-ఆపరేషన్ 2028..సీఎం గా ‘‘కేటీఆర్’’
-పార్టీ భవిష్యత్తు కోసం ‘‘కెసిఆర్’’ స్కెచ్
`యువ తరానికి టిక్కెట్లు..నవతరానికి పార్టీ పదవులు.
`వచ్చే ఎన్నికలలో వంద సీట్లు సాధించాలంటే కఠిన నిర్ణయం తప్పదు.
`60 శాతం యువకులకు సీట్లు.
`40 శాతం సీనియర్లుకు కేటాయింపులు.
`సీనియర్ ఎమ్మెల్యేలకు పార్టీ పదవులు.
`ఇప్పటికే మూడు, నాలుగు సార్లు ఎమ్మెల్యేలైన వాళ్లుకు కూడా పార్టీ పదవులు.
`గత ఎన్నికలలో ఓడిపోయిన వారి స్థానంలో యువకులకు టిక్కెట్లు.
`ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన స్థానాలలో ఎన్నికలు వస్తే కొత్త వారికి అవకాశం.
`గత ఎన్నికలలో టిక్కెట్లు రాని వారికి కూడా కొంత ప్రాధాన్యం.
`ప్రజలల్లో వున్న నాయకులకే టిక్కెట్లు.
`త్వరలో ప్రతి మండలం నుంచి కార్యకర్తలతో కేసిఆర్ ముఖాముఖి.
`ఎన్నికల వరకు కార్యకర్తలతో కేసిఆర్ వరుస భేటీలు.
`కార్యకర్తల సూచనల మేరకే ఎమ్మెల్యేలకు టిక్కెట్లు.
`ఫ్లెక్సీలు, పత్రికలలో ప్రకటనల నాయకులలో చాలా మంది అవకాశవాదులు.
`అవకాశ వాదులకు టిక్కెట్లు ఇచ్చే ప్రసక్తి లేదు.
`నిత్యం ప్రజల్లో వుండే నాయకులకే గుర్తింపు.
`వారికే టిక్కెట్లు కేటాయింపులు.
`పైరవీలకు ఎలాంటి తావు లేదు.
`అభ్యర్థుల ఎంపికలో ఎవరి ప్రమేయం వుండదు.
`కార్యకర్తలు సూచించిన నాయకులకే టిక్కెట్లు.
తెలంగాణ అంటేనే కేసిఆర్. కేసిఆర్ అంటేనే తెలంగాణ. కేసిఆర్ అనే పదంలేకుండా ఒక్క పూట కూడా రాజకీయం సాగదు. ఒక్క క్షణం మీడియాకు వార్త పుట్టదు. తెలంగాణలో కేసిఆర్ అనే పదం వినిపించకుండా ఎలాంటి వార్తకు అవకాశమే లేదు. అంతగా తెలంగాణలో కేసిఆర్ నామస్మరణం జరగడానికి కారణం ఒక్కటి కాదు, కొన్ని లక్షలున్నాయి. కేవలం తెలంగాణ ఉద్యమం, పోరాటం మాత్రమే కాదు. తెలంగాణ సాధన, బంగారు తెలంగాణ నిర్మాణంలో అనేక అంశాలు ముడిపడి వున్నాయి. అందుకే గత 25 సంవత్సరాలుగా కేసిఆర్ అనే పదం లేకుండా రాజకీయమే సాగింది లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా 2001 ఒక్కటి నుంచి ప్రతి ఆంద్రా నాయకుడు కూడా కేసిఆర్ నిత్య జపం చేశారంటే అశ్యర్యపోనక్కర్లేదు. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా సరే కేసిఆర్ అనే పదమే రాజకీయాలకు ఓంకారంగా మారిపోయేలా వుంది. కేసిఆర్ అనే పదం బీజాక్షరమైపోయింది. అందుకే దేశంలో ఏ నాయకుడికి పేరు ఆయా రాష్ట్రాలలో ప్రతి క్షణం గుర్తు చేసుకుంటారో లేదో గాని, తెలంగాణలో మాత్రం ఎక్కడో ఒక చోట ప్రతి ఒక్కరు రోజుకు ఒక్కసారైనా గుర్తుచేసుకుంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి కేసిఆర్ మాట్లాడినా, సంచలనమే..మాట్లాకపోయినా సంచలనమే. అందుకే ఆయన మౌనం కూడా రాజకీయ వర్గాలకు భయం. ఆయన మాట్లాడితే భరించలేదు. మౌనంగా వుంటే భరించలేరు. ఇది తెలంగాణ రాజకీయాల్లో విచిత్రమైన పరిస్ధితి. అయితే కేసిఆర్ ఇప్పుడే ం చేస్తున్నారు. ఈ ప్రశ్న తెలంగాణ రాజకీయాల్లో వున్న ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం వేసుకునే ప్రశ్న. ఎందుకంటే కేసిఆర్ ఒంటరిగా వున్నా, పది మందిలోవున్నా ఆయన ఆలోచనలు పసిగట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఊహించడానికి కూడా వీలుపడదు. అందుకే నేటిధాత్రికి అందిన సమాచారం మేరకు ఆయన వచ్చే ఎన్నికల గురించి పద్మవ్యూహం రచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వంద స్దానాలు ఎలా గెలవాలన్నదానిపై కసరత్తు చేస్తున్నారు. ఆ మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా పరామర్శకు వచ్చిన బిఆర్‌ఎస్ నాయకులతో హస్పిటల్‌లనే సమావేశం ఏర్పాటు చేశారంటే అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణ మీద ఆయనకు వున్న ఆర్తిని తెలుసుకోవచ్చు. మట్టిని తీసుకొచ్చి కుండను తయారు చేసిన వారు ఆ కుండను ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో తెలుసు. దాన్ని కొనుక్కున్న వారు కూడా ఎంతో అపురూపంగా చూసుకుంటారు. తెలంగాణ తెచ్చి బంగారు తెలంగాణ చేసిన కేసిఆర్, ఆ తెలంగాణ తెర్లవుతుందంటే చూస్తూ ఊరుకుంటారా? అందుకే ఇవరై ఏళ్లు వెనక్కి వెళ్లిన తెలంగాణను మళ్లీ నిలబెట్టాలంటే ఏం చేయాలన్నదానిపై కసరత్తు చేస్తున్నారు. పార్టీని ఎలా బలోపేతం చేయాలన్నదానిపై దృష్టిపెట్టారు. భవిష్యత్తులో పార్టీ మరో 50 ఏళ్లపాటు నిలబెట్టాలంటే ఎలాంటి మార్గాలు వేయాలో ఆలోచిస్తున్నారు. పార్టీ ఎలాంటి లక్ష్యాలు సాదించాలో అన్నదానిపై బ్లూ ప్రింట్ తయారు చేస్తున్నారు. సరిగ్గా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇలాగే బ్లూ ప్రింట్ తయారు చేశారు. అందుకే తెచ్చిన తెలంగాణను పదేళ్లలో బంగారు తెలంగాణ చేయగలిగారు. ఉద్యమ సమయంలో కేసిఆర్ పదే పదే బ్లూ ప్రింట్ గురించి నాయకులకు వివరించేవారు. ఆ సమయంలో తెలంగాణ వస్తుందో లేదో అందరూ అనుకున్నారు. కేసిఆర్ బ్లూప్రింట్ గురించి చెబుతుంటే అవుతుందో లేదో అని అనుమానపడ్డారు. కాని తెలంగాణ రాష్ట్రాం సాదించారు. తెలంగాణ ప్రజల కల నెరవేర్చారు. తెచ్చిన తెలంగాణను ప్రపంచంలోనే ఏ నాయకుడు, పాలకుడు చేయనంత వేగంగా అభివృద్ది చేశారు. అన్నమో రామచంద్రా? అని ఆకలి కేకలు వేసిన తెలంగాణను దేశానికి అన్నం పెట్టే అన్న పూర్ణను చేశారు. ఇంతకంటే ఏం కావాలి. కాని ప్రజలు అంతకన్నా మరింత బాగ్యం కావాలనుకున్నారు. ఇప్పుడు కేసిఆర్ వుంటేనే బాగుండనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో పార్టీని రేపటి రోజు ఎలా నిలబెట్టాలన్నదానిపై కేసిఆర్ పక్కా ప్లాన్ తయారు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారు. ఈసారి కార్యకర్తలే కేంద్రంగా అభ్యర్ధుల ఎంపిక జరగాలన్న కొత్త విదానాన్ని రూపకల్పన చేస్తున్నారు. అభ్యర్ధుల ఎంపిక ఈసారి కార్యకర్తలే నిర్థేశించేలా కొత్త తరహా రాజకీయాలకు అంకుర్పాణ చేస్తున్నారు. ఇక్కడ ఎవరి రెకమండేషన్లకు తావు లేని అభ్యర్ధుల ఎంపిక దారులు వేస్తున్నారు. ఎవరు ప్రజల్లో వుంటున్నారు. ఎవరు ప్రజల్లో వున్నారు. ఎవరు ప్రజలకు దూరంగా వుంటున్నారు. ఎవరు ఆర్భాటపు పోకడలు పోతున్నారు. ప్రతిపక్షంలో వుండి కూడా ప్రజలకు ఎవరు అందుబాటులో లేరు. వారి గురించి కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకొని, మెజార్టీ కార్యకర్తల సూచన మేరకే ఈ సారి అభ్యర్ధుల ఎంపిక వుండేలా రూట్ మ్యాప్ రూకల్పన చేస్తున్నారు. భవిష్యత్తులో కొత్త తరం బిఆర్‌ఎస్ రాజకీయాలు చూస్తారు. అందులో భాగంగా యువతరానికి పెద్ద పీట వేయాలనుకుంటున్నారు. 