ఎస్సీ కాలనీకి చెందిన గాయాల మధు (మానసిక వికలాంగుడు) అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ట్రస్ట్ తరుపున పూర్తి సహకారంగా ఉంటామని ధైర్యం చెప్పి 25 కేజీల బియ్యం, నిత్యావసరాలు, కూరగాయలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ యతిపతి శ్రీకాంత్, జనరల్ సెక్రటరీ జీడి హరీష్, కోశాధికారి ఒర్రె కుమారస్వామి, ట్రస్ట్ సభ్యులు పెండ్లి భాస్కర్, తాళ్లపెళ్లి రత్నాకర్, ఈ కార్యక్రమంలో గాదేపాక భాస్కర్, మృతుడి కుటుంబసభ్యులు, తదితరులు పాల్గొన్నారు
చేర్యాల లో మున్సిఫ్ కోర్ట్ బార్ అసోసియేషన్ ఎన్నికలు
అధ్యక్షుడిగా ఆరెల్లి వీర మల్లయ్య ఎన్నిక
చేర్యాల నేటిదాత్రి
చేర్యాల మున్సప్ కోర్ట్ పరిధిలో జరిగిన ఎన్నికలలో ఎన్నికల అధికారిగా భూమిగారి మనోహర్ వ్యవహరించారు చేర్యాల మున్సఫ్ కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఆరెల్లి వీర మల్లయ్య ఎన్నికయ్యారు ప్రధాన కార్యదర్శిగా తాటికొండ ప్రణీత్ ఎన్నుకోబడ్డారు.
Tatikonda Praneeth
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేర్యాల మున్సఫ్ కోర్టులో రెగ్యులర్ జడ్జి నియమాకానికి కృషి చేస్తానని మరియు పూర్తిస్థాయి కోర్టు సిబ్బంది నియమకానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పొన్నం సురేష్ కృష్ణ గుస్కా వెంకటేష్ పి యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు
మొగుళ్లపల్లి కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు క్యాతరాజు రమేష్
నేటిధాత్రి మొగుళ్ళపల్లి :
మొగుళ్లపల్లి మండల ప్రజలకు మరియు, ,పరిసర ప్రాంతాల ప్రజలకు వేసవి ఎండల తీవ్రతలకు ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల ప్రజలు వడ దెబ్బకు గురయ్యే అవకాశం వుంది వడదెబ్బ సోకకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు క్యాతరాజు రమేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఉపాధి హామీ పనులతో పాటు వ్యవసాయ పనుల నిమిత్తం కుళి పనులకు వెళుతున్న కూలీలు వడ దెబ్బ సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి క్లుప్తంగా వివరించామని చెప్పారు. వడ దెబ్బ నివారణకై ప్రజలు,కూలీలు అందరూ రోజుకి 10 గ్లాసుల కన్నా ఎక్కువ నీరు త్రాగాలన్నారు.బయటికి వెళ్లినప్పుడు గొడుగు,టోపీ, తలపాగ,తెల్లని కాటన్ దుస్తులు ధరించాలని సూచించామన్నారు. ఉదయం,సాయంత్రం ఎండ లేని సమయంలో పనులు చేసుకోవాలని,ఎండ వేడిమికి డి హైడ్రెషన్ కాకుండా ఉండడానికి ఓఆర్ఎస్ ద్రావణాన్ని త్రాగాలని సూచించారు.
* ఈరోజు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం ఆధ్వర్యంలో మార్కెట్లో పనిచేయుచున్న హమాలీ, దాడ్వయి, కార్మికులకు రెన్యువల్స్ లైసెన్సును జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి మల్లేశం ద్వితీయ శ్రేణి కార్యదర్శి శ్రీ ఎం రాజు ఆ ఆడ్తి దారుల మరియు హమాలీ సంఘం సభ్యులు దాడ్వయి సంఘం సభ్యులు మరియు అడ్తిదారుల మరియు హమాలీ సంఘం దాడ్వయి సంఘం అధ్యక్షులు ఎర్రవెల్లి రాజేశ్వరరావు మరియు_ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రముఖ ధూమ్ ధామ్ కళాకారుడు కవి గాయకుడు రామంచ బ్రతుకు ఢిల్లీలో ఘన సన్మానం జరిగింది ఇండియన్ కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోను ముద్రించాలని డిమాండ్ చేస్తూ జేరిపోతుల పరుశురామ్ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్మంతర్ వద్ద బుధవారం రోజున సుమారు వందమంది తెలంగాణ కళాకారులతో ధూంధాం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మద్దతుగా పలువురు తెలుగు రాష్ట్ర ఎంపీలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని స్థాపించిన మేధావి అంబేద్కర్ అని తెలిపారు అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితులను సరిదిద్దు దేశంలో నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టిన బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని కరెన్సీ నోట్ల మీద తప్పకుండా ముద్రించాలని అన్నారు అనంతరం ధూంధాం లో పాల్గొన్న కళాకారులకు ఘనంగా సన్మానం చేసి ఈ కార్యక్రమంలో ఎంపీలు ఈటల రాజేందర్, ఆర్ కృష్ణయ్య ,బీద మస్తాన్ రావు , వాకులాభరణం కృష్ణమోహన్రావు, అప్పలనాయుడు, ప్రసిద్ధ ధూమ్ ధాం కళాకారులు ఏపూరి సోమన్న, వల్లాల వాణి చెరుకు మల్లికా ,రేలారె గంగా ముక్కెర సంపత్ , గంట గల్లా సంజీవ్ మా పల్లె శంకర్ ,గ్యారయాకయ్య ,రేలారే గంగా దిబ్బట పుష్పలత, మేకల శ్రావణి ,స్వప్న తదితర వందమంది కళాకారులు పాల్గొన్నారు
తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం(కాంగ్రెస్ ప్రభుత్వం) రైతుకు న్యాయం జరగాలి అని 2 లక్షల రూపాయలు ఏక కాలంలో రుణ మాఫీ చేసి రైతు భరోసాను పది వేల నుండి పన్నెండు వేల రూపాయలకు పెంచి చిన్న సన్న కారు రైతులకు ఎంతో మేలు జరిగేలా చేస్తుంది.
అంతే కాకుండా నిరు పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి ఐదు లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుంది మరియు విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తుంది.
రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు గృహ అవసరాలకు ఇవ్వడం జరుగుతుంది మరియు మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షల రూపాయలకు పెంచి కార్పోరేట్ హాస్పటల్ లో పేద ప్రజలు చికిత్స పొందేలా చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చదువుకున్న విద్యార్థులకు 50 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టి నియామక పత్రాలు అందజేశారు. అంతే కాకుండా నిరుద్యోగులకు 4 లక్షల వరకు 60 శాతం సబ్సిడీతో రుణాలు అందించాలని దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన చేపట్టి బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలకు మరెన్నో ప్రయోజనాలు అందించాలని, నిత్యం ప్రజల ప్రయోజనాల కోసం మరియు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడతాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఇందుకు గాను భూపాలపల్లి జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకుడు యార అజయ్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో మరో ఆరు మంత్రి పదవులను భర్తీ చేయాలని చూస్తున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ నాయకుడు రాజకీయ నిబద్ధతకు నిజాయితీకి నిదర్శనమైన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డికి మంత్రిపదవి కేటాయించాలని టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ ప్రభుత్వాన్ని కోరారు.
శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామానంద్ మాట్లాడుతూ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నో వ్యాయ ప్రయాసాలు ఒడిదుడుకులను అనుభవిస్తూ నర్సంపేట గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేసిన నాయకుడు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అని అన్నారు.
నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామ సర్పంచిగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి సొసైటీ చైర్మన్ గా డిసిసిబి చైర్మన్ గా ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సుదీర్ఘకాలం పనిచేసి పిసిసి సభ్యులుగా ఏఐసీసీ సభ్యులుగా పదవులు చేపట్టి నిబంధత క్రమశిక్షణ కమిట్మెంట్ కు మారుపేరుగా నిలిచి కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసం జీవితాన్ని దారపోసి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి రాష్ట్ర నాయకుడిగా గుర్తింపు పొంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తూ వారు చేపట్టిన పాదయాత్రలో చురుకైన పాత్ర పోషించారని పేర్కొన్నారు.
2004 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీల పొత్తులో భాగంగా నర్సంపేట టికెట్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంభంపాటి లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయిస్తే కలత చెందకుండా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను ఏకతాటిపై నడిపించి లక్ష్మారెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించాడని అన్నారు.
