పాపం.. పవన్‌!

`సినిమా నిలబెట్టుకోవడానికి అష్ట కష్టాలు!

`ఎవర్రా మనల్ని ఆపేది అన్నాడు?

`సినిమా నిలబెట్టుకోవడం కోసం ఆపసోపాలు పడుతున్నారు.

`సినిమా ఫిక్షన్‌ అని చెప్పుకొచ్చారు!

`చరిత్ర సత్యాలను ఈ తరానికి తెలియాలంటున్నారు.

`కమ్యూనిస్టులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

`సినిమా సన్నివేశాలలో దొర్లిన తప్పులను గుర్తు చేస్తున్నారు.

`పవన్‌ ఇమేజ్‌ కాపాడుకోవాల్సిన అవసరం వుంది?

`మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆడియో లీక్‌!

`సినిమా నిలబెట్టాలని జనసైనికులకు సూచన.

`ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా వారం పాటు ఆడేలా చొరవ తీసుకోవాలి.

`కనీసం అన్నం తినడానికి కూడా సమయం లేకుండా పవన్‌ కష్టపడుతున్నారు.

`సినిమాలు చేసి పార్టీని నిలబెట్టారు.

`ఇప్పుడు సినిమాను నిలబెట్టే బాధ్యత మనం తీసుకోవాలి.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

     సినిమా ప్రేక్షలకు నచ్చే విధంగా వుంటే ఎవరూ ఏమీ చేయలేరు. ఎవరూ ఆపలేరు ..ఎవరు అడ్డుకున్నా సినిమా ఆగదు. చిన్న చిన్న సినిమాలు బాగుంటే తర్వాత రోజుల్లో బ్లాక్‌ బస్టర్లు అవుతున్న రోజులు. సినిమా కాస్త బాగుందంటే చాలు జనాలు విపరీతంగా ఎగబడుతున్నారు. వారంలో రోజుల్లో సినిమాలు కోట్లు కలెక్షన్లు వసూలు చేస్తున్నాయి. అలాంటిది పవన్‌ కళ్యాన్‌ సినిమా ఎందుకు డిజాస్టర్‌గా మారుతోంది. గతంలో కూడా పవన్‌ సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్లేమీ కాదు. కాని ఆయన క్రేజ్‌తో బాగానే సినిమాలు ఆడేవి. అయితే ఆయనను సినీ హారో కాన్న, పవన్‌ వ్యక్తిత్వం గురించి సినిమాకు చెందిన వాళ్లు గొప్పగా చెప్పేవారు. అది జనాల్లోకి బాగా చేరింది. అప్పటి నుంచి పవన్‌ అంటే ప్రజలకు ఒక రకమైన అభిమానం పెరిగింది. ప్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా వ విపరీతంగా పెరిగింది. పైగా సినిమాలో ఆయన హవభావాలు కూడా జనానికి బాగా నచ్చేవి. పవన్‌ తెరమీద చేసే కొన్ని సిన్ని వేషాలు ప్రజలకు చాలా దగ్గరగా వుండేవి. అవే ఆయనను పవర్‌స్టార్‌ను చేశాయి. గత వకీల్‌ సాబ్‌ వరకు కూడా ఆయన సినిమాలు మినిమమ్‌ గ్యారెంటే అనేవారు. కాని ఉన్న ఫలంగా హరిహర వీర మల్లు సినిమాను కొనేందుకు ఎవరూ ముందుకు రావడంలేదన్న వార్తలతోనే అసలు నిజం బైటపడిపోయింది. ఆ సినిమా ఆడడం కష్టమని తేలిపోయింది. అయినా కావాలనే కొందరు పని గట్టుకొని హరిహర వీరమల్లు మీద విష ప్రచారం చేస్తున్నారని కూడా అనుకున్నారు. కాని సినిమా విడుదలైన తర్వాత అదంతా నిజమే అంటున్నారు. కాకపోతే ఈశ్వరుడు నోరుంది కదా? అని ఏది పడితే అది వాగొద్దు! అని స్వయంగా పవన్‌ కళ్యాణ్‌ ఓ సినిమాలో చెప్పిన డైలాగ్‌. అదెందుకో అటు తిరిగి, ఇటు తిరిగి ఆయన నిజ జీవితంలో ఆపాదించబడుతుందేమో? అని ఆయన ఊహించి వుండకపోవచ్చు. కాని ఇప్పుడు అదే నిజమౌతోంది. ఈ మధ్య మనల్నెవడురా? ఆపేది అని ఓ మాటన్నారు. అది ఏ సందర్భంలో అన్నారో గాని, ఇప్పుడు సినిమా కష్టాలను స్వయంగా చూస్తున్నారు. పవన్‌ కళ్యాన్‌ సినీ కేరిర్‌లో డిజాస్టర్లు లేక కాదు. గతంలో అనేకం వున్నాయి. ఆయన సినిమాల్లో హిట్లకన్నా, ప్లాఫులే ఎక్కువగా వున్నాయి. కాని అప్పటి పరిస్దితి వేరు. ఇప్పటి పరిస్దితి వేరు. అప్పుడు కేవలం ఆయన ఒక సినిమా హీరో మాత్రమే. ఇప్పుడు రాజకీయ నాయకుడు. నాయకుడిగా ఆయన గత పన్నెండేళ్లుగా ప్రజల్లో వుంటున్నారు. కాని ఇప్పుడు మాత్రమే ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఆయన తెలుగుదేశం పార్టీతో కలిసి రాజకీయాల్లో సాగినా ప్రభుత్వంలో చేరలేదు. ఎమ్మెల్యేగా రెండు చోట్ల పోటీ చేసినా గెలవలేదు. అయినా అభిమానుల్లో ఆయన క్రేజ్‌ తగ్గలేదు. ఎప్పుడైతే ఆయన డిప్యూటీ సిఎం. అయ్యారో అప్పటి నుంచి ఆయనపై వున్న క్రేజ్‌ తగ్గుతూ వస్తోందని చెప్పడంలో సందేహం లేదు. పైగా సినిమా నిర్మాణానికి సమయం కేటాయించలేనంత పని ఒత్తిడిలో వున్నారు. సినిమాకు సమయం కేటాయించే అవకాశం దక్కలేదు. ఈ మధ్యలో మహారాష్ట్ర, డిల్లీ, హర్యానా రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలోనూ ఆయన పాల్గొంటూ వచ్చారు. అలా రాజకీయాలు, ఇటు పాలనకు సమయం కేటాయిస్తూ, సినిమాకు సమయం సరిపోలేదు. ఇక సినిమా ఏదో రకంగా చుట్టేయాలనుకున్నట్లున్నారు. పూర్తి చేశారు. నిజానికి ఈ సినిమా ఆది నుంచి పురిటి నొప్పులే భరిస్తూ వస్తోంది. కాకపోతే ఆఖరుకు ఆపరేషన్‌ సక్సెస్‌ అయ్యిందికాని పేషెండ్‌ డెడ్‌ అన్నది రుజువైంది. సినిమా విడులైతే సరిపోదు. సినిమా కూడా ప్రేక్షకులను ఒప్పించాలి. మెప్పించాలి. అంతే కాని రెండున్న గంటలు ప్రేక్షకులను రంజింప జేయకుండా కూర్చోబెడతా అనుకుంటే కుదరదు. హరిహర వీరమల్లు అనే సినిమా ఫిక్షన్‌ అన్నారు. అంటే కల్పిత కథ అని చెప్పుకొచ్చారు. ఈ మధ్య కూడా అదే ప్రచారం సాగించారు. కాని సినిమాలో పాత్రలు, సన్నివేశాల వల్ల అది ఫిక్షన్‌ కాదని తేలిపోయింది. ఇందులో కూడా రాజకీయం వుందన్న సంగతి అర్దమైంది. ప్రజలు రెండు గంటలపాటు వినోదం కోసం వస్తే, ఏదో చూపిస్తే చూస్తారా? అందులోనూ సినీ నిర్మాణలోపాలు కళ్లముందు కదలాడుతుంటే అసలే భరించరు. ఇక్కడా అదే జరిగింది. ఓవైపు చారిత్రక సినిమాలో చరిత్ర సత్యాలు చెబితే ఎవరు చూస్తారు. ఎక్కడి హరిహర మల్లుడు. ఎక్కడి గోల్కొంగ నవాబులు.ఎక్కడి డిల్లీ సుల్తానులు. 13శతాబ్ధానికి చెందిన హరి హర వీరమల్లు, 16 శతాబ్ధంలో కనిపించడమేమిటి? అయినా నిర్మాణ పరంగా మాయ చేసినా ప్రజలకు నచ్చేదేమో? కాని ఎక్కడా పవన్‌ కల్యాన్‌ సినిమాలాగా లేదని అభిమానులు కూడా బాధ పడుతున్నారు. అమ్మాయిని గుర్రం మీద కూర్చోబెట్టే స్టామినా వున్న హరో చిన్న తువ్వాలు తాకితే కింద పడే సన్నివేశాన్ని అభిమానులు జీర్ణించుకుంటారా? అయినా అభిమానులకే నచ్చని సినిమాను ఎంత ప్రమోషన్‌ వృదా అని తెలిసినా పాపం కష్టపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సినిమాను నిలబెట్టడం కోసం ఆపసోపాలు పవన్‌ కల్యాన్‌ ఆపసోపాలు పడుతున్నాడు. ప్రమోషన్‌లో మునిగి తేలుతున్నారు. గతంలో పవన్‌ కల్యాణ్‌ తన సినిమాలకు ప్రమోషన్‌ చేసిన సందర్బాలు చాలా తక్కువ. కాని ఈ సినిమాకు పడుతున్న కష్టాలు మరే సినిమాకు పడలేదు. అయితే ఓ వైపు తనకు ఎలాంటి ప్రాబ్లమ్‌ లేదంటూనే తన ప్రస్టేషన్‌ను పదే పదే చూపిస్తున్నారు. సినిమా పోయిందని బాధ పడాల్సిన అవసరం లేదంటూనే ఉప ముఖ్యమంత్రి స్ధానంలో వుండి జన సైనికులను రెచ్చగొడుతున్నారు. ఇది కూడా వాంచనీయంకాదు. ఇదిలా వుంటే ఆ పార్టీకి చెందిన మరో మంత్రి ఆడియో ఒకటి బైటకు వచ్చింది. జన సైనికులను ఆయన దిశానిర్ధేశం చేస్తున్న ఆడియో వైరల్‌ అవుతుంది. అయితే అది ఆ నాయకుడిదో కాదో తెలియదు. కాని ఆయనదే అంటూ మాత్రం పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ మంత్రితోపాటు ఎమ్మెల్యేలు కూడా సినిమా ప్రమోషన్‌ సాగిస్తున్నారు. జన సైనికులకు సినిమా నిలబెట్టాలని కోరుతున్నారు. ఎట్టి పరిసి ్ధతుల్లో సినిమా కనీసం వారం రోజుల పాటు ఆడేలా చూడాలని సూచిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌మీద ఆ మంత్రి విపరీతమైన సానుభూతి చూపిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ కనీసం అన్నం తినడానికి కూడా సమయం సరిపోవడం లేదని జన సైనికులకు చెబుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ సిని మాలు చేసి పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు సినిమా పోతే పార్టీ నడిపేందుకు కష్టమౌతుందన్నట్లు జన సైనికులకు వివరిస్తున్నారు. ఇప్పుడు సినిమాను నిలబెట్టే బాధ్యత జన సైనికులు తీసుకోవాలని కోరుతున్నారు. అందుకు గ్రామ స్ధాయి నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా స్దాయి నాయకులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. ఇంత చేసినా సినిమాను ఎంత కాలం ముందుకు తీసుకెళ్లగలరు. అంటే అభిమానులు, జనసైనికులు తమ సొంత డబ్బులు పెట్టుకొని సినిమాను నడిపిస్తే, ఎంత కాలం నడుస్తుంది. ఏ సినిమా అయినా సరే, ఎంత పెద్ద హీరో అయినా సరే బాగుంటేనే సినిమా చూస్తారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చితేనే సినిమా విజయవంతమౌతుంది. లేకుంటే డిజాస్టర్‌గానే మిగిలిపోతుంది. పైగా ఈ సినిమాకు తెలుగుదేశం శ్రేణులుకూడా పెద్దగా ఆదరిస్తున్నట్లు లేదు. బిజేపి పార్టీ శ్రేణులు నచ్చినట్లులేరు. ఆ మూడు పార్టీల నాయకులు ముందుకొస్తే తప్ప కనీసం ఒక వారం ఆడే పరిసి ్దతి కనిపించడంలేదు. అయినా సినిమా బాగా లేదన్న టాక్‌ విపరీతంగా ప్రచారం జరిగింది. మంచిగా వున్న సినిమా బాగాలేదని ఎవరు ప్రచారం చేసినా, మౌత్‌ టాక్‌తో సూపర్‌ డూపర్‌ హిట్లు అయిన సినిమాలు అనేకం వున్నాయి. బలగం లాంటి సినిమా తెలంగాణలో ఎలా ఆడిరదో చూశాం. ఏపిలో బలగాన్ని ఆదరించకపోయినా సరే బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది. కావాలనే బలగం సినిమాను ఏపిలో చెప్పకపోయినా బాయ్‌ కాట్‌ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ సినిమాను చూడడానికి కూడా అక్కడి జనం ఇష్టపడలేదు. కాని సినిమా ఎంతో విజయవంతమైంది. అలాగే పవన్‌ కళ్యాన్‌ సినిమా బాగుంటే ఏపిలో నడిచినా సరిపోయేది. కాని అంతో ఇంతో నడుస్తోందంటే నైజాం పుణ్యమే. ఏపిలో కూడా సినిమాను ఆదరిస్తే సినిమా ఎక్కడికో వెళ్లిపోయేది. కాని సినిమాపై ఇంకా పవన్‌ ఎంత ఆశలు పెట్టుకున్నా ముందుకు తీసుకుపోవడం అసాధ్యం.

పల్లె వికాసం పాలనతోనే సాధ్యం!

`పల్లెలో పాలన లేకుంటే అస్తవ్యస్తం!

`పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు.

`పల్లె ప్రగతే దేశ అర్థిక పురోగతి.

`రెండేళ్ళుగా గ్రామ పాలన లేకపోవడంతో స్థంభించిన ప్రగతి.

`కేంద్ర నిధులు ఆగిపోయాయి.

`రాష్ట్ర నిధులకు మోక్షం లేకుండా పోయింది.

`పారిశుధ్యం పడకేసింది.

`పల్లె ప్రగతి కుంటుపడిరది.

`వెంటనే ఎన్నికలు నిర్వహించాలి.

`పల్లకు పాలనలో ప్రధమ ప్రాధాన్యత కల్పించాలి.

`గ్రామ పంచాయతీకి రాజ్యాంగంలో గొప్ప స్థానమున్నది.

`సర్పంచ్‌ గ్రామ ప్రధమ పౌరుడు.

`ప్రధాని, ముఖ్యమంత్రి వచ్చినా సభలకు సర్పంచ్‌ కు అధ్యక్ష బాధ్యతలు.

`కేంద్రం నుంచి వచ్చే నిధులలో 85 శాతం గ్రామానికే కేటాయించాలి.

`పంచాయతి రాజ్‌ వ్యవస్థలో జిల్లా పరిషత్‌, గ్రామ సచివాలయాదే కీలక పాత్ర.

`జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి క్యాబినెట్‌ మంత్రి స్థాయి.

`కేంద్ర ప్రభుత్వం కన్నా రాజ్యాంగ పరంగా జిల్లా పరిషత్‌ సుప్రీం.

`అంత గొప్పది మన పంచాయతీ రాజ్‌ వ్యవస్థ.

హైదరాబాద్‌,నేటిధాత్రి:                         రాజులు కాలంలో మనదేశంలో స్ధానిక పాలన వుండేది. కాని అది కొంత మంది చేతుల్లో నిక్షిప్తమై వుండేది. రాజులు నియమించుకున్న వారి చేతుల్లో స్దానిక పాలన సాగుతుండేది. అది కూడా పన్నులు వసూలు చేయడానికి మాత్రమే ఆ యంత్రాంగం పనిచేసేది. తర్వాత బ్రిటీష్‌ కాలంలో ఆ పాలనకు స్వస్తి పలికారు. బ్రిటీష్‌ పాలకులు స్ధానిక స్వపరిపాలన తెచ్చారు. గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ రిప్పన్‌ తన కాలంలో ఈ స్దానిక స్వపరిపాలన తెచ్చారు. ఆ సమయంలో జిల్లాలు, బ్లాక్‌లు ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1959లో 1919,1935 చట్టాలకు అనుగుణంగా స్ధానిక సంస్ధలు ఏర్పాటు చేశారు. మూడంచెల వ్యవస్ద తెచ్చారు. గ్రామ పరిపాలనను చేర్చారు. ప్రతి గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని గ్రామపంచాయితీ వ్యవస్ధ కూడా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి పల్లెల్లో కూడా ఎన్నికలు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లను ఎన్నుకుంటూ వస్తున్నారు. గ్రామ సర్పంచ్‌కు రాజ్యాంగంలో ఎంతో గొప్ప నిర్వచనం వుంది. అదికారం కూడా వుంది. గ్రామ సర్పంచ్‌ మీద అవిశ్వాసం పెట్టే అవకాశం లేదు. కాని సర్పంచ్‌ తప్పు చేశాడనుకున్నప్పుడు మాత్రమే కలెక్టర్‌ తొలిగిస్తారు. దేశ మొదటి పౌరుడు రాష్ట్రపతి వచ్చినా సర్పంచ్‌కు ప్రోటో కాల్‌ వుంటుంది. ఎందుకంటే సర్పంచ్‌ గ్రామ ప్రధమ పౌరుడు. రాజ్యాంగబద్దంగా ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడే ఏకైక నాయకుడు. మన దేశంలో నేరుగా ప్రజల నుంచి ఇప్పుడు ఎన్నుకోబడే ఏకైన ప్రజా ప్రతినిధి సర్పంచ్‌. గతంలో మండలాధ్యక్షులు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, మున్సిపల్‌ చైర్మన్‌లు, మేయర్లు కూడా నేరుగా ప్రజల నుంచి ఎన్నుకోబడేవారు. కాని ఆ స్దానాలలో మార్పులు తెచ్చారు. కాని సర్పంచ్‌ ఎన్నికల్లో మాత్రం నేరుగా ఎన్నుకునే విధానం మార్చలేదు. గత రెండేళ్లుగా తెలంగాణలోని పల్లెలో పాలన స్ధంబించి పోయింది.. కేంద్రం నుంచి నిదులు రావడం లేదు. పల్లె పాలన పడకేసింది. పంచాయితీ రాజ్‌ వ్యవస్ధ చట్టం ప్రకారం ప్రజా ప్రతినిధులు వుంటేనే కేంద్రం నుంచి నిధులు అందుతాయి. రెండేళ్లుగా నిధులు లేక పల్లెలు కునారిల్లుతున్నాయి. పంచాయితీ రాజ్‌ చట్టంలో కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో సింహ భాగం పల్లెలకే కేటాయించాయి. కేంద్రం నుంచి జిల్లాలకు నేరుగా నిధులు అందుతాయి. కాని జిల్లా పరిషత్‌ ఆ నిధులలో కేవలం 5శాతం మాత్రమే వినియోగించుకోవాలి. మండలాలకు 10శాతం నిధులు పంపకాలు చేయాలి. గ్రామ పంచాయితీలకు 80శాతం నిధులు ఇవ్వాలి. కేంద్రం నుంచి వచ్చే ప్రతి పైసా గ్రామ పంచాయితీకే చెందాలి. మన దేశంలో స్ధానిక సంస్ధలకు ఎంతో గొప్ప గౌరవం వుంది. అంత కన్నా విలువ వుంది. కొన్ని సందర్భాలలో పార్లమెంటు కన్నా, జిల్లా పరిషత్‌ స్టాండిరగ్‌ కమిటీలకు ఎక్కువ ప్రాధాన్యత వుందంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ పల్లెలు పాలన కోసం ఎదరు చూస్తున్నాయి. పల్లె పాలన పూర్తయి రెండేళ్ల కాలానికి వస్తోంది. పల్లెతోపాటు, మిగతా పంచాయితీ రాజ్‌పాలన పూర్తయింది. మండల, జల్లా స్దాయి ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నాయి. మన దేశంలో పల్లెలే పట్టుగొమ్మలు. మన దేశంలో సుమారు 70శాతం జనాభా పల్లెల్లోనే వుంటుంది. ఐదు లక్షల గ్రామాలతో కూడిన అతి పెద్ద దేశం మనది.అలాంటి మన దేశంలో స్దానిక పాలనపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ వుంటాయి. స్దానిక సంస్ధల గడువు ముగిసినా, ప్రత్యేక అదికారుల చేత పాలన సాగిస్తుంటారు. ఎన్నికల నిర్వహణ గాలికి వదిలేస్తుంటారు. ప్రజలు ఎన్నికలెప్పుడు అని అడిగినా పట్టించుకోరు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ముఖ్యంగా తెలుగుదేశం ప్రబుత్వ హయాంలో ఎన్నికలు సమాయానికి నిర్వహించలేదు. నోడల్‌ అధికారులతో స్దానిక పాలన కొన్నేళ్లపాటు సాగించారు. ఇందుకు రాజకీయ పరమైన కారణాలు వుంటుంటాయి. ఎన్నికలు నిర్వహిస్త తమ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయా? రావా? అన్న మీమాంసలో అధికార పార్టీలు ఆలస్యం చేస్తుంటాయి. స్దానిక సంస్ధల ఎన్నికల్లో తాము స్వీప్‌ చేస్తామన్న మన్మకం వచ్చినప్పుడు చేయడం అలవాటు చేసుకున్నారు. ఇది ఇప్పుడు తెలంగానలో కనిపిస్తోంది. కాకపోతే తెలంగాణ స్ధానిక సంస్ధల ఎన్నికల ఆలస్యానికి బిసి రిజర్వేషన్ల అంశం అడ్డుగా మారుతోంది. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో 42 రెండు రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని శఫధం చేశారు. అందుకు అడ్డంకులుంటాయని తెలుసు. వాటిని అదిగమిస్తామన్న నమ్మకం కాంగ్రెస్‌ పార్టీకి వుంది. కాంగ్రెస్‌ పార్టీ కేవలం గత ఎన్నికల్లో గెలిచేందుకే ఈ అస్త్రాన్ని వినియోగించుకున్నదని ప్రతిపక్షాలు అంటున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా, రాజ్యాంగ సవరణ జరగకుండా 42 శాతం రిజర్వేషన్‌ సాధ్యం కాదు. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు కూడా అప్పుడు ప్రచారం చేయలేదు. కాంగ్రెస్‌ పార్టీ అలవి కాని హమీని ఇస్తోందని చెప్పలేదు. ఆ సమయంలో బిఆర్‌ఎస్‌ను ప్రజలు నమ్మేలా లేరన్న వాతావరణం కనిపిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ మేం సాదించి చూపిస్తామని మరింత గట్టిగా చెప్పుకునే అవకాశం వుంటుంది. కేంద్రంలో వచ్చేది మేమే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం వుంది. కేంద్రంలో కూడా మేమే వస్తామని మరింత చెప్పుకునే అవకాశం కాంగ్రెస్‌కు కల్పించినట్లౌతుందని బిఆర్‌ఎస్‌, బిజేపిలు సైలెంటుగా వున్నాయి. అదే కాంగ్రెస్‌కు వరమైంది. కాంగ్రెస్‌ పార్టీ గెలిచింది. 42 శాతం రిజర్వేషన్‌ ఎలా అన్నదానిపై తర్జన భర్జన పడుతోంది. ఇప్పటికే రెండు సార్లు అసెంబ్లీలో బిల్లు పాస్‌ చేయించి, కేంద్రానికి పంపడం జరిగింది. అది అయ్యేది కాదని కాంగ్రెస్‌కు కూడా తెలిసిపోయింది. స్దానిక సంస్ధలకు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించాలని కొంత మంది కోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర హైకోర్టు డెడ్‌ లైన్‌ విధించింది. సెప్టెంబర్‌ 31 లోగా స్ధానిక సంస్ధల ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్‌కు ఈ తీర్పు సంకటకంగా మారింది. ప్రజల నుంచి బిసి రిజర్వేషన్లు స్దానిక సంస్ధల ఎన్నికల్లో అమలు చేయాలని మరింత ఒత్తిడి వస్తోంది. బిసిల నుంచి కూడా పెద్దఎత్తున ఉద్యమాలు కూడా సాగుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్‌కు వెనకడుగు వేసే పరిస్దితి కనిపించడం లేదు. వాయిదాకు కూడా వీలు లేదు. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకునే పరిస్దితుల్లో లేదు. రిజర్వేషన్లును పార్టీ పరంగా అమలు చేస్తామని ఇప్పుడు చెబుతున్నారు. కాని ఈ విషయాన్ని ఎన్నికల ముందే చెబితే బాగుండేది. కాని అప్పుడు చెబితే ప్రజలు నమ్మేవారు కాదు. ఇప్పుడు నమ్మించడానికి అవకాశం లేకుండాపోయింది. కాకపోతే తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. అది కూడా చట్ట సమ్మతం కాదన్నది అందరికీ తెలుసు. ఏదో రకంగా ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా ఎదురుచూస్తున్నారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో అదికారంలోకి వచ్చింది. అదృష్టం కొద్ది స్ధానిక సంస్దల పాలన అప్పటికే పూర్తయిపోయింది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్దానిక సంస్ధల ఎన్నికలు నిర్వహిస్తారన్న ఆలోచనలతో పార్టీ నాయకులు, కార్యకర్తలున్నారు. కాని ప్రభుత్వం వాయిదా వేసుకుంటూ పోయింది. ఇప్పఇకైనా సమయం ఆసన్నమైందనుకుంటే, ఆర్డినెన్స్‌ జారీ చేసినా జరుగుతాయన్న నమ్మకం లేకుండా పోతోంది. నిజం చెప్పాలంటే తెలంగాణలో 15వేల మంది సర్పంచ్‌లు, 6వేల మంది ఎంపిటిసిలు, 500 మంది జడ్పీటీసిలుండేవారు. అందులో కాంగ్రెస్‌ పార్టీకి మెజార్టీ సీట్లు వచ్చేవి. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే స్దానిక సంస్ధల ఎన్నికలు జరిపితే కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో మేలు జరిగేది. స్దానిక పాలన కూడా మొత్తం కాంగ్రెస్‌ చేతుల్లోకే వచ్చేది. కాని ఆలస్యం చేశారు. అయితే ఆ సమయంలో బిజేపి కూడా 8 పార్లమెంటు స్దానాలు గెల్చుకొని వుంది. అదే సమయంలో స్ధానిక సంస్దల ఎన్నికలు నిర్వహిస్తే, బిజేపి పుంజుకునే అవకాశం వుండేది. అందుకే కొంత కాలం ఆగాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు మొదటికే మోసం వస్తుందేమో అన్న అనుమానం పార్టీలో వ్యక్తమౌతోంది. కాకపోతే ఇప్పటికైనా ఎన్నికలు నిర్వహించాలని పార్టీ శ్రేణుల నుంచి పెద్దఎత్తున డిమాండ్లు మొదలౌతున్నాయి. ఇక ఈ సమస్య ఇలా వుంటే గతంలో సర్పంచ్‌లుగా పనిచేసిన వాళ్లకు బకాయిలు పెండిరగ్‌లో వున్నాయి. ఎన్నికల ముందు వారికి బకాయిలు అందలేదు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం విచ్చి రెండేళ్లు గడుస్తున్నా నిధులు రావడం లేదు. 14వ ఆర్దిక సంఘం నిధులు విడుదలైతే తప్ప బకాయిలు అందవు. అవి అందాలంటే పంచాయితీ ఎ న్నికలు నిర్వహించాలి. ఏం జరగుతుందో చూడాలి.

హ్యూమన్‌ వర్షిప్‌..బెస్ట్‌ లీడర్‌ షిప్‌!

`సీఎం. రేవంత్‌ పై రాహుల్‌ ప్రశంసలు.

`సంక్షేమ సారథి రేవంత్‌.

`పట్టుదలకు మారు పేరు రేవంత్‌.

`ప్రభుత్వ పనితీరును మెచ్చుకుంటూ రేవంత్‌ తో రాహుల్‌ ఆలింగనం.

`రేవంత్‌కు అధిష్టానం నుంచి పెద్ద ఎత్తున అభినందనలు.

`ద బెస్ట్‌ లీడర్‌ రేవంత్‌ అని సోనియా కితాబు.

`రేవంత్‌ పై ప్రియాంక పొగడ్తలు.

`డిల్లీ వర్గాలలో లో రేవంత్‌ పాలనపై సానుకూల చర్చలు.

`తెలంగాణలో సంపూర్ణ, సమగ్ర, అర్థిక, సామాజిక, కుల గనణపై రేవంత్‌ చిత్తశుద్ధిపై మెచ్చుకోలు.

`రేవంత్‌ భుజం తట్టి శభాష్‌ అని మెచ్చుకున్న ఖర్గే.

`రేవంత్‌ ప్రభుత్వ పనితీరుపై అధిష్టానం ఖుషీ.

`మోడల్‌ ఆఫ్‌ తెలంగాణ ఈస్‌ ద బెస్ట్‌ అని అందరి కితాబు.

`రాష్ట్ర ప్రభుత్వంపై అధిష్టానం పెద్దల నుంచి సానుకూల స్పందన.

`అధిష్టానానికి రేవంత్‌ దూరమనే వార్తలు పటా పంచెలు.

`త్వరలో రేవంత్‌ బిహార్‌ ఎన్నికల ప్రచార బాధ్యతలు.

`రైజింగ్‌ తెలంగాణతో బీహార్‌లో రేవంత్‌ ప్రచారం.

`అధిష్టానంతో ఎలాంటి గ్యాప్‌ లేదు.

`గాసిబ్స్‌ ప్రచారానికి ఇక తావులేదు.

