మచ్చ సోమయ్య చలి వేంద్రం ఏర్పాటు.

మచ్చ సోమయ్య చలి వేంద్రం ఏర్పాటు

మరిపెడ నేటిధాత్రి.

 

 

మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు ఎదురుగా మచ్చ సోమయ్య పేరు మీద వారి కుమారులు ప్రముఖ వ్యాపార వేత్త మచ్చ వెంకట్రామనర్సయ్య, తెలంగాణ రాష్ట్ర హాకా మాజీ చైర్మన్ మచ్చ శ్రీనివాస్, చలి వేంద్రo,మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేశారు,ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చలివేంద్రం,మజ్జిగ పంపిణీ,కార్యక్రమాన్ని మరిపెడ మండల వాసి డిఎస్పి కొండం పార్థసారధి గౌడ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని ప్రయాణికులు, పాదచరులు, రైతులు, ఆటో కార్మికులు, సబండ వర్గాల అవసరాల నిమిత్తం ఏర్పాటు చేయడం సంతోషదాయకమని అన్నారు. ప్రయాణికులు దప్పిక తీర్చుకో వడానికి,చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు తల్లాడ వెంకట రామారావు,మచ్చ బాస్కర్,పువ్వాడ హరిప్రసాద్, తల్లాడ సురేష్,బుద్ధ శ్రీనివాస్, కందిబండ ప్రసాద్, ఉప్పల వెంకన్న, ఉప్పల వెంకటేశ్వర్లు, తల్లాడ లోహిత్,ఆర్య వైశ్య సంఘం నాయకులుపాల్గొన్నారు.

ముత్యాల తలంబ్రాలను సమర్పించిన.!

ముత్యాల తలంబ్రాలను సమర్పించిన మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ఆర్సీ జీవెలర్స్ అధినేత కలకొండ రమేష్ చంద్ర. 

వనపర్తి నేటిదాత్రి :

 

వనపర్తి లో సీతారాముల కళ్యాణం సందర్భంగా వనపర్తి పట్టణం లోని అన్ని దేవాలయాలకు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ఆర్యవైశ్య సంగం మాజీ రాష్ట్ర రాజకీయ కార్యదర్శి మాజీఎంపీ రావు ల చంద్రశేఖర్ రెడ్డి శిష్యులు కలకొండ రమేష్ చంద్ర ముత్యాల తలంబ్రాలు సమర్పించారు . రామాలయం వెంకటేశ్వర దేవాలయం బాలాంజనేయ కన్యకపర్మేశ్వరి దేవాలయం నాగవరం మర్రికుంట పీర్లగుట్ట రాంనగర్ కాలనీ రాజానగరం జగత్పల్లి అచ్యుతాపురం దేవాలయాల్లో ముత్యాల తలంబ్రాలు అందచేశారు ఈ కార్యక్రమం లో
ఉంగ్లం తిరుమల్ ఆవుల రమేష్ మారం బాలీశ్వరయ్య విశ్వనాథం కలకొండ అనంతమ్మ జగదీష్తదితరులు పోల్గొన్నారు

బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి.

చేనేత కార్మికులకు మద్దతుగా బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి )

 

ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ని స్థానిక అంబేద్కర్ చౌక్ లో సిఐటియు వారి ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు కూలి పెంచే విషయంలో నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది అట్టి నిరాహార దీక్షలో పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ పక్షాన మద్దతు ఇస్తూ జిందాం చక్రపాణి మాట్లాడుతూ చేనేత కార్మికుల కోసం సిరిసిల్ల చేనేత చీరలకు ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చినటువంటి దానికి కూలి పెంచాలని, వైపని కార్మికులకు, వర్పిన్ కార్మికులకు మర మొగ్గల పవర్ లుమ్ కార్మికులకు కూలి పెంచాలని , తెలంగాణ రాష్ట్రంలోని చేనేత చీరలకు అత్యధికoగా ధర కల్పించాలని కోరుతూ ఈరోజు చేనేత కార్మికులకు మద్దతు పలకడం జరిగింది. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోదండ రమణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు ముషం రమేష్, మాజీ వార్డ్ కౌన్సిలర్ దార్ల సందీప్ కీర్తన, తదితర నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఝరాసంగం సంగమేశ్వరుడికి వారోత్సవ పూజలు.

ఝరాసంగం సంగమేశ్వరుడికి వారోత్సవ పూజలు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రములోని శ్రీ కేతకీ ఉమా సంగమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం విశేష పూజలను నిర్వహించారు. వారోత్సవ పూజల సందర్భంగా లింగ రూపంలో కొలువైన శివ మహాదేవునికి అభిషేకాలు, అలంకరణ గావించి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు. స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వేకువజామునుండే భక్తులు బారులు తీరారు.

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో.!

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సీతారాముల కళ్యాణం
వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు . కళ్యాణోత్సవంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజ్ శెట్టి దంపతులు వాసవి క్లబ్ వనపర్తి పట్టణ అధ్యక్షులు చిగుళ్ల పల్లి శ్రీనివాలు వనిత క్లబ్ అధ్యక్షురాలు సువర్ణ కె బుచ్చయ్య దంపతులు కూర్చున్నారు ఆలయ పూజారి చంద్రశేఖర్ శర్మ కళ్యాణోత్సవం ప్రత్యేక పూజలు చేయించారు అనంతరం పట్టణ ఆర్యవైశ్యులకు అన్నదానం ఏర్పాటు చేశారు వనపర్తి ఆర్యవైశ్య సంగం మాజీ అధ్యక్షులు ఆకుతోట దేవరాజ్ లగిశేట్టి అశోక్ లగిశెట్టి రమేష్ లింగం హరినాథ్ పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బచ్చురాం కాంగ్రెస్ పార్టీ నేత చుక్కయ్య శెట్టి న్యాయవాది బాస్కర్ వజ్రాల సాయిబాబా వై వెంకటేష్ కొండ విశ్వనాథం పూరిరిసురేష్ యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ అమరవాది నరేందర్ ప్రధాన కార్యదర్శి కల్వ బూపేష్.కుమార్ శెట్టి కొండ ప్రశాంత్ ఆర్యవైశ్యులు బచ్చురాం ఎలిశెట్టి వెంకటేష్ వజ్రాల సాయిబాబా మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి కలకొండ భాగ్యలక్ష్మి ప్రధాన కార్యదర్శి శ్రీమతి అనoత ఉమావతి కొండూరు మంజుల ప్రవీణ్ పిన్నo వసంత సహాయనిధి వైస్ చైర్మన్ శ్రీమతి కొండూరు మంజుల పురుషోత్తం పట్టణ ఆర్యవైశ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈసందర్భంగా వాసవి క్లబ్ తరుపున సీతారాముల కళ్యాణం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించామని వాసవి క్లబ్ అధ్యక్షులు ఉపాధ్యాయులు శ్రీనివాసులు ఒకప్రకటనలో తెలిపారు

కన్నుల పండుగగా రాముల వారి కళ్యాణం.