2009లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి కొద్దిపాటి తేడాతో ఓటమి చెందినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తూ వచ్చారని 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం దొంతి మాధవరెడ్డికి టికెట్ కేటాయించకుండా మోసంచేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నియోజకవర్గ ప్రజల బలమైన కోరికతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఏకైక స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్రవ్యాప్తంగా దొంతి మాధవరెడ్డి ప్రభంజనం సృష్టించారని వివరించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు నీతిమాలిన రాజకీయాలు చేస్తూ పదవుల కోసం జంపుజిలానిలుగా మారి టిఆర్ఎస్ పార్టీలో కిరాయిప్పులకు పాల్పడుతుంటే అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వతంత్ర ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని టిఆర్ఎస్ పార్టీకి ఆహ్వానించినప్పటికీ అలాగే మంత్రి పదవి ఇస్తామని కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఆఫర్లు చేసిన ఆశపడకుండా కాంగ్రెస్ పార్టీని వీడకుండా మాతృపార్టీపై ప్రేమతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీలో చేరి తన రాజకీయ నిబద్ధతను చాటుకోవడం జరిగిందని గుర్తుకు చేశారు.
2014 నుండి 2018 వరకు ఎమ్మెల్యేగా నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తూ అప్పటి అధికార పార్టీ ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసిన నిఖర్సగా ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడిన గొప్ప నాయకుడు దొంతి మాధవరెడ్డి అని అభివర్ణించారు.
2018 ఎన్నికల ముందు టీపీసీసీ అధ్యక్షులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్రను ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముందుండి నిర్వహిస్తూ నడపారన్న విషయాన్ని గుర్తు చేశారు.
2018 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పార్టీ కోసం నిలబడే వ్యక్తిగా గుర్తింపు పొందిన నాయకుడని దాదాపు నర్సంపేట నియోజకవర్గం ఏర్పడి 45 ఏళ్ల చరిత్రలో చేతి గుర్తుపై గెలిచిన దాఖలాలు లేకపోగా మొదటిసారి నర్సంపేట గడ్డపై కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై గెలిచి చరిత్ర తిరిగరాశాడన్నారు.
కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ అధిష్టానం పార్టీలు ఫిరాయింపులు చేసిన వారికి కొత్తగా వివిధ పార్టీల నుండి పదవుల కోసం పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులను ఇవ్వడం వరంగల్ ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని గుర్తించి మంత్రిపదవి ఇవ్వకుండా వరంగల్ ఉమ్మడి జిల్లా అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను నిరాశకు గురి చేయడం సరికాదని వాపోయారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వంలో భర్తీ చేయనున్న మంత్రి పదవుల్లో రాజకీయ నిబద్ధతకు నిదర్శనంగా ఉన్న ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారికి మంత్రి పదవిని కట్టబెట్టి నర్సంపేట ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లకు టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ విజ్ఞప్తి చేశారు.
“కాజీపేట రైల్వే డివిజన్” పై కక్షగట్టిన “అధికారులు”?
నీరు గారుతున్న “కాజీపేట రైల్వే డివిజన్” ఆశలు..!
విజయవాడకు తెర వెనుక నుంచి మద్దతు ఇస్తున్న కొందరు ఆంధ్ర అధికారులు?
రైల్వేలో “ఉన్నతాధికారులను” సైతం తప్పుదోవ పట్టిస్తున్న “ఆంధ్ర అధికారులెవరు”?
ఉన్నపలంగా కాజీపేటకు 185 మంది లోకో రన్నింగ్ కార్మికుల సంఖ్యను తగ్గించిన దక్షిణ మధ్య రైల్వే
లోకో రన్నింగ్ స్టాఫ్ సంఖ్యను తగ్గించాలని కొంతమంది అధికారులు కంకణం కట్టుకుని తెరవెనుక ప్రయత్నాలు?
లోకో పైలట్ ఖాళీలు భర్తీ చేయాలని మార్చి 19న రైల్వే “జిఎం”కు వినతిపత్రం ఇచ్చిన కార్మికసంఘాలు
లోకో పైలట్ల ఖాళీలను భర్తీ చేయాలని వినతిపత్రం ఇస్తే, ఉన్న లోకో పైలట్ లను ట్రాన్స్ఫర్ చేస్తూ మార్చి 26న ఉత్తర్హులు ఇవ్వడం ఆశ్చర్యం.
కాజీపేట డివిజన్ గా ఏర్పడితే కొంతమంది అధికారులు సికింద్రాబాద్, విజయవాడ లను విడిచి కాజీపేటలో ఉండవలసి వస్తుందని, డివిజన్ కాకుండా ఉండడానికి అడ్డుకునే కుట్రలు చేస్తు.., సిబ్బందిని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్న తీరు ప్రశ్నార్థకం?
కొత్త పోస్టులు భర్తీ చేయకుండా, హుటా హుటిన ఉన్నవి కూడా తీసేయడం వెనుక మతలబు ఏంటో అధికారుల విజ్ఞతకే వదిలేద్దాం…!
తెలంగాణపై సవతి తల్లి ప్రేమ..?, ఆంధ్రకు ప్రాధాన్యత?, ఆంధ్ర అధికారుల కుట్రలు? స్పందించని తెలంగాణ కేంద్ర మంత్రులు?
నేటిధాత్రి, వరంగల్, కాజీపేట
కాజీపేట-హనుమకొండ-వరంగల్ త్రినగరి మాత్రమే కాకుండా తెలంగాణలో ఉన్న ప్రజలందరూ ఆశపడుతున్నది దక్షిణ మధ్య రైల్వేలో కాజీపేట మరో డివిజన్ గా అవతరించాలని. తెలంగాణలో మరో రైల్వే డివిజన్ ఏర్పడితే ఉద్యోగాల సంఖ్య పెరిగి మరి కొంతమంది స్థానికులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని ప్రజలందరూ ఆశపడుతున్నారు. అలాగే ఇక్కడ నుండి కొన్ని కొత్త రైళ్లను ప్రారంభించడానికి అవకాశం కూడా లభిస్తుందని అందరూ అనుకున్నారు.
నూతనంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావడం అందరిలో కాజీపేట డివిజన్ ఆశలు మళ్లీ ఒక ఉన్నత స్థాయిలో చిగురించాయి. కానీ ఏ రోజుకైనా కాజీపేట ను డివిజన్ కాకుండా చేస్తామని అధికారులు పన్నాగం పన్నినట్టు ఉన్నారు. ఇందులో భాగంగానే గత కొంతకాలంగా కాజీపేటలోని రైల్వే కార్మికుల సంఖ్యను క్రమక్రమేన తగ్గిస్తూ వస్తున్నారు. ఇందులో ప్రతిసారి మొదటి వేటు లోకో పైలట్ విభాగం పైనే పడుతున్నది, బుదవారం నాడు కాజీపేటలోని లోకో పైలట్ల సంఖ్యను తగ్గిస్తూ రైల్వే ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో కాజీపేటలోని కోచింగ్ లింకులను విజయవాడకు తరలించిన సందర్భంలో లోకో పైలట్ లందరూ ఒక్కసారిగా ఉవ్వెత్తున నిరసనను తెలియజేశారు. అప్పుడు కొద్ది రోజులు నిరాహార దీక్షలు కూడా చేపట్టారు. దీనికి కాజీపేటలోని స్థానిక సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ మద్దతు తెలపడంతో ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన సందర్భంలో అధికారులు కార్మిక సంఘ నాయకులతో చర్చలు జరిపి కోల్పోయిన కోచింగ్ లింకులను తిరిగి ఇవ్వకపోయినప్పటికీ, వాడి బీదర్ సెక్షన్లో నడిచే కొన్ని ట్రైన్లను కాజీపేటకు కేటాయించి కంటి తడుపు చర్యలు చేపట్టారు. కానీ కొంతకాలానికి వాటిని కూడా తిరిగి వేరే డిపోలకు కేటాయించడంతో కాజీపేట క్రూ డిపో ఎంతో నష్టపోయింది ఒక రకంగా చెప్పాలంటే కాజీపేట క్రూ డిపోను నిర్వీర్యం చేయడానికి బీజం ఇక్కడే పడిందని చెప్పవచ్చు.
గత ఐదు సంవత్సరాల కాలంగా కాజీపేట క్రూ డిపోలో పనిచేస్తున్న లోకో పైలట్ల సంఖ్యను అధికార గణం క్రమక్రమంగా తగ్గిస్తూ వస్తున్నది. ఈ విషయం కార్మిక సంఘాలు గుర్తించకుండా కొద్దికొద్దిగా తగ్గిస్తూ వచ్చింది. గత ఐదు సంవత్సరాల నుండి ట్రాన్స్ఫర్ ల రూపంలో కానీ, నూతన పోస్టింగుల రూపంలో కానీ కాజీపేటకు 10 మందికి మించి కేటాయించలేదు, కానీ ఇక్కడి నుండి చాలామంది ప్రమోషన్ల రూపంలో వేరువేరు క్రూ డిపోలకు వెళ్ళినారు. 2020 వ సంవత్సరంలో 623 మందితో నడిచిన క్రూడిపో నవంబర్ 2023 నాటికి 501 గాను, మార్చి 2025 కు 470 కి పడిపోయింది. ఈ విధంగా రోజురోజుకు కృూ సంఖ్యను తగ్గిస్తూ అధికారులు కాజీపేట పై ఉన్న నిరాసక్తను తెలియజేస్తున్నారు. కాజీపేట క్రూడిపోకు మే 2020 సంవత్సరంలో కేటాయించిన పోస్టుల సంఖ్య 790 కాగా బుధవారం నాడు అధికారులు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఈ సంఖ్య 542 కు పడిపోయింది. అంటే గత ఐదు సంవత్సరాల కాలంలో 248 పోస్టులు ఇక్కడి నుండి తొలగించబడ్డాయి.
