక ఎత్తైతే రోహౌజ్‌ల స్థలం కార్మికుల వశమైనప్పుడే అసలైన విజయమని నేటిధాత్రి భావిస్తోంది. కార్మికుల ఎప్పటికైనా నెరవేరాలని నేటిధాత్రి కోరుకుంటోంది. కార్మికుల క్షేత్ర స్ధాయి ఉద్యమాలకు శ్రీకారం చుడితే కార్మికుల అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. కార్మికులందిరకీ సొంతంటి కల సొంతమౌతుంది. అక్రమంగా నిర్మాణమైన రోహౌజ్‌ల కూల్చివేతలతోపాటు, అదనపు అంతస్దుల నిర్మాణాలకు నోటీసుల జారీ దాకా నేటిధాత్రి సాగించిన అక్షరపోరాట విజయానికి కార్మిక లోకం అభినందనలు తెలియజేస్తోంది. నేటిధాత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలుతెలియజేస్తూ ఇకపై పూర్తి స్ధాయిలో తాము ఉద్యమ కార్యాచరణ చేపడతామని, అందుకు నేటిధాత్రి సహకరించాలని కోరుతున్నారు. నేటిధాత్రికి కార్మికులు జేజేలు పలుకుతున్నారు.

రెండు ఉప ఎన్నికలు..పార్టీలకు పరీక్షలు!

`రాజాసింగ్‌ రాజీనామా ఆమోదం పొందితే గోషామహల్‌ ఖాళీ.

`రెండు ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌ పై చేయి సాధించేనా!

`రెండు గెలిచి కాంగ్రెస్‌ కు తిరుగులేదని నిరూపించేనా!

`ఇప్పటికే కంటోన్మెంట్‌ గెలిచిన బలం కొనసాగేనా!

`రెండు చోట్ల గెలిచి హస్తం హవా చూపేనా!

`ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలుపు బీఆర్‌ఎస్‌ దేనా?

`బీఆర్‌ఎస్‌ పార్టీ చెప్పేది నిజమౌనా!

`కారు గేరు మార్చేనా..పరుగందుకునేనా!

`కమలం తెలంగాణలో ఊపందుకునేనా!

`బీజేపీ రెండు గెలిచి వచ్చే ఎన్నికలకు సై అనేనా!

`తెలంగాణకు మేమే దిక్కని బీజేపీ చాటేనా!

`రాజాసింగ్‌ ఇంత కాలం సొంత బలంతో గెలిచాడా!

`బీజేపీ వల్లనే గెలిచాడా అనేది తేలిపోతుందా!

`కాంగ్రెస్‌ గెలిస్తే ఇక తెలంగాణలో తిరుగుండదు.

`సీఎం. రేవంత్‌ రెడ్డికి ఎదురుండదు.

`కారు పార్టీకి గడ్డు రోజులు తప్పవు.

`బీఆర్‌ఎస్‌ గెలిస్తే కాంగ్రెస్‌లో లుకలుకలు తప్పవు.

`బీజేపీ గెలిస్తే భవిష్యత్తు ఇక కమలానిదే.

`ఈ రెండు ఉప ఎన్నికలలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీదే జిహెచ్‌ఎంసి.

`ఏ పార్టీ గెలుస్తుందో చూడాలి మరి.

`జూబ్లీ హిల్స్‌ లో కాంగ్రెస్‌ గెలిస్తే అధికారం సుస్థిరం.

`రెండు ఉప ఎన్నికలు కాంగ్రెస్‌ గెలిస్తే వచ్చే ఎన్నికలు కూడా కాంగ్రెస్‌ సొంతం.

`బీఆర్‌ఎస్‌ రెండు గెలిస్తే సానుభూతి అనే వాదన వుండదు.