కన్నుల పండుగగా రాముల వారి కళ్యాణం.  

మరిపెడ నేటిధాత్రి.

 

మరిపెడ మండలం రాంపురం గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం లో కన్నుల పండుగగా రాముల వారి కళ్యాణం ఆదివారం జరిగింది. లోక కళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల బంధం అజరామరమైనది.లోక కళ్యాణం కారకం సీతారాముల కళ్యాణం. జన్మ పరంగా వచ్చే మలిన ఖర్మలు ఈ సందర్బంగా తొలిగిపోయే అవకాశం ఉంటుందనే భక్తుల్లో నమ్మకం, ఈ కళ్యాణ మహోత్సవం లో రామ సహాయం నరసింహారెడ్డి, మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో, మరియు గ్రామ ప్రజల అందరి సహకారంతో సీతారాముల కళ్యాణ మహోత్సవం తో పాటు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, వేద పండితులు శ్రీనివాస్ గీత దంపతులు రాముల వారి కల్యాణం నిర్వహించారు, భక్తి మార్గంలో నడిచే సీతా రాముల ఆశీర్వాదాంతో ప్రతి ఇంటిలో రాముడి ఆశీర్వాదాంతో శాంతి,సౌభాగ్యం కలగాలని,సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రామ సహాయం విష్ణువర్ధన్ రెడ్డి,జైపాల్ రెడ్డి, రాంపల్లి వెంకన్న,కేసముద్రం మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ రాంపల్లి వీరాంజి గౌడ్,లాయర్ రఘురామ్ రెడ్డి,పెండ్లి లింగరెడ్డి,వంగ పెద్ద వెంకన్న, ఈరాగాని శ్రీను,రాముల వారి కమిటీ సభ్యులు ఏల్ది చిన్న మల్లయ్య,అన్నం సత్యనారాయణ, ఊరుకొండ వెంకన్న,సత్య శ్రీనివాస్, ఈరాగాని రమేష్,ఎల్ది సాయి,వంశీ, సుధగాని డాక్టర్ నవీన్, ప్రవీణ్, దోమల విష్ణు గౌడ్,మహిళలు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈనెల 14 వరకు దరఖాస్తు చేసుకోండి.

ఈనెల 14 వరకు దరఖాస్తు చేసుకోండి.

నిజాంపేట, నేటి ధాత్రి

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాస పథకంలో భాగంగా మండల వ్యాప్తంగా యువత దరఖాస్తు చేసుకోవాలని నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలో మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ వికాస పథకానికి ఈ నెల 14 వరకు గడువును పొడిగించిందని అర్హత గల ప్రతి ఒక్కరూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పట్టణ అధ్యక్షుడు నజీరుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి పంజా మహేందర్, ఎం ఎస్ ఎస్ మండల అధ్యక్షులువెంకట్ గౌడ్, జాల శ్రీకాంత్ లు ఉన్నారు.

నిరుపేదలకు పెన్నిది సీఎం రేవంత్.

— నిరుపేదలకు పెన్నిది సీఎం రేవంత్

నిజాంపేట: నేటి ధాత్రి

 

నిరుపేదల పెన్నిధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సేవలు ఉన్నాయని నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో నిజాంపేట గ్రామానికి చెందిన పాక ప్రియాంక కు చెందిన చెక్కును 60వేల రూపాయలు పాక స్వామికి సోమవారం మండల కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుపేదల పెన్నిధిగా సేవలు చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట పట్టణ అధ్యక్షులు నజీరుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి పంజా మహేందర్, కాంగ్రెస్ నాయకులు వెంకట్ గౌడ్, జ్వాల శ్రీకాంత్, శ్రీకాంత్ గౌడ్ లు ఉన్నారు.

గ్రూప్ 1 ర్యాంకర్ జిన్నా తేజస్వినిరెడ్డికి ఘన సన్మానం. 

గ్రూప్ 1 ర్యాంకర్ జిన్నా తేజస్వినిరెడ్డికి ఘన సన్మానం. 

గట్లకానిపర్తి గ్రామ అభివృద్ధి కమిటీ

శాయంపేట నేటిధాత్రి:

 

తెలంగాణ రాష్ట్రంలో TGPSC ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్, మల్టీ జోన్1 లో మొదటిర్యాంక్ సాధించిన శాయంపేట మండ లం మాంధారిపేట గ్రామానికి చెందిన జిన్నా విజయపాల్ రెడ్డి కూతురు కుమారి తేజస్వి ని రెడ్డి అభినందిస్తూ గ్రామ అభివృద్ధి కమిటీ గట్లకానిపర్తి మరియు సీనియర్ జర్నలిస్ట్ & చీఫ్ ఎడిటర్ వరంగల్ వాయిస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మా నించడం జరిగింది. గ్రామ అభివృద్ధి కమిటీ తరుపున మెమంటో బహుకరించి, శాలువాతో సత్కరించడం జరిగింది. ఇదే సమయంలో కుమారి తేజస్వినిరెడ్డి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహిం చాలని కోరుకుంటూ భవిష్య త్తులో గట్లకానిపర్తి గ్రామంలో నిర్మించబోయే గ్రంధాలయ ప్రారంభోత్సవానికి రావాలని కోరగా అందుకు తను తప్ప కుండా హాజరవుతానని చెప్ప డంతోపాటు, గట్లకానిపర్తి గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు తెలుసుకొని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మద్దతు తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ & వరంగల్ వాయిస్ ఎడిటర్ గడ్డం కేశవ మూర్తి మరియు గట్లకాని పర్తి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న.!

శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి…

▪శ్రీ.సీతా రామచంద్రుల స్వామి దీవెనలతో నియోజకవర్గ ప్రజలంతా చల్లగా ఉండాలి…
– యన్.గిరిధర్ రెడ్డి

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

శ్రీరామ నవమి వేడుకలను పురస్కరించుకొని ఆదివారం రోజున జహీరాబాద్ పట్టణంలో ఘనంగా శోభయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ…దేశ స్థాయిలో శ్రీరామ నవమి వేడుకలను ఆనందాల మధ్య సంతోషలు నింపుకొని భక్తిశ్రద్ధలతో సీతారాముల కల్యాణ మహోత్సవాలను ప్రజలు ఘనంగా నిర్వహించుకోవడం ఎంతో గొప్పతనం అని ప్రజలు నిండుగా అభివృద్ధి చెందాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

N. Giridhar Reddy

 

సితా రామచంద్రస్వామి వారి దీవెనలతో జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి అని కోరుకున్నాను అన్నారు.ఈకార్యక్రమంలో జహీరాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్,మాజీ వైస్ యం.పి.పి.వి.రాములు,జహీరాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పి.నాగిరెడ్డి, సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి,ఖాసీంపూర్ మాజీ యం.పి.టి.సి రాజు,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి,సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి,అక్తర్ గోరి,బి.మల్లికార్జున్, ప్రజలు,భక్తులు,వివిధ సంఘాల నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం.

కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం రామకృష్ణాపూర్ పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం, విజయగణపతి దేవాలయంలో ప్రధాన పూజారులు వైభవంగా నిర్వహించారు. కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం జరిగింది. రాములోరి కళ్యాణాన్ని పట్టణంలోని భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి తిలకించారు. రాములోరి కళ్యాణ మహోత్సవంలో మందమర్రి ఏరియా జిఎం దేవేందర్ దంపతులు పాల్గొని దేవతా మూర్తుల తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు భక్తులకు మజ్జిగ, మంచినీటి సౌకర్యాలను కల్పించారు. ఈ మహోత్సవంలో ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జికి పునాది వేసిందే వివేక్ వెంకటస్వామి.

రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జికి పునాది వేసిందే వివేక్ వెంకటస్వామి…

పనులు పూర్తి కాగానే ప్రారంభించేది వివేక్ వెంకటస్వామి నే…..

మున్సిపల్ కాంగ్రెస్ శ్రేణులు…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతనపల్లి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణంకు నిధులు మంజూరు చేసింది, పనులు పూర్తి చేసింది కాంగ్రెస్ హయంలోనే అని, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నేతృత్వంలోనే నని రామకృష్ణాపూర్ కాంగ్రెస్ శ్రేణులు అన్నారు. గత పన్నెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న బ్రిడ్జి పనులు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో చివరిదశకు వచ్చిన నేపథ్యంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్లై ఓవర్ బ్రిడ్జి వద్ద సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ గడ్డం వంశి కృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

Bridge.

 

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 12 ఏళ్ల క్రితం ఎంపీగా ఉన్న వివేక్ వెంకటస్వామి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినప్పటికి అప్పటి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్లాల ఓదెలు, బాల్క సుమన్ బ్రిడ్జి నిర్మాణానికి శంఖుస్థాపనలు చేసి పనులను నత్త నడకన కొనసాగించి ఈ ప్రాంత ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రస్తుత ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని, పనుల్లో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవరోధాలు లేకుండా చేసి గెలిచిన సంవత్సరన్నర కాలంలోనే ఇచ్చిన మాట ప్రకారం బ్రిడ్జి పనులు పూర్తి చేశారని ఆనందం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చొరవతోనే పనులు పూర్తి అయ్యాయాయని చెప్పుకుంటున్న బిఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజరమేష్ కి సిగ్గు లేదా అని మండిపడ్డారు. త్వరలోనే బ్రిడ్జి ప్రారంభం చేసి ప్రాంత ప్రజల చిరకాల కోరికను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తీర్చుతారని నాయకులుb పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి ఓడ్నాల శ్రీనివాస్, నాయకులు అబ్దుల్ అజీజ్, గాండ్ల సమ్మయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం కళ, యాకూబ్ అలీ, కళ్యాణ్, శివకిరణ్, రాజేష్, సుధాకర్, బాణేష్, లాడెన్, మహిళా నాయకురాలు పాల్గొన్నారు.

ఈ సమ్మర్‌ హాట్‌ గురూ!!

ఏప్రిల్‌ నెలలో దేశవ్యాప్తంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు

గతంతో పోలిస్తే పెరగనున్న వేడి గాడ్పుల సంఖ్య

వృద్ధులు, పిల్లలు, మహిళలు జాగ్రత్తలు తీసుకోక తప్పదు

రాజధాని ఢల్లీిలో కాలుష్య నివారణ చర్యలు

పంజాబ్‌, హర్యానా, యు.పి.ల్లో ప్రత్యామ్నాయ పంటలవైపు రైతులకు ప్రోత్సాహం

సాధ్యమైనంత ఎక్కువ గడ్డిని పశుగ్రాసంగా మలచేందుకు చర్యలు

ప్రత్యామ్నాయ పంటలకు మద్దతు ధర ప్రకటిస్తేనే రైతులను ఒప్పించడానికి వీలు

వరిధాన్యాన్ని సేకరిస్తున్న ఎఫ్‌.సి.ఐ.

రైతులకు లాభం కలిగించే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఈ ఏడాది వేసవి ప్రారంభమైంది. ఏప్రిల్‌ 1 వచ్చిందటే వేసవి సీజన్‌ వచ్చేసినట్టే. ఇది జూన్‌ 30వరకు కొనసాగుతుంది. ఈసారి దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత అధికంగా వుండబోతున్నదని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. మండే ఎండలు మనుషుల జీవనశైలిపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి. ఎంతోమంది రోజువారీ పనులపై ఆధారపడి జీవనాన్ని గడిపేవారిపై వేసవి ఎండలప్రభావం అధికంగా వుంటుంది. ఏప్రిల్‌ నెలలో ఉష్ణోగ్రతలు బాగా పెరగడానికి ప్రధాన కారణంమార్చి నెలలో నెలలో వాతావరణం బాగా పొడిగా మారడం. వాతావరణంలో తేమ కొరవడడంతో గాలి తేలిగ్గా వేడెక్కుతుంది. ఫలితంగా ఈసారి దేశంలోని చాలా ప్రాంతాల్లో రాత్రి ఉష్ణో గ్రతలు సాధారణ స్థితికంటే ఎక్కువ నమోదయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ రకమైన ఉష్ణోగ్రత పెరుగుదల కనిపిస్తుంది. ఇదే సమయంలో నైరుతి మరి యు తూర్పు ప్రాంతాలు వేడి గాడ్పుల ప్రభావానికి లోనవుతాయని కూడా వాతావరణశాఖ అం చనా వేసింది. సాధారణంగా ఏప్రిల్‌`జూన్‌ మధ్యకాలంలో నాలుగు నుంచి ఆరు వరకు వేడి గాడ్పులు అనుభవంలోకి వస్తాయి. కానీ ఈఏడాది వీటి సంఖ్య ఆరు నుంచి పది వరకు పెరుగుతాయని స్పష్టం చేస్తోంది. 

వాతావరణశాఖ వేడి గాడ్పులను ఏవిధంగా నిర్ణయిస్తుందనే ప్రశ్న ఉదయించడం సహజమే. ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటి 47డిగ్రీల వరకు చేరతాయో అప్పుడు వేడి గాడ్పులు వీస్తున్నాయని నిర్ణయిస్తుంది. అయితే ఈ వేడిగాడ్పుల అంచనా అన్ని ప్రాంతాల్లో ఒకే రకమైన ఉష్ణోగ్రతల ఆధారంగా నిర్ణయించరు. ఉదాహరణకు మైదాన ప్రాంతాల్లో 40డిగ్రీలకు చేరుకున్నప్పుడు, కొండ ప్రాంతాల్లో 30డిగ్రీలకు చేరినప్పుడు, తీరప్రాంతాల్లో 37డిగ్రీలు నమోదయినప్పుడు, సాధారణ ఉష్ణోగ్రతల కంటే 4.5డిగ్రీల నుంచి 6.4డిగ్రీల సెల్షియస్‌ అదనంగా నమోదయినప్పుడు వేడిగాడ్పులు వీస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరుతుంది. 