 

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 డిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పార్టీ అధినేతల నుంచి ప్రశంసలందుకున్నారు. ముఖ్యంగా లోక్‌సభలో ప్రతిపక్షనేత, పార్టీ మాజీ అధ్యక్షుడు, అగ్రనేత రాహుల్‌గాందీ నుంచి సిఎం. రేవంత్‌ రెడ్డి అభినందనలు అందుకున్నారు. సిఎం. రేవంత్‌ రెడ్డి చాలా గొప్పగా పాలన సాగిస్తున్నారు. తన అంచనాలకు మించి పాలన సాగిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ, ప్రబుత్వం తెలంగాణ ప్రజల సంక్షేమంలో ముందుందని కొనియాడేలా పాలన సాగిస్తున్నారని కొనియాడారు. తెలంగాన ప్రభత్వం నిర్వహించిన సమగ్ర సంపూర్ణ ఆర్దిక, సామాజిక, గణనపై పార్టీ అగ్రనేతలకు సిఎం. రేవంత్‌ రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రసెంటేషన్‌ ఇచ్చారు. సిఎం. రేవంత్‌ ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రసెంటేషన్‌కు ముగ్థులైన పార్టీ అదినేతి సోనియా గాంధీ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యాన్ని తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చడంతోపాటు, తొలి అడుగు వేసింది. దేశానికి ఆదర్శవంతమైన పాలనతోపాటు, సామాజిక గనణపూర్తి చేసంది. దాంతో కాంగ్రెస్‌ పెద్దలు సిఎం. రేవంత్‌ రెడ్డిని అభినందనలతో ముంచెత్తారు. రేవంత్‌రెడ్డి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వివరించారు. తెలంగాణలో కుల గణనతోపాటు చేపట్టిన అన్ని రకాల అంశాలు సుదీర్ఘం వివరించారు. తెలంగాణలో కుల గణన ఎలా చేపట్టారు. ఎంత మంది ఈ కార్యాక్రమంలో వినియోగించారు. కేవలం 60 రోజుల్లో ఎలా పూర్తి చేశారు. సమగ్ర సమాచారాన్ని ఎలా సేకరించారు. అప్పటికీ కొన్ని అభ్యంతరాలు వస్తే, మరో 15 రోజుల గడువుతో పూర్తి స్ధాయి సామాజిక గణన ఎలా పూర్తి చేశారన్న విషయాలను సిఎం. రేవంత్‌ రెడ్డి అదిష్టానానికి చక్కగా వివరించారు. దాంతో రాహుల్‌ గాంధీ మెచ్చుకొని రేవంత్‌ రెడ్డిని లయన్‌ ఆఫ్‌ ది తెలంగాణ అని కీర్తించారు. రేవంత్‌ రెడ్డి పనితీరుపై ప్రశంసల జల్లు కురిపించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలనుద్దేశించ రాహుల్‌ గాంధీ ప్రస్తావిస్తూ రేవంత్‌ను సంక్షేమ సారధిగా అభివర్ణించారు. పట్టుదలకు రేవంత్‌ రెడ్డి మారు పేరంటూ కీర్తించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తేవడంలో రేవంత్‌ రెడ్డిన శ్రమను రాహుల్‌ కొనియాడారు. పార్టీని అదికారంలోకి తేవడంతోపాటు, ఆదర్శవంతమైన పాలన రేవంత్‌ సాగిస్తున్న తీరును అభినందించారు. దేశమంతా తెలంగాణ మోడల్‌ను అనుసరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్‌ పార్టీ ఆది నుంచి డిమాండ్‌ చేస్తున్న బిసి గణనను చేపట్టేందుకు ముందుకు రాలేదు. కాని కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలు చేసిన విధానంపై దేశమంతా ఆసక్తికనబర్చింది. దాంతో ప్రజల నుంచి కూడా దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున డిమాండ్‌ ఏర్పడిరది. బిజేపి పాలిత రాష్ట్రాలే కాకుండా ఎన్డీయే పక్ష రాష్ట్రాలు కూడా బిసి గణనపై మొగ్గు చూపాయి. దాంతో కేంద్రం దిగి రాక తప్పలేదు. ఇదంతా కాంగ్రెస్‌ పార్టీ ఘనతే అన్నారు. అయితే అందుకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని రాహుల్‌ గాందీ పేర్కొన్నారు. ఎంతో పట్టుదలతో కుల గణన చేపట్టిన సిఎం. రేవంత్‌ను పట్టుదలకు మారు పేరుగా రాహుల్‌ అభివర్ణించారు. కాంగ్రెస్‌ ఫార్టీ ధ్యేయాం ఒక అడుగు ముందుకు పడేలా చేసిన రేవంత్‌ రెడ్డిని ఆలింగనం చేసుకొని అభినందించారు. సిఎం. రేవంత్‌రెడ్డి ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రెసెంటేషన్‌ నచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. సిఎం. రేవంత్‌ చొరవ వల్లనే ఇదిసాధ్యమైందన్నారు. ఇలా దేశంలోని అన్ని రాష్ట్రాలు సామాజిక సృహ కల్గి వుంటే బిసిలకు భవిష్యత్తులో పూర్తి న్యాయం జరుగుతుందన్నారు. బిజేపి ప్రభుత్వాలు కాంగ్రెస్‌ డిమాండ్‌కు తలొగ్గేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక కారణమని, బెస్ట్‌ లీడర్‌ అని రేవంత్‌ రెడ్డిని కొనియాడారు. అనంతరం కాంగ్రెస్‌పార్టీ అగ్ర నాయకురాలు, వాయినాడ్‌ ఎంపి. ప్రియాంకా గాంధీ కూడా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. రేవంత్‌ రెడ్డిపై పొగడ్తల వర్షం కురిపించారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్చే రేవంత్‌ రెడ్డి భుజం తట్టి శభాష్‌ అని మెచ్చుకున్నారు. ఈ సమయంలో పార్టీ పెద్దలను ప్రశంసలు అందుకున్నతీరును గుర్తు చేస్తూ సోనియా గాందీ మాటలే తనకు నోబెల్‌, ఆస్కార్‌ అవార్డులనుకుంటానన్నారు. ఏద ఏమైనా తెలంగాణలో 42శాతం బిసి రిజర్వేషన్లు అమలు చేసి, రిజర్వేషన్లపై వున్న గీత చెరిపేస్తామన్నారు. బిసి రిజర్వేషన్లకు అడ్డుగావున్న 50శాతం సీజింగ్‌ను బద్దలు కొడతామన్నారు. అయితే కొంత కాలం పార్టీ అధిష్టానానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దగ్గర కాలేనంత దూరం ఏర్పడిరదంటూ పెద్దఎత్తున ప్రచారం జరగుతూ వచ్చింది. సిఎం.రేవంత్‌రెడ్డి ఎన్నిసార్లు డిల్లీకి వెళ్లినా రాహుల్‌ గాంధీ అప్పాయింట్‌ మెంటు ఇవ్వడం లేదని పుంకాను పుంకాలుగా వార్తలు వచ్చేవి. ప్రతిపక్షాలు సోషల్‌ మీడియా ద్వారా రకరకాల ప్రచారాలు సాగించింది. రేవంత్‌రెడ్డిని కలవడానికి రాహుల్‌ ఇష్టపడడం లేదని ప్రచారం సాగించారు. రేవంత్‌రెడ్డి రోజుల తరబడి పడిగాపులు కాసినా కనీసం ముఖం చూడడానికి కూడా ఇష్టపడడం లేదంటూ వార్తలు రాశారు. రేవంత్‌ రెడ్డిమీద అదిష్టానం ఎంతో కోపంగా వుందంటూ కూడా పదే పదే అసత్యాలు ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఈ రెండు సంవత్సరాలలో కొన్ని సందర్భాలలో రాహుల్‌ గాందీ ఎదురైనా సిఎం.రేవంత్‌రెడ్డితో కనీసం పలకరించలేదంటూ కూడా వార్తలురాశారు. డిల్లీలో మొదట్లో కలిసిన ఫోటోలు తప్ప, ఇప్పటి వరకు కొత్త ఫోటోలు విడుదల చేయలేదని రకరకాల వార్తలు రాశారు. బిఆర్‌ఎస్‌ నాయకులు రేవంత్‌ రెడ్డి మీద నిత్యం అబాండాలు వేస్తున్నారు. వాటన్నింటికీ ఈ ఒక్క సందర్భం అనుమానాలన్నీ పటాంపంచెలు చేసినట్లైంది. రేవంత్‌రెడ్డి పవర్‌పాయింట్‌ ప్రసెంటేషన్‌ ఇస్తున్న సమయంలో రాహుల్‌ గాందీతోపాటు, పార్టీ పెద్దలందరూ ఎంతో ఆసక్తితో గమనించారు. ఆ సమయంలో రేవంత్‌ సర్కారు సాధించిన విజయాన్ని చూస్తూ ఆనందంగా పవర్‌ పాయింట్‌ ప్రెసెంటేషన్‌ తిలకించారు. కొన్ని సందర్బాలలో రాహుల్‌ గాందీ ఎంతో ఆసక్తితో ఆ ప్రెసెంటేషన్‌ విన్నారు. ఆ సమయంలో రాహుల్‌ గాందీ ఎంతో ఉల్లాసంగా కనిపించారు. తర్వాత రేవంత్‌ రెడ్డిని పొగడ్తలతో రాహుల్‌ గాందీ ముంచెత్తారు. అయితే రాహుల్‌ గాందీ వ్యాఖ్యలతో ప్రతిపక్షాల ఆరోపణలన్నీ పటాపంచెలైపోయినట్లే అంటున్నారు. ఇక సిఎం. రేవంత్‌ రెడ్డి మీద మాట్లాడేందుకు బిఆర్‌ఎస్‌కు ఎలాంటి అవకాశం లేకుండాపోయింది. ఓ వైపు సిఎం. రేవంత్‌రెడ్డి పనితీరును ప్రశంసిస్తూనే హ్యూమన్‌ వర్షిప్‌ రాహుల్‌ కొనియాడారు. అంటే పేదల ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే గొప్ప నాయకుడు అన్నారు. ప్రజలను ఆరాదించే పార్టీ కేవలం కాంగ్రెస్‌ పార్టీయే అని రాహుల్‌ అన్నారు. ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, పేద ప్రజల అభ్యున్నతి కోసం, దేశ ప్రగతి కోసం, రేపటి తరం కోసం పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్‌ అని రాహుల్‌ పేర్కొన్నారు. అలా కాంగ్రెస్‌ భావాలను, ఆచరణలోకి తీసుకెళ్తున్నా రేవంత్‌ రెడ్డిని రాహుల్‌ అభినందించారు. తెలంగాణ మోడల్‌ దేశమంతా ప్రచారం జరగాలని రాహుల్‌ కోరుకున్నారు. తెలంగాణ రైజింగ్‌ దేశమంతా చూస్తుందన్నారు. జిడీపి గ్రోత్‌లో దేశమంతా తెలంగాణను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని, అందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వాలు వస్తేనే సాద్యమౌతాయని అన్నారు. వచ్చే బీహార్‌ ఎన్నికల్లో రేవంత్‌ రెడ్డికి ప్రచార బాధ్యతలు కాంగ్రెస్‌ పార్టీ అప్పగించనున్నారు. తెలంగాణలో అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలపై రేవంత్‌రెడ్డి చేత పెద్దఎత్తున ప్రచారం సాగించాలని కాంగ్రెస్‌ పార్టీ అనుకుంటోంది. తెలంగాణలో సక్సెస్‌ పుల్‌గా అమలు జరుగుతున్న ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్‌ ఫార్టీ తరుపున విసృతంగా ప్రచారం చేయడానికి రేవంత్‌కు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అమలు జరుగుతున్న ఆరు గ్యారెంటీలలో ఉచిత బస్సు పధకం వల్ల మహిళలకు ఎంత మేలు జరుగుతుందో బిహార్‌ ఎన్నికల్లో చెప్పనున్నారు. అంతే కాకుండా ప్రభుత్వ రవాణా ఎలా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందో రేవంత్‌ వివరించనున్నారు. ఈ పద్దెనమిది నెలల్లో రెండు వందల కోట్ల ప్రయాణాలను మహిళలు సాగించారు. అంతే కాకుండా ఆర్టీసీ లాబాల పట్టింది. ఉచిత బస్సు పధకం విజయవంతం కావడంతో బిఆర్‌ఎస్‌కు పాలు పోవడం లేదు. ఆర్టీసి మరింత బలోపేతమౌతుంటే బిఆర్‌ఎస్‌ ఆశ్చర్యపోతోంది. తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పధకం గురించి రేవంత్‌ రెడ్డి బిహార్‌లో విసృతంగా ప్రచారం సాగించనున్నారు. దేశంలో ఒక్క తెలంగాణలోనే సన్న బియ్యం ఇస్తున్న తీరు, విధానం గురించి బీహార్‌ ప్రజలకు వివరించనున్నారు. అంతే కాకుండా ఇందిరమ్మ ఇండ్లపై కూడా రేవంత్‌ రెడ్డి ప్రచారం సాగిస్తారు. తెలంగాణ రైజింగ్‌పై ప్రచారం సాగించనున్నారు.

ఎంపికలు, ఏరివేతలు షురూ!

-ఆపరేషన్‌ 2028..సీఎం గా ‘‘కేటీఆర్‌’’

-పార్టీ భవిష్యత్తు కోసం ‘‘కెసిఆర్‌’’ స్కెచ్‌

`యువ తరానికి టిక్కెట్లు..నవతరానికి పార్టీ పదవులు.

`వచ్చే ఎన్నికలలో వంద సీట్లు సాధించాలంటే కఠిన నిర్ణయం తప్పదు.

`60 శాతం యువకులకు సీట్లు.

`40 శాతం సీనియర్లుకు కేటాయింపులు.

`సీనియర్‌ ఎమ్మెల్యేలకు పార్టీ పదవులు.

`ఇప్పటికే మూడు, నాలుగు సార్లు ఎమ్మెల్యేలైన వాళ్లుకు కూడా పార్టీ పదవులు.

`గత ఎన్నికలలో ఓడిపోయిన వారి స్థానంలో యువకులకు టిక్కెట్లు.

`ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన స్థానాలలో ఎన్నికలు వస్తే కొత్త వారికి అవకాశం.

`గత ఎన్నికలలో టిక్కెట్లు రాని వారికి కూడా కొంత ప్రాధాన్యం.

`ప్రజలల్లో వున్న నాయకులకే టిక్కెట్లు.

`త్వరలో ప్రతి మండలం నుంచి కార్యకర్తలతో కేసిఆర్‌ ముఖాముఖి.

`ఎన్నికల వరకు కార్యకర్తలతో కేసిఆర్‌ వరుస భేటీలు.

`కార్యకర్తల సూచనల మేరకే ఎమ్మెల్యేలకు టిక్కెట్లు.

`ఫ్లెక్సీలు, పత్రికలలో ప్రకటనల నాయకులలో చాలా మంది అవకాశవాదులు.

`అవకాశ వాదులకు టిక్కెట్లు ఇచ్చే ప్రసక్తి లేదు.

`నిత్యం ప్రజల్లో వుండే నాయకులకే గుర్తింపు.

`వారికే టిక్కెట్లు కేటాయింపులు.

`పైరవీలకు ఎలాంటి తావు లేదు.

`అభ్యర్థుల ఎంపికలో ఎవరి ప్రమేయం వుండదు.

`కార్యకర్తలు సూచించిన నాయకులకే టిక్కెట్లు.

తెలంగాణ అంటేనే కేసిఆర్‌. కేసిఆర్‌ అంటేనే తెలంగాణ. కేసిఆర్‌ అనే పదంలేకుండా ఒక్క పూట కూడా రాజకీయం సాగదు. ఒక్క క్షణం మీడియాకు వార్త పుట్టదు. తెలంగాణలో కేసిఆర్‌ అనే పదం వినిపించకుండా ఎలాంటి వార్తకు అవకాశమే లేదు. అంతగా తెలంగాణలో కేసిఆర్‌ నామస్మరణం జరగడానికి కారణం ఒక్కటి కాదు, కొన్ని లక్షలున్నాయి. కేవలం తెలంగాణ ఉద్యమం, పోరాటం మాత్రమే కాదు. తెలంగాణ సాధన, బంగారు తెలంగాణ నిర్మాణంలో అనేక అంశాలు ముడిపడి వున్నాయి. అందుకే గత 25 సంవత్సరాలుగా కేసిఆర్‌ అనే పదం లేకుండా రాజకీయమే సాగింది లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా 2001 ఒక్కటి నుంచి ప్రతి ఆంద్రా నాయకుడు కూడా కేసిఆర్‌ నిత్య జపం చేశారంటే అశ్యర్యపోనక్కర్లేదు. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా సరే కేసిఆర్‌ అనే పదమే రాజకీయాలకు ఓంకారంగా మారిపోయేలా వుంది. కేసిఆర్‌ అనే పదం బీజాక్షరమైపోయింది. అందుకే దేశంలో ఏ నాయకుడికి పేరు ఆయా రాష్ట్రాలలో ప్రతి క్షణం గుర్తు చేసుకుంటారో లేదో గాని, తెలంగాణలో మాత్రం ఎక్కడో ఒక చోట ప్రతి ఒక్కరు రోజుకు ఒక్కసారైనా గుర్తుచేసుకుంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి కేసిఆర్‌ మాట్లాడినా, సంచలనమే..మాట్లాకపోయినా సంచలనమే. అందుకే ఆయన మౌనం కూడా రాజకీయ వర్గాలకు భయం. ఆయన మాట్లాడితే భరించలేదు. మౌనంగా వుంటే భరించలేరు. ఇది తెలంగాణ రాజకీయాల్లో విచిత్రమైన పరిస్ధితి. అయితే కేసిఆర్‌ ఇప్పుడే ం చేస్తున్నారు. ఈ ప్రశ్న తెలంగాణ రాజకీయాల్లో వున్న ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం వేసుకునే ప్రశ్న. ఎందుకంటే కేసిఆర్‌ ఒంటరిగా వున్నా, పది మందిలోవున్నా ఆయన ఆలోచనలు పసిగట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఊహించడానికి కూడా వీలుపడదు. అందుకే నేటిధాత్రికి అందిన సమాచారం మేరకు ఆయన వచ్చే ఎన్నికల గురించి పద్మవ్యూహం రచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వంద స్దానాలు ఎలా గెలవాలన్నదానిపై కసరత్తు చేస్తున్నారు. ఆ మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా పరామర్శకు వచ్చిన బిఆర్‌ఎస్‌ నాయకులతో హస్పిటల్‌లనే సమావేశం ఏర్పాటు చేశారంటే అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణ మీద ఆయనకు వున్న ఆర్తిని తెలుసుకోవచ్చు. మట్టిని తీసుకొచ్చి కుండను తయారు చేసిన వారు ఆ కుండను ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో తెలుసు. దాన్ని కొనుక్కున్న వారు కూడా ఎంతో అపురూపంగా చూసుకుంటారు. తెలంగాణ తెచ్చి బంగారు తెలంగాణ చేసిన కేసిఆర్‌, ఆ తెలంగాణ తెర్లవుతుందంటే చూస్తూ ఊరుకుంటారా? అందుకే ఇవరై ఏళ్లు వెనక్కి వెళ్లిన తెలంగాణను మళ్లీ నిలబెట్టాలంటే ఏం చేయాలన్నదానిపై కసరత్తు చేస్తున్నారు. పార్టీని ఎలా బలోపేతం చేయాలన్నదానిపై దృష్టిపెట్టారు. భవిష్యత్తులో పార్టీ మరో 50 ఏళ్లపాటు నిలబెట్టాలంటే ఎలాంటి మార్గాలు వేయాలో ఆలోచిస్తున్నారు. పార్టీ ఎలాంటి లక్ష్యాలు సాదించాలో అన్నదానిపై బ్లూ ప్రింట్‌ తయారు చేస్తున్నారు. సరిగ్గా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇలాగే బ్లూ ప్రింట్‌ తయారు చేశారు. అందుకే తెచ్చిన తెలంగాణను పదేళ్లలో బంగారు తెలంగాణ చేయగలిగారు. ఉద్యమ సమయంలో కేసిఆర్‌ పదే పదే బ్లూ ప్రింట్‌ గురించి నాయకులకు వివరించేవారు. ఆ సమయంలో తెలంగాణ వస్తుందో లేదో అందరూ అనుకున్నారు. కేసిఆర్‌ బ్లూప్రింట్‌ గురించి చెబుతుంటే అవుతుందో లేదో అని అనుమానపడ్డారు. కాని తెలంగాణ రాష్ట్రాం సాదించారు. తెలంగాణ ప్రజల కల నెరవేర్చారు. తెచ్చిన తెలంగాణను ప్రపంచంలోనే ఏ నాయకుడు, పాలకుడు చేయనంత వేగంగా అభివృద్ది చేశారు. అన్నమో రామచంద్రా? అని ఆకలి కేకలు వేసిన తెలంగాణను దేశానికి అన్నం పెట్టే అన్న పూర్ణను చేశారు. ఇంతకంటే ఏం కావాలి. కాని ప్రజలు అంతకన్నా మరింత బాగ్యం కావాలనుకున్నారు. ఇప్పుడు కేసిఆర్‌ వుంటేనే బాగుండనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో పార్టీని రేపటి రోజు ఎలా నిలబెట్టాలన్నదానిపై కేసిఆర్‌ పక్కా ప్లాన్‌ తయారు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై రూట్‌ మ్యాప్‌ తయారు చేస్తున్నారు. ఈసారి కార్యకర్తలే కేంద్రంగా అభ్యర్ధుల ఎంపిక జరగాలన్న కొత్త విదానాన్ని రూపకల్పన చేస్తున్నారు. అభ్యర్ధుల ఎంపిక ఈసారి కార్యకర్తలే నిర్థేశించేలా కొత్త తరహా రాజకీయాలకు అంకుర్పాణ చేస్తున్నారు. ఇక్కడ ఎవరి రెకమండేషన్లకు తావు లేని అభ్యర్ధుల ఎంపిక దారులు వేస్తున్నారు. ఎవరు ప్రజల్లో వుంటున్నారు. ఎవరు ప్రజల్లో వున్నారు. ఎవరు ప్రజలకు దూరంగా వుంటున్నారు. ఎవరు ఆర్భాటపు పోకడలు పోతున్నారు. ప్రతిపక్షంలో వుండి కూడా ప్రజలకు ఎవరు అందుబాటులో లేరు. వారి గురించి కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకొని, మెజార్టీ కార్యకర్తల సూచన మేరకే ఈ సారి అభ్యర్ధుల ఎంపిక వుండేలా రూట్‌ మ్యాప్‌ రూకల్పన చేస్తున్నారు. భవిష్యత్తులో కొత్త తరం బిఆర్‌ఎస్‌ రాజకీయాలు చూస్తారు. అందులో భాగంగా యువతరానికి పెద్ద పీట వేయాలనుకుంటున్నారు. 60:40 ప్రకారం టిక్కెట్ల పంపకాలు జరపాలని అనుకుంటున్నారు. యువతరనానికి ఈసారి టికెట్లు ఇస్తే బిఆర్‌ఎస్‌ మీద ప్రజల్లో వున్న నమ్మకానికి, కేసిఆర్‌ రావాలన్న బలమైన ప్రజల కోరిక తోడౌతుంది. యువతరం నాయకులు విజయం సాదిస్తారు. నిజం చెప్పాలంటే ఈసారి కేసిఆర్‌ ఎవరిని నిలబెట్టినా గెలిచే పరిస్టితులు కనిపిస్తున్నాయి. అందువల్ల కొత్త తరాన్ని ప్రోత్సహించాలి. మరో యాభై ఏళ్లు బిఆర్‌ఎస్‌ సైనిక సంపత్తిని తయారు చేయాలని అనుకుంటున్నారు. ఎన్టీఆర్‌ హయాంలో సరిగ్గా ఇదే జరిగింది. అప్పుడు యువతను ప్రోత్సహించడం వల్లనే ఇప్పటికీ తెలుగుదేశం జెంగా ఎగురుతోంది. ఒకసారి ఓడిపోయినా మళ్లీ మళ్లీ గెలుస్తోంది. అలాగే బిఆర్‌ఎస్‌ కూడా వచ్చే 50 ఏళ్లపాటు పార్టీకి సేవలందించే నాయకులను తయారు చేయాలనుకుంటోంది. కేసిఆర్‌ అందుకు అవసరమైన కసరత్తు విసృతంగా సాగిస్తున్నారు. ఈ రోజుల్లో ఎన్నికలంటే ఆశామాషీ కాదు. ప్రజలు ఎప్పుడు ఎవరి వైపు మొగ్గుచూపుతారో అర్ధం కాని రోజులు. గతంలో పార్టీలకు వున్న విలువ ఇప్పుడు లేదు. జనం నాడి పట్టడం అంత సులువు కాదు. జనాన్ని మెప్పించి,ఒప్పించి అదికారంలోకి రావడం అంటే మాటలుకాదు. ఎంత పక్కాగా ప్లాన్‌తో వెళ్లనా ఆఖరు నిమిషంలో ఏ చిన్న పొరపాటు జరిగినా పేక మేడ కూలినట్లు కూలుతుంది. ఎందుకంటే బిఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనా కాలంలో ప్రజలకు అందని పధకం అంటూ లేదు. ప్రజలకు తెలియని విషయమంటూ లేదు. ఉమ్మడి పాలనలో చూసిన గోసలన్నీ తీరినా, ప్రజలు మూడోసారి బిఆర్‌ఎస్‌ను అధికారంలోకి రాలేదు. ఉమ్మడిపాలనలో చూడని నీళ్లు తెలంగాణ ప్రజలు కళ్లారా చాశారు. బీడు వారిన భూముల్లో పంటలు పండిరచారు. రాళ్లు, రప్పలతో నిండిన భూముల్లో కూడా పసిడి సిరులు పంచించారు. అందుకు కారణం కేసిఆర్‌ అని తెలుసు. అయినా కేసిఆర్‌ను ఆ పల్లె జనమే కాదనుకున్నారు. కారణం రాజకీయ పార్టీలు హమీల విన్యాసం కూడా ప్రభావం చూపుతుంది. ఈసారి అదే ప్రజలు ఎటు మొగ్గు చూపాలన్నదానిపై కూడా అన్ని పార్టీలు తమ తమ వ్యూహాలను ఇప్పటి నుంచే మొదలు పెడుతున్నాయి. వచ్చే మూడేళ్ల కాలాన్ని కూర్చొని అంచనా వేయకూడదు. జనంలోకి మళ్లీ బిఆర్‌ఎస్‌ నాయకులు వెళ్లాలి. భరోసా కల్పించాలి. కాంగ్రెస్‌ పాలన బాగా లేదని జనమే మళ్లీ బిఆర్‌ఎస్‌ను గెలిపిస్తారన్న గుడ్డి నమ్మకంతో వుండకూడదు. బంగారు తెలంగాణ అని కొనియాడిన నోళ్లే, గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లు వేశారు. ప్రజలు రాజకీయ పార్టీల నుంచి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఆశిస్తారు. ప్రజల ఆలోచనలను పసిగట్టాలి. ఆ దారిలో రాజకీయ పార్టీలు నడవాలి. దేశ రాజకీయాలు వేరు. రాష్ట్ర రాజకీయాలు వేరు. రాష్ట్రంలో ప్రజలు ఆశించేవి వేరు. అందుకే ఈసారి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, నాయకుల ఎంపికలో ఎలాంటి తొందరపాటు లేకుండా చూడాలనుకుంటున్నారు. అందుకే ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టారు. త్వరలో తెలంగాణ వ్యాప్తంగా వున్న అన్ని మండలాలకు చెందిన కార్యకర్తల అభిప్రాయాలు సేకరించాలని కేసిఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. అది త్వరలో కార్యరూపం దాల్చనుంది. వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు సాదించాలి. కేటిఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలన్నదే కేసిఆర్‌ ఆశయం. తెలంగాణ అభివృద్దిని దిశానిర్ధేశం చేస్తూ మళ్లీ తెలంగాణను గాడి పెట్టాలన్నదే కేసిఆర్‌ సంకల్పం.

పీల్చి పిప్పి చేస్తున్న పన్నులు!?

-సామాన్యుడి మీద మోయలేని భారాలు?

-చిరు వ్యాపారుల గుండెల మీద గుది బండలు!

-ఆదాయ పన్నుకు అర్థం మార్చేస్తున్నారు?

-చిరు వ్యాపారుల జీవితాలు చీకటి చేస్తున్నారు.

-పన్నుల పేరుతో జనం నడ్డి విరుస్తున్నారు.

-లావాదేవీలే ఆదాయం పన్నులకు కొలమానం చేస్తున్నారు?

-లాభాల మీద వసూలు చేయాల్సిన పన్నులు వ్యాపారం మీద జిఎస్టీ వేస్తున్నారు?

-అందరూ బ్యాంకు అకౌంట్లు తీసుకోవాలన్నారు.

-జీరో బ్యాలెన్స్‌ అకౌంట్లు కోట్లాదిగా తెరిపించారు.

-తర్వాత మినిమమ్‌ బ్యాలెన్స్‌ వుండే విధంగా చేశారు.

-ఆ తర్వాత డిజిటల్‌ చెల్లింపులకు దారులు వేశారు.

-డిజిటల్‌ చెల్లింపులకు ఎలాంటి పన్నులుండవని నమ్మించారు.

-ఇప్పుడు మెల్లగా డిజిటల్‌ లావాదేవీలను లెక్కగట్టి జిఎస్టీ అంటున్నారు.

-కచ్చితంగా జిఎస్టీ లైసెన్స్‌ లు తీసుకోవాలంటున్నారు.

-పండ్ల బండి వ్యాపారంలో లక్షల ఆదాయం వుంటుందా?

-కూరగాయల వ్యాపారులు కోట్లు గడిస్తారా?

-చిన్న చిన్న కిరాణ షాపు దారులు కోట్లు సంపాదించుకునే వీలుందా?

-ఎటు పోతుంది అర్థిక వ్యవస్థ?

-జనాన్ని గుళ్ల గుళ్ల చేసే దాకా వదిలిపెట్టరా?

-వ్యాపారుల్లో తిరుగుబాటు ఊహించలేదు.

-డిజిటల్‌ చెల్లింపులపై జనమే ఎదురు తిరుగుతారని అంచనా వేయలేదు.

