రో హౌస్‌లపై నేటిధాత్రి మరో అక్షర విజయం!

`అక్రమంగా, అనుమతులు లేని రో హౌస్‌ లు గతంలోనే నాలుగు కూల్చివేత.

`మిగిలిన రెండు నేడు కూల్చేశారు.

`72 రో హౌస్‌ లపై అక్రమంగా పై అంతస్తులు నిర్మించిన వారికి నోటీసులు.

`15 రోజులలో కూల్చి వేసుకోవాలని ఆదేశాలు.

`గడువు దాటితే తామే కూల్చేస్తామని మునిసిపల్‌ శాఖ హెచ్చరికలు.

`మొత్తం రో హౌస్‌ లు కూల్చివేయాలనేది నేటిధాత్రి ప్రధాన డిమాండ్‌.

`కార్మికుల కోసం ప్రభుత్వం కేటాయించిన భూమి కార్మికులకే సొంతం కావాలి.

`అక్రమంగా జొరబడిన గద్దలు ఖాళీ చేయాలి.

`14 ఎకరాలు చిత్రపురి సొసైటీ స్వాధీనం చేసుకోవాలి.

`ఆ స్థలంలో కార్మికుల కోసం అప్పార్టుమెంట్లు నిర్మాణం చేయాలి.

`అర్హులైన ప్రతి సినీ కార్మికుడికి సొంతిల్లు కల నెరవేరాలి.

`అప్పటి వరకు నేటిధాత్రి అక్షర పోరాటం ఆగదు.

`కార్మికులు సొంత ఇండ్లు కళ్లారా చూసుకునే వరకు నేటిధాత్రి పోరు ఆపదు.

`కార్మికులు ఇప్పటికైనా కళ్లు తెరవాలి.

`నేటిధాత్రి అక్షర పోరాటంతో చైతన్యమై సొంతింటి పోరు జరపాలి.

`14 ఎకరాలలో కార్మికులకు అప్పార్టుమెంట్లు నిర్మాణం జరిగే దాక పోరాటం కొనసాగించాలి.

`అలుపెరగకుండా కార్మికులు తమ కల నెరవేర్చుకోవాలి.

`నేటిధాత్రికి కార్మికుల నుంచి పెద్ద ఎత్తున అభినందనలు.

`నేటిధాత్రి పోరాటానికి కార్మికుల ధన్యవాదాలు.