ఏప్రిల్‌ాజూన్‌ మధ్యకాలంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత కంటే ఎ క్కువ నమోదయ్యే అవకాశాలుండగా, పశ్చిమాద్వీపకల్ప ప్రాంతం, తూర్పుామధ్య మరియు తూర్పు ప్రాంతాల్లో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇక దేశంలోని అధిక ప్రాంతాల్లోమాత్రం సాధారణ గరిష్టం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. అయితేదేశ వాయువ్య భాగానికి చెందిన సుదూర ప్రాంతాల్లో సాధారణ గరిష్ట ఉష్ణోత్రలు నమోదవుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది.

ఇక దక్షిణ ద్వీకల్ప భారత్‌లోని సూదూర ప్రాంతాల్లో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. దేశ ఈశాన్య, వాయువ్య భాగాలకు చెందిన కొన్ని సుదూర ప్రాంతాల్లో సాధారణ గరి ష్టం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఇదిలావుండగా సుదీర్ఘ వేడి గాడ్పుల వల్ల వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొనక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావారికీ ఈ పెరిగే ఉష్ణోగ్రతలు ఇబ్బందులు కలుగజేస్తాయి. ఈ నేపథ్యంలో ప్రజాఆర్యోగం దృష్ట్యా జాతీయ విపత్తు నివారణసంస్థ ఇందుకు అనుగుణమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు పరచాల్సి వుంది. ఈ ఏప్రిల్‌ నెలకు సంబంధించి వాతావరణశాఖ అందించిన మరో శుభవార్త ఏమిటంటే సాధారణ వర్షపాతం నమోదు కావడం. దేశంలోని పలు ప్రాంతాల్లో, సాధారణ వర్షపాతంలో 88`112% వరకు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. దేశ వాయువ్య ప్రాంతాలు, ద్వీపకల్ప భారత్‌, ఈశాన్య రాష్ట్రాలు, మధ్య, పశ్చిమ ప్రాంతాలకు చెందిన కొన్ని ప్రదేశాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. ఇక దేశం మిగిలిన ప్రాంతాల్లో ఈ నెలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదుకానుంది. ఈ శాఖ ఇచ్చిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఈనెలలో ఏప్రిల్‌ నెలలో 32.6% లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలుండగా, వాయువ్య ప్రాంతాల్లో 41.3%, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో 38.6%,మ ధ్యభారత్‌లో 39.3% లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి. ఇదే దక్షిణ ద్వీపకల్ప భారత్‌లో మాత్రం 33.6% అధిక వర్షపాతం నమోదు కానున్నదని అంచనా వేసింది. 

పంజాబ్‌, హర్యానాల్లో పంట మార్పిడి ప్రణాళికలు

ఢల్లీి, ఉత్తర భారత్‌లోని చాలా ప్రాంతాల్లో వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న కోసిన త ర్వాత పంట వ్యర్థాలను తగులబెట్టే ప్రక్రియ రాబోయే కాలంలో తగ్గిపోయే అవకాశాలు స్పష్టంగాకనిపిస్తున్నాయి. పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లోని పాలు ప్రాంతాల్లో వరిపండిరచే రైతులు పంట కోతల తర్వాత పెద్ద ఎత్తున పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల వాతావరణం కాలుష్య మయమైపోయి, ఇది క్రమంగా ఢల్లీి తదితర ప్రాంతాలకు గాలితోపాటు విస్తరించడంతో వాయు కాలుష్యం పెద్దఎత్తున చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు మోటారు వాహనాలకాలుష్యం కూడా జతకావడంతో ఢల్లీి వాసుల జీవితాలు దుర్భరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం వెతకాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. ఇందుకోసం జరిగిన యత్నాల కారణంగా ఈ రాష్ట్రాల్లో రాబోయే సీజన్‌లో ఐదులక్షల ఎకరాల్లో వరిపంటకు ప్రత్యా మ్నాయంగా పత్తి, మొక్కజన్న వంటి పంటలను సాగుచేసేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నా రు. ఇందుకోసం ఈ మూడు రాష్ట్రాలు రూపొందించిన ప్రణాళికను కమిషన్‌ ఫర్‌ ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ (సీఏక్యూఎం) సుప్రీంకోర్టుకు గతవారం ఒక నివేదికను సమర్పించింది. 

పంజాబ్‌లో ఏటా మే నెలలో వరి సీజన్‌ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో సీఏక్యూఎం సభ్యులు మూడు రాష్ట్రాల అధికార్లతో చర్చలు జరిపి వరి విస్తీర్ణాన్ని తగ్గించేందుకు వారు రూపొందించిన ప్రణాళికను కోర్టు ముందుంచారు. 2024 సీజన్‌లో పంజాబ్‌ రాష్ట్రంలో మొత్తం 3.15మిలియన్‌ హెక్టార్లలో వరి సాగు జరగ్గా 19.52 మిలియన్‌ టన్నుల వరిగడ్డి ఉత్పత్తి అయింది. అదేవిధం గా హర్యానాలో 1.5మిలియన్‌ హెక్టార్లలో వరి సాగు చేపట్టగా 8.10 మిలియన్‌ టన్నుల వరిగడ్డి ఉత్పత్తి అయింది. ఇక ఎన్‌సీఆర్‌ పరిధిలోకి వచ్చే ఉత్తరప్రదేశ్‌ ప్రాంతాల్లో గత ఏడాది 1,85000 హెక్టార్లలో వరి సాగు చేయగా, 0.74మిలియన్‌ టన్నుల వరిగడ్డి ఉత్పత్తి అయింది. ఇది లావుండగా ఈ మూడు రాష్ట్రాలు వరిగడ్డిని తగులబెట్టకుండా, వాటిని సమీపంలోని పరిశ్ర మలకు తరలించి పశువులకు ఆహారంగా తయారుచేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని కూడా ఈ రాష్ట్రాలు హామీ ఇచ్చినటు ఈ నివేదికలో పేర్కొన్నారు. 

ఢల్లీాిఎన్‌సీఆర్‌ (నేషనల్‌ కేపిటల్‌ రీజియన్‌) ప్రాంతంలో పెరుగుతున్న కాలుష్య నివారణకు తగిన చర్యలు తీసుకోవాలంటూ పర్యావరణ కార్యకర్త, అడ్వకేట్‌ మెహతా సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు, రాజధాని నగరంలో కాలుష్యానికి ప్రధాన కారకాలను గుర్తించింది. వాహనాలు, విచ్చలవిడిగా పటాసులను పేల్చడం, వరిగడ్డి కాల్చడం వల్ల వస్తున్న ధూళి ప్రధాన కారణాలుగా కోర్టు గుర్తించింది. వీటన్నింటి కారణంగా నగ రంలో కాలుష్యం స్థాయిలు విపరీతంగా పెరిగిపోయి వాయుకాలుష్యం అత్యధిక స్థాయిలకు చేరు తోంది. ముఖ్యంగా శీతాకాలంలో పంటకోతలు జరుగుతాయి. సరిగ్గా అప్పుడే వరిగడ్డిన తగులబెట్టడం వల్ల నగరవాసులకు నాలుగు వారాలపాటు కాలుష్య నరకం తప్పడంలేదు. 