 

హైదరాబాద్‌,నేటిధాత్రి:                                                 

సామాన్యుడు బతికేదెలా? చేసిన కష్టం నోటిదాకా రాకపోతే రాకపోతే ఎలా? పొద్దంతా చేసిన కష్టంలో మిగులు లేకపోతే ఎలా? భవిష్యతకు భరోసా ఎలా? రేపటి గురించి ఆలోచంకుంటే జీవనం సాగేదెలా? జీవితమంటే కష్టం, సంపాదన, ఖర్చు ఈ రహస్యంలో ఎన్ని ఇబ్బందులున్నాయో పాలకులకు తెలియకుండాపోతోందా? ప్రభుత్వాలకు సలహాలు ఇచ్చేవారు ఎంత మంది వున్నా, నాయకులు ప్రజల్లో వుండడం లేదా? ప్రజల కష్టం తెలియడం లేదా? పనులే కాదు,ఉద్యోగాలే కాదు, స్వయం ఉపాది మేలని అనుకున్నవారు ఇక దివాళా తీయాల్సిందేనా? కర్ణాకట ప్రజలు ఎందుకు నిరసనలకు దిగుతున్నారు? ఇదే ఇప్పుడు దేశ వ్యాప్త చర్చకు దారి తీస్తోంది. సహజంగా సమాజంలో కొంత మంది వ్యాపారాలు చేసుకుంటే కష్టానికి అదనంగా రూపాయి తోడౌతుందని అనుకుంటారు. ఎక్కడో కూలీ చేయడం ఎందుకు? మన పని మనం చేసుకుందామని అనుకుంటారు. అలా ఏదో చిన్నా చితకా వ్యాపారం చేసుకోవాలనుకుంటారు. ఆత్మగౌరవంతో బతకాలనుకుంటారు. తాము బతకడమే కాకాండా పని చేసుకునేవారికి ఉపాధి కూడా కల్పించాలనుకుంటారు. కొన్ని వ్యాపారాల్లో కుటుంబమంతా పని చేస్తుంది. సహజంగా ఉద్యోగం చేసే ఒకరు ఉద్యోగం చేస్తే కుటుంబమంతా ఖాళీగా వుంటుంది. కాని కూలీ చేసుకునే కుటుంబాలలో అందరూ పని చేస్తే తప్ప పూట గడవదు. కూలీ అంటే ఒక రోజు వుండొచ్చు. మరో రోజు లేకపోవచ్చు. అదే కష్టం చిన్న వ్యాపారంలో చేస్తే కుటుంమంతా పనిచేయొచ్చు. ఓ నాలుగు రూపాయలు వెనకేసుకోవచ్చు. ఇదీ సగటు వ్యక్తి ఆలోచన. దాంతో రోడ్ల మీద పండ్ల వ్యాపారం చేసుకుంటారు. కొందరు చిన్న టిఫిన్‌ సెంటర్ల ఏర్పాటు చేసుకుంటారు. మహిళలకు అవసరమైన బొట్టు బిల్లలు, రబ్బరు బ్యాండ్లు అమ్ముకుంటారు. ఇలా రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ బతుకుంటారు. గత పదేళ్ల క్రితం వరకు వీరికి బ్యాంకు అకౌంట్లు కూడా వుండాలన్న ఆలోచన వుండేది కాదు. ఎందుకంటే ఆ సంపాదనతో బ్యాంకుల్లో డబ్బు దాచుకునేంత సంపాదన వచ్చేదే కాదు. అలాంటప్పుడు బ్యాంకులతో కూడా వారికి పని వుండేది కాదు. కాని కేంద్రలో బిజేపి వచ్చిన తర్వాత సమాన్యులు ఇప్పటికీ బ్యాంకు మెట్లెక్కింది లేదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సగటు వ్యక్తికి బ్యాంకు అంటే ఏంటో తెలియకుండాపోయింది. అంటూ బిజేపికి చెందిన పెద్దలు మాట్లాడుతుంటే జనం సంతోషించారు. తమకు లోక జ్ఞానం బిజేపి ఇస్తుందనుకున్నారు. కాని ఆ జ్ఞానం వచ్చే సరికి సంపాదనలో సగం ప్రభుత్వాల ఖాతాల్లోకి వెళ్లే ప్రమాదముందని ఎవరూ ఊహించలేదు. తొలుత అందిరికీ బ్యాంకు అకౌంట్లు వుంటే ఆత్మగౌరవం వస్తుందని నమ్మించారు. జీరో అకౌంట్లు కోట్లాదిగా ఇప్పించారు. తొలుత బ్యాంకు ఖాతాలలో డబ్బు లేకపోయినా సరే అన్నారు. ఆ తర్వాత మినిమన్‌ బ్యాలెన్స్‌ వుండాలన్నారు. అందుకు ఎవరూ బ్యాంకులకు నేరుగా వెళ్లాల్సిన అవసరంలేదన్నారు. ఆన్‌ లైన్‌ సేవలు అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడే జీఎస్టీ అనే బాదుడుకు ముహూర్తం పెట్టారు. దేశమంతటా ఒకే పన్ను విదానం తెస్తున్నామన్నారు. ప్రభుత్వ సేవలు అన్ని ప్రాంతాల వారికి సమానంగా అందాలన్నారు. ప్రతి వస్తువుకు దేశమంతాటా ఒకే పన్ను విధానం వుండాలన్నారు. ఇది దేశ ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతుందని అనుకున్నారు. కాని మొదటికే మోసం వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు జిఎస్టీ అధికారులు నోటీసులు పంపిస్తుంటే చిరు వ్యాపారులు లబోదిబోమంటున్నారు. దేశంలో పెద్ద నోట్ల వల్ల అవినీతి పెరిగిపోతుందని, నల్ల దనం పేరుకుపోతుందని అన్నారు. డబ్బంతా పెద్ద చేతుల్లో వుంటుందని, సామాన్యుడు అక్కడే ఆగిపోతున్నాడన్నారు. ఇలాంటి మాటలు పేద వర్గాలకు ఎంతో ఊరట కల్గిస్తాయి. దేశంలో నల్లధనం అదుపులోకి వస్తే దేశమంతా సుభిక్షంగా వుంటుందని నమ్మించారు. నోట్ల రద్దు చేశారు. కష్టాల సుడిగుండాన్ని తెరిచారు. తర్వాత కొంత కాలానికి ఆన్‌ లైన్‌ చెల్లింపుల ద్వారా ఎక్కడా నల్లదనం నిలువకు ఆస్కారం వుండదని అన్నారు. మెల్లిగా అన్ని రకాల వర్గాలకు ఈ ఆన్‌ లైన్‌ చెల్లింపులు అలవాటు చేశారు. కొన్ని కంపనీలు మనీ రిటన్‌ అనే స్కీమ్‌ను అమలు చేశారు. అటు నోట్ల రద్దుతో చిల్లర మార్చుకోవడం కొంత ఇబ్బంది కరంగా మారింది. డిజిటల్‌ మనీ మార్పిడి అనేది చిరు వ్యాపారులకు వరంగా మారిందన్న నమ్మకం కలిగింది. ఇక ఇప్పుడు అసలైన పన్నుల బారానికి రంగం సిద్దమైంది. ఇందులో నిగూఢ రహస్యం దాగి వుంది. నిత్యం దేశ వ్యాప్తంగా ఎంత వ్యాపారం సాగుతుందనే లెక్క తేలిపోయింది. అయితే ఆర్ధిక వేత్తల అత్యుత్సాహమో, లేక జీఎస్టీ అధికారుల అనాలోచిత నిర్ణయమో గాని, మొదటికే మోసం వచ్చే పరిస్ధితి వచ్చింది. రోడ్డుమీద ఓ పండ్ల వ్యాపారి ప్రతి చెల్లింపును ఆన్‌లైన్‌ ద్వారానే తీసుకుంటున్నారు. ఇక్కడ నగదు వ్యాపారం కూడా ఎంతో కొంత సాగుతుంది. కానీ ఎక్కువ శాతం అందరూ ఆన్‌లైన్‌ చెల్లింపులే చేస్తున్నారు. ప్రతి వ్యక్తికి బ్యాంక్‌ అకౌంట్‌ సౌకర్యం కల్పించిందే ఇందుకు. సెల్‌ఫోన్‌ల వ్యాపారం పెంచారు. ప్రతి వ్యక్తి చేతిలోకి ఇంటర్‌నెట్‌ సౌకర్యం కలిగేలా చేశారు. ఒకప్పుడు ఇంటర్‌ నెట్‌ అనేది కంపనీలకుమాత్రమే పరిమితమయ్యేది. ఇప్పుడు ప్రతి వ్యక్తి చేతిలోకి వచ్చేలా చేశారు. మాట్లాడేందుకు ఉపయోగపడే సెల్లు , సకల కార్యాలకు నిలయం చేశారు. ఆన్‌లైన్‌చెల్లింపులు కూడా అలవాటు చేశారు. పండ్లు, కూరగాయలు, చిన్న చిన్న టిఫిన్‌ సెంటర్లు నిర్వహించుకునే వారికి వస్తున్న చెల్లింపుల్లో లక్షల రూపాయలు కనిపిస్తున్నాయి. కాని ఒక పండ్ల వ్యాపారి మార్కెట్‌ నుంచి ఎంతకు కొనుగోలు చేస్తున్నాడు. అందుకు రవాణాకు ఎంత ఖర్చు చేస్తున్నాడు. తెచ్చిన పండ్లు ఎంత వరకు అమ్ముడౌతున్నాయి. ఎంత వృధా పోతున్నాయి. అతనికి సహాయకులుగా ఎంత మంది పనిచేస్తున్నారు. పండ్లు అమ్ముడుపోక ఎంత నష్టపోతున్నాడు. ఇవన్నీ జీఎస్టీ అధికారులు లెక్కలోకి తీసుకోవడం లేదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. డబ్బు రాక, పోకలు పోను మిగులును లెక్కిస్తున్నారా? లేక ఆదాయం మొత్తం లెక్కలోకి తీసుకుంటున్నారా? అన్నది కూడా చర్చించాల్సిన అవసరం వుంది. సామాన్య వ్యాపారులు జీఎస్టీ రిజిస్రేషన్‌ చేసుకోవాలంటే సాద్యమౌతుందా? అయితే ఏకకాలంలో కర్నాటకలో సుమారు 14వేల మంది చిరు వ్యాపారులకు జిఎస్టీ నోటీసులు పంపినట్లు వారు వెల్లడిస్తున్నారు. తమ వద్ద వున్న జిపేల బోర్టులు తొలగిస్తున్నారు. జిఎస్టీలు కట్టలేమని చెబుతున్నారు. నాలుగేళ్ల తర్వాత లావాదేవీల మీద జిఎస్టీలు వేయడం లో అర్దమేమిటని ప్రశ్నిస్తున్నారు. తము బతకాలా? వద్దా? అని నిలదీస్తున్నారు. ఇదెక్కడి దోపిడీ అని అంటున్నారు. తాము తెచ్చే ప్రతి వస్తువు మీద ముందే అన్ని రకాల పన్నులు చెల్లించిన తర్వాత మళ్లీ ఈ జిఎస్టీ ఏమిటంటున్నారు. అంతే కాకుండా ఆహార పదార్ధాలు, కూరగాయాలు, పండ్లు విడివిడిగా అమ్ముకునే చిరు వ్యాపారులు జీఎస్టీ చెల్లించాల్సిన అసవరం లేదు. కాని జిఎస్టీ అధికారులు నోటీసుల పంపడంపై చిరు వ్యాపారాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ నెల 25న కర్నాకట బంద్‌కు చిరు వ్యాపారులు పిలుపునిచ్చారు. ఇది ఇక్కడి నుంచి దేశ వ్యాప్తంగా పాకే అవకాశం వుంది. ఇప్పటికే ప్రజలు ధరలతో బెంబేలెత్తిపోతున్నారు. మొదట్లో డిజిటల్‌ చెల్లింపులకు ఎలాంటి పన్నులుండవన్నారు. తర్వాత రోజుకు ఏక కాలంలో రెండు వేల కన్నా ఎక్కువ డిజిటల్‌ చెల్లింపులు చేస్తే ఫైన్‌ పడుతుందన చెప్పారు. ఇప్పుడు ఏకంగా చిరు వ్యాపారులకు జిఎస్టీ నోటీసులు పంపించేస్తున్నారు. అసలు చిరు వ్యాపారులు ఏడాదికి లక్షలాది రూపాయలు లాభాలు ఆర్జించే అవకాశం వుందా? లావాదేవీలన్నీ లాభాలౌతాయా? వచ్చిన సొమ్మంతా ఆదాయమౌతుందా? అందులో ముడిసరుకుల ఖర్చులు ఎలా తేల్చుతారు. రూపాయికి ఐదు పైసల లాభం కూడా రాని వ్యాపారాలలో లక్షల ఆదాయం సాధ్యమౌతుందా? కూరగాయల వ్యాపారులు కోట్లు గడిరచినట్లు ఎక్కడైనా సాక్ష్యముందా? పండ్ల వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులు ధనవంతులైనట్లు ఎక్కడైనా చూశారా? అధికారులు సగటు వ్యక్తుల మీద ఇలా పన్నుల మీద పన్నులు వసూలు చేసుకుంటూ పోతే ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు తప్పవు.

రాములమ్మ ఆందోళన…ఎందుకు సంఘర్షణ!

`రాములమ్మ ధైర్యం.. తెలంగాణ నినాదం!

`రాములమ్మ నోట జై తెలంగాణ మాట!

`తెలంగాణకు ఏదో జరిగే అవకాశం కనిపిస్తున్నట్లు కనిపెట్టారా!

`తెలంగాణ మీద మళ్ళీ కుట్రలు మొదలైనట్లు పసిగట్టారా?

`అందుకే జై తెలంగాణ అని గట్టిగా నినదించారా!

`తెలంగాణ ప్రజలు జై తెలంగాణ అని అనాలని సూచించారు.

`గుండెల మీద చేయి వేసుకొని తెలంగాణ నినాదం చేయాలని చెప్పారు.

`తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమ నాయకురాలు రాములమ్మ.

`తెలంగాణ కోసం జీవితం త్యాగం చేసిన పోరాట యోధురాలు.

`వందలాది మంది యువత ఆత్మ బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణ.

`తెలంగాణపై కుట్రలు జరగకుండా అప్రమత్తంగా వుండాలని చెప్పారు.

`రాజకీయంగా ఏదో జరుగుతోందని రాములమ్మ ఆందోళన చెందుతోందా!

`రాజకీయ తెర వెనుక ఏపి శక్తులు తెలంగాణను తెర్లు చేయాలని చూస్తున్నాయా!

`రాములమ్మ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో ఒక్కసారిగా కళకళం సృష్టించాయి!

`కాంగ్రెస్‌ నాయకులు తెలంగాణ నినాదం చేయకపోవడంపై స్పందించారా?

`తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ జై తెలంగాణ అనకపోతే తప్పుడు సంకేతాలు వెళ్లవా!

`జై తెలంగాణ అనడానికి ఇబ్బంది ఏమిటి?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

   షీ ఈస్‌ ది గ్రేట్‌ లీడర్‌ ఆఫ్‌ మోడరన్‌ తెలంగాణ. షీ వాస్‌ స్రగుల్‌ ఫర్‌ తెలంగాణ స్టేట్‌. షీ ఈస్‌ బ్రేవ్‌ లీడర్‌ ఆఫ్‌ది తెలంగాణ. షీ ఈస్‌ వన్‌ ఆఫ్‌ది ప్రొటెక్టర్‌ ఆఫ్‌ తెలంగాణ. యస్‌.. షీ ఈస్‌ వండర్‌ లీడర్‌ ఆఫ్‌ తెలంగాణ. ఈ రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్‌ పార్టీలో జై తెలంగాణ అని నినదించిన ఏకైక నాయకురాలు ఎమ్మెల్సీ రాములమ్మ. ఇంత కాలానికి సూటిగా, స్పష్టంగా అందరి గుండెలు అదిరేలా జై తెలంగాణ అని చెప్పిన ఏకైక నాయకురాలు విజయశాంతి. రాజకీయాల కోసం, ఓట్ల కోసం జై తెలంగాణ అనడం వేరు. విజయశాంతి చెప్పిన ఒక మాట తెలంగాణ వున్నంత వరకు ప్రజలు మర్చిపోనంత గొప్పగా చెప్పారు. హనుమంతుని గుండెల్లో శ్రీరాముడున్నట్లే, ప్రతి తెలంగాణ వాదిలోనూ జై తెలంగాణ నినాదం వుండాలన్నారు. తెలంగాణ వచ్చినా, ఎంత కాలమైనా తెలంగాణను కాపాడుకోవాల్సిన బాద్యత ప్రజలదే అన్నారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ తెలంగాణ నినాదాన్ని మర్చిపోవొద్దన్నారు. తెలంగాణ పదాన్ని గుండెల్లో పెట్టుకొని స్మరించాలని చూసించారు. బోనాల పండుగ సంబరాలలో ఆమె జై తెలంగాణ అని మరోసారి గర్జించారు. తెలంగాణ మొత్తం వినేలా జై తెలంగాణ అని నినదించారు. ఇంత కాలానికి మనసు నిండా నిండిన ఉద్వేగంతో జై తెలంగాణ అని నినదించిన ఏకైక నాయకురాలు విజయశాంతి. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్‌లో జై తెలంగాణ అని ఒక్క విజయశాంతి మాత్రమే అంటున్నారు. విజయశాంతి గొప్పదనం, గొప్ప గుణం ఈ రోజు తెలంగాణ ప్రజలకు మరోసారి తెలిసింది. అప్పుడై, ఇప్పుడైనా, ఎప్పుడైనా తెలంగాణ కోసం మాట్లాడేది ఒక్క విజయశాంతి మాత్రమే అని మరోసారి నిరూపించారు. తెలంగాణపై దుష్టశక్తులు పన్నాగం పన్నుతున్నాయని తెలంగాణ ప్రజలను హెచ్చరించారు. తెలంగాణను వదిలేయలేక, తెలంగాణ మీద ఆదిపత్యం లేక కొంత మంది మళ్లీ కుట్రలు చేస్తున్నారని చెప్పారు. అదీ విజయశాంతి అంటే..ఎందుకంటే ఆమె ఎవరికీ భయపడే నాయకురాలు కాదు. తాను ఏమి చెప్పాలనుకుంటున్నారో చెప్పేస్తారు. ఏది చెప్పారో దానికి కట్టుబడి వుంటారు. ఎందుకంటే ఆమెకు తెలంగాణ అంటే ప్రాణం. ఆమె ప్రతి క్షణం తెలంగాణ కోసమే ఆలోచిస్తుందనే మరోసారి నిరూపించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్‌పార్టీ. తెలంగాణ తెచ్చిన పార్టీ కాంగ్రెస్‌పార్టీ. ఆ పార్టీలోనే తెలంగాణ అనే నినాదం వినిపించకపోతే కాంగ్రెస్‌కు తీరని నష్టం. జై తెలంగాణ నినాదం ఏ ఒక్కరి సొత్తు కాదు. ఏ ఒక్క పార్టీకి పెటెంట్‌ కాదు. జై తెలంగాణ అనేది అన్ని పార్టీల నినాదం. విధానం. అందుకే అన్ని పార్టీలు జై తెలంగాణ అనాలి. లేకుంటే ప్రజలు కూడా ఏదొ ఒక పార్టీకి చెందిన నినాదమని భావించే ప్రమాదముంది. ఆ అవకాశం కాంగ్రెస్‌ పార్టీ కల్పిస్తోంది. అందరూ జై తెలంగాణ అంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎందుకు అనడం లేదు? జై తెలంగాణ అని ఎన్నికల సమయంలో ప్రతి చోట అన్నారు. తెలంగాణ ఇచ్చిన రుణం తీర్చుకుందామని చెప్పారు. తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీయే అని ఎన్నికల సమయంలో అన్నారు. ఇప్పుడు జై తెలంగాణ అనడానికి విచ్చిన ఇబ్బంది ఏమిటని సగటు తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆ మాట చెప్పకపోతే భవిష్యత్తులో పార్టీకి కూడా ఇబ్బందికరమే అని ఆమె గ్రహించారు. అందుకే రాములమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. కాకపోతే తెలంగాణ రాజకీయాల్లో ఏదో జరుగుతోందని ఆమె గుర్తించినట్లున్నారు. అందుకే ఆమె సంఘర్షణ పడుతన్నాట్టున్నారు. అందుకే బోనాల పండుగ సమయంలో అమ్మవారి ఆలయంలో జై తెలంగాణ అని అనాలని అందరికీ చెప్పారు. తెలంగాణ వ్యతిరేక శక్తులు మళ్లీ మొదలయ్యాయని ఆమె సూటిగా చెప్పారు. అంటే తెలంగాణ రాజకీయాల్లోకి ఏపి శక్తులు జొరపడుతున్నాయని ఆమె హెచ్చిరించనట్లే లెక్క బోనాల సందర్భంగా ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. తెలంగాణ విషయంలో ఆమె పడుతున్న ఆందోళన ఆమెలో స్పష్టంగా కనిపించింది. తెలంగాణపై ఏదో కుట్ర జరుగుతోందా? అని ఆందోళన చెందుతున్నారా? అర్ధం కావడం లేదు. కాకపోతే ఏదో ఒక సంఘర్ణణ మాత్రం విజయశాంతిలో వున్నట్లు మాత్రం ఆమె మాటల ద్వారా అర్దమౌతోంది. లేకుంటే ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ ఆమె చేయలేదు. పదేళ్ల కాలంలో కూడా తెలంగాణ కుట్రలు జరుగుతున్నట్లు వెల్లడిరచలేదు. కాని ఇప్పుడు విజయశాంతి తెలంగాణపై ఏదో జరుగుతుందన్న అనుమానం మాత్రం ఆమె వ్యక్తంచేసినట్లున్నారు. ఎందుకంటే తెలంగాణ అనేది రాములమ్మకు ప్రాణం. తెలంగాణ మీద ఒక తల్లికి వుండే మమకారం. తెలంగాణ కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన నాయకురాలు విజయశాంతి. తన సినీ జీవితం ఉచ్చ దశలో వున్నప్పుడు ఆమె తెలంగాణ ప్రజల కోసం వదులుకున్నారు. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు సంపాదించుకునే రంగాన్ని వదిలేసుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి వచ్చిన సమయంలో ఆమెతో సినిమాలు తీయడానికి నిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూలలో వుండేవారు. ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు హీరోలకు సమానమై, పెద్ద పెద్ద సినిమాలు తీయడానికి నిర్మాతలు ఎదురుచూస్తున్న రోజుల్లో తెలంగాణ కోసం అన్నీ వదులుకున్నారు. నా తెలంగాణ ప్రజలు గోస పడుతుంటే, నేను సంతోషంగా వుండడం ఎందుకు అనుకున్నారు? నా ప్రజల కోసమే నా జీవితం అనుకున్నారు. నా ప్రజల తోనే నా జీవన ప్రయాణం అనుకున్నారు. నా ప్రజల ఆర్తిని కోసమే ఉద్యమిస్తానని వచ్చారు. నా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం కోసం నేను సైతం అని వచ్చారు. తెలంగాణ ఉద్యమం కోసం సమిదైనా పరవాలేదనుకొని వచ్చారు. ఎందుకంటే గత అనుభవాలు అనేకం వున్నాయి. ఏపి, తెలంగాణ కలిపిన నాటి నుంచి తెలంగాణ పోరాటం సాగుతూనే వుంది. రెండు రాష్ట్రాలను కలిపిన రోజు నుంచే ఉద్యమం తెలంగాణ ప్రజలు ఉద్యమం సాగించారు. అలా మొదలైన తెలంగాణ పోరాటం ఆమెకు తెలుసు. 1969లో వందలాది మంది విద్యార్ధులు చినిపోయారు. పోలీసు తూటాలకు బలయ్యారు. ఎంతోమంది ఉద్యమ నాయకులు వచ్చారు. కాని తెలంగాణ కల నెరవేరలేదు. ప్రజల్లో ఆకాంక్ష తీరలేదు. తెలంగాణ కళ్లారా చూడాలనుకున్న 1969 రోజులు నిజం కాలేదు. అయినా తెలంగాణ ఉద్యమం ఆగలేదు. అరవై సంవత్సరాలుగా రగులుతున్నా కాని, తెలంగాణ రాలేదు. అందుకే నా ప్రజల కోసం నాజీవితం అంకితమని రాములమ్మ వచ్చారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో తొలిసారి రaాన్సీ రాణి కదన రంగంలోకి దూకినట్లు తెలంగాణ ఉద్యమంలోకి రాములమ్మ వచ్చారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో సదా లక్ష్మి లాంటి వారు కనిపించినా, ఉద్యమ రంగంలో ఒక్కరైపోరాటం చేయలేదు. కాని విజయశాంతి ధీర వనితగా మలితరం ఉద్యమానికి ఊపిరి పోశారు. లక్షలాది మంది తెలంగాణ వాదులను కదిలించారు. తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు. తెలంగాణ కోసం ఆమె సినీ జీవితాన్ని, కేరిర్‌ను వదులుకున్నారు. తాను సినిమా సంపాదనంతా తెలంగాణ కోసం ధారపోశారు. పబ్లిక్‌ మీటింగులకు ఎంతో ఖర్చు చేశారు. అయినా ఆమె ఏనాడు బాధపడలేదు. నా తెలంగాణ కోసమనుకున్నారు. నా తెలంగాణ భవిష్యత్తు తరాల సంతోషం కోసం ఖర్చు చేస్తున్నానకున్నారు. సినిమాలన్నీ పక్కన పెట్టారు. ఒక్క తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా బతుకుతున్నారు. పద్నాలుగేళ్లు సుధీర్ఘ ఉద్యమ ప్రయాణం సాగించారు. వ్యక్తిగత జీవితాన్ని కూడా ఆమె తెలంగాణ ఉద్యమానికి అంకితం చేశారు. క్షేత్ర స్ధాయిలోనే కాదు, పార్లమెంటులో కూడ ఆమె చేసిన పోరాటం దేశమంతా చూసింది. అలా తెలంగాణ సాదనలో ముందున్న ఏకైక మహిళా నాయకురాలు విజయశాంతి. అలాంటి నాయకురాలు ఇప్పుడు నా తెలంగాణ మళ్లీ కుట్రల పాలయ్యేలా వుందని ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా వుండాలని కోరుతున్నారు. రాజకీయాల్లో ఎక్కడో తేడా కొడుతోందని గమనించినట్లున్నారు. అప్పుడు తెలంగాణ కోసం కొట్లాడాం..ఇప్పుడు తెలంగాణను రక్షించుకునేందుకు కొట్లాడేందుకు సిద్దంగా వుండాలన్నారు. అంటేనే ఏదో రాజకీయ తెరవెనుక జరుగుతోందని తెలుసుకున్నారు. అందుకే తెలంగాణ రక్షణ కోసం రాములమ్మ మళ్లీ రంగలోకి దిగారు. తెలంగాణను కాపాడుకునే పోరాటాన్ని చేయడానికి సిద్దంగా వున్నారు.

పంతుళ్లు..వ్యాపారాలు!?

`’’నేటిధాత్రి’’ పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు!

`రాష్ట్ర వ్యాప్తంగా ‘‘నేటిధాత్రి’’ ప్రతినిధులు సేకరించిన ఆసక్తికరమైన అంశాలు.

`లెక్కలు చెప్పక చిట్టి లెక్కలేసుకుంటున్నారు?

`చదువు చెప్పమంటే పైసలు లెక్కలు చూసుకుంటున్నారు.

`బడి వేళల్లో కూడా చిట్టీల ముచ్చట్లు పెడుతున్నారు.

`వానా కాలం సదువులకు పిల్లలు అలవాటు పడుతున్నారు.

`బడికి కూడా పోకుండా వ్యాపారాలు చేసుకుంటున్న పంతుళ్లున్నారు.

`బడికిపోయినా తూతూ మంత్రంగా పాఠాలు చెబుతున్నారు.

`సిలబస్‌ అయిపోయిందని చేతులు దులుపుకుంటున్నారు.

`సగానికి పైగా పంతుల్లు చేస్తున్నది ఇదే!

`వ్యాపారం చేసుకోవడం తప్పు కాదని బకాయిస్తున్నారు.

`ఉద్యోగులు లంచాలు తీసుకుంటే తప్పు లేదా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.

`అదనంగా ఆదాయం మాకేమైనా వుందా? అంటున్నారు.

`అన్నామలై, అలగప్పా సర్టిఫికేట్‌ ఉపాధ్యాయులు కొందరు చదువు చెప్పడం లేదు!

`2010కి ముందు అప్పాయింట్లైన టీచర్లు రకరకాల వ్యాపారాలు సాగిస్తున్నారు.

`ఆ తర్వాత అప్పాయింట్‌ అయిన టీచర్లు చదువు బాగానే చెబుతున్నారు.

`గురుకుల, రెసిడెన్షియల్‌ టీచర్లు బాగా పని చేస్తున్నారు.

`ప్రాధమిక, మాధ్యమిక ఉపాధ్యాయులు చిట్టిలు ఎక్కువగా నడుపుతున్నారు!

`ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు రియల్‌ వ్యాపారాలు సాగిస్తున్నారు!

`పల్లెల్లో టీచర్లు ఎవరూ వుండడం లేదు.

`పని చేసే చోట నివాసం ఎవరూ వుండడం లేదు.

`సొంత ఊర్లు వదిలిపెట్టి పక్కనున్న నగరాలలో గృహాలు నిర్మించుకున్నారు.

`చాలా మంది హైదరాబాద్‌ లో నివాసం వుంటున్నారు.

`నిత్యం హైదరాబాదు నుంచి వచ్చి వెళ్లిపోతున్నారు.

`లెక్చరర్లు గౌరవంగా ఉద్యోగాలు చేస్తున్నారు!

`ప్రొఫెసర్లు విద్యా వ్యవస్థ మీద ఆందోళన చెందుతున్నారు!

