కొత్తగా ఏర్పడిన కోహిర్ మున్సిపాలిటీతో ప్రజల కష్టాలు తెర్చే అధికారులే లేరు
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ కొత్తగా మునిసిపాలిటీగా ఏర్పడిన తర్వాత అధిక సమస్యలు ఎదుర్కొంటున్న కోహిర్ ప్రజానీకం సమస్యలు చెప్పుకోవడానికి మున్సిపాలిటీ అధికారులు దిక్కులేరు,, వీధిలైట్లు లేక,,, మురికి నీరు నిండి వివిధ రోగాల బారిని పడుతున్న ప్రజలు,, బర్త్ సర్టిఫికెట్లు,, డెత్ సర్టిఫికెట్లు రాక,, రోడ్లు గుంతల మయమై ప్రజలు ఇబ్బందులు పడుతున్న,, ప్రజల ఇండ్లు రికార్డులో ఒకరి పేరు ఆన్లైన్లో ఇంకొకరి పేరు ఇలా ఎన్నో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమస్యను చెప్పుకుందాం అని వెళితే అధికారులు దిక్కులేరు టిపిఓ టౌన్ ప్లాన్ ఆఫీసర్ నియమితులై ఎన్నో రోజులు గడుస్తున్న ప్రజలకు అందుబాటులో లేకుండా కనీసం సమస్య తెలపటానికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ప్రతిస్పందన లేకుండా ప్రజల ఫోన్ నెంబర్లను బ్లాక్ లిస్టులో వేస్తూ వాట్సాప్ లో సమస్యల గురించి విన్నవించుకున్న నిమ్మకు నెరెత్తినట్టు ప్రజల కష్టాలను తీర్చడమే లేకుండా ఇంకా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న ఇలాంటి అధికారుల పైన కోహిర్ మున్సిపల్ కమిషనర్ ,,, జిల్లా కలెక్టర్,, CDMA కమిషనర్ చర్యలు తీసుకొని ఇలాంటి అధికారులను సస్పెండ్ చేసి ప్రజలకు సేవ చేసి అధికారిని నియమించవలసిందిగా ప్రజల విజ్ఞప్తి చేస్తున్నారు.
.సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్
భూపాలపల్లి నేటిధాత్రి
జులై 9న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని మారపల్లి మల్లేష్ పిలుపునిచ్చారు. బుధవారం రోజున జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలన్నారు. పెట్టుబడ్డిదారుల ప్రయోజనాల కోసం కార్మికులకు ఉన్న హక్కులను కాళ్లరాస్తున్నారన్నారు. పనిగంటలు పెంచడంతోపాటు కార్మిక వర్గాన్ని ఐక్యంగా లేకుండా నాలుగు లేబర్ కోడ్ లతో బలిచ్చే విధంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని కోరుతున్నాము.ఏఐఎస్ఏ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి శీలపాక నరేష్.. రాజు.. పాల్గొన్నారు.
నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మ శాస్త అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్పస్వామికి ఘనంగా అష్టాభిషేకాలు నిర్వహించారు.అయ్యప్పస్వామి ఉత్తర నక్షత్ర జాతకంతో జన్మించిన నేపథ్యంలో ప్రతీ నెల వచ్చే ఉత్తర నక్షత్ర గడియలు వస్తున్న తరుణంలో నర్సంపేట శ్రీ ధర్మ శాస్త దేవాలయ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గత ఐదు నెలలుగా ప్రత్యేక పడిపూజలు నిర్వహిస్తున్నారు.కాగా బుదవారం దేవాలయ ట్రస్టు చైర్మన్ సింగిరికొండ మాధవశంకర్ గుప్తా, అధ్యక్షుడు సైపా సురేష్ ఆధ్వర్యంలో దేవాలయంలో అయ్యప్పస్వామి పడిపూజ నిర్వహించారు.ఉదయం గర్భగుడిలో సుప్రభాతంతో మొదలై హోమం కార్యక్రమం,ప్రత్యేక పూజలు చేపట్టారు.అనంతరం అయ్యప్పస్వామి ఉత్తర నక్షత్ర పడిపూజ, అభిషేకం,అన్నదాన దాతగా వంగేటి పద్మావతి గోవర్ధన్ కుటుంబం ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు దేవేశ్ మిశ్రా బృందం వేధ మంత్రోచ్చారణతో మహాదివ్య పడిపూజ చేపట్టారు.ముందుగా 18 కలశాల పూజలు,మెట్ల పూజలు చేశారు.ఈ సందర్భంగా అయ్యప్పస్వామికి నెయ్యి, తేనే,చక్కర,పంచాంతృతం,గంధం, విభూదితో అష్టాభిషేకాలు,కలశాభిషేకాలు చేపట్టారు. అనంతరం పుష్పాభిషేకం చేశారు.ఈ నేపథ్యంలో పడునెట్టాంబడిపై కర్పూర జ్యోతులతో వెలిగించడంతో భక్తులు మురిసిపోయారు.కళ్యాణరాముడు సురేష్,రంగనాథ్ బృందం ఆలపించిన భజన పాటలతో,భక్తుల శరణఘోషతో దేవాలయ ప్రాంగణం ఎంతగానో మారుమ్రోగింది.అనంతరం మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం దాత వంగేటీ పద్మావతి గోవర్ధన్ కుటుంబం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో దేవాలయ ట్రస్టు కోశాధికారి దొడ్డ రవీందర్ గుప్తా,శ్రీరాం ఈశ్వరయ్య ఇరుకుల్ల వీరలింగం,భూపతి లక్ష్మీనారాయణ,బండారుపల్లి చెంచారావు,దొడ్డ వేణు,మల్యాల రాజు,మల్యాల ప్రవీణ్,భీరం నాగిరెడ్డి,రాంచందర్,కర్ణాకర్,మండల వీరస్వామి గౌడ్,బాదం అనిల్,శ్రీనివాస్,గురుస్వాములు సంజీవ రావు, యాదగిరి,అనిల్,ఆలయ గుమస్తా దేశి రాము అర్చకులు ఫ్రాన్స్,శివాంకిత్,ఆనంద్,తో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