పంజాబ్‌లో ప్రస్తుతం 18 ధాన్యాలనుంచి ఎథనాల్‌ను ఉత్పత్తి చేసే డిస్టిలరీలు పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 4,90,000 హెక్టార్లలో వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజన్న, చెరకు, పత్తి పంటసాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఏక్యూఎం తెలిపింది. హర్యానా ప్రభుత్వం కూడా 81,000 హెక్టార్లలో పంటమార్పిడికి చర్యలు తీసుకుంటోంది. ఇక ఉత్తప్రదేశ్‌ ప్రభుత్వం 11వేల హెక్టార్లలో మొక్కజన్న సాగుకు చర్యలు తీసుకుంటోంది. 

దేశ రాజధాని నగరంలో కాలుష్య నివారణకు అవసరమైన ప్రణాళికను రూపొందించాల్సిందిగా గత ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు సీఏక్యూఎంను ఆదేశించింది. ఇందుకోసం సంబంధిత అధికార్లతో చర్చలు జరపి ఒక నివేదికను తనుకు సమర్పించాలని కోరింది. పంటమార్పిడిని ప్రోత్సహించేందుకు తాను సిద్ధంగానే వున్నానని పంజాబ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇందుకు రైతులను ఒప్పించాలి. ఎందుకంటే మొక్కజన్న పంట సాగు చేస్తే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించక తప్పదు. అప్పుడు మాత్రమే వారిని ఒప్పించే అవకాశాలుంటాయి. అదే వరిపంటకైతే ఈబాధలే దు. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఈ వరి ధాన్య సేకరణ చేపడుతుందని, పంజాబ్‌ ప్రభు త్వం పేర్కొంది. గతవారం సీఏక్యూఎం సమర్పించిన ఈ నివేదికను, ఇంకా కోర్టు పరిశీలించాల్సి వుంది. 1985 నుంచి సుప్రీంకోర్టు ఢల్లీి కాలుష్యంపై దృష్టి సారించినప్పటికీ, 2017లో అడ్వకేట్‌ మెహతా పిల్‌ దా ఖలు చేసిన తర్వాత, పంట వ్యర్థాలను విచ్చలవిడిగా తగులబెట్టడాన్ని నిరోధించే చర్యలు చేపట్టా ల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం గమనార్హం.

కేరళ ఓటు బ్యాంకు రాజకీయాలు భిన్నం

ఆలయల్లో డ్రెస్‌కోడ్‌పై కొలిక్కిరాని వివాదం

సమర్థకులు…వ్యతిరేకులు..ఎవరి రాజకీయాలు వారివే

సీపీఎం ఓటుబ్యాంకులోకి ఎంట్రీ ఇస్తున్న భాజపా

హిందూ ఓట్ల ఐక్యతపై బీజేపీ దృష్టి

కుల, మత రాజకీయాలపై ఇతర పార్టీల ఆసక్తి

మూఢత్వం నుంచి సామాజిక ప్రగతివైపు కేరళ ప్రస్థానం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కేరళలోని హిందూ దేవాలయాల్లోకి వెళ్లినప్పుడు శరీరం పైభాగంలోని దుస్తులు విప్పి స్వామి ద ర్శనం చేసుకోవాలన్న నిబంధన ఇప్పటికీ అమలవుతోంది. ఈ సంప్రదాయాన్ని అనుసరించే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం సహజం. గత డిసెంబర్‌ 31న కేరళలోని నారాయణ గురు స్థాపించిన ప్రముఖ శివగిరి మఠానికి చెందిన సచ్చిదానందస్వామి ఆలయంలో స్వామి ద ర్శనానికి వెళ్లే సమయంలో శరీర పైభాగంలో ధరించిన వస్త్రాలను తొలగించాల్సిన అవసరం లేదని చెప్పడంతో వివాదం చెలరేగింది. ఇంకా ఆయన చెప్పిందేమంటే నిరాకార, నిర్గుణుడుడైన భగవానుడిని చేరేందుకు భక్తుల కు దేవాలయాలు ఉపకరణాలు మాత్రమే. ఇందుకోసం శరీర పైభాగంలోని వస్త్రాలను తొలగించాల్సిన అవసరమేముంది? అందువల్ల ఎటువంటి ప్రయోజ నం లేదు. ఆలయంలోకి ప్రవేశించిన భక్తుడి మనసు దేవుడు/దేవతపై లగ్నం కావాలి. ఇది ముఖ్యం. బాహ్య వేషధారణకు దీనికి సంబంధం లేదు, అని ఆయన పేర్కొన్నారు. ఇంతవరకు బాగానే వుంది కానీ, దేవాలయంలోకి ప్రవేశించేవారు జంధ్యం వేసుకున్నారా లేదా పరిశీలించేందుకు తద్వారా కేవలం బ్రాహ్మణులు మాత్రమే ఆలయంలోకి ప్రవేశించేందుకు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారని అనడం వివాదం సృష్టించింది. కొన్ని దేవాలయాల్లో బ్రాహ్మణేతర పూజారులు కూడా ఇదే సంప్రదాయాన్ని అనుసరించాన్ని కూడా ఆయన వేలెత్తి చూపారు. నిజానికి డ్రెస్‌ కోడ్‌ అవసరంలేదు అని ఆయన చెప్పడం వరకు సమంజసమే. ఎందుకంటే దైవదర్శనం మనసు కు సంబంధించింది. కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఆలయ ప్రవేశం కలిగించేందుకు ఈసం ప్రదాయం పాటిస్తున్నారనడంలో మాత్రం అర్థంలేదు. ఎందుకంటే ఆలయ ప్రవేశానికి అందరూ అర్హులే. ఎవరూ ఎవరినీ అడ్డుకోవడంలేదు. కులాల ప్రసక్తి తెచ్చి రచ్చ చేయడంవల్ల ఒరిగేదేమీ లేదు. సామాజిక అశాంతి తప్ప. 92వ శివగిరి మఠం వార్షిక తీర్థయాత్ర కార్యక్రమం ప్రారంభ కార్యక్రమంలో పాల్గన్నా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కూడా సచ్చిదానందస్వామి వ్యాఖ్యలను సమర్థించారు. ఆయన నారాయణ గురును సనాతనధర్మం నుంచి వేరుచేయడానికి య త్నించారనే చెప్పాలి. అయితే స్పందించే సమయంలో ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. డ్రెస్‌కోడ్‌ అవసరంలేదని సచ్చిదానందస్వామి చెబుతున్న అంశం నిజమే కానీ, సర్వసమ్మతితో మాత్రమే ఇది జరగాలన్నారు.ఎందుకంటే గతంలో శబరిమలలో మహిళలకు కూడా ప్రవేశం కల్పించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో తలకు బప్పికట్టిన సంగతి ఆయనకు బాగానే గుర్తుంది.