60:40 ప్రకారం టిక్కెట్ల పంపకాలు జరపాలని అనుకుంటున్నారు. యువతరనానికి ఈసారి టికెట్లు ఇస్తే బిఆర్‌ఎస్ మీద ప్రజల్లో వున్న నమ్మకానికి, కేసిఆర్ రావాలన్న బలమైన ప్రజల కోరిక తోడౌతుంది. యువతరం నాయకులు విజయం సాదిస్తారు. నిజం చెప్పాలంటే ఈసారి కేసిఆర్ ఎవరిని నిలబెట్టినా గెలిచే పరిస్టితులు కనిపిస్తున్నాయి. అందువల్ల కొత్త తరాన్ని ప్రోత్సహించాలి. మరో యాభై ఏళ్లు బిఆర్‌ఎస్ సైనిక సంపత్తిని తయారు చేయాలని అనుకుంటున్నారు. ఎన్టీఆర్ హయాంలో సరిగ్గా ఇదే జరిగింది. అప్పుడు యువతను ప్రోత్సహించడం వల్లనే ఇప్పటికీ తెలుగుదేశం జెంగా ఎగురుతోంది. ఒకసారి ఓడిపోయినా మళ్లీ మళ్లీ గెలుస్తోంది. అలాగే బిఆర్‌ఎస్ కూడా వచ్చే 50 ఏళ్లపాటు పార్టీకి సేవలందించే నాయకులను తయారు చేయాలనుకుంటోంది. కేసిఆర్ అందుకు అవసరమైన కసరత్తు విసృతంగా సాగిస్తున్నారు. ఈ రోజుల్లో ఎన్నికలంటే ఆశామాషీ కాదు. ప్రజలు ఎప్పుడు ఎవరి వైపు మొగ్గుచూపుతారో అర్ధం కాని రోజులు. గతంలో పార్టీలకు వున్న విలువ ఇప్పుడు లేదు. జనం నాడి పట్టడం అంత సులువు కాదు. జనాన్ని మెప్పించి,ఒప్పించి అదికారంలోకి రావడం అంటే మాటలుకాదు. ఎంత పక్కాగా ప్లాన్‌తో వెళ్లనా ఆఖరు నిమిషంలో ఏ చిన్న పొరపాటు జరిగినా పేక మేడ కూలినట్లు కూలుతుంది. ఎందుకంటే బిఆర్‌ఎస్ పదేళ్ల పాలనా కాలంలో ప్రజలకు అందని పధకం అంటూ లేదు. ప్రజలకు తెలియని విషయమంటూ లేదు. ఉమ్మడి పాలనలో చూసిన గోసలన్నీ తీరినా, ప్రజలు మూడోసారి బిఆర్‌ఎస్‌ను అధికారంలోకి రాలేదు. ఉమ్మడిపాలనలో చూడని నీళ్లు తెలంగాణ ప్రజలు కళ్లారా చాశారు. బీడు వారిన భూముల్లో పంటలు పండిరచారు. రాళ్లు, రప్పలతో నిండిన భూముల్లో కూడా పసిడి సిరులు పంచించారు. అందుకు కారణం కేసిఆర్ అని తెలుసు. అయినా కేసిఆర్‌ను ఆ పల్లె జనమే కాదనుకున్నారు. కారణం రాజకీయ పార్టీలు హమీల విన్యాసం కూడా ప్రభావం చూపుతుంది. ఈసారి అదే ప్రజలు ఎటు మొగ్గు చూపాలన్నదానిపై కూడా అన్ని పార్టీలు తమ తమ వ్యూహాలను ఇప్పటి నుంచే మొదలు పెడుతున్నాయి. వచ్చే మూడేళ్ల కాలాన్ని కూర్చొని అంచనా వేయకూడదు. జనంలోకి మళ్లీ బిఆర్‌ఎస్ నాయకులు వెళ్లాలి. భరోసా కల్పించాలి. కాంగ్రెస్ పాలన బాగా లేదని జనమే మళ్లీ బిఆర్‌ఎస్‌ను గెలిపిస్తారన్న గుడ్డి నమ్మకంతో వుండకూడదు. బంగారు తెలంగాణ అని కొనియాడిన నోళ్లే, గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లు వేశారు. ప్రజలు రాజకీయ పార్టీల నుంచి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఆశిస్తారు. ప్రజల ఆలోచనలను పసిగట్టాలి. ఆ దారిలో రాజకీయ పార్టీలు నడవాలి. దేశ రాజకీయాలు వేరు. రాష్ట్ర రాజకీయాలు వేరు. రాష్ట్రంలో ప్రజలు ఆశించేవి వేరు. అందుకే ఈసారి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, నాయకుల ఎంపికలో ఎలాంటి తొందరపాటు లేకుండా చూడాలనుకుంటున్నారు. అందుకే ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టారు. త్వరలో తెలంగాణ వ్యాప్తంగా వున్న అన్ని మండలాలకు చెందిన కార్యకర్తల అభిప్రాయాలు సేకరించాలని కేసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. అది త్వరలో కార్యరూపం దాల్చనుంది. వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు సాదించాలి. కేటిఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలన్నదే కేసిఆర్ ఆశయం. తెలంగాణ అభివృద్దిని దిశానిర్ధేశం చేస్తూ మళ్లీ తెలంగాణను గాడి పెట్టాలన్నదే కేసిఆర్ సంకల్పం.