`నేటిధాత్రి దిన పత్రికకు కార్మికుల జేజేలు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
పోరాటాలన్నింటిలోకి అక్షర పోరాటం గొప్పది. ఆ అక్షరం కదిలంచే శక్తి మరింత గొప్పది. సమాజంలో ఏ వర్గం కదాలన్నా, ఏ వర్గం సమస్యలు వెలుగులోకి రావాలన్నా ముందు అక్షరం వెలగాలి. ఆ సమస్య అక్షర రూపం దాల్చాలి. అక్షరం వేసి తొలి అడుగే సమస్యల పరిష్కారానికి మరో అడుగుకు దారి పడుతుంది. రాజుల కాలంలోనైనా, ప్రజా స్వామ్య దేశాలలోనైనా అక్షర కావాతే అన్నింటికన్నాగొప్పది. దేశానికి స్వాతంత్య్ర సమరమైనా, తెలంగాణ ఉద్యమమైనా అక్షరంతోనే మొదలైంది. తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకున్నా అక్షరంతోనే..తెలంగాణ ఉద్యమం సమాజం ఎంత సాగించినా అది అక్షరూపంలో ప్రపంచానికి చేరినప్పుడే లోకానికి తెలిసింది. తెలంగాణ విజయం కూడా అక్షర రూపంలోనే వెలుగులోకి వచ్చింది. అదే మీడియా గొప్పదనం. అలాంటి అక్షరాలకు పునాదులు వేసేదే మీడియా. ఆ మీడియా లేవనెత్తిన సమస్యలు పరిష్కారమైనప్పుడు అందరికంటే ముందు సంతోషపడేది ఆ అక్షరాలను సందించిన మీడియానే..అలాంటి విజయాలను సొంతం చేసుకోవడం కోసం మీడియా పడే తపన, యాతన అంతా ఇంతా కాదు. ఎంతో శ్రమకోర్చి సమస్యలను వెలుగులోకి తెస్తుంది. ఆ సమస్య పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తుంది. అలా నేటిదాత్రి చేసిన కృషి కోకొల్లలలు. అందులో చిత్ర పురి కార్మికుల సమస్య ఒకటి. చిత్రపురిలోని బాగోతాలను ఒక్కొక్కటిగా వెలుగులోకి తెచ్చి, వాటి పరిష్కారానికి అలుపెరగని అక్షర పోరాటం నేటి ధాత్రి చేసింది. ముఖ్యంగా చిత్రపురిలో జరిగిన రోహౌజ్‌ల నిర్మాణం అక్రమమని, వాటిని తొలగించాలంటూ నేటి ధాత్రి చేసిన పోరాటంలో గతంలోనే ఒక విజయం సాధించింది. ఇప్పుడు మరో విజయం నేటిదాత్రి ఖాతాలో పడిరది. నిజానికి రోహౌజ్‌ల నిర్మాణం అక్రమమే కాదు, దుర్మార్గం కూడా..కార్మికుల శ్రేయస్సుకోసం, వారికి నీడ కోసం రాష్ట్ర ప్రభుత్వం 64 ఎకరాల స్థలం ఇచ్చింది సినీ రంగానికి చెందిన తెలంగాణ నటుడు ప్రభాకర్‌రెడ్డి మూడు ఎకరాల స్ధలం విరాళలంగా ఇచ్చారు. మొత్తంత 67 ఎకరాలకు పైగా ఆ స్ధలం కార్మికుల కోసం కేటాయించబడిరది. అందులో 14 ఎకరాల స్ధలం సినీ రంగంలోని పెద్దలు ఆక్రమించారు. నిజానికి దివంగత నటుడు ప్రభాకర్‌ రెడ్డి చూపిన దారిలో నడిచి, కార్మికుల కోసం స్థలాలు కొని ఇవ్వాల్సిన పెద్దలు ఆ కార్మికుల స్ధలానికే ఎసరు పెట్టారు. ప్రభుత్వం కేటాయించిన భూమిలో 14 ఎకరాలు ఆక్రమించుకున్నారు. చిత్ర పురి సొసైటీని బెదిరించి మరీ లాక్కున్నారు. అందులో 250 రోహౌజ్‌లు నిర్మాణం చేసుకున్నారు. అంతే కాకుండా మరో ఆరు రోహౌజ్‌లు అక్రమంగా అదనంగా నిర్మాణం చేసుకున్నారు. అసలు రోహౌజ్‌ల నిర్మాణమే తప్పని, నేరమని నేటిధాత్రి పోరాటం చేసింది. దాంతో మున్సిపల్‌ శాఖ గత ఏడాది రంగంలోకి దిగింది. అక్రమంగా నిర్మాణం చేసిన మరో ఆరు రోహౌజ్‌లలో నాలుగింటిని కూల్చివేశారు. మరో రెండు రోహౌజ్‌లు కొనుగోలు చేసిన వారు కొంత సమయం అడిగారు. అయినా ఇప్పటి వరకు ఖాళీ చేయలేదు. వాటిని కూల్చేయలేదు. దాంతో మున్సిపల్‌ శాఖ రంగంలోకి దిగింది. మిగిలిన రెండు రోహౌజ్‌లను మంగళవారం కూల్చివేసింది. మొదటి నాలుగు రోహౌజ్‌లు నేటిధాత్రి పోరాటం వల్లనే కూల్చివేశారు. తర్వాత మిగిలిన రెండు కూడా ఎప్పుడు కూల్చేస్తారంటూ నేటిధాత్రి రాసిన కధనాలకు స్పందించి, మున్సిపల్‌ అధికారులు మంగళవారం నేట మట్టం చేశారు. నేటిదాత్రి కోరుకున్న అదనపు రోహౌజ్‌ల కూల్చివేత పూర్తయింది. అయితే నేటిధాత్రి ఆది నుంచి చెబుతున్నది మొత్తం రోహౌజ్‌లను కూల్చివేయాలని కార్మికుల పక్షాన డిమాండ్‌ చేస్తూ వచ్చింది. అయితే