ముదిరిన వివాదం

ట్రావన్‌కోర్‌ దేవస్థానం బోర్డు ప్రెసిడెంట్‌ పి.ఎస్‌. ప్రశాంత్‌ కూడా ‘సర్వసమ్మతి’ అభిప్రాయాన్ని సమర్థించారు. చరిత్రకారుడు ఎం.జి. శశిభూషణ్‌ అభిప్రాయం ప్రకారం, ప్రజలు పవిత్రమైన దేవాలయాలను టూరిస్ట్‌ స్పాట్స్‌గా పరిగణించకుండా వుండేందుకు కూడా ఈ నిబంధనలను వి ధించి వుండవచ్చునని అభిప్రాయపడ్డారు. 1970 ప్రాంతంలో అప్పటి కేరళ ప్రభుత్వం ఈ డ్రెస్‌కోడ్‌ నిబంధనలను తొలగించడానికి ప్రయత్నించిన సంగతిని కూడా ఆయన గుర్తుచేశారు. ఇది లా వుండగా నాయర్‌ సర్వీస్‌ సొసైటీ (ఎన్‌ఎస్‌ఎస్‌) సెక్రటరీ జి. సుకుమారన్‌ నాయర్‌ ముఖ్య మంత్రి పినరయి విజయన్‌, సచ్చిదానంద స్వామిని సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండిరచడంతోవివాదం ముదిరింది. ఆలయ సంప్రదాయాలను మార్చడానికి ఎవరికీ అధికారంలేదు, ప్రభుత్వానికి కూడా! ఆలయ సంప్రదాయాలను ప్రశ్నించే అధికారం సచ్చిదానందస్వామికి ఎవరిచ్చారని ఆయన విరుచుకుపడ్డారు. ప్రతి ఆలయానికి ఒక్కో సంప్రదాయం వుంటుంది. అందువల్ల డ్రెస్‌ కోడ్‌ పాటించడం తప్పనిసరని ఆయన స్పష్టం చేశారు. 

శ్రీ నారాయణ ధర్మపరిపాలన యోగం (ఎస్‌ఎన్‌డీపీ) ప్రధాన కార్యదర్శి వెల్లపల్లి నటేషన్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యదర్శి సుకుమారన్‌పై విమర్శల దాడికి దిగడంతో వివాదం మరింత ముదిరింది. ఇటువంటి సమస్యలు హిందువులను విడదీయలేవని ఆయన అన్నారు. అయితే యోగక్షేమ సభ అధ్యక్షుడు అఖీరామన్‌ కళాదాసన్‌ భట్టత్తిరిప్పాడ్‌ మాత్రం కొంత సంయమనంగా మాట్లాడటం గమ నార్హం. అనవసరమైన పరిమితులు, నిబంధనలు ఎత్తేయడమే మంచిదని అభిప్రాయపడ్డారు. అయితే బ్రాహ్మణులను గుర్తించడానికే ఈ డ్రెస్‌కోడ్‌ తీసుకొచ్చారన్న వాదనను మాత్రం ఆయన ఖండిరచారు. ‘‘ఒక్కొక్క దేవాలయానికి ఒక్కో సంప్రదాయం వుంటుంది. ఉదాహరణకు శబరిమల దేవాలయనికి డ్రెస్‌కోడ్‌ నిబంధనలేం లేవు. కానీ 10 నుంచి 50ఏళ్ల మధ్య వయస్కులైన స్త్రీ లకు ఆలయంలో ప్రవేశం నిషిద్ధం. మార్పులకు మేం వ్యతిరేకం కాదు. కానీ ప్రతిదానికీ బ్రాహ్మ ణులు ఆధిపత్యం అనడం ఎంతమాత్రం సమంజసం కాదు’’ అని స్పష్టం చేశారు. 

విజయన్‌ మద్దతు వెనుక రాజకీయం

అతిపెద్ద తీర్థయాత్రా కేంద్రమైన శివగిరి మఠానికి విజయన్‌ మద్దతుగా నిలవడం వెనుక ఒక రాజకీయ కారణం వుంది. ఈ మఠం హిందువుల్లోని ఎరaవా వర్గం శివగిరి మఠాన్ని అత్యంత పవిత్ర మైనదిగా భావిస్తారు. పెద్దంసంఖ్యలో ఈ వర్గానికి చెందిన ప్రజలు ఈ మఠాన్ని సందర్శి స్తుంటారు కూడా. ఓబీసీలైన వీరు సీపీఎంకు బలమైన మద్దతుదార్లు. తాజాగా భారతీయ జనతా పార్టీ ఈ ప్రజల్లో తన పలుకుబడిని పెంచుకోవడానికి యత్నిస్తుండటం విజయన్‌కు ఎంతమా త్రం మింగుడుపడటంలేదు. ముఖ్యంగా భారత ధర్మ జనసేన (బీడీజేఎస్‌), శ్రీ నారాయణ ధర్మ పరిపాలనా యోగం (ఎస్‌ఎన్‌డీపీ) అనే రెండు సంస్థలు భారతీయ జనతాపార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం సీపీఎంకు ఓటుబ్యాంకుగా వున్న ఎరaవా వర్గం ప్రజల్లో బీజేపీ పలు కుబడిని పెంచడానికి ఇవి తీవ్రంగా కృషిచేస్తున్నాయి. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో సీపీఎంకు గట్టి మద్దతుగా నిలిచిన ఇక్కడి ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థి గణనీయంగా ఓట్లు సంపాదించడం వెనుక ఈ రెండు సంస్థల కృషి ఎంతో వుంది. లోకనీతి, సీడీఎస్‌ సర్వే ప్రకారం ఎరaవా కులాల్లో బీజేపీకి ఏకంగా 32% ఓట్లు లభించాయి. ఇది గతంతో పోలిస్తే 11% ఎక్కువ. ఈ నేపథ్యంలోనే ఎస్‌ఎన్‌డీపీని పూర్తిగా కాషాయీకరిం చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదంటూ సీపీఎం విరుచుకుపడుతోంది. 

శివగిరి మఠానికి ఎందుకంత ప్రాధాన్యం?

