పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు
సారు.. మాకు న్యాయం చేయండి
భూపాలపల్లి నేటిధాత్రి
గత కొద్ది రోజులుగా ఇంటి పక్కన వారు తీవ్ర ఇబ్బంది పెడుతున్నారని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని, అధికారులు మాకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు జరుపుల గంగ- కిషన్ లు కోరారు. జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తాము గత 20 సంవత్సరాల క్రితం కారల్ మర్క్స్ కాలనీలో ఇల్లు కొనుగోలు చేసుకుని ఇక్కడే నివాసం వుంటున్నామని, మా ఇంటి పక్కన వున్న వ్యక్తి మా ఇంటి కి, పక్క ఇంటికి మధ్యలో వున్న మాకు చెందిన ఖాళీ స్థలంలో ఉన్న మిషన్ భగీరథ పైపులను కాల్చరన్నారు. మా స్థలంలో వున్న మా మామిడి చెట్టును వారే నరకడంతో వాళ్ళ ఇంటి పైనే పడి రేకుల పై పడటంతో మమ్మల్ని కారకులుగా చేస్తూ నానా ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఇప్పటికే వారి పై పలుమార్లు స్టేషన్ లో పిర్యాదు చేశామన్నారు. కానీ ఇంకా తరచూ మమ్మల్ని భూమి గెట్టు విషయమై వేధింపులకు గురి చేస్తున్నారని, ఈ విషయమై 100కు ఫిర్యాదు చేశామని, స్థానిక పోలిస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసినా, కానీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. వారి నుండి మా కుటుంబానికి ప్రాణహాని ఉందని అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు. కాగా ఈ విషయమై స్థానిక ఎస్సైని ఆంధ్రప్రభ ఫోన్లో వివరణ కోరగా నేడు విజిట్ చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.