హైదరాబాద్‌,నేటిధాత్రి:                              టీచర్లు చిట్టీలు..ఉద్యోగులు లంచాలు. అవును ఈ చర్చ ఇప్పటిది కాదు. ఇప్పుడే పుట్టుకొచ్చింది కాదు. కాని ఎప్పటికీ మానుకోని వ్యవసనంగా మారిపోయింది. రాష్ట్రంలో చాలా మంది టీచర్లు చిట్టీలు, ఫైనాన్స్‌, రియల్‌ వ్యాపారాలు విరివిగా సాగిస్తున్నారు. మాయ మాటలు రాని కొంత మంది టీచర్లు తప్ప, చాలా వరకు చదువు చెప్పడం మానేశారు. వ్యాపారాలలో మునిగి తేలుతున్నారు. నిజానికి టీచర్లైనంత మాత్రాన వ్యాపారాలు సాగి ంచొద్దన్నదేమీ లేదు. కాని ప్రభుత్వ జీతం తీసుకుంటూ, గురుతర బాద్యతను వదిలేసి వ్యాపారాలు సాగిస్తున్నారు. ఇదే అసలైన చిక్కు. బతకలేక బడిపంతులైనా కావాలని గతంలో అనుకునేవారు. కాని ఇప్పుడు బతకనేర్వాలంటే చాలు బడి పంతులైతే చాలు అనుకుంటున్నారు. ఇలా వ్యాపారాలు సాగిస్తున్న వారిలో యువకులైన ఉపాద్యాయులు కాకుండా, సీనియర్‌ టీచర్లు ఎక్కువగా ఇలాంటి వ్యాపారాలు సాగిస్తున్నారు. జూనియర్‌ టీచర్ల మీద పెత్తనం చేస్తూ, వారి చేత చిట్టీలు కట్టిస్తూ, భూములుకొనుగోలు చేయిస్తున్నారు. ముఖ్యంగా రెండు వేల సంవత్సరానికి అటూ, ఇటు టీచర్లైన వారే ఈ వ్యాపారులు ఎక్కువగా వ్యాపారాలు సాగిస్తున్నారు. వారిలో ముఖ్యంగా అలగప్పా యూనివర్సిటీ నుంచి బిఈడీ చేసిన కొందరు టీచర్లు ఈ వ్యాపారాలు విరివిగా సాగిస్తున్నారు. చదువు చెప్పడం వారికి ఇష్టం లేదు. చదువు చెప్పే ఓపిక వారిలో లేదు. చదువు చెప్పాలన్న దృక్పధం కూడా వారిలో లేదు. వాళ్లలో చాలా మంది హెడ్‌ మాస్టర్లయ్యారు. స్కూల్‌ను చేతుల్టో పెట్టుకొని ఆడిస్తున్నారు. ఇలా అలగప్పా యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్‌ టీచర్లుగా పనిచేస్తున్న వారు చాల మంది ఇదే వ్యాపారాలను ఎంచుకున్నారు. అంతే కాకుండా హిందీ టీచర్లుగా పని చేస్తున్న వారు ఈ మూడు వ్యాపారాలలో మునిగిపోతున్నారు. ఇక్కడ విశేషమేమిటంటే మితగా సబ్జెక్టులు నేర్పే వారు మాత్రం ఈ వ్యాపారాలు చేయడం లేదని తేలింది. ముఖ్యంగా తెలుగు టీచర్లు ఈ వ్యాపారాలలో ఎక్కువగా లేరు. ముఖ్యంగా అలగప్పా యూనివర్సిటీ నుంచి పట్టా పొంది టీచర్లు అయిన వారికి సబ్జెక్టు మీద పెద్దగా పట్టు లేదు. హిందీ బోధించే టీచర్లులో కూడా సరైన స్కిల్‌ లేదు. అందుకే తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ స్కూళ్లలో చదవే విద్యార్ధులకు ఈ రెండు సబ్జెక్టులలో బోర్డర్‌ మార్కులు దాటడం లేదు. మిగతా సబ్జెక్టులలో ప్రభుత్వ పాఠశాల పిల్లలు బాగానే రాణిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అవసరం వుంది. ఈ సమయంలో టీచర్లు అయిన వారు చెప్పే విషయాలు గమ్మత్తుగా వుంటాయి. మాకు జీతం తప్ప మరే మార్గం లేదంటారు. అంటే ఉద్యోగుల్లా లంచాలు లేవని దాని అర్దం. అందుకే వ్యాపారాలు సాగిస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఇలా వ్యాపారాలు సాగించే టీచర్లు యూనియన్‌ నాయకులకు అత్యంత ఆప్తులుగా వుంటారు. ఎందుకంటే యూనియన్‌ కార్యకలాపాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుంటారు. యూనియన్‌లో మండల స్దాయి నుంచి, జిల్లా, రాష్ట్ర స్దాయి పదవులు చేపడుతూ నాయకులుగా చెలామణి అవుతుంటారు. పైగా టీచర్లలలో అనేక యూనియన్లు వున్నాయి. ఇవి కూడా వారికి బాగా కలిసి వస్తోంది. దాంతో బోధన తప్ప అన్నీ చేస్తున్నారు. విద్యా వ్యవస్ధను భ్రష్టుపట్టిస్తున్నారు. ఎప్పుడైతే అలగప్పా యూనివర్సీటీ సర్టిఫికెట్లు రద్దు తర్వాత రాష్ట్ర స్ధాయిలో శక్షణ పొందిన వాళ్లు నిపుణులుగా విద్యాబోధన చేస్తున్నారు. అయితే వారు కూడా సీనియర్ల దారిలో నడుస్తున్నారు. బోధన సాగిస్తూనే ఇతర వ్యాపారాల మీద వ్యాపకాలు నిర్వహిస్తున్నారు. పిల్లలకు చదువు చెప్పాల్సిన సమయంలో స్కూళ్లో కూడా సెల్‌ఫోన్లలోనే వ్యవహారమంతా నడిపిస్తుంటారు. ఆన్‌ పేమెంట్లు వచ్చిన తర్వాత స్కూల్‌ సమయంలోనే ఈ వ్యాపారాలు విరివిగా సాగిస్తున్నారు. ఇంతకు ముందు క్యాష్‌లతో పని కావడంతో, స్కూల్‌ సమయం అయిపోయిన తర్వాత వ్యాపారాలు సాగించేవారు. కాని ఎప్పుడైతే ఆన్‌లైన్‌ పేమెంట్లు వచ్చాయో అప్పటి నుంచి స్కూళ్లలోనే వ్యాపారాలు మొదలు పెడుతున్నారు. ఇటు చిట్టీలు, ఫైనాన్సులు మిత్తిలు, భూముల ముచ్చట తప్ప మరో పని లేకుండాపోయింది. నాలుగు ముక్కలు పుస్తకంలోవున్నది వున్నట్లు చదవడం, పిల్లల్ని చదువుకొమ్మని చెప్పడం తప్ప మరేం పనులుచేయడం లేదు. విద్యార్దులే గైడ్‌లను ఫాలో అవుతూ చదువుకుంటున్నారు. ముక్కీ మూలిగీ అన్నట్లు పాసౌతుతున్నారు. ఇప్పటికైనా సరే విద్యా వ్యవస్ధ బాగు పడాలంటే టీచర్లు స్కూల్‌కు వచ్చిన తర్వాత సెల్‌ ఫోన్‌ వినియోగించకుండా ఆదేశాలు జారీ చేయాలి. ప్రతి టీచర్‌ స్కూల్‌కు ఖచ్చితంగా హజరు కావాలని ఆదేశాలు జారీ చేయాలి. అప్పుడే విద్యా వ్యవస్ధ బాగు పడుతుంది. పల్లెల్లో పనిచేసే చాలా మంది టీచర్లు ఊర్లలో వుండడం లేదు. ఒకప్పుడు టీచర్లు ఎక్కడికి ట్రాన్స్‌ఫర్లు అయితే అక్కడికి వెళ్లి నివాసం వుండేవాళ్లు. కాని ఇప్పుడు వంద కిలోమీటర్ల దూరమైనా సరే టీచర్లు పట్టణాలలోనే వుంటున్నారు. నిత్యం హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వరకు కూడా టీచర్లు వస్తూ వెళ్తున్నారు. కాని చదువు చెప్పే చోట నివాసం వుండడం లేదు. తమ పిల్లల చదువు కోసమని కొందరు. వాళ్ల పిల్లలు మాత్రం స్కూల్‌ దశనుంచే కార్పోరేట్‌ స్కూళ్లలో చదవిస్తున్నారు. దాంతో హైదరాబాద్‌ చుట్టపక్కల వంద కిలోమీటర్ల దూరంలో పనిచేసే చోట వున్నా వెళ్లి వస్తున్నారు. విచిత్రమేమిటంటే సొంత ఊరి స్కూల్‌లో పనిచేస్తున్నా సరే, నిత్యం హైదరాబాద్‌కు వెళ్తున్నారు. పక్కనే వుండే పట్టణాల్లో సొంత ఇండ్లు కట్టుకొని అక్కడే నివాసముంటున్నారు. ఆలస్యంగా రావడం, లేటౌతుందని వెళ్లిపోవడం పరిపాటిగా మారిపోయింది. కొందరు టీచర్లు ట్రైన్‌లలో వెళ్తున్నారు. మరి కొంత మంది టీచర్లు నలుగురు కలిసి కార్లలో వెళ్తున్నారు. ఎందుకంటే జీతాలు కూడా అంతే స్ధాయిలో వున్నాయి. వ్యాపారాలతో మరింత సంపాదన అందుతోంది. మొత్తం మీద సమయంతా ప్రయాణాలు, వ్యాపారాలలో గడుపుతున్నారు. పాఠాలు చెప్పడం మర్చిపోయారు. రేపటి తరాన్ని తయారు చేయాల్సిన గురు స్ధానంలో వుంటూ పాఠాలు చెప్పడం మానేశారు. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల కోసం ప్రయత్నాలు సాగిస్తుంటారు. కాసుల కక్కుర్తితో చదువు చెప్పాల్సిందిపోయి, వ్యాపారాలు సాగిస్తున్నారు. జిల్లాలలో అక్రమ వడ్డీ వ్యాపారాలు సాగిస్తున్నారు. టీచర్లు పోటీ పడి మరీ చిట్టీల వ్యాపారాలు, వడ్డీ వ్యాపారాలు సాగిస్తున్నారు. జిల్లాల్లో ఉపాద్యాయులు పోటీలు పడి మరీ చిట్‌ ఫండ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. తమ బంధువుల పేరుతో ఫైనాన్స్‌ వ్యాపారాలు సాగిస్తున్నారు. నిజానికి చిట్‌ ఫండ్‌ వ్యాపారం నిర్వహించాలంటే 1982 చిట్‌ ఫండ్‌ ఆక్ట్‌ ప్రకారం నిర్వహించాలి. అందుకు జిల్లా రిజిస్ట్రార్‌ శాఖనుంచి అన్ని అనుమతులు పొందాలి. కాని అవేవీ వీరికి పట్టడం లేదు. ప్రజల అవసరాలను ఆసరా చేసుకొని ఇష్టానుసారం అదిక వడ్డీకి రుణాలు ఇస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారులకు రోజు వారి ఫైనాన్సులు నడుపుతున్నారు. ఇలా పల్లె, పట్ణణం అనే తేడా లేకుండా ఉపాద్యాయులు ఈ రకమైన దందాలు నిర్వహించుకుంటూ, పిల్లలకు పాఠాలు చెప్పడం మర్చిపోయారు. విద్యా వ్యవస్ధను భ్రష్టు పట్టిస్తున్నారు. ఇదిలా వుంటే రియల్‌ వ్యాపారాల్లోనూ టీచర్లదే హవా అని తెలుస్తోంది. వెంచర్లలో పెట్టుబడులు పెట్టే వారు కొందరైతే, వ్యాపారం పేరుతో పిల్లల తల్లిదండ్రులు, ఇతరులకు ప్లాట్లు అమ్మకాలు సాగిస్తున్నారు. సహజంగా టీచర్లు అంటే ఒక నమ్మకం. ఒకభరోసా. ఇదే వారికి వరంగా మారింది. ముఖ్యంగా యూనియన్‌ కార్యాకలాపాలు నిర్వహించే ఉపాద్యాయులే ఇలాంటి వ్యాపారాలు ఎక్కువగా సాగిస్తున్నారు. ఇలా సంపాదించిన వాళ్లు ఎమ్మెల్సీ లాంటి ఎన్నికల్లో పోటీ చేసిన వారున్నారు. వీటితోపాటు ప్రైవేటు కాలేజీలు, విద్యా సంస్ధలకు పిఆర్వోలుగా పనిచేస్తున్నవారున్నారు. ప్రైవేటు విద్యా సంస్ధలలో బాగస్వాములుగా వున్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి దోహడపడాల్సిన వాళ్లు, ఇలా ప్రైవేటు స్కూళ్లను బినామీల పేరుతో ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రభుత్వ బడులకు రావాల్సిన పిల్లలను తమ ప్రైవేటు స్కూళ్లకు వెళ్లేలా చేస్తున్నారు. ప్రభుత్వ విద్యకు తూట్లు పొడుస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య పెంచాల్సిన బాద్యతను గాలికి వదిలేస్తున్నారు. ఇలాంటి వారు ఉపాధ్యాయ వృత్తికే తీరని మచ్చగా మిగులుతున్నారు. అలాంటి ఉపాద్యాయులపై వరుస కథనాలు మీ నేటిధాత్రిలో…

జన సునామి!

జనం..జనం..జగన్‌ ప్రభంజనం.

-ఏడాదిలోనే కూటమికి ముచ్చెమటలు.

-రెచ్చగొట్టి మరీ జగన్‌ను బైటకు రప్పించిన కూటమి.

-పరదాల చాటు బతుకని నిందించిన కూటమి.

-జగన్‌ బైటకు వస్తే భరించలేకపోతున్న తెలుగు దేశం.

-పరామర్శలకే ఇంత జనం వస్తే పోరాటాలకు ఎంత మంది వస్తారో!

-సభలు పెడితే ఎలా వుంటుందో!

-ఊహలకందని కలలు పట్టపగలు చూపిస్తున్న జగన్‌.

-కూటమికి నిద్ర లేని రాత్రులే అంటున్న జగన్‌.

-అదేం జనం..ఎందుకంత ప్రజాభిమానం.

-జగనంటే ఎందుకంత మమకారం.

-జగన్‌ను చూడడానికి ఎగబడుతున్న జనం.

-ఎటు చూసినా ఇసుకేస్తే రాలనంత జనం.

-కట్టడి చేయలేక చేతులెత్తేస్తున్న యంత్రాంగం.

-జగన్‌ బయటకొస్తున్నాడంటే చాలు..ఊర్లన్నీ జనసంద్రం.

-చెక్‌ పోస్ట్‌లు ఎన్ని పెట్టినా తోసుకొస్తున్న జనం.

-కాలి నడకన కదులుతున్న జనం.

-పొలాలు, తోటలను దాటు కుంటూ వస్తున్న అభిమానం.

-జనాగ్రహానికి, జగన్‌ అభిమానం తోడైంది.

-జగన్‌కు జనం బ్రహ్మ రథం పడుతోంది.

హైదరాబాద్‌,నేటిధాత్రి:                         ఏం జనం..ఏం జనం..ఉప్పెనలా వస్తున్నారు. వెల్లువను తలపిస్తున్నారు. ఉరలెక్తుకుంటూ వస్తున్నారు. నిర్భంధాలను చేధించుకుంటూ వస్తున్నారు. తమ అభిమాన నాయకుడు జగన్‌ చూసేందుకు లక్షల మంది ఎగబడుతున్నారు. ఇలా గతంలో ఏ నాయకుడి కోసం జనం వచ్చింది లేదు. ఎంతటి విపత్కరమైన పరిస్ధితులనైనా ఎదుర్కొంటామని ముందుకు రాలేదు. ఇదేం అభిమానం. ఒక నాయకుడి మీద ప్రజలు ఇంతగా మమకారం పెంచుకునే రోజులు ఇంకా వున్నాయా? నిజంగానే అది జనమేనా…పూల వనమా? అన్నట్లు జెండాలు పట్టకొని జనం వస్తుంటే పూల వనాలు నడుచుకుంటూ వస్తున్నట్లున్నాయి. శవమెత్తిని జన తాండవం కనిపిస్తోంది. జనమంతా ఒక్కసారిగా రోడ్ల మీదకు వచ్చి తండోప తండాలుగా కదులుతుంటే జన జాతరను తలపిస్తోంది. జగన్‌ను దీవించేందుకు ప్రతి ఇంటి నుంచి ఒకరు వచ్చినట్లు కనిపిస్తోంది. ఇదేం.జనం..ఇదేం అభిమానం.. అదేం మమకారం..ఇంతలా జగన్‌ కోసం జనం ఎందుకు పరిపతిస్తున్నారు. జగన్‌ను చూసి ఎందుకు మురిసిపెతున్నారు. ఒక్కసారి జగన్‌ను చూస్తే చాలని ఎందుకనుకుంటున్నారు. జగన్‌ కొత్తగా వచ్చిన నాయకుడు కాదు. ఈ సారే జనం ముందుకు రావడం లేదు. 2010 నుంచి జనంలోనే వుంటున్నాడు. దివంగత వైఎస్‌ మరణించిన తర్వాత ఆయన ఇంటిలో వున్నది తక్కువ. జనంలో వున్నదే ఎక్కువ. ఓదార్పు యాత్రపేరుతో ఊరూరు జగన్‌ తిరిగాడు. తర్వాత జరిగిన ఎన్నికల సమయాల్లోనూ వస్తున్నాడు. 2017లో పాదయాత్ర చేపట్టారు. ఊరూ వాడ, రాష్ట్ర మంతా తిరిగారు. జనం ముందుకు వచ్చి, ప్రజలకు భరోసా కల్పించారు. 2019 ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు. కాని 2024 ఎన్నికల్లో ఊహించని విధంగా పరాజయం పాలయ్యారు. ఎన్నికల ముందు జరిగిన ఎన్నికల సభలకు జనం లక్షలాదిగా హజరయ్యారు. జగన్‌ ఎన్నికల సభలన్నీ విజయవంతమయ్యాయి. కాని జగన్‌ ఓడిపోయారు. ఏపిలో ప్రభుత్వం మారి సరిగ్గా ఏడాది పూర్తవుతోంది. ఇప్పుడు జగన్‌ ప్రజల కోసం అడుగు పెడుతున్నారు. అ ంతే జనం తండోపతండాలుగా ఆయన కోసం వస్తున్నారు. ఆయనతో కలిసి సాగుతున్నారు. జగన్‌ చూడాలిన ఉవ్విల్లూరుతున్నారు. అది ఎలా వుందంటే జనం, జనం ప్రభంజనం అన్నట్లు వుంది. జగనంటే జనానికి ఎందికింత అభిమానం అనే ప్రశ్న అందరిలో ఉత్పన్నమయ్యేలా వుంది. జగన్‌ను చూడడానికి ఇంతగా ఎతబడడానికి కారణం కూడా ఎవరికీ బోధపడడడం లేదు. సహజంగా ఓటమి పాలైన పార్టీ నాయకులు ఏడాది కాలంలో జనంలోకి వస్తే ఇంతటి ప్రజాదరణ ఏ నాయకుడికి దక్కలేదు. దేశంలో ఏ నాయకుడు కోసం ఇలా జనం ఎగబడి రాలేదు. నిజానికి అవి సభలు కాదు. ర్యాలీలు కాదు. కేవలం ఓదార్పులు. రైతుల కోసం, చనిపోయిన పార్టీ నాయకుల కుటుంబాలను పరామర్శించడానికి జగన్‌ వెళ్తుంటేనే ఇంతలా జనం ఊర్లకు ఊర్లు దాటి, ఎంత దూరమైన వాస్తున్నారంటే సామాన్యమైన విషయం కాదు. అంతే కాదు పోలీసుల నిర్భంధాలను చేదించుకుంటూ వాగులు, వంకలు దాటుకుంటూ, కొండలు ఎక్కి దిగితూ వస్తున్నారంటే మామూలు విషయం కాదు. రోడ్లపై జగన్‌ను చూసేందుకు వెళ్లే జనాన్ని కట్టడి చేస్తున్నారని తెలిసి, పొలాల గట్లపైన, తోటల మధ్య నుంచి వెళ్తున్నారు. జగన్‌కు జై కొడుతున్నారు. ఇలా వస్తున్న జనాన్ని చూసియంత్రాంగం కూడా చేతులెత్తేయక తప్పడం లేదు. జగన్‌ బైటకొస్తే ఊర్లన్నీ జనసంద్రాలౌతున్నాయి. పల్లెల్లో ఎక్కడ చూసినా జన నినాదమే వినిపిస్తోంది. పుట్టల్లో నుంచి చీమలు వచ్చినట్లు జనం జగన్‌ నినాదాలు చేసుకుంటూ, అలుపు, సొలుపు లేకుండా వస్తున్నారు. జగన్‌కు మేమున్నామని ధైర్యం నింపుతున్నారు. జగన్‌ తమకోసమున్నాడని సంబరపడుతున్నారు. జగన్‌ను చూసిన ఆనందంలో పరవశించి పోతున్నారు. ఎక్కడికక్కడ చెక్‌ పోస్టులు పెట్టినా సరిపోవడం లేదు. ఎక్కడికక్కడ కాలి నడకన కూడా జనం వెళ్లి తమ నాయకుడిని చూడడం అనేది గతంలో కనిపించేది. ఇప్పుడు జగన్‌ కోసం జనం అలా వెళ్లడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏడాది కాలంలోనే జగన్‌ కూటమి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అయితే ఇక్కడొక విషయం చెప్పుకోవాలి. నిజానికి జగన్‌ కూటమి ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామనే అనుకున్నారు. అందుకే ఆయన ఏడాది కాలంగా ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు, ఆరోపణలు చేయకుండా వుంటున్నారు. వైసిపి నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నా చూద్దాం? ఇంకా ఏన్ని నిర్భందాలు పెడతారో అని అనుకుంటూనే వున్నారు. కాని జగన్‌ బైటకు రాలేదు. జగన్‌ పిరికి వాడంటూ, ప్యాలెస్‌ చుట్టూ కంచెలు ఏర్పాటు చేసకున్నారంటూ తెలుగుదేశం, జనసేన నాయకులు పదే పదే విమర్శిస్తూ వుండేవారు. వాటిని జగన్‌ ఎప్పుడూ పట్టించుకోలేదు. దాంతో పదే పదే పరదాల చాటు నాయకుడు జగన్‌ అంటూ ఇటీవల ఎద్దేవా చేయడం మరీ విపరీతతం చేస్తూ వస్తున్నారు. జగన్‌ది పరదాల చాటు బతుకంటూ నిందించడం మొదలు పెట్టారు. ఒక్కసారిగా జగన్‌ బైటకు రావడంతో తెలుగుదేశం పార్టీ తట్టుకోలేకపోతోంది. తెలుగుదేశం శ్రేణులకు ముచ్చెమటలు పడుతున్నాయి. జగన్‌ పరామర్శలకు వస్తేనే ఇంత జనం వస్తే, ఇక ఆయన పాదయాత్ర చేయాలనుకుంటున్నారు. ఆ సమయంలో పరిస్దితి ఎలా వుంటుందో ఊహించుకుంటేనే కూటమి నాయకులకు తడిసిపోయేలా వుంది. ఇప్పుడే కూటమి పాలకులకు ఊహలకందని కలలు పట్టపగలే వచ్చేలా చేస్తున్నాడు. అనవసరంగా జగన్‌ను కెలికి తప్పు చేశామన్న భావన కలిగేలా చేశాడు. కూటమికి నాయకులకు నిద్రలేని రాత్రులు ఇప్పటి నుంచే మొదలైనట్లు కనిపిస్తోంది. ఏడాది పాలన తర్వాత కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో పెరుతున్న వ్యతిరేకత, జనాగ్రహానికి జగన్‌ అబిమానం తోడైంది. జగన్‌కు జనం బ్రహ్మరథం పడుతోంది. అయితే పాలకులెప్పుడూ తమకు వ్యతిరేక నినాదాలు వినలేరు. ప్రతిపక్షాలు ఎదుగుతుంటే చూడలేరు. ప్రతిపక్షాలను అణిచి వేయకుండా వుండలేరు. నిర్భంధాల నుంచి ఎన్ని పాఠాలు నేర్చుకున్నా పాలకులు మారరు. ప్రశాంతంగా ప్రతిపక్షాలను రాజకీయాలు చేసుకోనివ్వరు. ప్రతిపక్షాలు పాలకపక్షాల మీద పై చేయి సాధించడం తట్టుకోలేరు. రాజరికమైనా,ప్రజాస్వామ్యమైనా సరే ప్రశ్నను పాలకులు వినలేరు. ప్రశ్నించేవారిని చూసి సహించలేరు. రాజులు తమ సామంత రాజుల నుంచి నిరసన ఒప్పుకోరు. ప్రజాస్వామ్యంలో పాలక పక్షం ప్రతిపక్షం ఎదుగుతుంటే చూడలేరు. నిర్భంధం నుంచే ఏ పార్టీ అయినా సరే పాలక పక్షమౌతుంది. ఆ సంగతి తెలిసి కూడా నిర్భంధాలను విధించకుండా ఏ పాలకుడు వుండలేరు. ప్రపంచమంతా ఇదే అనుసరిస్తుంది. చరిత్రలో ఎన్ని సాక్ష్యాలున్నా పట్టించుకోరు. జనంలోకి జగన్‌ రావడాన్ని కూటమి ప్రభుత్వం సహించలేకపోతోంది. దాంతో ప్రజల నుంచి కూడా ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. గతాన్ని కూడా ఓసారి మననం చేసుకోవాలి. గత ప్రజాస్వామ్య స్పూర్తి ఈ మధ్య మరింత దెబ్బతింటోంది. జగన్‌ ప్రజల్లోకి వెళ్తున్నారు. అడుగడుగునా జగన్‌కు ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. జగన్‌ చూడడం కోసం జనం ఎగబడుతున్నారు. అంటే ఎంతో నిర్భంధం వుంటే తప్ప ఇలాంటి పరిస్ధితులు ప్రజాస్వామ్యంలో చూడలేం. జగన్‌ కాలు బైట పెడితే చాలు జనం తండోపతండాలుగా వేలల్లో వస్తున్నారు. జగన్‌ వస్తున్నాడని తెలిస్తే మూడురోజుల ముందు నుంచే ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఈ మధ్య జగన్‌ గుంటూరులోని ఓ గ్రామానికి వెళ్తుంటే అడుగుగడునా సుమారు 84 కిలోమీటర్ల పొడువునా జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇది కూటమి ప్రభుత్వానికి ఆశనిపాతంలా మారింది. నిన్న జగన్‌ చిత్తూరు జిల్లాలోని బంగారు పాలెంకు వెళ్లారు. అక్కడ జగన్‌ వెంట 500 మందికి మించకుండా వుండాలని ప్రభుత్వం షరతుపెట్టింది. వేలాది మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసింది. ప్రజలు కొండలు, గుట్టలు ఎక్కి మరీ వచ్చారు. గుంటూరు పర్యటనలో వేలాదిగా తరలిని జనం, ఇప్పుడు లక్షల్లోకి చేరుకుంటోంది. జనం ప్రభంజనం కనిపిస్తోంది. నిజం చెప్పాలంటే జగన్‌ను అలా వదిలేస్తే పోయేది. ప్రజలు ప్రతిపక్షంగా జగన్‌ తనపాత్ర పోషించేందుకు ప్రజల్లోకి వెళ్లొద్దని పాలకులు నిర్ణయం తీసుకొని నిర్భంధాల విధిస్తే పరిస్ధితి ఇలాగే వుంటుంది. చివరికి ఇది ఆదిపత్య రాజకీయాలే కాదు, కక్షపూరిత రాజకీయాలకు దారి తీస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదికాదు. పాలక, ప్రతిపక్షాల మధ్య రాజకీయ మాటల సంవాద సమరం వుండాలే కాని, నిర్భంధం వుండొద్దు. వుంటే రియాక్షన్‌ ఇలాగే వుటుంది. అక్కడ వుంది జగన్‌ మరి.

పని చేసేది లేదు..ప్రజా సేవ చేస్తున్నది లేదు!?

`ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.

`రాజకీయ ముసుగులో ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు.

`ప్ర్రజాసేవ గాలికి..రాజకీయాలు స్వార్థానికి!

`ఎందుకు గెలిచామన్నది వదిలేస్తున్నారు.

`ప్రజలెందుకు గెలిపించారన్నది ఎప్పుడో మర్చిపోయారు.

`ప్రజా ప్రతినిధులు తమ కర్తవ్యాలను మూలన పడేస్తున్నారు.

`వివాదాలు ముందేసుకొని కాలయాపన చేస్తున్నారు.

`ప్రజల దృష్టి మళ్లించి మూటలు వెనకేసుకుంటున్నారు.

`ఆ పార్టీ మీద ఈ పార్టీ, ఈ పార్టీ మీద ఆ పార్టీ..

`నిత్య రాజకీయ ప్రకంపనలు..అవినీతి ఆరోపణలు.

`పార్టీల స్వార్థం.. లేని పొత్తుల రాజకీయం!

`నాయకుల మాటలకు హద్దూ, బద్దు లేదు.

`కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ తో పొత్తని బిజేపి అంటుంది?

`బిఆర్‌ఎస్‌, బిజేపి పొత్తని కాంగ్రెస్‌ అంటోంది?

`కాంగ్రెస్‌, బిజేపి లు కలిసి నాటకాలాడుతున్నాయని బిఆర్‌ఎస్‌ ఆరోపిస్తుంది?

`ఉన్నవే మూడు పార్టీలు?

`జాతీయ పార్టీల మధ్య పొత్తలు అసాధ్యం!

`జాతీయ, ప్రాంతీయ పార్టీల పొత్తులు సహజం.

`ఒకరితో ఒకరికి రాజకీయ అవసరం.

`రహస్య ఒప్పందాలు సరే..లేని సంబంధాలపై రభసలెందుకు?

`ప్రజలను గందరగోళంలో పడేయడమెందుకు?