Kazipet Railway Division
గూడ్స్ లోకో పైలట్ల నుండి సీనియార్టీ ప్రకారం పదోన్నతి కల్పిస్తూ ప్యాసింజర్ లోకో పైలట్ మరియు మెయిల్ ఎక్స్ప్రెస్ లోకో పైలట్ ఖాళీలను భర్తీ చేస్తారు, ఈ విధంగా పదోన్నతుల కల్పనలో కూడా కాజీపేట లో ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా, విజయవాడ డివిజన్లో ఉన్న సికింద్రాబాద్ కు చెందిన క్రూ డిపోలో భర్తీ చేశారు. ఈ విధంగా చేయడం వలన ఆయా సంబంధిత ఖాళీలలో కాజీపేట కు చెందిన గూడ్స్ లోకో పైలట్లు సుమారు 30 మంది పనిచేస్తున్నారు. కొంతమంది పదవీ విరమణ పొందడం, కోవిడ్ కష్టకాలంలో మరణించడం, కొంతమంది లోకో ఇన్స్పెక్టర్గా, ప్యాసింజర్ లోకో పైలట్లుగా పదోన్నతి పొందడం మరియు మరి కొంతమంది మెడికల్ అన్ఫిట్ అవడం వలన కాజీపేటలోని గూడ్స్ లోకో పైలట్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. దీనికి తోడు అధికారులు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లను పరిగణలోకి తీసుకోకపోవడంతో కాజీపేట డిపో యొక్క క్రూ సంఖ్య రోజురోజుకు పడిపోతూ వస్తున్నది.
Kazipet Railway Division
అయితే విశాఖపట్నం కేంద్రంగా నూతన రైల్వే జోన్ ఏర్పాటు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంలో విజయవాడ డివిజన్ అనేది విశాఖపట్నం జోన్ లోకి వెళ్తున్నదని రైల్వే అధికారులు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇలాంటి సందర్భంలో కాజీపేటలోని లోకో పైలట్ల సంఖ్యను తగ్గించి వారిని విజయవాడ డివిజన్లో సికింద్రాబాద్కు చెందిన లోకో పైలట్లుగా పనిచేస్తున్న డిపోలో కలపడం ఒక హాస్యాస్పదంగా మారింది. ఈ విధంగా కలపడం వలన భవిష్యత్తులో సికింద్రాబాద్ డివిజన్లోని లోకో పైలట్ల ఉద్యోగాల సంఖ్య తగ్గిపోనున్నది.
సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ వెనుకబాటుతనానికి ఆంధ్ర నాయకులు వారి వారి స్థాయిలలో కృషిచేసి రైల్వేల పరంగాను ఎదగకుండా చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఆంధ్ర ప్రాంతం కు చెందిన కొంతమంది అధికారులు సికింద్రాబాద్ డివిజన్లో పనిచేస్తూ ఇంకా ఆంధ్రకే మద్దతునిస్తున్నారు. ఇందులో భాగంగానే కాజీపేట డివిజన్ ఏర్పాటును అడ్డుకుంటున్నట్టుగా తెలియవస్తున్నది. కాజీపేట డివిజన్ ఏర్పాటులో కీలక భూమిక పోషించనున్న లోకో రన్నింగ్ స్టాఫ్ సంఖ్యను తగ్గించాలని కొంతమంది అధికారులు కంకణం కట్టుకుని తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. కాజీపేట డివిజన్ గా ఏర్పడితే కొంతమంది అధికారులు సికింద్రాబాద్, విజయవాడలను విడిచి కాజీపేటలో ఉండవలసి వస్తుందని, డివిజన్ కాకుండా ఉండడానికి చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
Kazipet Railway Division
తెలంగాణలోని రెండవ అతిపెద్ద నగరమైన వరంగల్-హనుమకొండ-కాజీపేట కు కేంద్ర ప్రభుత్వం ఎయిర్పోర్టును కేటాయించడం, ఇదే సందర్భంలో రైల్వే ఫ్యాక్టరీ కాస్త మల్టిపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా మారడంతో ఇక్కడి ప్రజలలో రైల్వే డివిజన్ ఏర్పాటుపై ఆశలు ఎగిరిపడ్డాయి. కానీ అధికారులు ఈ విధమైన చర్యలతో డివిజన్ గా మారే ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఇక్కడి రైల్వే కార్మికులు, కార్మిక నాయకులు, ప్రజలు అందరూ అధికారుల చర్యలను విమర్శిస్తూ కాజీపేట డివిజన్ గా ప్రకటించాలని కోరుతున్నారు.
ఈనెల 8వ తేదీన కాజీపేటలో కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు కోరుతూ, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు రైల్వే మంత్రిని కలిసి వినతి..
కాంగ్రెస్ మంత్రులు, ఎంపీల ప్రతినిధి బృందం ఈ నెల మార్చి 8న కేంద్ర రైల్వే మంత్రిని కలిసి, కాజీపేటలో కొత్త రైల్వే డివిజన్‌ను సృష్టించాలని మరియు తెలంగాణ రాష్ట్రానికి కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, డి. సీతక్క, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య, పోరిక బలరాం నాయక్ లతో కూడిన ప్రతినిధి బృందం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్ర అవసరాలను జాబితా చేసే మెమోరాండంను సమర్పించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని వాగ్దానం ప్రకారం కాజీపేటలో రైల్వే తయారీ యూనిట్ ఏర్పాటుకు కొనసాగుతున్న పనులకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతినిధి బృందం అదే స్థలంలో రైల్వే డివిజన్‌ను కోరింది.
Kazipet Railway Division
కాజీపేట రైల్వే డివిజన్…!
విశాఖపట్నంలో ప్రధాన కార్యాలయంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు ఫలితంగా, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్‌లో సికింద్రాబాద్, హైదరాబాద్ మరియు నాందేడ్ అనే మూడు డివిజన్లు మాత్రమే మిగిలిపోయాయని, గుంతకల్, విజయవాడ మరియు గుంటూరులను సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌లో విలీనం చేశారని వారు వాదించారు. రైల్వే నెట్‌వర్క్ నిర్వహణ కోసం ప్రయాణీకులకు, వస్తువులకు మెరుగైన భద్రతను అందించడానికి కొత్త విభాగాన్ని సృష్టించడం అవసరమని మంత్రులు అన్నారు. ట్రాఫిక్‌తో పాటు ఎక్కువ సరుకు రవాణా ఉన్న కాజీపేట ప్రాంతాన్ని డివిజన్‌గా చేస్తే గుంటూరు మరియు హైదరాబాద్ డివిజన్‌ల కంటే ఎక్కువ ట్రాక్ కిలోమీటర్లు మరియు ఆదాయం ఉంటుందని వారు చెప్పారు.
తెలంగాణపై సవతి తల్లి ప్రేమ, ఆంధ్రకు ప్రాధాన్యత?, స్పందించని కేంద్ర మంత్రులు?
ఈ నెల మార్చి 19 బుధవారం నాడు సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, కాజీపేట క్రూ డిపో ని సందర్శించిన సందర్భంగా, లోకో పైలట్ల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ రిప్రెసెంటేషను ఇచ్చిన కార్మిక సంఘం నాయకులు. జనరల్ మేనేజర్ సందర్శన జరిగిన వారం రోజులకే కాజీపేట లోకో పైలట్ ల సంఖ్యను తగ్గిస్తూ ఉత్తర్వులు వెలవడం గమనార్హం.
సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పైడిగుమ్మల్లో విషాద ఘటన చోటుచేసుకున్నది. ఈ నెల 10న అదృశ్యమైన ఇద్దరు వలస కార్మికులు, వ్యవసాయ బావిలో విగతజీవులుగా కనిపించరు. మృతులు బైద్యనాథ్ భట్ (UP), హరిసింగ్(ఒడిశా)గా పోలీసులు గుర్తించారు. పైడిగుమ్మల్లో వెంచర్ పనులకు వచ్చిన ఇద్దరు కార్మికులు ప్రమాదం బారిన పడ్డట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి వ్యవసాయ బావిలో నుంచి కార్మికుల మృతదేహాలు గుర్తించి, వెలికితీశారు.
ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు పాముల రమేష్.