`బీజేపీ గెలిస్తే తెలంగాణలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ లకు చోటుండదు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
రాష్ట్ర రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. అనూహ్యంగా గోషామహల్‌ బిజేపి ఎమ్మెల్యే తన పదవికి, పార్టీకి రాజీనామ చేశారు. ఇంకా స్పీకర్‌ ఆమోదించలేదు. కాని రాజాసింగ్‌ వ్యవహారం చూస్తుంటే ఖచ్చితంగా దూరం జరిగినట్లే అనిపిస్తోంది. పైగా బిజేపి కూడా రాజాసింగ్‌ తలనొప్పిని తట్టుకోలేకపోతోందని అంటున్నారు. గత ఐదారేళ్లుగా రాజాసింగ్‌ ఎంతో అసంతృప్తిగా వున్నారు. పార్టీ తనకు సముచితమైన స్ధానం కల్పించడం లేదన్న ఆందోళన అనేక సార్లు వ్యక్తం చేశారు. 2018 ఎన్నికల్లో బిజేపి నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. కాని అనూహ్యంగా ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో రఘునందన్‌రావు, ఈటెల రాజేందర్‌ గెలుపుతో బిజేపి మూడు సీట్లకు చేరుకున్నది. అయినా రాజాసింగ్‌కు బిజేపి పక్షనాయకుడిగా గుర్తించలేదు. అంతే కాకుండా రాజాసింగ్‌ దూడుకు, సొంత పార్టీ నేతలపై ఏడుపులతో ఆయనను కొంత కాలం పార్టీ పక్కన పెట్టింది. ఒక దశలో సస్పెండ్‌ కూడ చేసింది. అయినా ఎన్నికల సమయంలో ఆయన సస్పెన్షన్‌ ఎత్తి వేసింది. మళ్లీ బిజేపి టికెట్‌ ఇచ్చింది. ఆ ఎన్నికల్లోనూ రాజాసింగ్‌ గెలిచారు. ఈసారి ఎన్నికల్లో బిజేపి నుంచి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అయినా ఈసారి కూడా రాజాసింగ్‌కు బిజేపి పక్ష నాయకుడి పదవి ఇవ్వలేదు. దాంతో ఆయన అసంతృప్తి తారా స్ధాయికి చేరుకున్నది. పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్‌ టికెట్‌ మాధవిలతకు ఇస్తే, పోటీ చేసేందుకు మగాడే దొరకలేదా? అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఇక అప్పటి నుంచి రాజాసింగ్‌ పార్టీకి దూరం కావాలనే చూస్తున్నాడు. పార్టీ కూడా రాజాసింగ్‌ను దూరం పెట్టడమే మేలనుకుంటూ వచ్చింది. రాష్ట్ర అద్యక్ష పదవి తనకు ఇవ్వాలని రాజాసింగ్‌ బలంగా కోరుకున్నాడు. కాని ఆయనకు ఇచ్చేందుకు బిజేపి ససేమిరా అన్నది. దాంతో రాజాసింగ్‌ పార్టీకి, ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే రాజాసింగ్‌ ఇలాంటి బెదిరింపులు సహజమే అని కూడా అంటున్నారు. కాకపోతే రాజాసింగ్‌ తన దారి తాను ఇక ఎంచుకున్నట్లే..శివసేన నుంచి పోటీ చేస్తానని కూడా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక హైదరాబాద్‌లో రెండు ఉప ఎన్నికలు ఖాయంగానే కనిపిస్తున్నాయి. ఇటీవలే జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాద్‌ మరణించారు. త్వరలో జరగనున్న బిహార్‌ ఎన్నికలతోపాటు ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు మూడు ప్రధాన పార్టీ పరిస్తితి ఏమిటన్నది జోరుగా చర్చ జరుగుతోంది. ఈ రెండు ఉప ఎన్నికలు ప్రతిపక్షాల కన్నా, పాలక పక్షం కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మాకం. ఈ రెండు సీట్లు కాంగ్రెస్‌ గెలుచుకుంటే మాత్రం ఆపార్టీని ఆపడం ఇక ఎవరి తరం కాదు. అందుకే ఎలాగైనా రెండు సీట్లు సాదించాలన్న వ్యూహాలకు కాంగ్రెస్‌ పదును పెడుతుందనిచెప్పడంలో సందేహం లేదు. కాంగ్రెస్‌ పార్టీ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఆ పార్టీలో ఏ నాయకుడైనా,ఏదైనా మాట్లాడినా చెల్లుతుంది. తర్వాత చిన్న సారీ చెబితే సరిపోతుంది. ఇదే కాంగ్రెస్‌కు వరం. ఇదే కాంగ్రెస్‌కు శాపం. అందుకే కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని వదులకోవడం లేదు. జూబ్లీ హిల్స్‌ మరణించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్‌ బిఆర్‌ఎస్‌ నాయకుడు. ఆ సీటు బిఆర్‌ఎస్‌ది. గతంలో ఒక బిఆర్‌ఎస్‌ సీటు కాంగ్రెస్‌ వశం చేసుకున్నది. కంటోన్‌ మెంటుకు జరిగిన ఉప ఎన్నికలో బిఆర్‌ఎస్‌ సీటును కాంగ్రెస్‌ గెల్చుకొని తన మెజార్టీకి మరో సీటును జత చేసుకున్నది. ఇప్పుడు జరిగే రెండు ఉప ఎన్నికలను గెల్చుకుంటే స్వతహాగానే కాంగ్రెస్‌కు మరింత బలం పెరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎదరులేకుండా పోతుంది. ఆయన నాయకత్వానికి తిరుగులేకుండా పోతుంది. అధిష్టానం వద్ద రేవంత్‌ రెడ్డి పలుకుబడి కొండంత పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే సిఎం. రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోఓ ఉప ఎన్నిక గెలిపించి చూపించారు. ఇప్పుడు రెండు ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే ఇక కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎదురుండదు. హైదరాబాద్‌ విషయంలో హైడ్రా, మూసీ సుందరీకరణ ప్రభావం వుంటుందని అంటున్నారు. ఆ రెండు సీట్లు గెలిస్తే మాత్రం ప్రజల నాడి వచ్చే సార్వత్రిక ఎన్నికల దాకా తెలిసిపోతుంది. పైగా వచ్చే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తుంది. గత రెండు ధపాలుగా జిహెచ్‌ఎంసికి దూరమైన కాంగ్రెస్‌ మరోసారి తన పాలన అక్కడ కూడా మొదలు పెట్టే అవకాశం ఏర్పడుంది. హైదరాబాద్‌లో బిఆర్‌ఎస్‌ ఖాళీ అయ్యేందుకు కూడా మార్గం పడుతుంది. ఈ రెండు సీట్లు కాంగ్రెస్‌ గెల్చుకుంటే ఇప్పటికే మారిన పది మంది ఎమ్యెల్యేలతోపాటు, మరో పది మంది ఎమ్మెల్యేలైనా కాంగ్రెస్‌ గూటికి చేరే అవకాశం లేకపోలేదు. బిఆర్‌ఎస్‌ అస్దిత్వం ప్రశ్నార్థకంలో పడక తప్పదు. ఎందుకంటే గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ఆయువు పోసిందే హైదరాబాద్‌. పల్లెల్లో ఎలాగూ కారుకు గత ఎన్నికల్లో స్ధానం లేకుండా పోయింది. పార్లమెంటు ఎన్నికల్లో పల్లెల్లో గులాబీ తుడిచిపెట్టుకుపోయింది అందువల్ల ఈ ఉప ఎన్నికలు పంచాయితీ ఎన్నికలకు ముందు జరిగితే రెండు రకాలుగా కాంగ్రెస్‌ లాభం పొందే అవకాశం కూడా వుంది. హైదరాబాద్‌ గెలుపు పల్లెల్లో కూడా ప్రభావం చూపుతుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వం మరింత బలపడేందుకు ఛాన్స్‌ వుంది. ఒక వేళ ఈ రెండు సీట్లు బిఆర్‌ఎస్‌ గెలిస్తే మాత్రం కాంగ్రెస్‌కు గడ్డు రోజులు వచ్చినట్లే అనుకోవచ్చు. నిన్నటి