హైదరాబాద్‌,నేటిధాత్రి:                          రాను రాను రాజకీయాలు ఎటు పోతున్నాయో ఎవరికీ అర్దం కావడం లేదు. అసలు రాజకీయాలు ప్రజా శ్రేయస్సు కోసమున్నాయో? లేక నాయకుల కోసం వున్నాయో? తెలియకుండాపోతున్నాయి. రాజకీయ పార్టీల వైఖరి ఎవరికీ అంతు పట్టకుండాపోతోంది. ఎవరు ఎవరిపై ఎలాంటి విమర్శలు చేస్తుంటారో వారికే అవగాహన కరువౌతోంది. ముఖ్యంగా సోషల్‌ మీడియా పెరిగిన తర్వాత నాయకులు ఇచ్చే లీకులు, ప్రకటనలు మరింత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఇక పార్టీల విషయానికి వస్తే ఏ పార్టీ తన సొంత పార్టీ వ్యవహారాలకన్నా ఇతర పార్టీల వైఖరి, అడుగుల గురించి ప్రస్తావిస్తూ పోవడం వింతగా వుంది. పైగా తెలంగాణలో రాజకీయాలన్నీ సహజంగా అధికార కాంగ్రెస్‌ పార్టీ చుట్టూ తిరగాలి. లేదంటే కేంద్రంలో వున్న బిజేపిపార్టీ చుట్టైనా తిరగాలి. కాని ప్రజలు ఓడిరచిప్రతిపక్ష పాత్రను అప్పగించిన బిఆర్‌ఎస్‌ చుట్టూ తిప్పుతున్నారు. తమ తమ పార్టీలను వారికి తెలియకుండానే తక్కువ చేసుకుంటున్నారు. వారి పార్టీలను వాళ్లే పలుచన చేసుకుంటున్నారు. ఎన్నికల ముందు ఇచ్చినహామీలేమిటి? వాటి అమలు తీరు ఎలా వుంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? వారి అభిప్రాయాలమేమిటి? అమలు జరుగుతున్న ప్రభుత్వ పధకాలపై ఎంత వరకు సంతృప్తి చెందుతున్నారు? ఏ ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి చెందించడం ఎవరి వల్ల కాదు. కాని మెజార్టీ ప్రజలను మెప్పించే పాలన సాగుతుందా? లేదా? అన్నది కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు, నాయకులు ఎప్పటికిప్పుడు తెలుసుకుంటుండాలి. ఓ వైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు కొంత మంది మంత్రులు ఎంతో కష్టపడుతున్నారు. ప్రజలకు గత ప్రభుత్వంలో అందని అనేక పథకాలను అమలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఉచిత బస్సు అనే పథకం ప్రజలకు ఎంతోఉపయోపడుతోంది. కాని దానిపై ప్రజలనుంచి వ్యతిరేకత వ్యక్తం కాకపోయినా, ప్రతిపక్ష పార్టీలు విమర్శల పాలు చేస్తున్నాయి. ఆయా పార్టీలకు చెందిన సోషల్‌ మీడియాలో విపరీతమై, విచిత్రమైన ప్రచారం సాగిస్తున్నారు. కాని ఉచిత బస్సు వినియోగించుకుంటున్న వాళ్లు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బస్సుల సంఖ్యను పెంచమని కోరుతున్నారు. అంతే కాని ఉచిత బస్సు ఎందుకు ప్రవేశపెట్టారని ఎవరూ అనడం లేదు. కేవలం బస్సులతో పనిలేని వాళ్లు మాత్రమే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. వాటిని తిప్పికొట్టే ప్రయత్నం కాంగ్రెస్‌పార్టీ నాయకులు చేయడం లేదు. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారమే నిజమని నమ్మే పరిసి ్ధతి వస్తోంది. కాని ఉచిత బస్సు పధకం వల్ల ఎంతోమందికి ఎంతో కొంత మేలు జరుగుతోంది. ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే మహిళలు, కూలీ పని చేసుకునేవారికి, కూరగాయల వ్యాపారం చేసుకునేవారికి, ఇతరత్రా పల్లెల్లో పనులు చేసుకోవడానికి వెళ్లేవారికి ఎంతో ఉపయోగపడుతోంది. ఆ పధకం మరింత ప్రయోజకరంగా కావాలంటే బస్సులు పెంచాలి. రైతు కూలీలకు ముఖ్యంగా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. పొరుగు గ్రామాలలో పనుల కోసం వెళ్లే మహిళలందరూ కలిసి ఆటోలను మాట్లాడుకొని వెళ్లేవారు. రోజు వారి కూలీలో కొంత ఖర్చు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అది మిగులుతోంది. అంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది ఎంతో మేలు ప్రక్రియే అని చెప్పాలి. ఇక ఉచిత బస్సు పధకం వల్ల లక్షలాది మంది స్కూల్‌, పాఠశాలల విద్యార్ధునులకు బస్సు పాసులు తీసుకోవాల్సిన అవసరం లేకుండాపోయింది. సన్న బియ్యం పధకం అనేది ఎంతో గొప్ప పధకం. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ధైర్యానికి ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే రెండు రూపాయలకు కిలో బియ్యం పధకం ప్రవేశపెట్టిన సమయంలో సన్న బియ్యం మార్కెట్‌లో సుమారు రూ.5 రూపాయలు వుండేది. ఆ సమయంలో దొడ్డు బియ్యాన్ని రెండు రూపాయలకు కిలో ఇచ్చారు. తర్వాత వైఎస్‌ రాజశేఖరెడ్డి 2004లో రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చినప్పుడు సన్న బియ్యం రూ.20 రూపాయలు వుంది. ఇప్పుడు మార్కెట్‌లో సన్న బియ్యం కిలో రూ.50 రూపాయలకుపైగా వుంది. ఇలాంటి సమయంలో సన్న బియ్యం ఉచితంగా ఇవ్వడం అంటే పేదల పట్ల రేవంత్‌ రెడ్డికి వున్న అంకితభావం అర్దం చేసుకోవచ్చు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం మేలైన, మెరుగైన పధకాలను అమలు చేస్తోంది. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తోంది. తొలి ఏడాది సుమారు 4.5లక్షల ఇండ్లు నిర్మాణం చేస్తున్నారు. ఈ ఏడాది మూడున్నర లక్షల రేషన్‌ కార్డులిస్తున్నారు. రైతుభరోసా వేస్తున్నారు. రైతు రుణమాఫీ చేశారు. వీటిని ప్రచారం చేయాల్సిన కంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు బిఆర్‌ఎస్‌ పార్టీ బిజేపితో కలిసి సాగుతుందంటారు. బిఆర్‌ఎస్‌, బిజేపితో వచ్చే ఎన్నికల్లో పొత్తుపెట్టుకుందంటూ అంటుంటారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్ప గొప్ప పనులు చేస్తుంటే వాటి గురించి చెప్పుకోకుండా నిత్యం బిఆర్‌ఎస్‌ మీద పడి ఎందుకు ఏడుస్తున్నారో ఎవరికీ అర్ధం కావడంలేదు. ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా మినహాయింపు కాకుండాపోవడంలేదు. ఆయన కూడా పదే పదే బిఆర్‌ఎస్‌ నాయకులను టార్గెట్‌ చేస్తూ ఏ జిల్లాకు వెళ్తే ఆ జిల్లా నాయకులను ఉతికి ఆరేస్తున్నారు. జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడి సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని చెబితే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రబుత్వం అమలు చేస్తున్న పధకాల గురించి వివరిస్తూ పోతుంటే, ప్రజలకు మరింత నమ్మకం కల్గుతుంది. అంతే కాని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నుంచి మొదలు అందరూ అదే బాష, అదే తీరును అనుసరిస్తున్నారు. నిజానికి కాంగ్రెస్‌ పార్టీ రాజకీయంగా టార్గెట్‌ చేయాల్సింది బిఆర్‌ఎస్‌ను కాదు. కేంద్రంలో వున్న బిజేపిని. రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన నిదులు రాకపోతే కేంద్రాన్ని కడిగేయాలి. దోషిగా ప్రజల ముందు నిలబెట్టాలి. అది వదిలిపెట్టి బిఆర్‌ఎస్‌ మీదే పడుతున్నారు. బిజేపి కూడా కాంగ్రెస్‌ దారిలోనే నడుస్తోంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హమీలు 420. వాటిని కనీసం బిజేపి పార్లమెంటు సభ్యులు ఒక్కరైనా చదివారా? కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టో చూశారా? రైతు భరోసా విషయంలోనైనా, రైతు రుణమాఫీ అంశంలోనైనా బిజేపి ఎందుకు మాట్లాడడం లేదు? రేవంత్‌ సర్కారు ఇచ్చిన హమీలను బిజేపి ఎందుకు గుర్తు చేయడం లేదు. తెలంగాణలో కరువు చాయలు కనిపిస్తున్నాయి. రైతులకు నీళ్లివ్వాలని బిజేపి ఎందుకు నిలదీయడం లేదు. 8 మంది బిజేపి ఎంపిలను తెలంగాణ గెలిపించి పార్లమెంటుకు పంపారు. అసలు ఆ ఎంపిలు కేంద్రం నుంచి ఎన్ని నిదులు తెచ్చారో చెప్పిన దాఖలాలు ఏ ఒక్కటి లేదు. కాని తెల్లారిలేస్తే బిఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేసే రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు. ప్రజలు బిఆర్‌ఎస్‌ను కాదని ఎందుకు ఎన్నుకున్నారు. తమకు ఎందుకు పాలన అప్పగించారన్న ఆలోచన ఏ ఒక్క నాయకుడు ఆలోచించడం లేదు. ఈ పార్టీ, ఆ పార్టీతో పొత్తు, ఆ పార్టీ, ఈ పార్టీతో పొత్తు అంటూ ఇంకా ఎన్నికలు ఎంతో సమయం వుంది. ఇప్పటి నుంచే ప్రచారం చేసుకుంటూ పోతే వచ్చేదేముంది? ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి సాదించేదేముంది? రాజకీయాలు ఇంకా ఎంతదూరం వెళ్లాయంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నదని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అంటుంటారు. అంతేకాకుండా త్వరలోనే ఆమెకు మంత్రి పదవి ఇస్తారంటారు. గత మంత్రి వర్గ విస్తరణలోనే ఆమె మంత్రిగా ప్రమాణం చేయాల్సి వుండేది. కాని ఆగిపోయిందంటారు. అసలు రాజకీయాలను ఎటు వైపు నుంచి ఎటు వైపు తీసుకెళ్తున్నారు. ఓ వైపు బిసి ఉద్యమమని అందరూ మాట్లాడతారు? అందరూ చిత్తశుద్దినే ప్రదర్శిస్తామంటున్నారు. 42 శాతం రిజర్వేషన్‌ అమలుకు కాంగ్రెస్‌ ఆర్డినెన్స్‌ తెచ్చి బిసిలకు రాజకీయ న్యాయం చేయాలనుకుంటున్నామని కాంగ్రెస్‌ అంటుంది. లేదు లేదు. ఆర్డినెన్స్‌ వల్ల రిజర్వేషన్‌ అమలు అసాద్యమని అదంతా బోగస్‌ అని బిఆర్‌ఎస్‌ అంటుంది. బిసి రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ మీద ఎవరూ కోర్టుకు పోకుండా చూసుకోవాలని ప్రభుత్వం అంటుంది. గతంతో తాము కూడా 27శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలనుకుంటే కాంగ్రెస్‌ పార్టీ కోర్టుకు వెళ్లిందని బిఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. ఇలా నిత్యం ఏదో వివాదం తప్ప, ప్రజలకు న్యాయం జరగాలన్న ఆలోచన ఏ పార్టీకి లేదన్నది మాత్రం ముమ్మాటికి నిజం అని చెప్పకనే చెబుతున్నారు.

ఎర్ర సినిమాలు..కోట్ల సంపాదనలు!

ఏ సమాజోద్దరణ కోసం తీశారు!

`ఏ లక్ష్యం వైపు సినీ అడుగులేశారు.

`లక్షలు పెట్టి సినిమా తీసి కోట్లు సంపాదించుకున్నారు.

`ప్రజల బలహీనత సొమ్ము చేసుకున్నారు.

`విద్యార్థులను రెచ్చగొట్టారు.

`ఆవేశపరులను చేసి వారి జీవితాలు ఆగం చేశారు

`ఓ తరం యువత జీవితాలలో నిప్పులు పోశారు.

`యువతను అడవుల పాలు చేశారు.

`విప్లవాల పేరు రెచ్చగొట్టి ఎర్ర సినిమాలు తీశారు.

`ఎర్ర సినిమాలతో యువతకు ఒరిగిందేమీ లేదు.

`ఆ కుటుంబాలలో కడుపు కోతలు మిగిల్చారు.

`తల్లిదండ్రులకు సేవ చేయాల్సిన పిల్లలు అడవుల బాట పట్టారు.

`ఆకలి, నిద్రలతో పాటు జీవితాలు కోల్పోయారు.

`తల్లిదండ్రులకు పుత్రశోకాలు మిగిల్చారు.

`అలా సినిమాలు తీసిన వాళ్ల పిల్లలు ఏ ఒక్కడూ అడవి బాట పట్టలేదు.

`జూబ్లీ హిల్స్‌ , బంజారా హిల్స్‌, ఫీలింనగర్‌ , కొకపేట లో బంగళాలు కట్టుకున్నారు.

`వారి పిల్లలు విదేశాలలో చదువుకున్నారు.

`తరతరాలు తిన్న తరగని ఆస్థులు సంపాదించుకున్నారు.

`ఎర్ర సినిమాలలో పని చేసిన కార్మికుల చేత కూడా వెట్టి చాకిరి చేయించుకున్నారు.

`ఎర్ర సినిమాలు తీసి సమాజంలో గొప్ప వాళ్లుగా చెలామణీ అయ్యారు.

`పల్లె ప్రజల జీవితాలలో నిప్పులు పోశారు.

`సమాజంలో బతకాల్సిన యువతను అడవి జీవితాలకు అంకితం చేశారు.

`జీవితాలు నరక ప్రాయం చేశారు…సినిమాలు తీసిన వారు సమాజంలో ఊరేగుతున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:                          ఎర్ర జెండా పట్టుకున్న వారిలో ఎంత మంది బాగుపడ్డారో గాని, ఎర్ర సినిమాలు తీసిన వాళ్లు మాత్రం బాగు పడ్డారు. కోట్లు సంపాదించుకున్నారు. సినిమా మీది సినిమాలు తీసి కోటీశ్వరులయ్యారు. సమాజంలో గుర్తింపు పొందిన వ్యక్తులుగా చెలామణి అయ్యారు. 70`80వ దశకం నుంచి మొదలు, తెలంగాణ ఉద్యమం ఊపందుకునే దాకా ఎర్ర జెండాలు ఎగిరాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కసారిగా కనుమరుగయ్యాయి. అంటే రంగు లజెండాలున్నా, ఎజెండాలు లేకుండా సాగే ఏ ఉద్యమైనా ఎంతో కాలం నిలవదని చరిత్ర తేల్చిచెప్పినట్లైంది. అయితే ఇక్కడే అసలు తిరకాసు దాగి వుంది. సమాజంలో ఎగిరిన ఎర్ర జెండాలు వేరు. సినిమాల్లో ఎగురవేసిన ఎర్ర జెండాలువేరు. ఎర్ర జెండాల ముసుగులో సినిమాలు తీసి తెలంగాణ యువతను తప్పు దారి పట్టించిన సినిమాలెన్నో వున్నాయి. తెలంగాణ యువతను తప్పుడు మార్గం పట్టించి, వారి జీవితాలను నాశనం చేశాయి. ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే ఏపిలోవున్న ఏ యూనివర్సిటీలలో ఎర్ర జెండాల ఎగురవేత కనిపించేది కాదు. కాని తెలంగాణలో యూనివర్సిటీలలో మాత్రమే ఎర్రజెండాలు ఎగురవేసేవారు. తెలంగాణ విద్యార్ధుల జీవితాలను పక్కదారి పట్టించారు. తెలంగాణ యూనివర్సిటీలలో ఎర్రజెండాలు ఎగురవేసి, యువతను తప్పుదారి పట్టించిన విద్యార్ది నాయకులు ఏపికి చెందిన వాళ్లే వుండడం గమనార్హం. ఇప్పటికీ ఎర్ర జెండాలతో వున్న ఏ పార్టీలో కూడా సామాజిక న్యాయం జరగలేదు. చట్టసభలకు ఎన్నికైన వారిలో బడుగులు పెద్దగా లేరు. ఒక్కరో ఇద్దరో వుంటే వారి పెత్తనం నడవనీయలేదు. ఇప్పుడు కూడా ఓ ఎర్ర జెండా పార్టీ నుంచి ఎమ్మెల్యే అయింది కూడా అగ్రకులానికి చెందిన నాయకుడే. ఇదీ ఎర్ర పార్టీల చరిత్ర. ఆ పార్టీలకు చెందిన అగ్ర నాయకులు కూడా అగ్ర కులాలకు చెందిన వాళ్లే. ఆ ఎర్ర ఎజెండాతో పత్రికలు నడిపిన వారు, ఆ ముసుగులో ఇంకా వున్న వాళ్లు కూడా అగ్ర కులాలకు చెందిన వాళ్లే. ఆ ఎర్ర రంగును చూపించి, సినిమాలు తీశారు. అందులోనూ అందరూ అగ్ర వర్ణాలకు చెందిన వాళ్లే వున్నారు. ఎందుకంటే ఉద్యమం వేరు. పోరాటం వేరు. కాని విప్లవం అనేది ఒక రుగ్మత. దాన్ని అంటించేవాళ్లు బాగానే వుంటారు. ఆ మంటల్లో తగలబడి పోయే వాళ్లు అణగారిన వర్గాలే వుంటారు. ప్రపంచంలో ఏ విప్లవం చూసినా రాజ్యాధికార ప్రయోజనం తప్ప, ప్రజా ప్రయోజనం ఎక్కడా కనిపించదు. కాని మసిబూసి మారేడు కాయ చేస్తారు. సామాన్యుల జీవితాలను సమిథలు చేస్తారు. నేనే సైతం అంటూ పాటలు రాస్తారు. వాళ్లు మాత్రం విలాసాలలో మునిగి తేలుతారు. అలా ఎర్ర రంగు పులిమి తీసిని సిమామాలు, వారి గురించి చెప్పుకుంటే చరిత్ర కూడా క్షమించదు. ఒకప్పుడు మాదాల రంగారావు అనే హీరో అనేక ఎర్ర సినిమాలు తీశారు. వీళ్లంతా ఎర్ర పార్టీల మీద వున్న ప్రేమతో సినిమాలు తీసిన వారు కాదు. సినిమా హీరోలు కావాలన్న లక్ష్యంతో ఇండస్ట్రీకి వెళ్లిన వాళ్లు. సినిమా ప్రపంచాన్ని ఏలాలన్న లక్ష్యంతో వెళ్లారు. కోట్లు సంపాదించాలన్న లక్ష్యంతోనే సినిమాలను తీశారు. అలా తీసిని సినిమాలన్నీ హిట్ల మీద హిట్లయ్యాయి. సమాజంలో ఏదో జరిగిపోతున్నట్లు, అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నట్లు రక్తి కట్టించే సన్నివేశాలు రాసి, తీశారు. యువతలో విషం నింపారు. విద్యార్థులు కాలేజీకి వెళ్లేదెందుకు? బాగా చదువుకొని ఉన్నత విద్యావంతులై, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి, దేశ ఆర్దిక ప్రగతికి, పురోగతికి తోడ్పడాలి. రేపటి తరాన్ని నిర్మించి, ఉజ్వలమైన భవిష్యత్తు కళ్లారా చూడాలి. కాని కాలేజీ కుర్రవాడ, కులాసాగ తిరిగెటోడ..విలాసాల మాట మరవరో..విప్లవాల బాట పట్టారో అని రెచ్చగొట్టారు. సమాజంలో అంతరాలు నిర్మించారు. కొంత మంది స్వార్ధ పరుల కోసం యువతరాన్ని మొత్తం నాశనం చేశారు. అలాంటి వారికి పాలకులు కూడా సహకరించిన సందర్బాలున్నాయి. రాజకీయ నాయకులు, పార్టీలు కూడా తమ స్వార్ధం కోసం ఎర్ర జెండాలను నెత్తికెత్తుకున్నారు. ఎన్టీఆర్‌ తెలుగుదేశంపార్టీ పెట్టినప్పుడు నక్సలైట్లు దేశ భక్తులన్నారు. కాని అదే ఎన్టీఆర్‌ అదికారంలోకి వచ్చిన తర్వాత నక్సలైట్లపై నిషేదం విధించారు. సమాజంలో సారా నిషేదించాలని నక్సలైట్లు కోరితే, వారుణీ వాహినీ అని పోలీస్‌ స్టేషన్లలో అమ్మించారు. అదే తెలుగుదేశం పార్టీ మళ్లీ 1994లో అదికారంలోకి రావడానికి మద్య నిషేద ఉద్యమం తెచ్చారు. అదికారంలోకి వచ్చారు. ఇలాంటి సమయంలో సుందులో సడేమియాలగా సిమాలు నిర్మాణం చేశారు. ఓ వైపు తన పత్రికలో నక్సలైట్లపై నిషేదం విధించాలని వార్తలు రాసిన రామోజీ రావు, పీపుల్స్‌ ఎన్‌కౌంటర్‌ అంటూ సినిమా తీశాడు. కోట్లు గడిరచారు. ఆ సినిమా చూడడానికి వెళ్లిన వారిని పోలీసులు పట్టుకొని నక్సలైట్ల ముద్ర వేసి, వారిని అరెస్టులు చేశారు. ఇక మరో నటుడు నారాయణ మూర్తి తీసిన ఎర్రసినిమాల మూలంగా అభం శుభం తెలియని ఎంతో మంది యువతీ,యువకులు కూడా నక్సలైట్లలో చేరారు. జీవితాలను ఆగం చేసుకున్నారు. ఎర్ర సినిమాలు తీసి కోట్లు గడిరచారు. దాసరి నారాయణ రావులాంటి దర్శకులు కూడా సంపాదన కోసం ఎర్ర సినిమాలు తీశారు. కోట్లు గడిరచారు. ఆయన మాత్రం కాంగ్రెస్‌ పార్టీలో వున్నారు. కాంగ్రెస్‌ నుంచి రాజ్యసభ సభ్యుడయారు. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. కాని దాసరి నాలుగైదు ఎర్ర సినిమాలు తీశారు. ఎర్ర జెండాలో అంత పవర్‌ వుంటే ఆయన ఎందుకు నక్సలైట్లలో చేరలేదు? మోహన్‌ బాబు లాంటి నటుడు కూడా అడవిలో అన్న అంటూ సినిమా తీశారు. కోట్లు సంపాదించుకున్నారు. అలా తీసిన సినిమాలతో వచ్చిన లాభాలతో ఆస్దులు కూడ బెట్టుకున్నారు. తన పిల్లల్ని మంచిగా చదివించుకున్నారు. వారిని సినిమా హీరోలను చేశాడు. అలా సంపాదించిన సినిమాలతో వచ్చిన డబ్బుతో ప్రైవేటు విద్యా సంస్ధలు నడుపుతున్నాడు. విద్యా వ్యాపారిగా మారాడు. అడవిలో అన్న సినిమా చూసి, ఆవేశంతో అడవుల్లోకి వెళ్లిన వాళ్లలో ఎంతో మంది విగతజీవులయ్యారు. తిరిగిరానిలోకాలకు వెళ్లిన వాళ్లున్నారు. ఇలా ఒకరు కాదు, ఇద్దరుకాదు సిని పెద్దలెంతో మంది ఎర్ర సినిమాలు తీశారు. ఆఖరుకు సూపర్‌ స్టార్‌ కృష్ణ కూడా ఎన్‌ కౌంటర్‌ అని సినిమా తీసి హిట్‌ కొట్టారు. కోట్లు సంపాదించారు. వీళ్లలో ఎర్ర జెండాలెన్ని రకాలో కూడా ఎవరికీ తెలియదు. ఆ ఎర్రజెండాల్లో నక్సలైట్లు వేరు అని తెలిసినా సినిమాలు చేశారు. తెలంగాణ యువతలో కల్లోలం నింపారు. ఎర్ర సినిమాలు తీసి సమాజోద్దరణ అన్నారు. ఎక్కడ చేశారు? ఏం చేశారు? సమాజాన్ని ఏ లక్ష్యం వైపు నడిపించారు. అమితాబచ్చన్‌ సినిమా చూసి ఒకరు దొంగగా మారారన్న వార్తను తాటికాయలంత అక్షరాలతో వార్తలు రాశారు. కాని ఎర్ర జెండాలు చూపించి, ఎంతో మంది యువత జీవితాలను ఆగం చేసిన ఆ సినిమా గురించి ఎవరూ ఎందుకు రాయలేదు? లక్షలు పెట్టి కోట్లు సంపాదించుకున్నారన్న వార్తలుఎందుకు రాయలేదు. ప్రజల బలహీనతలను కూడా ఇలా సొమ్ము చేసుకున్నారని ఏ మీడియా ఎందుకు ప్రశ్నించలేదు. ఎంతో మంది విద్యార్దులను సినిమాల ద్వారా రెచ్చగొట్టి వారి జీవితాలను ఆగం చేశారు. కొన్ని వేల మంది యువతను అడవుల పాలు చేశారు. విప్లవాల పేరుతో ఎర్ర సినిమాలు తీశారు. వాటికి ఎర్ర మట్టి అని పేరు పెట్టారు. ఆఖరుకు ఎర్రసైన్యం అంటూ కూడా పేర్లు పెట్టేశారు. అంటే దేశాన్ని కాపాడుతున్న సైనికులతో పోల్చారు. అదేంటోగాని అప్పటి పాలకులు కూడా ఆ సినిమాలు ధియేటర్‌కు వెళ్లి చూసిన వారిని అరెస్టులు చేశారు. కాని అలాంటి సినిమాలు తీసిన నిర్మాతలు,దర్శకులు, హీరోలకు అవార్డులిచ్చారు. వారిని గొప్ప వ్యక్తులుగా చిత్రీకరించారు. వారిని గౌరవించారు. ఎర్ర సినిమాలు చూసిన వారినే నిర్భందించిన కాలంలో ఎర్ర సినిమాలు తీసిన వారినికూడా అరెస్టులు చేస్తే ఆ దరిద్రం పాకకుండా పోయేది. విద్యా వంతమైన సమాజ నిర్మాణం జరగాలంటే అడవుల బాట కాదు పట్టాల్సింది. విద్యాలయాల బాట పట్టాలని చెప్పలేదు. ఎర్ర సినిమాలతో ఆనాడైనా,ఈనాడైనా యువతకు ఒరిగిందేమీ లేదు. కొన్ని లక్షల కుటుంబాలలో కడుపుకోతలు మిగిల్చారు. తల్లిదండ్రులకు పుత్రశోకాలు మిగిల్చారు. సమాజంలో సామాజిక సృహ పేరుతో సినిమాలు తీసిన వాళ్ల సినిమాలకు పనిచేసిన వారిని కూడా వెట్టి చాకిరీ చేయించుకున్నారు. వారికి సినిమాల్లో అవకాశమివ్వడమే గొప్ప అన్నట్లు వారి కష్టం దోచుకున్నారు. ప్రజల జీవితాల్లో సినిమాల పేరుతో నిప్పులు పోశారు.

ఎన్నికల సంఘం… ఎందుకీ గందరగోళం!

-విశ్వనీయత కోల్పోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదం.

-సుప్రీం కోర్టు చివాట్లు పెట్టినా మారదా!

-ఈవిఎంల మీద ఆరోపణలు.

-ఎన్నికల నిర్వహణలో లోపాలు.

-కౌంటింగ్‌లో అస్తవ్యస్త ప్రకటనలు

-వివి ప్యాట్స్‌పై అనేక అభ్యంతరాలు.

-ఎన్నికల సంఘం పని తీరు పార్టీల బరితెగింపుకు చెక్‌ పెట్టాలి.

-బీహార్‌ లో ఎందుకంత వావాదాస్పమౌతోంది.

-శేషన్‌లా గుర్తింపు పొందేలా పని తీరు వుండాలి.

-నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించిన పేరు సంపాదించుకోవాలి.

-ప్రపంచమంతా ఇండియన్‌ ఎన్నికల నిర్వహణ గురించి గొప్పగా చెప్పుకోవాలి.