లక్ష్యం మేరకు జూనియర్ కళాశాలలో అడ్మిషన్స్ సాధించాలి
జూనియర్ కళాశాలలో మరమ్మత్తు పనులు వేగంగా పూర్తి చేయాలి
జూనియర్ కళాశాలలో మెరుగైన ఫలితాల సాధనకు కృషి
ఇంటర్ విద్య పై ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
జూనియర్ కళాశాలలో మెరుగైన బోధన అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో ఇంటర్ విద్య పై ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లతో సమీక్ష నిర్వహించారు. జూనియర్ కళాశాలలో విద్యార్థుల ఎనరోల్ మెంట్, ఇంటర్ పరీక్షా ఫలితాల, జూనియర్ కళాశాలలో మైనర్ రిపేర్, విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాలు, పోటి పరీక్షల శిక్షణ, ఫైర్ సేఫ్టీ, ఇతర మౌలిక సదుపాయాలు తదితర అంశాల పై కలెక్టర్ చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు.
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న 10 ప్రభుత్వ జూనియర్ కళాశాల పరిధిలో మొదటి సంవత్సరం 1777 అడ్మిషన్స్ సాధించడం లక్ష్యం కాగా 63% 1116 మంది విద్యార్థులు ఎనరోల్ చేసుకోవడం జరిగిందని అన్నారు. జూనియర్ కళాశాలలో అడ్మిషన్స్ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. జూనియర్ కళాశాలలో సివిల్ వర్క్ , విద్యుత్ సరఫరా, పారిశుధ్య, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల కల్పన, మైనర్ రిపేర్ పనులకు ప్రభుత్వం 1కోటి 80 లక్షల రూపాయల మంజూరు చేసిందని, నిధులను సద్వినియోగం చేసుకుంటూ మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు.
జూనియర్ కళాశాలలో అందించే విద్య నాణ్యత పెరగాలని అన్నారు. లెక్చరర్ సకాలంలో కళాశాలకు హాజరు కావాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన జరగాలని అన్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో సప్లమెంటరీ పరీక్షలు ముగిసిన తర్వాత వేములవాడ ,ఎల్లారెడ్డి పేట, ఇల్లంతకుంట కళాశాలలో ఫలితాలు తక్కువగా వచ్చాయని తెలిపారు.
సిరిసిల్ల జిల్లాలో ఇంటర్ విద్య చాలా వెనకబడిందని, మౌలిక వసతుల కల్పన పనులు, పరీక్ష ఫలితాలో చాలా ఇంప్రూవ్ కావాలని అన్నారు. జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంక్షేమం కోసం అవసరమైన చర్యలు కట్టుదిట్టంగా తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.ప్రతి జూనియర్ కళాశాలలో రెగ్యులర్ గా స్టూడెంట్ కౌన్సిలర్ల ద్వారా విద్యార్థులకు అవసరమైన శిక్షణ అందించాలని అన్నారు.
జూనియర్ కళాశాలలో యాంటి డ్రగ్స్ కమిటీ ఏర్పాటు చేసి పోలీసుల సహకారంతో విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్ధాల పై అవగాహన కల్పించాలని అన్నారు. విద్యార్థులకు కెరియర్ కౌన్సిలింగ్ అందించాలని అన్నారు. జూనియర్ కళాశాలలో క్రీడలు ఆడు ఎందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
మన జిల్లాలోని జూనియర్ కళాశాల విద్యార్థులకు మెడిసిన్, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల కోసం అందించిన ప్రత్యేక శిక్షణ కారణంగా మంచి ఫలితాలు సాధించారని, ఇదే స్పూర్తి కొనసాగించాలని అన్నారు. జూనియర్ కళాశాలలో విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు, ఇతర పోటీ పరీక్షల పుస్తకాలు , టెన్నిస్ కోర్ట్ టేబుల్ టెన్నిస్ క్యారం బోర్డులు చెస్ బోర్డులు ఏర్పాటు చేసి అందించాలని అన్నారు. విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆ రూట్ లలో కాలేజీ సమయాలకు అనుగుణంగా బస్సులు నడిచేలా ప్రతిపాదనలు అందించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శ్రీనివాస్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లు, తదితరులు పాల్గొన్నారు.
నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే సాయంచేయేది లేదు
బిఆర్ఎస్ విమర్శలకు ధీటుగా సమాధానం విసిరిన కాంగ్రెస్ నాయకులు
వర్ధన్నపేట (నేటిధాత్రి):
బిఆర్ఎస్ నాయకులారా, మీరు నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి ఇది దొరల గడీ కాదు, ప్రజాస్వామ్యం. మీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని మేము విమర్శించడం సిగ్గుచేటంట? మరి మీరు ప్రజా సమస్యలపై మాట్లాడకుండా, పచ్చి అబద్ధాలతో బురద జల్లుడు రాజకీయం చేయడం సిగ్గుచేటు కాదా? ఎర్రబెల్లి పాలకుర్తి, వర్ధన్నపేట నియోజకవర్గాలను అభివృద్ధి చేశారని అంటున్నారు. ఏ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు? ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చలేని అభివృద్ధి మీదా? రోడ్లు లేవు, తాగునీరు లేదు, విద్య లేదు, వైద్యం లేదు. ఇదేనా మీ అభివృద్ధి? కేవలం తమ ఆస్తులు, అంతస్తులు పెంచుకోవడమే అభివృద్ధి అనుకుంటే అది మీ భ్రమ.
నాగరాజు గెలుపు అడ్డి మీద గుడ్డి దెబ్బ అంటారా? అది ప్రజల తీర్పు. ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టే నాగరాజును గెలిపించారు. ప్రజల తీర్పును అవమానించి, మీ అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ లాంటి గొప్ప నాయకుల మన్ననలు పొందిన చరిత్ర దయాకర్ రావుది అని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆ గొప్ప నాయకుల మార్గంలో నడుస్తూ ప్రజలకు ఏం చేశారో చెప్పండి. కేవలం పదవుల కోసం పార్టీలు మారడం, ప్రజలను మోసం చేయడమేనా మీ గొప్ప చరిత్ర? “దొరల పెత్తనం” అని అంటున్నాం, మా చుట్టూ ఉండి మమ్మల్ని నడిపించేది దొరలే అంటారా? మా చుట్టూ ఉన్నది ప్రజలు! ప్రజల ఆశీస్సులతో, ప్రజల మద్దతుతోనే మేము ముందుకు వెళ్తున్నాం.
మీ చుట్టూ ఉన్నది కేవలం మీ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసే పెత్తందారులు మాత్రమే. అందుకే మీకు ప్రజల కష్టాలు కనిపించడం లేదు. మేము మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచే సీన్ మాకు లేదంటారా? అది ప్రజలు నిర్ణయిస్తారు. మీ ముఖ్యమంత్రే ప్రజలు తనను దొంగలా చూస్తున్నారని చెప్పిన విషయం మీరు మర్చిపోయినట్టున్నారు. ప్రజలు మిమ్మల్ని ఎందుకు చీత్కరించారో ఆ మాటలే నిదర్శనం.
స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని చోట్లా బిఆర్ఎస్ జెండా ఎగురుతుందనేది మీ పగటి కల. ప్రజలు మేల్కున్నారు. మార్పు కోసం సిద్ధంగా ఉన్నారు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ జెండానే ఎగురుతుంది.
నోరు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మాకు నీతులు చెబుతారా? మీ నాయకులు, మీ కింద పనిచేసే చెంచాలు మాట్లాడుతున్న బూతుల గురించి ఆలోచించండి. దయాకర్ రావును విమర్శించే స్థాయి మాకు లేదంటారా? ప్రజల పక్షాన నిలబడి, అన్యాయాలను ప్రశ్నించే ధైర్యం మాకు ఉంది. మాకు ఏ స్థాయి అవసరం లేదు. ప్రజల మద్దతు ఉంటే చాలు.
ఖబడ్దార్ కాంగ్రెస్ చెంచాలారా అని హెచ్చరిస్తున్నారా? గుర్తుంచుకోండి, మేము చెంచాలం కాదు, ప్రజల సేవకులం. ప్రజాస్వామ్యంలో ప్రజలే నాయకులు. మీరు ప్రజలను కించపరుస్తూ, అహంకారంతో మాట్లాడితే ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మీ పతనం దగ్గరలోనే ఉంది. అని వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య ,మండల పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ, బ్లాక్ పార్టీ అధ్యక్షుడు అబిడి రాజిరెడ్డి లు సంయుక్తంగా ఆరోపించారు… ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ మైస సురేష్ , సీనియర్ నాయకులు కమగోని ప్రభాకర్ గౌడ్ , దుబ్బాక శివకుమార్ చీటూరి రాజు కుక్కల రాకేష్ ఆరేల్లి ఆరెల్లి ప్రభాకర్, గోధుమల విక్రం ముంజకృష్ణ తో పాటు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…
9న దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మెను విజయవంతం చేయాలి
సిఐటియు జిల్లా అధ్యక్షులు బందు సాయి
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆటో ప్రచార జాత కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఐటీయూ పార్టీ జిల్లా అధ్యక్షులు బందు సాయిలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 9న దేశవ్యాప్త సమ్మెలో కార్మికులంతా ఐక్యంగా పాల్గొనాలి,కార్మికులను బానిసత్వంలోకి నెట్టే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి.కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26,000/-లుగాని నిర్ణయించాలి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయరాదు. ప్రభుత్వరంగ సంస్థల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చెయ్యాలి. అసంఘటితరంగ కార్మికులను యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్’ను ప్రవేశపెట్టాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర బడ్జెట్ నిధుల కేటాయింపు పెంచాలి. ఈ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరించాలి.అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం లాంటి స్కీమ్ వర్కర్లకు చట్టపరమైన కనీస వేతనాలు చెల్లించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్,సిఐటియు సహాయ కార్యదర్శి ఆకుదారి రమేష్ ,సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రం దేవేందర్, జిల్లా నాయకులు వెలిశెట్టి రాజయ్య, సిఐటియు జిల్లా నాయకులు శేఖర్,రవికుమార్, రాజేందర్,శంకర్,లక్ష్మణ్,మహేందర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు
ప్రొఫెసర్.జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్.డాక్టర్ జానయ్య
నర్సంపేట,నేటిధాత్రి:
రబీ సీజన్ ఆలస్యం కాకుండా జులైలోనే నీటిని విడుదల చేయడం సంతోషకమని ప్రొఫెసర్.జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్.డాక్టర్ జానయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రొఫెసర్.జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్.డాక్టర్ జానయ్యతో కలిసి .నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలంలోని పాఖాల తూముల గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలువలలోని చెత్త,చెదారాన్ని నిధులు కేటాయించి తొలగించడం జరిగిందని,వచ్చే సీజన్ వరకు మిగిలిపోయిన కాలువల లైనింగ్ కొరకు నిధులు విడుదల చేయించి చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా.జనయ్య మాట్లాడుతూ రబీ సీజన్ పంట కోత దశకు చేరుకొనే నాటికి జూన్ మాసం రావడంతో అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోతున్నారని గ్రహించిన ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గత నెలలో రైతులు,వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించారని అన్నారు. రైతుల నుండి అభిప్రాయాలు సేకరించి,రైతుల కోరిక మేరకు ఆగస్టు నెలలో కాకుండా జులై నెలలోనే పాకాల నీటిని అందిస్తే ఈ సమస్య ఉత్పన్నం కాదని తెలపడంతో ఈ రోజు చెప్పిన ప్రకారం నేడు దొంతి మాధవ రెడ్డి జూలైలోనే నీటిని విడుదల శుభ పరిణామం అని,ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్. వెంకట నారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్,ఇరిగేషన్ ఈఈ సుదర్శన్,ఇతర అధికారులు,నాయకులు పాల్గొన్నారు.
కేజిబివి విద్యాలయాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి.
ఎంజీఎంలో మౌలిక సదుపాయాల మరమ్మత్తుల పనులను ప్రారంభించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:
వరంగల్ జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమావేశమై పనుల పురోగతిని సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఉన్న 10 కేజీబీవీలలో అవసరమగు డార్మటరి,యూరినల్స్ , బాత్రూమ్స్, ఆరో ప్లాంట్స్ పనులు చేపట్టాలని,ఖానాపూర్,దుగ్గొండి, నల్లబెల్లి కేజీబీవీలలో కొనసాగుతున్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. రాయపర్తి కేజీబీవీలో డార్మిటరీ విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు.మిగిలిన కేజీబీవీ లలో కూడా అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ ఎంజీఎం ఆసుపత్రిలో రోగులకు ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ పేర్కొన్న విధంగా సీలింగ్ మరమ్మత్తులు, అంతర్గత మరమ్మత్తులు తదితరులు పనులను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో రామిరెడ్డి, ఎంజీఎం పర్యవేక్షకులు కిషోర్, జిల్లా బాలికల అభివృద్ధి అధికారి ఫ్లోరెన్స్,ఇరిగేషన్ అధికారి సునీత, ఆర్ఎంఓ మాగంటి అశ్వినితో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని కరకగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ 2025-26 విద్యా సంవత్సరం నుండి నూతనంగా తెలంగాణ సార్వత్రిక విద్యా విధానం (ఓపెన్ స్కూల్) ద్వారా పదవ తరగతి, ఇంటర్మీడియట్ చదువుటకు కరకగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేంద్రం నుండి ఓపెన్ స్కూల్ ప్రారంభం అడ్మిషన్లు జరుగుచున్నవి కావున చదువు మధ్యలో ఆపేసి లేదా రెగ్యులర్ గా పాఠశాలలకు వెళ్లలేని వారికోసం తెలంగాణ సార్వత్రిక విద్యా విధానం ద్వారా చదువుకునే అవకాశాన్ని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ కల్పిస్తున్నాయి కావున మండలంలోని వివిధ గ్రామాలలో ఓపెన్ స్కూల్/ఇంటర్మీడియట్ విద్య లో ఉత్తీర్ణత పొందుటకు ఉన్నత చదువులకు పదోన్నతులు ఉద్యోగాలలో ప్రభుత్వ గుర్తింపు ఉంటుందని అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడమైనది. ఓపెన్ స్కూల్/ఇంటర్మీడియట్ అడ్మిషన్లు పొందుటకు ఈ క్రింది సర్టిఫికెట్ తో పదవ తరగతి చదువుకునేవారు టిసి బర్త్ సర్టిఫికెట్ కుల ధ్రువీకరణ పత్రం ఆధార్ కార్డు పాస్ ఫోటో మరియు ఇంటర్మీడియట్ చదువుకునే వారు పదవ తరగతి మార్కుల పట్టిక కుల ధ్రువీకరణ పత్రం ఆధార్ సర్టిఫికెట్ పాస్ ఫోటో లతో కరకగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కో ఆర్డినేటర్ జి మంజుల ఫోన్ నెంబర్ 94911 04082 సంప్రదించగలరు.