వరకు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక గురించే అందరూ మాట్లాడుకున్నారు. ఆ స్ధానంలో కాంగ్రెస్‌ గెలిస్తే ఆ పార్టీకి కొంత బలం పెరిగేది. కాని బిఆర్‌ఎస్‌ గెలిస్తే సానుభూతి పనిచేసిందని అనేందుకు కూడ కాంగ్రెస్‌కు అవకాశం వుండేది. ఒక వేళ ఇప్పుడు రెండు ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ రెండు చోట్ల ఓడిపోతే మాత్రం తీరని నష్టాన్ని చవి చూసే పరిస్ధితి రావొచ్చు. కారు గెలిస్తే ఆ పార్టీని ఆపే వారు ఇక వుండరు. పైగా జూబ్లిహిల్స్‌ అనేది సానుభూతితో గెల్చుకున్నారన్న మాట మాట్లాడేందుకు కూడాకాంగ్రెస్‌కు అవకాశం వుండదు. కారు పార్టీ ఈ రెండు ఉప ఎన్నికలు గెల్చితే పల్లె పోరు కారు వైపు తిరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జిహెచ్‌ఎంసి కూడా మళ్లీగులాబీ కైవసం చేసుకుంటుందన ఊహించొచ్చు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కారుదే జోరు అంటూ నిత్యం బిఆర్‌ఎస్‌ నాయకులు అంటున్నారు. పంచాయితీ ఎన్నికలు పెట్టే ధైర్యం కాంగ్రెస్‌కు లేదంటున్నారు. ఈ రెండు ఉప ఎన్నికలు గులాబీ పార్టీ గెలిస్తే రాజీనామా చేసిన పది మంది ఎమ్మెల్యేలపై ప్రజల నుంచి కూడా ఒత్తిడి రాకతప్పదు. వారు కూడా రాజీనామా చేయక తప్పదు. ప్రజా క్షేత్రంలో గులాబీ శ్రేణులు వారిని తిరగనివ్వరు. దాంతో పది ఉప ఎన్నికలు రాకతప్పదు. ఇక ఈ రెండు పార్టీలను కాదని హైదరాబాద్‌ ప్రజలు బిజేపి వైపు చూస్తే భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌లకు నూకలు చెల్లినట్లే. ఎందుకంటే ఒక్కసారి బిజేపి పాగా వేసిందంటే చాలు ఆ రాష్ట్రాలల ఓటమిని చవి చూడడం లేదు. గుజరాత్‌లో ఇప్పటికీ వరసగా ఏడు సార్లు గెలిచి రికార్డు సృష్టించింది. ఇక హాట్రిక్‌ విజయాలు అనేక రాష్ట్రాలలో చవి చూస్తోంది. ఆయా రాష్ట్రాలలో బిజేపిని ఓడిరచడం ఏ పార్టీ వల్ల కావడం లేదు. ఆప్‌లాంటి పార్టీ కూడా డిల్లీలో ఓడిపోయింది. భవిష్యత్తులో బిజేపి తెలంగాణలో పాగా వేస్తే మరో రెండు మూడు దఫాలు ఇతర పార్టీలు లేవడం కష్టమ అవుతుంది. వచ్చే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో బిజేపి జెండా ఎగురవేస్తుందని చెప్పడంలో సందేహం అవసరమే లేదు. అంతే కాకుండా ఈ రెండు గెలిస్తే, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కూడా వేటు వేయాలని బిజేపి డిమాండ్‌ చేస్తుంది. ఆ కార్యాచరణ ఊపందుకుంటుంది. ఇతర పార్టీల నుంచి బిజేపిలోకి వలసలు కూడా మొదలౌతాయి. పంచాయితీ ఎన్నికల్లో కూడా బిజేపి మెరుగైన స్ధానాలు గెల్చుకుంటుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తీర్పు వస్తే, ఉప ఎన్నికలు మళ్లీ వస్తే ఆ స్ధానాలు బిజేపి వశం కాకతప్పదు. పైగా ఇంత కాలం గోషామహల్‌ నుంచి రాజాసింగ్‌ వ్యక్తిగత బలంతో గెలుస్తున్నాడా? లేక బిజేపి బలంతో గెలుస్తున్నాడా కూడా తేలిపోతుంది. ఒక వేళ ఈ ఉప ఎన్నికలో కూడా రాజాసింగే గెలిస్తే మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో రాజాసింగ్‌ హీరో కావడం కూడా స్పష్టం.