హన్మకొండ,నేటిధాత్రి:
తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మాదిగ, ముదిరాజ్ సామాజిక వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణలో మంత్రివర్గంలో స్థానం కల్పించాలని హన్మకొండ జిల్లా ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు పాముల రమేష్ కోరారు.ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ,కాంగ్రెస్ జాతీయ నాయకులకు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లకు విజ్ఞప్తి చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గత టీఆర్ఎస్ ప్రభుత్వం మాదిగలను అదేవిధంగా ముదిరాజులను 10 సంవత్సరాల పాటు రాజకీయ వివక్షతకు గురిచేస్తూ అణగదొక్కడం జరిగిందన్నారు. మతోన్మాద బిజెపి పార్టీశక్తులు పావులుగా మార్చుకునే వారి కుట్రలను గమనిస్తున్నాం.బిజెపి పార్టీ 1996లో కాకినాడలో వర్గీకరణకు అనుకూలమని చెప్పి ఆ విషయాన్ని తుంగలో తొక్కిందన్నారు.గత శాసనసభ ఎన్నికల ముందు క్యాబినెట్ సెక్రెటరీతో హడావిడిగా ఎస్సీ వర్గీకరణ కమిటీ వేసి ఇప్పటివరకు రిపోర్టు తెప్పించలేదని తెలిపారు.బిజెపి పార్టీ మాదిగల పట్ల, ముదిరాజుల పట్ల ప్రేమ ఉంటే ఆ సామాజిక వర్గాల నుంచి కేంద్ర మంత్రులుగా తీసుకోవాలని రమేష్ డిమాండ్ చేశారు.
*షబ్ ఎ ఖదర్ లైలతుల్ ఖదర్ కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం సోదరులు*
జహీరాబాద్. నేటి ధాత్రి:
ఝరాసంగం ఆలంగిరి జామియా మసీదులో మత గురువు మొహమ్మద్ ఫిర్దోస్ మాట్లాడుతూ షబ్-ఎ-ఖదర్ యొక్క ప్రాముఖ్యత ముస్లింలు రాత్రిపూట ఆచరించే ఆచారాలు వాటిని పాటించడంలో ఈ రంజాన్ నెలలో.
చాలామంది రాత్రంతా ప్రార్థనలు చేస్తూ, ఖురాన్ పఠిస్తూ గడుపుతు 30 రోజులు ఆచరించే కురాన్ ను వింటూ.
కొందరు పేదలకు ఆహారం ఇవ్వడం మరియు పేదలకు సహాయం చేయడం వంటి దాతృత్వాలు కూడా చేస్తారు.లైలతుల్ ఖదర్ అత్యంత శుభప్రదమైన రాత్రులలో ఒకటి మరియు ఇస్లాంలో పవిత్రత పరంగా దీనికి సమానమైన రాత్రి బహుశా మరొకటి లేదు.
ఈ రాత్రి సాధారణంగా రంజాన్ చివరి పది రోజులలో ఉంటుందాని ఆ రోజుల్లో ఇది ఆశ్రమంలోని బేసి రాత్రులలో ఉంటుంది. పంక్తులు వివిధ ఆయత్‌లు మరియు హదీసుల వెలుగులో రాత్రి యొక్క కొన్ని ప్రధాన ధర్మాలను అందిస్తాయని.
ఖురాన్ లో, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అన్నారు ఈ ఖురాన్ ఆయత్ నుండి, లైలతుల్ ఖద్ర్ తో ముడిపడి ఉన్న అతి పెద్ద ధర్మం ఏమిటంటే, ఈ రాత్రిలోనే అల్లాహ్ మానవాళికి ఖురాన్ ప్రసాదించాడు, ఇది బహుశా అల్లాహ్ మానవాళికి పంపిన అతిపెద్ద బహుమతి కావచ్చు.
కాబట్టి, ఏ కారణం చేతనైనా ఒక ముస్లిం రాత్రిని జరుపుకోవాలనుకుంటే, అతి పెద్దది బహుశా అల్లాహ్ తన అతిపెద్ద బహుమతిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం పై ఈ రాత్రినే పంపాడనే వాస్తవం, కాబట్టి దీనిని ఈ బహుమతి కోసమే, అయితే, అంతిమ ఎంపిక ఏమిటంటే, ఈ అత్యంత శుభకరమైన రాత్రి నుండే పవిత్ర ఖురాన్ చదవడం అర్థం చేసుకోవడం నేర్చుకోవడం ప్రారంభించడం.
విశ్వాసం సంప్రదాయానికి చాలా సంబంధించినది; అత్యంత ముఖ్యమైన దీవించబడిన రాత్రులలో ఒకటి. ఖురాన్ విశ్వాసాల ప్రకారం, ఖద్ర్ రాత్రి ప్రత్యేకమైనది అల్లాహ్ క్షమాపణ కోరేవారికి ఆయన మార్గదర్శకత్వాన్ని అర్థించేవారికి ఆయన నుండి ఆశీర్వాదాలు లభిస్తాయని వాగ్దానం చేయబడింది. అని అన్నారు.
మన భారతదేశ సుఖ సంతోషాల గురించి ప్రత్యేక ప్రార్థనలు చేసి కుల మత విభేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి సుఖ సంతోషాలతో ఉండాలని దేవునితో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ సదర్ గ్రామ ముస్లింల పెద్దలు అందరూ కలిసిమెలిసి పాల్గొన్నారు.
ఖానాపూర్ క్రైస్తవ యువకుల ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి కాండిల్స్ తో నివాళులు అర్పించి అర్పించిన క్రైస్తవులు
జహీరాబాద్. నేటి ధాత్రి:
ఆర్ ఇ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి అనుమాన స్పద మృతి పట్ల సంపూర్ణ విచారణ జరిపి దుండగులను శిక్షించాలని నిరసన తెలుపడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రాబోయే రోజుల్లో క్రైస్తవులపై,, పాస్టర్లపై దాడులు జరగకుండా తగు కఠినమైన చట్టాలని తేవాలని ఖానాపూర్ యువకుల పక్షాన కోరడం జరిగింది. ఈ కార్యక్రములో పెద్ద ఎత్తున ఖానాపూర్ క్రైస్తవ యువకులు పాల్గొని క్యాండీల్స్ తో నిరసన తెలపటం జరిగింది జరిగింది ఈ కార్యక్రమములో్ ఎక్స్ ఎంపీటీసీ అనిత సంపత్ కుమార్ గ్రామ పెద్దలు కులవస్తులు పాల్గొని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరడం జరిగింది.
బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన శ్రీలక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయం
ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి
మండలంలోని,వర్షకొండ గ్రామంలో కోలిచినవారికి కొంగు బంగారంగా నిలుస్తున్న స్వామివారు 150 సంవత్సరాల క్రిందటి పురాతన ఆలయం గా సంతానం లేని వారికి ఏడు శనివారాలు గిరి ప్రదక్షణ చేసిన వారికి సంతానం ప్రసాదించే పరమాత్మునిగా భక్తులు నమ్మకం పురాతనైనటువంటి కాలం నాటి ఆలయాలలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఆలయం రాతితో గుండుతో ఏర్పాటు చేయబడి ఆలయ గర్భాలయం శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామివారి మూలవిరాట్ స్వామివారి కుడి భాగాన గోదాదేవి అమ్మవారి రెండుమిటర్ల, స్వామివారి రాతి విగ్రహాలు పురాతన ఆలయం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆలయం ప్రతి సవత్సరం ఉగాది రోజున ఘనంగా జాతర నిర్వహిస్తారు గ్రామాభివృద్ధి కమిటీ గ్రామ ప్రజల సహాయ సహకారాలతో జరుగుతాయి. కొన్ని సంవత్సరాలుగా మధుర అన్వేష్ చార్యుల మరియు మధుర రాము చార్యుల మరియు లక్ష్మణ్ చార్యులు లచేతుల మిదుగా ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో హనుమంతుడు మరియు గరుత్మంతుడు. భక్తుల సహకారంతో నిర్మించారు మరియు భక్తుల సౌకర్యం కోసం సల్కం నాడ్పి రాములు ట్యాంకు ఏర్పాటు చేశారు మరియు మామిడి వంశస్థులు రథం చేపించి భగవంతునికి సమర్పించారు బ్రహ్మోత్సవాలకు వేలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో త్రాగునీరు అందజేస్తారు ఉత్సవాలను గ్రామాభివృద ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
ప్రభుత్వ పాఠశాలలో పేపర్ బ్యాగుల తయారీ రెండు రోజుల శిక్షణా కార్యక్రమం
చందుర్తి, నేటిధాత్రి:
పర్యావరణ పరిరక్షణ…ప్లాస్టిక్ వినియోగం నివారణలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, చందుర్తి మండలంలోని జోగాపూర్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం వ్యర్థ పేపర్లను వినియోగించి పేపర్ బ్యాగులు, పేపర్ ఫైల్ తయారుచేయడంలో విద్యార్థులకు ఉపాధ్యయుడు మేడికాల అంజయ్య రెండు రోజులు శిక్షణనిచ్చాడు. విద్యార్థులు పలు రకాల బ్యాగులు, వివిధ రకాల పత్రాలు బధ్రపరచుకోవడానికి పేపర్ ఫైల్లను తయారు చేసి ప్రదర్శించారు. తమ గ్రామంలో ప్లాస్టిక్ బదులుగా పేపర్ బ్యాగ్ లు , పేపర్ ఫైల్ వాడతామని చెప్పా రు. శిక్షణను అందించిన ఉపాద్యాయుడు అంజయ్య మాట్లాడుతూ త్వరగా మట్టిలో కలిసిపోయో పేపర్ బ్యాగ్ లు పర్యవరణానికి ఎంతో మేలు చేస్తాయని వీటి తయారికి ఎలాంటి ఖర్చు ఉండదు కావున విద్యార్థులకు అవగాహన కల్పిస్తే భావితరాలకు కలుష్య రహిత సమాజాన్ని, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించవచ్చన్నారు. ప్లాస్టిక్ వలన మన దేశంలో ప్రతి యోట లక్షలాది మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, ప్లాస్టిక్ వాడకం తగ్గించి, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా త్వరగా మట్టిలో కలిసి పోయో పేపర్ బ్యాగ్ లు,జూట్ , బట్ట సంచులను విరివిగా వాడాలని ఉపాధ్యాయుడు అంజయ్య పిలుపునిచ్చాడు. ఈ సందర్భంగా శిక్షణనను అందించిన ఉపాద్యాయుడు అంజయ్యను ప్రధానోపాద్యాయులతో పాటు పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాద్యాయులు శ్రీధర్ రాజు, ఉపాధ్యాయులు జావీద్, మహేశ్, శ్రీనివాస్ , పద్మ, నర్సయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.
మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న ఇఫ్తార్ విందులు: షాకిర్ అలీ
జహీరాబాద్. నేటి ధాత్రి:
పవిత్ర రంజాన్ మాసంలో జరుపుకునే ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని కోహీర్ మండల మాజీ ఎంపీపీ ఎండి షాకీర్ అలీ అన్నారు. కోహీర్ పట్టణంలోని అజిజియా మజీద్ ప్రాంగణంలో ప్రజాబంధు షాకీర్ అలీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో షాకీర్ అలీ మాట్లాడుతూ… పరమ పవిత్రమైన రంజాన్ మాసంలో అల్లా ద్వారా పవిత్రమైన దివ్య ఖురాన్ మానవాళికి అందిందని, ఈద్ ఉల్ ఫితర్ పండుగను పురస్కరించుకొని నిర్వహించే ఇఫ్తార్ మరియు సెహ్రీ విందు కార్యక్రమాలు మత సామరస్యానికి ప్రతికలుగా నిలుస్తూ ప్రజల మధ్య స్నేహభావాన్ని పెంపొందిస్తున్నాయన్నారు. సూర్యోదయానికి ముందు ఉదయం నిర్వహించే విందును సెహ్రీ అంటారని,సూర్యాస్తమయం తర్వాత సాయంత్రం నిర్వహించే విందును ఇఫ్తార్ అంటారని, రంజాన్ మాసంలో రోజాలో ఉన్నవారు సెహ్రీ మరియు ఇఫ్తార్ విందుల ధ్వారా ఉపవాస దీక్షలను విరమించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా రంజాన్ మాసంలో జకాత్ ద్వారా పేద ప్రజలకు దానధర్మాలు చేయడం సంప్రదాయంగా వస్తుందన్నారు. ఘనంగా జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో కోహీర్ మండల మాజీ ఎంపీపీ షౌకత్ అలీ, మన బిన్ ఫౌండేషన్ చైర్మన్ మొఖీమ్, కాంగ్రెస్ నాయకులు మహ్మద్ గని,సాజిద్ అలీ,అక్షయ్ జాడే, బిఆర్ఎస్ నాయకులు నాగరిగారి సంపత్ కుమార్,ఉమర్ అహ్మద్, వస్త్ర వ్యాపారులు రాచూరి చంద్రశేఖర్, రాచూరి కనకరత్నం,ముక్క శ్రీనివాస్, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
`జనం ఏ పార్టీని నమ్మొచ్చు! ఏ పార్టీని నమ్మకపోవచ్చు!!
`బీసీ నినాదంతో బలపడేదెవరు! బాగుపడేదెవరు!
`ఇప్పుటి దాక వున్న బీసీ కమీషన్లు ఏం సాధించాయి!
`బీసీ కార్పోరేషన్లు ఎంత మందిని ఉద్దరించాయి?
`బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు పార్టీలకు లాభమా!
`ప్రజలకు మేలు జరుగునా?
`బీసీలు కుర్చీలో కూర్చుంటే ఆ కులాలకు మేలు చేస్తారా?
`బీసీ రాజకీయ రిజర్వేషన్లు ఏ పార్టీకి లాభిస్తాయి?
`స్థానిక సంస్థల ఎన్నికలలో ఎవరికి మేలు!
`42శాతం అమలు చేసిన కాంగ్రెస్‌కు వరమౌతుందా?
`ప్రతిపక్షాలు గెలవటానికి కారణమౌతుందా?
`బీసీ బిల్లుతో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు గెల్చుకుంటుందా?
`పల్లె రాజకీయాలలో పార్టీల పాత్ర పని చేస్తుందా?
`ఇప్పటికిప్పుడు బీసీ నినాదం కాంగ్రెస్ కు మేలు చేస్తుందా?
`ప్రతిపక్షాలకు వరమౌతుందా?
`ఇంతకీ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లుకు ఆమోదం తెలుపుతుందా?
`లేకుంటే జనరల్ స్థానాలన్నీ బీసీలకు కేటాయిస్తారా?
`పల్లెల్లో పరిస్థితులు కాంగ్రెస్‌కు అనుకూలంగా వున్నాయా!
`పల్లెల్లో రైతులు సంతోషంగా వున్నారా?
`ప్రజల ఆకాంక్షలు కాంగ్రెస్ నెరవేర్చిందా?
`ఉద్యోగ కల్పనతో పల్లెల్లో ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?
`ప్రజా వ్యతిరేకత బీసీ బిల్లులో కొట్టుకుపోతుందా?
`బీసీ, ఓబీసీ రుణాలు స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పట్టం కడతాయా?
`తాజాగా ప్రభుత్వం యువతకిచ్చే రుణాలు ఓట్లు రాల్చుతాయా!
`కాంగ్రెస్ ప్రచారం చేసుకోవడంలో సఫలమౌతుందా!
`ప్రతిపక్షాలకే మేలు జరిగేలా వుంటుందా!
,హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణ రాజకీయాలలో బిసి నినాదం తుఫాను సృష్టించేలా వుందని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇటీవల జరిగిన కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో బిసి ఓటర్లు తమ ప్రభావాన్ని చూపారని తేలింది. అంతే కాకుండా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బిసి డిక్లరేషన్ ప్రకటించింది. అప్పటి నుంచి బిసి నినాదం ఊపందుకున్నది. ఇక్కడ రెండు విషయాలు చెప్పుకోవాలి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాన్ని ముందు మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో వున్నప్పుడు చిన్నారెడ్డి అద్యక్షతన తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటైంది. 42 మంది కాంగ్రెస్‌ఎమ్మెల్యేల సంతకాలతో తెలంగాణ వాదానికి మలి దశ ఊపిరి పోసింది. తర్వాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. కాకపోతే తెలంగాణ తీర్మాణం 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఎంతో దోహదంచేసింది. అదే సమయంలో బిఆర్‌ఎస్‌కు రాజకీయంగా కూడా పనికి వచ్చింది. తర్వాత పద్నాలుగు సంవత్సరాలకు తెలంగాణవచ్చింది. కాని కాంగ్రెస్‌కు మేలు జరగలేదు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలయ్యింది. కాని తెలంగాణ కల నెరవేర్చినట్లైంది. తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిందన్న పేరు చరిత్రలో నిలిచిపోయింది. అలాగే గతంలో ఎన్ని బిసి ఉద్యమాలు వచ్చినా రాజ్యాధికారం కోసం ఏనాడు వాణ వినపడలేదు. ఎంత సేపు ఉద్యోగాలలో రిజర్వేషన్లు, ప్రమోషన్లలో రిజర్వేషన్లపై పోరాటాలు సాగేవి. అంతే కాకుండా బిసి కార్పోరేషన్ ద్వారా బిసి యువతకు రుణాల కోసం పోరాటాలు జరిగేవి. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ బిసి డిక్లరేషన్ ప్రకటించిందో ఒక్కసారిగా బిసి సంఘాలలో కదలిక వచ్చింది. బిసి కుల సంఘాలలో చైతన్యం నిండిర ది. రాజకీయ పార్టీలన్నీ జై బిసి నినాదం అందుకున్నాయి. ఇక్కడ కూడా ఆ పుణ్యం కాంగ్రెస్‌కే దక్కుతుంది. కాని దాని ఫలితం ఎవరికి దక్కుతుందనేది మాత్రం ఇప్పటికిప్పుడు చెప్పలేకుండా వుంది. గత ఎమ్మెల్సీ ఎన్నికలలో బిసిలకు టికెట్లు ఇచ్చేందుకు పార్టీలు కూడా ముందుకొచ్చాయి. గతంలో ఈ వాతావరణం కనిపించలేదు. ఇప్పుడు జనరల్ సీట్లలో మొత్తానికి మొత్తం ఓసిలకు కట్టబెట్టేందుకు రాజకీయ పార్టీలు ఒకటికిపదిసార్లు ఆలోచించే పరిస్దితి వచ్చింది. ఇక తాజాగా మంత్రి వర్గ విస్తరణలో కూడా బిసిల ప్రాధాన్యం పెంచాలని చూస్తున్నారు. మరో వైపు బిజేపి బిసి నినాదాన్ని ఎంచుకున్నది. గత ఎన్నికల సమయంలోనే బిసి ముఖ్యమంత్రి నినాదం ప్రకటిస్తారని అనుకున్నారు. కాని కుదరలేదు. బిఆర్‌ఎస్ పార్టీ కూడా బిసి విధానాన్ని, నినాదాన్ని కూడా వినిపిస్తూ వుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బిసి విధానమే ఏకైక ఎజెండాగా రాజకీయాలకు ఎంచుకున్నది. బసిలకు రాజ్యాదికారం కోసం బిఆర్‌ఎస్ కూడా ముందుకు రావాల్సి వస్తోంది. కవిత మూలంగా బిఆర్‌ఎస్ కూడ బిసి నినాదం అందుకోవాల్సి వస్తోంది. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. కల్వకుంట్ల కవిత గత రెండు సంవత్సరాలకు పైగా బిసి నినాదాన్ని వినిపిస్తోంది. కాని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ తర్వాతే బిసిలలో మరింత చైతన్యం నిండిరది. ఎందుకంటే సామాజిక న్యాయం అన్నది కాంగ్రెస్‌లోనే సాద్యం. బిఆర్‌ఎస్‌లో అది సాధ్యం కాదు. పదేళ్ల అదికారంలో సాద్యం కాలేదు. కనీసం ఓ నలుగురు బిసి మంత్రులు లేరు. ఇక బిజేపి ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ బిసి అంటూ చెప్పుకుంటారు. కాని ఇప్పటి వరకు వారి బిసి విదానాన్ని ప్రకటించలేదు. అయినా బిసిలు బిజేపిని మిగతా పార్టీలకన్నా ఎక్కువ నమ్ముతున్నారన్నది ఇతర పార్టీలు గుర్తించాలి. పైగా ఇటీవల బిసి కృష్ణయ్యను పిలిచి మరీ రాజ్యసభ ఇచ్చారు. బిసిల విషయానికి వస్తే సామాజిక న్యాయం జరగాలంటే సహజంగా జాతీయపార్టీలతోనే సాద్యమౌతుంది. అయితే బిఆర్‌ఎస్ పార్టీ కూడా జాతీయ పార్టీగా అవతరించాలని అనుకుంటోంది. భవిష్యత్తులో బిసిల రాజ్యాధికారం విషయంలో బిఆర్‌ఎస్ ఒక అడుగు ముందుకు వేస్తుందా? లేదా? అన్నది తెలుస్తుంది. కాని బిసిలకు తగిన న్యాయం చేయడంలో జాతీయ పార్టీలకే సాధ్యమౌతుందని చెప్పాలి. కొన్ని నిజాలు కటువుగా వుంటాయి. వాటిని జీర్ణించుకోవడం కొన్ని పార్టీలకు కష్టంగానే వుంటుంది. ఒక వేళ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ అదికారంలో వుంటే బిసి నినాదం వుండేదా? బిసి నినాదం చేపట్టేవారుండేవారా? వున్నా బిఆర్‌ఎస్ పట్టించుకునేదా? కేసిఆర్ బిసిలకు సపోర్టు చేసేవారా? బిసి బిల్లు తెచ్చేందుకు అంగీకరించేవారా? అంటే అసలే వుండేది కాదు. బిసి అనే ఉద్యమమే పురుడు పోసుకునేది కాదు. ఇంత త్వరగా బిసి బిల్లు వచ్చేదే కాదు. కాని కాంగ్రెస్ వల్లనే సాధ్యమైంది. కాని ఆ క్రెడిట్ కాంగ్రెస్‌కుఎంత వరకు దక్కుతుందనేది కూడా ప్రశ్నార్ధకమే. ఇప్పడు బసి బిల్లుకు మేం సంపూర్ణ మద్దతు తెలిపామంటూ బిఆర్‌ఎస్ చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. బిజేపి కూడా బిసి కార్డు వినియోగించుకునేందుకు ఏ మాత్రం వెనుకాడదు. ఇలాంటి పరిస్తితుల్లో కాంగ్రెస్‌కు ఏ మేర రాజకీయంగా ఉపయోగపడుతుందనేది ఎన్నికలు జరిగితే గాని తెలియకపోవచ్చు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అసవరం వుంది. లేకుంటే రాజకీయంగా ప్రయోజనం కన్నా, నష్టమే ఎక్కువ జరుగుతుంది. దశాబ్దాల బిసి పోరాటం ఇప్పుడు నిజమైంది. ఎంతో కొంత ఫలితాలు మోసుకొస్తుంది. బిసిలకు రాజకీయంగాఎంతో ఉపకరిస్తుంది. ఓసిల ఆధిపత్యం పల్లెల్లోనే కాదు, పట్టణాల్లో కూడ చాల వరకు తగ్గుతుంది. ఇంత ముందుకు జనరల్ అంటే ఓసిలే అన్నట్లుగా భావిస్తూ వచ్చేవారు. అందువల్ల బిసిలు పెద్దగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వచ్చే వారు. ఎవరైనా ముందుకొచ్చినా వారికి అవకాశాలు అంతగా దక్కేవి కాదు. కాని ఇప్పుడు అటు జనరల్‌లో అయినా, ఇటు బిసి రిజర్వేషన్లలో అయినా బిసిలకు తప్పని పరిస్ధితులత్లో టికెట్లు ఇవాల్సిన అవసరం ఏర్పడుతుంది. రాజకీయ పార్టీలు బిసి నాయకులకు జై కొట్టాల్సి వస్తుంది. ఇంత వరకు బాగానే వుంది. కాని ఇప్పటికిప్పుడు తెలంగాణలో రాజకీయ పరిస్ధితులు ఎలా వున్నాయన్నది కూడా ఎంతో ముఖ్యం. ఇప్పటికిప్పుడు పంచాయితీ ఎన్నికలు నిర్వహించడం ఏ మాత్రం మంచిది కాదు. పల్లెల్లో ఎవరు ఔనన్నా, ఎంత కాదన్నా కాంగ్రెస్‌కు అంత అనుకూలమైన పరిస్ధితులు లేవు. ఎంత గొప్పగా చెప్పుకున్నా రైతుల్లో కొంత నిస్తేజం ఆవహించి వుంది. పల్లెల్లో సాగు నీటి వసతి తగ్గింది. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ కూడా అంగీకరించని పరిస్ధితి ఎదురౌతోంది. ఎన్నికల హామీల అమలుపై ప్రజల్లో అనేక సందేహాలున్నాయి. రైతు బంధు విషయంలో కాంగ్రెస్ మాటలకన్నా, బిఆర్‌ఎస్ మాటలే ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. రైతు బంధుపై అపోహలను ప్రజలకు వివరించే ప్రయత్నాలు కాంగ్రెస్‌పార్టీ నాయకులు, మంత్రులే చేయలేకపోతున్నారు. ఏక కాలంలో రైతు రుణమాఫీ జరిగిందన్న వాస్తవాలు కళ్లముందే వున్నా, అవి అందరికీ అందలేదన్న అసంతృప్తి కూడా వుంది. ఇక ఇ ందిరమ్మ ఇండ్ల విషయానికి వస్తే ఎంత వరకు కాంగ్రెస్ సక్సెస్ అవుతుందన్నదానిలో అంచనాలు లేవు. మరో వైపు కళ్యాణ లక్ష్మి వంటి పధకాలు అమలు జరుగుతున్నా, తులం బంగారం విషయం ప్రజల్లో అసంతృప్తి వుంది. ఇక నాలుగు వేల పింఛన్లపై అందుకుంటున్న వారిలో కూడా ఎప్పుడెప్పుడా అన్న ప్రశ్నలే నెలకొని వున్నాయి. ఇక రేషన్ కార్డులు ఇప్పటికిప్పుడు ఎంత మందికి అందుతాయన్నదానిపై పూర్తి క్లారిటీ లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినా సరే, అది ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టినట్లు కనిపించడం లేదు. ఇలా ఎన్నికల హమీల అమలుపై ప్రజల్లో అసహనం వుంది. ముఖ్యంగా రైతాంగానికి ఎంతో కొంత అసంతృప్తి వుంది. పదేళ్ల కాలంలో చెరవులు నిండుకుండుల్లా కాలంతో సంబంధం లేకుండా నీళ్లుండేవి. అవి కాంగ్రెస్ నేతలు కూడా అంగీకరించాల్సిన పరిసి ్దతి. చెరువులను ఎప్పటికిప్పుడు నింపే ప్రయత్నం చేస్తే తెలంగాణలో భూగర్భ జలాలు అడుగంటేవి కాదు. రైతులు కొత్తగా బోర్లు వేసుకునే పరిస్దితి వచ్చేది కాదు. ఇంకా వేసవి ముదరలేదు. పంటలు చేతికొచ్చే సమయం వరకు పంటల పరిస్దితి ఎలా వుంటుందో ఎవరూ చెప్పలేని పరి స్ధితి. గత పదేళ్ల కాలంలో అసెంబ్లీకి ఎండిన వరి కర్రలు కాంగ్రెస్ ఎప్పుడూ పట్టుకురాలేదు. కరంటు లేదని కందిళ్లు తెచ్చే అవసరం రాలేదు. ఇప్పుడు అవకాశం దొరికితే చాలు బిఆర్‌ఎస్ ఈ సమస్యలను ముందు పెడుతోంది. వానా కాలంలోనే చెరువులు నింపితే ఈ పరిస్ధితి వచ్చేది కాదు. బిఆర్‌ఎస్ మాట్లాడేందుకు అవకాశముండేదే కాదు. గత పంట కాలంలో రికార్డు స్ధాయి పంటలు పండినా, ఇప్పుడు ఒక్క ఎకరా