-ప్రజాస్వామ్యంపై మరింత నమ్మకం పెంచాలి.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

  ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ అనేది ఒక క్రియాశీలకమైన ప్రక్రియ. ప్రజల నిర్ణయాన్ని నిక్షిప్తం చేసే వ్యవస్ధ. ప్రజలు కోరుకునే పార్టీని గెలిపించుకొని, పాలించమని కోరుకునేందుకు ఎన్నికల సంఘం ఒక వేదిక. ఆ ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్దమైనది. ప్రత్యేక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినది. అలాంటి ఎన్నికల సంఘం ఇటీవల అనేక వివాదాల్లో చిక్కుకుంటోంది. ఆ వ్యవస్ధ వున్నదే ఎన్నికలను సకాలంలో, సక్రమంగా నిర్వహించి, ప్రజా నిర్ణయాన్ని ప్రతిబింబించేలా వుండాలి. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికలు నిర్వహించాలి. అంతే కాని పదే పదే వివాదాలకు ఎన్నికల సంఘం కేంద్రం కాకూడదు. ఈ మధ్య ఎన్నికల సంఘం ఎదుర్కొంటున్న ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. రాజకీయ పార్టీలు అనేక విమర్శలు చేస్తున్నాయి. ఎన్నికల సంఘం ఓ పార్టీకి అనుకూలంగా పనిచేస్తుందన్న ఆరోపణలు రాజకీయపార్టీలు నేరుగానే చేస్తున్నాయి. అయినా ఎన్నికల సంఘంలో ఎలాంటి కదలిక లేదు. అంటే ఎన్నికల నిర్వహనలో పొరపాట్లు జరుగుతున్నాయని ఒప్పుకున్నట్లేనా? అవి దిద్దుకోలేనంత స్దాయిలో జరుగుతున్నాయని అంగీకరించినట్లేనా? అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఏ రాష్ట్ర ఎన్నికల నిర్వహణలోనూ కూడా పాదర్శకత కనిపించడం లేదని రాజకీయ పార్టీలు పదే పదే వెలెత్తి చూపుతున్నాయి. అలా ఆరోపణలు చేసి, చేసి విసిగిపోయిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఏకంగా సుప్రింకోర్టును కూడా ఆశ్రయించాయి. గతంలో సుప్రింకోర్టు కూడా పెద్దగా ఈ విషయాలను సీరియస్‌గా తీసుకోలేదు. కాని ఇటీవల దేశ వ్యాప్తంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాటిపై విచారణకు సీకరించిన సుప్రింకోర్డు అడుగుతున్న ప్రశ్నలలో ఎన్నికల కమీషన్‌ వద్ద సరైన సమాధానాలు వుండడం లేదు. దాంతో అనుమానాలు అందిరిలోనూ మరింత బలపడుతున్నాయి. ఎన్నికల సంఘం షరతులు, అనుసరిస్తున్న విధానాలు కూడా అలాగే వున్నాయి. సహజంగా ఎన్నికలు పూర్తయిన తర్వాత 45 రోజుల వరకు ఆ ఫలితాలకు సంబందించిన లెక్కలు చెరిపేయకూడదు. కాని ఇటీవల జరిగిన కొన్ని రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలకు సంబంధించిన వివరాలు పది రోజుల్లోనే మాయం చేశారని తెలుస్తోంది. ఎందుకు అలా ఎన్నికల సంఘం చేయాల్సి వచ్చిందన్నదానిపై సమాదానాలు లేవు. ఇది ఎన్నికల సంఘం నిర్లక్ష్యాన్ని చూపిస్తోంది. నిజం చెప్పాలంటే ఎన్నికల సంఘం అంటే రాజకీయ పార్టీలు భయపడేలా వుండాలి. ఏ మాత్రం చిన్న పొరపాటు జరిగినా ఎన్నికలకు అర్హులు కాకుండాపోతామన్న భయం నాయకుల్లో వుండాలి. పార్టీల గుర్తింపు రద్దు జరుగుతుందనే భయం పార్టీల్లో కూడా వుండాలి. కాని ఎన్నికల సంఘం గత కొంత కాలంగా ఒక పార్టీకి అనుగుణంగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు దురదృష్టకరం. ఆ ఆరోపణలు నిజం కానప్పుడు, ఆయా రాజకీయ పార్టీల మీద చర్యలకు కూడా ఎన్నికల సంఘం సిఫారసు చేయొచ్చు. కాని చేయడం లేదు. రాజకీయ పార్టీలకు వివరణలు ఇచ్చింది లేదు. ఎన్నికల సంఘానికి వున్న హక్కులను వినియోగించింది లేదు. ఇలా కూడా ఎన్నికల సంఘం వివాదాల్లో చిక్కుకున్నది. ఆ మధ్య జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెళ్లువెత్తాయి. మహారాష్ట్రలో జరిగిన ఓ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి విజయం సాధించారు. అదే పార్లమెంటు నియోజకవర్గ పరిదిలో వున్న అసెంబ్లీ నియోజకవర్గాలలో బిజేపి పార్టీ గెలిచింది. ఏకకాలంలో జరిగిన ఎన్నికల్లో ఇలాంటి తేడాలు సహజంగా దొర్లవు. ఎన్నికల జరిగిన తర్వాత ఎన్నికల సంఘం విడుదల చేసిన లెక్కలకు, తర్వాత లెక్కలకు ఎక్కడా పొంతనలేదు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం చాలా వేగంగా ఎన్నికల పోలింగ్‌ వివరాలు అందించే వెసులుబాటు వుంది. గతంతaలో బ్యాలెట్‌ ఎన్నికలు నిర్వహించినప్పటికంటే ఇప్పుడు ఎందుఉకు కాలాతీతమౌతోందన్నది అర్దం కాని ప్రశ్నగా మిగిలిపోతోంది. బ్యాలెట్‌ తో ఎన్నికల జరిగిన సమయంలో కూడా మరునాటి వరకైనా లెక్కలు పక్కాగా ప్రకటించేవారు. ఏ సమయానికి ఎంత పోలింగ్‌ అయ్యింది. పోలింగ్‌ మొదలైన తొలి గంట నుంచి ఆఖరు ఓటు వరకు లెక్కల్లో ఎలాంటి తేడాలు వుండేవి కాదు. ఇంత టెక్నాలజీ పెరిగిన సందర్భంలో పోలింగ్‌ లెక్కలు చెప్పడానికి మూడు రోజులు సమయం ఎందుకు పడుతుందన్న ప్రశ్నలకు ఎన్నికల సంఘం నుంచి సరైన సమాధానం లేదు. అది కూడా పారదర్శకంగా వుండడం లేదు. పైగా పెద్దఎత్తున ఓటర్ల నమోదు ప్రక్రియ జరిగినట్లు ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి. లక్షల్లో ఓట్లు రాత్రికి రాత్రి ఎలా పెరిగాయని ప్రశ్నిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఓట్లు వేస్తున్న వారి ఓట్లు లేకపోవడం, లక్షల్లో ఓట్లు పెరిగిపోవడం అనేది అనుమానాలకు తావిస్తోంది. ఇక హర్యానా ఎన్నికల విషయంలోనూ ఎన్నికల సంఘం ఇలాంటి వివాదాన్నే ఎదుర్కొన్నది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌తోపాటు, కొన్ని రౌండ్ల లెక్కింపు వరకు కాంగ్రెస్‌ పార్టీ గెలుపు దిశగా దూసుకుపోయింది. కాని అనూహ్యంగా కొన్ని రౌండ్లు పూర్తయ్యే సరికి బిజేపి పుల్‌ స్వింగ్‌లోకి వచ్చింది. కాంగ్రెస్‌ చాలా వెనుకబడిపోయింది. ఇది కూడా పెద్ద వివాదమైంది. ఇదంతా ఎన్నికల సంఘానికి తెలియకుండా జరిగి వుంటుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నతమౌతున్నాయి. ఇక ఏపిలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో సుమారు 54లక్షల ఓట్లు అదనంగా పోలయ్యాయని చెబుతున్నారు. ఒక రాష్ట్రంలో ఏకంగా 53లక్షల ఓట్ల తేడా వచ్చినట్లు గుర్తించారు. అసలు ఇన్ని లక్షల ఓట్లు ఎలా వచ్చాయి. పోలింగ్‌కు, ఎన్నికల ఫలితాలకు మధ్య ఇంత తేడా ఎలా వచ్చిందన్న దానిపై సర్వత్రా ఎన్నికల ఫలితాల నాటి నుంచే ఆందోళన వ్యక్తమౌతోంది. ఇప్పుడు ఆ ఆందోళన మరింత ఊపందుకున్నది. ఏకంగా ఏపి ఎన్నికలు రద్దు చేయాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. ఏపి ఎన్నికల విషయం కూడా ఇంత పెద్ద ఎత్తున ఊపందుకోవడానికి బిహార్‌లో ఎన్నికల కమీషన్‌ తీరుతో మరింత బలం చేకూరింది. సరిగ్గా ఏపిలో అనుసరించిన విదానమే బిహార్‌లో అనుసరించేలా వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. అక్కడ కూడా 33 లక్షల ఓట్లు ఏకంగా ఎన్నికల జాబితాలోనే కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. ఇలా ఎందుకు అవుతోంది. సహజంగా పోలింగ్‌ రోజున ఉదయం నుంచి మద్నాహ్నం వరకు ఒక్కొసారి కనీసం పదిహేను శాతం కూడా పోలింగ్‌ కాదు. సాయంత్రం ఐదు గంటల వరకు అరవై, నుంచి డెబ్బై శాతం పోలింగ్‌ జరగుతుంది. ఒక గంట ఎక్కువ సమయం కేటాచించినా ఓ రెండు నుంచి ఐదు శాతం ఓటింగ్‌ పెరగొచ్చు. ఆరు గంటలలోపు వచ్చి లైన్లో నిలుచున్న వారందరికీ ఓటు వేసుకునే అవకాశం కల్పించినా, సరే మరో రెండు శాతం పెరగొచ్చు. ఏకంగా పదిహేను శాతం ఓటింగ్‌ పెరగడం అనేది సాద్యమయ్యే పని కాదు. ఎన్నికల పలితాల తర్వాత సుమారు 45 రోజుల వరకు వివిప్యాట్స్‌ లెక్కబెట్టేందుకు అందుబాటులో వుంచుకోవాలి. కాని ఎన్నికల కమీషన్‌ పదిరోజుల్లోనే వాటిని చిత్తు చేసినట్లు సుప్రింకోర్టుకు వెల్లడిరచింది. అసలు అంత త్వరగా వివిప్యాట్స్‌ను, ఈవింఎంలలో వుండే డాటాను ఎందుకు తొలగించినట్లు అనేదానిపై ఎన్నికల కమీషన్‌ వద్ద సమాదానం లేదు. సుప్రింకోర్టు ఒత్తిడిని తట్టుకునేందుకు భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామన్నారు. మరి ఎన్నికలు జరిగిన రాష్ట్రాల పరిస్దితి ఏమిటన్నది ప్రశ్నగా మిగిలిపోతోంది. ఏపిలో వైసిపికి కేవలం 11 సీట్లు రావడంతో ఈ అనుమానం మరింత బలపడిరది. కొన్ని పోలింగ్‌ స్టేషన్లలో రాత్రి ఒంటి గంట వరకు పోలింగ్‌ జరిగినట్లు కూడా చెబుతుండడంతో అంత మంది పోలింగ్‌ స్టేషన్‌లోకి ఎలా వచ్చారు. ఆరు తర్వాత వచ్చిన వారిని ఎలా అనుమతించారు. ఎలా ఓట్లు వేయించారు. ప్రకటించిన పోలింగ్‌ శాతానికి కన్నా అదనంగా ఫలితాలలో వచ్చిన ఓట్లు, మెజార్టీల లెక్కల్లో చాలా తేడా వుందని నిపుణులు అంటున్నారు. బిహార్‌లో కూడా ఇదే జరగొచ్చన్న అనుమానాలు ఎక్కువగా వ్యక్తమౌతున్నాయి. డిల్లీలో కూడా ఇలాగే జరిగిందని కూడా అంటున్నారు. ఏది ఏమైనా ఎన్నికల కమీషన్‌ పారదర్శకంగా వుండాలి. నిస్పక్షపాతంగా వ్యహరించాలి. ప్రజలకు అనుమానాలను నివృత్తి చేయాలి. ప్రజాస్వామ్య గొప్పదనాన్ని ఎన్నికల కమీషన్‌ కాపాడాలి. ప్రజల నిర్ణయానికి భిన్నంగా ఫలితాలు వస్తే, ఎన్నికల సంఘం మీద విశ్వసనీయత పోతుంది. అది ఎన్నికల నిర్వహణకే శాపంగా మారుతుంది.

కమ్మ,రెడ్డి కలిసిపోదాం..తెలంగాణను ఏలుదాం?

`ఏపికి చెందిన నాయకుల రహస్య సమావేశాలు?

`తెలంగాణలో రాజకీయ పరిస్థితులు అనుకూలంగా మలుచుకుందాం?

`తెలంగాణలో ఆధిపత్య రాజకీయాలు సాగుతున్నాయి!

`తెలంగాణ ప్రజల దృష్టి అటువైపు వున్నప్పుడే మనం తేరుకుందాం?

`ఐక్యతగా నిలబడి సాధించుకుందాం?

`తెలంగాణలో ఏపి సెటిలర్లు 67 లక్షలున్నట్లు అంచనా!

`హైదరాబాదులో 33 లక్షలున్నట్లు తెలుస్తోంది.

`ఖమ్మం, నిజామాబాద్‌, నల్గొండ, వరంగల్‌ లలో 34 లక్షల మంది వున్నారు.

`64 స్థానాలలో కీలక భూమిక పోషించొచ్చు.

`సమైక్య రాష్ట్రమే అవసరం లేదు.

`రెండు రాష్ట్రాలున్న ఇబ్బంది వచ్చేదేమీ లేదు.

`రెండు రాష్ట్రాలు మనవే కావాలి!

`క్రియాశీల పాత్ర పోషించే స్థాయిలో వున్నాం!

`ఇప్పటికైనా మేలుకుందాం?

`లేకుంటే ఎప్పటికైనా పరాయివాళ్లే అంటారు?

`ఇదే సరైన సమయం.. పాగా వేద్దాం?

`ఏపి రాజకీయాలనే శాసిస్తున్నాం!

`తెలంగాణ రాజకీయాలను ఎప్పటికైనా వశం చేసుకుంటాం?

`ఇప్పటి నుంచి మొదలు పెడితే ఎక్కువ కాలం కూడా పట్టదు!

`ఏపి మీడియాను ఎగదోద్దాం?

`తెలంగాణ రాజకీయాల దృష్టి మళ్ళించి మనం బలపడదాం!                            తెలంగాణ ఏ రాకీయ పరిస్దితుల్లో వుందో చెప్పడానికి కమ్మ, రెడ్డి కలిసి పోదామా? అన్న చర్చలోనే తెలిపిపోతోంది. సరిగ్గా తెలంగాణలో రాజకీయ గందరగోళం సాగుతోంది. బిఆర్‌ఎస్‌ మీద కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్దఎత్తున కేసులు నమోదు చేసింది. అందులో ఏ ఒక్క కేసులోనైనా బిఆర్‌ఎస్‌ నాయకులకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చినా ఆ పార్టీకి కొంత గడ్డుకాలమే. అలాంటి పరిస్దితి వస్తే మాత్రం సీమాంద్ర మీడియాకు సంక్రాంతి పెండుగే. తెలంగాణ విఫల రాష్ట్రమని ఎలా రుజువు చేయాలనేదానిపైనే ఆ ప్రాంత మీడియా కాచుకొని కూర్చున్నది. ఏపికి చెందిన రాజకీయాలపై కేసిఆర్‌ అప్పుడప్పుడు కొన్ని మాటలు చెప్పడం చూస్తూనే వుంటాం. కళ్లు మనవే, వేలు మనదే పొడిచేది మనోడే..పొడిపించే వాడు మాత్రం పక్కొడే అంటుంటారు. ఇది కొంత కాలం పోతే నిజమయ్యే అవకాశం కళ్లముందు కనిపిస్తోంది. తెలంగాణలో ఆదిప్యత రాజకీయాలు, కేసిఆర్‌ కుటుంబంలో కలహాలు, బిసి రాజకీయంలో లుకలుకలు. ఇలా గందరగోళ రాజకీయాలున్న సమయంలోనే సీమాంద్రకు చెందిన ప్రజల ఆలోచనలు మార్చాలి. ఏపికి చెందిన పార్టీల వైపు వారి దృష్టి మళ్లించాలి. అప్పుడు పాగా వేయడం చాల సులువు అనే ఆలోచనకు ఏపికి చెందిన రెండు కులాల నాయకులు లోతుగా ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ మీద మళ్లీ కుట్రలు మొదలయ్యాయి. కాకపోతే సమైక్య వాదం పక్కన పెట్టి, రెండు రాష్ట్రాలను ఏలుదామన్న ఆలోచనలు మొదలయ్యాయి. రెండు రాష్ట్రాలను కలపడం ఇప్పట్లో సాద్యం కాదు. ఆ పని చేయాలని చూస్తే మళ్లీ తెలంగాణ వాదం తెరపైకి వస్తే తట్టుకోలేం. అందవల్ల రెండు రాష్ట్రాలను తమ గుప్పిట్లో పెట్టుకుంటే చాలు. రెండు రాష్ట్రాలను ఏలితే మేలు అనే నిర్ణయానికి కొంత మంది సీమాంద్రకు చెందిన రెండుకులాల నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. పైగా కొంత మంది ముఖ్య నాయకులు, వ్యాపార వేత్తలు కలిసి సంయుక్త సమావేశం రహస్యంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఎక్కడా సమైక్య వాదమన్న మాట రాకుండా జాగ్రత్త పడుతూనే తెలంగాణను రాజకీయంగా వశం చేసుకోవాలన్న కుయుక్తులు పన్నుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఎంత గొప్పగా చెప్పుకున్నా, అమరావతితోపాటు, ఏపిలో రియల్‌ బూమ్‌ కనిపించడం లేదు. అమరావతిని ఎంతగా అభివృద్ది చేయాలన్నా కాలం కలిసి రావడం లేదు. ఏళ్లుగా ఎదురుచూసి మొదలు పెట్టిన పోలవరం ఇంకో దశాబ్ధం గడిచినా పూర్తవుతుందన్న నమ్మకం లేదు. కొత్తగా సాగునీటి ప్రాజెక్టులేవైనా సరే తెలంగాణ నుంచి వ్యతిరేకత తప్పడం లేదు. అందువల్ల ఏపిలో వాతావరణ అననుకూలతలే ఎక్కువ. వ్యవసాయం, మత్స్య రంగాలు తప్ప మరో పారిశ్రామిక ప్రగతి జరిగే పరిస్దితి కనిపించడం లేదు. ఐటి రంగం కూడా విస్తరించే అవకాశాలు కనిపించడంలేదు. మరో వైపు ఏసి. సిఎం. చంద్రబాబు నాయుడు కూడా ఖజానా చూస్తే భయమేస్తుందన్నాడు. సంపద సృషించాలని వుంది. ఎవరైనా సలహాలు ఇవ్వండి అని కూడా చెప్పే పరిస్దితి వచ్చింది. కేంద్రంలో కీలక భూమిక పోషిస్తున్నా నిధుల వరద పారడం లేదు. ఏ రకంగా చూసినా ఏపిలో పెట్టుబడులు పెట్టాలన్నా ఎవరూ ముందుకు రావడంలేదు. ఇలాంటి పరిస్దితుల్లో తెలంగాణలో రాజకీయాల్లోపాగా వేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదన్న భావన వారిలో కనిపిస్తోంది. ఎంత లేదన్నా తెలంగాణలో 64 నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్దితిలో ఏపి నుంచి స్దిరపడిన వాళ్లు వున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎంత మంది సీమాంధ్ర మూలాలున్న వారున్నారనే లెక్కను ఆ ప్రాంతానికి చెందిన వాళ్లు ఓ సంపూర్ణ సర్వే చేసి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌, రంగారెడ్డి రెండు జిల్లాల్లో సుమారు33 లక్షల మందికి పైగా సీమాంద్ర మూలాలున్న వాళ్లున్నారు. మిగత జిల్లాలైనా ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాలన్నింటిలో కలిపి 34లశ్రీల మంది సీమాంధ్రకు చెందిన వాళ్లున్నారు. ముఖ్యంగా ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఎక్కువ మంది వున్నారు. కుటుంబాల పరంగా చూసుకుంటే ఖమ్మం, నిజాబాబాద్‌ జిల్లాల్లో ఎక్కువగా వున్నారు. అందుకే ఖమ్మం జిల్లాలో తెలంగాణ వాదం వున్నప్పటికీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ప్రజలు స్దానం కల్పించడం లేదు. సీట్లు ఇవ్వడం లేదు. గతంలో వామపక్షాలు, కాంగ్రెస్‌ ఎక్కువ ప్రభావం చూపేవి. తర్వాత తెలుగుదేశం వచ్చిన తర్వాత ఖమ్మంలో ఎక్కువగా వారి ప్రాభల్యం నడిచింది. ఇప్పుడు తెలుగు దేశం లేకపోవడంతో, కాంగ్రెస్‌కు ఆ ఓటు బ్యాంక్‌ షిఫ్ట అయ్యింది. మళ్లీ తెలుగుదేశం పురుడు పోసుకుంటే, ఆ ఓట్లన్నీ ఆ పార్టీ వైపు మళ్లించొచ్చన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. అందుకే గత రెండేళ్ల కాలంలో ఎన్టీఆర్‌కు చెందిన శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్‌, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్కో ఎక్కువగా నిర్వహిస్తూ వచ్చారు. ఎక్కడైతే ఎన్నికలను తీవ్రంగా ప్రభావితం చేసే స్ధానాలున్న చోట అవసరమైతే ఎన్నికల బరిలోకి దిగి ఓటు బ్యాంకును పదిలం చేసుకోవాలని చూస్తున్నారు. అయితే తెలంగాణలో పాగా వేయాలంటే ముందు రెండు కులాల మధ్య రాజకీయాలను పక్కన పెట్టి, పార్టీలకతీతంగా కలిసి పనిచేయాలని అనుకుంటున్నారు. కేసిఆర్‌ వల్ల తెలంగాణకు ఎట్టిపరిస్దితుల్లో వైసిపి రాదు. జనసేనకు పెద్దగా తెలంగాణలో స్కోప్‌ లేదు. ఇక మిగిలింది రెండు కులాల రాజకీయం. కొంత కాలం కలిసి పనిచేస్తే చాలు తెలంగాణలో పాగా వేయడం పెద్ద సమస్య కాదన్న సమాలోచనలు చేసినట్లు తెలిసింది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో స్దిరపడిన ఏపి మూలాలున్న వారిలో ఇప్పటికీ తెలంగాణ భావన లేదు. ఎందుకంటే నలభై యాభై సంవత్సరాల క్రితం తెలంగాణకు వచ్చి స్ధిరపడినా, వారి కుటుంబ బందాలు, బాంద్యవ్యాలు ఏపితోనే కలిసి వున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత యువత, ఐటి రంగం విస్తరించిన తర్వాత జరిగిన వివాహాలలో రెండు ప్రాంతాల మద్య వివాహ బందాలు కొన్ని పెరిగాయి. అది 3 నుంచి 7శాతంగా గుర్తించినట్లు తెలుస్తోంది. రెండు ప్రాంతాల మధ్య వివాహ సంబందాలు కూడా మెరుగుపడుతున్నాయి. ఈ సమయంలో సమైక్యాంధ్ర అనే నినాదం కన్నా, రెండు రాష్ట్రాలలో పాతుకపోవడమే మేలన్న అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమౌతోంది. గత ఎన్నికల్లో సీమాంధ్ర మూలాలున్న వాళ్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొంత మంది కాంగ్రెస్‌కు అనుకూలంగా చేశారు. మరి కొంత మంది బిఆర్‌ఎస్‌కు అనులంగా ఓట్లు వేశారు. మెజార్టీ ప్రజలు బిఆర్‌ఎస్‌వైపే మొగ్గు చూపారు. కాంగ్రెస్‌ను నమ్మడానికి ఆసక్తి చూపలేదు. కాని ఇక్కడ నుంచి ఏపికి వెళ్లి, రెండు చోట్ల ఓట్లు వుండడంతో తెలుగుదేశాన్ని గెలిపించుకున్నారు. ఆ ఓట్లే కూటమి విజయానికి దారులువేసింది. కూటమికి ప్రతిపక్షం లేనంత మెజార్టీని కట్టబెట్టింది. తెలంగాణలో కూడా అదే జరిగితే, కాంగ్రెస్‌కు పూర్తి స్దాయి మద్దతు పలికితే బిఆర్‌ఎస్‌ ఉనికి లేకుండాపోయేది అన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే తెలంగాణ గ్రామీణ ప్రజలు బిఆర్‌ఎస్‌ను కాదనుకున్నారు. కాని హైదరాబాద్‌ ప్రజలు బిఆర్‌ఎస్‌ను గెలిపించారు. అంటే సీమాంధ్ర ప్రజలు కాంగ్రెస్‌ వైపు నిలుస్తారని ఏపికి చెందిన నాయకులు, పారిశ్రామిక వేత్తలు ఊహించుకున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ప్రచారం వదిలేశారు. గత ఎన్నికల్లో ఏపికి చెందిన నాయకుల అనుచరులుపెద్దఎత్తున తెలంగాణలో ప్రచారంలోపాలుపంచుకున్నారు. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్‌, నిజామాబాద్‌, నల్గొండలలో కాంగ్రెస్‌ నాయకులకు పనిచేశారు. కాని హైదరాబాద్‌లో అర్భన్‌ ప్రజలు బిఆర్‌ఎస్‌వైపు నిలుస్తారని ఊహించలేదు. ఎక్కడైతే నెగ్గుతామనుకున్నారో అక్కడ ఓడిపోయారు. ఎక్కడైతే నెగ్గలేమనుకున్నారో అక్కడ కాంగ్రెస్‌ను గెలిపించారు. ఇకపై అలాంటి తప్పు చేయొద్దు. ఈసారి ఎన్నికలో నిలిచే ప్రయత్నాలను వదలుకోవద్దని నిర్ణయం తీసుకున్నారు. ముందుగా జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో తెలుగుదేశం తరుపున రంగంలోకి దిగితే ఓట్ల లెక్క కూడా పక్కాగా తెలుస్తుంది. అప్పుడు చాప కిందనీరులా హైదరాబాద్‌, రంగారెడ్డిలలో మాత్రమే ప్రచారం మూడేళ్ల ముందు నుంచే మొదలుపెట్టాలనుకుంటున్నారట. ఖమ్మం లాంటి జిల్లాల్లో ప్రత్యేకంగా శద్ద్ర పెట్టాల్సిన అసవరం లేదని తేలింది. హైదరాబాద్‌లోనే అసలైన దృష్టి కేంద్రీకరించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

కమిటీలకు దిక్కు లేదు..కార్యకర్తలకు గుర్తింపు లేదు!

`వాళ్ల కష్టానికి ఫలితం లేదు.

`అన్ని పార్టీలది అదే తీరు.

`ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తుకొస్తారు.

`ఏళ్లకేళ్లు వెట్టి చాకిరి చేయించుకుంటారు.

`కడుపు కట్టుకొని పార్టీ కోసం కార్యకర్తలు పని చేస్తారు.

`జెండాలు కట్టడానికి, నాయకులకు సలాం కొట్టడానికి పనికొస్తారు.

`సభలు పెడితే జేజేలు కొట్టడానికి అవసరౌతారు.

`పథకాల అమలులో కూడా వివక్షకు గురౌతారు.

`సొంత పార్టీ వాళ్లకే ప్రయోజనమౌతుందని కార్యకర్తలను పక్కన పెడతారు.

`ఓట్లేయించేందుకు మాత్రమే కార్యకర్తలు అవసరమౌతారు.

`పార్టీ కోసం ఏం ఆశించకుండా పని చేస్తారని గొప్పలు చెప్పి నోరు మూయిస్తారు.

`అడుగడుగునా మాయ చేసి చెప్పు చేతుల్లో వుంచుకుంటారు.

`నాయకులు గ్రూపులు కట్టి కార్యకర్తలను విభజిస్తారు.

`సొంత పార్టీలలోనే కార్యకర్తలు శత్రులయ్యేలా చేస్తారు.

`నాయకులు మాత్రం చెట్టా పట్టాలేసుకొని తిరుగుతారు.

`గ్రామ, మండల కమిటీలు వేయకుండా కార్యకర్తలను ఆశల పల్లకిలో ఊరేగిస్తారు.

`కమిటీలెప్పుడు వేసినా పదవి నీకే అని అందరికీ చెప్పి కాలయాపన చేస్తారు.

`పై స్థాయిలో వున్న వాళ్లు ఒక్కొక్కరు నాలుగు పదవులు చేపడతారు

`కుటుంబంలో వున్న వాళ్లకు పదవులు పంచుకుంటారు.

………………………..

`పదేళ్లు అధికారంలో వున్నా ‘‘బిఆర్‌ఎస్‌’’ కార్యకర్తలు బతికింది లేదు.
`అప్పుల పాలై దివాళా తీసినా ఒక్కరినీ ఆదుకున్నది లేదు.
`నామినేటెడ్‌ పదవులిచ్చి గౌరవించింది లేదు.
`కనీసం పార్టీ కమిటీలు వేసి పదవులు అప్పగించింది లేదు.
`ఇప్పటికీ ‘‘బిఆర్‌ఎస్‌’’ కమిటీలు వేయాలన్న సోయి లేదు.
……………………….
`కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు కావొస్తోంది.
`పార్టీ కమిటీలకు దిక్కు లేదు..
`పూర్తి స్థాయిలో నామినేట్‌ పదవులు పంచింది లేదు.
…………………..
`బిజేపి ఇందుకు తీసిపోయిందేమీ లేదు.
`ఆ పార్టీ అనుసరిస్తున్నది అదే తీరు.
`మూడు పార్టీలలో కమిటీలకు దిక్కు లేదు.
`ఎన్నికల పేరు చెప్పుకొని నాయకులు ఎగేసుకొస్తారు.
`గెలిపించే బాధ్యత మీదే అని కార్యకర్తలను ఆకాశానికెత్తురు.
`మీరు లేకుండా పార్టీయే లేదని ఉబ్బిస్తారు.
`ఎన్నికలైపోయిన తర్వాత ముఖం చాటేస్తారు.
`కార్యకర్తలు కరివేపాకులు..రాజకీయాలలో గోలించి పడేస్తారు!