రేషన్ డీలర్ల కృషిని గుర్తించాలి.

రేషన్ డీలర్ల కృషిని గుర్తించాలి’

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి: అధికారులు ఏ ఆదేశాలు జారీచేసిన వాటిని ఎంత కష్టమైనా ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా కష్టపడడంలో రేషన్ డీలర్లు ఎప్పుడు ముందుంటారని కోహీర్ మండల రేషన్డీలర్ల సంఘం అధ్యక్షుడు గరుగుబాయి అశోక్ తెలిపారు. ప్రభుత్వాలు రేషన్ పంపిన విషయాన్ని చెప్పుకుంటున్నాయంటే కారణం దాని వెనుక ప్రభుత్వ అధికారుల తర్వాత రేషన్డీలర్లే అని అన్నారు. వారి కృషిని ప్రభుత్వం గుర్తుంచి కమిషన్ అమలుచేయాలని కోరారు.

జాతీయ సదస్సుకు తిరుపతి మేయర్‌ను.!

*జాతీయ సదస్సుకు తిరుపతి మేయర్‌ను ఆహ్వానించకపోవడం అన్యాయం..

-కేంద్ర మంత్రికి ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు..

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 01:

 

 

 

హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ నెల‌ 3, 4 తేదీల్లో రాజ్యాంగం ప్రజాస్వామ్యం, జాతి నిర్మాణంలో పట్టణ స్థానిక సంస్థల పాత్ర” అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి తిరుపతి మేయర్ డాక్ట‌ర్ శిరీష‌ను ఆహ్వానించకుండా, డిప్యూటీ మేయర్‌ను నామినేట్ చేస్తూ ప్రభుత్వం జిఓ జారీ చేయడంపై తిరుపతి పార్లమెంటు సభ్యులు డా.మద్దిల గురుమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రోటోకాల్ ఉల్లంఘనపై కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వశాఖా మంత్రి మనోహర్ లాల్ కి ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదులోని అంశాలు పరిశీలిస్తే …

ఈ సమావేశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన శాఖ విడుదల చేసిన

జీవో ప్రకారం, తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ను ఈ సదస్సుకు పంపనున్నట్లు పేర్కొనడం, ప్రజా ప్రాతినిధ్య నిబంధనలను ఉల్లంఘించడమేనని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.

మేయర్‌గా ప్రజలచే నేరుగా ఎన్నికయ్యే వ్యక్తి, నగరానికి పూర్తి ప్రతినిధిగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందన్నారు. అలాంటి అధికారిక హోదా కలిగిన వ్యక్తిని పక్కన పెట్టి డిప్యూటీ మేయర్‌ను ఎంపిక చేయడం సబబు కాదని పేర్కొన్నారు.

ఇది కేవలం ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ నిబంధనలను ఉల్లంగించడమేనని ఎంపీ స్పష్టం చేశారు.

తిరుపతి మేయర్ డాక్టర్ శిరీషా తిరుపతి నగరపాలక సంస్థకు మొట్టమొదటగా ఎన్నికైన మహిళా మేయర్, ప్రముఖ వైద్యురాలు, బీసీ యాదవ కమ్యూనిటీకి చెందినవారు కావడం విశేషం అని ఆయన తెలిపారు.

ఆమె ఎన్నిక, సామాజిక న్యాయం, అలాగే పురుషుల‌తో స‌మానంగా రాజ‌కీయాల్లో మ‌హిళ‌లు రాణిస్తున్నార‌నేందుకు నిదర్శనమని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు.

ఈ ఘటనపై కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వశాఖ తక్షణమే జోక్యం చేసుకొని, తిరుపతి మేయర్‌కు సదస్సుకు తగిన ఆహ్వానం అందేలా చూడాలని, అలాగే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఎంపీ డిమాండ్ చేశారు.

బీసీ సంఘం చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుడిగా.!