జిల్లాలో నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ పోటీ (ఎన్.ఎస్.పి.సి) 2025 పోస్టర్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తన కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ మార్పుల ప్రభావాల నుంచి రక్షణ కోసం విద్యార్థుల్లో పర్యావరణ నైపుణ్యాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవడం అత్యంత అవసరమని, మొక్కలు నాటడం, నీటి సంరక్షణ,వ్యర్థాల వేరుచేయడం వంటి పద్ధతులు ప్రతి విద్యార్థికి అలవాటవ్వాలిని పేర్కొన్నారు.ఈ పోటీని హరిత్ , ద వే ఆఫ్ లైఫ్ అనే నినాదంతో పర్యావరణ సంరక్షణ అనే ఉద్దేశంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తోందన్నారు.జూలై 1 నుండి ఆగస్టు 21 వరకు రిజిస్ట్రేషన్లు అందుబాటులో ఉంటాయనీ,కేంద్ర విద్యా,పర్యావరణ మంత్రిత్వ శాఖల సహకారంతో ఈ పోటీని నిర్వహిస్తున్నారనీ చెప్పారు. ఫలితాలు ఆగస్టు 30న విడుదల విడుదల చేస్తామన్నారు.పోటీ ఐదు విభాగాలలో..1వ నుండి 5వ తరగతి, 6వ నుండి 8వ తరగతి, 9వ నుండి 12వ తరగతి,డిగ్రీ, పీజీ, పరిశోధన విద్యార్థులు,ఇతరులు / సాధారణ పౌరులు పోటీలో పాల్గొనడానికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు అవసరం లేదు.ఈకో మిత్ర https://ecomitram.app/nspc/ అనే మొబైల్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయవచ్చన్నారు.హిందీ, ఇంగ్లీష్ సహా అనేక భాషలలో క్విజ్ అందుబాటులో ఉంటుందనీ, మొక్క నాటుతున్న, నీరు సేవ్ చేస్తున్న లేదా వ్యర్థాలను వేరు చేస్తున్న మీ సెల్ఫీని అప్లోడ్ చేయడం తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రతి విద్యార్థికి పాల్గొన్నందుకు ఈ సర్టిఫికెట్ ఇవ్వబడుతుందనీ, ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన విద్యా సంస్థలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు ఈ పోటీలో పాల్గొనాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జ్ఞానేశ్వర్,జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
నీటి వనరుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం దే సాయిపల్లి కొత్తచెరువు ను. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంరక్షణకు సంబంధించి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తంగళ్ళపల్లి మండలం దేశ పల్లి కొత్త చెరువు కట్ట పరిసరాలను బుధవారం ఉదయం కలెక్టర్ పరిశీలించారు స్థానిక నక్క భాగం నుంచి కొత్త చెరువులోకి వచ్చే ఫీడర్ ఛానల్ లోడి. సిల్టింగ్ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు నీటి వనరుల సంరక్షణ పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇట్టి పర్యటనలో డిస్టిక్. ఇరిగేషన్ ఆఫీసర్ ఈ .ఈ. ప్రశాంత్. డి .ఈ. ఈ. సత్యనారాయణ సాగర్ సంబంధిత.అధికారులు తదితరులు పాల్గొన్నారు
జహీరాబాద్ మండలం శేఖపూర్ గ్రామంలో తేలికపాటి వర్షానికే రోడ్డు పూర్తిగా నీటమునిగిపోతుంది. గుంతలు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చీకట్లో ప్రమాదాలు జరగొచ్చని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్ నుండి మల్చల్మ వరకు రోడ్డును ఇప్పటికీ మరమ్మతులు చేయకపోవడంపై వారు అధికారులు వెంటనే స్పందించి కొత్త రోడ్ వేయాలని కోరుతున్నారు.
డిఫాల్టర్ రైస్ మిల్స్, రేషన్ కార్డులు పంపిణీ ,భూభారతి దరఖాస్తు పరిష్కారం,వన మహోత్సవం ఏర్పాట్ల పై సమీక్షా..
వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:
వరంగల్ జిల్లా పరిధిలోని ప్రతి మండలంలో ఉన్న డిఫాల్టర్ రైస్ మిల్లర్‌ల జాబితాను సిద్ధం చేయాలని,
సంబంధిత మిల్లర్లపై రీవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారంగా చర్యలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య నాదెళ్ల ఆదేశించారు.జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో డిఫాల్టర్ రైస్ మిల్స్, రేషన్ కార్డులు పంపిణీ ,భూభారతి దరఖాస్తు పరిష్కారం,వన మహోత్సవం ఏర్పాట్లపై తహసిల్దార్లు, సివిల్ సప్లై డిఎం,డిసిఎస్ఓలతో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద,అదనపు కలెక్టర్ జి సంధ్యారాణిలు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామసభలు,మీ సేవా కేంద్రాల ద్వారా స్వీకరించిన కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల వెరిఫికేషన్ వేగవంతం చేయాలని,రేషన్ కార్డుల్లో నెంబర్ యాడ్ చేయుట అంశాలపై పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
రేషన్ షాప్ ల ఖాళీల భర్తీకై ప్రభుత్వ నిబంధనల మేరకు ఖాళీలను భర్తీ చేయుటకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆర్డీవోలను ఆదేశించారు.రేషన్ కార్డు లబ్ధిదారులలో డెత్ కేసులు ఉన్నట్లయితే గ్రామపంచాయతీల నుండి నివేదికలు సేకరించి వాటిని పర్యవేక్షించి పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు.భూభారతి ధరకాస్తు పరిష్కారంపై సంబంధిత తాసిల్దార్లతో మాట్లాడుతూ వివిధ మండలాలలో రెవెన్యూ సదస్సుల నిర్వహణలో సేకరించిన దరఖాస్తుల ఆన్లైన్ నమోదు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