హైదరాబాద్‌,నేటిధాత్రి:
రాజకీయ నాయకులు, కార్యకర్తలు అనగానే ఖద్దరు చొక్కాలు. రేబాన్‌ కళ్లజోళ్లు. కాళ్లకు ఖరీదైన చెప్పులు. అయితే టూవీలర్‌, లేకుంటే కారు. కాలు తీసి బైట పెడితే చాలు గౌరవాలు. మర్యాదలు. పైరవీలు. ప్రజ సమస్యలు. అబ్బో ఆ సెటప్పే వేరు. కనిపించిన వాళ్లను పలకరించడం. వారికి టీలు తాగిపించడం. అవసరమైతే టిఫిన్లు చేయించడం. ఇలా చెప్పుకుంటూ పోతే నిత్యం అదో సంతర్పణ కార్యక్రమం. ఇదంతా ఎలా? అనుకుంటే సమాధానం చెప్పడానికి నోరు రాదు. కడుపు చించుకుంటే కాళ్లమీద పడేంత దుఖం. కాని పైకి మాత్రం చెరగని చిరునవ్వు. నోరు తెరిస్తే కోట్ల రూపాయల రియల్‌ వ్యాపారం మాటలు విన పక్కవాళ్లు అబ్బో అనుకోవాలి. అంతే కాని అబ్బా..అనేలా వుండకూడదు. అలా మెంటైన్‌ చేయకపోతే నాయకుడే కాదు. కార్యకర్త కూడా కాదు. కాని ఇంత హడావుడి చేస్తున్నా ఆయా రాజకీయ పార్టీలలో వారి పదవులు ఏమిటని మాత్రం ఎవరూ అడగొద్దు. ఎందుకంటే కొంచెం వయసు చిన్నదైతే కార్యకర్త. కాస్త పెద్ద వయసైతే సీనియర్‌ కార్యకర్త. ఇక వాళ్లు పార్టీల కోసం పడే కష్టం అంతా ఇంత కాదు. ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు కేక వేస్తే చాలు జీ హుజూర్‌ అని వాలిపోవాల్సిందే. చేతులు కట్టుకొని నిలడాల్సిందే. నోరు నొచ్చేదాకా ఆ పార్టీ నాయకులు జేజేలు కొట్టాల్సిందే. పార్టీ కండువాలు మెడలో వేసుకొని, జెండా కూడా మోయాల్సిందే. ఇంతగా పార్టీకి సేవ చేస్తున్నా పదవులు ఇస్తారా? ఇస్తాం..ఇస్తామంటూ ఊరిస్తారు. పుణ్యకాలం పూర్తయ్యేదాకా వాయిదా వేస్తూ వెళ్లాల్సిందే. అధికారంలో వున్నప్పుడు నాయకులు ఊడిగం చేయాలి. ప్రతిపక్షంలో వున్నప్పుడు పార్టీకి రక్షణ కవచాలు కావాలి. ఒక రకంగా చెప్పాలంటే మొత్తానికి పార్టీ కార్యకర్తలు వెట్టి చాకిరీ చేసే కూలీలుగా మారిపోవాలి. ఇంతకు మించి రాజకీయం అంటే చెప్పుకోవడానికి ఏదీ వుండదు. పార్టీ పేరు చెప్పి బతికే కొంత మంది లైక్యం తెలిసిన కారకర్తలుంటారు. చిన్నా చితక పైరవీలతో నాలుగు రూపాయలు సంపాదించుకుంటారు. నాయకులు చెప్పి పనులు చేయించుకుంటారు. ఇది కూడా ఏ ఐదు శాతమో వుంటారేమో? కాని మిగతా నాయకులంతా జేజేలు కొట్టడం మాత్రం చేస్తుంటారు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా పదవి రాకపోతుందా? అని జీవితాంతం ఎదురు చూస్తుంటారు. జీవితాంతం కార్యకర్తగానే మిగిలిపోయిన వాళ్లు కొన్ని లక్షల మంది వుంటారు. కడుపు కట్టుకొని పార్టీకి సేవ చేస్తుంటారు. అప్పులు చేసిన పార్టీ కోసం పనిచేస్తుంటారు. ఆస్ధులు అమ్ముకొని రాజకీయాల్లో సాగుతుంటారు. ఇంత చేస్తున్నా నాయకులకు సలాం కొట్టడానికి మాత్రమే వుంటారు. నాయకుడు ఫోన్‌ చేస్తే క్షణాల్లో వాలిపోతారు. నాయకుడు కదలమని చెప్పేదాకా అక్కడే పడిగాపులు కాస్తారు. నిజం చెప్పాలంటే ఇది రాజకీయం కాదు. నాయకులకు ఊడిగం చేయడం. సరే ఇంత చేస్తున్నా ప్రభుత్వ పథకాలనైనా కార్యకర్తలకు అందుతాయా? అదీ వుండదు. ఎందుకంటే అడుక్కుంటే చులకనౌతాడు. పట్టుబట్టి తీసుకుందామంటే నాయకుల ఆగ్రహానికి గురౌతారు. మనం పంచే స్దితిలో వున్నాం. అడుక్కుంటామా? అని చెప్పే నాయకుల మాటలకు తలవంచేవాళ్లుంటారు. సర్ధుకుపోయే మనస్తత్వమే అలవాటు చేసుకుంటారు. పథకాలు పార్టీ కార్యకర్తలకే పంచుకుంటున్నారన్న అవపాదు మోయొద్దని నాయకులు చెప్పే మాటలు విని ఆశలు చంపుకుంటారు. ఇది అన్ని పార్టీలలో వుండే కార్యకర్తల దీనస్ధితికి నిదర్శనం. కనీసం పార్టీ పదవులు ఇచ్చారా? అంటే అదీ లేదు. బిఆర్‌ఎస్‌ పార్టీ పదేళ్ల కాలం అదికారంలో వున్నా ఇప్పటి వరకు సంస్ధాగత నిర్మాణం ఎక్కడా జరగలేదు. మాటలకు మాత్రం 60లక్షల మంది కార్యకర్తలున్నారని గొప్పగా చెబుతారు. కాని ఎంత మంది కార్యకర్తలకు పదవులిచ్చారన్నది చెప్పరు. ఇప్పటికీ గ్రామస్దాయి నుంచి రాష్ట్ర స్దాయి వరకు పదవుల పంపకాలు లేవు. పదేళ్ల అదికారంలో నామినేటెడ్‌ పదువులు కొద్ది మందికి తప్ప పూర్తిగా ఇచ్చింది లేదు. నాయకుల ఇంట్లో ఒక్కొక్కరికి నాలుగు పదవులు పంచారు. అదే కుంటుంబంలో నలుగురున్నా పదవులు పంచారు. కాని పార్టీ కోసం పనిచేసిన ఎంతో మంది కార్యకర్తలకు ఆఖరులోకూడా పదవులు పంచలేదు. వారి జీవితాలను నిలబెట్టలేదు. కార్యకర్తలంటే ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకొచ్చే వాళ్లుగా మారిపోయారు. ఎన్నికల సమయంలో జనాన్ని పోగేసుకునేందుకు పడే అవస్దలు కార్యకర్తలతో తీర్చుకుంటున్నారు. వారిని కూరలో కరివేపాకులు చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వచ్చిన కష్టాలు పగ వాడికి కూడా రాకూడదనుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన నాయకులకు కూడా పదవులు లేదు. గుర్తింపు లేదు. కొత్త నీరుకు పెద్దగా పని లేదు. పదేళ్ల తర్వాత అదికారంలోకి వచ్చామన్న సంతోషమే తప్ప, పదువులు అందక ఇబ్బందులు పడుతున్నారు. రేపు, మాపు అనుకుంటూ ఇప్పటికీ ఏడాదిన్న కాలం చూస్తుండగానే కరిగిపోయింది. పార్టీ అదికారంలోకి వస్తే అంతా ఇక మా కాలామే..మా రాజ్యమే అనుకున్న ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు పదవుల రాక యాతన పడుతున్నారు. కనీసం చెప్పుకోవడానికిపార్టీ పదవులు కూడా ఇంకా పూర్తి స్ధాయిలో పంపకాలు జరగలేదు. మాకు ఎప్పుడు అవకాశాలు వస్తాయో అని ఎదరుచూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే పదవులు అందుకుంటామనుకున్నారు. కాని రెండేళ్ల దగ్గర పడుతున్నా ఎదరు చూపులు తప్పడం లేదు. ..పదవులకోసం పడిగాపులు తప్పడం లేదు. అదికారంలోకి వచ్చి ఏడాదిన్నరౌతుంటే ఆశలు ఆవిరౌతాయేమోనన్న ఆందోళనలో వున్నారు. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్ధితుల్లో రియల్‌ వ్యాపారం కూడా సాగడం లేదు. కాంగ్రెస్‌ నాయకులకు ఆ రకంగా కూడా కలిసి రావడం లేదు. రేవంత్‌ సర్కారు తీసుకొస్తున్న కొన్ని సంస్కరణల మూలంగా వున్న ఉపాధి కూడా పోయిందని రియల్‌ వ్యాపారం చేసే కాంగ్రెస్‌ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. హైడ్రా వల్ల హైదరాబాద్‌లో భూముల అమ్మకాలు,కొనుగోలు ఆగిపోయింది. భూములు కొనాలంటేనే జనం భయడిపోవాల్సి వస్తోంది. వారికి భరోసా ఇచ్చే ధైర్యం ఎవరూ చేయలేకపోతున్నారు. ఇక ధరణి పేరుతో బిఆర్‌ఎస్‌ నాయకులు, అధికారులు కొంత బాగు పడ్డారు. భూ భారతి వచ్చినా, కాంగ్రెస్‌ నాయకుల సమస్యలు తీరడం లేదు. వారికి ఏదీ కలిసి రావడం లేదు. దాంతో పార్టీపరమైన పదవులు వచ్చినా చెప్పుకోవడానికి ఒక హోదా వుంటుందని అనుకుంటున్నా అవీ రావడం లేదు.ద అన్ని స్దాయిలో నాయకులకు ఎప్పుడొస్తాయో పదవులు అని ఎదురుచూస్తున్నారు. పైగా తమకు వస్తాయా? లేక ఇతరులకు వస్తాయా? కూడా అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. అదే సమయంలో ఎక్కడిక్కడ నాయకులనే నిలదీసేంద ధైర్యం చేస్తున్నారు. ప్రభుత్వ పధకాలు అందక, పార్టీ పరమైన పదవులు అందక, ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేతికి రాక ఆర్ధికంగా నాయకులు చితికిపోతున్నారు. అప్పుల పాలౌతున్నారు. చిన్నా చితక కాంట్రాక్టులు వచ్చిన బాగుండని అనుకుంటున్నారు. పల్లెల్లో మొరం పనులు కూడా రాక సతమతమౌతున్నారు. రోడ్డెక్కితే వందలు ఖర్చవున్నాయి. నాయకులు చుట్టూ తిరిగేందుకు వేలకు వేలు ఖర్చవుతున్నాయి. నాయకులు మాటలు నమ్మి తిరిగాల్సిన పరిస్తితి ఎదురౌతోంది. ఇంట్లో కూర్చోలేరు. చేతిలో వున్న పైకం ఖర్చు చేసుకుంటూ సాగలేరు. ఇక పదవులు, పదువులు అని కలవరిస్తూ, ఏ కార్యక్రమం పెట్టినా పై స్దాయి కాంగ్రెస్‌ నాయకులకు ఎదురీతలు తప్పడం లేదు. కార్యకర్తల ప్రశ్నలు ఎదుర్కొ తప్పించుకునే పరిస్దితి లేదు. ఇక కాంగ్రెస్‌ అంటేనే గ్రూపులు. ఆ గ్రూపుల మధ్య సమన్వయం నాయకులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. పదేళ్ల తర్వాత అదికారంలోకి వచ్చినా కష్టాలు తీరడం లేదని కార్యకర్తలు మొత్తుకుంటున్నారు.. అధికార పార్టీలో నాయకులుగా వుంటూ కూలీ చేసుకోలేరు. ఊరికి పరిమితమై వుండలేరు. నాయకుల పర్యటనల్లో పాలు పంచుకోక వుండలేరు. ఎక్కడా పనులు లేవు…చేతికి పైకం అందింది లేదని మదనపడుతున్నారు. ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటూ ఓదార్చుకుంటున్నారు. అధికారంలోవున్నామన్న మాటే కాని అణా సంపాదన లేదంటూ నిట్టూర్చుతున్నారు. . ఖర్చులు మాత్రం ఆగడం లేదు..కార్యకర్తల పోషణ తప్పడం లేదు. ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంటికొచ్చి కార్యకర్తలు విసుక్కుంటున్నారు. మంత్రుల మందే నాయకులు తిట్టుకుంటున్నారు. కొన్నిచోట్ల నాయకులు కొట్లాడుకుంటున్నారు. సెక్యూటిరీని కూడా నెట్టేసుకుంటే కష్టాలు చెప్పుకుంటున్నారు. గందరగోళంలో పార్టీ శ్రేణులు. స్దానిక సంస్దల ఎన్నికలు రావడం లేదు..పదువుల అందుతాయా అన్నదిగులు. అధికారంలోవున్న మాటే గాని, సంతోషం ఎక్కడా కనిపించడం లేదు. బిజేపి నాయకులు, కార్యకరర్తల పరిస్ధితులు ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అక్కడ కూడా అదే పరిస్దితి. కార్యకర్తలకు పదవులు ఇచ్చింది లేదు. కేంద్రంలో పార్టీ అదికారంలోవున్నా గ్రామీణస్దాయి నాయకులకు నామినేటెడ్‌ పదవులు పంచింది లేదు. కార్యకర్తలు కూరలో కరివేపాకులు..రాజకీయాల్లో గోలించి పడేస్తున్నారు.

42శాతం ఒక విప్లవం..కాంగ్రెస్‌ బడుగులకు వరం?

దేశంలో ‘‘మొదటి రాష్ట్రంగా’’ కీర్తిని సంపాదించుకునే ప్రభుత్వం.

`బీసీల చేతుల్లోకి పంచాయతీ పాలన!

`బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలుతోనే ఎన్నికలు.

`ఇక తెలంగాణల పల్లె పాలనలో బీసీలదే అగ్రభాగం.

 

`ఇంత గొప్ప నిర్ణయం చేసినా కాంగ్రెస్‌ శ్రేణులు ఏం చేస్తున్నారు.

`కనీసం క్యాబినెట్‌ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసే తీరిక లేదా!

`ప్రచారం చేసుకునే సోయి కూడా లేదా!

`బీసీరిజర్వేషన్‌ ఆర్డినెన్స్‌ పై జాగృతి సంబరాలు చేస్తుంటే కనిపించడం లేదా!

`క్రెడిట్‌ మాదే అని జాగృతి ప్రకటనలు చేస్తుంటే చూడడం లేదా!

`మంత్రులందరూ ఏం చేస్తున్నారు.

`ఎమ్మెల్యేలందరూ ఏ పనిలో వున్నారు.

`కనీసం నాయకులకు, కార్యకర్తలకు చెప్పినా చేసే వాళ్లు.

`మంత్రి పొంగులేటి క్యాబినెట్‌ బ్రీపింగ్‌ ఇచ్చిన వెంటనే పిసిసి ఏం చేస్తున్నాట్లు!

`ముఖ్యమంత్రి రేవంత్‌ తర్వాత ఆక్టివ్‌గా వుండేది ఇద్దరు మంత్రులేనా?

`పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ లకు తప్ప మిగతా వారికెవ్వరికీ పట్టదా?

`బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అనేది సంచలనమైన నిర్ణయం.

`ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతమైన నిర్ణయం.

`ఇంత గొప్ప కార్యక్రమాన్ని ప్రచారం చేసుకోవడంలో కాంగ్రెస్‌ వెనుకబడితే ఎలా?

`మా ఒత్తిడి వల్లనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని ఇతర పార్టీలు ప్రచారం చేసుకుంటాయి.

`తెలంగాణ ఇచ్చినా అప్పుడు ప్రచారం చేసుకోలేకపోయారు.

`రుణమాఫీ విషయంలో అదే పొరపాటు చేశారు.

`సన్న బియ్యంపై అనుకున్నంత ప్రచారం చేసింది లేదు.

`ఇందిరమ్మ ఇండ్లను కూడా ప్రచారం చేసుకునే ఓపిక కాంగ్రెస్‌ నాయకులకు లేదు.

`బీసీల రిజర్వేషన్‌ మీద ఎవ్వరూ నోరు మెదపడం లేదు.

`గతం ప్రభుత్వానికి మించి పాలన సాగిస్తున్నా చెప్పుకునే దిక్కు కాంగ్రెస్‌ లేదు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హమీ మేరకు బిసిలకు 42శాతం రిజర్వేషన్‌ అమలు దిశగా అడుగులు వడివడిగా పడుతున్నాయి. సెప్టెంబర్‌ ఆఖరులోగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశంతోపాటు, 42 శాతం బిసి రిజర్వేషన్‌ అమలు చేయడం పై కాంగ్రెస్‌ పార్టీ సిరియస్‌గా దృస్టిపెట్టింది. నిజం చెప్పాలంటే ఇది ఒక విప్లవాత్మకమైన నిర్ణయంగా దేశ చరిత్రలో లిఖించబడుతుంది. సిఎం. రేవంత్‌రెడ్డి పేరు చిరస్ధాయిగా నిలిచిపోతుంది. మనదేశంలో బిసిల జనాభా మేరకు ఎన్నికల్లో అవకాశాలు కల్పించాలన్న డిమాండ్‌ ఎప్పటి నుంచో వుంది. కాని డెబ్బై ఏళ్లలో ఏనాడు, ఏ స్దాయిలో ఇంత వరకు అమలుకు నోచుకోలేదు. అందుకు సుప్రింకోర్డు ఆదేశాలు కూడా అడుగడుగునా అడ్డుపడుతూ వస్తున్నాయి. ఒకవేళ సుప్రింకోర్టు తీర్పు అడ్డులేకపోతే అమలు చేసేవాళ్లమని పదే పదే అనేక పార్టీలు చెప్పుకున్న సందర్బాలున్నాయి. దాట వేసేందుకే ఎక్కువ ఇష్టపడేవి. బిసిల మీద ప్రేమ ఒలబోస్తున్నట్లు నటిస్తూనే బిసిల రిజర్వేషన్‌ అమలుచేయాలంటే దైర్యం చేయలేకపోయాయి. బిసిలు రాజకీయంగా ఎదిగితే ఓసిల రాజకీయానికి మరణ శాసనమే అని భావించేవారు. అందుకే బిసిలను రాజకీయంగా ఎదగకుండా ఎప్పటికప్పుడు ఏదో సానును చూపిస్తూ వుండేవారు. మొత్తానికి బిసిలను ఎదగకుండా చేశారు. ఇప్పుడ బిసిలకు 42శాతం ఎట్టిపరిస్ధితుల్లోనూ రిజర్వేషన్‌ అమలు చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం గట్టిగా నిర్ణయం తీసుకున్నది. ఈ విషయంలో ముందుకు పోవడం తప్ప వెనకడుగు వేసే ప్రసక్తి లేదన్నట్లే వుంది. బిసిల రిజర్వేషన్‌ ఎలా అమలు చేయాలన్నదానిపై క్యాబినేట్‌లో సుధీర్ఘమైన చర్చ జరిగింది. అందుకోసం ఆర్డినెన్స్‌ జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పనిలో పనిగా మరోసారి అత్యవసర అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి, కేంద్రానికి మరోసారి తీర్మాణాన్ని పంపించాలనుకుంటున్నారు. తర్వాత కేంద్రంపై ఒత్తిడి తేవాలని చూస్తున్నారు. ఏది ఏమైనా బిసి రిజర్వేషన్‌ అమలుకు ఒక దారి పడినట్లే అని అంటున్నారు. దేశంలోనే ఇది సంచలనామ్మకమైన ప్రక్రియగా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు. తెలంగాణలో అమలు జరిగితే మాత్రం దేశమంతా ఆచరించాల్సిందే అని అంటున్నారు. అది కాంగ్రెస్‌ పార్టీకి దేశ వ్యాప్తంగా ఏంతో మేలు జరుగుతుంది. ఆ పార్టీ దేశ వ్యాప్తంగా బలపేందుకు కూడా మార్గం వేసినట్లౌవుంది. ఒకే దెబ్బకు రెండుపిట్టలన్నట్లు కాంగ్రెస్‌ పార్టీకి దేశ మంతా నీరాజనం పడుతుందని చెప్పడంలో సందేహమే లేదు. తెలంగాణలో బిసిల రిజర్వేషన్‌ అమలు జరడం వల్ల పంచాయతీ ఎన్నికలల్లో బిసిలు రాజకీయంగా మరింత ఎదుగుతారు. రాష్ట్రంలో సగం మంది సర్పంచ్‌లు, ఎంపిపిలు, జడ్పీచైర్మన్‌లు అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. భవిష్యత్తులో బిసి రాజ్యానికి దారి పడుతుంది. ఇంత గొప్ప కార్యాక్రమం చేపట్టాలని సిఎం. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాని అమలుకు దారులు వెతుకుతున్నది. ఇలా క్యాబినేట్‌ తీర్మానం చేసిందనే ప్రకటన వచ్చిన వెంటనే తెలంగాణ వ్యాప్తంగా జాగృతి సంస్ధ సంబరాలు చేసుకున్నది. ఈ విషయం తమ ఖాతాలో వేసుకునే ఎత్తుగడ వేసింది. ఈ మాత్రం సోయి కాంగ్రెస్‌పార్టీ నాయకులకు లేకుండాపోయింది. ఎన్నికల ముందు ఈ హమీ ఇచ్చి, ఇప్పటికే అసెంబ్లీలో తీర్మాణం చేసి, కాంగ్రెస్‌ ప్రభుత్వం డిల్లీకి పంపింది. అంటే బిసిల రిజర్వేషన్‌ అమలు బిల్లు క్రెడిట్‌ అంతా కాంగ్రెస్‌ పార్టీకే చెందాలి. కాని సందిట్లో సడేమియా అన్నట్లు జాగృతి సంబరాలు చేసుకుంటోంది. ఈ సందర్భాన్ని కాంగ్రెస్‌ శ్రేణులు గడ్లప్పగించి చూస్తున్నారు. ఈ మాత్రం బాద్యత లేని కాంగ్రెస్‌ నాయకుల వల్లనే ప్రభుత్వం ఎంత మంచి కార్యక్రమాలు చేసినా ప్రజల్లోకి వెళ్లడం లేదు. ప్రచారం జరగడం లేదు. కాంగ్రెస్‌ పార్టీకి బలం చేకూరడం లేదు. తెలంగాణ ఏర్పాటకు అసలైన నిర్వచనం చెప్పేటు వంటి 42శాతం రిజర్వేషన్ల అమలును కాంగ్రెస్‌ ప్రచారం చేసుకోలేకపోవడం విడ్డూరం. ఇప్పటికే ఏ పధకమైనా, ప్రతిపక్షాలకు సమాదానం చెప్పడంలో అటు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాత్రమే కనిపిస్తున్నారు. అడపా దడపా ఓ ఇద్దరు ముగ్గురు మంత్రులు కనిపిస్తుంటారు. మిగతా మంత్రులు ఏం చేస్తున్నారో అర్ధం కావడం లేదు. వాళ్లు ప్రతిపక్షాల నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చినా సమాదానం చెప్పడానికి ఎప్పుడూ ముందుకు రారు. మాకు సంబంధం లేని విషమనుకుంటారో..లేక సిఎం రేవంత్‌ చూసుకుంటారనుకుంటారో గాని, నోరు విప్పరు. ప్రతిపక్షాలను పల్లెత్తు మాట అనరు. ఇతర సమయాల్లో మాట్లాడలేకపోయినా, బిసిల రిజర్వేషన్‌ అంశంపై కూడా నోరువిప్పకపోతే ఎలా? ప్రభుత్వం తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం స్పందిం చకపోతే ఎలా? మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి క్యాబినేట్‌ బ్రీఫింగ్‌ చేస్తున్నప్పుడే జాగృతి సంబరాలు చేసుకున్నది. ఈసంగతి కాంగ్రెస్‌ నాయకులకు కనిపించడ ంలేదా? ఏకంగా జాగృతి కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. రంగులు చల్లుకున్నారు. క్రెడిట్‌ మాదే అంటూ ప్రకటనలు కూడా చేశారు. కాని ఎక్కడా కాంగ్రెస్‌ నాయకులు కనిపించలేదు. పిసిసి కూడా ఏం చేస్తున్నట్లో అర్ధం కావడం లేదు. దీనిపై ఇతర మంత్రులగాని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్కడా ప్రకటనలు చేయలేదు. మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి చెప్పలేదు. తెలంగాణలో ఎక్కడా కాంగ్రెస్‌ నాయకులు సంబరాలు జరుపుకున్నది లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి పాలాభిషేకాలు జరిపింది లేదు. ఇదే కాదు ప్రజా ప్రభుత్వ ఏర్పాటైన తర్వాత తీసుకున్న అనేక కార్యక్రమాలను కూడా అలాగే నిర్లక్ష్యం చేశారు. మీడియాలో వార్తలు వస్తే స్పందించలేదు. నిజం చెప్పాలంటే 42శాతం బిసిలకు రిజర్వేషన్‌ అనేది దేశంలోనే తొలి రాష్ట్రంగా కీర్తిపొందుతుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి దేశ ప్రజల నుంచి ప్రశంసలు కూడా అందుతున్నాయి. అన్ని రాష్ట్రాలకు ఆదర్శవంతమైన నిర్ణయం చేసినప్పుడైనా కాంగ్రెస్‌ శ్రేణులకు సోయి రాకపోవడం విడ్డూరం. తెలంగాణ ఇస్తే ఏపిలో కాంగ్రెస్‌ పూర్తిగా కనుమరుగౌతుందని తెలుసు. నాయకులతోపాటు, కార్యకర్తలు కూడా ఒక్కరు కూడా లేకుండాపోతారని తెలుసు. భవిష్యత్తులో ఏపిలో కాంగ్రెస్‌ ఉనికిలో వుండదని కూడా తెలుసు. జెండా మోసేవారే కనుమరుగౌతారని తెలుసు. కాంగ్రెస్‌ జండా పట్టుకుంటే ప్రజలే లాక్కుంటారని తెలుసు. మరో వందేళ్లయినా సరే ఏపిలో కాంగ్రెస్‌కు ఊపిరి అనేది లభించదని తెలుసు. అయినా సోనియాగాందీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం తెలంగాణ ఇచ్చారు. అలాంటి తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ కనుమరుగౌతుందని ఎవరూ ఊహించలేదు. తెలంగాన ఇచ్చిన వెంటనే బిఆర్‌ఎస్‌ సంబరాలు చేసుకున్నది. తెలంగాణ తెచ్చింది మేమే అని ప్రజలను నమ్మించింది. కాని తెలంగాణ ఇచ్చింది మేమే అని అప్పుడు కాంగ్రెస్‌ నాయకులు బలంగా చెప్పుకుంటే పరిస్దితి మరోలా వుండేది. కాంగ్రెస్‌ అప్పుడే గెలిచేది. కాని ఆనాడు కూడా కాంగ్రెస్‌ నాయకులు అదికారం రాదన్నట్లే చేతులెత్తేశారు. అలా రెండు ఎన్నికల్లోనూ తెలంగాణ ఇచ్చింది మేమే అని బలంగా చెప్పుకోలేకపోయారు. పిసిసి. అధ్యక్షుడుగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఈ ప్రచారం మొదలైంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క అవకాశమివ్వాలని రేవంత్‌ రెడ్డి తెలంగాణ ప్రజలను ఎంతో విన్నవించుకున్నారు. ఏపిలో పార్టీకి తీరని నష్టమైనా సరే తెలంగాణ ఇచ్చిన సోనియాగాందీకి కృతజ్ఞత తెలియజేయాలని కోరారు. కాంగ్రెస్‌ను గెలిపించాలని కాలుకు బలపం కట్టుకొని తిరిగారు. అప్పుడు గాని ఇతర కాంగ్రెస్‌ నాయకులకు జ్ఞానోదయం కాలేదు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా అనేక గొప్ప కార్యక్రమాలు అమలు చేశారు. పదేళ్ల కాలంలో కేసిఆర్‌కు సాధ్యంకాని రుణమాఫీని ఏక కాలంలో చేపట్టారు. రైతులను రెండు లక్షల రూపాయల రుణమాఫీ నుంచి విముక్తి ప్రసాదించారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్‌ నాయకులు ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మొదటి సారి పేదలకు సన్న బియ్యం రేషన్‌ దుకాణాల ద్వారా అందజేస్తున్నారు. దానిని కూడా ప్రచారం చేసుకోవడానికి కాంగ్రెస్‌ నాయకులు బద్దకిస్తున్నారు. పదేళ్ల తర్వాత ఇందిరమ్మ ఇండ్ల సంబురాలు ప్రజల్లో కనిపిస్తున్నంతగా కాంగ్రెస్‌ పార్టీ నాయకుల్లో కనిపించడం లేదు. ఇది కాంగ్రెస్‌కు భవిష్యత్తులో తీరని నష్టాన్ని మిగిల్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికైనా తేరుకోండి. మేలుకోండి. పార్టీని కాపాడుకోండి. మరింత బలంగా కాంగ్రెస్‌ను నిర్మాణం చేసుకోండి.

ప.బెంగాల్‌ ఓటర్ల జాబితా ప్రక్షాళన

`తృణమూల్‌ కాంగ్రెస్‌లో గుబులు

`వలస కార్మికులు ఓటుహక్కును కోల్పోయే ప్రమాదం

`ఇదే జరిగితే తృణమూల్‌ భవిష్యత్తు అంధకారం

`సుప్రీంకోర్టును ఆశ్రయించిన పార్టీ

`బీజేపీ మాస్టర్‌ స్ట్రోక్‌తో తృణమూల్‌ విలవిల

డెస్క్‌,నేటిధాత్రి:

పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితాలో పెద్దఎత్తున మార్పులు చేయాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయిచిన నేపథ్యంలో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి గొంతులో పచ్చివెలక్కాయపడిన చం దంగా మారింది. ప్రజాప్రాతినిధ్య చట్టం`1950లోని సెక్షన్‌ 20 కింద ఎన్నికల కమిషన్‌ ఈ చర్యకు ఉపక్రమించింది. దీని ప్రకారం దేశంలో ఒక ప్రాంతానికి చెందిన పౌరుడు మరో నగరం లో సాధారణ జీవితాన్ని గడుపుతున్నప్పుడు, తన స్వస్థలంలో సొంత ఇల్లు వున్నప్పటికీ, అతనికి ఓటుహక్కు ప్రస్తుతం జీవిస్తున్న నగరంలోనే వుంటుంది తప్ప తన సొంత వూర్లో వుండదు. దీన్నిఈ సెక్షన్‌ చాలా స్పష్టంగా పేర్కొంటున్నది. ఇప్పుడు పశ్చిమబెంగాల్‌నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు ఇతర రాష్ట్రాల్లో బ్లూకలర్‌ ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. ముఖ్యంగా వీరంతా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నవారే. 2011 జనగణన ప్రకారం ఈవిధంగా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి పనిచేస్తున్న బెంగాలీల సంఖ్య కేవలం 24.1లక్షలు కానీ ప్రస్తుతం ఈ సంఖ్య మూడుకోట్లు దాటిపోయి వుంటుందని అంచనా. అయితే ఇతర రాష్ట్రాల్లో వివిధ రకాల వృత్తుల్లో వైట్‌కాలర్‌ ఉ ద్యోగాల్లో వున్నవారి సంఖ్య ఇందులో చేర్చలేదు. ఇటువంటివారిలో ఓట్లకోసం బెంగాల్‌కు వ చ్చేవారి సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. అయితే సీఈఐసీ అనే ఒక ప్రైవేటు సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ఇతర రాష్ట్రాలకు వలసపోయిన బెంగాలీల సంఖ్య 3.34కోట్లు! అయితే వెస్ట్‌ బెంగాల్‌ మైగ్రెంట్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డులో నమోదు చేసుకున్న వారి సంఖ్య 21.67లక్షలు మాత్రమే. పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వ సమాచారం ప్రకారం ఈవిధంగా వలసలు ప్రధానంగా ముర్షిరాబాద్‌, నాదియా, మాల్డా, బీర్‌భుమ్‌, 24పరగణాల జిల్లాలనుంచి చోటుచేసుకున్నాయి. ఇవన్నీ దాదాపుగా బంగ్లాదేశ్‌ సరిహద్దులో వుండే జిల్లాలు కావడంతో, ఇక్కడికి బంగ్లాదేశీయుల వలసలు అధి కం. బంగ్లాదేశీయులంటే 80శాతం వరకు ముస్లింలే. అయితే వీరెవరికీ పశ్చిమబెంగాల్‌లో జీవనోపాధికి అవకాశాలుండవు కనుక, రెండు మూడు నెలలపాటు ఈ జిల్లాల్లో వుండి తప్పుడు మార్గాల ద్వారా ఆధార్‌కార్డులు, రేషన్‌ కార్డులు సంపాదించి, వీటి ఆధారంతో ఇతర రాష్ట్రాలకు వలసపోతుండటం జరుగుతోంది. ఇటువంటివారికి అవసరమైన సదుపాయాలన్నీ కల్పించేది తృణ మూల్‌ కాంగ్రెస్‌ పార్టీనే. అంటే ఈ పార్టీ అధికారంలో వున్నంతవరకు తమ భద్రతకు ఢోకాలేదన్న అభిప్రాయం ఈ ముస్లింలలో వుంటుంది. ఎన్నికల సమయంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఇతర ప్రాంతాల్లో వుంటున్న ఈ బంగ్లాదేశీ ముస్లింలను, అసవరమైన ఖర్చులన్నీ పెట్టుకొని స్వరాష్ట్రానికి రప్పించి ఓటుబ్యాంకుగా ఉపయోగించుకుంటోంది. అంతేకాదు, రాష్ట్రంలో ఇతర పార్టీలకు ఓట్లు వేసేవారిని లేదా ఇతర పార్టీల కార్యకర్తలను బెదిరించడం, హింసకు పాల్పడటానికి కూడా వీరు గూండాలుగా పనికివస్తున్నారు. స్థానిక బెంగాలీ ముస్లింలు కూడా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం కద్దు. కానీ ఆవిధంగా వెళ్లేవారి సంఖ్య చాలా తక్కువ. అయితే బంగ్లాదేశ్‌ ముస్లింలకు జీవనోపాధికోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకతప్పదు. స్థానిక ఎన్నికలు లేదా అసెంబ్లీ లేదా సాధారణ ఎన్నికలకు ముందు తృణమూల్‌ కాంగ్రెస్‌ పెద్దఎత్తున తన ఓటర్ల సమీకరణ కార్యక్రమాన్ని చేపడుతుంది. ముఖ్యంగా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న బంగ్లాదేశ్‌ వలస కార్మికులను (ముస్లింలు) వారి పేర్లు ఎక్కడ రిజిస్టరయి వున్నాయో తెలుసుకొని ఆయా ప్రాంతాలకు తరలిస్తుంది. ఆవిధంగా వారంతా తమకే ఓటువేసేవిధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇదే సమయంలో ఇటువంటి ఓటర్లకు చార్జీలు పెట్టుకొని కొంత ముట్టచెబుతుండటంతో వీరంతా గంపగుత్తగా తృణమూల్‌ కాంగ్రెస్‌కే ఓట్లు వేస్తున్నారు. నిజానికి అంతకుముందు వామపక్షాలు అధికారంలో వున్నప్పుడు కూడా ఇదే పద్ధతిని అనుసరించాయి.
ఇప్పుడు ఎన్నికల సంఘం ఇటువంటి ఓటర్ల పేర్లను జాబితానుంచి తొలగిస్తే తృణమూల్‌ కాంగ్రెస్‌ పుట్టిమునగడం ఖాయం. బంగ్లాదేశ్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 7.5కోట్లు కాగా ముస్లిం ఓటర్లు 2.25కోట్లు.