బీసీ సంఘం చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుడిగా బండమీది వెంకటయ్య

శంకర్‌పల్లి: నేటి ధాత్రి:

 

శంకర్‌పల్లి మండలం మోకిల గ్రామానికి చెందిన బండమీది వెంకటయ్య బీసీ సంఘం చేవెళ్ల నియోజకవర్గం అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సభ్యుడు, సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చేతుల మీదుగా మంగళవారం నియామక ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బండమీది వెంకటయ్య మాట్లాడుతూ సంఘం బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని, తన నియామకానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆర్.కృష్ణయ్యను బండమీది వెంకటయ్య శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో గౌండ్ర సత్యం, శ్రీనివాస్ ఉన్నారు.

మల్లయ్య దర్శనం కోసం అడవి శాఖ అనుమతి.

మల్లయ్య దర్శనం కోసం అడవి శాఖ అనుమతి.

అచ్చంపేట నేటి ధాత్రి:

 

బజరంగ్ దళ్ అచ్చంపేట ఆధ్వర్యంలో మంగళవారం నాగర్ కర్నూల్ DFO రోహిత్ గోపిరేడీని కలిసి తొలి ఏకాదశి పర్వదినాన లొద్ది మల్లయ్య దేవస్థాన దర్శన నిమిత్తం అటవీ అనుమతి కొరకు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా భజరంగ్ దళ్ అచ్చంపేట సంయోజక్ శివ చంద్ర గౌడ్ మాట్లాడుతూ..ప్రతి ఏటా తొలి ఏకాదశి పర్వదినాన లొద్ది మల్లయ్య దేవస్థాన దర్శనం చేసుకోవడం ఈ ప్రాంత ప్రజల ఆనవాయితీ & సంప్రదాయంగా వస్తుంది, అందుకుగాను ఈ సంవత్సరం ఈనెల 6వ తేదీన తొలి ఏకాదశి పర్వదినాన సందర్భంగా లొద్ది మల్లయ్య దేవస్థానానికి దర్శనం నిమిత్తం అటవీ అనుమతులు ఇవ్వవలసిందిగా DFO రోహిత్ గోపిడి గారికి వినతి పత్రం అందించడం జరిగింది వారు సానుకూలంగా స్పందిస్తూ తొలి ఏకాదశి సందర్భంగా ఒకరోజు అనుమతి ఇస్తామని, ఈ ప్రాంత ప్రజలు లొద్ది మల్లయ్యను దర్శనం చేసుకోవచ్చని, పర్యాటకులకు అనుమతి లేదని, ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, అభయారణ్యంలో వెలసిన ఈ దేవస్థానానికి తగు జాగ్రత్తలు తీసుకొని, చెట్లను కొట్టకుండా & జంతువులకు హాని కలిగించకుండా దర్శనం చేసుకోవాల్సిందిగా వారు సూచించారు,అభయారణ్యంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధం అని సూచించారు.ఈ కార్యక్రమంలో నాయకులు చందులాల్ చౌహాన్, శివాజీ నరేష్, తిరుపతి, అజయ్ కుమార్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి.

మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి

మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు

పరకాల నేటిధాత్రి

 

 

 

ప్రస్తుతం వర్షాలు పడి మొక్కలు నాటడానికి అనువైన సమయమైనందున మండల పరిధిలోని అన్ని గ్రామాలలోని నర్సరీలలో పెంచిన మొక్కలు ఇంటికి 6 మొక్కల చొప్పున పంపిణీ చేసి ప్రతి మొక్క ఏనుకునేలా చూడాలని యంపీడీఓ పెద్ది ఆంజనేయులు అన్నారు.మండలంలోని లక్ష్మీపూర్ గ్రామం అంగన్వాడీ సెంటర్లో నాటుదాం ఒక చెట్టు అమ్మ పేరు మీద కార్యక్రమం లో బాగంగా చిన్నారి చే మొక్క నాటించి పర్యావరణ పరిరక్షణ చేయాలని ఆదేశించారు.అనంతరం గ్రామంలో ఇంటింటికి మొక్కలు పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభించి రెండు రోజుల లో మొక్కల పంపిణీ చేసి వెబ్ సైట్ లో నమోదు చేయాలని అలాగే మిగతా ప్లాంటేషన్ కూడా పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో
పంచాయతీ కార్యదర్శి రిజ్వానా అంగన్వాడీ టీచర్ స్రవంతి,పాఠశాల ప్రధానోపాధ్యాయులు సారంగపాణి ఉపాధ్యాయులు బాసాని లత గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

తహశీల్దార్ కార్యాలయం ముట్టడి .