కేరళకు చెందిన నారాయణ గురు గొప్ప సంఘసంస్కర్త. ఆయన మతసామరస్యంతో పాటు అందికీ సమాన విద్య, అన్ని వర్గాల మధ్య సమానత్వం అవసరమంటూ ఉద్యమాలు చేశారు. శివగిరి మఠాన్ని 1903లో ఆయన స్థాపించారు. ‘ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు’ అనేది ఈయన ప్రవచించిన సిద్ధాంతం. ముఖ్యంగా బాగా వెనుకబడిన ఎరaవా కులం వారి అభ్యున్నతికోసం అహర్నిశలు పాటుపడ్డారు. ప్రజల్లో ఉన్నత విలువలను పెంపొందించే ప్రక్రియలో భాగంగా ఏటా ఈ ‘తీర్థయాత్ర’ కార్యక్రమాన్ని మఠం నిర్వహిస్తుంది. నిజానికి ఎరaవా వర్గం వారు కేరళ జనాభాలో 23% వరకు వున్నారు. దీనివల్ల సీపీఎం, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు వీరిని గొప్ప ఓటు బ్యాంకుగా పరిగణిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శివగిరి మఠంతో మంచి సంబంధాలను కొన సాగించడం ద్వారా ఈ వర్గం ప్రజల్లో పలుకుబడి పెంచుకోవాలని తంటాలు పడుతున్నాయి. బీజేపీ హిందువుల ఓట్లు చీలడానికి ఎంతమాత్రం ఇష్టపడదు. ఈ నేపథ్యంలో నారాయణ గురు సంప్రదాయానికి పూర్తి మద్దతు ప్రకటించడం ద్వారా ఎరaవా వర్గాల్లో పలుకుబడి పెంచుకోవ డానికి ప్రయత్నిస్తోంది. అయితే శివగిరి మఠం ఇప్పటివరకు ఏపార్టీకి మద్దతు ఇవ్వకుండా తట స్థ వైఖరి అవలంబిస్తోంది. ఫలితంగా అన్ని పార్టీలు ఈ మఠాన్ని తమకు వేదికగా ఉపయోగించుకుంటున్నాయి. శివగిరి మఠం ముఖ్యంగా ఆలయల్లో అనుసరిస్తున్న డ్రెస్‌కోడ్‌ను వ్యతిరేకిస్తుంది. ఇందులో భాగంగా జనవరి 17న ట్రావన్‌కూర్‌ దేవస్థానం బోర్డువరకు మఠం సన్యాసులు ఒక ప్రదర్శన కూడా నిర్వహించడం గమనార్హం.

మూఢత్వం నుంచి ప్రగతి పథం వైపునకు….

నిజానికి కేరళలో కులవివక్షకు వ్యతిరేకంగా తొలి ఉద్యమం 1813లో చోటుచేసుకుంది. నాటి ట్రావన్‌కూర్‌ సంస్థానంలోని వెనుకబడిన వర్గాలైన నాడార్లు ఈ ఉద్యమాన్ని నిర్వహించారు. అప్పటివరకు ఈ కులాలకు చెందిన మహిళల వక్షాలను వస్త్రంతో కప్పుకోవడానికి అనుమతి వుండేది కాదు. మారు మరక్కల్‌ సమారం పేరుతో జరిగిన ఈ ఉద్యమం 50 సంవత్సరాల పాటు సాగింది. నాటి ట్రావన్‌కూర్‌ ప్రభుత్వం, అత్యంత శక్తివంతమైన నాయర్‌లు ఈ ఉద్యమాన్ని అణచివేశారు. అయితే చివరకు ప్రభుత్వం నాడార్‌ మహిళలకు తమ పైభాగాలను వస్త్రంతో కప్పుకునే హక్కును సమర్థించిడంతో వివాదం సమసింది. తర్వాత 1859లో అప్పటి మద్రాస్‌ ప్రెసిడెన్సీ గవర్నర్‌ ఛార్లెస్‌ ట్రెవెలియన్‌ ఒత్తిడితో నాడార్లలో అత్యధికులు క్రైస్తవంలోకి మారిపోయారు. అప్పట్లో కేరళలోని ఉన్నత కులాలకు చెందిన మహిళలు కూడా ఆలయంలోకి వెళ్లాలంటే తమ పైభాగంలోని ఆచ్ఛాదనను తప్పనిసరిగా తొలగించాల్సిందే. ఇదిలావుండగా 1936కు ముందు కేరళ దేవాలయాల్లోకి వెనుకబడిన వర్గాలవారు ప్రవేశించడానికి అనుమతి వుండేది కాదు. అయితే 1936లో మహాత్మాగాంధీ, నారాయణగురులు వైకోమ్‌లో సత్యాగ్రహం చేశారు. కేరళలో అత్యధిక శాతం హిందువులు ఇతర మతాల్లోకి మారిపోవడానికి ప్రధాన కారణం ఈ మూర్ఖపు ఆచార వ్యవహారలేనని చెప్పాలి.దీంతో అప్పటి ట్రావన్‌కూర్‌ సంస్థానాధిపతి ఈ నిషేధాన్ని ఎత్తేశారు. స్వాతంత్య్రం వచ్చిన 50 సంవత్సరాలు దాటిన తర్వాత దేవాలయాల్లో బ్రాహ్మణేతర పూజార్ల నియామకం కూడా జరుగుతోంది. 2018లో ప్రస్తుత విజయన్‌ ప్రభుత్వం ట్రావన్‌కూర్‌ దేవస్థాన బోర్డులో దళితులకు రిజర్వేషన్‌ సదుపాయం కల్పించింది. ఈ దేవస్థానం కింద 1200 దేవాల యాలున్నాయి.

రేషన్ షాపుల్లో నరేంద్ర మోడీ చిత్రపటాన్ని పెట్టాలి. 

రేషన్ షాపుల్లో నరేంద్ర మోడీ చిత్రపటాన్ని పెట్టాలి. 

మందమర్రి నేటి ధాత్రి

 

బిజెపి నాయకులు దేవరనేని సంజీవరావు
మందమర్రి టౌన్ ఏప్రిల్ 5

మందమర్రి మండలంలోని చిర్రకుంట గ్రామంలో ప్రభుత్వ చౌక ధార దుకాణంలో ఉచిత రేషన్ బియ్యం కోసం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యువజన పథకం కింద ఐదు కిలోల బియ్యం ప్రతి పేదవారికి చెందే విధంగా గత కరోనా కాలం నుండి రాబోయే ఐదు సంవత్సరాల వరకు మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉచితంగా రేషన్ ఇవ్వడంలో భాగంగా చిర్రకుంట గ్రామంలో ప్రభుత్వ చౌకదారుల దుకాణంలో ఉచిత రేషన్ నరేంద్ర మోడీ బోర్డుని పెట్టడం జరిగింది ఈ సందర్భంలో లబ్ధిదారులను ఉద్దేశించి సీనియర్ నాయకులు సంజీవరావు దేవర్నేని మాట్లాడడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మందమర్రి మండల అధ్యక్షులు గిర్నాటి జనార్ధన్ మరియు చిర్రకుంట మాజీ ఉపసర్పంచ్ కర్రే రాజయ్య మరియు మాజీ వార్డ్ నెంబర్ దుర్గం మల్లేష్ కొమురోజు రాము కడియాల ఉదయ్ సిద్ధం శ్రీను నమసని చంద్రశేఖర్.శ్రీకాంత్ సత్యం మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నర్సంపేట విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా డిఈ తిరుపతి బాబు జగ్జీవన్ రామ్ యొక్క స్ఫూర్తి గురించి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏ.డి.ఈ బి.లక్ష్మణ్, టౌన్ ఏ.ఈ ఎన్ .విజయభాస్కరరావు టెక్నికల్ ఏ ఈ సంపత్ తో పాటు నర్సంపేట టౌన్ విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

అద్దంకి దయాకర్ సేవలు గుర్తించడం గర్వకారణం. 