జిల్లాలో మహిళా శక్తి స్వయం సహాయక బృందాల ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటు కల్పించే ఉద్దేశ్యంతో మహిళా పెట్రోల్ బంక్ స్థాపనకు ప్రభుత్వ స్థలాలను గుర్తించి నివేదికలు సమర్పించాలని తహసిల్దారులను ఆదేశించారు.పీఎం కుసుమ ప్రాజెక్ట్ కింద సోలార్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా విరివిగా మొక్కలు నాటేందుకు ఒక్కొక్క మండలానికి 5 ఎకరాల చొప్పున ప్రభుత్వ స్థలాన్ని సేకరించి గ్రీనరీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షలో వరంగల్ ,నర్సంపేట ఆర్డీవోలు సత్యపాల్ రెడ్డి, ఉమారాణి, డీసిఎస్ఓ కిష్టయ్య, సివిల్ సప్లయ్ డిఎం సంధ్యారాణి, సంబంధిత మండలాల తహసీల్దార్లు,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
శ్రీశైలంలో నేటి నుంచి ఉచిత స్పర్శ దర్శనం పునః ప్రారంభం
జహీరాబాద్ నేటి ధాత్రి:
శ్రీశైలం మహా క్షేత్రంలో ఈరోజు నుండి గతంలో నిలిపివేసిన ఉచిత స్పర్శ దర్శనాన్ని పునః ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఈ ఉచిత దర్శనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఉచిత దర్శనం గురించి భక్తులకు తెలిసే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు ఈవో ఎం శ్రీనివాసరావు. మై కానౌన్స్మెంట్ ద్వారా అలాగే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి భక్తులు ఉచిత దర్శనానికి ఎలా వెళ్లాలి టికెట్స్ ఎలా పొందాలనే విషయాన్ని పొందుపరిచారు. మధ్యాహ్నం ఒకటి 15 నిమిషాలకు టోకెన్లు జారీ చేసి ఒకటి 45 నుంచి 3:45 వరకు ఈ ఉచిత స్పర్శ దర్శనాన్ని కల్పిస్తున్నట్లు ఈవో తెలిపారు. భక్తుల రద్దని బట్టి 1000 నుంచి 1200 మందికి ఈ ఉచిత స్పర్శ దర్శనం కల్పించే అవకాశం ఉందని వారంలో నాలుగు రోజులు ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయం ఈ ఉచిత స్పర్శ దర్శనానికి కేటాయించామని ఈవో తెలిపారు.
◆ డాక్టర్స్-డే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సన్మానం
◆ డా౹౹సిద్దం.ఉజ్వల్‌రెడ్డి గారికి ఘన సన్మానం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని ఉజ్వల్‌రెడ్డి గారి స్వగృహంలో డాక్టర్స్-డే పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం ఉజ్వల్‌రెడ్డి గారికి మరియు వారి మిత్రులు డా౹౹ప్రమోద్ గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా డాక్టర్స్-డే పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్‌రెడ్డి మాట్లాడుతూ వైద్య వృత్తి అనేది ఒక నిరంతర సేవా మార్గమని మానవత్వాన్ని కాపాడే గొప్ప బాధ్యత అని వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదేనని, ప్రాణాలు పణంగా పెట్టి రోగులకు సేవలందిస్తున్నామని అన్నారు. ఈకార్యక్రమంలో సీడీసీ చైర్మన్ ముబీన్, సీనియర్ నాయకులు శ్రీకాంత్‌రెడ్డి,అక్బర్, టీపీసీసీ జిల్లా మీడియా & కమ్యూనికేషన్ కన్వీనర్ అశ్విన్ పాటిల్, యూత్ కాంగ్రెస్ జిల్లా లీగల్ సెల్ చైర్మన్ నతానియల్ ,యూత్ కాంగ్రెస్ న్యాల్కల్ మండలం అధ్యక్షుడు జి.కిరణ్‌కుమార్‌గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు నరేష్ బబ్లూ, ఇమామ్ పటేల్ మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
విత్తన స్వయం సమృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం :
ఎమ్మెల్యే కాలే యాదయ్య
శంకరపల్లి, నేటిధాత్రి :
విత్తన స్వయం సమృద్ధే లక్ష్యంగా రైతులకు నాణ్యమైన విత్తనాల పంపిణీ చేస్తున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. శంకర్ పల్లి పట్టణ కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ ఆహార భద్రతా మిషన్ పథకం కింద రైతులకు ఉచితంగా కంది విత్తనాలు (మినీ కిట్స్ – చిరు సంచులు)ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించి, స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందన్నారు. నకిలీ విత్తనాల అమ్మకాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.
◆ పవర్ ప్రెస్ యంత్రం మీదపడి చేతి కోల్పోయిన కార్మికుడు
◆ రూ.20లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సీఐటీయూ డిమాండ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణ పరిధిలోని ముంగి పరిశ్రమ యాజమాన్యం అనుసరిస్తున్న కార్మికుల భద్రతా చర్యల వైఫల్యం కారణంగా జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు తన చేయిని కో ల్పోవాల్సి వచ్చింది. పవర్ ప్రెస్ మిషన్ నెంబ ర్.1ఫేయిలై కార్మికుడిపై పడడంతో మిషన్ ఆ పరేటర్ కే.గణేష్ కుడి చేయిని కోల్పోయాడు. స్థానిక పరిశ్రమలో తరచూ ఇలాంటి ఘోరాలు సర్వసాధారణమని కార్మికులు ఆరోపిస్తున్నారు. కర్ణాటక రేకుల్గి గ్రామానికి చెందిన క్షతగాత్రుడు గణేష్ 13 ఏళ్లుగా కాంట్రాక్టు కార్మికునిగానే పనిచేస్తూ కుటుంబానికి పోషిస్తున్నాడు. అకస్మా త్తుగా పవర్ ప్రెస్ మిషన్ ఫెయిలై చేయిపై పడటంతో జరిగిన ప్రమాదంలో తన కుడి చేయి మొత్తం నుజ్జు నుజ్జునుజ్జె రెండు ముక్కలైంది.