నేటిధాత్రి ఓ వైపు అక్షర పోరాటం చేస్తున్నా, 72 రోహౌజ్‌ల యజమానులు వాటిపై అంతస్ధులు నిర్మాణం మొదలు పెట్టారు. రోహౌజ్‌లే అక్రమంగా నిర్మాణం చేసుకున్నారు. వాటిపై అంతస్ధులు వేసుకోవడానికి ఎలాంటి అనుమతిలేదు. మున్సిపల్‌ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఆ యజమానులు అనుమతులు తెచ్చుకోలేదు. కేవలం అనుమతుల కోసం ధరఖాస్తులు చేసుకున్నారు. వాటిని మున్సిపల్‌ శాఖ తిరస్కరించింది. అయిన అందర్నీ మభ్యపెట్టి, అనుమతులు వచ్చినట్లు చెప్పుకొని పై అంతస్ధులు నిర్మాణం చేపట్టారు. వాటిని వెంటనే ఆపాలంటూ నేటిధాత్రి ఈ మధ్య వరస కథనాలు రాసింది. రోహౌజ్‌ల నిర్మాణమే అక్రమంటే, పై అంతస్ధుల నిర్మాణం మరీ దుర్మార్గం. అందుకే నేటిధాత్రి మళ్లీ అక్షర పోరాటం మొదలుపెట్టింది. దాంతో మున్సిపల్‌ అధికారులు 72 రోహౌజ్‌లకు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులను సవాలు చేస్తూ రోహౌజ్‌ల యజమానులు కోర్టును ఆశ్రయించారు. అయితే తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని రోహౌజ్‌ల యజమానులు ఆశించారు. మున్సిపల్‌ అధికారులు చిత్త శుద్ది కారణంగా కోర్టు రోహౌజ్‌ల యజమానులకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దాంతో పై అంతస్ధులను తొలగించాల్సిన పరిస్దితి ఎదురైంది. మున్సిపల్‌ అధికారులు మంగళవారం అదనపు నిర్మాణాలు చేపడుతున్నా 72 రోహౌజ్‌లకు నోటీసులు అంటించారు. 15 రోజుల్లో అదనపు నిర్మాణాలు తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక వేళ 15 రోజుల్లో ఆ నిర్మాణాలు కూల్చని పక్షంలో తామే వచ్చిన నిర్మాణాలు తొలగిస్తామని మున్సిపల్‌ అదికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికైనా సరే కార్మికులు కళ్లు తెరవాలి. కార్మికుల కోసం అక్షర పోరాటం చేస్తున్న నేటిధాత్రిని చూసైనా చైతన్యం పొందాల్సిన అవసరం వుంది. చిత్రపురి అనేది కార్మికులసొంతం. అందులోని ప్రతి అణువణువూ కార్మికులదే..ఈ సంగతి కార్మికులు గుర్తించినప్పుడే ఆ భూమి అంతా కార్మికుల సొంతమౌతుంది. దశాబ్ధాలుగా కార్మికుల చేస్తున్న పోరాటం ఫలిస్తుంది. వారి సొంతింటి కల నెరవేరుతుంది. ఇప్పటికే జరిగిన అప్పార్టుమెంటు వల్ల ఇంకా ఎంతో మంది కార్మికులకు సరిపోలేదు. ప్రస్తుతం నిర్మాణం చేస్తున్న ట్విన్‌ టవర్స్‌ల వల్ల కూడా కార్మికులందరి లక్ష్యం నెరవేరదు. రోహౌజ్‌ల పేరుతో సినీ గద్దలు ఆక్రమించుకున్న 14 ఎకరాల స్ధలంలో మరిన్ని అప్పార్టుమెంట్లు నిర్మాణం చేస్తే తప్ప కార్మికలందరికీ న్యాయం జరగదు. చిత్రపురిలో అన్ని క్రాఫ్టుల కార్మికులకు సొంతింటి కల నెరవేరాలన్నదే నేటిధాత్రి లక్ష్యం. ఆ లక్ష్యం కోసం సాగిన్న అక్షర పోరాట ప్రయాణంలో దక్కిన విజయం ఒక ఎత్తైతే రోహౌజ్‌ల స్థలం కార్మికుల వశమైనప్పుడే అసలైన విజయమని నేటిధాత్రి భావిస్తోంది. కార్మికుల ఎప్పటికైనా నెరవేరాలని నేటిధాత్రి కోరుకుంటోంది. కార్మికుల క్షేత్ర స్ధాయి ఉద్యమాలకు శ్రీకారం చుడితే కార్మికుల అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. కార్మికులందిరకీ సొంతంటి కల సొంతమౌతుంది. అక్రమంగా నిర్మాణమైన రోహౌజ్‌ల కూల్చివేతలతోపాటు, అదనపు అంతస్దుల నిర్మాణాలకు నోటీసుల జారీ దాకా నేటిధాత్రి సాగించిన అక్షరపోరాట విజయానికి కార్మిక లోకం అభినందనలు తెలియజేస్తోంది. నేటిధాత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలుతెలియజేస్తూ ఇకపై పూర్తి స్ధాయిలో తాము ఉద్యమ కార్యాచరణ చేపడతామని, అందుకు నేటిధాత్రి సహకరించాలని కోరుతున్నారు. నేటిధాత్రికి కార్మికులు జేజేలు పలుకుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version