తహశీల్దార్ కార్యాలయం ముట్టడి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మున్సిపల్ హోతి(కె)లో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ తాళాలు లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలని, అధికారులు 20 రోజుల్లో ఇస్తామన్న హామీ నిలబెట్టుకోక పోవడంతో నిరసిస్తూ మంగళవారం రోజు సిపిఎం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించి తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. తాసిల్దార్ కార్యాలయం ముట్టడించి బైటాయించిన సందర్భంగా అధికారులతో వాగ్వాదం జరిగింది, స్పష్టమైన తేదీ ప్రకటించే వరకు కదిలేది లేదని కూర్చోవడం జరిగింది. తాహసిల్దార్ డిప్యూటీ తహసిల్దార్ తో సిపిఎం నాయకులతో ఫోన్లో మాట్లాడి 7వ తేదీలోగా ఇళ్ల తాళాలు అప్పచెబుతామని, అప్పటివరకు వేచి ఉండాలని ఆలోపు కచ్చితంగా ఇస్తామన్నా స్పష్టమైన హామీతో ఆందోళన విరమించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జహీరాబాద్ ఏరియా కమిటీ సభ్యులు ఎస్.మాట్లాడుతూ పేదలకు వచ్చిన ఇళ్లను ఇవ్వకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని, తక్షణమే లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంటి అద్దెలు చెల్లించలేక పేదలు పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురవుతున్నారని తక్షణమే ఇంటి తాళాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈసారి కూడా అధికారులు ఇచ్చిన హామీ ప్రకారం ఏడవ తేదీ లోపు ఇళ్ళ తాళాలు ఇవ్వకుంటే లబ్ధిదారులే వెళ్లి ఇళ్లల్లో ఉంటారని, నివసిస్తారని అన్నారు. ఆ పరిస్థితి వరకు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వెంటనే ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తిరుపతి, సలీం, బక్కన్న, డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు శ్రీనివాస్, శివకుమార్, యాదుల్, స్వప్న, తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛత స్వచ్ఛ సర్వేక్షన్ నిర్వహణ.

స్వచ్ఛత స్వచ్ఛ సర్వేక్షన్ నిర్వహణ

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

శాయంపేట మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో స్వచ్ఛత స్వచ్ఛ సర్వేక్షన్ నిర్వహించారు. గ్రామీణ 2025లో భాగంగా స్వచ్ఛతపై గ్రామాల్లో ర్యాంకింగ్ ఇవ్వడా నికి సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించి స్వచ్ఛత స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా హుస్సేన్ పల్లి, ఆరేపల్లి, నర్సింహులపల్లి వెరిఫికేషన్ గా పర్యటించి గ్రామాల్లో ఉన్నటువంటి తడి పొడి చేత్త నిర్వహణ ప్లాస్టిక్ వేస్ట్ యూనిట్ గ్రామపంచాయ తీలో పనితీరు, మరుగుదొడ్ల నిర్వహణ సోక్పిట్ మరియు సామాజిక తనిఖీలు నిర్వహిం చి గ్రామాల్లో మెరుగైన పరిశుభ్ర త ఎలా ఉంది అనేదానిపై తనిఖీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడిఓ ఫణి చంద్ర ,ఏంపిఓ రంజిత్, ఏపీఓ అనిత గ్రామ పంచాయతీ కార్యదర్శిలు స్వచ్ఛభారత్ కన్సల్టెంట్ సంపత్ కుమార్ ఎస్ ఎస్ జి టీం సభ్యులు రాజు, రాణి, రేవంత్ మరియు కారోబార్లు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