వెంటనే ఆయనను స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు శస్త్ర చికిత్స ద్వారా చేయి తొలగించి చికిత్స చేశారు. ఆయనకు భార్య ఇద్దరు ఆడ, ఒక మగ సంతానం ఉన్నారు. కార్మికుడిని ఆదుకోవాలని సీఐటీయూ పారిశ్రామిక క్లస్టర్ కన్వీనర్ యస్.మహిపాల్ డిమాండ్ చేశారు. అదే పరిశ్రమలో కార్మికుడిని పర్మినెంట్ ఉద్యోగిగా తీసుకోవాలని, రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లిం చాలని, వైద్య ఖర్చులు పూర్తిగా యాజమాన్యమే భరించాలని, ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
త్యాగానికి ప్రతీకగా మొహర్రంను నిర్వహిస్తారు. జిల్లాలో పీర్లపండుగ(మొహర్రం) పెద్దఎత్తున ప్రారంభమైంది. కర్బలా మైదానంలో మహమ్మద్ ప్రవక్త మనుమడు ఇమాం హుస్సేన్ బలిదానాన్ని స్మరిస్తూ ముస్లింల్లోని ఓవర్గం మొహర్రంను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇస్లామిక్ క్యాలెండరు ప్రకారం మొదటి మాసాన్ని మొహర్రం నెలగా భావిస్తారు. ఈమాసంలోనే పది రోజులు పవిత్ర దినాలుగా భావిస్తూ మొహర్రం నిర్వహిస్తారు.
హిందూ ముస్లింలు కలిసిమెలిసి..
పూర్వకాలం నుంచి హిందూ ముస్లింలు కులమతాలకతీతంగా జరుపుకునే మొహర్రం పర్వది నానికి గ్రామాల్లో ఎంతో ప్రత్యేకత ఉంది. పట్టణాలు, గ్రామాలు అన్నతేడా లేకుండా వారం రోజుల పాటు హిందూ ముస్లింలు భాయి.. భాయి.. అంటూ మొహర్రం పర్వదినంలో పాల్గొని పూజలు నిర్వహిం చడం ఆనవాయితీగా వస్తోంది. ముస్లింలకు సంబంధించిన ఏపర్వదినానికి లేనివిధంగా మొహర్రం (పీర్ల పండుగ)ల్లో హిందువులు పెద్దఎత్తున పాల్గొనడం ప్రత్యేకతగా నిలుస్తుంది. జిల్లాలోని అనేక గ్రామాల్లో విస్తృత ఏర్పాట్లు చేపట్లారు.
మొహర్రం చరిత్ర
ముహర్రం ఇస్లామిక్ చరిత్రలో గొప్ప ప్రాముఖ్యత కలిగిన నెల, మరియు దాని చరిత్ర విషాదం మరియు నష్టాలతో నిండి ఉంది. ఈ నెల ఇస్లామిక్ సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది మరియు దీనిని “అల్లాహ్ పవిత్ర మాసం” అని పిలుస్తారు. అయితే, 1400 సంవత్సరాల క్రితం ఈ నెలలో జరిగిన సంఘటనలు నేటికీ ముస్లిం సమాజానికి ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. క్రీ.శ. 680లో, ప్రవక్త ముహమ్మద్ మనవడు ఇమామ్ హుస్సేన్, ఖలీఫా యాజిద్‌కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసి, అతనికి వ్యతిరేకంగా విప్లవానికి నాయకత్వం వహించాడు.దురదృష్టవశాత్తు, ఇమామ్ హుస్సేన్ మరియు అతని అనుచరులు కర్బలా యుద్ధంలో సంఖ్యాపరంగా ఎక్కువగా ఉండి దారుణంగా చంపబడ్డారు]. నేడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఇమామ్ హుస్సేన్ మరియు అతని అనుచరుల మరణానికి ఊరేగింపులు, ప్రసంగాలు మరియు ఇతర మతపరమైన ఆచారాల ద్వారా సంతాపం తెలుపుతూ ముహర్రం మాసాన్ని పాటిస్తారు. ఇది ముస్లిం సమాజానికి జ్ఞాపకం, ప్రతిబింబం మరియు సంతాప నెల.
ముహర్రం యొక్క ప్రాముఖ్యత
ముహర్రం ఇస్లామిక్ క్యాలెండర్‌లో మొదటి నెల మరియు ఇస్లాంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. యుద్ధం నిషేధించబడిన సంవత్సరంలోని నాలుగు పవిత్ర నెలలలో ఇది ఒకటిగా పరిగణించబడుతుంది. పవిత్రమైన ముహర్రం మాసాన్ని “ముహర్రం ఉల్ హరామ్” అని కూడా పిలుస్తారు మరియు ఇస్లామిక్ క్యాలెండర్‌లో అత్యంత పవిత్రమైన నెలల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది రంజాన్ తర్వాత రెండవ అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించబడుతుంది.ఈ నెల ఉపవాసం మరియు సంతాప ఆచారాలకు ప్రసిద్ధి చెందింది మరియు ఇస్లామిక్ విశ్వాసంలో ముఖ్యమైన జ్ఞాపక దినమైన అషురా అని పిలువబడే పదవ రోజుతో గుర్తించబడింది.ముహర్రం ముస్లింలకు ఆత్మపరిశీలన మరియు ఆత్మపరిశీలన చేసుకునే నెల, మరియు ఈ సమయంలో వారు దైవభక్తి మరియు మంచి పనులలో పాల్గొనమని ప్రోత్సహించబడ్డారు. ముహర్రం సమయంలో ఉపవాసం ఉండటం చాలా మంచిది, మరియు ఆషూరా దినాన్ని ఉపవాసం గడపడం వల్ల ముస్లిం యొక్క గత పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.