ఎండినా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది.. అలాంటి సమయంలో బిసి బిల్లు తెచ్చిన సంతోషం నాయకుల్లో కనిపించినా, ఓట్లుగా మల్చుకోవడంతో కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు కృషి చేస్తుందో చూడాలి. లేకుంటే బిసి బిసి బిల్లు పేరుతో పంచాయతీ గెలుపు బిఆర్‌ఎస్ చేతుల్లో పెడుతుందో చూడాలి. అంతే కాకండా ఇటీవల బిసి యువతకు సుమారు రూ.6వేల కోట్ల రూపాయలలో కొన్ని లక్షల మందికి రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. దరఖాస్తులు కూడా ఆహ్వానిస్తోంది. బిసిల నినాదం ఎంచుకొని అమలు దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్‌కు ఏ మేరకు సహకరిస్తారన్నది కూడా చూడాలి. మరో వైపు ఉద్యోగ కల్పనలో బిఆర్‌ఎస్ కన్నా ఒక అడుగు ముందుకు వేసి, ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఆ ప్రభావం కూడా స్ధానిక సంస్దల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కలిసి వస్తే మాత్రం తెలంగాణలో ఇక కాంగ్రెస్‌కు ఎదురుదండదు. తిరుగుండదు. చూద్దాం…బిసిలు ఎటు వైపు నిలుస్తారో..ఎటు వైపు నడుస్తారో…
సినీనటుడు విజయ్ కొత్త పార్టీతో ద్రవిడ పార్టీలకు సరికొత్త సవాలు
జయలలిత భజన ఏఐడీఎంకేకు ఎంతోకాలం లాభించకపోవచ్చు
ఛరిష్మా నాయకుడు లేక కునారిల్లుతున్న పార్టీ
స్టాలిన్ తర్వాత డీఎంకే పరిస్థితీ ఇంతే
క్రమంగా ప్రజల్లో పట్టు సాధిస్తున్న సనాతనధర్మ వాదం
బీజేపీతో మైత్రి తప్ప ఏఐడీఎంకేకు మరో మార్గంలేదు
ఎన్నికలకు ఏడాదిముందునుంచే పదునెక్కుతున్న వ్యూహాలు
హైదరాబాద్,నేటిధాత్రి:
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఒకప్పుడు కలిసుండి తర్వాత ఎడమొ హం పెడమొహంగా మారిన పార్టీలు ఎన్నికలు సమీపంలోకి వచ్చేసరికి, జ్ఞానోదయమై మళ్లీ ‘అవసరం’రీత్యా తిరిగి సన్నిహితం కావడం రాజకీయాల్లో అత్యంత సహజ పరిణామం. ఇక్కడ అధికారమే అవసరం కనుక విభేదిస్తే మునిగిపోతామన్న సత్యం రాజకీయ నాయకులను, శాశ్వత శత్రువులుగా కొనసాగనివ్వదు. ప్రస్తుతం తమిళనాడులో ఇదే జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చి లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఇప్పటినుంచే రాజకీయంగా హాట్‌హాట్ గా వున్న రాష్ట్రంలో పరిణామాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయనడానికి మంగళవారం ఏఐడీ ఎంకే నాయకుడు పళనిస్వామి, కేంద్ర హోమంత్రి అమిత్ షాను ఢల్లీిలో కలవడం ఒక ఉదా హరణ. నిజానికి 2016లో జయలలిత మరణం తర్వాత ఏఐడీఎంకే, భారతీయ జనతాపార్టీతో జట్టు కట్టింది. అయితే ఈ రెండు పార్టీలు కలిసి పనిచేసినా 2019 లోక్‌సభ ఎన్నికలు, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అప్రతిహత విజయం సాధించిన తర్వాత ఈ పొత్తు అచ్చిరాలేదన్న ఉద్దేశంతో 2023లో పళనిస్వామి బీజేపీకి రాంరాం చెప్పారు. అయినప్పటికీ అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పలేదు. అయితే పొత్తు లేకపోవడంతో, బీజేపీ ఫైర్‌బ్రాండ్ అధ్య క్షుడుగా తనను తాను నిరూపించుకున్న మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అన్నామలై, ఎన్నికల ప్రచారంలో ద్రవిడ పార్టీలను తన విమర్శల వాగ్ధాటితో చీల్చి చెండాడారు. ఈ ఎన్నికల్లో ఏఐడీఎం కే సోదిలో లేకుండా పోవడానికి, అన్నామలై అప్రతిహత విమర్శల దాడులే కారణమని తమిళ నాడు రాజకీయ పండితులు మాత్రమే కాదు, అన్నాడీఎంకేలోని తలపండిన నాయకులుకూడా అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అన్నామలై అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితను కూడా విమర్శించకుండా వదిలిపెట్టలేదు. జయలలిత భజనను నమ్ముకున్న ఏఐడీఎంకే నాయకులకు అన్నామలై వ్యవహారశైలి నచ్చకపోవడం కూడా పొత్తునుంచి విరమించుకోవడానికి ఒక కారణంగా చెబుతారు. పొత్తునుంచి బయటకు వచ్చినా ఏఐడీఎంకే గత లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయింది. బీజేపీకి రాష్ట్రంలో బలం లేదు కనుక పెరిగే ఓట్లశాతం పరంగా లాభం తప్ప, సీట్లు సాధించే స్థాయికి ఎదగలేదు. ఇక్కడ ఏఐడీఎంకేలో ఛరిష్మా నాయకుడు లేకుండా, ఇంకా జయలలిత భజనతో సీట్లు సాధించలేరన్నది గత ఎన్నికలు స్పష్టం చేశాయి.
తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త మార్పు సినీ స్టార్ విజయ్ రూపంలో రాబోతున్నది. మరో సినిమానటుడు కమల్‌హసన్ ప్రభావం తమిళ రాజకీయాలపై లేదన్న సంగతి తేలిపోయింది. మరి విజయ్ ‘తమిళ వెట్రి కజగం’ (టీవీకే) అనే కొత్త పార్టీని పెట్టి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. తమిళనాడులో ఆయనకు గొప్ప పాలోయింగ్ వున్నదన్న సంగతి అందరికీ తెలిసినప్పటికీ, ఈ ‘ఛరిష్మా’ ఎంతవరకు ‘ఓటు బ్యాంకు’ను సృష్టిస్తుందనేది ఇప్పుడే చెప్పడం కష్టం. కాకపోతే ప్రస్తుతం ప్రధానంగా తలపడే రెండు ద్రవిడపార్టీల అవకాశాలను విజయ్ దెబ్బకొట్టే అవకాశాలే ఎక్కువ. గత ఎన్నికల పోరాటాల్లో ఘోరంగా ఓటమిపాలై తిరిగి సత్తువ కూడగట్టుకో లేని స్థితిలో ఉన్న ఏఐడిఎంకేపైనే విజయ్ ప్రభావం పడకూడదనేం లేదు. ఆయన అధికారంలోకి వస్తారా, రారా అన్నది కాదు ప్రశ్న. ఆయన చీల్చే ఓట్లు ఎవరి కొంప ముంచుతాయన్నది అసలు పాయింటు. ఈ లెక్కలు వేసుకున్న అన్నాడీఎంకే నాయకులు, తాము ముందుగా మేల్కనక పోతే పార్టీ అడ్రస్‌లేకుండా పోయే ప్రమాదం ఉన్నదని గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యమే పళనిస్వామి ఢల్లీిపయనం, అమిత్‌షాతో ములాఖాత్ జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. నిజం చెప్పాలంటే ఏఐడీఎంకేకు ప్రస్తుతానికి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఎందుకంటే ప్రస్తుతం అన్నామలై స్టార్ లీడర్‌గా ఎదుగుతున్నారు. ఆయన ప్రసం గాల ప్రభావం ప్రజలపై చాలా అధికంగా వుంటోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఆయన నేతృత్వం లో బీజేపీ రాబోయే ఎన్నికల్లో మరింత పుంజుకొని తమిళ యవనికపై తన గుర్తింపును ప్రస్ఫు టంగా చూపగలిగే అవకాశాలే ఎక్కువ. ఇప్పటికే క్రమంగా ఓట్ల శాతం పెంచుకుంటూ వస్తున్న బీజేపీ రాబోయే ఎన్నికల నాటికి సీట్లు సాధించే స్థాయికి ఎదిగితే ఇక ద్రవిడవాదానికి ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం కూడా అన్నాడీఎంకే నేతల్లో వుంది.