విద్యుత్ షాక్ తో దుక్కిటేద్దు మృతి

విద్యుత్ షాక్ తో దుక్కిటేద్దు మృతి

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి రూరల్ మండలం గొల్లబుద్దారం గ్రామానికి చెందిన రత్నం సుధాకర్ S/. మల్లయ్య అనే రైతు దుక్కిటేద్దు రోజు వారి లాగే మేతకు వెళ్ళింది ఎస్సీ కాలనీ దగ్గర ట్రాన్స్ఫార్మర్ కరెంట్ తీగలు వేలాడి ఉండటం తో కరెంట్ షాక్ కు గురైన దుక్కిటేద్దు అక్కడే మృతి చెందింది ఆ ఎద్దు విలువ 1,00,000/- లక్ష రూపాయల వరకు ధర ఉంటుంది రోజు వారి కూలి పనులు చేసుకునే జీవనం కొనసాగించే ఆ కుటుంబనికి సంబందించిన ఎద్దు చనిపోవడం చాలా బాధాకరం విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఈ ఘటన జరిగింది కావున వారే పూర్తి బాధ్యత వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తమ నిరుపేద కుటుంబన్ని ఆదుకొని 1,00,000/- నష్ట పరిహారం చెల్లించాలని ఆ కుటుంబ సభ్యులు అధికారులను వేడుకోవడం జరిగింది…

ప్రాముఖ కాంట్రాక్టర్ జావిద్ గారిని పారామర్శించిన.

ప్రాముఖ కాంట్రాక్టర్ జావిద్ గారిని పారామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై నరోత్తం ..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

జే.జే.కన్స్ ట్రక్షన్స్ అధినేత జావిద్ గారి మాతృమూర్తి మరణించిన విషయం తెలిసి ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు ఈ రోజు వారి ఇంటికి వెళ్ళి వారిని పరామర్శించి వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.

గ్రామాల్లో రోజూ పారిశుధ్య నిర్వాహణ చేయాలి

గ్రామాల్లో రోజూ పారిశుధ్య నిర్వాహణ చేయాలి

మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు

పరకాల నేటిధాత్రి

 

గ్రామాలల్లో ప్రతిరోజు పారిశుధ్య పనులు చేయించాలని పరకాల ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమై వర్షాలు కురిసి నీరు నిలిచి దోమలు వ్యాప్తి చెంది సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అందరు పంచాయతీ కార్యదర్శులు తమ గ్రామాలలో మురికి కాలువలు శుభ్రం చేయడం,దోమల నివారణ మందు పిచికారి చేయడం ఆయిల్ బాల్స్ తయారు చేసి నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో వేయడం లాంటి ముందస్తు చర్యలు తీసుకుని అంటు వ్యాధులు ప్రబలకుండా చూడాలని ప్రజల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తే సహించబొమని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.అలాగే గ్రామాలలో ఎవరైనా జ్వరం తో బాద పడుతున్నట్లు గమనిస్తే వైద్య సిబ్బందికి వెంటనే తెలియ చేయాలని తెలిపారు.

రాజీవ్ యువ వికాస్ పథకం జాడ ఎక్కడ.

రాజీవ్ యువ వికాస్ పథకం జాడ ఎక్కడ

ఎదురుచూస్తున్న… యువత నిరుద్యోగులు

వీణవంక, (కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి :

 

 

 

 

వీణవంక మండల కేంద్రంలో
బిఆర్ఎస్వి సీనియర్ నాయకులు హొల్లాల శ్రీకాంత్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడుస్తున్న ఇదిగో పథకం అదిగో పథకం అని ప్రజలను మోసం చేస్తూ ప్రజా ప్రభుత్వం కాలయాపన గడుపుతూ యువతకు నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాస్ పేరుతో దరఖాస్తులు తీసుకొని మూడు నెలలు గడిచిన ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల యువత జేబులు చిల్లుపరిచి ఇన్కమ్,క్యాస్ట్, రెసిడెన్సి సర్టిఫికెట్ల కోసం ఇబ్బందులు గురిచేసి దరఖాస్తులు పెట్టుకొని మూడు నెలలు గడిచిన ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా కాలం వెళ్లబుచ్చుతూ యువతరాన్ని నిరుద్యోగులను నిరాశపరిచే దిశగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని వెంటనే వారు ఇచ్చిన హామీల్లో భాగంగా రాజీవ్ వికాస్ పేరుతో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను ఎంపిక చేసి నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు .

error: Content is protected !!
Exit mobile version