మొహర్రం ఎలా జరుపుకుంటారు?
ముహర్రం అనేది భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఈ పండుగ ఇస్లామిక్ నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుంది మరియు దీనిని సమాజం పవిత్రమైన మరియు ముఖ్యమైన పండుగగా భావిస్తుంది. వివిధ ముస్లిం సమూహాలలో ముహర్రం వివిధ మార్గాల్లో జరుపుకుంటారు, అయితే భారతదేశంలో ముహర్రం జరుపుకోవడానికి కొన్ని సాధారణ మార్గాలు ఉపవాసం ఉండటం మరియు మసీదులు లేదా ప్రైవేట్ ఇళ్లలో ప్రార్థన సమావేశాలకు హాజరు కావడం.భారతదేశంలో, షియా ముస్లిం సమాజం కూడా ముహర్రంను సంతాప దినంగా పాటిస్తుంది. వారు ప్రవక్త ముహమ్మద్ మనవడు ఇమామ్ హుస్సేన్ మరియు అతని సహచరులు 680 ADలో జరిగిన కర్బలా యుద్ధంలో బలిదానం చేసినందుకు గుర్తు చేసుకుంటారు. ఈ సందర్భాన్ని గుర్తుచేసుకోవడానికి షియా ముస్లింలు “తాజియా” మరియు “ఆలం” అని పిలువబడే ఊరేగింపులలో పాల్గొంటారు. ఊరేగింపుల సమయంలో, వారు ఇమామ్ హుస్సేన్ సమాధి ప్రతిరూపాలను, రంగురంగుల జెండాలను తీసుకువెళతారు మరియు ఆయన జ్ఞాపకార్థం ఎలిజీలను పఠిస్తారు.
భారతదేశంలో మొహర్రం ఆచారాలు మరియు ఆచారాలు వైవిధ్యమైనవి మరియు ప్రాంతం నుండి ప్రాంతానికి మారుతూ ఉంటాయి. దేశంలోని కొన్ని ప్రాంతాలలో, దేవునికి కృతజ్ఞత చూపించడానికి ప్రజలు పేదలకు మరియు పేదలకు దాతృత్వం అందిస్తారు మరియు ఆహారం మరియు స్వీట్లు పంపిణీ చేస్తారు. భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో, గంభీరమైన సందర్భానికి గౌరవ చిహ్నంగా ప్రజలు మొహర్రం సమయంలో సంగీతం ఆడటం లేదా వివాహాలు నిర్వహించడం మానేస్తారు.
2025 మొహర్రం సెలవులను ఎక్కడ గడపాలి?
ముహర్రం ఇస్లామిక్ పండుగలలో అత్యంత ముఖ్యమైన మరియు ముఖ్యమైన పండుగలలో ఒకటి. కర్ణాటక, కేరళ మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు ముహర్రంను గొప్పగా జరుపుకుంటాయి. ప్రజలు తమ కుటుంబ సభ్యులను మరియు స్నేహితులను కలుసుకుంటూ పండుగ నిర్దిష్ట ఆహారం మరియు స్వీట్లను ఆస్వాదిస్తారు. అయితే, ఇది శోకం మరియు ఉపవాసం యొక్క పండుగ కాబట్టి, భక్తులు బహుళ రోజులు ఉపవాసం ఉండటానికి ఎంచుకుంటారు కాబట్టి, ఈ పండుగలు చాలా సరళంగా ఉంటాయి. మీరు భక్తుడైతే లేదా 2025 ముహర్రం అనుభవంలో మునిగిపోవాలని ప్లాన్ చేస్తుంటే , ఈ మూడు రాష్ట్రాలను సందర్శించడం ఈ పండుగ యొక్క అందం మరియు సరళతను ఆస్వాదించడానికి అనువైనది కావచ్చు.
జహీరాబాద్ పట్టణంలో పిచ్చికుక్కల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మంగళవారం జహీరాబాద్ పట్టణంలోని పస్తాపూర్లో గల భవాని కాలనీలో చాకలి మంజులకు పిచ్చికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. స్థానిక కమ్యూనిటీ వైద్యశాలలో చికిత్స పొందుతుంది. కాగా ఫస్తాపూర్లోని జర్నలిస్ట్ కాలనీ, మేస్త్రి కాలనీ, ఆనంద్ నగర్ కాలనీ లలో పిచ్చి కుక్కలు దాడి చేసి రోజుకు ఒకరికి గాయపరుస్తున్నాయని కాలనీ వాసులు అంటున్నారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే పిచ్చి కుక్కలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
-కమిషనర్ వివరణ
ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ సుభాష్రవు స్పందిస్తూ.. వెంటనే కుక్కలను నివారించేందుకు చర్యలు చేపడతామని అన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.