అద్దంకి దయాకర్ సేవలు గుర్తించడం గర్వకారణం. 

తొర్రూరు( డివిజన్) నేటి ధాత్రి

 

అద్దంకి దయాకర్ సేవలు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం గర్వకారణం అని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చిట్టి మల్ల మహేష్ పేర్కొన్నారు.
మాల మహానాడు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ జన్మదిన వేడుకలు డివిజన్ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో కేక్ కట్ చేసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ…..
సామాజిక ఉద్యమాల్లో అద్దంకి దయాకర్ చురుగ్గా పాల్గొన్నాడని, దళితుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేశాడని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆయన శక్తివంచన లేకుండా కృషి చేశాడని తెలిపారు.
మాలలు, దళిత వర్గాల అభివృద్ధికి అద్దంకి దయాకర్ పాటుపడ్డాడని తెలిపారు.
అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించే విషయ పరిజ్ఞానం, నిబద్ధత కలిగిన దయాకర్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా యూత్ నాయకులు యనమల రాకేష్, డివిజన్ అధ్యక్షులు గొడిశాల నవీన్, నాయకులు గారలాజర్, నెల్లికుదురు అధ్యక్షులు కారం ప్రశాంత్, నాయకులు చిట్టి మల్ల కిరణ్ ఎనమాల లక్ష్మి, ప్రసన్న కుమార్, చిట్టి మల్ల గోపి, బన్నీ మనో, శివకుమార్, వైద్యాధికారులు పాల్గొన్నారు.

ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

దళిత ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కార్యక్రమం..

నర్సంపేట,నేటిధాత్రి;*

 

అణగారిన ప్రజల హక్కుల కోసం పోరాడిన యోధుడు,భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి కార్యక్రమాన్ని నర్సంపేట టౌన్ దళిత ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక పాత ఎమ్మార్వో ఆఫీస్ కార్యాలయం ముందు నిర్వహించారు. దళిత రత్న,దళిత ప్రజా సంఘాల కో కన్వీనర్ కళ్ళేపెళ్లి ప్రణయ్ దీప్ ఆధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా దళిత ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గద్ద వెంకటేశ్వర్లు, ప్రజాసంఘాల నాయకులు జనగాం కుమార్,అందె రవి దళిత ప్రజా సంఘాల జేఏసీ కో కన్వీనర్ దళిత రత్న గుంటి వీర ప్రకాష్ దళిత ప్రజాసంఘాల జేఏసీ కో కన్వీనర్ తడుగుల విజయ్ లు మాట్లాడుతూ భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత నేత బీహార్ లో ఒక సామాన్య రైతు కుటుంబంలో 1908 ఏప్రిల్ 5న జగ్జీవన్ రామ్ జన్మించారన్నారు.ఈ కార్యక్రమంలో ప్రతినిధులు బోయిని నారాయణ, ఉపాధ్యాయ సంఘ నాయకులు సాంబయ్య, ప్రభుత్వ ఉపాధ్యాయులు గిరిగాని శ్రీనివాస్, కుల పెద్దలు మాదాసి సదానంద,కరుణాకర్, నవీన్, రాజు,మాల మహానాడు నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

చేనేత కార్మికుల ఐదవ రోజు కొనసాగుతున్న నిరవధిక సమ్మె.

సిరిసిల్ల చేనేత కార్మికుల ఐదవ రోజు కొనసాగుతున్న నిరవధిక సమ్మె

డిమాండ్లతో కూడిన ఫ్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టిన కార్మికులు

ఏప్రిల్ – 7 సోమవారం రోజున 24 గంటల నిరాహార దీక్ష చేపడతాం

CITU పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ డిమాండ్

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని జోళి శాఖ ప్రభుత్వ ఆర్డర్ చీరలకు సంబంధించి పవర్లూమ్ కార్మికులకు వార్పిన్ , వైపని కార్మికులకు మెరుగైన వేతనాలు వచ్చే విధంగా కూలీ నిర్ణయించి ఇతర సమస్యలు పరిష్కరించాలని పలు డిమాండ్లతో చేపట్టిన సమ్మె ఈరోజు 5 వ రోజు కు చేరుకుంది ఈరోజు సమ్మెలో భాగంగా బి.వై నగర్ లోని సమ్మె శిబిరం నుండి కార్మికులు గోపాల్ నగర్ చౌరస్తా వరకు ర్యాలీగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.

ఈ సందర్భంగా సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ , జిల్లా అధ్యక్షులు కోడం రమణ గార్లు మాట్లాడుతూ గత ఐదు రోజుల నుంచి కార్మికులు సమ్మె చేస్తున్న కూడా ప్రభుత్వం , అధికారులు స్పందించకపోవడం అన్యాయమని అన్నారు.

సమ్మె డిమాండ్ల పరిష్కారం కోసం ఏప్రిల్ 7 సోమవారం రోజున 24 గంటల నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఇట్టి కార్యక్రమానికి సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్..

Musham Ramesh’s

కూరపాటి రమేష్ గారు ముఖ్యఅతిథిగా హాజరుతున్నారని ఇట్టి కార్యక్రమంలో పవర్లూమ్ కార్మికులు , వార్పిన్ , వైపని కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కార్మికుల సమ్మెకు మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు నక్క దేవదాస్ , వార్పిన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సిరిమల్ల సత్యం , వైపని వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కుమ్మరి కుంట కిషన్ నాయకులు ఉడుత రవి , ఒగ్గు గణేష్ , ఎలిగేటి శ్రీనివాస్ , సబ్బని చంద్రకాంత్ , భాస శ్రీధర్ , వేణు , తిరుపతి , రాజు , రాము , వెంకటేశ్వర్లు , సదానందం పెద్ద ఎత్తున పవర్లూమ్ , వార్పిన్ , వైపని యూనియన్ల నాయకులు , కార్మికులు పాల్గొన్నారు

గర్భిణీ స్త్రీలకు, పసిపిల్లలకు ఇంజక్షన్స్.

గర్భిణీ స్త్రీలకు, పసిపిల్లలకు ఇంజక్షన్స్.
• అంగన్వాడీ లో పౌష్టిక ఆహారం
• ఏఎన్ఎం రేణుక
నిజాంపేట: నేటి ధాత్రి

 

గర్భిణీ స్త్రీలకు, పసి పిల్లలకు నెలవారి ఇంజక్షన్స్ ప్రతి నెల ఇవ్వడం జరుగుతుందని ఏఎన్ఎం రేణుక అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల అంగన్వాడి కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు, పసి పిల్లలకు నెలవారి ఇంజక్షన్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు, పసి పిల్లలకు పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తుందని గర్భిణీ స్త్రీలు ప్రతి ఒక్కరు పౌష్టిక ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ జ్యోతి, సిస్టర్ గౌరీ, గర్భిణీ స్త్రీలు పసుపిల్లలు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version