ముస్లింఓటర్లు ప్రధానంగా రాష్ట్రంలోని 74 నియోజకవర్గాల్లో కేంద్రీకృతమై వున్నా రు. మరో 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీరు గెలుపును ప్రభావితం చేసే స్థాయిలో వుండటం గమనార్హం. ఇటువంటి నియోజకవర్గాల్లో వలస కార్మికుల ఓట్లను తొలగిస్తే ఇది తృణమూల్‌ కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ కాగలదు. దీనికితోడు పశ్చిమ బెంగాల్‌లో హిందువుల ఓట్లు సుసంఘటి తం కావడం ఇప్పటికే మొదలైంది. ఉదాహరణకు నాదియా జిల్లాలో ముస్లింల జనాభా 30శా తం. వీరిలో చాలామంది ఇతర రాష్ట్రాల్లో జీవనం గడుపుతున్నారు. ఇదే జిల్లాకు చెందిన కాళి గంజ్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2.48లక్షలు. వీరిలో ముస్లిం ఓటర్ల సంఖ్య 1.43లక్షలు. వీరిలో 43వేలమంది ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు కనుక వారు, ఈ ని యోజకవర్గానికి చెందిన సాధారణ పౌరులుగా పరిగణించబడరు. ఫలితంగా ఈ 43వేల ఓట్లను ఎన్నికల కమిషన్‌ తొలగిస్తే, ఈ నియోజకవర్గంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపు చాలా కష్టం కాగలదు. ఇదే పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో కొనసాగుతున్న నేపథ్యంలో, వలస కార్మి కుల పేర్లను తొలగించడం వల్ల రాష్ట్రం మొత్తంమీద వచ్చే ఎన్నికల్లో బీజేపీకి సానుకూలత ఏర్పడగలదు. 2021 అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే దాదాపు 45 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లే మెజారిటీగా వుండటంతో, వీరి ఓట్లతోనే తృణమూల్‌ కాంగ్రెస్‌ గెలిచింది. విశేషమేంటంటే ఈ ని యోజకవర్గాల్లో పోటీచేసిన బీజేపీ అభ్యర్థులు గరిష్టగా 15వేల ఓట్ల తేడాతో ఓటమి చెందడం గమనార్హం. ఈ నేపథ్యంలో వలస ఓట్ల తొలగింపు బీజేపీకి ఎంతటి ప్రయోజనం కాగలదో ఆలో చించవచ్చు. ఇదే సమయంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ లక్షలాది బోగస్‌ ఓట్లను జాబితాలోకి చొ ప్పించడం మరో కారణం. ఎన్నికల సంఘం ఇటువంటి వాటిని కూడా విజయవంతంగా తొలగి స్తే, అప్పుడు నిజమైన ఓటర్లు మాత్రమే ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోగలగుతారు. అయితే ఎన్నికల కమిషన్‌ కేవలం పశ్చిమ బెంగాల్‌ మాత్రమే కాదు బిహార్‌లో కూడా ఈ ప్రక్రి యను మొదలుపెట్టింది. తర్వాత దేశవ్యాప్తంగా దీన్ని అమలుచేయనుంది. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఎన్నికల సంఘం వీటికి తొలి ప్రాధాన్యతనిస్తోంది.
రాబోయే అనర్థాన్ని గుర్తించిన తృణమూల్‌ కాంగ్రెస్‌, తమ ఎంపి మొహువా మొయిత్రా ద్వారా సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలు చేయించింది. ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియను నిలుపు చేయాలన్నది ఈ పిటిషన్‌ సారాంశం. ఎన్నికల సంఘం ఓటర్ల నిరూపణకోసం పదకొండు డాక్యుమెంట్లు కోరింది. వీటిల్లో ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు లేవు. ఎందుకంటే వీటిని విచ్చలవిడిగా దొంగతనంగా సృష్టిస్తున్నారనేది బహిరంగ రహస్యమే. దీంతోఓ తృణమూల్‌ కాంగ్రెస్‌లో ఆందోళన మొదలైంది. దీనివల్ల ఇప్పుడు వలస వెళ్లిన ముస్లిం కార్మి కుల ఓట్లన్నీ రద్దవుతాయి. మొత్తం ఓటుబ్యాంకు కుప్పకూలిపోతుంది. ఈ నేపథ్యంలో కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన చేపట్టాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ యోచిస్తోంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో, ఒకవేళ కోర్టు ఎన్నికల సంఘానికి మద్దతుగా నిర్ణయాన్ని ప్రకటిస్తే ఏంచేయాలన్నది ఇప్పుడు తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకులను తొలుస్తున్న ప్రశ్న! ఏవిధంగానైనా ఈ వలస కార్మికుల పేర్లను ఓటర్ల జాబితానుంచి తొలగించకుండా చూడాలన్న లక్ష్యంతో తృణమూల్‌ కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. ప్రస్తుతానికైతే సుప్రీంకోర్టుపై ఆశలు పెట్టుకుంది! మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి!

’’మునిసిపల్‌ శాఖలో ‘‘ లో ‘‘అవినీతి జలగలు’’ టౌన్‌ ప్లానింగ్‌ లో ‘‘తిమింగలాలు’’! ఎపిసోడ్‌ -1

`కాసుల కక్కుర్తిలో ‘‘టౌన్‌ ప్లానింగ్‌’’ అధికారులు.

`పట్టుబడని బాలకృష్ణ లెందరో..

`ఆదాయానికి మించిన ఆస్తుల దిట్టలు.

`అవినీతి కంపు…అధికారుల పసందు!

`మునిసిపల్‌ శాఖ అంటేనే అవినీతికి తాతలుగా తయారైన అధికారులు.

`టౌన్‌ ప్లానింగ్‌ అంటేనే జనానికి హడల్‌.

`రెసిడెన్షియల్‌ పర్మిషన్‌..కమర్షియల్‌ బిల్డింగ్‌?

`జీ ప్లస్‌ వన్‌ పర్మిషన్‌.. ఆరు ఫ్లోర్లకు నిర్మాణం?

`ఇరుకు సందులు..ఇష్టానుసారం బిల్డింగులు!

`గాలి కూడా దూరనంత సందుల్లో అప్పార్టుమెంట్లు!

`భూమిని గుళ్ల గుళ్ల చేస్తూ బోర్ల మీద బోర్లు.

`నాణ్యత లేని నిర్మాణాలు..పేక మేడల భవంతులు.

`ఫైర్‌ సేఫ్టీ లేకుండానే దొంగ డాక్యుమెంట్లతో నిర్మాణాలు.

`అడుగు తీసి అడుగు వేయలేం.

`రెండు ఆటోలు ఎదురెదురు వస్తే ముందుకు వెళ్ళలేం.

`పదేళ్లలో లక్షల నిర్మాణాలు.

`నిత్యం లక్షలకు లక్షల సంపాదనలు.కోట్ల రూపాయల ఆస్థులు.

`ప్రకృతి విపత్తులొస్తే ఎంత ప్రాణాలు కోల్పోతారో!

`‘‘జిహెచ్‌ఎంసి’’ని చూసి జిల్లాలలో కూడా ఇదే అనుసరిస్తున్నాయి.
వ్రరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం లాంటి నగరపాలికలు కూడా అవినీతి కంపులో కూరుకుపోయాయి.

`ప్రకృతి విరుద్దంగా అధికారుల నిర్ణయాలు.

`‘‘డిల్లీ’’ భూకంపంతో ఒక్కసారిగా ఉలిక్కి పడాల్సి వస్తున్న నగరాలు.

`మున్సిపల్‌ శాఖల అడ్డగోలు అవినీతికి జరిగిన ప్రమాదాలే సాక్ష్యాలు.

`అయినా అధికారులు మారరు.

`ప్రజల ప్రాణాల గురించి క్షణం కూడా ఆలోచించరు.

`పాలకులు పట్టించుకోరు.

`అవినీతి అధికారులు తమ తీరు మార్చుకోరు.

`జిహెచ్‌ఎంసి టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో మరొక ‘‘బాలకృష్ణ’’. ఎపిసోడ్‌ – 2

`పదిలక్షలు ఇస్తే..ఆరు ఫ్లోర్ల వరకు కళ్ళు మూసుకుంట?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

రక్తం మరిగిన పులి, ఎలుకను వేటాడే పిల్లి ఎప్పుడూ ఒకటి కాదు. రెండూ ఆకలి కోసమే అనుకుంటాం. కాని పులి కోపంతో కూడా వేటాడుతుంది. కనిపించిన జంతువునల్నా చంపి తింటుంది. రక్తం మరిగిన పులిలో ఆకలి,కోపం తప్ప విచక్షణ కనిపించదు. సరిగ్గా అవినీతి అలవాటు పడిన కొందరు ఉద్యోగుల తీరు ఇంతకన్నా దారుణంగా వుంటోంది. ఎంత ఆకలైనా గడ్డి తినవు. కాని అవినీతి తిమింగలాలు మాత్రం గడ్డి, గాదం ఏదైనా తింటారు. పుణ్యానికి వస్తున్నాయంటే పినాయిలైనా తాగుతారు. అంత దరిద్రంగా మారిపోయారు. నీతి లేదు, నియమం లేదు. ధర్మాధర్మ విచక్షణ లేదు. కనికరం లేదు. ఉద్యోగం పోతుందన్న బెరుకు లేదు. భయం అసలే లేదు. ఎందుకంటే జీతం కంటే వందల రెట్లు అవినీతి సంపాదన చేతుల నిండా నిత్యం కనిపిస్తుంటే భయం ఎందుకుంటుంది? ఒకప్పుడు ఉద్యోగులంటే సగటు జీతగాళ్లు. నెల నెల వచ్చే జీతంతో బతికే మధ్య తరగతి జీవితాలు అనుకునే వారు. కాని ఇప్పుడు ఉద్యోగం అంటే ఒక కల్పతరువైపోయింది. నిత్య సంపాదనకు నెలవైపోయింది. జేబు నిండడం ఎనాడో మర్చిపోయారు. రోజూ సూట్‌ కేస్‌ నిండితే గాని ఆకలి తీరని జలగలు తయారయ్యారు. నిత్యం ఎంతో మంది పట్టుబడుతూనే వున్నారు. అయినా జంకు లేదు. బొంకడానికి కూడా ఇష్టపడడం లేదు. లంచం తీసుకొని కూడా కుర్చీలో దర్జాగా కూర్చొని ఫోటోలకు ఫోజులిస్తున్నారు. అలాంటి ఉద్యోగులలో రెవిన్యూ, మున్సిపల్‌ శాఖలు అందరికన్నా ముందున్నారు. తెలంగాణ వ్యప్తంగా ఒక్క రోజు జరిగితే అవినీతి అంత ఒక ఎత్తైతే ఒక్క జిహెచ్‌ఎంసిలో జరిగితే అవినీతి అంత ఎత్తుగా సాగుతోంది. ఇంత దుర్మార్గం ఏ రాష్ట్రంలోనూ లేదు. ఇంత విచ్చలవిడి తనం ఎక్కడా కనిపించదు. ఏరాష్ట్రంలోనూ ఇంతటి అవినీతి గలగలున్నట్లు వార్తలు కూడా వుండవు. తెలంగాణలో అధికారుల్లో అవినీతి ఉన్మాదం పెరిగిపోయిందా? అన్నట్లు సాగుతోంది. లంచాలకు బాగా అలవాటు పడ్డారు. జిహెచ్‌ఎంసికి వచ్చే ప్రజలను పీడిరచుకుతింటున్నారు. వారు చెప్పిందే లెక్క. అడిగిందే రొక్కం. అన్నట్లు సాగుతోంది. ఒకప్పుడు లంచమంటే వందలు అనుకునేవారు. ఇప్పుడు వేలు కూడ దాటిపోయింది. లక్షలు,కోట్లు వసూలు చేస్తున్నారు. ఆ మధ్య పట్టుబడిన కీసర ఎమ్మార్వో ఏక కాలంలో తీసుకున్న లంచం ఏకంగా రూ.100 కోట్లు. అది విన్న జనానికి గుండెలు అదిరాయి. అంటే తెలంగాణ వ్యాప్తంగా అవినీతి అనేది ఊడల మర్రిని మించిపోయింది. జిహెచ్‌ఎంసి అధికారులు, ముఖ్యంగా టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అంటే నిత్యం కరెన్సీలతోనే స్నానం అన్నట్లు అవినీతి సాగుతోంది. ఎలాంటి పర్మిషన్‌ కావాలన్నా సరే లక్షలు సమర్పించుకోవాల్సిందే. ఇలా జిహెచ్‌ఎంసిలోని అన్ని సర్కిళ్లలో అవినీతికి అంతు లేకుండాపోతోంది. అడ్డూ అదుపు లేని అవినీతి సంపాదన ఉద్యోగులకు చేరుతోంది. ఓ వైపు సామాన్యులను వేదించుకుతింటున్నారు. అడ్డగోలు నిర్మాణాలు చేసుకునేవారికి అమ్ముడుపోతున్నారు. నగరం ఎలా వుండాలి. ఎలా వుంటే భవిష్యత్తు తరాలకు ఇబ్బందులుండవు. సమాజానికి సమస్యలు ఎదురుకాకుండా వుంటాయన్న సోయి ఏ ఒక్క ఉద్యోగిలోనూ లేకుండాపోతోంది. జిహెచ్‌ఎంసిలో అదికారులు అనుసరిస్తున్న విధానం ప్రజల జీవితాలను ఆగం చేస్తున్నాయని చెప్పకతప్పదు. జిహెచ్‌ఎంసి అంటేనే అవినీతికి తాతలు అనే పేరు సార్ధకం చేసుకుంటున్నారు. ఇక టౌన్‌ ప్లానింగ్‌ అంటేనే జనం జడుసుకుంటున్నారు. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు తలుచుకుంటే ఏదైనా చేయగలరనే దాక వెళ్లిపోతున్నారు. అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్నారు. సక్రమ నిర్మాణదారులను వేదిస్తుంటారు. అక్రమ నిర్మాణదారులు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఎంత చెబితే అంత ముట్టజెబుతారు. అన్నీ వాళ్లే చూసుకుంటారు. అక్రమార్కులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు. బిల్డింగ్‌ మొదలు పెట్టిన నుంచి పూర్తయ్యే వరకు అక్రమ నిర్మాణదారులు ఉద్యోగులను ఇంటి అల్లుడిని చూసుకుంటున్నట్లు చూసుకుంటున్నారు. లంచాలు, విందులు, వినోదాలు అన్నీ అందిస్తున్నారు. కాని సామాన్యులు కనీసం లంచం ఇచ్చుకోలేరు. టౌన్‌ ప్లానింగ్‌ ఉద్యోగులు అడిగినంత సొమ్ము అసలే ఇచ్చుకోలేరు. ఇంకా ఇక్కడ వింతేమిటంటే 60 గజాలు, వంద గజాల స్ధలాలలో సహజంగా జివన్‌ ప్లస్‌ వరకు మాత్రమే అనుమతి వుంటుంది. అంత వరకే నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తారు. కాని అధికారులు అశీస్సులతో నిర్మాణదారులు ఆరు అంతస్ధులు వేసుకున్నా పట్టించుకోరు. అటు వైపు చూడరు. ఎందుకంటే నిర్మాణం చేసుకోపో..అని అభయమిచ్చేదే టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు. అలా ఒకరిని చూసి ఒకరు అదికారులు అడిగింత ముట్టజెప్పి నిర్మాణాలు చేసుకుంటూ పోతున్నారు. ముఖ్యంగా హైటెక్‌సిటీ, …..లలో ఐటి కంపనీలు ఎక్కువ. ఆ ప్రాంతాలలో కొత్తగా వెలిసిన కాలనీలు చూస్తే పద్మవ్యూహమైనా అర్దమౌతుందేమో కాని, ఆ కాలనీలు అర్ధం కావు. అన్ని ఆరు అంతస్ధుల బిల్డింగులే. ఎక్కడ చూసినా ఐటి ఉద్యోగులకు అవసరమైయ్యేలా నిర్మాణం చేసి ఇస్తున్న అద్దె బిల్డింగులే. అరవై, వంద గజాలలో ఆరు అంతస్ధుల నిర్మాణాలు. కనీసం గాలి కూడా దూరనంత సందు కూడా వుండనంత ఇరుగ్గా, పక్కపక్కనే బిల్డింగులు. ఇళ్లముందు రోడ్లు కూడా కనీసం పది ఫీట్లు కూడా వుండవు. రెండు ఆటోలు ఎదురెదురు వచ్చినా ముందుకు వెళ్లలేవు. నలుగురు ఏక కాలంలో నడుచుకుంటూ వెళ్లలేరు. ఆ రోడ్లమీదే కార్లు, బైక్‌లు. ఇలా అంతా చిందరవందర జీవితాలను తలపించేలా కాలనీలుంటాయి. ఇలాంటి నిర్మాణాలన్నీ అక్రమమే. ఏ ఒక్కటి సక్రమం కాదు. ఎందుకంటే 60, 100 గజాల స్ధలాలలో జిప్లస్‌ వన్‌ మాత్రమే నిర్మాణాలు చేసుకోవాలి. ఎట్టిపరిస్ధితుల్లోనూ ఐదారు ప్లోర్లకు అనుమతులు ఇవ్వకూడదు. అదికారులు చాక చక్యంగా నోటి మాట ద్వారా అనుమతులిస్తారు. నిర్మాణాలు పూర్తయిన తర్వాత వాటిని కూల్చివేసేందుకు కూడా వీలుండదు. కనీసం ఆ సందుల్లోకి జేసిబిలు కూడా వెళ్లలేవు. అంటే కూల్చడానికి వీలు లేనంత సందుల్లో నిర్మాణాలు చేపడతారు. 60, 100 గజాలలో ఆరు అంతస్ధులు నిర్మాణం చేసుకునేవారు ఓ పది లక్షల రూపాయలు టౌన్‌ ప్లానింగ్‌ అదికారులు చేతుల్లో పెడితే చాలు. అనుమతులు అర క్షణంలో ఇచ్చేస్తారు. మూడు నాలుగు నెలల్లో నిర్మాణాలు పూర్తి చేస్తారు. ఆరు నెలల్లో బిల్డింగులు అద్దెకిచ్చేస్తారు. ఇంత స్పీడ్‌గా నిర్మాణాలు జరిగిపోతుంటాయి. పక్క పక్కనే వెలసిన ఆరు అంతస్ధుల నిర్మాణాల కోసం విపరీతమైన బోర్లు వేస్తారు. భూమిని గుళ్ల గుళ్ల చేస్తారు. సహజంగా ఓ వంద గజాల స్ధలంలో ఓ నిర్మాణం చేపడితే ఓ పది మంది నివాసం వుండేందుకు ప్రకృతి సహకరిస్తుంది. స్వచ్చమైన గాలి, సరిపడినంత నీరు అందుతుంది. ప్రైగా మున్సిపల్‌ శాఖ ఏర్పాటు చేసే డ్రైనేజీ సిస్టమ్‌ కూడా అంత మేరకే వుంటుంది. కాని నిబంధనలకు విరుద్దంగా కమర్షియల్‌ నిర్మాణాలు చేసి, ఒక్కోబిల్డింగ్‌లో కనీసం వంద నుంచి నూటాయాభై మందికి వుంటున్నారు. ఇలా వేలాది నిర్మాణాలున్నాయి. అందుల్లో లక్షల్లో కిరాయిదారులుంటున్నారు. ఐటి కంపనీలు దగ్గరగా వుండడం వల్ల తప్పని పరిస్ధితుల్లో ఐటి ఉద్యోగులుంటున్నారు. ఐటి ఉద్యోగుల అవసరం గుర్తించిన వాళ్లు అక్రమంగా ఇలాంటి నిర్మాణాలు సాగిస్తున్నారు. ఏదైనా అనుకోని ఉపద్రవం ఎదురైతే ఒక్కరు కూడా బతికి బట్టకట్టే పరిస్ధితి వుండదు. భూకంపం లాంటి విపత్తులొచ్చినా బతికే చాన్సు వుండదు. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే బూడిత తప్ప మరేం మిగలదు. పర్మిషన్లు ఇచ్చే ముందు అదికారులు భవిష్యత్తు గురించి ముందూ వెనక ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు. లక్షలు చేతుల్లో పడుతున్నాయా? లేదా? అన్నదే చూసుకుంటున్నారు. అక్రమ పర్మిషన్లు ఇచ్చుకుంటూ పోతున్నారు. ఏది జరిగినా తప్పించుకునేందుకు జిప్లస్‌ వన్‌ మాత్రమే ఇచ్చామని చెప్పుకునేలా మాటతోనే పర్మిషన్లు ఇచ్చుకుంటూపోతున్నారు. ఎందుకంటే అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి అక్రమ నిర్మాణం జరిగే అవకాశమే లేదు. సామాన్యులు కాంపౌడ్‌వాల్‌ను ఒక ఇంచ్‌ ముందుకు తెస్తేనే కూల్చేస్తారు. అలాంటిది ఆరు ఫ్లోర్లకు అనుమతులిస్తున్నారు. అలాంటి అక్రమ నిర్మాణాలు, జిహెచ్‌ఎంసి సర్కిళ్ల అధికారులు అవినీతిపై మీ నేటిధాత్రిలో వరుస కథనాలు త్వరలో…

గురు పౌర్ణమి సందర్భంగా సత్యసాయి మందిరంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు

గురు పౌర్ణమి సందర్భంగా సత్యసాయి మందిరంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు

వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి పట్టణంలో గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్య సాయి మందిరంలో షిరిడి సాయి సత్య సాయి బాబాకు అభిషేకాలు ప్రత్యేక పూజలు భజనలు ఘనంగా నిర్వహించామని శ్రీ సత్య సాయి సేవ సంస్థ కన్వీనర్ రమేష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు అనంతరం భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశామని ఆయన తెలిపారు

మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది

 

The state government will stand by the fishermen.

*చేపల పెంపకంలో మత్స్యకారులు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి*

*రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్*

*సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి )*

The state government will stand by the fishermen.

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు మత్స్యకారుల రైతు వేదికలో నేషనల్ అగ్రో ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ మత్స్య రైతుల దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఉత్తమ ప్రతిభ కనబరిచిన సొసైటీ సభ్యులకు ప్రశంసా పత్రాలు అందజేసి సన్మానించారు..అనంతరం చేపల స్టాల్స్ ను సందర్శించారు. వారు మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మత్స్య సంపద పెంపొందించడానికి తన వంతు ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు..మొన్నటి రోజూ మంత్రీ శ్రీహరి కరీంనగర్ వచిన్నపడు వారితో చేపల పెంపకం,మత్స్యకారుల గురించి మాట్లాడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని చెరువుల్లోకి సకాలంలో చేప పిల్లలు పంపిణీ చేస్తుందనీ తెలిపారు.. బలహీన వర్గాల ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందజేస్తుందని అన్నారు.గతంలో మిడ్ మానేరులో చేపలను వదలడం జరిగిందని, మన ప్రాంతంలో మల్కపేట్ రిజర్వాయర్ కుడా అందుబాటులోకి వచ్చిందని వాటిలో కూడ చేపల పెంపకం ఏర్పాట్లు విధానం పరిశీలించాలన్నారు. గతంలో తెగిపోయిన చెరువులు మరమ్మత్తులు పూర్తి చేశామని అన్నారు.. ఇంకా ఎక్కడ చెరువులు మరమ్మత్తులు ఉంటే చేపడతానని తెలిపారు… ఎమ్మెల్యేగా గెలిచిన 3 నెలల్లోనే కథాలపూర్ మండలం లోని తెగిపోయిన చెరువులను మరమ్మత్తులు చేసినట్లు తెలిపారు. మల్కపేట రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చెసి ఎల్లారెడ్డిపేట వరకు రైతులకు సాగు నీరు అందించమని తెలిపారు.గతంలో మిడ్ మానేరు డ్యాంలో కేజీ కల్చర్ విధానంలో చేపల పెంపకం కోసం ముంపు గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించమని కేజీ కల్చర్ చేపల పెంపకం చేపట్టడం కోసం ముందుకు రావాలన్నారు.చేపల పెంపకంలో అధునాతన సాంకేతిను అందిపుచ్చు కోవాలన్నారు… కేజీ కల్చర్ విధానంలో చేపల పెంపకానికి ముందుకు వస్తె రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు అందజేస్తామని తెలిపారు..
దేశంలో మత్స్య సంపద పెరగాలని చేపలు ఆరోగ్యానికి మంచిదనీ ,ప్రభుత్వం మత్స్యకారులకు అనేక రకాలుగా ప్రోత్సాహకాలు అందజేస్తుందని తెలిపారు.గత ప్రభుత్వం పెట్టిన ఒక్క పథకాన్ని కూడా రద్దు చేయకుండా వాటిని కొనసాగిస్తూ నూతన పథకాలను అమలు చేస్తున్నామన్నారు..రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు మహిళ తల్లులకు ఉచిత బస్సు ప్రయాణం,500 కు సిలిండర్,10 లక్షల అరోగ్య శ్రీ,పది సంవత్సరాలుగా పేద ప్రజలు ఎదురు చూస్తున్నా ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డులను మంజూరు చేసినట్లు తెలిపారు.. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప, జిల్లా ఫిషరీస్ చైర్మన్ చొప్పరి రామచంద్రం, డి ఏ వో అఫ్జల్ బేగం, మల్లికార్జున్, పి కిషోర్, నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ సునీల్ కుమార్,, అడ్వైజర్ విద్యాసాగర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు

పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు

సారు.. మాకు న్యాయం చేయండి

భూపాలపల్లి నేటిధాత్రి

గత కొద్ది రోజులుగా ఇంటి పక్కన వారు తీవ్ర ఇబ్బంది పెడుతున్నారని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని, అధికారులు మాకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు జరుపుల గంగ- కిషన్ లు కోరారు. జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తాము గత 20 సంవత్సరాల క్రితం కారల్ మర్క్స్ కాలనీలో ఇల్లు కొనుగోలు చేసుకుని ఇక్కడే నివాసం వుంటున్నామని, మా ఇంటి పక్కన వున్న వ్యక్తి మా ఇంటి కి, పక్క ఇంటికి మధ్యలో వున్న మాకు చెందిన ఖాళీ స్థలంలో ఉన్న మిషన్ భగీరథ పైపులను కాల్చరన్నారు. మా స్థలంలో వున్న మా మామిడి చెట్టును వారే నరకడంతో వాళ్ళ ఇంటి పైనే పడి రేకుల పై పడటంతో మమ్మల్ని కారకులుగా చేస్తూ నానా ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఇప్పటికే వారి పై పలుమార్లు స్టేషన్ లో పిర్యాదు చేశామన్నారు. కానీ ఇంకా తరచూ మమ్మల్ని భూమి గెట్టు విషయమై వేధింపులకు గురి చేస్తున్నారని, ఈ విషయమై 100కు ఫిర్యాదు చేశామని, స్థానిక పోలిస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసినా, కానీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. వారి నుండి మా కుటుంబానికి ప్రాణహాని ఉందని అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు. కాగా ఈ విషయమై స్థానిక ఎస్సైని ఆంధ్రప్రభ ఫోన్లో వివరణ కోరగా నేడు విజిట్ చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అర్హులకే డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు…

Allotment of double bedroom houses to deserving people…

ఆర్డీవో శ్రీనివాసులు, ఎమ్మార్వో సతీష్ కుమార్,కమిషనర్ గద్దె రాజు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు రామకృష్ణాపూర్ లోని ఆర్కేసీఓఏ క్లబ్ లో లాటరీ ద్వారా ఇండ్ల కేటాయింపు జరిగింది. మంచిర్యాల్ ఆర్డీవో శ్రీనివాసులు,మందమర్రి తహసిల్దార్ సతీష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు ఆధ్వర్యంలో లబ్ధిదారులకు లాటరీ ద్వారా చీటీలు తీసి అర్హులకు ఇండ్ల నెంబర్లను అందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 286 ఇండ్లకు గాను 230 ఇండ్లను లబ్ధిదారుల సమక్షంలోనే విద్యార్థులతో లాటరీ ద్వారా చీటీలు తీయించి అర్హులకు డబుల్ బెడ్రూం ఇండ్ల నెంబర్లను కేటాయించడం జరిగిందని తెలిపారు. దివ్యాంగులకు మొదటగా 13 ఇండ్లను లాటరీ ద్వారా అందించిన అనంతరం 217 ఇండ్లను అందరికీ కలిపి అందించడం జరిగిందని పేర్కొన్నారు. ఇండ్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా నిర్వహించామని అన్నారు. ఎవరికైతే లాటరీ పద్ధతి ద్వారా ఇండ్ల కేటాయింపు జరిగిందో వారి బ్యాంకు అకౌంట్ బుక్, ఆధార్ కార్డ్ , ఎలక్షన్ కార్డు, అప్లికేషన్ ఫామ్ లు తీసుకొని సాఫ్ట్ వేర్ లో డాటా ఎంట్రీ చేసిన అనంతరం పట్టా సర్టిఫికేట్ రాగానే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇల్లును అందజేస్తామని తెలిపారు.ఇండ్ల కేటాయింపు స్థలమైన క్లబ్ కు బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి లు పరిశీలించారు. పట్టణ ఎస్సై రాజశేఖర్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version