అధికార డీఎంకే కూడా ద్రవిడవాద పార్టీయే కనుక ప్రస్తుతం తనకున్న అధికార హంగు, ఆర్భా టాలతో బీజేపీని యధాశక్తి కట్టడిచేయడానికి అన్నిరకాలుగా ప్రయత్నాలు సాగిస్తోంది. భాషా వివాదం, డీలిమిటేషన్ సమస్యలు ఇందులో భాగమే. అయితే డీఎంకే ఇక్కడ భాష పేరుతో పెంచు తున్న వివాదం దానికే బూమరాంగ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో, ఉద్యోగావకాశాలు కేవలం తమిళనాడుకు మాత్రమే కాదు, భారతదేశం యావత్తు విస్తరించాయి. హిందీ, ఇంగ్లీషు భాషల్లో ప్రావీణ్యం వుంటేనే ఉద్యోగార్థులు రాణిస్తార న్న సత్యం ద్రవిడ పార్టీలకు తెలియంది కాదు. కాకపోతే భావోద్వేగ రాజకీయాలను నెరపడం ద్వారా తమ స్థానాన్ని పదిలం చేసుకోవడం వాటి లక్ష్యం తప్ప, నిజమైన భాషాభిమానం కనిపిం చదు. నిజమైన భాషాభిమాని అన్ని భాషలను సమానంగా ప్రేమిస్తాడు. తన మనుగడకు అవసర మైన ప్రతి భాషను నేర్చుకొని, జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి యత్నిస్తాడు. ప్రస్తుతం తమిళనాడులో పాతతరం వారికి భాషా దురభిమానం ఉపయోగపడినా, నేటి తరానికి ఈ వా దం ఎంతమాత్రం ఉపయోగకరమైంది కాదనేది క్షేత్రస్థాయిలో వెల్లడవుతున్న నిష్టుర సత్యం.
దేశవ్యాప్తంగా విస్తరించాలన్న లక్ష్యంతో వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్న బీజేపీ, తమిళనాడులో ద్రవిడవాదాన్ని ఎదుర్కోవడానికి సనాతనధర్మ వాదం అనే అస్త్రాన్ని ఉపయోగిస్తోంది. ఇది ఫలితాలనిస్తోంది కూడా. ఏఐడీఎంకేకు ఇది తెలియంది కాదు. ఏ వాదమైనా కొంతకాలం వరకే ప్రభావం చూపుతుందనేది చరిత్ర చెబుతున్న సత్యం. కొత్త వాదాల హోరులో పాత వాదాలు కొట్టుకుపోవడం సహజం. ఈ నేపథ్యంలో ఏఐడీఎంకే తన స్థానాన్ని కాపాడుకోవడానికి, బీజేపీ అధికాయకత్వంతో బేరసారాలు అడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే, దీన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనసాగించేందుకు ఒక ‘స్టీరింగ్ కమిటీని’ ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే నాయకులు కోరుతున్నట్టు తెలుస్తోంది. అంటే స్టీరిం గ్ కమిటీ పేరుతో అన్నామలే స్వేచ్ఛను కట్టడి చేయాలన్న వ్యూహాన్ని అనుసరిస్తున్నదని చెబుతు న్నారు.
బుధవారం ఎడప్పాడి కె.పళనిస్వామి ఢల్లీిలో విలేకర్లతో మాట్లాడుతూ కేవలం రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరడానికి మాత్రమే తాను అమిత్ షాను కలిసానని యధాలాపం గా చెప్పినప్పటికీ, ఏ రాజకీయ ఉద్దేశము లేకుండా ఇటువంటి సమావేశాలు జరగవన్నది అందరికీ తెలిసిందే. న్యూఢల్లీిలో కొత్తగా ఏఐడీఎంకె పార్టీ ఆఫీసు ప్రారంభం పేరుతో వచ్చిన పళని స్వామి అమిత్ షాతో 45 నిముషాలు భేటీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న భాషావివా దం, టీఏఎస్‌ఎంఏసీపై ఈడీ దాడులు, కోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడం వంటి అంశాలను చర్చించి, ముల్లయార్ పెరియార్ డ్యామ్‌ను పటిష్టం చేయడం, కావేరి, గోదావరి న దుల అనుసంధానంతో పాటు రాష్ట్ర సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం జోక్యాన్ని కోరినట్టు ఆయన చెబుతున్నప్పటికీ అంతర్గత వ్యూహం మాత్రం వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినది మాత్రమే అయివుంటుందన్నది తమిళనాడు రాజకీయాలను పరిశీలిస్తున్న వారికి ఇట్టే అర్థమవుతుంది. ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై విలేకర్లతో మాట్లాడుతూ అమిత్ సా`పళనిస్వామిల మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి మరింత విస్త రించే అవకాశాలున్నాయని చెప్పడం గమనార్హం.
*ఐదు మండలాల గిరిజనులకు సర్వసభ్య సమావేశానికి హక్కు లేదా.*
*సమస్యల పరిష్కారానికి వేదిక సర్వసభ్య సమావేశనికి*
*గిరిజనులు దూరం ఎందుకు.*
*మహాదేపూర్ జిసిసి లో ఏం జరుగుతుంది. గుట్టు చప్పుడు కాకుండా తీర్మానాలు ఎందుకు.?*
*నేటి ధాత్రి ,డిఎం ను వివరణ కొడితే పొంతనలేని సమాధానాలు. పిఓ దృష్టికి తీసుకువెళ్లిన “నేటి ధాత్రి.*
*మహదేవపూర్ -నేటి ధాత్రి:*
గిరిజన సహకార సంస్థ జిసిసి మహదేవ్పూర్ లో ఏం జరుగుతుంది. గిరిజనుల అభివృద్ధి కొరకు ఏర్పాటు చేసిన జిసిసి, గిరిజనులను అణగదొక్కే ప్రయత్నం చేస్తుందా, గిరిజనుల హక్కులను కాలరాసే కుట్ర జిసిసి నుండి అధికారులు చేస్తున్నారా, అనే విషయానికొస్తే వాస్తవమే అని ప్రత్యక్షంగా కనబడుతుంది. గురువారం రోజు జిసిసి సర్వసభ్య సమావేశం గుట్టుచప్పుడు కాకుండా చేయడం, గిరిజనులను అనగా దోక్కడమే లక్ష్యంగా అని చెప్పడంలో సందేహం లేదు. సర్వసభ్య సమావేశాల పేరుతో గిరిజనులకు తెలవకుండా జిసిసి అధికారులు గుడుపుటానిలు చేస్తున్నారనేది చెప్పడానికిబ్ గురువారం జరిగిన సర్వసభ్య సమావేశమే సాక్ష్యం.
గిరిజనులకు తెలవకుండానే జిసిసి సర్వసభ్య సమావేశం
5 మండలాలకు సంబంధించిన మహాదేవపూర్ గిరిజన సహకార సంస్థ, గిరిజనుల అభివృద్ధి అటవీ ఉత్పత్తుల కొనుగోలు ధర నిర్ణయం గిరిజనుల సమస్యలను పరిష్కరించుకొనుటకు గిరిజనుల సమక్షంలో, సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ అధికారులు అలా కాకుండా ,ఐదు మండలాలకు సంబంధించిన గిరిజనులకు ఎలాంటి సమాచారం లేకుండా గురువారం రోజు గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించుకోవడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. గిరిజనుల సమక్షంలో చేపట్టాల్సిన తీర్మానాలు కేవలం అధికారులు డైరెక్టర్ల సమక్షంలో నిర్ణయించుకోవడం వెనుక కారణాలు ఏమిటో తెలియ రావడం లేదు.
మహాదేపూర్ జిసిసి లో ఏం జరుగుతుంది. గుట్టు చప్పుడు కాకుండా తీర్మానాలు ఎందుకు.?
దీనికి సంబంధించి ప్రస్తుతం మహాదేవపూర్ మండల కేంద్రంలో జిసిసి గుట్టుచప్పుడు కాకుండా సర్వసభ్య సమావేశం నిర్వహించుకోవడంపై, జీసీసీలో గుడుపుటాని జరుగుతుందన్న వాదనలు ప్రజల్లో బలంగా వినబడుతున్నాయి, జిసిసి సర్వసభ్య సమావేశం నిర్వహణపై నీటి ధాత్రి డిఎం వివరణ కోరగా, నేను ఆహ్వానం మేరకు వచ్చానని స్థానిక మేనేజర్కు వివరాలు కోరాలని, కొత్త డైరెక్టర్లకు సన్మానం చేయడం జరిగిందని, గుంతల లేని సమాధానం చెబుతూ ఫోన్ కట్ చేయడం జరిగింది. జిసిసి లో గుర్తుచేప్పుడు కాకుండా నిర్వహించిన సర్వసభ్య సమావేశం బియ్యం పొంతన లేని సమాధానాల వ్యవహారం నీటి ధాత్రి పిఓ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది, గిరిజనుల సమక్షంలో నిర్వహించాల్సిన సమావేశాన్ని జిసిసి అధికారులు గిరిజనులు లేకుండా ఇలా నిర్వహించడం జరిగిందో విచారణ జరిపి ఇలాంటి చర్యలు తీసుకుంటారు వేచి చూడాల్సిందే.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.